రాజవాహనవిజయము

ప్రౌఢప్రబంధము


కాకమాని మూర్తికవి

ప్రణీతము


టీకాసహితము


1937

ద్వితీయముద్రణము

ప్రకాశకులు : నందిరాజు చలపతిరావు

మంజువాణీ ప్రెస్, ఏలూరు

విజ్ఞప్తి

ఈ రాజవాహన విజయ గ్రంథమును చెన్నపురి ప్రాచ్యలిఖిత గ్రంథభాండాగార మాతృకనుండి ప్రతివ్రాసి తెచ్చి 1898 సంవత్సరము జూలై మాసమున బ్రకటింపబడిన మంజువాణీ మాసపత్రికలో ముద్రించితిమి.

ప్రౌఢ ప్రబంధమగుటచే టీకాసాహాయ్యము లేక యర్థము చేసికొనుట కష్టసాధ్యమనియెంచి లఘుటీకతో బ్రచురించితిమి.

ఈకవి ప్రయోగించిన శబ్దములను సూర్యారాయనిఘంటు కారులును, శబ్దరత్నాకర నిఘంటుకారులు, ఉదాహరణముగా గైకొనియున్నారు. చిన్నయసూరి మతమునకు వ్యతిరిక్తమైన ప్రయోగములు క్వచిత్తుగా నీగ్రంథమందున్నవిగాని, ఆయాసందర్భములలో చిన్నయసూరి మతమే సంస్కరణాపేక్షితముగా గానుపించుచున్నవి.

బహులాశ్వచరిత్రయు రసవత్కావ్యముగానున్నది. భాషాపరులెవ్వరైన నాగ్రంథమును బంపినచో కృతజ్ఞతాపూర్వకముగ ముద్రించి, కాకమానిరాయని ప్రతిభను వెల్లడింతుము.

ఇప్పుడిప్పుడే ప్రజలలో మరల ప్రబంధ పఠనాసక్తి గలుగు సూచన లగపించుచున్నవి.

ఇట్లు,
ఏలూరు,నందిరాజు చలపతిరావు,
15-8-37.ప్రకాశకుడు.