మొల్ల రామాయణము/కిష్కింధా కాండము/రాముఁ డొక్క కోలతో వాలిని గూలనేయుట

రాముఁ డొక్క కోలతో వాలిని గూలనేయుట మార్చు

ఉ. సాలము పొంత నిల్చి రఘుసత్తముఁడ మ్మరివోసి, శబ్ద వి
న్మూలముగాఁగ విల్‌ దివిచి, ముష్టియుఁ దృష్టియు గూర్చి, గోత్రభృ
త్కూలము వజ్రపాత హతిఁ గూలు విధంబునఁ గూల నేసె న
వ్వాలిఁ, బ్రతాపశాలి, మృదు వందన శీలి, సురాలి మెచ్చఁగన్‌. 14
క. ఓలిమిఁ బొంచియు రఘుపతి
పాలిత కపిరాజ్యశాలిఁ బ్రస్ఫుట కీర్తిన్‌
శూలి పద భక్తి శీలిని
వాలి న్నొక కోల నేలఁ గూలఁగ నేసెన్‌. 15
వ. తదనంతరంబున, 16