రాజశేఖరవిలాసము/ప్రథమాశ్వాసము

రాజశేఖరవిలాసము

ప్రథమాశ్వాసము

శ్రీనగజాత నుద్యుతులు చెల్వు మెఱుంగులుగా వియన్నదీ
ధ్వానము లెల్ల గర్జితకదంబముగా రజతాచలాంబరా
స్థాని వసించు శర్వజలదంబు కృపారసధారమీర మ
న్మానసబర్హి నెంతయు ఘనంబుగ సంతసమొందఁజేయుతన్.


చ.

కరిముఖుఁ గన్నతల్లి, శశిఖండవిభూషణు కూర్మిరాణి, భూ
ధరవరు ముద్దుపట్టి, నిజదాసగృహాంగణకల్పవల్లి కి
న్నరగరుడోరగాద్యమరనవ్యకిరీటమణిప్రభాతి వి
స్ఫురితపదాబ్జ యాత్రిపురసుందరి మాకు నభీష్ఠ మిచ్చుతన్.


ఉ.

పల్లవపల్లవాధరు, లవారితభక్తిని బాలుఁడంచుఁ ద
న్మెల్లనఁ బిల్చి యెంతయును మేలగు క్రొవ్విరిబొళ్ళొసంగఁ దా
నొల్లక యల్ల కప్పికొనియుంచిన బంతు లొసంగుమంచు భా
సిల్లుకుచంబు లంటుచు హసించు ముకుందుఁ డభీష్ఠ మిచ్చుతన్.


గీ.

కమలజార్చితమృదుపద కమలయైన | కమల మాయింట నేప్రొద్దు కడుముదమున
నిలిచి యభిలాషి తార్థమున్ గలుగఁజేసి | చిరతరంబైన కృపను రక్షించుఁగాఁత.


క.

ఎంచఁదగు నంచతేజిని | జంచలగతి నెక్కుజాణ సరసిజగర్భుం
డంచితమతిచేఁ దానొన | రించుంగావుతను మాకుఁ బ్రేమన్ శుభముల్.


సీ.

వేదాదివిద్యల వెలయించు పూబోణి నెఱిభక్తతతిఁ బ్రోచు నీలవేణి
యురుకవిత్వప్రౌఢి యొనగూర్చు కళ్యాణి మహనీయపుస్తకమహితపాణి
నిఖిలగీర్వాఁణవర్ణితసద్గుణశ్రేణి నిజలోచనప్రభానిర్జితైణి
ఘనతరోత్తుంగసైకతసన్నిభశ్రేణి రాజీవభవుని గారాబురాణి
సమదపికవాణి యవ్వాణి సంతతంబు | మదిని దైవార రచియించు మత్ప్రబంధ
మరసి దుర్దోషరహితమొనట్లుగాను | జిరకృపాస్ఫూర్తిఁ బరిపూర్తి జేయుఁ గాఁత.


చ.

పొలుపుఁగ నీశుకంఠమున బూనినయట్టి కపాలమాలికల్

వలనుగఁ జూచి గొప్పలుగ వండిన యుండ్రములంచు భ్రాంతి లో
పల జనియించి తుండమునఁ బట్టి మరిం దివియంగఁ జూచు వి
ద్యలగురుఁ డేకదంతుఁడు ముదంబున మత్కృతి బ్రోచుఁ గావుతన్.


చ.

రవి శుక్ర ధౌమ సౌమ్య సురరాడ్గురు భార్గవమంచు రాహుకే
తువులనఁ బేరు గల్గి యల తోయజగర్భసురేంద్రముఖ్యులౌ
దివిజుల కెల్లకోరిక లతిస్థిరమానసులై యొసంగుచుం
భువిని ప్రబుద్ధులైన గ్రహముల్ మముఁ బ్రోతురు గావుతం గృపన్.


సీ.

కచశైవలంబులఁ గటిసైకతంబులఁ గొమరారు వక్షోజకోకములను
లాలితబాహుమృణాలనాళంబుల నిరుపమలోచనేందీవరములఁ
గమనీయపాదకల్హారదళముల మానైన దరహాసఫేనములను
బంధురకరతలపంకేరుహంబుల వరవళివీచికావ్రాతములను
భాసిలుచునుండు గిరిజానివాససరసి | నమరఁ గ్రీడించు గిరీశహంసము మదీయ
దురితనీరంబు దిగనాడి నెరిని సుకృత | దుగ్ధములఁ గైకొనండుఁ గాఁతఁ దూర్ణగతిని.


సీ.

ఆకాంతవిదితపుణ్యశ్లోకు వాల్మీకు నఖిలశాస్త్రాగమాభ్యాసు వ్యాసు
భాసురకవితాప్రభవభూతి భవభూతిఁ జారుతరాతి యశోరుఁ జోరు
వీరాధిభుజామయూరు మయూరుని బంధురనవపుష్పబాణు బాణు
నసమవిద్వన్మనోహర్షుని శ్రీహర్షు సారవాక్యక్రియాశ్లాఘు మాఘు
కలితవిద్యాసముల్లాసుఁ గాళిదాసు | బుధజనానందకరముఖాంభోజు భోజు
మఱియు గీర్వాణకావ్యనిర్మాణచతురు | లగుకవీంద్రులఁ బ్రార్థింతు నగణితముగ.


మ.

రమణన్ నన్నయభట్టుం దిక్కమఖి నెఱాప్రగ్గడ న్భాస్కరుం
గ్రమ మింపొందఁగఁ బోతనాహ్వయుని లోకఖ్యాతుఁడౌ జిమ్మపూ
డమరేశున్ ఘనభీమసత్కవిని రథ్యంబొప్ప శ్రీనాథము
ఖ్యమహాంధ్రాంచితకావ్యకల్పకుల నేఁ బ్రార్థింతు నెల్లప్పుడున్.


సీ.

గురుతరకౌండిన్యగోత్రవిఖ్యాతుండు బయ్యనామాత్యుఁ డేప్రభునితాత
నిరతాన్నదానవర్ణితయశస్సాంద్రుండు తిమ్మనసచివుఁ డేధీరుతండ్రి
ఘనులు జగ్గనయు సింగన్నయు నరసన్నయను మువ్వు రేమంత్రి యనుఁగుఁదమ్ము
లలరఁ దిమ్మన్న రాజన్న జగ్గన్నయు సూరన్న యేమంత్రిసుతవరేణ్యు
లొనర వీరమ పాప మేఘనుని సహజ | లతిపతివ్రత లక్ష్మి యేచతురు రాణి
యట్టి శ్రీకూచిమంచి వంశాబ్ధిచంద్రు | మజ్జనకు నల గంగనామాత్యుఁ దలతు.

క.

ఛందమునుం గావ్యాదుల | చందము నింతైన నెఱుఁగ సతతము విద్వ
ద్బృందంబులకృపఁ గవితా | సందర్భం బొగి నొనర్తు సాహసవృత్తిన్.


చ.

ఎనయఁ బ్రసూనదామ మెవ రేక్రియఁ గూర్చిన నందుఁ గల్గు వా
సనలకుఁ గాదె మానవులు సంతస మందుదు రుర్వి నట్టిపా
వనతరశంభుభర్తయను వాసనకు న్మది మెచ్చి మత్కృతిం
గనుకొని తప్పులెన్నక తగం గరుణింపుఁడు సత్కవీశ్వరుల్.


వ.

అని నిఖిలవిబుధ విబుధ వినుతిం గావించి మఱియు నిష్టదేవతాప్రార్థనంబు జేసెద.


సీ.

శ్రీమద్గిరీంద్రజాచిత్తసరోహంస హంససహస్రదివ్యప్రతాప
తాపసానేకసంతవరక్ష శోణాధ్యక్ష యక్షేశనఖ దక్షయాగహరణ
రణరంగరిపునాశ రజతాచలనివాస వాసవార్చితవాదవనజయుగళ
గళమూలభూషణలలితహాలాహల హలధరానుజసన్నుతార్జునాంగ
యంగసంఘాతమధనసత్యప్రచార | చారణామరపోషణసతతవిభవ
భవవిరూపాక్షయోగిహృత్యద్యపీఠ | వీకపురికుక్కుటేశ కిల్బిషవినాశ.

సర్వలఘుసీసము.

తరుణశశిభరణ సువితరణ భయహరణకర యరుణసరసిరుహనిభచరణయుగళ
మదనమదమధన ఘనకదనతలవిజయ గిరిసదన జగదవన కరివదనజనక
వనజభవదమన పురదనుజకులశమన మునిమనజలురవరద ప్రతిదినవిలసిత
బహువితరవిభవ రిపుగహనదవదహన పటువిహగపతిగమననుత మహితచరిత
ధరణిరథ తరణిశతసదృశ హరత్రినయన | గరళగళ ధనదసఖ శుభద గగనచికుర
వరసుగుణనికర మృదుహృదయ శరధిశరథి | యురగవరచరణ పరమపురుష గిరిశ.


క.

దుర్గాధినాథ దివిజని | వర్గార్చితమృదులపాద వనరుహయుగళా
గర్గాదిమౌనిసన్నుత | భర్గా శ్రీకుక్కుటేశ భవ్యవిలాసా.


చ.

విను మఖిలేశ మర్త్యులకు వేడుకఁ గావ్య మొసంగి ధాత్రిపై
నొనరఁగ సౌఖ్యసంపదల నుద్ధతులై సుకవీంద్రు లుందురా
ర్యనికరవంద్య నీవిహపరంబుల సౌఖ్య మొసంగు సామివం
చును మది నెంచి నీకు సరసుల్ విని మెచ్చఁ బ్రబంధ మిచ్చెదన్.


గీ

తప్పులున్నయెడల నొప్పులుగా నెంచి | పూని కావ్య మొనరఁ బూర్తి చేసి
కరుణ మీఱ మాకుఁ గామితార్థము లెల్ల | ఘనత నొసగి యేలుకొను గిరీశ.


క.

అని విన్నవించి యాతని | ఘనతరకరుణావిశేషగౌరవముననే

నొనరించెద నవ్విభునకు | జను లెల్లను బొగడఁదగిన షష్ఠ్యంతంబుల్.


క.

ధీరునకు భక్తజనమం | దారునకు సురారిమదవిదారునకు మహో
దారునకు నఖిలజగదా | ధారునకు నఘౌఘవారిదసమీరునకున్.


క.

సోమునకు రజితభూధర | ధామునకు నుదంచితాహిదామునకు నయో
ద్దామునకుఁ బ్రకటసద్గుణ | దామునకున్ మౌళిశీతధామున కెలమిన్.


క.

భవునకు శోషితసరసిజ | భవునకు నగణితలసద్విభవునకు గౌరీ
ధవునకు వృషభేశ్వరసైం | ధవునకు గిరిబాంధవునకు ధవళాంగునకున్.


క.

శూలికి విమలదయాసం | శీలికి గజదైత్యచర్మచేలికిఁ బురని
ర్మూలికిఁ బరిపాలితదివి | జాళికి నతహృత్పయోరుహాళికి భక్తిన్.


క.

స్థాణునకు నురుచతుర్భుజ | బాణునకు జితప్రసూనబాణునకు బుధ
త్రాణునకు నిరతపోషిత | బాణునకున్ సత్యవాక్యపారీణునకున్.


క.

నరకిన్నరవిద్యాధర | గరుడోరగ సిద్ధసాధ్య గంధర్వసురా
సురపూజితచరణునకును | హరిణాంకనిభప్రకాశుఁడగు పశుపతికిన్.


క.

భృంగిరిటనాట్యరతునకు | సంగరవిజయునకు పాణిసారంగునకున్
గంగాధరునకు నబ్ధిని | నిషంగున కుర్వీరథునకు జగదధిపతికిన్.


క.

యక్షాధీశ్వరసఖునకు | నక్షీణలసత్కృపాకటాక్షునకు గణా
ధ్యక్షప్రియునకు విదళిత | దక్షాధ్వరునకును ధర్మతాత్పర్యునకున్.


క.

హరునకుఁ గాంచనధరణీ | ధరకోచందండునకు మృత్యుదర్పహరున కీ
శ్వరునకుఁ బీఠాపురమం | దిరకుక్కుటలింగమునకు దివ్యాంగునకున్.


వ.

అనంతసాష్టాంగదండప్రణామంబులు సమర్పించి యద్దేవతాసార్వభౌమునకు నంకి
తంబుగఁ దత్కృపాతిశయమున నా యొనర్పం బూనినయట్టి రాజశేఖరవిలాసంబునకుఁ
గథాక్రమం బెట్టిదనిన.


ఉ.

శ్రీకరలీలఁ దొల్లి మునిసింహు లనేకులు నైమిశాటవిం
బ్రాకటరీతి సూతుఁ గని పల్మరు ప్రార్ధనఁ జేసి యెప్పుడున్
లోకములందు యోగిజనలోలుఁ డుమాపతి తత్కథావళుల్
చేకొని పల్కినన్ తిసిసఁవినినఁ జేకురు సౌఖ్యము లెట్టివారికిన్.


సీ.

అసమానఘోరదుఃఖారణ్యములకుఁ బ్రజ్వలితాగ్నికీలలు శంభుకథలు
ఘనతరాఘౌఘాంధకారంబునకు లసజ్జలజాప్తబింబముల్ శంభుకథలు
గాఢామితోగ్రదుష్కర్మోరగములకు నమదమయూరముల్ శంభుకథలు

అపమృత్యుముఖ్యదోషాంభోధరములకు జంఝానిలంబులు శంభుకథలు
సజ్జనస్తోత్రపాత్రముల్ శంభుకథలు | సకలసంపత్కరంబులు శంభుకధథలు
శాశ్వతైశ్వర్యయుక్తముల్ శంభుకథలు | నవనఫలదాయకంబులు శంభుకథలు.


గీ.

గిరిశకథలందు నీవు నేర్పరివి మున్ను | శంభునకు వేశ్యగాఁ బ్రియసతి నొసంగి
యతని కారుణ్యమునకుఁ బాత్రత వహించి | నట్టిమనుజేంద్రుకథఁ దెల్పవయ్య మాకు.


క.

అనవుడు సూతుఁడు మునులం | గనుఁగొని వెస నిట్టు లనియె గౌరీశుకథల్
వినిపించెదనని పూనఁగ | జనులకుఁ దరమగునె? యోగిసంఘములారా!


శా.

వాణీశామరవల్లభాదులగు గీర్వాణుల్ నిజంబొప్ప న
య్యేణాంకార్ధవిభూషణుం దెలియఁగా నింతేనియుంజాల రీ
క్షోణిన్ మానవుఁ డెట్లు నేర్చు? దృఢభక్తుల్ గొంద ఱాచక్రభృ
ద్బాణుం గాంతురు సత్కథావళులు నిత్యంబుం ప్రశంసించుచున్.


క.

ఘనుఁడగుపినాకి చరితలు | వినయవివేకజ్ఞుఁ డగుచు విలసిల్లెడు సూ
తునికిం దెలిసినవిధమునఁ | బనివడి యితరులకుఁ దెలియఁబడు టె ట్లరయన్.


క.

ఘనశైలంబు లుంచెడు ము | వ్వననిధిలో నోడ నిలిపి వడి నీదెడుమ
ర్త్యునికరణి భక్తి యను నా | వను గిరిశకథాసుధార్ణవం బీదఁదగున్.


గీ.

అట్లు గావున నతనిపాదాబ్జయుగము | భక్తితోడుత మది నిల్పి ప్రకటగతిని
మీరలడిగినకథలెల్లఁ గోరి కలర | నెఱుఁగఁబలికెద వినుఁడని యిట్టులనియె.


క.

శ్రీకరమై రిపుజనహృ | ద్భీకరమై త్రిభువనప్రధితశివమతర
త్వాకరమై యనవరతశు | భాకరమై సింధుకటకమను పురి వెలయున్.


మ.

శశికాంతోపలజాలనిర్మితమహాసౌధాగ్రభాగోల్లస
ద్విశదాబ్జారిముఖీజనాంచితముఖావిర్భూతమందస్మితా
తిశయప్రస్ఫుటకౌముదీముదితహృద్దేశానిశోద్యచ్చకో
రశికుంతావళియై తనర్చుఁ జెలువారన్ దత్పురం బెంతయున్.


చ.

అరయఁగ నప్పురిం గనకహర్మ్యతలంబులఁ గేలిసల్పు సుం
దరుల యొయారముల్ గని ముదంబున నచ్చరలెల్ల మెచ్చి భా
సురగతిఁ గాన్కలంపిన ప్రసూనపుదండ లనంగ నెల్లెడం
దరుచుఁగ రత్నతోరణకదంబము లందము మీరు నెప్పుడున్.


మ.

లలనల్ తత్పురసౌధవీథులను డోలాకేళిచేనుండి తా
రల బాలార్కుని మింటఁ జూచి తమపాదాబ్జద్యుతిం బోల రాఁ

గల కెందమ్మి యటంచుఁ బాదములఁ ద్రొక్కన్ దంతముల్ రాల య
ట్లలరెంగాదె సహస్రపాదుఁ డనుపే రావానరస్వామికిన్.


గీ.

నాగరులు మేన నలందిన నవ్యచంద | నాగరుల సౌరభానలం బానుచున్న
చంచరీకాళుల నయనసరణిఁ బొదలుఁ | బురి వితానాంచలాంచితసురపమణులు.


చ.

మరకతరత్నసంఘటితమానితకుడ్యకదంబజాలకాం
తరములనుండి వేవెడలు తద్ఘనసారపుధూపధూమముల్
పరువడిఁ జూచి నీలఘనపంక్తు లటంచు నటించు నెంతయున్
గుఱుతుగ మేదినీస్థలిని గోర్కెలచే శిఖినీసమూహముల్.


మ.

నెల మద్విటను గోటచాటుఁ జనుచో నీటొప్ప నర్కోపమో
జ్వలపంకేరుహరాగరత్నము రుచివ్యాప్తిం బ్రకాశించు ని
వ్వలిచెంతన్ బరిఘాంతరాంబుజతతల్ వ్యాకోచభావంబుచే
నలరుం బున్నమఱేలు దన్మణిరుచుల్ హంసాళులన్ భ్రాంతిచేన్.


ఉ.

గట్టిగ వెండిబంగరపుగట్టులె యిల్లును విల్లు గాఁగఁ జే
పట్టియు భిక్షకుం దిరుగు భర్గుని దేటివిభూతి యంచుఁ బె
న్గట్టుల మించు విత్తములఁ గ్రక్కున వెచ్చము చేయుచుందు ర
ప్పట్టణమర్త్యసంఘములు భవ్యవిభూతిఁ జెలంగి యెప్పుడున్.


క.

వేడుక నజుతో వాదం | బాడం బులకితాంగు లగుదు రాపురిలోనం
బాడబులు దురితజలనిధి | బాడబులని జగములల్ల బ్రస్తుతిసేయన్.


క.

మారునియాకారముం బలు | మారును నిరసించు రాకుమారులు వీటన్
మారెందు లేక వడిఁ బరి | మారుతు రంవరులఁ దృణముమారుగ నెపుడున్


క.

ధనదుఁడను పేరు మాత్రము | తనకబ్బెం గాక పిలిచి ధన మెవ్వరి కి
చ్చెను యక్షుండంచు నెంచుచు | ధన మిత్తురు బుధులఁ బిలిచి తత్పురివైశ్యుల్.


క.

ధరణీసురాంఘ్రసేవా | నిరతులు శ్రీకంఠభక్తినిపుణులు రిపుకుం
జరనముదయమహర్యక్షులు | సురుచిరయశు లందుఁ గలుగు శూద్రజనంబుల్.


సీ.

వలనొప్ప నీదండవలె నింతి మాకన్న దండ గావలెనేని యుంుకొనుముము
కనుగొనియెద బంతులొనర నిమ్మిపుడన్న గోరంట బంతులఁ గోరుకొనుడు
మారుబేరము లింక మాకెట్లమరు నన్న మరుమాట మేలగు మాయెడలను
నునుమోవిచివురునకు వెల యెంతన్నఁ బ్రియమంచు దీని దీవెనఁగఁదగునె
యనుచుఁ దముఁ జేరు నెఱదంటతనము మీరఁ | పలుకు నల కోడెకాండ్రకుఁ బ్రీతివచనము

లొసగుచును బువ్వు లమ్ముచు నుందు రందు | నందముగ నెప్పుడును గొంద రిందుముఖులు.


సీ.

అలకంబు లలగించి తిలకంబు లొగి ఫాలఫలకంబులగ ముద్ద గులుకదిద్ది
యందంబులగు మంచిగందంబు లెక్కుడానందంబుతో గుబ్బలందు నలఁది
సింగారముగ మేల్మిబంగారుతొడవులు పొంగాగువేడ్క చేకొనలఁ దాల్చి
బలువైనవిలువ చేఁజాలవైనసన్నంపువలువలు రింగులు వారఁగట్టి
యంగభవకేళిఁ గోర దాయంగవచ్చు | పల్లవులమానసంబులు పల్లవింపఁ
బొందుమీరంగ విహరించుచుందు రెపుడు | వారకామిను లందున వాతతముగ.


శా.

శుంభర్విక్రమరూఢిచే బలుమరుం శోభేంద్రు కాలంచున
జ్జంభద్వేషణు చేతివజ్రమునకున్ శంకించి చంచత్కృపా
రంభుం డావిభుచెంతఁజేరిన మహీధ్రశ్రేణులన్కైైవడిం
కుంభీద్రంబు లగద్గముండు నెపుడున్ గోటానుకో ట్లప్పురిన్.


చ.

గురుతుగ నప్పుడుం గలుగు ఘోటకసంఘముతోడ నెంతయున్
బరువిడనోడి వేగహరిణంబులు వాయునిశాధినాథ డం
కరులను జేరియైన నధికంబగు వైరము దీర్పలేక యా
కరణిన యుండెఁ దథ్యమిది కాదన వానికి నట్టు లేటికిన్.


గీ.

రాజహంసప్రభలచేత రాత్రి పగలు | కుముదకమలాళి హెచ్చుచుం గొమరుఁ జూప
రాజహంసప్రతతులచే రమ్యమైన | సరస లలరారు నచ్చోట సరసు లలర.


సీ.

అసదృశఫలపల్లవాహారంబు లన శుకపికాదివిహంగశోభితములు
చంచత్ప్రసూననిష్యంగన్మరందాళిసంచితబుంగమేదిందిరములు
సతతవిలాససంచారనారీజనరమణీయగీతవిరాజితములు
సకలశ్రమాపనోదకభూరివిస్తారమానితఛాయాసమన్వితములు
వకుళసహకార చంపకాశ్వత్థభాగ | నారికేళకపిత్థజంబీరపనస
కేతకీస్వముఖ్యభూజాతయుతము | లున్నతము నిప్పు నప్పురయుపవనములు.


సీ.

లలి బృహస్పతులంచు నలరు విప్రోత్తము ల్నెలకల్పకములందుఁ దరువులెల్లఁ
గామధేనువు లందుగల గోగణములెల్లఁ నొసఁగ నప్సరు లలరుఁ బువ్వుబోండ్లు
వలనొప్ప నుచ్చైశ్రవంబు లందు హయంబు లైరావణము లందు వారణములు
గంధర్వవరు లందు గాయకానీకంబు లలవైజయంతు లందుల గృహంబు
లభవనామజపంబె యందమృతసేవ | గాంగసురకీర్తి సుఖ మందె డగ్గియుండు
రామవంశుఁ భవకృతరాయవిభుఁడు | గరుణఁ బాలించు తత్సింధుకటకమునను.

సీ.

ఆడఁడు స్వప్నంబులందైన నెప్పుడు పాటిఁదప్పి యసత్యభాషణములు
చూడఁ డొక్కెడనైన సురుచిరసౌందర్యవరవధూజనముఖపద్మములను
వీడఁ డెంతటి యవివేకచిత్తులనైన శరణు వేడిన భీతజనవితతుల
నోడఁ డత్యుగ్రరణోర్వీస్థలులనైనఁ జలితుఁడై శాత్రవసంఘములకు
నతఁడు రాజేంద్రమాత్రుఁడే మతిఁ దలంప | నర్థి దారిద్ర్యతిమిరార్కుఁ డమితయశుఁడు
భవ్య శివదేవరాయ భూపాలసుతుఁడు ! భూరివిభవుండు భళ్ళాణభూధవుండు.


గీ.

ధర్మగుణకాండములె చాలఁ దనకుఁ దోడు | గాఁగ నరులను రక్షించు గణనలేక
ధర్మగుణకాండములె చాలఁ దనకుఁ దోడు | గాఁగ నరులను శిక్షించు గణనలేక.


సీ.

అల చందురునియందు గలకందుఁ గని ముందు పలుచందముల సందలలి నొనర్చి
ఘనలీలలను శూలిగళమూలమున నీలమునుబోలు రుచి జాలమును హసించి
తగసీరి పైభూరి తరహారి యగుచీరఁగని సారెకునుఁ గేరివినుతి మీరి
సికవాణియగువాణి పృథువేణిఁ గలపోణి మినిజాణతనమున మించనాడి
కుందమందార విశదారవింద చంద | నేందుమణిహార తారకాహీరవార
ములఁ దిరస్కృతి యొనరించుఁ జలము మిగుల | వరుసతోడుత నమ్మహావరునికీర్తి.


సీ.

కోరినయప్పుడే కురియును వర్షంబు భూమి ఫలించు నద్భుతము గాగ
మొదవులు పాలిచ్చు మూడువేళలయందు విడువక కాచును వృక్షతతులు
నెరి నపమృత్యువు నెఱుఁగ రెవ్వారైనం జోరరుగ్బాధలు సోకుటరిది
జలతృణోపేతమై విలసిల్లు ధారుణి నిత్యోత్సవము లొప్పు నిఖిలదిశల
జనులు కలనైనఁ గలహంబుఁ గనుటలేదు | జాతిభేదంబు దప్పక జరుగుచుండు
జలరుహస్తాన్వయాంభోధిచంద్రుఁ డగుచుఁ | దనరు భళ్ళాణవిభుఁ డేలు ధరణియందు.


గీ.

సతతపుణ్యవ్రతలు గుణోన్నతలు పతికి | హిత లశేషజగజ్జననుతలు భాగ్య
వతులు రూపున మారటరతులు సుమతు | లతులసౌజన్యయుత లిర్వు రతనిసతులు.


గీ.

వారిలోన నగ్రవనజాక్షి చల్లాంబ | మఱియుఁ జిన్నపొలఁతి మల్లికాంబ
సవతు లెరసు లేక సతతంబు మెలఁగుచు | సవతు లేక యుండ్రు సమ్మదమున.


సీ.

కమనీయమేఘలాఘటితభూరినితంబ పోషితాశేషసద్బుధకుటుంబ
సుందరాస్య ప్రభానిందితశశిబింబ మధురోష్ఠవిహసితమహితబింబ
చికురకోమలకాంతిగితమత్తరోలంబ కేవలతరకరుణావలంబ
యానావధానప్రహర్షితకాదంబ నిఖిలపాపౌఘావనీధ్రశంబ
గురుజనానందకరలసద్గుణకదంబ | సేవకాభీలఫలదప్రతిరసాంబ

'

శివచరణభక్తివాసనాంచితకదంబ | సతతసత్యవ్రతాలంబ చల్లమాంబ.


శా.

ఆ చల్లాంబ విలాసవైఖరులు భాషాధీశ భోగీశులున్
వాచాప్రౌఢిని బల్కఁజాల రల గీర్వాణాబ్జపత్రాక్షులం
దా చెల్వం బొకయింతయుం గలుగ దిట్లైన యాలేమతో
భూచక్రంబునఁ గల్గు నిందుముఖులం బోల్పంగ నీవౌదురే?


చ.

కలికిపదద్వయంబునకుఁ గ్రక్కుననోడిన వ్రీడఁ గచ్ఛపా
వళి తలఁజూపఁజాలక జవంబున లోతగు నీటిలోఁ బడెం
దలరఁగ నెఱ్ఱతామరలు దట్టపుకాంతికి నోడి తత్పదం
బులఁబడి యెప్పుడున్ వదలిపోక భజించు నహర్నిశంబులన్.


గీ.

సఖియజంఘాయుగంబుతో సాటిరాఁగలదలచి | యెదిరించి యోడి డెందమున బలియు
బీతిచేఁ గాదె పొట్టలు పిగులుచుండు | గలయ గర్భంబు లెల్ల సంగ్రమముతోడ


క.

కరిగమన తొడలతోడుత | సరివోలం దలచి మావిచక్కఁగ నరఁటుల్
పెరిగి జిగి 3తరుగు గాకటు | తరమగునే పిల్లపిల్లతరములఁ దమకున్.


క.

కలికిపిరుందుల కెనఁగాఁ | బులినము లిసుమంత లెటులఁ బోలెడు నొకచోఁ
దులతుల యనుచుండెడు వే | దులఁదులయననేల వానితో సరియగునే.


గీ.

అతివనడలకు నోడి రాయంచమటుము | లరయ నిలువెల్ల వెల్లనై యాత్మలోన
దద్విరోధంబు సాధింపదలఁచికాక | కమలజుని మోవందమి కేమి కారణంబు.


చ.

నిరతరవిక్రమస్నరణచే సముదంచితకుంభికుంభముల్
పరియలు జేసి తల్పిసతక్షణ సేయుమృగేంద్రకోటు లా
గురుకుచసూక్ష్మమధ్యమున కుందగ నోడి యదృశ్యమయ్యెఁగా
కరమ గుహాంతరాళముల నట్టు వసింపఁగ నేల వాటికిన్.


గీ.

లలనవళు లెప్పుడును దారు నిలిచియుండు | నిలుకడ యొకింతయును లేక చలన మొందు
చుండునంచును పలుమారు నుల్లసమున | భంగత యొనర్చు జలధితరంగములకు.


చ.

పొలఁతుక యారుతీరులకుఁ బొందుగ నాభిగుహ న్వసించు స
ల్లలితపయోధరద్వయమిళిద్ఘనలేపనదీవ్యసౌరభం
బల మలయాద్రిశృంగసముదంచితచంచలమందచందనా
నిల మనుచుం బయవ్వెడలి నిల్చిననీలభుజంగమోయనన్.


చ.

చలమునఁ జంద్రుఁ డెంచఁగను జక్కవరాచెలిగుబ్బచన్నులై
పొలుపుగ నుద్భవించి మదిఁ బూనిన సాధ్వసమెల్ల దీర త

ద్విలసితనామధేయమున వేమరుఁ జెల్వగునట్టిచంద్రస
మ్మిళితములై వసించుఁ జెలిమిన్ మనెనోయన నొప్పు నెప్పుడున్.


క.

విరిచెండ్లు నిమ్మపండ్లును | గర మొప్పగు పసిడిగిండ్లు కరికుంభములున్
సరిగా వావరవర్ణిని | గురుకుచయుగళంబుతోడ గోరంతైనన్.


క.

గళమునకు నోడి శంఖము | గళగళమనిపలుకుచుండెఁ గలకంఠంబుల్
పలుచందంబుల నయ్యు | గ్మలిసుస్వరమునకు నోడి మలినములయ్యెన్.


సీ.

వనజాక్షి కెమ్మోవి కెనఁబోల్పఁదగునవి పల్కదళాల్ గావె పల్లవములు
శుకవాణియధరంబునకు సాటియౌనంచుఁ గీర్తింప ఱాల్గావె కెంపులెల్ల
నెలనాగ పెదవితోఁ దులయంచుఁ బొగడంగ విలువ దేరునుగావె విద్రుమంబు
లింతివాతెఱతోడ నీడనంగను గంధరహితంబు నగుఁగాదె రక్తకంబు
నరయ నెందులతోఁ బ్రతియనఁగవచ్చు | బలుచనై తేనె లొలుకుచు విలువఁ దెగక
సతతఘనసారసౌరభోన్నతులఁ దనరు | కంబుకంధర రదనాంశుకంబునకును.


క.

తలతలమను వజ్రంబులఁ | దలతలమను నిందువదన దంతమరీచుల్
కలకలమనియెడు రాచిలు | కలకలమనుసుల్ గలంచుఁ గలికి మృదూక్తుల్.


ఉ.

తామరసాక్షి వీనుగవతానవ సంఖ్యల నెంచఁజాలుఁద
త్కామిని తళ్కుచెక్కు లల కామునిచేతిమెఱుంగుటద్దముల్
సామజయాన నాసికము సంపఁగిమొగ్గల నెగ్గులాడు నా
కోమలి లోచనంబులు చకోరగణంబుల నేలు నెంతయున్.


క.

వనితారత్నంబునకుం | గనుబొమ లందమున మీరు కందర్పునిచేఁ
దనరెడి సింగిణివిండ్లో | యనుచున్ జనులెల్లఁ జూచి యభినుతి చేయన్.


మ.

నెరి నబ్జాహ్వయ మిర్వురందు నలర న్నీరేజతారేశు లా
తరుణీరత్నము ముద్దునెమ్మొగము చందంబంద వాదించుచో
సరసీజావళి యోడెఁ గాదని యొరుల్ చర్చింప సర్వోర్వికిం
గర మాహ్లాదము చేయుచంద్రుఁ గని స్రుక్కన్ వాని క ట్లేటికిన్.


క.

నీలంబులమృదుతరశై | వాలంబులఁ జారు చమరవాలంబు లస
ద్రోలంబమేచకాంబుద | జాలంబుల నేలఁజాలు నఖచికురంబుల్.


సీ.

జలజాక్షి నునుకురుల్ శైవాలలతికలు రాజాస్యవళులు తరంగతతులు
కలకంఠి లోచనంబులు గండుమీనులు సుమగంధి విమలహాసములు నురువు
లతివకంఠము దక్షిణావర్తశంఖంబు భామచన్గుబ్బలు పర్వతములు

కామినీమణిజంఘికలు మకరంబులు చానపిరుందులు సైకతములు
గంధగజయానచరణముల్ కచ్ఛపములు | రమణిహారంబులెల్లను రమ్యమణులు
తరుణి ఘననాభి సుడియనఁ దనరుచుండుఁ | గావున విలాసజలరాశి యావెలంది.


వ.

ఇవ్విధంబున ననన్యసామాన్యయౌవనసౌందర్యసద్గుణకదంబయగు చల్లమాంబ
యు నఖిలగుణంబుల నప్పరమపతివ్రతారత్నంబున కెనయందగు మల్లికాదేవియుం ద
నకుఁ బ్రియపత్నులుగా నభీష్టభోగంబు లనుభవించుచుండి యారాజపురందరుం డొక్క
నాఁ డాత్మగతంబున నిట్లని వితర్కించె నంత.


చ.

సిరిగలవాఁడె మానవుఁ డశేషజగద్విదితంబు గాఁగ సు
స్థిరతరమైనకీర్తులను జెందుట మేలగు నట్టుగానిచో
సిరియును లేమియుం దలఁపఁ జీకటి వెన్నెలవాసి గాక యె
వ్వరికిని లేతప్రాయమును వార్థికమున్ గురిగాదె మేదినిన్.


గీ.

ధనము గల్గియుండ ధర్మంబు సేయక | యున్ననదియుఁ బరుల కొదవుఁ గాదె
తేటులెల్లఁ గూడి తేనియఁ గూర్చిన | నొరుల కబ్బినట్టు లెఱుఁగుకొనిన.


గీ.

చెలఁగు చౌశీతిలక్షల జీవరాసు | లవనిఁ జరియించి నరకంబు లనుభవించి
యంతమీదట మనుఁజుఁడై యవతరించి | తేటపడఁగ సమస్తంబు తెలిసియుండు.


ఉ.

అట్టిమనుష్యదేహ మటు లబ్బినయప్పుడె భక్తి మీరఁగా
గట్టులరేనియల్లుని జగద్విభు నీశ్వరు నిందుశేఖరుం
గట్టిగఁ బూజ సేయుచునుఁ గౌతుకలీలలఁ గీర్తికాంతఁ జే
పట్టి తుదిం దిరంబయిన భవ్యపదంబునుఁ జెంద మేలగున్.


క.

అడిగినవస్తువు లొరులకుఁ | గడు వేడ్కనొసంగి ముజ్జగంబులకుం దా
నొడయఁ డగునట్టి శంభునిఁ | దడయక హర్షింపఁజేతుఁదధ్యము మీరన్.


క.

ఈపథమున ప్రతికార్యముఁ గావింప దలంచుచోటు గావలయుఁ దగ
న్భావనతరగురుదీక్షను | ధీవరులగువారలకు నధికతరభక్తిన్.


క.

పొసఁగ గురుచరణయుగళము | వెసఁ గాంచినయపుడె తొలఁగు వెఱచి యఘంబుల్
విసవిసఁ బవనుఁడు జవమున | విసరిన విడిపాఱుజలదవిసరముభంగిన్.


మ.

వనజాతప్రభవాండమండితజగద్వ్యాకీర్ణుఁ డై యొప్పుభ
ర్గునిఁ గాంచన్ గురు నాశ్రయింపవలయుం గుంభాంతరాపూర్ణద
ధ్యనిశోద్యన్నవనీత మారయఁగఁ దథ్యం బొప్ప నెల్లప్పుడున్
ఘనమందారము నాశ్రయించుకరణిన్ గౌతూహలప్రక్రియన్.

సీ.

బహుజన్మజనితమౌ పాపాబ్ధికినీ న వచర్చింప సద్గురుచరణసేవ
కమనీయపుణ్యలోకప్రాప్తికిని ద్రోవ చర్చింప సద్గురుచరణసేవ
చిరతరైశ్వర్యలక్ష్మీప్రదంబగు క్రేవ చర్చింప సద్గురుచరణసేవ
దుష్కర్మరుక్సంహతులకు నౌషధసేవ చర్చింప సద్గురుచరణసేవ
వనజసంభవముఖ్యగీర్వాణబృంద | ములకుఁ గానంగరాని శంభునిపదాబ్జ
దర్శనం బాత్మఁగోరిన ధన్యమతుల | కిరవలరుఠేవ సద్గురుచరణసేవ.


క.

అని తలంచి యాక్షణంబున | దినకరకులజలధిశీతదీధితి యగున
జ్జనపాలవరుఁడు కౌతుక | మునఁ దనరారుచును వేగమునఁ బయనంబై.


సీ.

గములు గూడుక కురంగములచందమున వేగమునఁ బారెడు తురంగములతోడ
నరుల కచ్చెరువుగాఁ దరలియాడెడు పెద్దగిరులఁ బోలెడుగంధకరులతోడ
సుతులు పేయఁగఁజాలు గతులఁ జెల్వలరారు నతులశతాంగసంహతులతోడఁ
గుటిలారివరులఁ గోమటులఁ జే సెడి మహార్భటులుగల్గిన వీరభటులతోడ
హితులతో మాన్యులగు పురోహితులతోడ | బుధులతోడను వందిమాగధులతోడ
మఱియుఁ దక్కినపరివార మరుదుమీఱఁ | గొలువఁజనియె నిలాభర్త గురునికడకు.


క.

అటు లరిగి కనియె నరపతి | పటుశైవకథారహస్యభాసురహృదయున్
ఘటితాఖిలజనకామున్ | నిటలాక్షపదాబ్జభక్తినిధి నాచార్యున్.


క.

కనుఁగొని వినయంబునఁ బద | వనజంబుల కెఱగి లేచి వసుధాధిపుఁ డొ
య్యన ముకుళితకరతలుఁడై | వినుతింపఁగఁ జూచి గురుఁడు వెస నిట్లనియెన్.


మ.

క్షితినాథోత్తమ! నీకు నీసతులకున్ సేమంబె? నీమంబుతో
సతతంబుం బ్రజ నేలుచుండుదువె? నీసైన్యంబులెల్లం బలో
న్నతి నొప్పారుటఁ జేసి శత్రువరులన్ మర్దించి యిష్టార్థముల్
కుతుకంబొప్పఁగ ధారుణీసురులకుం గొంచింప కీఁజూతువే?


క.

పరమర్మభేదనుండును | జిరమతిమంతుండు హితుఁడు శిష్టవ్రతుఁడున్
వరకులజుండునుఁ గరుణా | నిరతుండును నైనమంత్రి నీయెడఁ గలఁడే?


క.

దేవాధీశ్వరునకు మును | జీవుఁడు దామంత్రి యగుటచే ఘనుఁడయ్యెం
గావున విభవముఁ గోరిన | భూవిభునకు మంత్రివరుఁడు భూషణ మరయన్.


ఉ.

స్నానము సేయునీమమును శంభుపదార్చనఁ జేయుమర్త్యుఁడున్
వానలఁ గల్గుసస్యమును వారిరుహాహితుఁ డుండురాత్రియున్
మానిని గల్గుసౌఖ్యమును మంత్రివరేణ్యుఁడు గల్గ నొప్పు న

మ్మానవనాథురాజ్యమును మానుఁగఁ దేటవహించు నెంతయున్.


వ.

అట్లగుటం జేసి నేర్పరి యగుమంత్రిగల రాజు రిపులం జయించి యక్షీణరాజ్య
సుఖంబు లనుభవించుం గావున సప్తాంగబలంబులకన్నఁ బెద్దయగు మత్రాంగబలం
బు పరిగ్రహించితివే యని మఱియు భవదాగమనప్రయోజనంబును సవిస్తరంబు
గాఁ దెల్పుమనిన నద్ధరావల్లభుం డిట్లనియె.


క.

జననుత! మీరాజ్ఞ యొసం | గినరీతి నొనర్చినాఁడఁ గృతపుణ్యభవ
ద్ఘనకరుణను నే నిచటకిఁ | జనుదెంచుట మీపదాంబుజంబులఁ గొల్వన్.


సీ.

గురునాథ! జంగంబు గోరినవస్తువు నెద్దియైన ముదంబు నివ్వటిల్ల
నొసంగి జగంబులం దసమానకీర్తులఁ జెంది గిరీశుఁ డానందమొంద
నట్టు గావించెదనని తగనూహించి వ్రతము గైకొనఁగోరి వచ్చినాఁడ
మీర లిందుల కిచ్చమెచ్చి యాదరమున నీక్షింప నిప్పుడే దీక్ష యొసఁగి
భూతి నొక్కింత నొసటిపై బొట్టు బెట్టి | పాదతీర్థంబు మూర్థంబుపైని జల్లి
యాజ్ఞ దయసేయు మనుటయు నతనిఁ జూచి | యద్భుతంబొంది యాచార్యుఁ డనియె నపుడు


ఉ.

ఓనరనాథ! భూరిసుగుణోన్నత! నీ విపు డాత్మలోపలం
బూనినకార్య మాపవనభుగ్వరకంకణుఁడైన నిష్ఠతోఁ
దా నొనరింపఁజాలఁ డట ధారుణిలో జను లెట్టు నేర్తు ర
ట్లైన ప్రయోజనంబునకు నర్హమె నీ కిటు లూహ సేయుటల్.


ఉ.

ఇప్పటి భక్తిమార్గము నరేశ్వర! చిత్తమునందు నెప్పుడుం
దప్పక నిల్పఁజాలుదువె? తద్విధ మెంతయు దుర్లభంబు నీ
కెప్పగిదిం బొసంగు? వసుధేశ్వరు లెక్కడ? చెప్పఁ చోద్యమై
యొప్పువ్రతంబు లెక్కడ? మనోభవరూప! యెఱుంగఁబల్కుమా.


క.

ఇచ్చెద రనుచోటికిం గడు | వచ్చెద రార్యులు చెలంగి వారికిఁ గృపతో
నిచ్చల్ గలుగుపదార్ధము | లొచ్చెం బించుకయు లేక యొసఁగన్ వలయున్.


ఉ.

ఆరయఁ బుత్రినైన పతినైన దనూభవునైనఁ గాంచనా
గారములైనఁ జెల్వమగు కాయ మొకించుకఁ గోసియైన యా
ధారుణినైన నిట్టిశపథం బొనంరించినచోట వేటుగాఁ
గోరిక యెంత లేదనక గొబ్బున నీవలయున్ బుధాళికిన్.


చ.

ఘను లరుదెంచి యీఁదరము గానిపదార్థము లానతోడఁ గో
రినయెడ నీయఁజాలక ధరిత్రిపము న్నగుబాటుఁ జెందు కం

టెను విను భూవరా! మునుపటింబలె నూరకరతోమం
చినదియే మేలుసుక్యుశాఖరు నెమ్మదిగా జంకేయుచుఁ".


క.

అదియును గా కొకయెడ గుఱి | వదలి వెసన్ శిష్యువరుఁడు వ్రతభంగముచేఁ
బొదవినయప్పు డొకించుకఁ | గొదవంటుఁజుమీ! తలంప గురునాథునకున్.


ఉ.

నావుడు రాజశేఖరుఁడు నవ్వలరన్ గురుఁ జూచి పల్కె నో
దేవ! భవత్ప్రసాదమున ధీరత మీఱఁగఁ దద్ర్వతంబు పృ
థ్వీవరు లెల్ల నెన్నఁగను వేడ్క నొనర్చెద సంశయంబు మీ
భావమునందు నిల్పక కృపామతి నానతియీవె శీఘ్రతన్.


మ.

అరవిందోదరతుల్యపుణ్యయుతకార్యారంభసంరంభవి
స్ఫురితాకీర్ణదృఢాంతరంగ మితరంబుల్ గోరుటల్ నేర్చునే?
చిరగీర్వాణతరంగిణీవిమలవీచీజాలలీలానిరం
తరసంతోషితరాజహంస మిరవొందం జేరునే వాగులన్.


వ.

అదియునుం గాక.


సీ.

సతి నమ్ము మును హరిశ్చంద్రభూనాథుండు సత్యంబు నిలుపఁడే జగమెఱుంగఁ?
దనతండ్రియానతిం దప్పక హర్షించి రాజ్యంబు వదలఁడే రాఘవుండు?
శిబిచక్రవర్తి వాసిగఁ దొల్లి డేగకుఁ గొనకొని దేహంబుఁ గోసియీఁడె?
ఘనత మీఱఁ బరోపకారార్ధము దధీచి తా నస్థు లొసఁగఁడే తనువు విడిచి?
వారలెల్లను బృథ్వి యున్నారె యిపుడు? | సలలితంబగు ప్రఖ్యాతి వెలసెఁగాక
వినుము గురునాథ! యిఁకఁ బెక్కు లనఁగ నెందు | కటులసత్కీర్తి నిలిపెద నవనియందు.


చ.

జలనిధు లింకినన్ ధరణిఁజంద్రుడు గ్రుంకిన వేధ జంకినన్
జలజలమంచుఁ జుక్కలు కృశయయి డుల్లిన భూమి గ్రుంగినం
గులగిరురెల్లం బెల్లగిలి కూలిన దిక్కరులోలి మ్రొగ్గినం
బొలుపుగ నీవ్రతంబు పరిపూర్తి యొనర్తు శివుండు మెచ్చఁగన్.


వ.

మహాత్మా! మీయనుగ్రహంబువలన మన్మానసంబు సంతోషించుచున్నదనియది మీ రిందుల
కు సంశయింపక శీఘ్రం బానతీయవలయునని ప్రార్థించిన.


గీ.

ఇన్నివిధముల నీమది నెన్ని చూచి | గట్టిగా గురి నిలుపగలట్టులైన
భూమిపాలక మాచేతిభూతి యంది | భూతనాథుని మెప్పింపు ఖ్యాతిమీఱ.


క.

కరుణారసపూరితహృ | త్వరవిజుఁడై యపుడు గురుఁడు జనపతినొసటన్
సరగున భూతి యొకించుక | తిరముగ నిడి యాజ్ఞ నొసఁగ దినకరకులుఁడున్.

క.

శరణార్థి యగుచు శిరమున | గురుపదతీర్థంబుఁ జల్లుకొని సద్భక్తిం
బరివర్ణించుచు నొయ్యన | మరలెం బురి కధికసంభ్రమం బలరారన్.


ఉ.

అంతఁ గొఱంతలేక జలమంతయుఁ జెంత ననంతవాజులన్
దంతుల నెక్కి యెంతయు నితాంతజవంబున నంతకంతకుం
బంతము మీర వింతలుగ బంతులు సాగి యొకంతరాఁగ భూ
కాంతుఁడు సొచ్చె నప్పురము కాంతలు సేసల జల్లుచుండఁగన్.


చ.

అలికులవేణు లెల్ల మణిహర్మ్యతలంబుల నిల్చి చెల్వుగాఁ
గలువలు నాణిముత్తెములు గాఢముగాఁ బయింజల్ల నప్పు డ
జ్జలజహితాన్వయుం డలరెఁ జారుతరంబుగఁ దారకాగణం
బులు బలుదిక్కులం గొలువఁ బొల్పగుచల్లనిచంద్రుఁడో యనన్.


గీ.

రమణఁ దళుకొత్త మేదినీరమణునకును | బసిఁడిపళ్ళెరములను దీపముల నుంచి
రమణు లతనునికంఠహారమణు లనఁగ | నిచ్చ నలరుచు నారతు లిచ్చి రపుడు.


గీ.

ఇందుకాంతావళులభావమెల్లఁ గఱఁగ | రా జుదయఁబర్వతమునుఁ జేరంగనెఱిఁగి
యిందుఁ గాంతావళులభావమెల్లఁ గరఁగ | రాజుదయఁబర్వతమునుఁ జేరంగ నెఱిగి.


వ.

ఈచందంబునఁ బౌరసుందరీసందోహం బందంబగు నానందంబు డెందంబులం
గ్రందుకొన నందందపయిం దొఱంగించెడు కుందాది సుముబృందంయుల గంధం
బు లుపొందుగా హృదయారవిందంబులకు విందొనర్ప వందిమాగధులు ముందర సం
దడిగొని వినుతింప దివ్యదుందుభినాదంబులు చెలంగఁ గందర్పసుందరుండగు న
వ్వసుంధరాపురందరుండు మందహాసం బొదవ నిజమందిరంబు బ్రవేశించి తనయిం
దుముఖలుం దానును సుఖంబున వసించినంత.


మ.

సరసీజోద్భవరుక్మకారకుఁడు ఘనస్త్రీమణిం బ్రేమతోఁ
గరమింపొంద నలంకరించుటకు వేగం గాఁచి తా నీటిలో
బరగన్ ముంచినయట్టిమేల్మియగు బల్బంగారపుంబూదెయ
న్కరణిన్ భానుఁడు పశ్చిమాంబునిధి జక్కం గ్రుంకె నొక్కుమ్మడిన్.


గీ.

రాజు కువలయ మలరింప రాఁదలంచు | టెంచి సమయాధికారి గట్టించినట్టి
భవ్యకల్హారతోరణపంఙ్తి యనఁగ | సాంధ్యరాగము విలసిల్లె సాంద్రముగను.


మ.

గురుపత్నిన్ వరియించుద్రోహి తనుఁ గన్గోరాదటంచున్ సుధా
కరురాకల్ మది నెంచి పద్మిని సువక్త్రంబుం గడున్వంచె న
ట్లరయం బుణ్యవధూమణుల్ ధరణి నత్యంతోగ్రదోషాత్మునిన్.

సరవి న్గన్గొననొల్లకుందురుగదా చర్చింప నెంతేనియున్.


సీ.

విటులపై మదనుండు వెడలుచో దిక్కులఁ గ్రమ్ము పికాళిసంఘ మ్మనంగ
మిగులనిశాకాంతమేల్మునుం గిడుకొన్న లాలితనీలచేలం బనంగఁ
బద్మబాంధవునితోఁ బాసి వర్తించువాసరలక్ష్మి ఘనదుర్యశఁ బనంగ
నజుఁడు విష్ణుపదంబు నమరఁ బూజించినఁ బరగునిందీవరప్రతతి యనఁగ
నవనిఁ దము నెందుఁ జొరనీక దవిలెనంచుఁ | దపనుఁ డపరాబ్ధిఁ బడె నింకఁ దాగనేల
ననుచు గిరిగుహలందుండి యొనరవెడలు | కలుషరతి యనఁ బర్వె దిక్కులఁ దమంబు.


గీ.

పేర్మి రేఱేఁడు కుముదినిఁ బెండ్లియాఁడ | రమణఁ బఱతెంచునని తిమిరమణి చదలు
మంగలంబున వేచిన మంగళార్థ | లాజలవరుసఁ దార లల్లనఁ జలంగె.


గీ.

దృఢతమోభూతబాధితదిగ్వధూటిఁ | బ్రోవఁ దత్కాలఘునయోగి పూన్కిఁ దెచ్చి
నట్టిబల్దివ్విటీయన నబ్జవైరి యురుతరశ్రీలఁ దా నంత నుదయమయ్యె.


సీ.

అజుఁడు చకోరామరావనార్ధము నిల్పఁ గొమరారు నమృతంపుఁగుండ యనఁగఁ
బతిరాకకును నిశాసతి హారతింబట్టు బాగైన రజితంపుఁబాత్ర యనఁగ
ఘనసాంధహృత్పద్మవనములు గలఁచంగఁ దవిలియేతెంచు చౌదంతి యనఁగఁ
దొగకన్నె ముదమంది నగుగాక యనుచుఁ బ్రాఙ్నగము చూపెడు దర్పణం బనంగ
విశదకాంతుల నంతంత వృద్ధి పొంది | శీతకరబింబ మింపొందఁ జెలఁగి దిశల
సాంద్రతరముగఁ జంద్రికాసమితి దనరెఁ | గోరికల మీఱి కేరంజకోరకములు.


వ.

అయ్యెడ.


సీ.

పట్టైనసిగల పైఁబట్టుబొందులు జుట్టి వలిపెగుడ్డలఁబొంక మలరఁగట్టి
సొగసుగా నుదుటఁ గస్తూరిరేఖలు దీర్చి కడఁగి ముత్యాలచౌకట్లు గట్టి
కరములఁ బచ్చలకడియంబు లొగిఁ దాల్చి కంఠమాలికలు చొక్కమున నించి
చలువదుప్పటులు పైవలెవాటుఁ గావించి కర మొప్పు జందనగంధ మలఁది
మల్లెపూదండ లింపు శోభిల్లఁబూని | పండుటాకులు కపురంపుబాగ లూని
పరగఁ జేపట్టి యొయ్యారిభామ లెసఁగ | లిటులు విహరింపసాగి రవ్వేళయందు.


చ.

చెలువగుపెన్నెరుల్ దళుకుఁజెక్కులు నిద్దపుముద్దుమోములుం
గులుకుమిటారిచన్గవలు గొప్పపిరుందులు వాలుఁజూపులు
న్గిలకిలనవ్వులున్ మిగులనేటగు గాటపుసూటిమాటలుం
గలిగి విటావళిం దిరముగా వలపింతురు వేడ్క లత్తఱిన్.


చ.

చిలుకలతేఱును న్జెఱుకుసింగిణివిల్లును దేఁటినారియున్

బలుజిగురాకువాలును వనప్రియసైన్యము పువ్వుదూపులున్
జెలఁగెడు మీనుటెక్కెమునుఁ జెన్నొదవ న్వెడలెన్ విటాళిపై
మలయమరుద్వసంతఘనమంత్రులఁ గూడి రతీశుఁ డయ్యెడన్.


క.

పుండ్రేక్షుచాపమునఁ గడు | వేండ్రపుపూటమ్ముఁ దొడిగి విరహిజనులఁ బె
క్కండ్ర నపు డేసి మన్మథుఁ | డెండ్రాయని యొరుఁడు దన్ను నెదురుటలేమిన్.


చ.

బలములబాజుఁ దీర్చి నిజబాణపరంపర లెల్ల సేర్చి, దో
ర్బల మరుదాఱఁ బేర్చి, కడుబాగుగ శింగిణిఁ జేర్చి, లీలతోఁ
బలుమఱు నేసి యార్చి, వరబంభరవేణులఁ దార్చి, నాథులం
గలయఁగఁ గూర్చె నోర్చి యలకాయజువైఖరి నేర్తురే! యొరుల్.


ఉ.

కొమ్మ లనంగ నొప్పు పువుఁగొమ్మలఁ జేరి వినూత్నదివ్యగం
ధమ్ములఁ గేరిమోవి నమితమ్మగు తేనియఁ గ్రోలి సోలి యా
ముమ్మరమైన కోడిచనుమొగ్గలమీదను వ్రాలి చాలసౌ
ఖమ్ములఁ దేలె లీలఁ బురుషావళియన్ మధుపంబు లయ్యెడన్.


గీ.

అంతం గడఁక నంతకాంతకుఁ డంగజుఁ | డరయఁ దనదుభక్తివరునిపురము
జనుల నేచుటెఱిఁగి సరగ వేగనుచు కై | వడిని వేగుచుక్క వొడమె దివిని.


లయగ్రాహి.

కుక్కుటము లెంతయునుఁ బెక్కులగుదిక్కులను నిక్కి మదమెక్కి భువి పిక్కటిల మ్రోసెన్
జుక్కలును సోముఁడునుఁ గ్రక్కునఁ బొలంగి రలజక్కవలు గేరె మరుఁ డుక్కుచెడి పాఱెన్
జక్కఁగ విహంగములు జిక్కువడియున్న తమఱఎక్క లలరించుకొని చొక్కముగఁ బల్కెన్
గ్రిక్కిఱిసి తేటిగము లక్కమలరాజిపయిఁ బొక్కుచుఁ జరించెఁ దొగ ఱక్కట మునింగెన్.


చ.

అతులతరార్చులెల్ల నలరారఁగ నెంతయుఁ గ్రోధచిత్తుఁడై
నతజనఘోరకిల్బిషవనంబులఁ గాల్పఁగ నాత్మ నెంచి శీ
ఘ్రత నరుదెంచినట్టి యలగంధవహాప్తుఁడొ యన్విధంబునన్
ధృతి నుదయింటె జంభరిపుదిగ్గిరి నైప...దశ్వుఁ డంతటన్.


క.

పురజను లపుడు కడున | బ్బురపుగోరిక లనంతపురములలోఁ గ
ప్పురపుంధూమము లిడి గో | పురములపైఁ గనకకుంభములు నిల్పి తగన్.


సీ.

తీరుగా నాణిముత్తియపుంబందిళు లినకలువలు నించి మేల్కట్టుు గట్టి
గోడల న్వెరంగు గంజికలుపు వాగి వీడలు దేవతానీకప్రబలును

వింతగా నలరించి వృషభకేతనముల గములయందెల్లఁ బ్రేమ నునిచి
వీథులు జక్కఁగావించి చందనమునుఁ గస్తూరియును గూడఁ గలిపి చల్లి
యఖిలజనములు పురినెల్ల నమరఁజేసి | రప్పటికిమున్నె యొప్పులకుప్పలయిన
తనవధూరత్నములుఁ దాను ధరణివిభుఁడు | వేగ మేల్కాంచి తత్కాలవిధులఁ దీర్చి.


ఉ.

తానములాఁడి నీమమున ధౌతపటంబులు గట్టి యంత సం
స్థానమునందు భర్మమణిసంఘటితంబగు వేదిమీదటన్
రామకులాగ్రగణ్యుఁడగు పార్థివశేఖరుఁ డాత్మలోన నిం
పూనినవేడ్కతోడ శివపూజ నొనర్పఁగసాగె నుబ్బుచున్.


సీ.

ఆవాహనంబు వృషాధిపబాహున కాసనం బమలసింహాసనునకు
నర్ఘ్యం బనేకలోకాధారమూర్తికిఁ బాద్యంబు గుణసంపాద్యునకును
పదభక్తి నాచమనీయ మీశ్వరునకు స్నానంబు వేడ్కతో స్థాణునకును
వస్త్రం బశేషనిర్వాణసన్నతునకు బ్రహ్మసూత్రము పరబ్రహ్మమునకు
గంధ మిభదైత్యదాననిర్గంధునకును | బుష్ప మశ్రాంతమున జనపోషణునకు
ధూప మానసకాంతినిధూపమునకు | దీప ముష్ణాంశుకోవిప్రదీపునకును.

. జాజూమపారుద

4: ఆ: - - - - - - ధీ యుక్త సిరాజనం - - . --- .. జర ద్రారా" లి'్ఫర 1 1 1 1 1 ముహ-20ల్పంచుచు, - - - - - - - 1/4 కప్పుకుని కూకవకు సాంకము ;C ఎమె న న ల - జే దుఃతకోట సకృతు విధపుషముల + : . : . . . . గుగులు స్తూ కాదిక కల! Tv in ' .... . నా ఆడువు లనెడు బొమ్మ కుల

. - జన పుష్పములను ' నామము రామున
- 7 :: reacts | - నివర్యుడిన్చసి వ శంభుపూలు.

- - న వాక్య శత్రాద కు ఫొనండంబుల నంబి కారణం నా రాధించి - -- : మన వాస ! శిరదిందుసి ఫహాస! శుశకం ! - 1 కి స ప ! సనకాదిక కరూ: : 11.3.1 at !

వరయోగిజనలోల! దురితాభ్రవారూల! సురరాజవరపాల! శరణుశరణు!
రణరంగరిపుభంగ! రమణీయధవళాంగ! చతురాగముతురంగ! శరణు శరణు!
సలలితాంభోధితూణీర! శరణు శరణు! | శాశ్వతైశ్వర్యసంయుక్త! శరణుశరణు!
సౌధులోకసురోర్వీజ! శరణుశరణు! | శరణు! విశ్వేశ! భూతేశ! శరణుశరణు!


పొంకంబుగల మంచిజింక నంకంబుగాఁ గొంకక ప్రేమతోఁ జంక నిఱికి
దిట్టతనంబుతో గట్టిగా సామేన గట్టులదొర ముద్దుపట్టి నునిచి
వింతఁగాని కనుఁబూబంత గా జాబిల్లి నెంతయు సంతసం బెనఁగ నిలిపి
మేలైనయేనికతోలు శాలుగఁ బూన లీలతో ముమ్మొనవాలుఁ దాల్చి
పొసఁగ భసితంబుఁ బూసి యాఁబోతు నెక్కి | గాలిమేతరిసొమ్ములఁ గడు ధరించి
లచ్చిమగఁడును నలువయు మెచ్చి పొగడ | జగము లేలెడునినుఁ గొల్తు నిగమవినుత.


శా.

నీరజోద్భవముఖ్యులౌ సురమునుల్ ని న్బ్రస్తుతుల్ సేయఁగాఁ
దారొక్కింతయు నేరరంచును బుధులే తథ్యంబుగాఁ బల్కుచో
నో రాజార్ధకెరీట! మర్త్యుఁ డిఁక నెట్లోపున్ బ్రశంసింపగా
గౌరీమానసపద్మషట్చరణ! శ్రీకంఠా! జగద్రక్షకా.


గీ.

శివశివా యని సన్నుతి సేయనేర | వినయ మొప్పారఁ బూజఁ గావింపనేర
మూఢుఁడను నన్ను గృపఁజూడు ముదముతోడఁ | బార్వతీలోల సంతతభక్తపాల.


క.

జయజయ పురదైత్యాంతక | జయజయ శృంగారలీల నదమలశీలా
జయజయ నాకాధిపనుత | జయజయ లోకాధినాథ జయ పరమేశా.


వ.

ఇ ట్లనేకప్రకారంబులఁ బ్రస్తుతించి తదనంతరంబ.


క.

తరుణారుణాంశనిభభా | సురనవరత్నచయఖచితశోభితదివ్యా
భరణోజ్వలాంగుఁడయి స | త్వరతరచిత్రాంబరములు ధరియించె వెసన్.


గీ.

అరయ రుద్రాక్షమాలిక లఱుత మెఱయ | ఫాలమున భూతిరేఖయు శ్రీలఁ దనరఁ
బసిఁడిపావలు దొడిగి వైభవము చెలఁగఁ | గప్రపువిడెంబు సేయుచుఁ గౌతుకమున.


సీ.

దివి పిక్కటిలఁ బెక్కుతెఱఁగుల నెడలేక భేరీమృదంగముల్ భోరు చెలఁగ
గంతునిచేతి చేమంతిబంతు లనంగ వంతుకెక్కిన కళావంతు లాడ
తుంబురునారదాదులఁ దిరస్కృతి సేయు గాయకుల్ గీతముల్ కడఁగిపాడ
వందిమాగధులు చెల్వంది ప్రస్తుతి సేయఁ జేరి భూదేవు లాశీర్వదింప
రమణఁ బరిచారికలు ముందఱను బిరుందఁ | బసిఁడిబెత్తులనెఁ బరాగతు లొనర్ప

రాజసంబున నంతఃపురంబు వెడలి | ఘనత నుర్వీశుఁ డాస్థానమునకుఁ జనియె.


సీ.

చాలుచాలునఁ జాలు నీలంపుఁ బగడంపుఁ గంబము ల్మితిలేని కాంతిఁ దనర
గారుత్మతపుమణు ల్గదియించినట్టి మేల్మేడగోడలు సొంపు మీఱి యలర
నిందుకాంతముల బొల్పొంద నొనర్చినసోపానములు వింతశోభ లెసఁగ
వెలలేనివజ్రంపువేదిక ల్చెలువాఱ గోమేధికపుగవాక్షులు చెలంగ
నతులవైడూర్యపుష్యరాగాదినీల | రత్నవస్తువు లెంతయు రమణ మెఱయఁ
గ్రొత్తముత్తెఁపుబెత్తులు గొమఱు మిగులు | కొలువుకూటంబునందునఁ గూర్మితోడ.


క.

కురుమగధచోళమాధవ | కరహాటమరాటలాటకర్నాటకఘూ
ర్జరయవనముఖ్యధరణీ | వరులెల్లం గొలువ భూరివైభవలీలన్.


సీ.

వేదశాస్త్రపురాణవివిధరహస్యము ల్వరునతోఁ గవిబుధావళులు దెలుప
సంగీతనృత్తారాదిసరసవిద్యాప్రౌఢి కడువేడ్క నర్థిసంఘములు నెఱప
శైనవైష్ణవజైనచార్వాకబౌద్ధశాక్తేయులు తన్మతక్రియలు సెప్ప
కరవాలశూలతోమరభిెండివాలాదిశస్త్రసాధకులు ప్రసిద్ధిఁ జూప
రమణు లిరుఁగడ వింజామరములు వీవఁ | గడఁగి డెబ్బదిరెండగుఘననియోగ
ములఁ దవిలి రత్నపీఠాగ్రమునఁ జెలువుగఁ | గొలువుఁ గూర్చుండె మేదినీతలవిభుండు.


క.

అతులితవిభవంబున నీ | గతిఁ గొల్వున నుండి యచటఁ గలజనములకుం
గుతుకం బొప్పఁగ ధరణీ | పతి దా నపుఁ డిట్టులనుచుఁ బలికెం బ్రేమన్.


చ.

వినుఁ డిది యాది గాఁగఁ బృథివిమగల జంగమకోట్లకెల్నుం
గొనకొని నప్పదార్థముఁలఁ గోరినయంతనె పూన్కితోడ లే
దన కరయంబు మీఱ ననయంబును నిత్తణ వృషాధిరాజవా
హనునకుఁ బ్రీతి గాఁగ జగమంతయు మెచ్చఁగ నుత్సవంబునన్.


గీ.

ప్రజలకెల్లఁ దెలియఁ బ్రతిన గావించెద | నడుగకున్నవారి కరయ నొట్టు
జేరి యానతోడఁ గోరినవారల | కీయలేనివాని కిదియె యొట్టు.


క.

అని పలికి సకలదిశలం | బనివడి చాటింపంబనిచి బాగుగ మొగసా
లను గంట వ్రేలఁగట్టిం | చెను జనములకెల్లఁ గడువిచిత్రము మీఱన్.


వ.

పట్లు శపథంబు గావించి దిశలం జాటించిన దద్వృత్తాంతం బంతయు విని క్రమంబున.


సీ.

కక్షపాలరు పైడికట్లబెత్తంబుల శంఖసంఖ్యల మించు శంఖములును

బిడిగంటలును గేకిపింఛంపుఁగుంచెలు ఛత్రముల్ బులితోళ్ళచామరములు
యోగదండంబులు యోగపట్టెడలును గండపెండేరము ల్కుండలములు
తనువుల భూతిపూతలు కావివస్త్రముల ల్మేలైనరుద్రాక్షమాలికలును
శ్వేతకేతనములు రుద్రవీణియలును | బాత్రమగునట్టిరజతంపుఁబాత్రికలును
గేలు దామరఁ బలువైనశూలములును | మొలకబంగరుగిలుకుపావలును గలిగి.


సీ.

అతులితవిమలపంచాక్షరీమంత్రంబు మించి కోరిక బఠియించువారు
తరుచుగా శైవకథారహస్యార్థము ల్నెఱిశిష్యవరుల కేర్పఱచువారు
సారేసారెకు "నమశ్శర్వాయ రుద్రాయ పశుపతయే” యనిపల్కువారు
నడుగడ్గునకుఁ గాహళాదిరవంబులు చెలఁగించుచును వేడ్క నలరువారు
చిత్రగతులను గానంబుఁజేయువారు | సరవితో గద్యపద్యము ల్జదువువారు
నగుచుఁ గోటానకో ట్లొకమొగిని నడువ | సాగిరా నేలయీనినచందమునను.


సీ.

మల్లయ్య వీరయ్య మఱివిరూపాక్షయ్య జడముడిబసవయ్య శంకరయ్య
పిడిఘంటచిక్కయ్య భీమయ్య సోమయ్య శివ్వయ్య హరిణాంకశేఖరయ్య
మరులయ్య సంగయ్య మార్కొండలింగయ్య పర్వతనాథయ్య పశుపతయ్య
శరభయ్య రుద్రయ్య కరపాత్రసిధ్ధయ్య శితికంఠయోగయ్య శ్రీగిరయ్య


గీ.

విశ్వనాధయ్య వీరమాహేశ్వరయ్య | యాదిగాఁ బేరుగల్గి మహాత్ములయిన
జంగమస్వాము లారాజసముఖమునకు | సరగఁ జనుదెంచి రత్యంతసంభ్రమమున.


వ.

ఇవ్విధంబునఁ బఱతెంచి నృపాలుం గాంచి.


శా.

ఏరా! భూవర! మాకుఁ గాంచనతురంగేభాంబరాందోళికా
భూరిస్యందనమందిరోపవనసద్భూషామణిశ్రేణులున్
జేరం గావునఁ బల్లెలున్ బళువులున్ లెక్కింప కర్థంబు మా
కీరా! కోరికఁ దీర మీఱకిఁక నీ వెంతేనియున్ ధీరతన్.


క.

పాలుపెరుగేక్షురనమునుఁ | జాలఫలరసములు దేనె శర్కరఘృతమున్
మేలగుకజ్జంబులు నీ | వేళకుఁ దెప్పించరోరి వేగమె మాకున్.


మ.

అనుచుఁ గోరినజంగమయ్యలకు నత్యానందచేతస్కుఁడై
మనుజాధీశ్వరుఁ డర్ఘ్యపాద్యవిధులన్ మన్నించుచుం గాంచనా
సనము ల్వెట్జి బహుప్రకారములఁ బూజల్చేసి యశ్రాంతమున్
ధనధాన్యాంబరముఖ్యవస్తువులచేత న్బ్రీతిఁ గావించుచున్.

క.

అడిగినవస్తు వొకింతయుఁ | దడయక యాక్షణమునందె తాత్పర్యముతోఁ
గడువడి నొసఁగుచు భూపతి | పుడమిన్ బ్రతివాసరంబు బ్రోది యొనర్పన్.


క.

జంగంబులెల్ల నచట భు | జంగమరాజాంగదుని వెసం గొల్చుచునో
జంగములై వసియించిరి | బంగరపుమఠంబులందు భాసురలీలన్.


వ.

ఈక్రమంబున నద్ధరాధీశుం డతులితధర్మమార్గప్రచారుండై ప్రతిదినజంగమారాధ
న చేయుచుండె నని సూతుం డెఱింగించిన నైమిశారణ్య మహామును లఁటమీదికథా
వృత్తాంతం బెట్లని యడుగుటయును.


ఉ.

హారతుషారహీరశరదభ్రనిశాకరతారకాబ్జడిం
డీరమరాళపారదపటీరవియత్తటినీసితాభ్రమం
దారసురేంద్రనాగకలధౌతసుధారసనన్నిభోజ్వలా
కారలసద్విహారసుమకాండవిదార యుదారశంకరా.


స్రగ్విణి.

చారుకారుణ్యవిస్తారతారేశకో | టీరదైత్యేభకంఠీరవేంద్రాదిబృం
దారకానీకమందారసత్యవ్రతా | చారగోరాజసంచార గౌరీశ్వరా.


తురగవల్గనము.

ధరణిధరవరశరణచిరశుభదాయకా హరిసాయకా
తరణిశశిశుచిశయనదురితవిదారణాలయకారణా
పరమపురుష హరిహయవినుత పురభంజనా మునిరంజనా
హర గరళగళ మదదనుజభయంకరా జయశంకరా.

గద్య.
ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర ఘన
యశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర
బుధజనవిధేయ తిమ్మయనామధేయప్రణీతంబైన రాజశేఖరవిలా
సంబను కావ్యంబునందుఁ బ్రథమాశ్వాసము.