యెంకి పాటలు/కలపోత
కలపోత
ఏతపసు నే చేయవలెనో
యెంకితో
ఎటుల నేనేక మనగలనో
శిశువులో మా జంట
చిన్నె లున్నాయంట
బాలలే మనకన్న
మేలు లే యుంటాది ! ఏ తపసు. . . . . .
తనరూపె నా మేన
తళుకు మన్నాదంట
నిలప జాలని సిరలు
నీకె తగునంటాది ఏ తపసు. . . . . .
నా కంట కనసీదు
నా కంఠ మననీదు
తను లేని కలయేని
కని నే మనగరాదు ఏ తపసు. - - - - -
తలపోసి మాకళలు
కలబోయవలెనంట
గౌరీశులకె బాగ
గరవ భంగము కాగ ఏ తపసు. - - - - -
రెoకి పోః (9) $5