యెంకి పాటలు/నాగరీకాలు
నాగరీకాలు
నా పేరె నా రాజు జపమన్న అపవాదు--
యూపుటక దేకాదు యెప్పటికిపోదు! నాపేరె...
వరస వారెవరైన
తరిచి తరిచడిగినా,
తప్పించు నాపేరు---
తలపడే, తెలపడే నాపేరే...
ఏకాంతమున నైన
'యెంకి' యని పిలువడే :
చెప్పన్ని పేర్లెట్టు
చెప్కుంటే రట్టు నాపేరే...
పక్షి పేరొకమారు
పండు వేరొకమారు
రాలేన ఒక తీరు
పూలేన పలుమారు నాపేరే...
ఏ నాటి వరములో
యూ నాగరీకాలు
పొటలో తస పరువే
బతుకులో బరువటే ? నాపేరే...
66 యెంకి పాటలు