యదుకుల కాంభోజి రాగం - త్రిపుట తాళం

మార్చు


పల్లవి:

మూట లడిగితినా ముల్లె లడిగితినా
మూతి త్రిప్పెదవేమిరా ముద్దిడరా మోము తిప్పెద వేమి రా ||

అనుపల్లవి:

నోటి మాట కై న నోచుకోనైతినా
కూట ములా ముద్దు కోమలి పాలైన ||

చరణం 1:

త్యాగ శీలుడవీవు దాచిన సొమ్మంత వేగ నా కిమ్మంటినా
భాగా లివ్వ నైన పనికి రానైతినా
బాగాయె నది యెంత బంగారు బొమ్మైన ||

చరణం 2:

వడిగ నీ పాన్పు వద్దకు చేరగ వద్దు వద్దన నేలరా
అడుగు లొత్తగ నైన అనుకూల పడ రాదా
పడతి బోధన లిహ పర సాధన్ములైన ||

చరణం 3:

పాలించు శ్రీ తోట్ల వల్లురి వేణు గోపాలా మ్రొక్కితి మ్రొక్కితి
శ్రీ ల మించిన దాసు శ్రీ రామ కవి కృతి వాళాయముగ నిన్ను వర్ణన జేసిన ||