రాజవాహనవిజయము/పీఠిక
రాజవాహనవిజయము
పీఠిక
ఇది 5 ఆశ్వాసముల ప్రబంధము. కాకమాని మూర్తికవి ప్రణీతము. ఈతడు బ్రాహ్మణుడు. ఇంటిపేరు పెన్నేకులవారు. తండ్రి రామలింగభట్టు. తల్లి తిమ్మమాంబిక. ముత్తాత రామపండితుడు. తాత ప్రబోధపండితుడు. ఆపస్తంబసూత్రుడు. ఉభయభాషావిద్వత్కవీంద్రుడు. కవి పట్టభద్రుడు.
ఈతడు సంకుసాల నృసింహకవివలె
శా. వ్యాళస్వాంతు లశాంతు లజ్ఞ సతతైకాంతుల్ మహాచేటికా
శ్రీలోపద్రవ నవ్యపత్రికులు భూరిప్రాజ్ఞవిజ్ఞాపనా
వేళాకల్పితరక్తవక్త్రులు కళావిజ్ఞాననిర్భాగ్యు లీ
కాళక్ష్మాతలనేతలం బొగడుటల్ కష్టంబు లర్థార్థికిన్.
అని ఆనాటి రాజులను గూర్చిన తన యభిప్రాయమును వెల్లడించుచు 'నదైవం కేశవాత్పరమ్మ'ని తనకృతులలో పాంచాలీపరిణయమును శ్రీరంగపతికిని, రాజవాహనవిజయమును శ్రీ వేంకటాచలపతికిని గృతి యొసంగెను. ఈతడు రచించిన బహుళాశ్వచరిత్రములోని లక్ష్యములుగా జూపబడిన పద్యములు తక్క, సమగ్రగ్రంథ మెచ్చటను లభింపలేదు.
కవికాలము
సాధారణముగా కవికాలమును నిర్ణయించుటకు కవిస్తుతియు, గద్యలు, నరాంకిత మొనర్చియుండిన యెడల నాకృతిపతి వంశకథనమును జాలవఱ కుపచరించెడివి. ఈతడు సంస్కృతకవులను, కవిత్రయమునే పేర్కొనియెను గాని, తననాటి కవులను పేర్కొశక తన తాత ముత్తాతలను పేర్కొనెను.
పంచమాశ్వాసము నందలి,
సీ. అఖిలసీమామూలమై దుర్గమ్ము లు
మ్మకలు గల కమ్మ వెలమదొరలు
చేతి కైదేసివేల్ శివరాయల వరాల
నెల కట్టడల పటాణీ ల్గరీబు
లూళ్ళాయములమీద హొరపుత్తరవు గన్న
రాయకై జీతంపు రాయవారు
పగటిగ్రాసంబు దప్పకయుండ దినరోజు
మాదిరి నొంటిరు జోదుమూక
గీ. మొదలుగా గల బారలు మొనకు నిల్చి
పొడిచి పేర్వాడి వీథు లేర్పడగ జేసి
గాసి గావించి యరుల జేనాసి యెదుట
జూపి నిలఱేడు మూడు మెచ్చులున మెచ్చ.
అను పద్య మందలి "శివరాయల వరాల"నుటచేత శివదేవరాయలనాటివాడు గాని, తరువాతివాడనిగాని నిశ్చయించుట కాధార మీగ్రంథమందే లభించినది.
అచ్యుతదేవరాయల కుమారుడు మరణించిన తరువాత రంగారాయల కొడుకు సదాశివరాయలు రాజ్యమునకు వచ్చెను. సదాశివదేవరాయల బావమరిది యకు రామరా జతని కమాత్యుఁడై యుండెను. తాళికోట యుద్ధములో 1565 లో రామరాజు మరణించెను. సేనాని వెంకటాద్రియు మడసెను. ఇక మిగిలినది నేనాని తిరుమలరావు ఒక్కడే. అతడు 150 కోట్ల రూపాయిలు, నవరత్నాభరణములు మొదలగు బహుధనముతో సదాశివరాయలను తోడ్కొని అనంతపురము వద్దనున్న పెనుకొండ దుర్గమునకు పారిపోయెను.
1568 వ సం॥మున సదాశివరాయలను చంపి తిరుమలరాయుడే రాజ్య మేలెను. కానీ అక్కడ నిలువలేక చంద్రగిరికి వచ్చి చేరెను.
ఈ కవి 1568 సం॥ తరువాత సదాశివదేవరాయల వరాలు ప్రచారములో నుండుకాలమున జీవించియుండెనని నిర్ధారణ చేయవచ్చును.
గీ॥ అల్లసానివాని యల్లిక బిగిసోంపు ముక్కు తిమ్మనార్యు ముద్దుపలకు పాండురంగ విభుని పద్యం హరువును కాకమానిరాయ నీకెకలదు.
అని తనను గూర్చి శ్రీరంగనాధుడు పల్కినట్టు లీకని తన పొంచాలి పరిణయములో జెప్పుకొనెను. అల్లసాని పెద్దన్న 1535 వఱకును, ముక్కు తిమ్మన్న 1526 ఇఱకును. పాండురంగ మహాత్మ్యమును రచించిన రామకృష్ణుడు గూడ కృష్ణదేవరాయల యవసాన కాలము నాటికి చిన్న వాడైయుండి యుండవచ్చును.
ఈతని కవిశ్వమును గూర్చి పై ముగ్గురి కవిత్వములోని గుణము లున్నదనుటచేత నీ కవియం, వారి తరువాత 1570-80 ప్రాంతముల యందే యున్న వాడని యూహించవచ్చును.
కాకమానీ మహా గ్రామాబ్జ మిత్రుడని చెప్పుట చేతను, పరస విద్వత్కవి సార్వభౌముడని చెప్పుకొనుటచేతను, నీకవియా యూరిలో గౌరవ జీవనముగల ప్రసిద్ధుడై యుండును. శివదేవరాయల యనంతరము విద్వత్కవి పోషకులగు రాజుల స్తమించుటచేతను, అర్హులగు కృతినాధులు లేని కారణమునను, నరకృతి యందిష్టములేక పోవుటచేతను గూడ నీతడు తన కృతులను నరాంకికము గావించి యుండడు,
కథా సంగ్రహము. (ప్రథమాశ్వాసము.)
కథా సంగ్రహమును విశదీకరించిన పిమ్మట కభేతి వృత్తమును విమర్శించుట సమంజసము గదా !
మగధదేశమున కుసుమపురము గలదు. అది శత్రుదుర్నిరీక్ష మై లక్ష్మీవంతమై రత్న ప్రభలచే చీకటిలేనిదిగా తనరారు చుండెను.
అచటి బ్రాహ్మణులు నలుమొగముల బ్రహ్మవలె దిక్కులు జూడక నేరముఖముగా వేదపాఠమును జదువుదురు. రాజులు భారవుని తమ కొలువునకు రప్పింపగల సమర్థులు. వైశ్యులు విత్యైశ్వర్య కుబేర విజయులు. శూద్రులు బలరామునిత్రోసి రాజని కొంకులో సైకిము దుక్కి చాన్ని పగల దక్షుడా.
మధురాధరా రణ్యమునను, వేణికా మైచక్యమునను, భుజా లతా ఐలధనముచేతను, కవి జకహారి భావములచేతను, పల్లవశ్రేణి కుంప దల హరించు 'వేళ్యాకాంత లా పట్టణమున కలంకారముగా నుందుకు.
ఆ పట్టణమున తాతుమనం బెఱింగి జలరాశి చివుక్కున దాటు. శశ్వములును, చటుల బృంహిత ఫిరితాళా గజములగు కరటి ఘటలును చెల రేగు చుండును.
ఆట్టి కుసుమపురమును ప్రతాపాటోపహత కోహ్వత భూయి త ధైన్య కౌర్య పుట భేదముండకు రాజహంసుడుపరి పాలించు చుండు ను. అతని దేవేరి వినుమతీ సుగుణవతి. ఆ యార్యగృహిణి తసూజాత జాతికంబున కెదురుచూచుచు క్రీడాగారంున శయనింప నాతలోదరికి కలలో శ్రీవత్సము, శంఖచకములు, గద, స్వర్ణ చేల ధరించిన శ్రీకృష్ణు ఈ సాక్షాత్కరించి, సంతానంకంబొసంగి తిరోహితు డాయెను.
దేవేరి నిద్రలేచి మురారిహృదయ గతోభ్యత్సంతో బొమ్ప కళికా కాంత నిరంకరిత పులకగండ యణగళయై, ముద్దుకృష్ణుని దివ్యసంద ర్శనమునవిజేపీ కళాని కార్యము నొందిన మోముదమ్మితో భర్తను మేలు కొలిపి యిట్లనియెనూ
(ద్వితీయాశ్వాసము)
ఆర్యపుత్తా ! యశోదా కీశోకము నాకు కలలో ప్రత్యేక్షమై సంతాన ఫలమొసంగౌనని తెలంగావిని యావసుధేశుఁడు లేని భార్య దేహృడము దాల్చునని ప్రమాద భరితుడాయెను.
వసుమతీ దేవి యంతక్వత్నియై సంవర్ణవర్ణ పరిపూర్ణ గర్భంబు చాల్చి, గణ్యసాద్గుణ్యంబగు నౌకా నొక పుణ్య వాసనంబున, బృహ సృతి, చంద్ర, శుకులుగల శుభలగ్నమున మన్మధ మొలక భువ డగు ఈమారునిగారనెను.
ఆ రాజహంస భూజాని యాత్మజాత నార్తాకర్ణనా పూర్ణుడై ఆ యానంద ఔప్పములు రాల నగరి జనులకు బహుమానంబు లొసంగి, బాంధవాఁడః కరణంబు ఫలింపగా పుట్టిన బిడ్డకు రాజవాహనుడని నామకరణం బొనర్చెను.
శుద్ధాుకవాటీ నటన్బాలాజాలము “చంద్రమః కంఠళాందోళీ భావ ! దయార్ద్ర భావ" యనుచు జోలపాటలు బాడుచు నా శిశువు లాలించుచుండిరి. కాలకుడు యీడు
ఆ ముద్దులు మూటగట్టు శిశువు జిలిబిలి పాలుగారు చెక్కుల
- టెక్కుతో, నిగనిగలాడు పుట్టు వెండ్రుకలతో, బాలకృష్ణుని వలె
పాదాంగుష్టములు నోట నిడికొని నెల్లరకు కనులపండువగా నుండెను.
దినదిన ప్రవర్ధమానుడగు నారాజవాహన జోడు చెలికాండ్రతో దాగుడు మూతలు, నిలిసింగనాలు. కప్పురపు గుప్పలు, మున్నగుదాటలాడుకొనుచు ముద్దులు మూట కట్టుచుండెను.
రాజహంసుడా బాలునకు ఉత్తమ కుత్త్రియోచిత విధమున సుపనయన మొనర్చి, బ్రహ్మచర్యమ క నిష్ఠానియమవంతుని గావించెను.
రానురాను యౌవనము నెలికురుకుగా కరికలభములను కొమ్ములు బట్టి యీడ్చుచు, మత్త ఖడ్గసి బడల్చు శాస్త్రమున, అనవద్యమగు సంగీత సాహిత్య నీ వ్యాధివణుడై, చక్కదనమునకుఁదగిన ప్రతాపముతో రణాంగణాటవీ పావకుడై యొప్పారు చుండెను-
పెండ్లి యీడు వచ్చుటచేత తండ్రి) యాతనికి చుట్టపునరపాలుర యింటిబిడ్డకు వివాహ మొనర్చి, యువరాజుగా నభిషేకించి, రాజనీతి యుపదేశించి, కప్పముగట్టని పాండ్యు పైకి యుద్ధమునకు బంపెను.
రాజవాహనుడు తండ్రి) పనుపున బంగారు పల్యంకి కారూడుని డై గజ, తురగ, పదాతులు, వెంటరా, శంఖ కానీ శార్భటీ ఢక్కికాహు దుక్కా రవములు దిక్కులు పిక్కటిల్ల రణరంగమునకు వెడలెను.
రాజవాహనుని భార్యగూడ, సోదరుడు మెటరా పల్లకియెక్కి భర్తృపతాపమును జూచి వినోదించుటకు బయలు వెడలెను.
ఇట్లు సమస్తసేనా పరిసృతుడై, రాజవాహనుడు శత్రు రాజ పట్టణ ప్రాంతమున దండుదిగి కత్రువులు గుండెలు గుబ్బురన శంఖా రావము గావించి యాత్తర ధరణీభృత్తతుల కోట కొత్తళము తుత్తు · మూడు జేసెను. పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/8 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/9 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/10 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/11 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/12 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/13 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/14 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/15 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/16