సావేరి రాగం - రూపక తాళం మార్చు


పల్లవి:

ముంజేతి కంకణ్ణమ్మున కద్దమేల నే
రంజిల్లు వాని గుణము రమణి మన మెరగమే ||

చరణం 1:

కమ్మదనపు మాట లనె కడుపులో నొక విధమె
కొమ్మ వాని వలపు నిక్కము గాదె నమ్మ రాదె ||

చరణం 2:

మాటలును చేతలును మన వద్దనె చెలియ
మాటికి పడాకలా మగువ తోడ తగవ దేల ||

చరణం 3:

భాసురాంగి నన్ను మాయ జేసె నేనేమి సేతు
దాసు రామ కవి మనో నివాసుడాయె మోసమాయె ||