రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/ఎనిమిదవ ప్రకరణము
ఎనిమిదవ ప్రకరణము
నగర కొత్వాలు
హైద్రాబాదు నగరకొత్వాలు పదవిలో ఆదినుండియు నేటివరకు ముసల్మానులే అందును విశేషముగా సున్నీ తెగ వారే నియమితులగు చుండిరి. రెడ్డిగారే ప్రప్రథమ హిందువు లీ పదవి నలంకరించుటకు! ఈ సందర్భములో కొత్వాలీ చరిత్ర కొంత తెలిసికొనట వినోద కరముగా నుండును.
సర్ సాలార్జంగుగారి కాలములో “జిల్లాబందీ" పద్దతి యేర్పడెను. అంతకు పూర్వము నగరములో 18 మంది గొత్వాలులు పని చేసియుండిరి. వారిని "అఠారాకొత్వాల్ " అని యందురు. వీరిలో తాలిబు ద్దౌలా, గాలిబుద్దౌలా అను నిద్దరన్నదమ్ములు ప్రసిద్ధులైన వారు. వారి క్రింద 600 పోలీసు సిబ్బంది మాత్రమేయుండెను. వారి కాలములో పోలీసు వారి అధికారములకు పరిమితి లేకుండెను. ఎవరిపై కన్ను బడిన వారిని పట్టుకొనుచుండిరి. ఎంత కాలము వరకై నను వారిని జెయిలులో విచారణ లేకుండ మూసియుంచుచుండిరి. ఈకొత్వాలీ యుద్యోగము గ్రామ కరణీకమువలె వంశ పారంపర్యముగా వచ్చు ఉద్యోగముగా భావింపబడు చుండెను. గాలీబుద్దౌలా చని పోయినప్పుడు అతని కుమారుడు రెండేండ్ల వాడు. ఆ పిల్లవాని పేర కొత్వాలీ పదవిని స్థిరపరచి అతనికి బదులుగా నొక సహాయ కొత్వాలును నియమించి పని తీసికొనిరి.
కొత్వాలీ పదవి నలంకరించిన వారిలో నవాబ్ జోరా వర్ జంగ్ అనువారు కూడ చాల ప్రసిద్ధులు. వారు జనుల ముఖములను చూచియే దొంగ లెవరో దొర లెవలో గుర్తించెడి వారట! వారు అరుదుగా నగరములో సవారీ వెళ్లుచండెడి వారు. ఎప్పుడైన వాహ్యాళి వెళ్ళినప్పుడు వారు గుర్రము పై నెక్కి ముందు వెనుకల అరబ్బులు, రోహిలాలు, పోలీసు జవానులు నడుచుచుండగా నగర వీధులలో తిన్నగా గంబీరముగా వెళ్లుచుండెడి వారు. జవానులకు డ్రెస్సులు లేకుండెను. కొందరకు లాగులు, కోందరకు ధోవతులు, కొందరకు తెల్లని అంగీలు, అందరికిని నడుములో తోలుపట్టీలు, చేతులలో కట్టెలును ఉండు చుండెను. కొత్వాలుగారు సవారీ వెళ్ళినప్పుడు వీధులలో ఉభయ పార్శ్వములందు జనులు క్రిక్కిరిసి నిలుచుకొనియుండెడి వారు. కొత్వాలుగారు ఆదిక్కు ఈదిక్కు జనులను తేరిపార చూచుచు అందందు గుర్రమునాపి తస జవా
నులతో ఫలాని వాడు దొంగ వానిని పట్టుకొనుడు అని యాజ్ఞు పించి ముందు సాగిపోయెడి వారు. ఈ ప్రకారముగా వారు ఇల్లు చేరుకొను వరకు కొంతమందిని త్రాళ్ల తో గట్టి జవాను లీడ్చుకొని వచ్చెడివారు. ఆ నిర్బంధితులు తమ తప్పులన్నిం టిని ఒప్పుకొస్న ఆ ర్వాత వారిని జెయిళ్లలో వేయుచుండిరి!!
ఆ కాలములో ఉత్తరమునను, మధ్య హిందూ స్థానముసను వ్యాపించినట్టి థగ్గులు హైద్రాబాదు రాజ్యము లోను వ్యాపించుకొని యుండిరి. నిజామాబాదులోని సీర్నపల్లి ప్రాంతములలో గుట్టలును, దట్టమగు అడవులును నిప్పటికిని కలవు. అందు విశేషముగా ఈ థగ్గుల ఘోరములు జరుగుచుండెను. మరియు హైదరాబాదు నగర సమీపములో, నుఁడిన ఆసఫ్ నగరు గుట్టవద్ద నొక దేవాలయ ముండెను. అది గోసాయీల యొక్కయు, ఫకీ రుల యొక్కయు; సన్యాసుల యొక్కయు ఆశ్రయమై యుండెను. వారు వేషధారులైన దొంగలుగా నుండిరి. థగ్గుబు తాము దోచిన ధనమును ఈ సన్యానుల కమ్ముచుండిరి. లక్షలకొలది విలువగల సొమ్ములు, ముత్యములు, వజ్రములు వీరివద్ద దాచియుంచ బడుచుండెను.
నగర కొత్వాలుల చరిత్రలో నవాబ్ అక్బర్ జంగు కొత్వాలుగారి కాలపు చరిత్రయు చాల వినోదకరముగా నున్నది. అక్బర్ జంగు గారు 1293 ఫసలీ లో
(అనగా వేంకట రామా రెడ్డి గారు సుమారు 14- 15 సంవ తృరముల ఎయస్సు బాలుడుగా నుండిన కాలములో, నగర కొత్వాలీ పదవినందిరి. ఆతను చండ శాసననుడు. అతని పేరు చెప్పిన దొరలు, దొంగలు, ధనికులు అందరును గడగడ వడకుచుండిరి. కొత్వాలుగారి కెవ్వరి పైన కోపము కలుగునో వారు నాశనమైనట్లే. వారి కాలములో నగరమందు సుమారు 10000. అరబ్బులుcడిరి. ఈ అరబ్బులు నగరములో హత్యలు లూటీలు విశేషముగా. చేయుచుండిరి. మొహరము పండుగలో వీరి దౌర్జన్యములు పారమందు చుండెను. నవ్వాబు అక్బరు జంగు కాలములో నొక ఘోరమైన ఘట్టము సంభవించెను.మొహర్రము నాడు గొప్ప గొప్ప నవాబులు ఏనుగుల నెక్కి తమ తమ సిబ్బందితో వీధులందు వాహ్యాళికి వెళ్ళుచుండెడి వారు. ఆచార ప్రకారము కొత్వాలుగారును రాత్రి సమయమున తన సిబ్బందితో ఏనుగు పై నెక్కి సవారీ వెళ్ళినారు. పత్తర్ ఘట్టీ బాజారువరకు వారువచ్చినారు. ఇంతలో ఎదురుగా నగరభాగము నుండి అరబ్బుల నాయకుడైన సుల్తాన్, నవాజుజంగు గారి పిల్లలు ఏనుగు నెక్కి చారుమినారు నుండి బయలు దేరి వచ్చిరి. కొత్వాలుగారు వారిని ప్రక్కకు పొమ్మని ఆజ్ఞాపించి నారు. వారి యేనుగు ప్రకకుపోయినది కాదు. ఇంతలో కోత్వాలుగారు స్వయముగా తన ఏనుగును నడిపించికొనుచు . సుల్తాను సవాజు జంగుగారి పిల్ల లెక్కిన ఏనుగును సమీపించి తుపాకీని గురి పెట్టి " ఒక్క అడుగు ఈ ఏనుగు ముందు నడి చెనా మిమ్ముల కాల్చి వేయుదును. ఖబర్దార్ " అని గర్జించిరి. పిల్లల గడగడ వణికిపోయిరి. ఒక పిల్ల నాడు ఉక్కిరి బిక్కిరియై ఏనుగునుండి దిగజారినాడు. పిల్లలు ఏడ్చుచు ఇంటికి మరలి పోయిరి. వారి తండ్రికి తన పిల్లలకు జరిగిన అవమానము తెలిసినంతనే యతడు మండిపడి “నగరములో ఎచ్చట నైనను సరే పోలీసు వాడుకాని, పోలీసు డ్రెస్సులోనుండినట్టి వాడు కాని కనబడిన వెంటనే కాల్చి వేయుడు" అని తన అరబ్బులకు ఆజ్ఞాపిచెను. ఇంకేమున్నది- ! అరబ్బులు చెలరేగి 'పట్నము పై విరుగబడిరి. చారుమినారునుండి హత్యలు ప్రారంభిచిరి. కనబడిన పోలీసువారి సందరిని కాల్చుచు వచ్చిరి. వీదులలో పీనుగులు పడియుండెను. కొత్వాలుగారు పారిపోయి తమ యింటిలో దాగుకొనినారు. పోలీసు వారు దుస్తులను తొందర తొందరగా విడిచి మురికి కాలువలలో విసరి వేసి పారిపోయి కనబడిన దగ్గరి యిండ్లలో దూరి దాగుకొనినారు. సాలార్జంగుగారి కీవార్త తెలిసెను. వెంటనే మిలిటరీ సేన కాజ్ఞయిచ్చెను. మిలిటరీవారు నగరము నాక్రమించుకొనిరి. ఒక దిక్కు సుల్తాను నవాజు జంగునకు తన సిబ్బందిని వెంటనే పిలిపించుకొనుట కాజ్ఞాపించిరి. ఈఆజ్ఞను అఫ్సర్ జంగు అనువారి ద్వారా పంపిరి, వారును అత్యంత ధైర్య సాహసయులు. ఒక్కరే సుల్తాన్ యార్జింగు దేవిడీకిపోయి ఆజ్ఞ వినిపించి వారిని భయ పెట్టి శాంతి సంరక్షణార్థమై అతని కుమారులను జమానతుగా తీసుకొని వచ్చినారు. తర్వాత శాంతి నెలకొనెను. విచారణ జరిగెను కొందరి అరబ్బులకు జెయిలుశిక్షలు! సుల్తానునవాజు జంగుగారికి కఠిన మైన మంద లింఫు!! ఇది పర్యవసానము! అక్బరుజంగు తర్వాత సుల్తాను యార్జంగు అనువారు, లాల్ ఖాన్ అనువారును సుప్రసిద్ధు లైన కొత్యాలులుగా పని చేపిరి. వారియసంతరము ప్రసిద్దులైన వారు నవాబ్ ఇమాద్ జంగుగారు. వారి కాలములోను పెద్దలు, చిన్నలు నగరమందు వారిని చూచి భయపడు చుండెడి వారు. కాని పూర్వమువలె పరిస్థితులు లేండెను. చాలమారి పోయి యుండెను. వారికాలమందే వేంకట రామా రెడ్డిగారు సహాఁయ కొత్వాలుగా వారి కోరిక పైననే నియుక్తులైరి.కొత్వాలీ దర్పము సాగించిన తుది కొత్వాలు నవాబు ఇమార్జంగు గారే! వారితో పూర్వకాలము పరిసమాప్తి , కొత్త కాలము, క్రొత్త పరిస్థితులు, ఏర్పడెను. వేంకట రామా రెడ్డిగారు కొత్వాలు అయిన కాలము నుండి నగర కొత్వాలీ పదవి బ్రిటిషిండియాలోని నగర పోలీసుక మిషనరు పదవి యొక్క పద్ధతుల పై ననే ఏర్చరుచు వచ్చెను. మరియు వేంకట రామారెడ్డి గారు పూర్తిగా 'క్రొత్త మార్గమును దొక్కిరి. పూర్వము కొత్వాలు పేరు చెప్పిన ప్రజలకు సగము ప్రాణము పైననే ఎగిరిపోవు చుండెను. వారి చేతులలో పడిన వారు మరల బయట పడిననాడు పునర్జన్మమెత్తినట్లు భావించుకొనెడి వారు. ఆ కాలము దాటిపోయెను. రెడ్డిగారు శాంతమూర్తులై సర్వప్రజాను రంజుకు లై ముఖ్యముగా బీద వారియందు అపారమైన దయగల వారై తమ యుద్యోగ కాలమును గడపిరి. రెడ్డిగారు నగర కొత్వాలీ పదవికి వచ్చునప్పటికీ దేశ కాల పరిస్తితులు చాల మారిపోయెను. బ్రిటిషిండియాలో సహాయ నిరాకరణోద్యమము విజృంభించి యొండెయి. వేన వేలు జెయిలుకు పోయిరి.లాఠీ ప్రయోగములు, తుపాకీ కాల్పులు, ఆర్డి నెన్సులు విరివిగా ప్రయోగము లోనికి వచ్చెను. లార్డు రీడింగు వైస్రాయిగా నుండిరి. గాంధీగారి సత్యాగ్రహ తత్వము ఇంగ్లీషు వారిని గందరగోళములో పడవేసెను. తుదకు లార్డు రీడింగు గారు కూడ "నేను దిగ్రమ చెఁందినాను. నాక దిక్కు తోచ లేదు. " | “I am puzzled aud perplexed" ) అని సెల విచ్చిరి.
అ బ్రిటిషిండియాలోని వాతావరణము నిజాం రాష్ట్ర ములోనికి వీచెను. అట్లు వీచుటకు ప్రబల కారణము ఖిలాఫతు నమస్యయే. హైదరాబాదు సగరములో ( ఇప్పుడు ఉన్న ఈ న్యాయస్థాన మూర్తులైన , బ్యారిస్టర్ ఆస్గర్ గారును, ధర్మవీర
వామన్ నాయకుగారును, పండిత్ కేశవరావు గారును హిందూ ముసల్మాను నాయకు లై ప్రచండ సభలుచేసిరి. ఆనాడు రాజుకీయ వాతావరణ మెట్లుండినను హిందూ ముసల్మానుల ఐక్యత మాత్రము ప్రశంసనీయముగా నుండెను. ఖలాఫత్ గడబిడలలో బ్రిటిషిండియాలోని వారు కొందరు నిజాం రాష్ట్రములో ప్రవేశించి ఆందోళనము చేసి. అహమ్మదాబాదు నుండి ఇద్దరు ముగ్గురు ఖలా ఫతు సంఘము వారు హైదరాబాదు నగర ములో ప్రచారముచేసి వేలకొలది జనుల గుంపును తీసికొని రెసిడెన్సీ కోఠిపై బడి ఆల్లరులు చేసిరి. 'రెసిడెన్సీ న్యాయస్థానము పై బడి అచ్చటి బంగ్లాలోని తలుపులను, అద్దములను పగుల గొట్టిరి. వేంకట రామారెడ్డి గారి కీవార్త తెలిసిన వెంటనే ఏమియును జంకక, అనితర సహాయులై ఆందోళన రంగము జేరి ప్రజలకు శాంతి పద్ధతులను బోధించి గుంపులను చెదరిపోవునట్లు చేసి తర్వాత అహమ్మదాబాదునుండి వచ్చిన వారిని పట్టుకొని రాష్ట్రమునుండి వెడల గొట్టించిరి. తర్వాత సగరములో మరే అల్లరులును జగుగకుండునట్లుగా మంచి యేర్పాట్లు చేసి ప్రభుత్వమువారి కేమియు చింత కలుగకుఁడునట్లుగా చూచుకొనిరి.
ఇట్టి వాతావరణములో వేంకట రామారెడ్డి గారు నగర కొత్వాలు పదవి నలంకరించిరి. పూర్వకాలపు పరిస్థితులు పట్టువిడువక ఒక ప్రక్క వర్తించుచుండెను. ఒక పక్క
రాజకీయపు సంబంధమగు ఖిలాఫత్ ఆందోళనము, ఇంకొక పక్క బ్రిటిషిండియాలోని సత్యాగ్రహపు గాలి వీచుచుండుట తటస్థించెను. నవాబులు, రాజులు, తమ ప్రాచీనాధి కారములను వదలు వారు కారు. వారేమైన అక్రమములు చేసినను వారిపై ఆధి కారము పూర్ణముగా చూపించిన వారు ప్రబల శత్రువుల గుదురు, ప్రజాందోళసమును అణచిన అషయశస్సును పొందుదురు. అల్లరులు జరిగినప్పుడు సమయము కని పెట్టి కొని యుండినట్టి సరిషడని వారికి ప్రభుత్వము వద్ద విరుద్ధ ప్రచారము చేయుట కవకాశము లబించును. ఇవన్నియు నిట్లుండ నగరములో ఒక జాతివారు, ఒక దేశము వారు, ఒక మతము వారు ఆను పరిమితి లేకుండెను.నడుము చుట్టును బాకులు, కత్తులు,
మెడలపై తుపాకులు వేసుకొని తిరుగు అరబ్బులును, బీదల పాలిటి భయఁకరులై పీడకులని వ్యక్తి పరచచిసిన రోహి లాలను, పఠానులును, చెల రేగిన పట్టశక్యముగాని సిక్కులును, ఇట్టివే యితర జాతుల వారసు నగరమందు బహుళముగా నుండిరి, (ఇప్పటికిని కలరు.)
ఈ పరిస్థితులలో వేంకట రామారెడ్డిగారి ఉద్యోగము అసిధారా వ్రతము వంటిదై పోయెను. ఏ క్షణమున ఏమి పొరపాటు జరుగునో ఉయేమో తెలుగు యజ మానికి అసం తృప్తి కలుగునో, ఏమి ఆగ్రహము కలుగునో అను ఆందోళ
నము వారిలో లేకపోలేదు. ఇట్టి సన్నివేశములలో ఇట్టి అగ్ని పరిక్షలకు లోనై అందు 'విజయమును పొంది మ. ఘ. వ. నిజాం ప్రభువు గారిని మొదలుకొని, పోలీసు సీపాయివరకును, మోటారు నెక్కు రాజులను మొదలుకొని, మోట కొట్టు రైతు వరకును, అందరును ప్రశంసించునట్లుగా వేంకట రామారెడ్డి గారు వర్తించుకొనినారు. హిందూ ముసల్మానులు సమానముగా ఒక అధికారిని ప్రేమించుట ఈ రాష్ట్రములో అరుదై నట్టియు, విచిత్ర మైనట్టియు నంశము. అట్టి సమాన ప్రేమకు పాత్రు లైన వారీ వేంకట రామా రెడ్డి గారొక్కరే కాన వచ్చుచున్నారు.
వీరు కొత్యాలు పదవికి వచ్చిన కొలది కాలములోనే పోలీసు శాఖలో అనేకము లైన మార్పులు కావించిరి. పూర్వ పద్దతిని వదలి వేసి క్రొత్త పద్ధతిపై చేతిక్రింది యుద్యో గులను సిద్ధముచేసిరి. వీరిలో నింకొక్క విశేషమున్నది. ప్రతిచిన్న విషయమనుగూడ తాము స్వయముగా విచారించుకొని తృప్తి పడిన పిమ్మటనే క్రింది అధికారులకు చర్య గైకొనుటకై అనుజ్ఞ యిచ్చెడివారు. ఈ కారణముచేత వారికి నిరంతరము పనియే యుండిన దన్నమాట. సగము రాత్రి వేళ కూడ నగరములో ఏదైన' దౌర్జన్యములు కలిగిన క్రింది అధికారులు వారిని లేపి స్వయముగా తెలుపుచుండిరి. లేదా టెలిపోనుద్వారా వారి
తోమాట్లాడి విషయములు తెలిపి ఆజ్ఞలుపొందు చుండిరి. ఇట్లు రాత్రిం బగళ్లును కష్టపడిన అధికారి మొత్తము నిజాం రాష్ట్రమంతటను వీరొక్కరే కానవచ్చుచున్నారు.
వీరి కాలములోనే లార్డు రీడింగుగారు హైద్రాబాదునకు వచ్చిరి. వీరు తమ కచ్చేరీలో “వైస్రాయశాఖ" అను నదొకటి' ప్రత్యేకముగా వైస్రాయిగారు వచ్చుటకు మూడు నాలుగు మాసములకు ముందే ఏర్పాటు చేసి, తగు కట్టుదిట్టములు చేసినారు. వైసాయిగారికి గాని, ప్రజలకుగాని ఏయిబ్బందులును కలుగకుండునట్లుగా ఏర్పాటు చేయుటలో వీరి చాకచక్యము, దూదృష్టి, నేర్పరితనము, సువ్యక్తమగు చున్నది. సాధారణముగా వైస్రాయిగారి వంటివారు నగరమునకు వచ్చిన ప్రజల కిబ్బంది కలుగును. గంటలకొలది వైస్రాయి గారు పోఫు వీధులలో పోలీసువారు నిలిచి ఆబాటలలో, జనులు కాని, బండ్లు, మోటారులు గాని పోకుండునట్లుగా నిరోధించుట వాడుకయై యుండెను. అట్లు చేయుటచేత ప్రజలకును, వ్యాపారస్థులకును, వ్యవహారస్థులకును నష్ట కష్టములు సంభవిం చెడివి. అట్టి వేవియు సంభవింపకుండు నటల కొత్వాలుగారు ఏర్పాట్లు చేసినారు. వైస్రాయిగారు వచ్చిరి. అన్నియు సవ్యముగా జరిగినవి. వారు సురక్షితముగా వెళ్లిపోయిరి.
ఇదే కాలములో వేల్సు యువ రాజు గారుము 5 వ జార్జిచక్రవర్తి గారి పెద్ద కుమారులును అగు యెడ్వర్డు యువ రాజు గారు హిందూస్థానమునకు విచ్చేసిరి. హిందూస్తానములో సహాయ నిరాకరణోద్యమము ప్రచండముగా జరుగుచుండి సందున యున రాజు గారు వచ్చుట కిది సమయము కాదని కూడ గాంధీ గారు తెలిపియుండిరి. అట్లు తెలిపినను వారు రానే వచ్చిరి. పెద్ద పెద్ద నగరాలలో హార్తాలులు జరిగెను. వీధులు నిర్మానుష్యమయ్యెను. ఇండ్లపై సల్ల జండా లెగురుచుండెను. కొన్ని తావులందు వీధులలో కలహములు జరిగెను. కొంత ప్రాణనష్టముకూడ కలిగెను. యువరాజు గారి కార్య క్రమములో 'హైదరాబాదునకు వచ్చుటయు మఖ్య మైనదిగా నుండెను.
యువరాజు గారు ఇంకొక సంవత్సరమునకు హిందూ స్థానమునకు రానున్న వారని వేంకట రామారెడ్డి గారికి తెలియగా వారు తప్పకుండ 'హైద్రాబాదు నగరానికి రాగల రనియు, వారితో మాట్లాడు నవసర మేర్పడుననియు ఊహించుకున్నారు. ఊహ సరియైనదిగానే యుండెను. వారు వెంటనే తమ అరువద వయేట ఆరేండ్ల బాలునివలె ఇంగ్లీషు విద్యా భ్యాసమును 'మొదలు పెట్టిరి. తాము ఉద్యోగములో ప్రవేశించిన కొలది కాలము తర్వాత - అనగా తమ యిరువదవయేట
ఇంగ్లీషులో ఏ బీ సీడీలు పూర్తి చేసికొని “యెస్ ” “నో' వంటి నాలుగైదు ముక్కలు నేర్చుకొని యుండిరి. కాని ఉద్యోగ ధర్మములో ఊపిరి తిరుగనివారై ఆ కొలది పాటి ముక్కల నెన్నడో మరచి యుండిరి. ఇప్పుడు మరల బుద్ధిపుట్టెను ఒక బీ. ఏ. పండితుని గురువుగా నేర్పాటు చేసికొన్నారు. పాఠములు మొదలు పెట్టినారు.పదముల కాగుణితమ' ( స్పెల్లింగు ) ఉచ్చారణ, అర్థము, వ్రాత పూత శ్రద్ధ రాత్రి కాలములో చెప్పించు కొనుచు తెల్ల వార 4 గంటల కే లేచి గట్టిగా మననము చేసికొనుచు పాఠముల నేర్వ మొదలిడిరి. ఒక నాడు రాత్రి 11 గంటల కాలమప్పుడు తస పాఠములను గట్టిగా కంఠపాఠము చేయుచుండిరి. గది ముందట నేయుండిన ఫహిరా జవాను (పూటకాపరి) యా విపరీత శబ్దములను ధ్వనులను వినినాడు. అదరిపడినాడు ఎన్నడును విననిరీతిగా కొత్త కొత్త .. ధ్వనులతో కొత్వాలు గా రు తనలో తానే వదరుకొను చున్నారు. ఉర్దూ కాదు, ఫార్సీ కాదు, అరబీ కాదు, తెనుగు కాదు, ఏదిన్నీ కాదు. ఇ వేమి ధ్వనులు? ఆయనకు పిచ్చి లేచి యుండును. లేదా దయ్యమైనను పట్టియుండును. అని తర్కించుకొని నిశ్చయించు కొనినాడు. ఆ భటుని కిది నిశ్చయమైన వెంటనే తన తుపాకీని గోడ కానించి పరుగు పరుగున సమీపములోనుండు ఒక సదరు అమీనును సమీపించి కొత్వాలు
గారికి సంభవించిన యా యకాండ విషత్తును మనివి చేసికొని నాడు. సదరమీనుగారును దిగ్భమ జెంది ఉక్కిరి బిక్కిరిగా పరుగెత్తు కొనివచ్చి కొత్వాలుగారి బంగ్లా తలుపు తట్టినారు. కొత్వాలుగారు తలుపు తెరచినారు. సదరమీను గారు తనతో జవాను చెప్పిన వార్త తెలిపినారు. - కొత్వాలు గారదంతయు పొరపాటనియు, తాము ఇంగ్లీషు పాఠమును నేర్చుకొనుచుం టిమనియు, జవానుయొక్క నిర్ణయమును గురించి కొంత సేపు ముచ్చటించుకొని తమలో తాము నవ్వు కొనిరి. ఇట్లు వీరు ఇంగ్లీషు విద్యాభ్యాసము అతి శ్రద్ధతో చేసినారు. తప్పులో ఒప్పులో మాట్లాడుటకును మాట్లాడిన మాటలు అర్థము చేసి కొనుటకును నేర్చుకొనినారు.
వేల్సు యువరాజు గారు హైద్రాబాదునకు రానుండిరి. కాని ఒక చిక్కు సంభవించను. వారు నాలుగు గుర్రాలబడ్డీ లోనే ఊరేగింపు వెళ్ళదలచి నామని తెలిపినారు. భారత దేశము లోని ఆందోళనములను దిన దినమును వినుచున్నందున హైద్రాబాదు ప్రభుత్వమువారు వారిని బగ్గీలో తీసికొని పోవుట ఉచితము కాదనియు మోటారులోనే తీసికొని పోవలె సనియు నిర్ణయించినారు. కాని వేల్సు యువరాజుగారు పట్టిన పట్టు వదలు స్వభావము లేని వారని అప్పుడే కాదు తర్వాత కూడ సామ్రాజ్య పీఠమునే వదలి నిరూపించినారు. అప్పుడు
హైద్రాబాదులో సర్ అలీ ఇమాము గారు ప్రధాన మంత్రి గాను, రన్సల్ అనువారు రెసిడెంటుగాను నుండిరి. వీరును ఇతర మంత్రివర్గము వారును, శ్రీ నిజాం ప్రభువు గారును. అందరును వేల్సు యువరాజుగారిని మోటారులోనే తీసుకొని పోవుట యుక్త మని నిర్ణయించిరి. తుదకు వేంకట రామా రెడ్డి గారిని పిలిపించి వారి అభిప్రాయ మడిగిరి. " వేల్సు యఃపగాజు గారు బగ్గీలోనే వెళ్ల నిశ్చయించిన అటులే కానీయడు. అన్నిటికి నేను బాధ్యుడనై యుందును. మీరేమాత్రము విచారపడ నలసిన పనిలేదు” అని రెడ్డిగారు ప్రత్యుత్తరమిచ్చిరి. అందరును ఆశ్చర్యపడిరి. " నీ కేమైన మతి తప్పినదా! పిచ్చివాడవైనావా- నీ వేమి మాట్లాడుచున్నావో ఆలోచించుకొన్నావా'! ఇంత గొప్ప బాధ్యతను నీవు నిర్వహింప జాలుదువా! బ్రిటిషు ఇండియాలోని పరిస్థితులను దిన దినము జరుగు ఆందోళసములను నీవు గమనించినావా? అని యెన్నియో ప్రశ్నా పరంపరలు మంత్రిగారును, అందరును, వీరిపై కురిపించినారు. అన్ని టికిని ఒకటే ప్రత్యుత్తరము - " నేను సంపూర్ణ బాధ్యత వహంచియే మాట్లాడుచున్నాను".
" ఏమైన ప్రమాదమైన ,
" నాతల సమర్పించు కొందును " “ బాగా ఆలోచించు కొనుము. ప్రమాద మేమాత్రము జరిగినను రాష్ట్రమునకు శాశ్వతమైన కళంకము కలుగును "
" అటుకాకుండ చూచుకొన కుండిన నా సేవ యింకెందుకు ?"
" నీ యిష్టము ”
అని తుదకు రెడ్డి గారి మాటగా వేల్సు యువ రాజు గారి కంగీ కారమును తెలుపు కొనినారు.
వేల్సు యువ రాజుగారు వచ్చుటకు రెండు మూడు మాసములకు ముందునుఁడియే కొత్వాలుగారు పడిన 'పాటులు వారి యాలోచనలు, వారి ఏర్పాటులు, వారి జాగరూకత, అవన్నియు, వారికే తెలియును. అదంతయు వర్ణించుట ఒక గొప్ప గ్రంథమే యగును. నగరములోనికి వచ్చునట్టి యే క్రొత్త వారైనను వారి దృష్టిలోనికి రాకుండ పోలేదు. రహస్య పరిశోధకులగు చారుల సంఖ్యను అపారముగా పెంచినారు. అనుమానస్థుల సందరిని నెప్పటి కప్పుడే బయటికంపుచు వచ్చినారు. 'పోలీసు సిబ్బందిని ఎక్కున చేసినారు. యువ రాజు గారు వెళ్ళు రాజవీధులను ముఖ్యముగా దృష్టిలో నుంచుకొన్నారు. ప్రజల కిబ్బందులు కలుగకుండు నట్లుగా ఏర్పాటులు ముందు ముందుగానే కావించినారు. యువరాజు గారింక 10 - 15 దినాలకు రానున్నారనగా పూర్వపు జిల్లా పోలీసు డైరెక్టరైనట్టి హెంకిను గారినికూడ పిలిపించి యువ రాజు గారి బంగ్లా సంరక్షణ కర్తగా నియోగించినారు. హెంకీనుగారు రెడ్డి గారు చేసిన ఏర్పాట్లన్నియు విమర్శనతో చూచి అన్నియు తెలిసి కొనిన తర్వాత ఇట్లన్నారు. " నా శిష్యులలో నీ వొక్కడవే నిజమైన శిష్యుడవు. ఇంతకన్న మించిన ఏర్పాటులు నేను కూడ చేయవలసినది లేదు. అయితే ఒక్కమాట. ఇంత కట్టు దిట్టములు చేసిన తర్వాత తీరా యువరాజుగారు వచ్చునాడు వీధులు నిర్మానుష్యముగా నుండిన అదియు వికారముగాను విపరీతముగాను కావింపబడునుగదా. దాని కేమి యాలోచించితివి.” రెడ్డి గారు యువ రాజు గారి ఆగమనమున గొక దినము ముందు నగరమంతటను దండోరా వేయించినారు. యువరాజు గారి వేడుకలు చూడ గోరు వారందరును ప్రొద్దుననే ఎనిమిది గంటలలోగా వచ్చి శాంతము - వీధులలో బాటప్రక్కన కూర్చున వచ్చునని చాటింపు చేయించినారు. తునకు యువ రాజు గారు రానేవచ్చిరి- వీధులలో జనులు 'కిక్కిరిసినారు. నాలుగు గుర్రాల బర్లీలో తిన్నగా నెమ్మదిగా ఊరేగింపు చేసినారు. ఫలక్నుమా సౌధములో చేరుకున్నారు. అంతయు శుభావహముగానే జరిగినది. 13
యువరాజు గారు నచ్చుటకు ( దినాలకు ముందుగా సిమ్లాలోనుండిస సి. ఐ. డీ. పోలీసు డిపుటీ డైరెక్టర్ జనరల్ గారు హైద్రాబాదుకు వచ్చి కొత్వాలు గారి ఏర్పాట్లన్నియు సూక్ష్మముగా విచారించి చూచినారు. నగరమంతయు తిరిగి నారు. ముఖ్యముగా పాడు గోడలను పరిక్షించినారు. ఆ గోడలు దాపుని ఒకరిద్దరు ప్రతి చోటను కనబడినారు. సి. ఐ. డీ అధకారి వారి విషయమై విచారించినారు. కొత్వాలుగారు సీటీ యియ్యగానే ఆగోడల లోపలివారు వచ్చినారు. వీరు మాచారులే అని చూపించినారు. సీ. ఐ. డీ. అధికారీకి సంపూర్ణముగా తృప్తి కలిగినది. యువ రాజు గారు వచ్చిన నాడు వీదులలో సుమారు 3 - 4 లక్షల మంది కనబడినారు. సి ఐ. డీ. అధికారి కొత్యాలు గారి మోబారులోనే యుండినారు. జన సమ్మర్గమునుచూచి భయపడిపోయినారు. “ఏమియు భయ పడవలసిన పని లేదు. అంతయు నాదే బాధ్యత " అని కొత్యాలుగారు నిర్భయముగా చెప్పినారు.యువ రాజుగారు ఐదు దినములు నగరములో అతిథిగా నుండినారు. మరునాడు శ్రీ నిజాం ప్రభువు గారి వద్ద విందు. కొత్యాలుగారు యువరాజుకన్న ముందుగా దేవుడికి వెళ్లినారు. దేవిడీ ద్వారము వద్దనే మిలిటరీవారు వారి నాపినారు. " నేను కొత్యాలును నన్ను వదలుడు" ఆని తెలుపుకొనినను వదల లేదు. ద్వారమునుండి దేవిడీ లోపలి భాగము మిలిటరీ వారు వశపరచు గొనినారు. విధి లేక రెడ్డి గారు బయటనే ఆగిపోయి నారు. శ్రీ యువ రాజు గారు దేవిడీలో ప్రవేశించినారు. దేవిడీలో ఎన్నియోబంగ్లాలు కలవు, విందుకై ఏర్పాటు చేసిన బంగ్లాయేదిమో యేమో. ఒక బంగ్లాయెద్ద మోటారుచేరినది. అక్కడ శ్రీ నిజాం ప్రభువు గారు లేరు. ఆహ్వానించు వారును లేరు. యువరాజు గారికిని వారి కమాండరుగాకిని ఆగ్రహము కలిగినది. పావుగంట వరకు వేచు కొని నారు. తుదకు నిజాం ప్రభువుగారికి తెలిసినది. అందరును కొత్వాలు గారిపై యెగిరిపడినారు. “ నేను మిలిటరీ వారిని ప్రాధేయపడినను లోనికి రానీయకపోయిరి. మరి తాము సరియగు వ్యవస్థ చేయక పోయితిరి. నా దేమియు తప్పులేదు.. అని రెడ్డి గారు తెలుపుకొనినారు.
మరునాడు వేరొకచోటవిందు. ఆందులో శ్రీ నిజాము ప్రభువుగారు రెడ్డి గారిని ప్రత్యేకముగా పిలిచియిట్లు చెప్పినారు. " ఇదిగో, రేపు మరల మా దేవిడిలో విందు ఏర్పాటు చేసినాము. ఎవ రేవన్ననుసరే నీవు నేరుగా మా బంగ్లాకు రానలసినది. నీవు లేనిది మరల పొరపాటులు జరుగును . “చిత్తము" అని రెడ్డిగారు అదే ప్రకార మాచరించుకొని ఆంతయు సవ్యముగా జరుగులాగున చూచుకొన్నారు. నాల్గవనాడు వేల్సు యువరాజుగారు నగరమును తామొక్కరే ప్రైవేటుగా చూడదలచు కొనినారు. కొత్వాలు గారికికూడ తెలుపవద్దనినారు. కాని కొత్వాలుగారికి వారి సంకల్ప మప్పుడే తెలిసిపోయినది. నగర మంతటను పోలీసు వారికి మెలకువతో నుంచుటకై టెలిఫోను లిచ్చినారు. వేల్సు యువరాజు గారు మోటారులో ప్రైవేటుగా ఫలక్నుమా సౌధమును వదలి గుట్ట క్రిందికి వచ్చినారు. రావడములోనే కొన్ని కట్టెలబండ్లు అడ్డముగా వచ్చినవి. అవన్నియు పోవుటకుగాను పదిపదేను నిముషాలుపట్టినవి. ఇంతలో వారు వెనుకకు తిరిగి చూచినారు. వెనుక రెడ్డిగారు సిద్ధముగా నుండినాను. వారిని పిలిచినారు. “నీ నెందుకు నా వెంట వచ్చుచున్నావు. అవసరము లేదు. అని సెలవిచ్చినారు. “చిత్తము” అన్నారు రెడ్డి గారు. యువరాజు గారు చారుమినారువద్ద వెళ్ళుచున్నారు. అచ్చటి పోలీసులు దిగ్బ్రమతో నెత్తి రుమాలుల సవరించు కొనుచు తుపాకులు అపసవ్యముగా పట్టుకొనుచు కొందరు లేచి కొందరు సగము లేచి అడ్డదిడ్డి సలాములు కొట్టినారు. యువరాజు గారికి మంచి వినోద దృశ్యము కనిపించినది. బాగానవ్వుకొని తరువాత కొత్వాలుగారితో ఆ దృశ్యము వర్ణించి వర్ణించి నవ్వినారట. యువరాజు గారు వీదులలో వెళ్ళునపుకు దూరములో ఎన్నియోబండ్లు, - మంది, మోటారులు, సైకిళ్ళు అన్నియు కనుపించు చుండెడివి. దగ్గరకు వచ్చువరకు అన్ని యు మాయము. ఇది వారికి ఆశ్చర్యము కలిగించెను. వారి మిలిటరీ సెక్రటరీగారు గొత్వాలు గారి నిట్లు విచారించినారు. మీవీధు లన్నింటిలో భూసురంగము లేమైన యున్నవా? బండ్లన్నియు జనసమూహమంతయు గారడివాని చేతినస్తువులవలె అప్పటి కప్పుడే మాయమగు చుండును. అప్పటి కప్పుడే పుట్టు చుండును" అని విచారంచి నారు. రెడ్డి గారి ఏర్పాట్లలోని విచిత్రములలో విచిత్ర మిదొకటి! ప్రజలకు ఏవిధమగు నష్ట కష్టములు కలుగకుంకునట్లుగా చూచుకొనుటయే వారి ప్రధానోద్దేశమై యుండెను.
యువరాజు గారు అయిదవ దినము నగరమునుండి వెళ్ళు వారైయుండిరి. అందరితోను సెలవు తీసుకొనుచుండిరి. తమ విడిది సౌధములోనికి ప్రధాన మంత్రిగారిని, మహారాజులను, నవాబులను, అధి కారులను నొకరి వెంట నొకరిని పిలిపించి
రెండు మూడు నిముషాలు వారితో మాట్లాడి వారికేదో బహుమతి యిచ్చి పంపుచుండిరి. వేంకట రామా రెడ్డిగారి వంతు వచ్చినది. వారు ద్వారము వద్దకు వెళ్ళి అచ్చటి ప్రై వేటు కార్యదర్శితో ఇట్లు చెప్పి పంపినారు. నాకు సరిగా
ఇంగ్లీషు రాదు. అందుచేత మreవ్వని నైన ఉర్దూ, ఇంగ్లీషు తెలిసిన దుబాసీని పిలిపించిన బాగుండును." వేల్సు యువరాజుగారిట్లు జవాబు పంపినాను “నీకు ఇంగ్లీషు సరిగా రాదు. నాకు ఉర్దూ రాదు. ఇద్దరమును వచ్చినట్లు మనము మనమే మాట్లాడు కొందము రమ్మనుము."
రెడ్డిగారు యువ రాజుగారి సన్నిధిలో సలాము చేసి దూరముగా నిల్చినారు.
"దగ్గరకు రమ్ము" అనినారు యువ రాజుగారు. రెడ్డి గారు దగ్గరకు వెళ్లి నారు. యువరాజుగారు తామే ముందుకు వచ్చి రెడ్డి గారి చేయిబట్టి తనప్రక్కన కూర్చున బెట్టుకున్నారు. " మీఏర్పాటులు నాకు అపరిమితమగా ఆనందము కలిగించినవి. నీకు నేను ఎల్లప్పటికి కృతజ్ఞుడను. అని సెలవిచ్చినారు. మరియు ఈ క్రింది విధిదము గా సంభాషించినారు:
యువరాజు _ " మీరు పంజాబునుండి వచ్చినారా లేక మదరాసు
నుండి వచ్చినారా!
"కొత్వాలు- " నేను ఈ రాష్ట్రము వాడనే కాని అన్యుడనుకాను,
మా పూర్వులు తరతరాలనుండి అనాదిగా ఈ
రాష్ట్రములోసివారే.
యువ రాజు- " ఈ యుద్యోగము మీ కెప్పుడిచ్చినారు
కొత్వాలు:-- " నేను 60 ఏండ్ల నుండియు పోలీసులో ఉద్యో
గము చేసి అమీన్ పదవినుండి యీ స్థానమునకు క్రమక్రమమగా వచ్చినాను
యువరాజు" నేను వచ్చిననాడు ప్రేక్షకులు 8 లక్షల వరకుండి
రేమో వారంద రెక్కడి వారు
కోతా:- “ నగరము వారును - చుట్టు పట్టుల గ్రామాదులనుండి
వచ్చి, వారును నై యుండిరి.
ఈ విధముగా 2 నిముషాల వరకు మాట్లాడు కున్నారు. రెడ్డిగారు జంకు కొంకు లేక ఇంగ్లీషులో సంభాషించి నారు. వారితో మూట్లాడు కుతూహలముతోనే ముపలి ముప్పున ముప్పుతిప్పలుపడి ఇంగ్లీషు నేర్చియుండిరి. యువరాజు గారు వీరి తప్పుడు ఇంగ్లీషు మాటలను, ఉచ్చారణను వివి పొరలి పొరలి నవ్వినారు. బాగుగా ముచ్చటగా విని
నారు. ఇట్లు ఎవ్వరికిని చేయని మర్యాదను, ప్రీతికిని కనబరచిన తర్వాత
సెలవిచ్చు నప్పుడు ఒక పెద్ద వెండి సిగారు కేసుసు రెడ్డి గారికి ఒహుమతి - నిచ్చినారు. రెడ్డి గారు తమ జీవితములో ఎన్నడును, ఏ దుర్వభాసమును గాని ఎరిగిన వారు కారు. నస్వము గాని, సిగరెట్టు గాని డిన్నరులలో నైన కొంత బ్రాందీ సేవిం చుటగాని, ఇట్టి వేవియు వారు ఎరుగరు. కొత్వాలు పదవిపై నుండి ఇంత మంచి ఏర్పాటులు చేసిన వారు ఘాటైన సిగా
రులు త్రాగకుండ ఉందురా అని యున రాజుగా రూహించి నారు కాబోలు! రెడ్డిగారా బహుమతిని గౌరవముతో తమ యింట నుంచుకోనినారు.
వీరి కొత్వాలీ కాలములోనే ఇర్విన్ ప్రభువు గారును, వెలింగ్డన్ ప్రభువు గారును హైదరాబాదుకు విచ్చేసిరి. ఆసందర్భములందును వీరు చాల మంచి యేర్చాటులు చేసి అందరి మెప్పును బడసిరి. వీరి కొత్వాలీ కాలములో స్పెయిన్ రాజుగా నుండిన డాన్ అల్ఫన్సో గారు హైదరాబాదు విచ్చేసి యుండిరి.
క్రీ. శ. 1923 లో వైస్రాయిగారు వచ్చిన సందర్భమున వేంకట రామారెడ్డి గారు చేసిన ఏర్పాట్లను చూచి ఇప్పుడు ప్రధాన మంత్రిగా నుండి అప్పుడు ఆర్థిక శాఖా మంత్రిగా మండిన సవాబ్ సర్ హైదర్ నవాజుజంగు బహదరుగారు చాల ప్రశంసించిరి, మరియు 1330 ఫసలీ నాటి " కొత్వాలీ శాఖా నివేదికను చదివి సర్ అక్బర్ హైదరీ గారిట్లు రెడ్డిగా రికి 5 జులై 19233 నాడు వ్రాసిరి.
“మీ నివేదిక నిప్పుడే అందుకున్నాను. మేమందరమును ( ఈమాట నా ఉద్యోగ ధర్మముచేతనే కాక నా హైద్రాబాదు పౌరత్వ ధర్మము చేతను చెప్పుచున్నాను) మీ కఠినమైన ఉద్యోగవిధులను మీ రెట్టి చాకచక్యముతోను, విశ్వాస పాత్రముగను, భక్తి తోను, నిర్వహించుచున్నారో , ఆపద్ధతిని అత్యంతముగా ప్రశంసించుచున్నాము.
"(It is not necessary for me to say how we all (& in this I am speaking not only in my official capacity but also as a citizen of Hyderabad) appreciate the great tact, honesty, and loyalty, with which you are discharging the duties of your onerous position.)
క్రీ. శ. 1923 లో ప్రధాన మంత్రిగా నుండిన సవాబ్ ఫరీదూ ముల్కు గారును వైస్రాయిగారి ఆగమన సందర్భపు టేర్పాటులను ప్రశంసించుచు నిట్లు వ్రాసిరి:-
" వైస్రాయిగారి ఆగమన సందర్భములో తాము చేసిన
ఉత్తమమైన మీ పోలీసు ఏర్పాటులను నేనత్యంతముగా
ప్రశంసించుచున్నాను. నే నిచ్చట ఎన్నియో సంవత్స
రముల నుండి నివసించుచున్నాను. ఈ తడవ మీ
ఏర్పాటులకన్న మించిన యేర్పాటులను నేనెన్నడును
జూచియుండలేదు. అన్నిటి కన్న ఆనంద దాయకమగు
విషయ మేమన - ప్రజల కేవిధముగు ఇబ్బందులు కలుగ
లేదు. ఇదివరలో గంటలకొలది కాలము వరకు బాటలు
అరికట్టబడుచుండెను. అట్టిది యీ తడవ లేకుండినది.”
రా|| బ| వేంకట రామా రెడ్డిగా ఉద్యోగ కాలము లోని అన్నింటికన్న ముఖ్య మగునంశము చెప్పవలసియున్న ది. నగరములో నానా మతముల వారున్నను వారి కాలములో ఎన్నడుగాని మతకలహములన్న మాట లేకుండెను. సుమారు 15 సంవత్సరముల నుండి హిందూస్థానములో హిందూ, ముసల్మానుల ద్వేషములు, కలహములు, నిత్యాభివృద్ధితో ప్రబలుచు వచ్చెను. కేవలము బ్రిటిషిండియాలోనే గాక అనేక దేశీయ సంస్థానములందును ఈ కలహములు సంభవించెను. హైదరా బాదులోని, జిల్లాలలోను అందందు కొంచెము పొడచూపినను హైద్రాబాదు ముఖ్యపట్టణములో మాత్రము వీరి కాలములో ఒకనాడైనను హిందూ ముసల్మానుల కలహములు జరుగక
పోయెను. ఇది ఉభయ మతస్థుల నిగ్రహశక్తి వలస కాదు.కేవలము రెడ్డిగారి చాకచక్యమే దీనికి కారణమని పూర్వము తెలుసుకొనకుండిన గత సంవత్సరము నగరములో గొప్ప హిందూ ముసల్మాను మత కలహము చెలరేగిన కాలములో నిష్పక్షపాత బుద్దిగలిగిన అనేక ప్రభుత్వాధికారులును ప్రజలందరును బాగుగా గ్రహించుకొన గలిగిరి. సుమారు 15 సంవత్సషముల క్రిందట. గుల్బర్గాలో గొప్ప హిందూ ముసల్మాను మతకలహము జరిగెను. దానిగాలి హైద్రాబాదు వరకు వీచినను రెడ్డిగారు కొత్యాలుగా నుండిరి కాన ఏమియు ప్రమాదము లేక పోయెను! గణపతి నవరాత్రులలో ఊరేగింఫుల సందర్భము లలో ప్రతి సంవత్సర మేదో విధమగు సంఘర్షణ జరుగునట్టి పరిస్థితు లేర్పడు చుండెను. కాని ఒక్కసారియైనను ప్రమాదము కలుగకుండ చూచుకొనినారు. ఒక తడవ కొందరు పోలీసు జవానులే గణపతి ఊరేగింపులో అనసరమగు చొరవ కల్పించుకొని సంఘర్షణమునకు కారకులైరి. అంతట గణపతి విగ్రహమును వీధిలోనే దించి హిందువులు సత్యాగ్రహము ప్రారంభించిరి. రెడ్డిగారి వార్త తెలిసిన వెంటనే అచ్చటికి వెళ్లి వారి నెన్నియో విధముల సంతృప్తి పరచుటకై ప్రయత్నించిరి. ఎన్ని విధముల చెప్పినను వినక పోవుటనుచూచి మరి ముగ్గురు హిందూపోలీసు అధికారులను జత చేసికొని
తాము నాల్గవవారై గణపతి విగ్రహముండు పల్లకీని మోసి కొనిపోవుటకు సమకట్టిరి! అంతటితో హిందువులు శాంతించి యథాప్రకారముగా గణపతి ఊరేగింపును ముగించుకొని వెళ్లి పోయిరి.
నగరములో బక్రీదు వంటి పండుగల సందర్భములలో ముసల్మానులకును, లోధీలు అను హిందువులకును, సంఘర్షణ యేర్చడు సూచనలు కనుపించెడివి. ఆ సందర్భము లలో రెడ్డి గారు బహు చాకచక్యముతో, లోథీలలోని ముఖ్యులను తాత్కాలిక పోలీసు సిబ్బందిలోనికి తీసుకొని వారి ద్వారా శాంతిని నెలకొల్పడివారు.
కొత్వాలీ పదవిలో నింకొక ముఖ్యాంగము శ్రీ నిజాం గారి సేవయైయుండెను. ప్రాచీనము నుండియు నగరకొత్వాలు ముఖ్యముగా నిజముగారి మొదటి బంటు. ప్రతిదినము తన ప్రభువుతో కలిసి నగరములోని పరిస్థితులు తెలుపుటయు, ప్రభువుగారి ఆజ్ఞలను శిరసా వహించు టయు నతని ముఖ్యమైన విధులు. ప్రభువుగారి డేవిడీలోని కార్యములను, పోలీసు జవానలద్వారా పూర్తి కావించ వలసియుండెను. మరియు పూర్వము ప్రభువుల కెవ్వరిపైనా నేని ఆగ్రహముకలిగిన కొత్వాలును పిలిపించి అతనిద్వారా వారిని నిర్బంధమందుంచు చుండెడివారు. ఇట్టి కార్యవిధానములలో ఆధునిక పరిస్థితుల బట్టి
కొన్ని మారినను వేంకట రామారెడ్డిగారు ప్రతిదినము తప్పని విధిగా తమ యేలిక తో కలిసి వచ్చెడివారు. కొన్ని సమయములలో కచ్చేరీ పనులు చేయు సమయములో శ్రీ ప్రభువుగారి నుండి టెలిఫోన్ వచ్చెడిది. అన్నియు పదలి తృణమే వెళ్ళి వచ్చెడివారు. మరియు ఒక్కొక్కమారు దినమునకు రెండు ముడు మారులు సహితము శ్రీ ప్రభువుగారితో కలిసెడి వారు ఒక్కొక్క తడవ రెండు మూడు గంటల కాలము ప్రభు సన్నధిలో నిలిచి అజ్ఞలన పొందుచుండెడివారు.
ఎవ్వరినైన మెప్పించవచ్చును గాని ఏలికను మెప్పించుట సామాన్యమైన విషయము కాదు. వేంకట రామా రెడ్డిగారు శ్రమ ఏలికను సంపూర్నముగా మెప్పించినారు. వీరి యుద్యోగ కాలము. పూర్తియై ఉపకార వేతసమును పొందవలసిన కాలము వచ్చినను ప్రతి సంవత్సరమును శ్రీ ప్రభువుగారు వీరి యుద్యోగకాలమును పొడిగించుచునే వచ్చిరి. క్రొత్త రెసిడెంట్లు వచ్చినప్పుడు గాని, వైస్రాయీలు వచ్చినప్పుడుగాని, ఇతర దేశీయ సంస్థాన పరిపాలకులు వచ్చినప్పుడుగాని, ప్రతి సంవత్సరము శ్రీ ప్రభువు గారి జన్మదినోత్సవములు జరిగినప్పుడుగాని, దేవిడీలో ఏర్పాటగు విందులందును, రాజకీయపు విందులందును ముఖ్యమగు ఏర్పాటులన్నియు వీరి ద్వారానే చేయించు చుండెడివారు.
హిందూ ముసల్మాను నాయకులందరును వీరి చేతిలోని వారై యుండెడివారు. వారి కేదోవిధముగా సమాధానములు చెప్పి సంతృప్తి పరచి వారిని తన వశమందుంచుకొనెడి వారు, అందు చేతనే వీరి కాలములో అశాంతి ఎన్నడును ప్రబల లేదు.మహాత్మా గాంధీ గారు వచ్చినప్పుడు వారు ఒక ఖద్దరు ప్రదర్శనశాలను దర్శించువారై యుండిరి. కాని సర్ ట్రెంచి గారి నిషేదాజ్ఞ అయియుండెను. గాంధీ గారికి ఆగ్రహము కలిగి తమ కార్యక్రమము నంతయు ఆపివేసి వెంటనే వెళ్ళిపోవుటకు సమకిట్టిరి. అప్పుడు కొత్వాలు వేంకట రామారెడ్డి గారు వారితో స్వయముగా కలిసి మాట్లాడి సమాధానము చెప్పి శాంతిపరచి మరల కార్యక్రమము సాగించు కొనునట్లు చేసిరి.
మ. ఘ. వ. నిజాం ప్రభువుగారు - 27 బహమన్ 1339" ఫ. నాడు తమ జన్మదినోత్సవ సందర్భమున రెడ్డి గారికి “రాజాబహద్దరు:" అను బిరుదమును అనుగ్రహించిరి. ఆ బిరుదమును పొందినందున నగరములోని హిందువులును ముసల్మానులును ఒక రినిమించి యొకరు వారి గౌరవార్థము సభలు చేసిరి. ఎన్నియో విందులు చేసిరి.
సికింద్రాబాదు రైల్వే లాలగూడా కార్యాలయము లోని వేలకొలది కూలీలు ఎక్కువ జీతములు కావలెననియు
తక్కువ పని కాలము ఏర్పాటు కావలెననియు, సమ్మెకట్టి హడ్తాలు చేసిరి. ఆసమయమున చాల అల్లరులు జరుగునట్లుండెను. అప్పుడు రెడ్డిగారు రెసిడెన్సీ ప్రభుత్వమనకు అత్యంతముగా సహాయపడి సమ్మెదారులను తృప్తి పరచి ఏఅవాంతర ములును జరుగకుండు నట్లుగా సహాయపడిరి. ఈ విషయమును గురించి జిల్లా పోలీసు డైరెక్టర్ జనరల్ గారికి సహాయాధికారిగా నుండిన మీర్ విలాయత్ హుసేనుగారు తాము రచించిన “హైద్రాబాదు పోలీసు చరిత్ర : అను గ్రంథములో నిట్లు వ్రాసినారు.
" వీరి యీసహాయమువలన ' కేవలము మాప్రభుత్వమే కాక రెసిడెంటుగారున్ను వీరికి కృతజ్ఞతల నర్చించిరి. దీనికి ప్రతి ఫలముగా వీరికి ఓ. బి. ఇ. బిరుదము ఇచ్చి యుండవచ్చు సనుటలో నేమి యాశ్చర్యము?"
రాజా బహద్దరు వేంకట రామారెడ్డిగారికి -క్రీ. శ. 1931 సంవత్సరాదిలో (1340 ఫసలీలో) జార్జి చక్రవర్తి గారి నుండి “ఓ. బి. ఇ.” అను బిరుదము ప్రసాదింపబడెను. ఇంతకు మునుపు రాజాబహద్దరు బిరుదము లభించినప్పుడు అన్ని శాఖల వారే ప్రకారముగా వీరిని గౌరవించిరో అదే ప్రకారముగా ఈ ఓ. బి. ఇ. బిరుదము లబించినప్పుడును ప్రీతి పూర్వకముగా సభలు విందులు చేసి గౌరవించిరి, స్థానిక పత్రిక లన్నియు వీరి సత్యంతముగా ప్రశంసించెను. "
రెడ్డిగారి కొత్వాలీ కాలములో నింకొక విశేషముండెను. సాధారణముగా పోలీసు వారనిన కఠినులనియు, భయంకరులనీయ, జనుల విశ్వాసము. శ్రీ రెడ్డిగారు పోలీసు ఉద్యో గములో పరమావధి పొందినహరైనను, సర్వశక్తి మంతులై యుండినను, శ్రీనిజాం ప్రభువుగారి మున్ననకు సంపూర్ణముగా పాత్రులైనను ఒక నాడును తనను తాను మరచి యెరుగరు. గర్వమనునది వారి జీవిశములోనే లేనట్టివి. అధికార మత్తత యనునది వారికి చిన్నప్పటినుండియు అలవాటు కానట్టి గుణము. వారిని జూచి దుర్మార్గులు మాత్రమే భయపడెడి వారు. అట్టి దుర్మార్గులును వారి దయాగుణమును గుర్తించి వారికి వశవర్తులగు చుండెడివారు.
హైదరాబాదు నగరములో దావూద్ అను పేరుగల ఒక గజదొంగ యుండెను. వాడు ఒకటి రెండు మారులు జెయిలు శిక్షనుబొంది అచ్చటినుండి తప్పించుకొని పోయినట్టి వాడు. పలుమారు మార్వాడీ దుకాణములపై బడి మార్వాడీలను బెదరించి వారినుండి సొమ్ములు లాగుకొనుచుం డెడివాడు ఒకతడవ వానిని పట్టుకొని హైకోర్టులో విచారణకై పోలీసువారు తీసికొని పోయియుండగా అచ్చట బహిర్భూమికని కొట్టిడీలోనికి పోయి అందలి రంధ్రములలో జొరబడి తప్పించుకొని పోయి యుండెను. వానిని పట్టుకొనిన వారికి మంచి
బహుమతి యిచ్చునట్లు ప్రభుత్వమువారు ప్రకటించియుండిరి. రెడ్డిగారు ఒకనాడు తెల్లవారు జామున ఎండ కాలములో తన యింటిలోని వసారాలో ద్వారము లన్నియు తెరచిపఁడు కొనియుఁడగా నొక ఆయథపాణియగు వాడు పహిరా పోలీసులు నిరాకరించి నను వినక వారిని త్రోసివేసి పోలీసులచే వెంబడింపబడినవాడై కొత్వాలు గారిని సమీపించెను. వాని వద్ద ఒక తుపాకీయు, ఒక పిస్టలును, ఒక కత్తియు, నడుములో బాకులును ఉండెను! కొత్వాలు గారికి వాని వార్తను రోహలా పహిరా జవాను తెలిపినాడు. వానినిదగ్గకు పిలిచినారు. వాడు కొత్వాలు గారి కాళ్లుపట్టు కొని తానే దావూద్ పేరుగల దొంగనని తెలుపుకొని తనను రక్షించుమని వేడినాడు. “సరే. ఇచ్చటనే పండుకొనుము. నీ కేమియు భయము లేదు". అనినారు కొత్వాలు. వాని ఆయుధములను మాత్రము తీసివేయించినారు. వానికి భోజనము పెట్టించినారు. తమ మోటారులో వానిని తీసికొని పోపుచు ఏ యే మార్వాడీలకు వాడిబ్బంది కలిగించి యుండెనో వారి వద్దకు వెళ్ళి " దావూద్ అను దొ0గను ఎరుగుదురా? అని వారిని ప్రశ్నంచగా వారు మోటారులోనే డ్రైవరు ప్రక్కననే ఆదొంగయున్నను గుర్తు పట్టజాలక వాని దౌర్జన్యములను వర్ణించి “సర్కార్ వాన్ని పట్టుకొని ఉరివేయించండి తలనరికించండి. లేకుంటే
వాడు మమ్ముల బ్రతుక నియ్యడు" అని ప్రాధేయపడినారు. కొత్యాలుగారు ఆదొంగను పోలీసు జవానుల వశము చేసి న్యాయస్థానములో విచారణ చేయించి శిక్షింప జేసినారు. ఆ దొంగను దొరకినప్పుడే పోలీసు భటుల వశము చేయక వానిని 12 గంటల కాలము తన వద్దనే స్వేచ్ఛతోనుంచి బేడీ లైనను వేయక తన మోటారులోనే తిప్పి తర్వాత పోలీసు వారి పశము చేయుటలో రెడ్డిగారి ఆత్మవిశ్వాసము ధైర్యమును ప్రశంస నీయములు. శిక్ష పొందిన తర్వాత ఆ దొంగ ఇట్లన్నాడట " కొత్వాలు: సాబ్ ఇంత మోసము చేయునని నాకప్పుడే తెలిసియుండిన నేనా రాత్రియే ఆయనను ముగించి యుందును, ఆ అందుపై రెడ్డిగారిట్ల నిరట. “అదేమో నిజమే, వాడేమిచేసి నను సాధ్యముగా నుండెను".
రెడ్డిగారి కొత్వాలీ కచ్చేరీ వ్యవహారములు బహువినోద కరముగా నుండెడివి. వారియా స్థానములోనికి ఏ పోలీసు వాని అడ్డంకును లేక ఎట్టి దరిద్రుడైనను, పోవచ్చును. హాలంతయు పోలీసులచేతను, చేతి క్రింది అధికారులచేతను, వకీళ్ల చేతను, గుమాస్తాలచేతను, అభ్యర్థుల చేతను నిందితులచేతను క్రిక్కిరిసి యుండెడిది. కొందరు బోగమువారు నగరములో కొన్ని దినాలు గాన సభలు చేసికొనుటకు స్వయముగా కచ్చేరీ నలంకరించి వినతి పత్రము లర్పించుకొను చుందురు. వారితో ముచ్చటించి తీర్పులు చేయుదురు, కొన్ని మొరలీవిధముగా నుండెడివి.
" అయ్యా, నా భార్యను నామామగారు పంపకన్నారు
" సర్కార్. నా భార్యను ఫలానావాడు ఎత్తుకొని పోయినాడు
“ నా భార్య పోతేపోయినది. అదినా పిల్లలనుగూడ తీసికొని పోయినది సర్కార్.
పిల్లల నైనా ఇప్పించగలరు.
" దొరా! నాకు ఫలానివాడు ఇన్ని రూపాయీలు బాకీ పడినాడు. చూడండి ఇదిగో
ప్రాంసరినోటు. నారూపా యీలిప్పించండి.
" సర్కార్ నేను ముసలిదాన్ని. నాయింటిలో ఫలానా బ్యారిష్టరు 3 ఏండ్లనుండి
ఉన్నాడు. అద్దెయియ్యడు • ఇల్లు వదలడు. గట్టిగా మాట్లాడితే నన్నే
వెళ్లగొడ్డానంటాడు. నా దేయిల్లు అంటాడు. నేను దిక్కు లేనిదాన్ని,
ఆబ్యారిస్టరును వెళ్లగొట్టించండి.
ఈ విధముగా పోలీసు వారికి సంబంధించి నట్టివియు, పోలీసు వారికి సంబంధము లేనట్టివియునగు 'మొరలును వారివద్ద కావింపబడుచుండెను. అయినను ఇదినాకు సంబంధ ములేదు పో అని వెడలగొట్టెడి వారు కారు. అన్నియు విచా రించుచుండిరి. సంబంధము లేనివాటిలో మొదలు మొదలు నాకు సంబంధము లేదుపో అని కసరుకొని మరల బీద వారు ప్రాధేయపడుటచేత ఎదిరి పక్షము వారిని పిలిపించి విచారించు
దుకు వారు వినిరా సరియే. తీర్పుచేసి పరిష్కారము చేయుదురు. వినకపోయిరా అన్యాయమే జరిగినదని వారికి స్థిరపడిన నాల గైదుమారులు త్రిప్పించి విచారణలు చేయుచుందురు. “అయ్యా, ఈవిచారణపోలీసు శాఖకు సంబంధించినది కాదు' అని యెవ్వరైనను ఆక్షేపించిన “ఆ సంగతి మా విచారణ పూర్తి యైన తర్వాతకదా నిర్ణయింపబడును". అని యింకను విసిగించెడివారు. తుదకు ప్రతిపక్షులు వారు చెప్పినట్లు వినుకొని పోయెడివారు. ఇట్లు చేయుటవలన బీదల కెంత యోశ్రమ, కష్టము, నష్టము, అన్యాయము అన్నియు తప్పిపోయెడివి. కొన్ని మారులు కొందరు ఉన్నతన్యాయస్థాన న్యాయాధికారులకు వీరి యీ సంబంధము లేని విచారణల వలన న్యాయస్థానానికి స్టాంపుల నష్టము కలుగుచున్నదని మొరపెట్టుకున్నారట. ఆందు పై ఒక తడవ ఉన్నత న్యాయస్థానపు న్యాయాథి కారి యొకరు వీరికి చ్చేరీలో వీరి ప్రక్కననే కొన్ని గంటల కాలము కూర్చుని వీరి తీర్పులను నెమ్మదిగా విని ప్రభుత్వానికి నష్ట
మైనను వీరు బీదల పాలిటి కల్పవృక్షము, న్యాయమే పరిపాలించుచున్నారు" అని పలుకుచు సెలవు తీసికొని పోయి నారట
వేంకట రామారెడ్డి గారి కొత్వాలీ యుద్యోగ కాలము మరల 1335 ఫసలీలో హెచ్చింపబడి నపుడు గుల్బర్గాలో రెవిన్యూ (మాల్), మదద్దారు పదవిలోనుండిన మహమ్మద్
ఎ కాంఅలీ అనువారు 19 ఆర్ది బెహిష్తు 1335 ఫసలీనాడు రెడ్డి గారికిట్లు జాబువ్రాసిరి.
" మీ యద్యోగ కాలమును ప్రభుశ్వము వారు పొడిగించిన వార్త నాకు పరిమితి లేని ఆనందము కలిగించినది. హైదరాబాదు ప్రజలవిషయమన మీ అస్తిత్వము దైప ప్రసాదిత మైన వరమువంటిది. దక్కన్ చరిత్రలో ఈ అధికార కాలము ' స్వర్ణా క్షరములలో వ్రాయదగినదై యున్నది. మీ ఉద్యోగ కాలములో హైద్రాబాదు ప్రజలకు లభించిన శాంతి భద్రతలు మరెవ్వరి కాలములోను నేటి వరకు లభించినవి కావు. ... ఏ విధముగా మీయుద్యోగ కాలము హెచ్చుచున్నదో అదేవిధముగా పరమాత్ముడు మీ ఆయుర్వృద్ధిని, ఐశ్వర్యాభివృద్ధిని ప్రసాదించుగాక"
పోలీసు చరిత్ర (History of the Police ), అను ఉర్దూ గ్రంధము వ్రాసిన మోర్ విలాయతు హుసేను గారు రెడ్డి గారిని గురించి యిట్లు వ్రాసినారు.
“ వేంకట రామా రెడ్డిగారు కొత్వాలు అయిన కాలములో పోలీసు (డిసిప్లిన్) క్రమ శిక్షణములో మంచి మార్పు కలిగెను. వారు తమ దీర్ఘానుభవము చేతను సర్వజన ప్రియత్వ ముచేతను తమ శాఖను ఉత్త మవిధముగా వశమందుంచుకొని కార్యసాధన కావించిరి. పోలీసు కార్యనిర్వహణలో వీరిశా
ఖలో ఏమియు లోపము కలుగ లేదు. వీరు హిందువులగుట చేత రాజకీయ పరిస్థితులలో తీవ్ర స్వరూపము దాల్చకుండ జరిగి పోయెను ...... ఈ కాలములో మతకలహములు అంతటను చెలరేగు చున్నవి. కాని వేంకట రామారెడ్డిగారు అట్టివేవియు నగరములో తలనెత్త నీయక నిరోధించియుంచినారు.. -ఈ ప్రకారముగా ఇంకను పై గ్రంథకర్త గారు కొత్వాలు వేంకటరామా రెడ్డిగారిని గురించి ప్రశంసించుచు వ్రాసి యున్నారు.