రసార్ణవాలంకారము/పీఠిక
ప్రకాశవర్షుఁడు — రసార్ణవాలంకారము
1. మున్నుడి
రెండుసంవత్సరములక్రిందట నాంధ్రసాహిత్యపరిషత్పత్త్రికలో [సంపు. 23-24. (1934-35.)] ప్రకాశవర్షుని 'రసార్ణవాలంకారము' నాసంపాదకత్వమున వెలువడినది. నేఁటివఱకు దానికిఁ బీఠిక వ్రాసి పుస్తకరూపమున నీకృతిపుష్పమును సహృదయలోకమున కర్పించుటకు యోగములు కూడినవి కావు. పలువురు రసజ్ఞు లీగ్రంథమును బంపుఁ డని పరిషదధికారులకుఁ జాలసారులు వ్రాయుచుండి రని విని దీనియెడఁ బాఠకలోకము చూపుసమాదరణమునకు సంతసించి, గ్రంథకర్తను, దత్ప్రృతికాలాదులను, నీకృతివైశిష్ట్యమును గుఱించినసమాలోచనమును బండితలోకమున కర్పించుచున్నాఁడను.
2. కృతజ్ఞత
ఈకృతిని మొట్టమొదట-మహోపాధ్యాయ-విద్యాభూషణబిరుదాంకితులు చెన్నపురవిశ్వవిద్యాలయసంసృతపండితులునగు వి. వేంకటరామశర్మగా రాంగ్లలిపిలో నుచ్చారణచిహ్నముల (Dia-critical marks) తోడను నుపోద్ఘాతముతోడను కలకత్తానగరమున ఆచార్య నరేంద్రనాథ లా[1] సంపాదకత్వమున వెలువడు 'భారతీయేతిహాస త్రైమాసికపత్రిక'[2]లో నేఁటి కెనిమిదివత్సరములకుఁ బూర్వము (మార్చి-1929 లో] ప్రకటించియున్నారు. ఈకృతి గుణోత్తరముగా నుండుట గాంచి యాంగ్లలిపిలో ముద్రింపఁబడినశ్లోకముల నాంగ్లభాషాభిజ్ఞులే యెంతయో పరిశ్రమ సల్పినఁగాని చదువనేర నప్పు డిఁక నాంగ్లభాషా గంధము నెఱుఁగని యాంధ్రదేశసంస్కృతపండితుల కీకృతి యన నచుంబితప్రక్రియగా నుండు నని యెంచి దీనిని దెలుఁగు లిపిలో విపులసమాలోచనపూర్వకముగా రసజ్ఞలోకమునకు నివేదించుచున్నాఁడను. శర్మగా రీకృతిని బ్రచురించిన కొన్నినెలలకే -ఆచార్య సుశీలకుమార - డే-గారు[3] [డక్కావిశ్వవిద్యాలయమున గీర్వాణపీఠాధ్యక్షులు] శర్మగారిపీఠికలోని యనేకసిద్ధాంతముల ఖండించుచుఁ బైకలకత్తాపత్రిక[4]లోనే యొకవ్యాసమును బ్రకటించియున్నారు. 'డే'పండితు లిప్పటికి రెండుసంవత్సరములకుఁ బూర్వమే 'లండన్' నగరమునుండి వెలువడు 'ప్రాచ్యవిద్యాలయపత్త్రిక'[5]లోఁ బ్రకృతగ్రంథమును గూర్చి యించుక వ్రాసియున్నారు. ఈనడుమ చెన్నపురవిశ్వవిద్యాలయమున గీర్వాణశాఖలోఁ బరిశోధకులుగానుండిన ఆచార్య వి. రాఘవన్ పండితులు కూడ శర్మగారిసిద్ధాంతములను నిరసించుచు చెన్నపురిలోఁ బ్రకటింపఁబడు 'ప్రాచ్యపరిశోధనపత్త్రిక'[6]లో [1934] నొకవ్యాసమును బ్రచురించియున్నారు. సాహిత్యాచార్య, వేదాంతభూషణ నందకిశోరశర్మ యనుకాశీపండితులు ప్రాచ్యవిద్యావైభవ - మహామహోపాధ్యాయ, గోపీనాథకవిరాజ [యం.ఏ] మహోదయుని సంపాదకత్వమున 'సారస్వతాలోకము'నందలి ప్రథమకిరణమున కనుబంధముగా 'సంసృతకవిపరిచయము - భారవి'[7] యను కృతిని [1932] బ్రకటించియున్నారు. పైవ్యాసములు, కృతులును బ్ర కృతము విశేషముగా నుపకరించినవి. మఱియు 'డే' పండితుని 'అలంకారశాస్త్రచరిత్ర'[8], పాండురంగ వామన కాణేపండితుని 'అలంకారశాస్త్రచరిత్ర'[9], ప్రకృతము ముద్రణమునందున్న డాక్టర్ మాడభూషి కృష్ణమాచార్యుల వారి 'సంసృతసారస్వతచరిత్రము'[10] నా కుపకారకములయినవి. పాఠకులకు సుబోధముగా నుండుటకై శ్లోకముల ప్రక్క నాయాశ్లోకములందలి విషయములఁ దెలుపుసూచికలను జేర్చియున్నాఁడను. విజయనగరమహారాజసంస్కృతకళాశాలలోని 'రసార్ణవాలంకారము'యొక్క వ్రాతప్రతియందలి పాఠభేదము లనుబంధమునఁ జూపఁబడినవి.
3. ప్రకాశవర్షులు
సంసృతవాఙ్మయమునఁ బ్రకాశవర్షుఁ డనునామముతో నలుగురు గ్రంథకర్తలు కన్పట్టుచున్నారు.
1. వల్లభదేవుని 'సుభాషితావళి'[11]లోను, శార్ఙ్గధరుని 'శార్ఙధరపద్ధతి'[12] లోను నుదాహరింపఁబడిన ప్రకాశవర్షుఁడు. ఈతఁడు కాశ్మీరదేశస్థుఁ డనియు, భట్టహర్షుని సుతుఁ డనియు, 'సుభాషితావళి'లో నుదాహరింపఁబడిన దర్శనీయకవి (=దోర్లతికాదర్శనీయకవి?)కి జనకుఁ డనియు, గౌడకవి భట్టనరసింహకవిపుత్త్రునికి శిష్యుఁ డనియు నందకిశోరపండితులు వ్రాసియున్నారు[13]. వల్లభదేవ [క్రీ. 1417-67] శార్ఙ్గధరులచే [క్రీ. 1363] నుదాహరింపఁబడియుండుటచే నీప్రకాశవర్షుఁడు క్రీ. 1363కంటెఁ బూర్వుఁ డని చెప్పఁదగును.
2. భారవికృత 'కిరాతార్జునీయము' నకు వ్యాఖ్యాత.
ఈప్రకాశవర్షుని, దద్వ్యాఖ్యను దేవరాజయజ్వ తనభారవివ్యాఖ్య ('సుబోధిని') యందును,[14] గదసింహుఁడును[15] [క్రీ. 1200-1600] మల్లినాథుఁడును దమ ‘కిరాతార్జునీయవ్యాఖ్యల'లో [IV స. 10 శ్లో.)ను బేర్కొనియున్నారు.
3. మాఘకృత 'శిశుపాలవధ'కు వ్యాఖ్యాత.
ఈప్రకాశవర్షుని వల్లభదేవుఁడు స్వకృతమాఘవ్యాఖ్యలోఁ దనకు గురువుగాఁ బేర్కొనియున్నాఁడు. ప్రకాశవర్షునకు మహోపాధ్యాయబిరుద మున్నటు లీతనియాకరమువలనఁ దెలియుచున్నది.[16] ఈగురుశిష్యులు సమకాలికులు గావున వల్లభదేవునికాలము నిట విచారింపఁజనును. ఈతఁడు 'సుభాషితావళి'సంధాత యగువల్లభదేవునికంటెఁ బ్రాచీనుఁడు, భిన్నుఁడు నని యెఱుఁగునది.] వల్లభదేవుని పౌత్రుఁ డగుకైయటుఁడు క్రీ.శ. 977 లో నానందవర్ధనుని 'దేవీశతకము'నకు వ్యాఖ్యను రచించెను. ఆవ్యాఖ్యనుండి యీప్రమాణమును జూచునది.[17]
శ్లో. | ‘వల్లభదేవాయనిత శ్చన్ద్రాదిత్యా దవాప్య జన్మేమామ్ | |
శ్లో. | వసుమునిగగనోదధి [4078] సమకాలే యాతే కలే స్తథా లోకే | |
కైయటుఁడు క్రీ. శ. 977 ప్రాంతముల జీవించియుండుటచే నాతనిపితామహుఁ డగు వల్లభదేవుఁడు క్రీ. శ. 927 ప్రాంతముల జీవించియుండె నని నిశ్చయింపనగును. కావున వల్లభదేవుని విద్యాగురు వగు ప్రకాశవర్షుఁడు క్రీ.శ. 875-925 నడుమ విలసిల్లియుండవచ్చు నని నందకిశోరశర్మగారు వ్రాసియున్నారు.
4. రసార్ణవాలంకారకర్త యగు ప్రకాశవర్షుఁడు.
ఈనలుగురును భిన్నులా, కారా యనునది విమర్శనీయము. మాఘభారవుల కావ్యములకు వ్యాఖ్య వ్రాసి, సుభాషితావళి మొదలగు సంధానగ్రంథములలోఁ బేర్కొనఁబడిన ప్రకాశవర్షుఁడు కవి యనియు, నందువలన నాలంకారికుఁ డగు మనగ్రంథకర్తకంటె భిన్నుఁ డనియు వేంకటరామశర్మగారు వ్రాసియున్నారు.[18] భిన్నవాదమున కింతకంటెఁ బ్రబలప్రమాణము నేమియుఁ జూపక సిద్ధాంతీకరించుట చింత్య మనుచు వీరియభిప్రాయమును ఖండించుచు పండిత నందకిశోరశర్మగా డిట్లు నుడివియున్నారు;[19]
—కవి యగువాఁ డాలంకారికుఁడు కాఁ డనుట యపసిద్ధాంతము. కవి యైనవాఁడే యాలంకారికుఁ డగుటకు నిదర్శనము లనేకములు గలవు. దండి, భోజుఁడు, 'సాహిత్యదర్పణ' నిర్మాత యగువిశ్వనాథుఁడు 'రసగంగాధర'కారుఁ డగు జగన్నాథపండితరా యలు మొదలగు ననేకు లుత్తమాలంకారికులే కాక తమకావ్యనిర్మాణపాటవముచేతను బ్రసిద్ధు లైయున్నారు. నామైక్యముండి, విరోధిప్రమాణము లేనప్పుడు వ్యక్తిద్వయకల్పన మసంగతము. కావునఁ బైనలువురు నొకఁడే—
కాని వీరిసిద్ధాంతముకంటె వేంకటరామశర్మగారి యభిప్రాయమే సరి యని తోఁచెడిని. మాఘభారవికావ్యవ్యాఖ్యాత లిరువురు నొకఁడే యనియు, నీతఁడు భోజునికంటెఁ [క్రీ. 1005-1054] బ్రాక్తనుఁ డనియు, భోజునికంటె మనయాలంకారికుఁడు భిన్నుఁ డనియు, బరుఁ డనియుఁ దోఁచుచున్నది. సుభాషితావళిలోఁ బేర్కొనఁబడిన ప్రకాశవర్షుఁడు పైవ్యాఖ్యాతయే కావచ్చును, లేక ప్రకృతగ్రంథకర్త యైనను గావచ్చును. వ్యాఖ్యాత యగుప్రకాశవర్షుని, యాలంకారికుఁ డగుప్రకాశవర్షుని పౌర్వాపర్యవిచారము క్రింది కాలనిర్ణయప్రకరణమునఁ గననగును.
4. ప్రకాశవర్షుని కాలము
భామహుని 'కావ్యాలంకారము'నను, దండి 'కావ్యాదర్శము'నను ప్రకాశవర్షుని 'రసార్ణవాలంకారము'నుండి పదవాక్యవాక్యార్ధము లనేకములు హరింపఁబడిన వనియు, ప్రకాశవర్షునికృతి దండిభామహులకృతుల కుపజీవ్య మనియు నందువలన వీరిరువురును ప్రకాశవర్షునికంటె నవీను లనియు, భట్టబాణుని బేర్కొనుట చేఁ బ్రకాశవర్షుఁడు బాణునికంటె నర్వాచీనుఁ డనియు నందుచే మనకవి బాణుని తరువాతను దండిభామహులకుఁ బూర్వమునను [అనఁగా - క్రీ. శ. 650-750 నడుమ] జీవించియుండవలె ననియు వేంకటరామశర్మగారి సిద్ధాంతము.[20] కాని యిది యవిమర్శపూర్వకము. సుశీలకుమారడే, రాఘవన్ పండితుల వ్యాసములను బట్టి ప్రకాశవర్షుఁడు భోజునికంటె నవీనుఁ డనియు, భోజుని 'సరస్వతీకంఠాభరణము', 'శృంగారప్రకాశము'ను ప్రకాశవరుని కృతిలత కుపఘ్నము లనియు సుశీలకుమారడే, రాఘవన్ పండితు లనేకరచనాసామ్యప్రదర్శనపూర్వకముగా నిర్ధారణ చేసియున్నారు. వీరిమతమును బట్టి దండి-భామహ–బాణులకంటె ప్రకాశవర్షుఁడు నవీనుఁ డని వేఱె చెప్పనవసరము లేదు. ఒక్కరచనాసామ్యము కాలనిర్ణయవిచారమునఁ బరమప్రమాణము కాఁజాలదు. వీరిసిద్ధాంతము సరియే కాని వీరు చూపిన ప్రమాణములు ప్రబలములు గావు. ప్రకాశవర్షుఁడు భోజునికిఁ బరుఁ డనుటకు నొండురెం డాంతరప్రమాణములు లభించుచున్నవి. వీని నేలకో పైపండితు లలక్ష్యము చేసిరి. ఇది చింత్యము. 'సరస్వతీకంఠాభరణము'న భోజుఁడు పదదోషప్రకరణమున - 'అసాధు’వను దోషము నిట్లు వివరించెను.
"శ్లో. | 'శబ్దశాస్త్రవిరుద్ధం య త్త దసాధు ప్రదక్షతే | |
'శ్లో. | భూరిభారభరాక్రాన్త బాధతి స్కన్ధ ఏష తే | |
అత్ర బాధతే రాత్మనేపదిత్వాద్ 'బాధతే' ఇతి స్యాత్, న పునర్ 'బాధతి' ఇతి." [I గుణవివేచనపరిచ్ఛేదము; 4 పుట. నిర్ణయసాగరముద్రణము. 1934.] దీనికి రత్నేశ్వరుఁ డిట్లు వ్యాఖ్య వ్రాసియున్నాఁడు: “అత్ర కేచి దాహుః-‘బాధతిధాతుం సంస్కారప్రచ్యావనేన బాధతే ఇతి బాధతిబాధస్తస్య సంబోధనం బాధతిబాధేతి. తే=తవ. వచన మితి శేషః,' ఇతి. త దసత్. నేయార్థత్వప్రసఙ్గాత్. అన్యేతు 'బాధతి ర్బాధతే యథా' ఇతి పఠన్తి. ఇదం తత్త్వమ్. విద్యమాన స్వార్థవత్వ స్యావివక్షాయాం గవిత్యయమాహేత్యాదావివ ప్రాతిపదికసంజ్ఞా న ప్రవర్తతే.”
'భూరిభార' అను పైశ్లోకమును శబ్దశాస్త్రవిరుద్ధ మగునసాధుదోషమున కుదాహరణముగా భోజుఁడు చూపియుండ నందలి యుత్తరార్ధమును స్వీకరించి ప్రకాశవర్షుఁడు భోజుఁడు దోష మనిన దాని కపవాదము నిట్టులు నిపుణముగాఁ జూపియున్నాఁడు: [శబ్ద మసాధు వైనను ననుకరణమున గుణీభావము నందును.]
శ్లో. | 'పదం యాతి గుణీభావ మనుకర్తు రసా ధ్వపి | |
2 పరి. 36-37 శ్లో. [7 పు.]
ఒకనాఁడు వేఁటనుండి మరలుచు భోజుఁడు తనపల్లకిని మోయు వాహకులలోఁ గ్రొత్తవానిం గని- యాతఁడు మాఱువేషమున నున్న పండితుఁ డని యెఱుఁగక— 'ఎక్కుడు బరువుచే నీభుజము బాధనొందుచున్నదా?' యని పృచ్ఛించె నఁట. దానికి బహుశాస్త్రవిశారదుఁడును, విశేషించి, శబ్దశాస్త్రనిష్ణాతయు నగుభోజుఁడు 'బాధతే' యనుటకు 'బాధతి' యని యపప్రయోగము చేసినందులకుఁ జింతించి రా జని యైనను జంకక యాపండితవాహకుఁడు వెంటనే “నీవు చేసిన 'బాధతి' యను నపప్రయోగము కలిగించినంతబాధ నాభుజము కలిగించుటలేదు" అనె నఁట! రసికుఁ డగుభోజుఁ డందుల కమితానందము నంది యాతని సన్మానించియుండును.
తనకాలమున కప్పుడే ప్రచురప్రచారము నందిన ధ్వనిసిద్ధాంతమును భోజుఁ డెఱుఁగును. ధ్వన్యాలోకమునుండి కొన్నికారికల నీతఁడు గ్రహించియు నీతఁడు ధ్వనిమతము నలక్ష్యము చేసి 'ధ్వనిమత్తాతు గాంభీర్యమ్' [I పరి. 78 శ్లో. 74 పు.] అని ధ్వనిని శబ్దగుణ మగు గాంభీర్యముగాఁ బేర్కొనెను. ప్రకాశవర్షుఁడుకూడ [2 పరి. 20 శ్లో. 6 పు.] ధ్వనిని గాంభీర్య మనుశబ్దగుణముగా నుడివియుండెను. దీనినిబట్టి ధ్వన్యాలోకకారునికంటె[క్రీ. శ. 840-860.] నీతఁడు నవీనుఁ డని తెలియుచున్నది.
'సరస్వతీకంఠాభరణము' మొదలగుకొన్నిసాహిత్యగ్రంథములలో నౌచిత్యము పేర్కొనఁబడినను 'ఔచిత్యవిచారచర్చ'లో నౌచిత్యసిద్ధాంతమును శాస్త్రదృష్టిని విచారించి, కావ్యమున కాత్మ యౌచిత్య మని నిర్ధారణచేసిన మహనీయుఁడు క్షేమేంద్రుఁడు. ఈసిద్ధాంతమును ప్రకాశవర్షుఁడు గుర్తించియే యుండును; కాని 'అగ్నిపురాణము'నందు ఔచిత్య ముభయాలంకారములలోఁ జేర్పఁబడినట్టు లీతఁ డౌచిత్యమును శబ్దాలంకారములలోఁ జేర్చియుండెను. క్షేమేంద్రునికంటె [క్రీ.1025–75.] ప్రకాశవర్షుఁ డర్వాచీనుఁడు కావచ్చును.
భోజునికంటె మనకవి నవీనుఁ డనుటకుఁ బైప్రమాణములకంటె బలవత్తర మైనగ్రంథస్థప్రమాణము లభించుచున్నది. కాని 'రసార్ణవము'పై విమర్శల వెలయించిన 'డే', రాఘవన్ మొదలగు పండితు లెవ్వరు నేకారణముననో దీనిని గుర్తింపరైరి:
ఆఢ్యరాజు, సాహసాంకుఁడు ననుప్రాకృతసంసృతభాషాపోషకులగు ప్రభుపుంగవులు, (మహా)భామహుఁడు, బాణుఁడు, వాత్స్యాయనుఁడు ననుగ్రంథకర్తలు, మహేశ్వరుఁడు, స్వయంభువు, వాతవ్యాధి, బృహస్పతి, కౌటిల్యులచే రచింపఁబడిన ‘అర్థశాస్త్రములు', కామందకీయ'నీతిసారము', 'విదగ్ధముఖమండనము'[22] మొదలగు గ్రంథములును 'రసార్ణవము'నఁ బేర్కొనఁబడెను. ఈకృతు లన్నిటిలో 'విదగ్ధముఖమండనము’ నవీనము. ఇది కవిశిక్షాగ్రంథము. దీనికర్త ధర్మదాససూరి యను బౌద్ధసన్న్యాసి. క్రీ. శ. 1298-1809 నడుమనుండిన జినప్రభుఁడు (జయసింహునిశిష్యుఁడు) దీనికి వ్యాఖ్య రచియించెను. అందువలన ధర్మదాససూరి క్రీ. శ. 1190-1210 ప్రాంతముల జీవించి యుండె నని నిర్ణయింపఁజనును.[23] కావున నీతనిగ్రంథమును బేర్కొనిన ప్రకాశవర్షుఁడు క్రీ. శ. 1210 ప్రాంతములకంటె నర్వాచీనుఁ డనిమాత్రము నిర్ణయింపవచ్చును.
5. గ్రంథపరిమాణము
మనకు లభించిన గ్రంథమున 4 పరిచ్ఛేదములు సమగ్రముగను, రసవిచారకమును ముఖ్యము నగు 5 వపరిచ్ఛేద మసమగ్రముగను గలవు. ఈగ్రంథము పంచపరిచ్ఛేదాత్మక మనియే వేంకటరామశర్మగారు ను, 'డే' పండితులును నుడివియున్నవారు. కాని దీనిని గూలంకషముగ గవేషణ మొనర్చిన రాఘవన్ పండితు లిది యాఱుప్రకరణముల గ్రంథ మై యుండవలె ననియు, నుభయాలంకారవిచారక మగు పంచమప్రకరణము పూర్తిగాను, రసప్రకరణమగు నాఱవప్రకరణము [ముద్రితపుస్తకమున 5 వ పరిచ్ఛేదము.] చాలవఱకును లోపించియుండవలె ననియు నిర్ణయించియున్నారు. అందులకు వారు చూపిన యుపపత్తుల[24] నిటఁ జూపుచున్నాను—
1. పరిచ్ఛేదము దోషప్రకరణము. 2. పరి. గుణప్రకరణము. 3-4. పరి. శబ్దార్థాలంకారప్రకరణములు. 5. పరి. శృంగారవ్యక్తి యనఁబడు రసప్రకరణము. ఇందు 2పుటలగ్రంథము మాత్రము లభించినది. మనకు లభించినస్వల్పగ్రంథమునుబట్టి చూచినను శృంగారప్రకాశమున భోజుఁడు విపులముగాఁ జేసిన రసవిచారమును ప్రకాశవర్షుఁ డీప్రకరణమున సంగ్రహముగా నుడివి యుండె నని తోఁపకమానదు. అందువలన నీపరిచ్ఛేదము తకినవానికంటే మిగుల విపులముగా నుండితీరవలెను.
తృతీయపరిచ్ఛేదముమొదట నలంకారములు— బాహ్యములు, అభ్యంతరములు, బాహ్యాభ్యంతరములు నని మూఁడువిధము లని మనకవి పేర్కొనియున్నాఁడు. ఈయలంకారవిభజనము నీతఁడు భోజునినుండియే గ్రహించియున్నాఁడు. భోజుఁ డీమూఁడువిధము లగు నలంకారములను ద్రివిధము లగు స్త్రీలయలంకారములతోఁ బోల్చియుండ మనకవియు నట్లే నుడివియుండెను. చూడుఁడు: శృంగారప్రకాశము [చెన్నపురిలోని వ్రాఁతప్రతి II సం. 266 పు.]
అలఙ్కారాశ్చ త్రిధా—బాహ్యాః, అభ్యన్తరాః, బాహ్యాభ్యన్తరాశ్చ. తేషు బాహ్యాః వస్త్రమాల్యవిభూషణాదయః; అభ్యన్తరాః దన్తపరికర్మ-నఖచ్ఛేదా-లకపరికల్పనాదయః; బాహ్యాభ్యన్తరాః స్నానధూప(విలేపనాదయః).
చూ. రసార్ణవము [3 పరి. 5-8 శ్లో. 12 పు.]
అఁదువలన ప్రకాశవర్షుఁ డీమూఁడువిధము లగునలంకారములను గూర్చియుఁ జర్చించి యుండు నని నొక్కి వక్కాణింపవచ్చును. కాని మనకు లభించిన వ్రాతప్రతిలో (3 వ పరి.) బాహ్యము లగు శబ్దాలం కారములను, (4 వ పరి.) అభ్యంతరము లగునర్థాలంకారములను గూర్చిన చర్చమాత్రము గలదు. పిమ్మట రసప్రకరణముయొక్క యుపసంహారభాగముగల 2 పుటల గ్రంథము మాత్రము లభించినది. కావున బాహ్యాభ్యంతరము లగునుభయాలంకారములు విమర్శించు 5 వ పరి. కూడఁ బూర్తిగా నుత్సన్న మైనదని నిర్ణయింపఁదగును. దీనిని బట్టి రసప్రకరణముననే కాక యలంకారప్రకరణమునఁ గూడ గ్రంథపాత మున్న దనియు, రసార్ణవ మాఱుపరిచ్ఛేదముల గ్రంథ మనియుఁ దేలుచున్నది.
6. రసార్ణవమీమాంస
1 వ పరిచ్ఛేదము [దోషప్రమోషము.]:-
దోషములు 3 విధములు-1. పదదోషములు. 2. వాక్యదోషములు. 8. వాక్యార్థదోషములు. ఇందు పదదోషములు 14 తెగలు.
1. అసాధువు.
2. అనిబద్ధము.
3. కష్టము.
4. క్లిష్టము.
5. అనర్ధకము.
6. అపుష్టార్థము.
7. గూఢార్థము.
8. అప్రతీతము.
9. ససంశయము.
10. నేయార్థము.
11. అసమర్థము.
12. అప్రయోజకము.
13. దేశ్యము.
14. గ్రామ్యము.
ఇందు, కడపటి గ్రామ్యదోషము - i. అసభ్యము. ii. అమంగళము. iii. ఘృణాకరము - అని 3 తరగతులుగా విభజింపఁబడెను.
వాక్యదోషములును 14 :-
1. శబ్దహీనము.
2. క్రమభ్రష్టము.
3. విసంధి.
4. పునరుక్తము.
5. వ్యాకీర్ణము.
6. భిన్నవృత్తము.
7. సంకీర్ణము.
8. గర్భితము.
9. భిన్నలింగము.
10. భిన్నవచనము.
11. ఖంజము.
12. న్యూనము.
13. అధికము.
14. శ్లేషాదిగుణహీనము.
ఇం దాఱవది యగు భిన్నవృత్తము మరల వర్ణభ్రంశము, యతిభ్రంశము నని రెండువిధములు.
గుణములు 3 తరగతులు- 1. శబ్దగుణములు. 2. అర్థగుణములు. 3. ఉభయగుణములు.
పై వాక్యదోషములలోని'శ్లేషాదిగుణహీనము నందలి 'ఆది' పదముచే నీ 10 గుణములయొక్క యభావమే 10 దోషములుగా నెంచఁబడెను. ఈదోషము లేవన-
1. శ్లేషవిపర్యయము.
2. సామ్యవిపర్యయము.
3. సౌకుమార్యవిపర్యయము.
4. అర్థవ్యక్తివిపర్యయము.
5. ప్రసాదవిపర్యయము.
6. కాంతివిపర్యయము.
7. ప్రౌఢివిపర్యయము.
8. మాధుర్యవిపర్యయము.
9. ఔదార్యవిపర్యయము.
10. నిస్సమాధి.
వాక్యార్థదోషములు 16 :-
1. అపార్థము.
2. వ్యర్థము.
3. ఏకార్థము.
4. ససంశయము.
5. అపక్రమము.
6. ఖిన్నము.
7. అతిమాత్రము.
8. విరసము.
9. పరుషము.
10. హీనోపమ.
11. అధికోపమ.
12. విసదృశోపమ.
13. అప్రసిద్ధోపమ.
14. నిరలంకారము.
15. అశ్లీలము.
16. విరుద్ధము.
ఇందలి విరుద్ధదోషము 3 విధములు.
1. దేశవిరుద్ధము.
2. కాలవిరుద్ధము.
3. లోకవిరుద్ధము.
1. యుక్తివిరుద్ధము.
2. ఔచిత్యవిరుద్దము.
3. కామశాస్త్రవిరుద్ధము.
భామహుఁడు 15 దోషములనే పేర్కొనియెను; కాని వానిని పద-వాక్య-వాక్యార్థగతము లని విభజింపలేదు. యుక్తి-ప్రతిజ్ఞావిరుద్ధముల నీతఁ డంగీకరించెను. 'పునరుక్త'దోష మర్థగత మగునప్పుడు 'నేయార్థ' మగు నని యీతఁ డనెను.
దండి యర్థ-శబ్దగతము లగు 10 దోషములనే పేర్కొనెను. యుక్తి(=హేతు)-విరుద్ధ-ప్రతిజ్ఞావిరుద్ధములు గుణములా, కావా యనువిషయమున నాలంకారికుల విప్రతిపత్తిని సూచించియున్నాఁడు.
వాక్యదోషములు 2:-న్యూనము, అధికము. వాక్యార్థగతము లగుచో నివియే- న్యూనోపమ, అధికోపమ- అనుదోషము లగును. వాక్య-వాక్యార్థగతభేదమే తప్ప పై రెండుదోషములకు వ్యత్యాసము లేదు. వాక్యార్థదోషములలో నుపమాదోషములు నాలుగు పేర్కొనఁబడెను. ఇందు న్యూనోపమ, అధికోపమలను దండిభామహు లిరువురు నుదాహరించియుండిరి. అప్రసిద్ధోపమ, విసదృశోపమలను భామహుఁ డొక్కఁడే వివరించియుండెను. దండి వీనిని బేర్కొననే లేదు. ప్రకాశవర్షుఁడు పేర్చొనిన పైయుపమాదోషములు నాలుగింటినే కాక యుపమానము-ఉపమేయములలో లింగ-వచనవ్యత్యాసమువలనఁ గలుగు మఱిరెం డుపమాదోషములు దండిభామహులు నుడివియున్నారు. ఈరెండిటిని ప్రకాశవర్షుఁడు భిన్నలింగ-భిన్నచనము లని నుడివి వీనిని వాక్యదోషములలోఁ జేర్చియున్నాఁడు. 'విపర్యయము' (అసదృశత ?) అను నేడవయుపమాదోషమును భామహుఁ డొక్కఁడే నుడివియున్నాఁడు. తనకంటెఁ బ్రాచీనాలంకారికుఁ డగుమేధావి యీయుపమాభేదముల నేడింటిని బేర్కొనె నని భామహుఁడు వ్రాసియున్నాఁడు.[భామహ. II పరి. 40 శ్లో.]
2. వపరిచ్ఛేదము. [గుణోపాదానము.]
గుణములు 2 విధములు- 1. శబ్దగుణములు. 2. అర్థగుణములు. మరల శబ్దగుణములలో 22 భేదములు, అర్థగుణములలో 22 భేదములు. ఈ 22 గుణభేదములపేళ్లు రెంటికిని సమానము—
1. శ్లేష.
2. ప్రసాదము.
3. సమత.
4. మాధుర్యము,
5. సుకుమారత.
6. అర్థవ్యక్తి.
7. కాంతి.
8. ఔదార్యము.
9. ఉదాత్తత.
10. ఓజస్సు.
11. ఔర్జిత్యము.
12. ప్రేయస్సు.
13. సుశబ్దత.
14. సమాధి.
15. సూక్ష్మము.
16. గాంభీర్యము.
17. సంక్షేపము.
18. విస్తరము.
19. సామ్మిత్యము.
20. భావికత్వము.
21. రీతి.
22. ఉక్తి.
ఈనామము లన్నియును సార్దకములు. ఈ గుణములను దృష్టియం దుంచుకొని శబ్దములను వాక్యములను సరిగాఁ బ్రయోగించునది యని ప్రకాశవర్షుఁ డనుశాసించియున్నాఁడు.
భామహుఁడు మాత్రము కావ్యవిధాయకము లగు గుణముల నేప్రకరణమునను వివరించియుండలేదు; దండి యన్ననో వైదర్భమార్గమున కత్యావశ్యకములగు పదిగుణములను మాత్రము నుడివియుండెను. వైదర్భీ-గౌడీమార్గముల భేదములఁ గొన్నిటి నీతఁడు చెప్పియుండెను, గాని, గౌడమార్గప్రధానము లగుగుణములఁ గూర్చి యేమియు నెత్తుకొనలేదు. ప్రకాశవర్షునిచేఁ బేర్కొనఁబడిన గుణములు దండిభామహులకృతులలో నలంకారములుగా నెంచఁబడియుండెను. ఇ ట్లగుట కీముగ్గురకృతులలో నాయాగుణములకు నాపేరుగల యలంకారములకుఁ గలలక్షణసామ్యమే హేతువు.
శ్లో. | 'వదన్తి బన్ధవైకట్య మౌదార్యం కవిపుఙ్గవాః | |
అని ప్రకాశవర్షుఁడు [2 పరి. 16 శ్లో.] చెప్పియుండఁ గొంద ఱాలంకారికు లీయుదాత్తలక్షణము నుదారము (ఔదార్యము)న కారో పించినట్లు దండి వ్రాసియున్నాఁడు. ‘శ్లాఘ్యై ర్విశ్లేషణై ర్యుక్త ముదారం కైశ్చి దిష్యతే' గుణవివరణమునకుఁ బిమ్మటఁ బ్రథమపరిచ్ఛేదమునఁ బేర్కొనఁబడిన దోషములు నలువదినాలుగింటిలో నొక్క 'విరస' మనునది తక్కఁ దక్కినవి కొన్నియెడల గుణత్వము నొందు నని వివరింపఁబడెను. 'విరస' మిందులోఁ జేరకుండుటకు హేతువు 'కాలవిరోధము'నకు వలె గ్రంథపాతమో లేక కవియే దీనిని నపవాదముగా నెంచియుండెనో చెప్పఁజాలము.
శ్లో. | ‘దోషాణామపి యేషాం స్యా ద్గుణత్వం కారణా త్క్వచిత్ | |
— ప్రకాశ. 2 పరి. 35-36.
దోషములు నలువది యని యిటఁ జెప్పఁబడినది. కాని క్రిందటిపరిచ్ఛేదమున 43 దోషములు వివరింపఁబడి యుండుటచే నిటఁ బూర్వాపరవైషమ్యము గానఁబడుచున్నది.
మొదట-పదదోషముల గుణత్వము, ఆపిమ్మట వాక్యదోషముల గుణత్వము, వాక్యార్థదోషముల గుణత్వము నిట్లు మొదటిపరిచ్ఛేదమునందలి క్రమమే పాటింపఁబడియెను. మొదటిపరిచ్చేదమున గుణములను చెప్పినపిమ్మట - (24-28 శ్లో.)
1. శేషగుణాభావము - శైథిల్యదోషము.
2. సామ్యగుణవిపర్యయము- వైషమ్యదోషము.
8. సౌకుమార్యగుణరాహిత్యము- కఠోరము.
4. అర్థవ్యక్తిహీనత- నేయార్థము.
5. ప్రసాదగుణాభావము- అప్రసన్నము.
6. కాంతిగుణలోపము- అవ్యుత్పన్నత.
7. ప్రౌఢి(ఓజో)గుణవిహీనత- అప్రౌఢి.
8. మాధుర్యలోపము- అనిర్వ్యూఢము.
9. ఔదార్యవిపర్యయము- నిరలంకారము.
10. నిస్సమాధిగుణలోపము- ఋజుమార్గము.
ఇందు నేయార్థము ప్రత్యేకముగా వాక్యదోషముగాను, నిరలంకారము వాక్యార్థదోషముగాను గూడఁ జెప్పఁబడినవి. శ్లేషాదిగుణహీ
| 'నిర్దుష్టస్యాపి కావ్యస్య గుణోపాదాన మన్తరా | |
సహేతుకముగాఁ జూపట్టుచున్నది.
3 వ పరిచ్ఛేదము. [శబ్దాలంకారప్రకాశనము.]
మొదట నలంకారసామాన్యలక్షణములు విశదముగాఁ జూపఁబడినవి. 1. బాహ్యములు, 2. అభ్యంతరములు. 3. ఉభయములు - అని యలంకారములు మూఁడువిధములు. బాహ్యములగు శబ్దముల కుత్కర్షాధాయకము లగుటచే శబ్దాలంకారములు బాహ్యము లనఁబడెను. అభ్యంతరము లగుకావ్యార్థముల కౌన్నత్యముం జేకూర్చునవి యగుటచే నర్థాలంకారము లాభ్యంతరకక్ష్యలోఁ జేర్పఁబడెను. ఉభయాలంకారకక్ష్యలో నేయలంకారములు చేరునో మనకవి చెప్పియుండలేదు. కాని యాతని వివరణమునుబట్టి యూహించిన, శ్లేషాదు లిందుఁ జేరునేమో యని తోఁచెడిని.
శబ్దాలంకారములు 18 :
1. జాతి.
2. రీతి.
3. వృత్తి.
4. రచన.
5. ఘటన.
6. ముద్ర.
7. ఛాయ.
8. యుక్తి.
9. భణితి.
10. శ్రవ్యత.
11. శ్లేష.
12. చిత్రము.
13. ఔచిత్యము.
14 ప్రశ్నోత్తరము.
15. ప్రహేలిక.
16. అనుప్రాస.
17. యమకము.
18. గూఢోక్తి.
సంసృతప్రాకృతాత్మకమగు'జాతి' శుద్ధ, సాధారణి యని రెండువిధములు. దండిభామహులు భాషల సామాన్యనామమునుగాని, శుద్ధ, సాధారణి యను తద్భేదములఁ గాని నుడువక భాషాసామాన్యమును సంసృతప్రాకృతాపభ్రంశము లని విభజించియుండిరి. దండి మిశ్ర మను మఱియొకభేదమును గూడఁ గల్పించియున్నాఁడు. ఇ వన్నియు వాఙ్మయభేదము లని యీతఁ డనియున్నాఁడు.
రీతులు 5 :-1. వైదర్భి. 2. గౌడి. 3. పాంచాలి. 4. లాటి. 5. ఆవంతి. ఆయాదేశములలోని జనుల యభిరుచుల ననుసరించి చేయఁ నతవలనఁ గలుగు నీపదిదోషములను ప్రకాశవర్షుఁడు వివరించినపద్దతిని బట్టి యాలోచించిన నాయాగుణముల యభావము నీతఁడు విశేషదోషములుగాఁ బరిగణించినట్లు లేదు. మ ఱే మన నీపదిగుణములును దక్కినగుణములును గావ్యమున కత్యావశ్యకము లైన ట్లీతని దృఢాభిప్రాయముగాఁ దోఁచెడిని. దండియు నిట్టియభిప్రాయముతోడనే శ్లేషాదిదశగుణములను మాత్రమే పేర్కొనియుండెను, గాని, వానియభావమును దోషములుగా నెంచియుండలేదు.
వేంకటరామశర్మగా రిట్లు వ్రాసియున్నారు:-[25]
"భామహుఁడు దఁడియుఁ గావ్యలక్షణములను దద్భేదములను విపులముగాఁ జర్చించియుండిరి. వారి కుపజీవ్య మగు గ్రంథ మొకటి యుండవలెను. అది యీరసార్ణవమే. ఇందు ద్వితీయపరిచ్ఛేదము—
| 'నిర్దిష్టస్యాపి కావ్యస్య గుణోపాదాన మన్తరా' | |
అని ప్రారంభింపఁబడెను. దీనినిబట్టి మనకవి కావ్యలక్షణములను దద్భేదములను గ్రంథాంతరమున వివరించియుండుటచే నా ప్రసంగముచే నిట విడిచె నని యూహింపనగును. మఱియు నితరాలంకారగ్రంథములందువలె నిం దాశీర్నమస్క్రియాపూర్వక మగుకృత్యాది గాని, గ్రంథకర్తృప్రశస్తి గాని, యనుబంధచతుష్టయనిరూపణాదులు గాని లేవు. ప్రథమపరిచ్ఛేదము దోషవిచారకము. వీని నన్నిటింబట్టి చూచినఁ గావ్యనిర్దేశప్రకరణాదులు గల మఱికొన్నిప్రకరణము లుత్సన్నము లైయుండితీరు నని నిర్ణయింపఁ జనును.”
ఈయభిప్రాయములు చాలవఱ కవిమర్శపూర్వకములు. రసార్ణవము దండిభామహుల కుపజీవ్య మెంతమాత్రమును గా దనియు, వీరిరువురకంటెను రసార్ణవకర్త చాల నవీనుఁ డనియుఁ గాలనిర్ణయాదిప్రకరణముల నిరూపింపఁబడినది. కృత్యాదిగ్రంథము కొంత లోపించిన లోపింపవచ్చును. మొదటి పరిచ్ఛేదమున దోషములు వివరింపఁబడెను. రెండవపరిచ్ఛేదమున గుణవిచారము చేయఁబడెను. అందువలనఁ గావ్యము నిర్దుష్టమైనను, గుణసహితము కానిచో సాధువు కానేర దనుపాఠమేబడువచోవిన్యాసమే రీతి యనఁబడును. దేశము లనేకములు; అందలి జనులరుచిభేదములు ననేకములు. అందుచే రీతులభేదముల నెన్నుటకు సర్వజ్ఞుఁడగు నీశ్వరుఁ డొక్కడే సమర్థుఁ డని యీతఁడు నుడివియున్నాఁడు.
దండిమతమున రీతు లనేకములు. అందు సూక్ష్మభేదములు గల తక్కినవానిని వదలివైచి ప్రస్ఫుటవ్యత్యాసముగల వైదర్భ-గౌడీయముల మాత్రము దండి విశేషముగా వర్ణించియున్నాఁడు.
వృత్తులు:-1. కైశికి. 2. ఆరభటి. 3. భారతి. 4. సాత్వతి. ముద్ర (= సాభిప్రాయార్థవిన్యాసము) 4 విధములు:-1. విభక్తిగతము. 2. వచనగతము. 3. సంవిధానగతము. 4. సముచ్చయగతము.
అన్యోక్తుల ననుకరించుట ఛాయ. ఇది 5 విధములు- 1. లౌకికము. 2. స్ఖలితము. 3. ఛేకము 4. ముగ్ధము. 5. వేటోక్తి. జను లసంఖ్యాకు లగుటచే నన్యోక్తిచ్ఛాయాభేదములు ననంతము లని యీతఁ డనెను.
విశేషము:- ఈఛాయ నితరాలంకారికులు శబ్దార్థహరణము, హరణము, ఉపజీవనశిక్ష మొదలగుపేళ్లతో వ్యవహరించిరి. వామనుఁడు నానందవర్ధనుఁడు తమకృతులలో నీవిషయమును స్పృశించియున్నారు. ఈవిషయమును గూలంకషముగ సోదాహరణముగఁ జర్చించిన మహనీయుఁడు రాజశేఖరుఁడు. ఈతఁడు కావ్యమీమాంసయందు మూఁడు ప్రకరణములు [XI-XIII) తద్విచారమునకు వినియోగించెను. హేమచంద్రుఁడు తన'కావ్యానుశాసనము'నకుఁ దాను రచించిన 'వివేక' మను వృత్తిలోను, వాగ్భటుఁడు 'కావ్యానుశాసనము' నను నిందలివిషయము లనేకములఁ బరిగ్రహించియుండిరి. భోజుని 'సరస్వతీకంఠాభరణము'నందు నీవిషయ మించుక కలదు. క్షేమేంద్రుఁడు కవిశిక్షాగ్రంథమగు తన 'కవికంఠాభరణము'న నీవిషయమును విపులముగఁ జర్చించియున్నాఁడు. రాజశేఖరుఁడు (XI అధ్యా. 61 పు] ఈవిషయమును గూర్చి యొకచక్కని యాభాణకమును గ్రోడీకరించియున్నాఁడు: 'లోకమునఁ జోరుఁడు గాని, కవి గాని, వర్తకుఁడు గాని యుండఁడు. ఎవఁడు తనచౌర్యమును గప్పిపుచ్చుకొనఁగలఁడో వాఁడు నింద నొందక యానందము నందును.'
యుక్తి 6 విధములు: 1. పద 2 పదార్థ 3. వాక్య 4. వాక్యార్థ 5. ప్రకరణ 6 ప్రబన్ధయుక్తులు.
భణితి 4 భేదములు:-1. సంభావనారూపము. 2. అసంభావనారూపము. 3. కల్పనారూపము. 4. విరోధరూపము.
శ్రవ్యత 6 తెగలు:-1. ఆశీరూపము. 2. నమస్క్రియారూపము. 3. నాందీరూపము. 4. వస్తురూపము. 5. బీజరూపము. 6. ప్రరోచనారూపము.
శ్లేష 6 రకములు:-1. ప్రకృతి, 2. విభక్తి, 3. పద, 4. వచన, 5. భాషా, 6. ప్రత్యయశ్లేషలు.
ఔచిత్యము 2 విధములు:-1. అభిధానౌచిత్యము. 2. బన్ధౌచిత్యము.
[ఔచిత్యమును గూర్చి విపులముగ నెఱుఁగఁ గోరువారు క్షేమేంద్రుని 'ఔచిత్యవిచారచర్చ'ను బరిశీలింపఁదగును. ఔచిత్యమే కావ్యమున కాత్మ యని యీతనిమతము.]
ప్రశ్నోత్తరము 6 విధములు:- 1. అంతఃప్రశ్న. 2. బహిఃప్రశ్న. 3. ఉభయప్రశ్న. 4. పృష్టప్రశ్న. 5. ఉత్తరప్రశ్న. 6. జాతిప్రశ్న. ఈప్రశ్నోత్తరమునుగూర్చిన విశేషములు నరయఁగోరువారు 'విదగ్గముఖమండనము'ను బఠింపఁజను నని ప్రకాశవర్షుఁడే చెప్పియున్నాఁడు. ప్రకాశవర్షునికాలనిర్ణయమున కీగ్రంథ మెట్లుపయోగించునో కాలనిర్ణయప్రకరణమునఁ జూచునది.
ప్రహేళిక 6 విధములు:- 1. పరివర్తితము. 2. విన్యస్తము. 3. లుప్తము. 4. వ్యుత్క్రమము. 5. బిందుకము. 6. ఆర్థము.
[భామహుఁడు ప్రహేళికకు లక్ష్యముం జూపక, ప్రహేళికకు యమక మని నామాంతరము గల దనియుఁ దద్విశేషముల రామశర్మకృతమగు ‘అచ్యుతోత్తరము'నఁ జూడఁదగు ననియు నుడివెను. [భామహ. II. 19.] దండి యమక మేకాంతమధురము కాకపోవుటచేఁ దరువాత దీనినిగుఱించి చెప్పెద నని [కావ్యాదర్శ. I. 61] నుడివి, తృతీయపరిచ్ఛేదమున 14 ప్రహేళికాభేదములను సోదాహరణముగా వివరించియున్నాఁ డు. విశ్వనాథకవిరాజు [సాహిత్యదర్పణము X. 13.] రసపరిపంథియగుటచేఁ బ్రహేళిక యలంకారము కా దనియు, నిది 'ఉక్తివైచిత్ర్య'మాత్రప్రయోజక మనియు వ్రాసియున్నాఁడు. అంతకుమునుపే భోజుఁడు 'సరస్వతీకంఠాభరణము’నఁ బ్రహేళికాప్రయోజనములకు దండిశ్లోకము నుదాహరించియున్నాఁడు:
| “క్రీడాగోష్ఠీవినోదేషు తద్జ్ఞై రాకీర్ణమన్త్రణే | |
ఈశ్లోకము రసార్ణవమున గ్రహింపఁబడినది [3.82.]
దండి చెప్పినప్రహేళికాభేదములకు ప్రకాశవర్షుఁడు చెప్పినవానికి సాదృశ్యము లేదు.]
యమకము 7 తరగతులు:
1. అవ్యపేతము. (నియతము).
2. అవ్యపేతము. (అనియతము),
3. వ్యపేతము. (నియతము).
4. వ్యపేతము. (అనియతము).
5. అవ్యపేతవ్యవేతకము. (నియతము).
6. అవ్యపేతవ్యవేతకము. (అనియతము).
7. సముద్గకము.
భామహునిమతమున యమకము 5 విధములు: 1. ఆది. 2. మధ్యాన్తము. 3. పాదాభ్యాసము. 4. ఆవలి. 5. సమస్తపాదయమకములు.
సందష్టక - సముద్గకాదిభేదముల నీతఁ డీయైదింటిలోనే యిమిడ్చెను. ప్రకాశవర్షుఁడు పేర్కొనిన యేడిటికి నధికముగా దండికృతియం దీ 5 ను వివరింపఁబడినవి: 1. సందష్ట, 2. సముద్గ, 3. శ్లోకాభ్యాస, 4. మహాయమక, 5. ప్రతిలోమయమకములు. ఇతరులు కొందఱు సందషమును దక్కినభేదములలో నంతర్భూతముగా నొనర్చినను దానుమాత్రము దీనికిఁ బ్రత్యేకస్థానము నొసఁగుచున్నాఁడ నని దండి చెప్పియున్నాఁడు. తనకృతిలో(III పరి.) నీతఁడు యమకభేదముల 78 శ్లోకములలో వివరించియున్నాడు.
| 'ప్రాయేణ యమకే చిత్రే రసపుష్టి ర్న దృశ్యతే' | |
అని మఱియొక సాహిత్యవేత్త యమకచిత్రములు రసపోషకములు గా వనియే నుడివియున్నాఁడు. ప్రకాశవర్షుఁడు మాత్రము యమకము కవిపాండితికి గీటురాయివంటి దని
| ['కవివ్యుత్పత్తినికషం యమకం నామ తద్విదుః'- 3. పరి. 61.] | |
చెప్పియున్నాఁడు.
మనకవి ప్రహేలికకుఁ బిమ్మట ననుప్రాసమును [3 పరి. 14.] బేర్కొనియుండినను మనకు లభించినప్రతిలోఁ బ్రహేళిక తర్వాత యమకము చెప్పఁబడినది; అనుప్రాస విడువఁబడినది. అనుప్రాసవివరణభాగ ముత్సన్నమైన దని చెప్పవచ్చును.
యమకభేదముల వివరించునవసరమున ప్రకాశవర్షుఁడు —
| 'లక్ష్యులక్షణబోధార్థం దిఙ్మాత్రం తు ప్రదర్శ్యతే' - 3 పరి. 64.] | |
అని చెప్పినను లక్ష్యలక్షణము లిందు మృగ్యములుగా నున్నవి.
గూఢోక్తి 5 విధములు : 1 క్రియాభేదము. 2. కారకభేదము. 3. సంబంధభేదము. 4. పదభేదము. 5. అభిప్రాయభేదములవలనఁ గలుగునవి.
ఈశబ్దాలంకారములు వాగ్దేవికి నవయవాలంకారాదులుగాఁ జెప్పఁబడినవి. ఔచిత్యమును రసమును బాటించుచు సందర్భశోభకై వీనిని గవులు పద్యగద్యముల నుపయోగింపవలయు నని యాతనియభిప్రాయము.
పిమ్మట శ్లేషచిత్రముల ప్రాముఖ్యము, ననుప్రాసా క్లిష్టయమకముల ప్రాధాన్యము వివరింపఁబడెను. బాణునకుఁ బద్యరచనమునకంటె గద్యరచనమునఁ గలయధికకౌశలము, సంసృతప్రాకృతాదిభాషావిచారము, ఆఢ్యరాజ-శ్రీసాహసాంకప్రభువులకాలమునందలి భాషలను గూర్చినవివరములు గలవు. మంచిపుష్పముల నెంచి మాలను గూర్చుమాలాకారునివలెఁ గవి కావ్యశోభాసంధాయకము లగువిషయముల గ్రహించి కావ్యనిర్మాణమును జేయఁదగు నఁట! 4 వ పరిచ్ఛేదము. [అర్థాలంకారనిర్ణయము.]
అర్థాలంకారములు 28: -
1. జాతి.
2. హేతువు.
3. అహేతువు.
4. సూక్ష్మము.
5. సారము.
6. సమాహితము.
7. భావము.
8. విభావన.
9. అన్యోన్యము.
10. విరోధము.
11. విషమము.
12. సంభవము.
13. ప్రత్యనీకము.
14. వ్యతిరేకము.
15. అసంగతి.
16. లేశము.
17. పరివృత్తి.
18. నిమీలనము.
19. వితర్కము.
20. స్మరణము.
21. భ్రాంతి.
22. అభావము.
23. ఆగమము.
24. ఉపమానము.
25. అనుమానము.
26. ప్రత్యక్షము.
27. సంశయము.
28. అతిశయము.
ఇందు 1, 3, 5, 7, 9, 11-13, 15, 18-26 భామహుని కృతిలో లేవు. భామహుఁడు మఱికొన్నియలంకారములఁ బేర్కొనెను.
1. అర్థాంతరన్యాసము.
2. అనన్వయము.
3. అపహ్నుతి.
4. అప్రస్తుతప్రశంస.
5. ఆక్షేపము.
6. ఆశీస్సు.
7. ఉత్ప్రేక్ష.
8. ఉదాత్తము.
9. ఉపమ.
10. ఉపమేయోపమ.
11. ఊర్జస్వి.
12. తుల్యయోగిత.
13. దీపకము.
14. నిదర్శన.
15. పర్యాయోక్తము.
16. ప్రతివస్తూపమ.
17. ప్రేయస్సు.
18. భావికము.
19. యథాసంఖ్యము.
20. రసవత్తు.
21. రూపకము.
22. విశేషోక్తి
23. వ్యాజస్తుతి.
24. శ్లేష.
25. సమాసోక్తి.
26. సహోక్తి.
27. సంసృష్టి.
28. స్వభావోక్తి.
ఇవి ప్రకాశవర్షునికృతియందు మృగ్యములు. దండి మొత్తము 35 అలంకారములను సోదాహరణముగ వివరించెను. ఇతఁడు పేర్కొనినవానిలోఁ దొమ్మిది రసార్ణవమునను [2, 4, 6, 8, 10, 14, 16, 17, 28] గలవు. ఇవి కాక దండికృతియం దీక్రింది వధికముగాఁ గానవచ్చుచున్నవి —
1. స్వభావోక్తి.
2. ఉపమ.
3. రూపకము.
4. దీపకము.
5. ఆవృత్తి.
6. ఆక్షేపము.
7. అర్థాంతరన్యాసము.
8. సమాసోక్తి.
9. ఉత్ప్రేక్ష
10. క్రమము.
11. ప్రేయస్సు.
12. రసవత్తు.
13. ఊర్జస్వి.
14. పర్యాయోక్తము.
15. ఉదాత్తము.
16. అపహ్నుతి.
17. శ్లేష.
18. విశేషము.
19. తుల్యయోగిత.
20. అప్రస్తుతప్రశంస.
21. వ్యాజస్తుతి.
22. నిదర్శన.
23. సహోక్తి.
24. ఆశీస్సు.
25. సంకీర్ణము.
26. భావికము.
దండిభామహు లిరువురు నలంకారములుగా నెంచిన- 1. ప్రేయస్సు. 2. ఊర్జస్వి. 3. ఉదాత్తము. 4. భావికములను మనకవి గుణములుగా మార్చెను. దండిభామహులచే నర్థాలంకారముగాఁ బేర్కొనఁబడిన శ్లేష మనకవిచే శబ్దాలంకారములలోఁ జేర్పఁబడెను. పిమ్మట మనకవి జాతి నర్థాలంకారములలో మొదటిదానినిగా నుడివెను. శబ్దాలంకారములలోఁ గూడ జాతిని మొదటిదానినిగా నీతఁ డెంచెను.
హేతువు 6 విధములు:- 1. ప్రవర్తకము, 2. నివర్తకము. 3. అభావము. 4. జ్ఞాపకము. 5. ప్రయోజకము. 6. చిత్రము.
దండి హేతువు నాలుగువిధము లనియెను. రసార్ణవమునందలి 6 హేతువులలో మొదటి రెండును దక్కఁ దక్కినవి దండికృతిలోఁ జూపట్టుచున్నవి. మనకవి 'ప్రయోజక' మనిన దానిని దండి 'కారక' మనెను. మఱియు నీతఁడు 'జ్ఞాపక-కారకములు' ప్రవృత్తి-నివృత్తులలోఁ జేరుననెను. కారకము - 1. నిర్వర్త్యము. 2. వికార్యము. 3. ప్రాప్యము - అని 3 విధము లనియు, i. దూరకార్యము. ii. కార్యసహజము. iii. కార్యాంతరజము. iv. అయుక్తకార్యము. V. యుక్తకార్యము మొదలుగా 'చిత్రహేతు' వనేకవిధము లనియు దండి నుడివెను. సూక్ష్మము రెండురకము లని దండి యన, రసార్ణవకర్త యాఱువిధము లనెను.
ధర్మి, ధర్మము నని సార మిఱుదెఱఁగులు. సమాహితముకూడ 2 విధములే. దండి సమాహితభేదములఁ బేర్కొనలేదు. విరోధము శబ్దాలంకారములలోఁ గూడఁ జేరును గాని, సంఖ్యాగౌరవభీతిచే దీని నాప్రకరణమునఁ జెప్పక యిటఁ బేర్కొనుచుంటి నని రసార్ణవకారుఁడు వ్రాసియున్నాఁడు.
సంభవము 4 విధములు:- 1. విధి. 2. నిషేధము. 3. ఉభయరూపము. 4. ఉభయవర్జితము.
వ్యతిరేకము 7 తెఱఁగులు:- 1. ఏకవ్యతి రేకము. 2. ఉభయవ్య. 3. సదృశవ్య. 4. అసదృశవ్య. 5. సజాతివ్య. 6. వ్యక్తివ్య. 7. రూపకప్రకృతి.
[భామహుఁడు వ్యతిరేకమును బేర్కొనియెను గాని తద్భేదములఁ జెప్పలేదు. దండి వ్యతిరేకభేదముల నేడింటిని నుడివెను: 1. ఏకవ్యతిరేకము. 2. ఉభయవ్య. 3. సశ్లేషవ్య. 4 సాక్షేపవ్య. 5. సహేతువ్య. 6. సాదృశ్యవ్య. 7. సజాతివ్యతిరేకము. ఇందు 1, 2, 6, 7 లను రసార్ణవకర్త గ్రహించెను. దండి సాదృశ్యవ్యతిరేకభేదములఁగూడఁ గొన్నిటిని బేర్కొనెను.]
అభావాలంకారము 4 తెఱఁగులు:- 1. ప్రాగభావము. 2. ప్రధ్వంసాభావము. 3. అత్యంతాభావము. 4. కల్పితాభావము. ఇట సంసర్గాభావమే పేర్కొనఁబడినది కాని యన్యోన్యాభావము చెప్పఁబడలేదు. కొందఱు నైయాయికు లీసంసర్గాభావమును బైనాలుగువిధములుగా విభజింతురు. కాని కొందఱు సంసర్గాభావము త్రివిధ మని పైవానిలో మొదటి మూటిని బేర్కొందురు. కల్పితాభావమునకు సామయికాభావ మని నామాంతరము.
ఆగమాలంకారము 4 విధములు:- 1. ధర్మము. 2. అర్థము. 3. కామము. 4. మోక్షము. ధర్మోపార్జనము ప్రవృత్తినివృత్తులచే నగును.
అర్థము 3 తెగలు:- 1. పిత్ర్యము. 2. స్వము. 3. సంచితము.
పిమ్మట నర్థశాస్త్రగ్రంథములు, నర్థశాస్త్రమునందలి దశస్కంధములు పేర్కొనఁబడినవి. 5 వ పరిచ్ఛేదము. [శృంగారవ్యక్తి]
రసవిచారకమును మనకృతికి 'రసార్ణవ' మనుపేరును సార్థకము చేయునదియు నగు నీపరిచ్ఛేదము బహువిపులముగా నుండియుండును. కాని మనకు 2 పుటలగ్రంథము మాత్రమే లభించినది. ఈ ప్రకరణమునకు 'శృంగారవ్యక్తి' యనుపే రీక్రిందిశ్లోకమునుబట్టి కలిగినది:
శ్లో. | 'ఏ(వం) (రత్యా)దయో భావాః శృఙ్గారవ్యక్తిహేతవః | |
— రసార్ణవ. 5. 17.
ఈశ్లోకము భోజుని 'శృంగారప్రకాశము'న 14 వ ప్రకాశమునందలి యుపసంహారశ్లోకములలో మొదటిది. ఈప్రకాశమునందలి కడపటి యీరెండుశ్లోకములను గూడ ప్రకాశవరుఁడు గ్రహించెను.
శ్లో. | 'జన్మానుబన్ధాతిశయసమ్పర్కానుగమా నితి | |
శ్లో. | య దపి చ గదితం ప్రకర్షగామీ | |
—రసార్ణవ, 5. 18-19.
శృంగారప్రకాశము [13 ప్రకాశము] న విస్తరింపఁబడిన భావముల వివిధావస్థలు — భావోదయము, వికాసము మొదలగునవి — 18 వ శ్లోకమున సూచింపఁబడెను. తరువాతిశ్లోకమున నూతన మగు భోజుని రససిద్ధాంతము కొంతవఱకు సంగ్రహముగాఁ జెప్పఁబడెను. ఈసిద్దాంత మేమన — అభిమానము, శృంగారము నను నామాంతరములు గల 'అహంకారము'నకే రసనామ ముచితము. రత్యాదులగు 49 భావములు ప్రకర్షావస్థ నందినను భావనావస్థయం దుండుటచే నవి రస మనఁ జెల్లవు. రత్యాదిప్రకర్షయే రస మనునది ప్రాచీనసిద్దాంతము. ప్రకర్షయైనను భావమే యని భోజునిమతము. ప్రకర్షావస్థయందున్న యీభావము లన్నియు మనలో ననవరతమును బ్రకాశించునహంకారదీపికను బ్రజ్వలింపఁజేయును ['సప్తర్చిషం ద్యుతిచయా ఇవ వర్ధయన్తి']. ఈయహంకారమే మన మనుభవించునది, విషయాంతరముల ననుభవించుటకు సాధనభూత మైనది. కావున 'అహంకారశృంగారాభిమాన' మొకటియే రసము. 'సరస్వతీకంఠాభరణము'నఁ గూడ రసప్రకరణము మొదట [5 పరి.] నీతని సిద్ధాంత మిట్లు సూత్రప్రాయముగా నొసఁగఁబడెను:
| 'రసో౽భిమానో౽హఙ్కారః శృఙ్గార ఇతి గీయతే.' | |
ఈనవీనమతము నావిష్కరించిన పిమ్మట భోజుఁడు ప్రాచీనాలంకారికులు చెప్పిన 'శృంగారము' [స్త్రీపురుషప్రేమ] రతియను భావముయొక ప్రకర్షావస్థయే యని నుడివియున్నాఁడు. ఈరతి 'అహంకారశృంగార'కల్పకముయొక్క ప్రథమముఁ బ్రధానము నగునంకురము. 'శృంగారప్రకాశము' [11ప్రకాశ] న నీరతినే 'సకలభావమూర్థాభిషిక్త' మని యీతఁడు చెప్పియున్నాఁడు. రతిప్రపంచక మగు 13 వ ప్రకాశము తుదిని—
1. శ్లో. | 'సైష భావో రతి ర్నామ.' | |
2. శ్లో. | ‘భావాన్తరేభ్యః సర్వేభ్యః' | |
3. శ్లో. | 'నిసర్గసంసర్గసుఖైః ప్రభేదైః.' | |
అనునీశ్లోకములలో రతివిచారము నుపసంహరించెను. ఈశ్లోకములు మూఁడును రసార్ణవమున స్వీకరింపఁబడినవి. [5 పరి. 12-14]
'రసార్ణవము'న నీప్రకరణమున 'శృంగారప్రకాశము' సారము- అందుఁ బ్రధానముగా 11, 12, 13 ప్రకాశముల సారము-సంగ్రహింపఁబడి యుండును, రసార్ణవమునఁ బంచమప్రకరణము—
| 'ఉక్తః సో౽యం విభావానుభావసఞ్చారిసఙ్కరః | |
అని ప్రారంభింపఁబడెను. దీనినిబట్టి మొదటఁ జాలభాగ ముత్సన్నమైనట్లు తెలియుచున్నది. ఇటఁ బేర్కొనఁబడిన చతుర్విధశృంగారములును భోజుఁడు చెప్పిన ధర్మార్థకామమోక్షశృంగారములే. శ్లోకాదిని 'ఉక్తః' అని చెప్పఁబడుటచే లుప్త మగుభాగమున 'శృంగారప్రకాశము' నందలి 11, 13, 14, 18-21 ప్రకాశములలో వివరింపఁబడిన భావములయొక్క విభావములు మొదలగునంశములు సమాలోచింపఁబడియుండును.
రాఘవన్ పండితులు చెప్పినట్లు భోజునికిఁ బిమ్మట వచ్చినయాలంకారికులలో విలక్షణ మగుభోజుని రససిద్దాంతమును సరిగా బోధపఱచుకొనినవారు బహుస్వల్పము. ప్రకాశవర్షుఁడు, 'సరస్వతీకంఠాభరణము'నకు వ్యాఖ్యలు వ్రాసిన రత్నేశ్వర - జగద్ధర - భట్టనరసింహు లను నుద్ధతప్రకాండు లేతన్మతమును బాగుగ నవగాహనము చేసికొనఁగలిగిరి. అందువలన ప్రకాశవర్షునికృతిలోఁ బ్రధానమగురసప్రకరణము చాలభాగ ముత్సన్న మగుట శోచనీయము.
7. భామహుఁడు - ప్రకాశవర్షుఁడు
ప్రకాశవర్షున కుపజీవ్యు లగు ప్రాచీనాలంకారికులలో భామహుఁ డొకఁడు. భామహుని కావ్యాలంకారమునుండి యీతఁడు కొన్నిశ్లోకములు యథాస్థితములుగాఁ బరిగ్రహించియున్నాఁడు. మఱికొన్ని భామహుని శ్లోకములకు నీతనిశ్లోకములకు విశేషసామ్యము పొడకట్టుచున్నది. 4 వ పరిచ్ఛేదమున (37 శ్లో.) మహ భామహుని దని యొకశ్లోకము నుదాహరించెను. ఇది మనకు లభించిన భామహగ్రంథమునఁ గానరాదు. అం దీశ్లోకము లోపించెనో లేక ప్ర. వ. పొరపాటున మఱియొకకవిరచన నీతని కంటఁగట్టెనో చెప్పఁజాలము. రసార్ణవమున [4 పరి. 41-42 శ్లో. 'ప్రతిబింబమపి', 'రూపం శంసన్తి'] 'రెండుశ్లోకములలో భామహుని మతము ప్రమాణీకరించుకొనఁబడెను. ఈశ్లోకములు గూడ భామహునికృతిలో మృగ్యములు. దీని నాధారముగాఁ గొని వేంకటరామశర్మాగారు మహాభామహుఁ డనునాలంకారికుఁ డొకఁడు గలఁ డనియు, నతఁడు భామహునికంటె భిన్నుఁ డనియుఁ బ్రతిపాదించిరి. కాని యీవాదము సమంజసము కాదని తరువాత నిరూపింపఁబడును. ఇక భామహప్రకాశవర్షులరచనాసామ్యములఁ జూడఁదగును— (అ) ఈక్రిందిశ్లోకము లిరువురగ్రంథములలోను గలవు:
| 'సముదాయార్థశూన్యం య త్త దపార్థం ప్రచక్షతే.' | |
—భామహ, IV. పరి. 8 శ్లో, ప్రకాశ. 1 పరి. 31.
2. శ్లో. | 'క్వచి దాశ్రయసౌన్దర్యా ద్ధత్తే శోభా మసాధ్వపి | |
శ్లో. | 'సన్నివేశవి శషాత్తు దురుక్త మపి శోభతే | |
—భామహ. I. 53-54. ప్రకాశ. 2. 50-51.
౩. శ్లో. | 'సర్వం సర్వేణ సారూప్యం నాస్తి భావస్య కస్యచిత్ | |
శ్లో. | అఖణ్డమణ్డలః క్వేన్దుః క్వ కాన్తానన మద్యుతి | |
—భామహ. II. 43-44. ప్రకాశ. 2. 64-65.
4. శ్లో. | 'ఏతద్గ్రాహ్యం సురభికుసుమం మాల్య మేత న్నిధేయమ్ | |
—భామహ. I. 59. ప్రకాశ. 3. 97.
(ఆ) ఉభయులకు విశేషసాదృశ్యముగల రచనలు:
1. | 'య దభిన్నార్థ మన్యోన్యం త దేకార్థం ప్రచక్షతే.' | |
— భామహ, IV. 12.
| 'ఉక్తాభిన్నార్ధ మేకార్థం వ్యాహరన్తి విశారదాః' | |
— ప్రకాశ. 1. 32.
2. | ‘యథోపదేశం క్రమశో నిర్దేశో౽త్ర క్రమో మతః | |
—భామహ. IV. 20.
| 'అపక్రమం తు తద్యత్ర పౌర్వాపర్యవిపర్యయః ' | |
—ప్రకాశ. 1. 33.
3. | 'అవిద్వదఙ్గనాబాలప్రతీతార్థం ప్రసాదవత్' | |
—భామహ. II. 3.
| ‘ప్రసిద్ధార్థపదన్యాసా త్ప్రసాద ఇతి కీర్తితః.' | |
—ప్రకాశ. 2. 7.
4. | 'న కాన్త మపి నిర్భూషం విభాతి వనితాననమ్.’ | |
—భామహ. I. 13.
| 'జ్ఞేయో౽లఙ్కారయోగో౽యం కామినీవపుషో యథా | |
—ప్రకాశ. 3. 2.
5. | 'వినయేన వినా కా శ్రీః కా నిశా శశినా వినా | |
—భామహ, I. 4.
| 'వినయేన వినా కా శ్రీః కానిశా శశినా వినా | |
—ప్రకాశ. 3. 80-81.
8. దండి - ప్రకాశవర్షుఁడు
ప్రకాశవర్షుని కుపజీవ్యగ్రంథములు భోజుని 'సరస్వతీకంఠాభరణ-శృంగారప్రకాశములు.' 'సరస్వతీకంఠాభరణము'న దండి 'కావ్యాదర్శము' నుండియు, భామహుని 'కావ్యాలంకారము' నుండియు శ్లోకములు చాలవఱకును, రాజశేఖరుని 'కావ్యమీమాంస' నుండి కొన్నిశ్లోకములును సంగ్రహింపఁబడినవి. భోజుని యీకృతి మనకవికి నొఱవడి యగుటచే దండి-భామహ-రాజశేఖరుల రచనలకు నీతనిరచనలకు విశేషసామ్యసాదృశ్యములు కానఁబడుటలో వింత లేదు. ప్రకృతము దండి-ప్రకాశవర్షులరచనాసామ్యముల నరయుదము.
(అ) ఈ క్రిందిభాగము లుభయులకృతులలోను గానవచ్చెడిని:—
1. | 'సముదాయార్థశూన్యం య త్త దపార్థం ప్రచక్షతే' | |
—దండి. III. 128; ప్రకాశ. 1. 31.
2. | 'ఓజ స్సమాసభూయస్త్వమ్' | |
—దండి. I. 80. ప్రకాశ. 2. 17.
3. | 'యత్రోద్వేగో న ధీమతాం.' | |
—దండి. II. 51. ప్రకాశ. 2. 62.
4. | 'అస్తి కాచి దవస్థా సా సాభిషఙ్గస్య చేతసః | |
—దండి. III. 133. ప్రకాశ. 2. 88.
5. | 'ఇహ శిష్టానుశిష్టానాం శిష్టానా మపి సర్వథా | |
—దండి. I. 3, 4. ప్రకాశ. 3. 67-68.
6. | 'అనుకమ్పా ద్యతిశయో యది కశ్చి ద్వివక్ష్యతే | |
—దండి. III. 137. ప్రకాశ. 2. 55-56.
7. | 'క్రీడా గోష్ఠీవినోదేషు తద్జ్ఞై రాకీర్ణమస్త్రణే | |
—దండి, III. 97. ప్రకాశ. 3. 28.
8. | 'న సంహితాం వివక్ష్యామీ త్యసన్ధానం పదేషు యత్ | |
—దండి. III. 159. ప్రకాశ. 2. 54-55.
(ఆ) దండి-ప్రకాశవర్షులకృతులలో విశేషసాదృశ్యముగల వాక్యములు.
1. | 'అవిశేషణ పూర్వోక్తం యది భూయో౽పి కీర్త్యతే | |
—దండి. III. 135.
| ఉక్తా భిన్నార్థ మేకార్ధం వ్యాహరన్తి విశారదాః' | |
—ప్రకాశ. 1. 32.
2. | 'లోకాతీత ఇవాత్యర్థ మధ్యారోప్య వివక్షితః | |
—దండి. II. 89.
| 'లోకాతీత ఇవార్థో యః సో౽తిమాత్ర ఇహేష్యతే.' | |
—ప్రకాశ. 1. 84.
3. | 'స్యా ద్వపుః సున్దర మపి శ్విత్రే ణైకేన దుర్భగమ్.' | |
—దండి, I. 7.
| 'న హి కుష్ఠాదిభి ర్దోషై రహితం కామినీవపుః | |
—ప్రకాశ. 2. 2.
గ్రంథగౌరవభీతిచే నిఁక దండివాక్యముల మాత్ర ముదాహరించి ప్రకాశవర్ణునివాక్యముల దిక్ప్రదర్శనముగ సూచించెదను.
4. | 'ప్రసాదవత్ ప్రసిద్ధార్థమ్.' | |
—దండి. I. 45.
| ‘ప్రసిద్ధార్థ.' | |
—ప్రకాశ 2. 7.
5. | 'సమం బన్ధే స్వవిషమం తే మృదుస్ఫుటమధ్యమాః | |
—దండి. I. 47.
| 'బద్ధోమృదు' | |
—ప్రకాశ. 2. 8.
6. | 'అనిష్ఠురాక్షరప్రాయం సుకుమార మీ హేష్యతే.' | |
—దండి I. 69.
| 'అకఠోరాక్షర' | |
—ప్రకాశ. 2. 9.
7. | ‘ఊర్జస్వి రూఢాహంకారమ్' | |
—దండి. II. 275.
| 'రూఢాహంకార తౌర్జిత్యమ్' | |
—ప్రకాశ. 2. 29.
8. | 'యత్నః సమృద్ధవిజ్ఞానహేతుకో౽పి కృతో యది | |
—దండి. III. 146.
| 'యత్నః సమ్బన్ధ' | |
—ప్రకాశ. 2. 53-54.
9. | 'శిథిలమ్ * * * | |
—దండి. I. 43-44.
| 'సుకుమారార్థ' | |
—ప్రకాశ. 2. 67.
10. | 'ఉన్మత్తమత్తబాలానా ముక్తే రన్యత్ర దుష్యతి.' | |
—దండి. III. 128.
| 'మత్తోన్మత్తాది.' | |
—ప్రకాశ. 2. 74.
11. | 'ఈదృశం సంశయా యైవ యది వా తు ప్రయుజ్యతే | |
—దండి. III. 141.
| 'సంశయా యైవ' | |
—ప్రకాశ. 2. 76-77.
12. | 'కాన్తం భవతి సర్వస్య లోకయాత్రానువర్తినః' | |
—దండి. I. 88.
| 'కాన్తం భవతి సర్వస్య లోకసీమానువర్తినః' | |
ప్రకాశ. 2. 79.
13. | 'తత్ర వైదర్భగౌడీయౌ వర్ణ్యేతే ప్రస్ఫుటాన్తరౌ.' | |
—దండి. I. 48.
| 'ఉచ్యన్తే రీతయస్తత్ర త థాపి ప్రస్ఫుటాన్తరాః' | |
—ప్రకాశ. 3. 17.
14. | 'కారకజ్ఞాపకౌ హేతూ తౌ చానేకవిధౌ యథా.' | |
—దండి. II. 235.
| 'అలఙ్కారతయోద్దిష్టం నివృత్తా వపి తత్సమమ్.' | |
—దండి. II. 237.
| నిర్వర్త్యేచ వికార్యేచ హేతుత్వం త దపేక్షయా | |
—దండి. II. 240-41.
| '* * * రమ్యాః జ్ఞాపక హేతవః | |
—దండి. II. 246.
| 'ప్రాగభావాదిరూపస్య హేతుత్వ మిహవస్తునః | |
—దండి. II. 252.
| 'దూరకార్య స్తత్సహజః కార్యానన్తరజస్తథా.' | |
—దండి. II. 258-59.
| 'ప్రవృత్తేర్వా * * * క్వా ప్యర్థాన్తరబాధితః.' | |
—ప్రకాశ. 4. 11–18.
15. | 'సౌక్ష్యా త్సూక్ష్మ ఇతి స్మృతః' | |
—దండి. II. 260.
| 'సూక్ష్మః సూక్ష్మగుణస్తు సః.' | |
—ప్రకాశ. 4. 14.
16. | 'కిఞ్చి దారభమాణస్య కార్యం దైవవశాత్ పునః | |
—దండి. II. 298.
| '** ప్రయత్నా ద్వా ** సమాహితమ్.' | |
—ప్రకాశ. 4. 18.
17. | 'ప్రసిద్ధహేతువ్యావృత్త్యా యత్కిఞచి త్కారణాన్తరమ్ | |
—దండి, II. 199.
| 'ప్రసిద్ధహేతు * * * విభావనా.' | |
—ప్రకాశ, 4. 19–20.
9. భోజుఁడు-ప్రకాశవర్షుఁడు
భోజుని 'సరస్వతీకంఠాభరణము'ను, 'శృంగారప్రకాశము'ను ప్రకాశవరుని కృతిదర్పణమునకుఁ గళాయి వంటివి. భోజుని యడుగులలోనే యడుగులు వేసి మనకవి గ్రంథరచనము చేసెను; కాని యీతఁడు గ్రంథమున నొకచోనైనను భోజుని స్మరించిన పాపమునఁ బోలేదు. భోజుని సరస్వతీకంఠాభరణమునకు 'రసార్ణవము' నిపానము వంటిది. 'శృంగారప్రకాశ'సారముగూడ నిం దిమిడి యున్న దనియు భోజునికృతికి ప్రకాశవర్షునిగ్రంథము సింహావలోకనమువంటి దనియుఁ జెప్పునొప్పును. ఇఁక మనకవి యుపజ్ఞ యేమన - భోజుని రచనముల వెడనెడ వ్యత్యస్తము చేయుట, యాతఁడు నుడివిన గుణదోషాదులలో నొండు రెండు వదలివేయుట, యాతఁడు చెప్పిన వాని కొకటిరెండు చేర్చుట యాతఁడు పెట్టినపేరును మార్చి మఱొకపదముచే నావిషయమునే చెప్పుట మొదలగునవి. ఇక వారిరువుర రచనాసామ్యములలోఁ గొన్నిటిని మాత్రము చూపి పిమ్మటఁ గొన్నివిషయముల సమాలోచ మొనరించెదను.
భోజుఁడు
I పదదోషములు: 16.
1. అసాధువు: ('శబ్దశాస్త్రవిరుద్ధం యత్.')
2. అప్రయుక్తము: ('కవిభి ర్నప్రయుక్తం యత్)
3. కష్టము: ('పదం శ్రుతే రసుఖదమ్.')
4. అనర్థకము: ('పాదపూరణమాత్రార్థమ్.')
5. అన్యార్థము: ('రూఢిచ్యుతం పదం యత్.')
6. అపుష్టార్థము: ('యత్తు తుచ్ఛాభిధేయం స్యాత్.')
7. అసమర్థము: (‘అసఙ్గతం పదం యత్.')
ప్రకాశవర్షుఁడు
I పదదోషములు: 14. క్రమమున నించుకవ్యత్యాసము గలదు.
1. ('శబ్దశాస్త్రవిరుద్ధం యత్.')
2. (‘సప్రయుక్తం కవీన్ద్రై ర్యత్)
3. (‘శ్రవణదుర్భగమ్.’)
4. ('పాదపూరణమాత్రం యత్.)
5. [ఈక్రింది 'యసమర్ధ'లక్షణము దీనికి సదృశముగా నున్నది.]
6. (‘వాచ్యతుచ్ఛతయా క్లిష్టమ్.')
7. (‘య ద్బద్ధం రూఢివర్త్మవ్యతిక్రమాత్.')—భోజుని 'అన్యార్థము' దీనికిఁ
దుల్యముగా నున్నది.
8. అప్రతీతము: (‘తదుద్దిష్టం, ప్రసిద్ధం శాస్త్ర ఏవ యత్.')
9. క్లిష్టము: (‘దూరే యస్యార్థసంవిత్తిః.')
10. గూఢార్థము:(‘అప్రసిద్ధార్థం ప్రయోగమ్.')
11. నేయార్థము: (‘స్వసంకేతప్రక్లుప్తార్థమ్.')
12. సందిగ్ధము: (‘నయత్పదం నిశ్చయకృత్')
13. విపరీతము: ('విరుద్ధార్థప్రకల్పనమ్.')
14. అప్రయోజకము: ('అవిశేషవిధాయకమ్.')
15. 'దేశ్యము: (‘అవ్యుత్పత్తిమత్పదమ్.')
16 గ్రామ్యము:i. అశ్లీలము (లేక) అసభ్యార్ధము
ii. అమంగళము.
iii. ఘృణావత్తు.
8. ('శాస్త్ర ఏవ ప్రయుక్తం యత్.')
9.(‘పారంపర్యేణచార్థస్యసూచకమ్.')
10. ('అప్రసిద్ధార్థసంబద్ధమ్.')
11. ('స్వయంకల్పితసంకేతమ్')
12. ('య తార్థాన్తరసమ్బన్ధః.')
13. [ప్రకాశవర్షుఁడు పేర్కొనలేదు.]
14. ('వివక్షితప్రమేయస్య నోపకారి.')
15. (‘దేశరూఢిగతం పదమ్.')
16. గ్రామ్యము: i. అసభ్యము.
ii. అమంగళము.
iii. ఘృణాకరము.
భోజుఁడు
II. వాక్యదోషములు: 16.
1. శబ్దహీనము: ('అపశబ్దవత్.')
2. క్రమభ్రష్టము: (‘అర్థః శాబ్దివా యత్ర న క్రమః.')
3. విసంధి: ('విసంహితో విరూపోవా యత్ర సన్ధిః.')
4. పునరుక్తిమత్తు: (‘పదం పదార్థశ్చాభిన్నౌ యత్ర.')
5. వ్యాకీర్ణము: ('మిథో యస్మిన్ విభక్తీనామసఙ్గతిః.')
6. సంకీర్ణము: ('వాక్యాసరపదై ర్మిశ్రమ్.')
7. అపదము: ('విభిన్నప్రకృతిస్థాది పదయుక్తి.')
8. వాక్యగర్భితము: ('వాక్యాన్రతసగర్భమ్ యత్.')
ప్రకాశవర్షుఁడు
వాక్యదోషములు: 14, కాని సరిగా నాలోచించిన 15 కానఁబడుచున్నవి. క్రమమున నించుక వ్యత్యాసము గానఁబడుచున్నది.
1. 'భిన్నభాషాపదావిద్ధమ్.’
2 'శబ్దార్థవ్యుత్క్రమో యత్ర'
8. 'విరుద్ధసిద్ధి నిః సన్ధి'
4. 'తాదృక్పదపదార్థానాం నిబన్ధే.'
5. 'అనేకపదసన్తానవ్యాహతస్మృతిభిఃపదై ర్యోజనా యత్ర.'
6. 'వాక్యాన్తరపదోన్మిశ్రమ్,'
7. * * *
8. [వాక్య]గర్భితము: ('వాక్యాన్తర సగర్భం యత్.')
9. భిన్నలింగము: ('యత్రోపమా భిన్నలిఙ్గా.')
10. భిన్నవచనము: (యద్భిన్న వచనోపమమ్')
11. న్యూనోపమ: ('న్యూన ముపమానవిశేషణైః.')
12. అధికోపమ: (‘అధికం యత్పునస్తైః స్యాత్.')
13.భగ్నఛందస్సు: (‘యచ్ఛన్దోభఙ్గవద్వచః.')
14. భగ్నయతి: ('అస్థానే విరతి ర్యస్య.')
15. అశరీరము: (‘క్రియాపదవిహీనం యత్.')
16. ఆర్తిమత్తు: (గుణానాం దృశ్యతే యత్ర శ్లేషాదీనాం విపర్యయః.')
సమాధి తప్పఁ దక్కిన 9 గుణములు విపర్యయమునందు
టనుబట్టి ఆర్తిమత్తు 9. విధములు.
9. 'అలిఙ్గత్వా దుపమానోపమేయయోః'.
10. 'యస్మిన్ వచనవైషమ్య ముపమానోమపమేయయోః.'
11. 'న్యూనై రుపమానవిశేషణైః.'
12. 'విశేషణాధికౌపమ్యమ్'.
13. భిన్నవృత్తము: (ఛన్దోలక్షణహీనం.')
2 విధములు: 'తద్వర్ణ-యతి-భేదేన ద్విధా'.
14 ఖంజము: ('క్రియావిరహితం వాక్యమ్'.)
15. శ్లేషాదిగుణహీనము-10 తెగలు
సమాధిగుణహీనముతో కలిపి.
III. వాక్యార్థదోషముల విధానము, వర్గీకరణములలో నుభయులకు నిదివఱకుఁ జూపినసామ్యముకంటె నధికసామ్యము గన్పట్టుచున్నది:-
భోజుఁడు
వాక్యార్థదోషములు: 16.
1. అపార్ధము: ['సముదాయార్థశూన్యం యద్వచః.']
2. వ్యర్థము:[‘గతార్థం యత్, యచ్చ స్యా న్నిష్ప్రయోజనమ్.']
3. ఏకార్ధము: ('ఉక్త్యభిన్నార్థమ్.']
4. ససంశయము : ('సందిగ్ధార్థమ్.')
ప్రకాశవర్షుఁడు
వాక్యార్థదోషములు: 16.
1. 'సముదాయార్థశూన్య౦ యత్'.
2. 'యదప్రయోజనం (కం ?) యచ్చ గతార్థమ్.'
8. 'ఉక్త్యభిన్నార్థమ్.' (‘ఉక్తాభిన్నార్థమ్' – సరి కాదు.)
4. 'యత్రార్ధస్య న నిశ్చయః'
5. అపక్రమము: ['వాక్యం యత్తు క్రమభ్రష్టమ్.')
6. ఖిన్నము: ['జాత్యాద్యుక్తావనిర్వ్యూఢమ్.')
7. అతిమాత్రము: ['యత్ సర్వలోకాతీతార్థమ్.']
8. పరుషము: ['యత్తుక్రూరార్థమత్యర్థమ్.']
9. విరసము: ['అప్రస్తుతరసంయత్.']
10. హీనోపమ: ['హీనం యత్రోపమానం స్యాత్.']
11. అధికోపమ: ('తదేవయస్మిన్నధికమ్.']
12. అసదృశోపమ: ['యత్త్వతుల్యోపమానమ్.']
13. అప్రసిద్ధోపమ: ['అప్రసిద్ధోపమానం యత్.']
14. నిరలంకారము: ['యదలఙ్కారహీనమ్.']
15. అశ్లీలము: ['అశ్లీలార్థ ప్రతీతికృత్.']
16 విరుద్ధము: 3 విధములు.
1. ప్రత్యక్షవిరుద్ధము.
2. అనుమానవిరుద్ధము
3. ఆగమవిరుద్ధము
ఈమూటిలో నొక్కొకటి 3 తెఱఁగులు; మొత్తము 9.
5. 'పౌర్వాపర్యావిపర్యయః.'
6. 'జాత్యాద్యుక్తావనిర్వ్యూఢమ్.'
7. 'లోకాతీత ఇవార్థో యః.'
8. 'అతిక్రూరస్తు వాక్యార్థః.'
9. 'ఆప్రాకృతరసమ్.'
10. 'హీనం యత్రోపమానం స్యాత్.'
11. 'యత్రోపమాన మధికమ్.'
12. విసదృశోపమ: 'అతుల్య ముపమానం చేత్.'
13. 'అప్రసిద్ధోపమానం చేత్'.
14. 'అలఙ్కారవివర్జితమ్.'
15. 'యదసభ్యార్థసమృద్ధమ్.'
16. విరుద్ధము: 3 విధములు
1. ప్రత్యక్షము.
2. అనుమానము.
3. ఆగమము.
ఈమూటిలో నొక్కొకటి మరల 3 విధములు. మొత్తము 9.
దోషములు, తల్లక్షణములు కేవలము భోజునికృతియందే కాక తత్పూర్వాలంకారికులకృతులలోను గానఁబడుచున్నవి; కావున దోషలక్షణములు, తద్రచనాక్రమమును బ్రాచీనులచే స్థిరరూప మొసఁగఁబడినవి. అందుచే శబ్దసాదృశ్యము రచనాసామ్యము దోషప్రకరణమునఁ దప్పవు. కేవలము నీసామ్యములఁ బట్టియే యొకగ్రంథకర్త మఱకనికృతి నుపజీవ్యముగాఁ గొనెనను సిద్ధాంతము సమజంసము కాదని కొందఱువాదింపవచ్చును. కాని గుణప్రకరణమునందలి సామ్యములం జూచుచో భోజునికృతి యెంతవఱకు ప్రకాశవర్షునకు మూలమో తెలియఁగలదు. దండి, తదనుయాయుల ప్రభావమును, అగ్నిపురాణమునందలి యలంకారప్రకరణములందలి మతప్రభావమును భోజుని యభిప్రాయములపైఁ జాలవఱకు గన్పట్టినను, నీతనికృతియందుఁ బేర్కొనఁబడిన 'గుణముల' నామములును గుణనిర్ణయపద్ధతియు విలక్షణములై, తత్పూర్వకృతులలోనివాని కనేకవిషయములు భిన్నములై చూపట్టుచున్నవి. ఇక్కడకు ప్రకాశవర్షుఁడు భోజుని విశేషముగా ననుకరించెను.
1. శ్లేష. 2. ప్రసాదము. 3. మాధుర్యము. 4. సమత. 5. సౌకుమార్యము. 6. అర్థవ్యక్తి. 7. ఓజస్సు. 8. కాంతి. 9 ఉదారత. 10. సమాధి - అని వామనునిచేఁ బేర్కొనఁబడిన శబ్దార్థగుణములు పదింటికి భోజుఁడు- 11. ఔర్జిత్యము. 12. ఉదాత్తత. 13. ప్రేయస్సు. 14. సుశబ్దత. 15. సౌక్ష్యము. 16. గాంభీర్యము. 17. సంక్షేపము. 18. విస్తరము. 19. సమ్మితత్వము. 20. భావికత్వము. 21. రీతి. 22. ఉక్తి. 23. గతి. 24. ప్రౌఢి -
అను 14 గుణములఁ జేర్చి మొత్తము గుణములు 24 అనెను. ఈతనివలె నింతవిలక్షణముగ నిన్నిగుణములను మఱి యేయాలంకారికుఁడును జెప్పియుండలేదు.
ప్రకాశవర్షుఁడుమాత్ర మిందలి గతి- ప్రౌఢి అనువానిని వదలి తక్షిన 22 గుణముల నామముల లక్షణములను భోజునికృతినుండి సంగ్రహించెను.
భోజుఁడు
IV శబ్దగుణములు: 24.
1. శ్లేష: ('సుశ్లిష్టపదతా')
2. ప్రసాదము: (‘ప్రసిద్దార్థపదత్వమ్.')
3. సమత: ('యన్మృదుప్రస్ఫుటోన్మిశ్రవర్ణబన్ధ విధింప్రతి,
అవిషమ్యేణభణనమ్.')
ప్రకాశవర్షుఁడు
శబ్దగుణములు: 22.
1. 'యత్ర బన్ధో౾తి సంక్లిష్టః.'
2. 'ప్రసిద్ధార్థపదన్యాసః'
3. 'బద్ధోమృదుస్ఫుటోన్మిశ్రవర్ణజన్మా,
న సఙ్కరః.'
4. మాధుర్యము: ('యాపృథక్పదతావాక్యే')
5. సుకుమారత: (‘అనిష్ఠురాక్షరప్రాయమ్')
6. అర్థవ్యక్తి: ('యత్ర సమ్పూర్ణవాక్యత్వమ్')
7. కాంతి: ('యదుజ్జ్వలత్వం బన్ధస్య.')
8. ఔదార్యము: ('వికటాక్షరబద్ధత్వమ్.')
9. ఉదాత్తత: (‘శ్లాఘ్యైర్విశేషణైర్యోగః.')
10. ఓజస్సు: ('సమాసభూయస్త్వమ్.')
11. ఔర్జిత్యము: ('గాఢబద్ధతా.')
12. ప్రేయస్సు: ('ప్రియతరాఖ్యానం చాటూకా')
18. సుశబ్దత: ('వ్యుత్పత్తిః సుప్తిఙాంయా.')
14. సమాధి: (‘అన్యధర్మాణాం యదన్యత్రాధిరోపణమ్.')
15. సౌక్ష్మ్యము: ('అన్తఃసంజల్పరూపత్వం శబ్దానామ్.”)
16. గాంభీర్యము: ('ధ్వనిమత్తా.')
17. విస్తరము: ('వ్యాసేనోక్తిః.')
18. సంక్షేపము: (‘సమాసేనాభిధానమ్.')
19. సమ్మితత్వము: (‘యావదర్థపదత్యమ్.')
20. భావికత్వము: ('భావతో వాక్యవృత్తిర్యా.')
21. గతి: ('క్రమో యఃస్యా దరోహావరోహయోః.')
22. రీతి: (‘ఉపక్రమస్యనిర్వాహః.')
23. ఉక్తి: (‘విశిష్టా భణితి ర్యా స్యాత్.')
24. ప్రౌఢి: ('ఉక్తేః ప్రౌఢః పరీపాకః.')
4. 'అర్థోచితవచో బన్ధః.'
5. 'అకఠోరాక్షరన్యాసః.'
6. 'సమ్పూర్ణవాక్యాతా.'
7. 'బన్ధస్యోజ్జ్వలతా.'
[ఇట గ్రంథపాతము గలదు.]
8. 'బన్ధవైకట్యమ్.’
9. 'శ్లాఘ్యైర్విశేషణైర్యుక్తమ్.'
10. 'సమాసభూయస్త్వమ్.'
11. 'బన్దగాఢత్వమ్.'
12. 'ప్రేయార్థపదవిన్యాసః.'
13. 'యాసుబన్తతిఙన్తానాంవ్యుత్పత్తిః.'
14. 'అన్యధర్మస్యభవేదన్యత్రరోపణమ్.'
15. 'శబ్దానా మన్తఃసంజల్పరూపతా.'
16. 'ధ్వనిమత్తా.'
17. 'వ్యస్తమ్.’
18. 'అభిధానం సమాసేన.'
19. 'యావదర్థపదత్వమ్.'
20. 'భావాభివ్యఞ్జికా వాణీ.'
21. * * * *
22. 'ఉపక్రమస్యనిర్వాహః.'
23. 'అర్థాన్తరేణ చార్థస్య భణనాత్.'[26]
24. * * * * *
10. పిన్నుడి
శార్ఙ్గధరుని 'పద్ధతి' లో ప్రకాశవర్షునిశ్లోకములు రెం డుదాహరింపఁబడి యున్నవి [383; 783 శ్లో]. ఈశ్లోకములు వల్లభదేవుని 'సుభాషితావళి' లోఁగూడ [484; 834]. ప్రకాశవర్షున కారోపింపఁబడియున్నవి. ఇవికాక మఱి 27 శ్లోకములు ప్రకాశవర్షకృతములుగా 'సుభాషితావళి'లో లభించుచున్నవి. బాగుగా విమర్శింవఁగా నీసుభాషితగ్రంథములలోఁ బేర్కొనఁబడిన ప్రకాశవర్షుఁడు ప్రాచీనవ్యాఖ్యాతయగు ప్రకాశవర్షుఁడు కాఁడనియు, 'రసార్ణవ'కర్తయగు మనప్రకాశవర్షుఁడే యనియు ధృఢప్రత్యయము కలుగుచున్నది. ఏమన నాలంకారికులైనవారు కవులుగాఁ గూడఁ గన్నట్టుచున్నారుగాని, సామాన్యముగా వ్యాఖ్యాతలైనవారు కవినామప్రసిద్ధి నొందుటలేదు. ఉత్తమసాహిత్యకృతికర్తలగు దండి, ఉద్భటుఁడు, రాజశేఖరుఁడు, భోజుఁడు, క్షేమేంద్రుఁడు, విశ్వనాథకవిరాజు, విద్యానాథుఁడు, ధర్మసూరి, జగన్నాథపండితరాయలు మొదలగుమహనీయు లందరును గవిచంద్రులుగాఁ గూడఁ బ్రఖ్యాతులు. మల్లినాథాదు లేవో కొన్నిముక్తకశ్లోకము లల్లినను వీరికి వ్యాఖ్యాతలనియే కాని కవులని ప్రసిద్ధి కలుగలేదు. కావునఁ బైసుభాషితకోశములలోఁ బేర్కొనఁబడినకవి 'రసార్ణవ'కర్తయే యని నిశ్చయింపవచ్చును. మఱియు క్రీ. శ. 1200 కంటె నవీనము కాదని నిశ్చయింపఁబడిన 'కవీంద్రవచనసముచ్చయము’న ప్రకాశవర్షునిశ్లోకము లేమియుఁ గానరావు. ఇందువలనఁ గూడ సుభాషితావళిలో నుల్లేఖింపఁబడినకవి మనకవి యనియే నిర్ణయింపనగును. ఈసిద్ధాంతము సరియగుచో ప్రకాశవర్షునికాలమున కుత్తరావధి మనకు లభించుచున్నది. ధర్మదాససూరి ‘విదగ్ధముఖమండనము'ను బేర్కొనుటచే 'రసా ర్ణవ'కారుఁడు క్రీ. 1210 కంటె న వీరుఁడని కాలనిర్ణయప్రకరణమునఁ జెప్పఁబడినది. 'శార్ఙ్గధరపద్ధతి' రచనాకాలము క్రీ. 1363. ఇది ‘సుభాషితావళి'కంటెఁ బ్రాచీనము. కావున నిం దుదాహరింపఁబడిన ప్రకాశవర్షుఁడు క్రీ. 1363 కంటెఁ బ్రాచీనుఁడని చెప్పవచ్చును. అనఁగా 1210-1363 నడుమ నీతఁడు జీవించియుండు ననుట సరియని తోఁచెడిని.
————————
అనుబంధము
లోపపూరణములు - పాఠభేదములు
1. పరిచ్ఛేదము.
అచ్చుప్రతి
3. శ్లో. దో++షమితి.
6. తచ్చ + + దనర్థకమ్.
7. శాస్త్రస్ +++ యుక్తం.
10. దేశ్య+థవా(?)యన్న్యస్తం.
18. భిన్నలిఙ్గమలిఙ్గత్వాత్.
27. + + శ్శబ్దార్థయోః.
34. జాత్యాద్యుక్తా +++ఢం.
42. తద్యత్ర్ +++న.
43. యద్య (భ?)నో++
సవరణలు
దేశ్యంగ్రామ్యమితి. (స. క. I. 6.4పు.)
తదేవస్యా (?) దనర్థకమ్.
శాస్త్రఏవప్రయుక్తం. (స.క. I. 10.9. పు.)
తద్దేశ్యమితినిర్దిష్టం యదవ్యుత్పత్తిమత్ పదమ్ (స. క. I. 14. 13.పు.)
భిన్నలిజ్ఞ మలిఙ్గం యత్ (?)
పాకఃశబ్దార్థయోః (స. క. 61 పు.)
జాత్యాద్యుక్తావనిర్వ్యూఢం (స. క.94 పు.)
త ద్యత్ప్రదేశేన (?)
యద్యత్ర నోచితమ్ (?)
2 పరిచ్ఛేదము.
1. శాస్త్రార్థ + + లాలోకః
2. దోషై రహితం.
6. ఏష++
10. బాధ్యన్తే.
12. యోగినామ్.
15. బన్ధస్యో +++కాన్తిః.
17. వ్యాస++చ.
శాస్త్రార్థకుశలో లోకః (?)
దోషైస్సహితం (?)
ఏష ప్రోక్తో (?)
బధ్యన్తే (?)
యోగినమ్ (?)
బన్ధస్యోజ్జ్వలతా కాన్తిః (స. క. I. 69.48 పు)
వ్యాస ఏవ చ (?)
18. ప్రేయార్థ.
19. సం+++జః.
24. క్రియాక్రమమ్.
27. యథా న ( ఈపాదమంతయు)
తథా+++ణ.
31. సందిగ్ధం ... ... [ణః].
34. +++
35. శివలింగాదిశ+++స్యా.
39. ఘృ+++
41. ++వశ.
ఈశ్లోకమునకుఁ బిమ్మట.
44. విచక్ష్యామీ.
45. నప్రగృహ్యా++కమ్.
46. కృతిః
47. సంయోగాదే+++
48. కృతా++
50. నదో.................
61. ................విదుర్బుధాః.
ప్రేయోర్థ (i)
సంయోగ మోజః (?)
క్రియాత్మకమ్ (?)
తథాన (స. క. I. 4. 4 పు.)
తథానుకరణే (?)
సందిగ్ధం తు ప్రకరణాద్విశేషావగమో యది (స. క. I. 101.95. పు.)
సంవీతం (స. క. I. 105. 98 పు.)
శివలింగాది సంస్థానే కస్యా (స. క.84 పు.)
ధృ+++మ్
సన్నివేశ (స. క. I. 107. 103 పు.)
మృణార్థం స్మృతి హే + + పూర్వవద్గదితా గతిః.
వివక్షామీ. (స. క. I. 114. 107పు.)
నప్రగృహ్యాదిహేతుకమ్. (స. క. I.114. 107 పు.)
క్రియా (స. క. I. 115.107 పు.)
సంయోగాదే రగౌరవమ్ (స. క. I.123. 120 పు.)
కృతానచేత్ (స. క. I. 121 పు.)
నదోషాయ వాకోవాక్యవిదోవిదుః (స. క. I. 117. 109 పు.)
ద్గర్భితం తద్విదు ర్బుధాః.
వాక్యాన్తరసగర్భం యద్వాక్యంతద్వాక్యగర్భితమ్.
(స. క. I. 119.113 పు.)
62. +++భిన్న.
న భిన్నవచనే.
64. ++సర్వేణ.
71. హాస్యాదా++త్పన్న,
77. అ(థేద) మపి.
82. దృశౌపమ్యా.
85. విరోధే.
90. +++యో.
91. నదో+++
న దోషో భిన్న.
స భిన్న వచనో.
సర్వం సర్వేణ (స. క. I. 109 పు. )
హాస్యాదా వవ్యుత్పన్న (?)
అపక్రమో౽పి.
దృశౌపమ్య వ్య.
విరోధో.
ప్రత్యవాయో.
నదోషో రత్య.
3. పరిచ్ఛేదము.
3. ++సున్దరస్యాపి.
15. స్రాకృతా.
22. సమస్త++++
24. సంబన్ధ.
29. తత్తాదృ.
32. భరతైః
37. మిశ్రేతి తం.
61. ++++త్తు
62. +++తకమ్.
63. ++ భ్యాసభవం.
75. తం వినా.
90. నా++తేషు.
94. +++గూర్జరాః.
95. గౌపః.
గాథాం++స్తు.
97. ద్వితీయచరణము:
త+++భిధానమ్.
నిసర్గసున్దరస్యాపి.
ప్రాకృతా.
సమస్తరీతిసంకీర్ణా (స.క.II.38. 157.)
సంబద్ధ
తాం తాదృ.
పురుష.
మిశ్రేతి తాం.
ఏకరూపా తు (స.క.II. 58. 197పు.)
తవ్యపేతకమ్ (స. క. 187 పు.)
అర్థాభ్యాసభవం (స. క. 187 పు)
తాం వినా.
నాభిజాతేషు (స.క. II. 8. 142 పు.)
నాన్యేనగుర్జరాః(స.క.II.13;142పు.)
గౌడః.
గాథా మన్యావాస్తు
ధత్తే శోభాం విరచిత మిదం స్థాన మస్యైతదస్య. (భామహ. 1. 59.)
తత్తదేవాభిధానమ్ (భామహ.)
4. పరిచ్ఛేదము.
5. నానావస్తుషు.
రూపాణి+++
6. మి++
7. జహామో నమిసీ వక్తి.
మాశ్రయే హేతుమితి త+ద.
8. మథ (చ) +
9. వి++స్త్రీ
10. దేశ కాలకలాశక్తి ++ నాని.
14. పత్ర. బాధితః.
16. ++++++హేతుః.
17. ++రస్య.
18. అ+++
20. స్వాద్య++++
37. విమిశ్రా+++++
39. సంశయా+++తు
40. స్మ++
41. ర్నచార్థాన్తరతః స్మృతే.
నానావస్థాసు (స.క. III. 4. 312 పు.)
రూపాణి వస్తునః. (స. క. 226 పు.)
మియతా (స. క. III. 5. 312 పు.)
జాయమానప్రియం వక్తి (స. క. III.5. 312 పు.)
మాశ్రయో హేతు రితి తద్భేద. (స.క. III. 6. 312 పు.)
మ ప్యవస్థానం (స. క. III. 7.313 పు.)
విముగ్ధస్త్రీ (స. క. III. 7. 818.పు.)
దేశః కాలశ్చ శక్తిశ్చ సాధనాని. (స. క.III. 8. 313 పు.)
పాత్ర. బోధితః
క్రియాయాః కారణం హేతుః. (స. క.III. 12. 320. పు.)
అసారస్య (?)
అప్రయత్నాత్ (స. క. 307 పు.)
వా స్యా ద్వత్ర సా స్యాత్. (స. క.III. 9. 318 పు.)
విమిశ్రాం కావ్యకోవిదాః (స. క. 297 పు.)
సంశయే నిర్ణయేన్తః (స. క. 334పు)
ప్రయత్నాత్ (స. క. 320 పు.)
ర్న చా స్వార్థానరం స్మృతేః. (స. క. 320 పు.)
47. కారణైరపి:
48. +++ప్యు.
66. సమాధిభి.
74. 'క్వచిత్' – అనుపాదమునకుఁ బిమ్మట:
90. 'యత్ర ' అను పాదమునకుఁ దరువాత:
93. లిఙ్గినః.
97. తుది గద్యము- 'ఇది’
ఈశ్లోకము 'మాలాభ్రాన్తేః' అను (45-శ్లో.)
పాదమునకుఁ బిమ్మటఁ గలదు.
కమప్యు.
సామాదిభి.
'కస్మిన్నపి హి కో౽ప్యర్థః కాలేయేనోపయుజ్యతే,
తేన మన్యామహే కాల ముపయోగనిబన్ధనమ్.'
'+++త(?) ఉపమానమితి+ (ప్రా?)జ్ఞైరలఙ్కారస్సకథ్యతే,
ఉపమానమితి ప్రోక్తో బుధై రభిహితో౽పి సః,
యతో౽భినయా +++సూచ్యం వస్తుప్రతీయతే'.
లిఙ్గినోః.
ఇతి.
5. పరిచ్ఛేదము.
12. కామ+++మాఙ్కురః.
కామకల్పద్రుమాఙ్కురః.విజయనగరమహారాజ-సంసృతకళాశాలయందలి 'రసార్ణవము'యొక్క వ్రాఁతప్రతిని బరిశీలించి పాఠభేదములు నా కొసఁగిన తత్కళాశాలాసంసృతసాహిత్యాలంకారోపన్యాసకులు, వేదాంతశిరోమణి శ్రీమత్పండిత వరవస్తు గోవిందాచార్యచరణులకు ధన్యవాదముల నర్పించుచున్నాను.
(ఈ. రా.)
శృంగారప్రకాశము: వ్రాఁతప్రతి చెన్నపురి 'ప్రాచ్యలిఖితగ్రంథాలయము'నఁ గలదు.
సరస్వతీకంఠాభరణము: నిర్ణయసాగరముద్రాలయము (బొంబాయి)న ముద్రితములగు ప్రథమ(1925) ద్వితీయ(1984) సంస్కరణము లుపయోగింపఁబడినవి. ఫైయాకరములయొద్ద పుటసంఖ్యమాత్ర ముండిన నది మొదటికూర్పుప్రతి యనియుఁ బరిచ్ఛేదశ్లోకసంఖ్యకూడ నుండిన నది రెండవకూర్పుప్రతి యనియు నెఱుఁగునది.
'సుభాషితావళి' లో ప్రకాశవర్షుని శ్లోకములు 29 లభించుచున్నవి. ఈకవియు రసార్ణవకారుఁడు నభిన్నులు కావునఁ దత్కవితారచనకుఁ గొన్నిశ్లోకముల నుదాహరించెదను.
1. శ్లో. | సహసిద్ధమిదం మహతాం ధనేష్వనాసా గుణేషు కృపణత్వమ్ | |
(248 శ్లో.)
2. శ్లో. | కృపణసమృద్ధీనామపి భోక్తారః సన్తి కేచి దతినిపుణాః | |
—సుభా. (484). శా. పద్ధతి. (383 శ్లో.)
3. శ్లో. | ధనబాహుల్య మహేతుః కో౽పి నిసర్గేణ ముక్తకరః | (522) |
4. శ్లో. | ఏతదత్ర పథికైకజీవితం, పశ్య శుష్యతి కథం మహత్సరః | |
—సుభా. (834). శా. ప. (783).
5. శ్లో. | కార్యజ్ఞః ప్రష్టవ్యో న పునర్మాన్యో మమప్రియో వేతి | (2876) |
6. శ్లో. | గుణవానస్మి విదేశః క ఇవ మమేత్యేష దురభిమానలవః | (2877) |
7. శ్లో. | స్తబ్దప్రకృతి ర్లోకే బహుమాన ముపైతి నాతిశయనమ్రః | (2678) |
ఈయూణ్ణి వేంకట వీరరాఘవాచార్యుఁడు, యం. ఏ.,
కాకినాడ,
ఆంధ్రగీర్వాణభాషోపన్యాసకుఁడు,
16-7-1937.
పిఠాపుర రాజకళాశాల.
——————
- ↑ Dr. Narendranath Law, M. A., B. L., Ph. D., P. R. S.
- ↑ 'Indian Historical Quarterly'— Vol. V. No. 1. March, 1929.
- ↑ Dr. S. K. De, M. A., D. Lit., Head of the Department of Samskrit & Bengali, Dacca University.
- ↑ 'Indian Historical Quarterly' Vol. V. No. 4. December, 1929. (Pp. 770-80).
- ↑ 'Bulletin of the School of Oriental Studies'-Vol. IV. Part ii, P. 283.
- ↑ 'Journal of Oriental Research' Vol. VIII. Part 3. Pp. 267–76 (1931).
- ↑ 'The Sarasvataloka' Kirana I (Supplement): 'సంస్కృతకవిపరిచయః -మహాకవి భారవిః’-నిబన్ధకః: సాహిత్యాచార్య శ్రీనందకిశోరశర్మా. [Benares, 1932.]
- ↑ 'Studies in the History of Sanskrit Poetics' Vol. I (1923) By Dr. S. K. De, M. A., D. Lit.
- ↑ 'History of Alamkara Literature' - By Prof. P. V. Kane, M. A., LL. M. (1923.)
- ↑ ‘History of Classical Sanskrit Literature' Second, revised and enlarged edition (now in course of publication)- By Dr. M. Krishnamachariar, M. A., M. L., PH. D., M. R. A. S.
- ↑ Edited in the 'Bombay Sanskrit & Prakrit Series' By Prof. Dr. P. Peterson. (1886).
- ↑ Edited : in the 'Bombay Sanskrit & Prakrit Series' By Dr. Peterson. (1888).
- ↑ సంస్కృతకవిపరిచయము - పు. 20.
- ↑
'ప్రకాశవర్షప్రభృతిప్రణీతా, వ్యాఖ్యా న పూర్ణా ఇతి భారవీయే
కావ్యే ప్రభూతాం విదధాతి టీకాం, శ్రీదేవరాజో విదుషాం నిదేశాత్.'
i. 'Triennial Catalogue of MSS.' of the Govt. Oriental Manuscripts Library-(Madras)-Vol. II. Part 1. C. (No. 1854 d)
ii. ‘Ibid—Vol. IV.' Part 1. (No 2912)
iii. Travancore' Catalogue'-P. 97. [Cantos I-IX & XV]. 1895. - ↑
'సన్తి ప్రకాశవర్షాది టీకా ఆపి సువిస్తరాః
తథాపి లఘుబోధార్థం గదసింహో౽కరో దిమామ్''సంస్కృతకవిపరిచయము- భారవి' - పు. 47
- ↑
(అ) ‘శ్రుత్వా ప్రకాశవర్షాత్తు వ్యాఖ్యాతం తావ దీదృశమ్
విశేషతస్తు నైవాస్తి బోధో౽త్రానుభవా దృతే.'— చతుర్థసర్గటీకా
(అ.) "అత్ర మహోపాధ్యాయః ప్రకాశవర్షః—
'షష్ఠీ సమాసో౽ప్యత్ర బహువ్రీహ్యర్థే౽న్తర్భవ త్యేవ. యోహి యస్య
సఖా తస్యాసావపి భవత్యేవ.' ఏవ మత్రాపి — 20 సర్గె 71 శ్లోకటీకా. - ↑ 'సంస్కృతకవిపరిచయము - భారవి' — పుట. 21.
- ↑ Introduction to 'Rasarnavalankara' — P. IV.
- ↑ 'సంసృతకవిపరిచయము' — 22-23 పు.
- ↑ Introduction to 'Rasarnava'—P. X.
- ↑
'భూరిభారభరాక్రాన్త బాధతి స్కన్ధ ఏష తే
న తథా బాధతే స్కన్ధో యథా బాధతి బాధతే. పూర్వార్ధం మృగయాయా గృహమాగచ్ఛతః శిబికారూఢస్య భోజరాజస్యోక్తిః ఉత్తరార్ధం చ రాజదర్శనార్థం ఛద్మశిబికావాహపండితస్య ప్రత్యుక్తిః'
[శా. ప. 562 శ్లో.]
- ↑ 'రసార్ణవము' 3 పరి. 56 శ్లో.
- ↑ S. K. De : 'Sanskrit Poetics' Vol. I. P. 297.
Dr. M. Krishnamachariar : 'History of Classical Sanskrit Literature.'- P. 766. - ↑ 'Journal of Oriental Research' Vol. VIII. Part 3. P. 268-9.
- ↑ Introduction to 'Rasarnava.'—P. XVI.
- ↑ [మొదటి రెండక్షరములు లోపింప శర్మగారు 'వినా' అని పూరించిరి, 'డే' పండితులు 'అర్ధ' అని పూర్తిచేసిరి.]