రమణి రో సముఖాన
కానడ రాగం- రూపక తాళం
మార్చు
పల్లవి:
రమణి రో సముఖాన - రాయ బార మేటికే
నిమిష మైన తాలాలేనె. నేనె వాని రమ్మందునే ||
చరణం 1:
కడు వేడుక వాని మేన - గంధమును బూసి ఆకు
మడుపు లిచ్చి తడ వేటికి - మాపటికి రమ్మందునె ||
చరణం 2:
కోరి వాని జేరి పన్నీరు జల్లి నన్ను
వేరు సేయగ రాదు వే వేగ రమ్మందునె ||
చరణం 3:
భూసురాంగి వేణు గోపాల ఇంత పంత మేల
దాసు రామ కవి సన్నుతి జేసె నిక రమ్మందునె ||