మొల్ల రామాయణము/కిష్కింధా కాండము
కిష్కింధాకాండము
మార్చుక. పక్షీంద్ర వాహ! గిరిజా
త్ర్యక్ష మనోబ్జాత గేహ! యపహృత మోహా!
రాక్షస భీమా! ముని జన
సాక్షాత్కృత నైజ ధామ! జానకి రామా! 1
వ. శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి మహా మునీశ్వరున కెఱిం
గించిన తెఱం గెఱింగించెద నాకర్ణింపుము, 2