యెంకి పాటలు/నేను - తాను

నేను - తాను

తనవంత నారాజు తపసెయని - నేను
మనసులో యెంకితో మగతనము - తాను

బతుకంత నా రాజు పాటెయని - నేను
పాటలోయెంకితో పల్లదము - తాను

నిదరంత నారారాజు సీడెయని - నేను
కలలోనియెంకితో కిలకిలలు - తాను

జగమంత నారాజు సొగసెయని - నేను
అద్దమున యెంకితో విద్దెములు - తాను