మార్కండేయపురాణము
ప్రథమాశ్వాసము
కథాప్రారంభము
వ. |
పరమకళ్యాణపరంపరాభివృద్ధిగా నారచియింపం బూనినయిమ్మహాపురాణంబునకుఁ
గథాక్రమం బెట్టిదనినఁ బల్లవితకుసుమితఫలితవివిధవల్లీవెల్లితమాకందచందనమందా
రాదినానామహీజరాజవిరాజితంబును, దరులతాశిఖరవిహరత్కలకంఠశుకకులకల
కలస్వనమనోహరంబును, ననవరతహోమధూమశ్యామలితవ్యోమమండలంబును,
ననవచ్ఛిన్నాధ్యయనరవబధిరితదిగంతరాళంబును, ననుదినప్రవర్ధమానమహాధ్వరో
త్సవసమాగతశతమఖప్రముఖనిఖిలనిలింపనివహాలంకృతంబును, సమిత్కుసుమ
కందమూలఫలాహరణాగమనార్థపరస్పరాహ్వానమునికుమారకోలాహలవిలసితం
బును, శాస్త్రపురాణేతిహాసకథాకథనచతురతాపసోత్తమపరిషదభిరామంబును,
బరమపావనంబును నైన తపోవనంబునందు.
| 1
|
క. |
నిరుపమనిష్ఠాపరుఁ డై, పరమతప మొనర్చుచున్న భార్గవవంశో
త్తరు నిర్మలచారిత్రు న,మరపూజ్యుఁ గృపావిధేయు మార్కండేయున్.
| 2
|
క. |
కానఁ జనుదెంచి సత్యవ, తీనందనశిష్యుఁ డధికతేజోనిధి వి
ద్యానిపుణుఁడు జైమిని వినయానతుఁ డై యిట్టులనియె నధికప్రీతిన్.
| 3
|
భారతప్రశంస
చ. |
వినుము మునీంద్ర! వేదనిధి విష్ణునిభుండు పరాశరాత్మజుం
డనఘయశుండు సర్వనిగమార్థయుతంబును సర్వధర్మసా
ధనమును సర్వశాస్త్రకలితంబును సర్వకథాభిశోభితం
బును నగుభారతంబు కృతపుణ్యుఁ డొనర్పె సవిస్తరంబుగన్.
| 4
|
తే. |
మానుగా నింద్రియంబులలోన మనసు, సురలలోన ముకుందుండు నరులలోన
బ్రాహ్మణుఁడుఁ బోలె నెక్కుఁడై భారతంబు, వెలయు సకలదివ్యపురాణవితతిలోన.
| 5
|
క. |
జలపూరము పాండవకథ, జలరుహనివహములు విదితసరసాఖ్యానం
బులు మృదుపదములు హంసం, బులు మేదిని భారతాఖ్యఁ బొలుచు కొలనికిన్.
| 6
|
తే. |
వ్యాసవాగ్జలపూర్ణయు నాగమప్ల, వావతీర్ణయు బహుకుతర్కావనీజ
హరిణియు నైనభారతోదారతటిని, యడరి దురితరజోరాశి నడఁచుచుండు.
| 7
|
తే. |
ఒనర బహువిశేషంబుల నుల్లసిల్లు, నట్టిభారతాఖ్యానంబునందు గూఢ
తరము లైనసమంచితార్థంబు లెఱుఁగఁ, దలఁచి వచ్చితి నీకడ కలఘుచరిత!
| 8
|
జైమిని మార్కండేయమునిని గొన్నిప్రశ్నముల నడుగుట
వ. |
నిఖిలభువనోత్పత్తిస్థితిలయకారణుండును ద్రిగుణరహితుండును సర్వవ్యాపకుం
డును నైనపురుషోత్తముం డేమి నిమి త్తంబున మనుష్యత్వంబు నొందెఁ? బరమ
పుణ్యులైన పాండవు లేవురకు ద్రౌపది యొక్కతె యెట్లగ్రమహిషి యయ్యె? మహా
బలుండైన బలభద్రునకుఁ దీర్థంబున కరుగునవసరంబున బ్రహ్మహత్య యెట్లు వాటిల్లె?
దాని కతండు ప్రాయశ్చిత్తం బెత్తెఱంగునఁ జేసెఁ? బాండవేయనందను లైన ద్రౌప
దేయులు కృతచారపరిగ్రహులు గాక యనాథులుం బోలె నేల మృతిఁ బొంది?
రింతయు సవిస్తరంబుగా నెఱిఁగింప నీవ యర్హుండ వనిన నమ్మహాముని జైమిని
కి ట్లనియె.
| 9
|
క. |
అమరఁగ నీయడిగినయ, ర్థములను జెప్పంగఁ బెద్దతడ వయ్యెడు సం
యమివర్య! నియమవిధులకు, సమయం బరుదెంచె మాకుఁ జనఁగా వలయున్.
| 10
|
వ. |
నీకు నీయర్థంబు లవశ్యంబు నెఱుంగవలయు నేని.
| 11
|
క. |
అండజపతులు దృఢాగమ, పాండిత్యులు ద్రోణసుతులు భవ్యులు పింగా
క్షుండును విరాటుఁడును వృ, త్రుండును సుముఖుండు ననఁ జతుర్ముఖసదృశుల్.
| 12
|
తే. |
ప్రవిమలజ్ఞానవంతులు పరమశాంతు, లఖిలభాషావిశారదు లధికమతులు
సకలశాస్త్రపురాణనిశ్చయసమర్థు, లమితతేజులు సతతసమాధిరతులు.
| 13
|
క. |
ఉన్నారు వింధ్యనగమున, నన్నలువురు నడిగినట్టియర్ధంబును వి
ద్విన్నుతగుణ! యెఱిఁగింతురు, క్రన్నన చనుమన్న నతఁడు గడువిస్మితుఁ డై.
| 14
|
తే. |
ఇట్టినిర్మలవాక్సిద్ధి యిట్టియెఱుక, యిట్టిమహిమ యాపులుఁగుల కెట్టు గలిగె?
ద్రోణుఁ డన నెవ్వఁ డట్టిపుత్రుల మహాత్ముఁ, డెట్టు వడసె నతఁడు? చెప్పు మేర్పడంగ.
| 15
|
మార్కండేయుఁడు జైమినికి ద్రోణచరిత్రము చెప్పుట
సీ. |
అనిన మార్కండేయుఁ డను విను చెప్పెద ననిమిషవల్లభుఁ డప్సరోంగ
నలు గీతనృత్యము ల్సలుపంగ నిజనందనంబున నున్నెడ నారదుండు
వచ్చిన నతనికిఁ జెచ్చెర నాసనాద్యుపచారములు ప్రియం బొనరఁ జేసి
యిదె రంభ మేనక యిదె యూర్వశి ఘృతాచి యిదె తిలోత్తమ నీకు నీలతాంగు
|
|
తే. |
లందు మె చ్చొనరించు నేయతివనృత్త?, మనిన నీయచ్చరలలోన హావభావ
విలసనోత్కృష్ట నని మది విఱ్ఱవీఁగు, నేవెలఁది దానినృత్యంబ యింపు మాకు.
| 16
|
క. |
అని ముని పల్కిన నయ్యం, గనలకు నిజరూపవిభవకాంతిచతురతా
ద్యనుపమగుణములఁ దమలో, ననఘా! యే నేన యెక్కు డనువా దయ్యెన్.
| 17
|
తే. |
వాసవుం డంత వారలవాదు మాన్చి, యిమ్మునీంద్రుండు మీలోన నేలతాంగి
నధికగుణవతిగాఁ జెప్పు నదియె యెక్కు, డనిన నారదముని యిట్టు లనియె నపుడు.
| 18
|
తే. |
మంచుమలమీఁదఁ దపము గావించుచున్న, యనఘ దుర్వాసుమునిపుంగవునిఁ గలంపఁ
జాలు నేయింతి దనవిలాసప్రశస్తి, నదియె పో యెక్కుడనిన భయంబు గదిరి.
| 19
|
క. |
ఆనతముఖులై యొకపలు, కైనను బలుకంగ నోడి యందఱు నున్నం
దా నిట్లను వపువను నొక, మానిని మునివంకఁ గాంచి మదవతి యగుటన్.
| 20
|
చ. |
పలుకులు వేయు నేల మునిపాలక! నాదగురూపమంజువా
గ్విలసనలీల నమ్మునివివేక మడంచెదఁ దాల్మిఁ జించెదన్
గలఁచెద డెందముం దపము గర్వము మాన్పెద నే మనంబునం
దలఁచిన రుద్రు నైన ఘటదాసునిఁ జేయుదుఁ గామునింటికిన్.
| 21
|
తపముఁ జెఱుపవచ్చిన వపువనునచ్చరను దుర్వాసుఁడు పక్షి వగుమని శపించుట.
మ. |
అని గర్వోక్తులు వేడ్కఁ బల్కి వెస నయ్యబ్జాక్షి దృగ్దీధితుల్
దనుకంగాఁ జని కాంచె నంత హిమవంతంబు లసన్నూత్నర
త్ననితాంతద్యుతిపుంజరంజితదిగంతంబున్ లతాంతోల్లస
ద్ఘనరేఖాంచితసానుమంతము మరుద్దంతిస్ఫురత్ప్రాంతమున్.
| 22
|
వ. |
కని తదీయసుందరకందరంబునందు.
| 23
|
క. |
మలయానిలమృదులీలా, చలితతరులతాప్రసూనసౌరభమాలా
కలితమధుమత్తమధుకర, విలసనమున నొప్పువనము వెలఁదుక సొచ్చెన్.
| 24
|
క. |
చొచ్చి మునీశ్వరుఁ డున్నెడ, యచ్చోటికిఁ గ్రోశమాత్ర మగుట యెఱిఁగి చం
చచ్చూతలతాంతరమున, విచ్చలవిడిఁ జంద్రకాంతవేదికమీఁదన్.
| 25
|
తే. |
ఎలమిఁ గూర్చుండి యెలుఁగెత్తి యింపు మిగుల, వట్టిమ్రాఁకులు చివుళులు వెట్ట నతివ
పాడెఁ బాడిన విని యాతపసి కలంగి, వెఱఁగుపడి యంతయును మది నెఱిఁగి కనలి.
| 26
|
వ. |
రయంబున వచ్చి రూపగుణగర్వోన్మత్తచిత్త యైనయత్తలోదరిం జూచి.
| 27
|
శా. |
దుర్వాసుం డతికోపనిస్ఫురితవక్త్రుం డై యనున్ దానితో
గర్వాంధ్యంబున మత్తపంబునకు విఘ్నం బాచరింపంగ నా
గీర్వాణాధిపుతోడఁ బూనితి కడుం గీ డేల లేకుండు? నీ
గర్వం బంతయు నుజ్జగించి విహగాకారంబునం బుంశ్చలీ!
| 28
|
తే. |
విహగరాడ్వంశమందు నావిర్భవించి, ధరణితలమున షోడశాబ్దములు నిలిచి
సుతుల నలువురఁ గని తుది సునిశితాస్త్ర, హతి శరీరము విడిచి పొ మ్మమరపురికి.
| 29
|
క. |
నావచన మమోఘం బని, దేవతరంగిణికి నతఁడు దిగ్గనఁ జనియె
న్నావుడు జైమిని యిట్లను, నావనితజనిప్రకార మానతియీవే.
| 30
|
వపు వనునచ్చరచరిత్రము
వ. |
అనిన మార్కండేయుం డంతయుం జెప్పెద నాకర్ణింపు మరిష్టనేమిపుత్రుండైన
|
|
|
గరుడునికి[1] సాంపాతి పుట్టె నతనికి శూరుం డతనికి సుపార్శ్వుం డతనికిఁ గుంభి
యతనికిఁ బ్రలోలుపుఁడును బ్రభవించి రాప్రలోలుపుఁడు కంకుఁడు కందరుండు
నన నిరువురుకొడుకులం బడసె నాకంకుం డొకనాఁడు విహారార్థంబు కైలాసం
బునకరిగి యందొక్కరమణీయశిలాతలంబున మధుపానమత్తుండై భార్యయుం
దాను నేకతంబై యున్నవాని విద్యుద్రూపుం డనుదానవుండు గని డాయం
బోయినం గరం బలిగి వాఁ డి ట్లనియె.
| 31
|
గరుడవంశ్యుఁ డగుకంకుఁడు విద్యుద్రూపుఁ డను రాక్షసునిచేఁ జచ్చుట
|
స్త్రీయును బురుషుఁడు నేకత, మై యున్నెడఁ జూచి యెట్టియధముండైనన్
డాయఁగ వచ్చునె యిట్లి, స్సీ యటు పొమ్మనినఁ గోపజృంభితుఁ డగుచున్.
| 32
|
క. |
అడవులు గొండలు నీతని, పడసినవే యేల యిట్లు వదరెద? వనుచుం
కడు నలిగి కంకుమెడఁ దెగ, నడిచెను రక్కసుఁడు భీకరాసికరుం డై.
| 33
|
క. |
అంత నటఁ గందరుఁడు దా, నింతయు విని యడలు గనలు నెదఁ గూరంగా
నెంతయు రయమున నరిగి య, నంతరవిధు లగ్రజునకు నచ్చటఁ జేసెన్.
| 34
|
ఉ. |
చేసి మహోగ్రకోపశిఖిచిత్తమున న్నెగయంగ నుత్పత
ద్భాసురపక్షమారుతము పర్వతకోటిఁ జలింపఁజేయ ని
శ్వాసమహానిలక్షుభితసాగరుఁ డై వెసఁ గందరుండు గై
లాసనగేంద్రకందరములన్ దనుజాధము రోసి యొక్కెడన్.
| 35
|
కందరవిద్యుద్రూపులయుద్ధము
కవిరాజవిరాజితము. |
కనుఁగొని యోరి దురాత్మ! మహాత్మునిఁ గంకు మదగ్రజు నుగ్రుఁడవై
చనునె వధింపఁగ! వచ్చితి నే నిదె శౌర్య మెలర్పఁగ మార్కొన ర
మ్మనిచెదఁ గాలునిప్రోలికి నిన్ను రయమున నంచు నదల్చుచు డా
సినఁ గని రక్కసుఁ డాజ్యము వోసినచిచ్చుక్రియం గడు మండె వెసన్.
| 36
|
మానిని. |
కన్నుల నిప్పులు రాలఁగ నిట్లను గర్వమున న్విహగాధమ! నీ
యన్నకు మృత్యువు నన్ను నెఱుంగవె ప్రాణము లిప్పుడు వ్రాలెద నం
చున్నతశాతకృపాణము ద్రిప్పుచు నుగ్రతఁ దాఁకిన నిద్దఱకున్
గ్రన్నన శక్రసుపర్ణులకయ్యముకైవడి ఘోరరణం బొదవెన్.
| 37
|
తే. |
ప్రతిపక్షంబు వీక్షించి రాక్షసుండు, గిట్ట ఖడ్గంబు వైచిన బిట్టు నెగసి
యొడిని ఖగపతి దానిఁ జంచూగ్రశక్తి, గరుడుఁ డురగంబుఁ బట్టినకరణిఁ బట్టి.
| 38
|
కందరుఁడు విద్యుద్రూపునిఁ జంపి తత్పత్నిం బడయుట
క. |
కడువడిఁ గాళ్లంజేతులఁ, బొడిపొడిగాఁ బ్రామి చెలఁగి భూరిబలం బే
ర్పడ నక్కు ద్రొక్కి రక్కసు, బెడిదంబుగ నవయవములు పెఱికి వధించెన్.
| 39
|
తే. |
అంత నాదైత్యపతి ప్రియకాంత యయిన, మేనకాత్మజ మదనిక మిక్కుటంపు
భీతి నీభార్య నయ్యెదఁ బ్రీతి నాకు, శరణ మగుమన్న నగుచుఁ గందరుఁడు వొంగి.
| 40
|
వ. |
ఆసుందరిం దోడ్కొని చని నిజమందిరంబున కరిగె నంత నిజేచ్ఛానురూపరూప
ధారిణియగుటం జేసి.
| 41
|
కందరునివలన విద్యుద్రూపపత్నియగు మదనికయందు వపువు జనించుట
క. |
ఆధవళవిలోచన పులుఁ, గై ధవునిం బ్రీతుఁ జేసె నాదుర్వాసః
క్రోధానలమున నెరిసిన, యాధవళాబ్జాక్షి పుత్త్రియై జనియించెన్.
| 42
|
వ. |
దానికిఁ గందరుఁడు తార్క్షి యనునామం బొనరించె నంత.
| 43
|
క. |
పరమముని మందపాలుఁడు, జరితారిప్రముఖు లైనశార్ఙ్గేయుల న
ల్వురఁ బడసె సుతుల నం దు, ద్ధురగుణుఁ డగుపిన్నకొడుకు ద్రోణుఁడు దార్క్షిన్.
| 44
|
వ. |
ధర్మపత్నిగ నంగీకరించె నవ్విహంగాంగనయుఁ గతిపయకాలంబునకు గర్భిణియై
మూఁడునెలలపదియేనుదివసంబులు చన్నసమయంబునం బాండవకౌరవులు
భండనం బొనరించుచున్న నొక్కనాఁడు విధివశంబునం గురుక్షేత్రంబున కరిగి
నిరంతరనిశితవివిధవిశిఖపరిచ్ఛన్నాంబరం బైనయమ్మహాయుద్ధమధ్యంబునం బరిభ్ర
మించుచున్నంత.
| 45
|
భారతయుద్ధమునఁ దార్క్షి కడుపు దెగి గ్రుడ్లు పడుట
సీ. |
భగదత్తుగజముపై ఫల్గునుం డేసిన పటుభల్లమునఁ జేసి పక్షివనిత
కడుపుతో ల్ద్రెవ్వినఁ గర్భచ్యుతంబులై కమనీయశశిబింబకాంతి నొప్పు
నండము ల్నాలు గొయ్యన సాంద్రతద్రక్తపంకముపై దూదిఁ బడువడువునఁ
బడినతోడనె తెగిపడి సుప్రతీకంబు పార్శ్వమహాఘంట పటురయమున
|
|
తే. |
భవన మయ్యెను వానికి భాగ్యమహిమఁ, బతగియును నంత దివ్యరూపమునఁ జనియె
భారతాజి చెల్లినఁ గురుప్రభుఁడు భీష్ము, పాల సకలధర్మములు తత్పరత వినఁగ.
| 46
|
ధర్మపక్షులయొద్దకు శమీకముని వచ్చి వారం బెంపఁ గొనిపోవుట
వ. |
అయ్యెడకు శమీకుం డనుముని శిష్యసమేతుం డై వచ్చి.
| 47
|
క. |
జిలిబిలియెలుఁగులు ఘంటా, నిలయములోఁ జెలఁగుటయు మునిప్రభుఁ డచ్చో
నిలిచి చెవి యెడ్డి విని శి, ష్యులు దానుం బట్టి గంట యొయ్యన నెత్తెన్.
| 48
|
తే. |
అమరు రేయెండపిండుల కవయవములు, మొలచినట్లు తేజస్ఫూర్తి వెలుఁగుచున్న
విహగశిశువుల విజ్ఞానవిమలమతులఁ, గని మునీంద్రుఁడు విస్మయమున మునింగి.
| 50
|
క. |
అక్కట! యీసమరతలం, బెక్కడ? నీయండజంబు లెక్కడ? నీపా
టెక్కడ? నీఘంటాశ్రయ, మెక్కడ? దైవంబుఘటన యే మన వచ్చున్?
| 51
|
వ. |
అని శిష్యులం జూచి తొల్లి యాదిత్యులకు నోడి దైత్యులు మరణభయంబునఁ
బాఱిన భార్గవుండు వారల నుద్దేశించి చెప్పిన వాక్యంబులు వినుండు.
| 52
|
చ. |
సురలకు నోడి పాఱకుఁడు సొంపఱి రాక్షసులార! పాఱిన
న్మరణము దప్పునే యచట? మానుగ థాత యొనర్చినట్టి వెం
దెరువు మొఱంగ నెవ్వరికిఁ దీరునె? యాఱడి యేల? శౌర్యము
న్జిరతరకీర్తియు న్జెడఁగఁ జేయఁక కయ్యము సేయుఁ డుక్కునన్.
| 53
|
తే. |
సమర మొనరించినంతనే చావు రాదు, పాఱిపోయినయంతనే బ్రతుకు రాదు
జీవితంబును మరణంబు దైవకల్పి, తములు వానికి ముదమందఁ దలఁక వలదు.
| 54
|
ఉ. |
కొందఱు తీవ్రశస్త్రహతిఁ గొందఱు దుస్తరరోగబాధలన్
గొందఱు నీరు ద్రావునెడఁ గొందఱు భోజనకార్యవేళలన్
గొందఱు యోగముక్తు లయి కొందఱు నిష్ఠఁ దపం బొనర్చుచున్
గొందఱు కాంతల న్గవయుకోర్కులఁ జత్తు రనేకభంగులన్.
| 55
|
వ. |
మరణభయంబున కిది నిమిత్తం బని నిరూపింప రాదు.
| 56
|
క. |
దైవంబు చక్కఁజూచిన, నేవిధమునఁ గీడు పొంద దెయ్యెడ నున్నన్
దైవంబు తప్పఁ జూచిన, నే విధమున మేలు వొంద దెయ్యెడ నున్నన్.
| 57
|
వ. |
అని భార్గవుండు దెలిపినం తెలిసి యారాక్షసులు మరణభయంబు విడిచి రణపరా
యణు లై రమహాత్ముండు చెప్పిన వాక్యంబులయర్థం బిట్టివిషమసమరస్థలంబునం
బడి బ్రతికినయివ్విహంగంబులచేత నిట్లు సత్యప్రదర్శితం బగునె? యివి సామాన్య
పక్షులుగావు విప్రజాతు లగుట సందేహంబు లేదు సరగున నకులశ్యేనమార్జాల
మూషకాదులవలనిభయంబు లేకుండ నతిప్రయత్నంబున వీని రక్షింపవలయు
నొయ్యన నెత్తికొని రం డని యమ్మునీంద్రుండు శిష్యులం బనిచి నిజాశ్రమంబున
కరిగి వానికి సముచితస్థానంబున సంవిధానం బాచరించి యనుదినంబును బయః
ఫలాదివివిధాహారంబులం బోషణం బొనరించుచుండ మాసమాత్రంబునం
బ్రవర్ధిల్లి యొక్కనాఁడు.
| 58
|
మహాస్రగ్ధర. |
జవసత్వస్ఫూర్తు లొప్ప న్సకలమునిజనాశ్చర్యసంపాదలీలా
ప్రవణంబై పక్షిజాలప్రవరము లెగసె న్పర్వతంబు ల్చలింపన్
రవిల కాద్యూర్ధ్వలోకప్రతతిఁ గడప సంరంభ మేపారఁగా ని
య్యవనీచక్రంబు సూక్ష్మం బయి తమకు రథాంగాకృతిం దోఁచుచుండన్.
| 59
|
ఆ. |
అట్టు లెగసి మగుడ నరుదెంచి యమ్ముని, నాథునకుఁ బ్రదక్షిణంబు చేసి
భక్తిఁ బాదములకుఁ బ్రణమిల్లి విహగకు, మారు లిట్టు లనిరి మనము లలర.
| 60
|
క. |
మరణము దప్పించి మముం, గరుణ మెయిం బెంచి తిట్లు గారామున నీ
వరయఁగఁ ద్రాతవు తండ్రివి, గురుఁడవు మా కేడుగడయు గుణరత్ననిధీ!
| 61
|
ఉ. |
తల్లి మొగంబు గాన కటు తండ్రికి దవ్వయి గంటలోఁ గడుం
దల్లడ మంది పుర్వులవిధంబున వందురుచున్న మమ్మును
|
|
|
త్ఫుల్లదయామతి న్విగతదుఃఖులఁ జేసితి గానఁ బెంపు సం
ధిల్లఁగ మాకుఁ బ్రాణములు దేహములం గలిగె న్మునీశ్వరా!
| 62
|
ఉ. |
ఎన్నఁడు వృద్ధిఁ బొందు నివి యెన్నఁడు రూపు వహించుఁ బొల్బు నిం
కెన్నఁడు నల్గడం జెలఁగి యేడ్తెఱఁ బాఱుచు నుండు నామెయిం
జెన్నుగ నెన్నఁ డాటమెయిఁ జెందిన ఱెక్కలధూళి నించు నే
నెన్నఁడు చూడఁ గాంతు నొకొ యీ తరుశాఖలఁ గేళి సల్పఁగాన్.
| 63
|
తే. |
అనుచు నర్మిలియును గరుణాతిశయము, నగ్గలింపఁగ నీవు మ మ్మరసి పెనిచి
తనఘ యేము ప్రబుద్ధుల మైతి మింక, నేమి పనులు చేయుదుము మునీంద్ర! చెపుమ.
| 64
|
క. |
అని ప్రస్ఫుటవాక్యము లి, ట్లొనరఁగఁ బలుకుటయుఁ వెఱఁగునొంది పులకముల్
తనువున నెసఁగఁ గుతూహల, మునఁ బక్షుల కిట్టు లనియె మునివరుఁ డెలమిన్.
| 65
|
క. |
ఎవ్వనిశాపంబున మీ, రివ్వికృతిం బొందినార లేది కతము మీ
కివ్వాగ్విభవము కలుగుట, కివ్విధ మంతయునుఁ జెప్పుఁ డేర్పడ మాకున్.
| 66
|
ధర్మపరులు శమీకునకుఁ దమవృత్తాంత మెఱిఁగించుట
చ. |
అనవుడుఁ బక్షు లిట్టు లను నమ్మునివల్లభుతో నతిప్రియం
బున విపులుండు నాఁ గలఁడు పుణ్యుఁడు సంయమిసత్తముండు ద
త్తనయులు సత్తపోధను లుదాత్తగుణు ల్సుకృశుండు తుంబురుం
డును సుకృశుండు మాపిత గడు న్వినయంబున నేము దండ్రికిన్.
| 67
|
వ. |
శుశ్రూషణం బొనరించుచుండ నొక్కనాఁడు వృద్ధశ్రవుండు మాతండ్రి సత్య
వ్రతనిష్ఠ యరయం దలంచి వృద్ధవిహంగం బై చనుదెంచి యి ట్లనియె.
| 68
|
సీ. |
విను మునివల్లభ! వింధ్యశృంగమున నే నుండంగ నడరినచండపవన
హతి భగ్నపక్షుండ నై పడి మూర్ఛిల్లి యెనిమిదిదినముల కిపుడు దెలిసి
యుదరాగ్ని కొని కాల నోర్వంగఁ జాల కతిథి నైతి నాహారతృప్తిఁ జేసి
ప్రాణము ల్గావవే యనవుడు నీ కిష్ట మెయ్యది పెట్టెద నెఱుఁగఁ జెప్పు
|
|
ఆ. |
మనినఁ బక్షి యడిగె మనుజమాంసము దాని, కాత్మ నతఁడు రోసి యకట క్రూర
హృదయుఁడవు గదయ్య! హింసార్జితాహార, మడుగఁ దగునె నను విహంగనాథ!
| 69
|
క. |
ఇది రూపం బిది ప్రాయం, బిది నీపడియెడునవస్థ యింకైన శమం
బొదవఁగ వలదే మనమున, నది దుష్టాత్ములకు నేవయస్సునఁ గలుగున్.
| 70
|
వ. |
నీ వెట్టివాఁడ వై తేమి? నీకుం బ్రతిశ్రుతంబు చేసినయశనం బవశ్యంబును బెట్టెద
నని నిశ్చయించి.
| 71
|
మత్తకోకిల. |
ఏమి చెప్పుదు మేము నీకు? మునీంద్ర! యప్పుడు తండ్రి మ
మ్మామిషంబుగ నాఖగంబున కామతింపఁ దలంచి తాఁ
బ్రేమవంతుఁడు వోలె క్షుద్రతఁ బిల్చి యెంతయు మాగుణ
స్తోమముం గొనియాడి యి ట్లను దుష్టనిష్ఠురభాషలన్.
| 72
|
తే. |
పరమపూజ్యుఁడు దండ్రియు గురుఁడుఁ గాని, యొరుఁడు గాఁడని తలఁపు మీ కొదవెనేని
బొంకు గాకుండ నాపల్కు పూని సేయుఁ, డనిన మే మట్ల చేసెద మంటి మనుఁడు.
| 73
|
క. |
ఇండు భవత్తనువులఁ గల, కండలు నెత్తురును వేగ కమియంగా నీ
యండజపతి కానంద మ, ఖండముగా క్షుత్తృషావికారము లడఁగన్.
| 74
|
వ. |
అనిన మరణభయంబున వడవడ వడంకుచుఁ దల్లడిల్లి యే మి ట్లంటిమి.
| 75
|
క. |
ఎ ట్టిట్లు పలికి తీ విది? యె ట్టొనరింపంగ వచ్చు నీపని? దేహం
బె ట్టొకనిదేహమునకై, నెట్టన యీవచ్చుఁ? దండ్రి! నిక్కము చెపుమా.
| 76
|
తే. |
దేవ పితృ ఋషిఋణములు తీర్చి యధిక, భక్తిఁ బరిచర్య సేయుచుఁ బరగి తండ్రి
కరుణ బ్రతికి యుండెడువాఁడు గాని యనఘ, విను శరీరప్రదుండును దనయుఁ డగునె.
| 77
|
తే. |
ప్రాణములు గల్ల శుభములు పడయవచ్చు, ధర్మములు సేయ నగుఁ గానఁ దన్నుఁ గీడు
చెందకుండంగ నరుఁడు రక్షించుకొనుట, ధర్మమని చెప్పుదురు ధర్మతత్త్వవిదులు.
| 78
|
వ. |
అది కారణంబుగా మేము నీ చెప్పినయప్పని సేయ మనినం గోపించి తామ్రనయ
నుండై మాతండ్రి మముఁ దిర్యగ్యోనిజాతుల రగుఁ డని శపించి తనసత్యవ్రతంబు
పరిపాలింపం దలంచి యప్పులుఁగుఱేనియాననం బాలోకించి మదీయదేహంబు
నీ కాహారంబుగా సమర్పించితి శుచి వై సేవింపు మనుటయు విస్మితుం డగుచు
నవ్విహంగపురుహూతుం డి ట్లనియె.
| 79
|
తే. |
యోగబల మూఁడి దేహంబు నుజ్జగింపు, జీవుఁ డొడలిలో నున్న భక్షింప ననిన
నక్షణమ యోగసంయుక్తుఁ డయ్యె ముని త, దీయనిశ్చయ మెఱిఁగి యద్దేవవిభుఁడు.
| 80
|
మ. |
తనరూపంబు ధరించి యి ట్లను మునీంద్రా! బుద్ధి సంమోద మం
దను బక్ష్యాకృతిఁ బొంది నీహృదయతాత్పర్యం బెఱుంగంగ వ
చ్చిన నాతప్పు సహింపు చేసెద భవచ్చిత్తేప్సితం బెద్ది చె
ప్పు నిను న్సంతతసత్యపాలనమునం బుణ్యుండు గాఁ గాంచితిన్.
| 81
|
ఆ. |
నేఁడు మొదలు గాఁగ నీకు నైంద్రజ్ఞాన, మావహిల్లు విఘ్న మడఁగిపోవుఁ
దపమునందు విమలధర్మమునందును, నని సురేంద్రుఁ డరిగె నంత నేము.
| 82
|
మ. |
శిరము ల్వ్రాలఁగ మ్రొక్కి నెన్నుదురుల న్జేతు లొగిం జేర్చి దై
న్యరసం బాస్యములందు వెల్లిగొన సర్వాంగంబులుం గంపమున్
బొరయం గుత్తుక లెండ నీరెలుఁగులం బుణ్యాత్మ! మ మ్మీయెడ
న్మరణాపాయభయంబు మన్నిగొనియె న్మాతప్పు సైరింపవే.
| 84
|
ఆ. |
చర్మమాంసశల్యసంఘాత మై రక్త, పూరపూర్ణ మైనపొల్లయొడలి
యందుఁ జేయు వేడ్క యనఘ! యకర్తవ్య, మట్టివేడ్క యప్పుడయ్యె మాకు.
| 86
|
ఆ. |
కడిఁదిశత్రులైన కామాదు లలజడి, పాలు పఱుప నవశభావ మొంది
మోహసాగరమున మునుఁగుచున్నది లోక, మత్తెఱంగు విను మహానుభావ!
| 88
|
వ. |
ప్రవిమలజ్ఞానప్రాకారంబును శల్యకీలకంబును జర్మకుడ్యంబును రక్తమాంసాను
లేపనంబును నానాస్నాయువేష్టనంబును మహామాయాముఖంబును నైనయట్టి
పురంబునకుఁ బురుషుండు రాజు ఆరాజునకు మనోబుద్ధులు పరస్పరవిరోధు లైన
మంత్రులు కామక్రోధలోభమోహంబు లత్యంతబలవంతులైన శత్రువులు
ఈనలువురు శత్రులు చొరకుండ నన్నరపతి దనవీటివాకిళ్లు పదిలంబుగా సంవృ
తంబు చేసికొనియె నేని దాను నిరాతంకుండును సమాధిస్వాస్థ్యబలసంపన్నుండును
బరమానురాగుండునగు నవ్వాకిళ్లుగట్ట నసమర్థుం డయ్యె నేనిం గామమహా
శత్రుఁడు నేత్రాదిపంచద్వారప్రవిష్టుం డై సర్వంబును వ్యాపించు నతని వెనుకన
యమ్మువ్వురుపగతురుం బ్రవేశింతు రన్నలువురుంగూడి యింద్రియంబులతోడను
మనంబుతోడను గాఢాశ్లేషం బొనరించి వాని నన్నింటి నవ్వాకిళ్ళనుం దమవశంబ
కా నొనర్చికొని దురాసదులై యక్కోటయురలం ద్రోచి యయ్యమాత్యులం
గీటడఁగించి యంతయుం దారయై వర్తింతు రంత నమ్మహీకాంతుండు మంత్రిరహి
తుండు విగతపరివారుండు నై నశించు నివ్విధంబునం గామాదిశత్రులు మనుష్య
స్మృతినాశకు లగుటం జేసి యేము మోహాపహృతచిత్తులమై ప్రాణలోభంబున
నెఱుకచెడి బుద్ధి వో విడిచి యపరాధంబుఁ జేసితిమి మాకుఁ బ్రసన్నుండ వై
నీయిచ్చిన శాపంబు గ్రమ్మరించి తామసి యైనకష్టగతిం బొందకుండ మమ్ము రక్షింప
వే యనిన నమ్మహాత్ముం డి ట్లనియె.
| 89
|
ఉ. |
నావచనం బమోఘ మెడ నవ్వుచుఁ బల్కినఁ దప్ప దెన్నఁడున్
దైవకృతంబు మానుషహతం బగు నెట్లు? తనూజులార! దుః
ఖావహ మైనపక్షిభవ మైనను నిర్మలబోధ మెప్పుడున్
మీ వమలాంతరంగముల నిత్యము గాఁగ ననుగ్రహించితిన్.
| 90
|
క. |
దురితక్లేశభయమ్ములఁ, బొరయక విజ్ఞానవిదితపుణ్యపథములం
బరగుఁడు సమస్తవిద్యా, పరు లగుఁడు మనుష్యవాక్ప్రభావము మెఱయన్.
| 91
|
వ. |
అని యి ట్లస్మజ్జనకుడు ప్రసాదించిన నేము పెద్దకాలంబునకు నివ్విధంబున.
| 92
|
క. |
పక్షుల మై పుట్టి భవ, ద్రక్షణమునఁ జేసి యిట్లు బ్రతికితి మని యా
పక్షులు తమవృత్తాంతం, బక్షిణప్రీతిఁ జెప్పె నమ్మునిపతికిన్.
| 93
|
వ. |
చెప్పి సంప్రీతచేతస్కుం డైనశమీకునిచేత మధురవాక్పుష్పంబులం బూజితు లై
యాద్విజోత్తము లతని వీడ్కొని చని.
| 94
|
తే. |
పద్మరాగనభోమణిప్రభలు మెఱయఁ, జంద్రకాంతచంద్రద్యుతిజాల మెసఁగ
బహులతరవజ్రనక్షత్రపంక్తి వెలుఁగ, నంబరస్పర్ధి యైనవింధ్యంబు గనిరి.
| 95
|
వ. |
కని తదీయరామణీయకంబున కచ్చెరు వంది.
| 96
|
సీ. |
సురకరి యీ యద్రిఁ జరియించు నేనుంగుఁ గొదమలఁ గ్రీఁబడ్డకొదమ యొక్కొ!
నవకల్పలతిక లీనగముశృంగంబుల యం దొత్తి పాఱినయంబు లొక్కొ!
హరశిరోరత్న మీయచలంబుమణుల పెం బ్రోవులకడపటిపొల్ల యొక్కొ!
పరమేష్ఠియంచ యీగిరికొలంకులయంచపిండులోఁ దప్పినపిల్ల యొక్కొ!
|
|
తే. |
యని నుతింపుచుఁ జేరి సంయమికుమార, పఠ్యమాననానాగమాభ్యసనచతుర
కీరనికరోల్లసత్సహకారవనవి, రాజితం బైనతత్కందరంబునందు.
| 97
|
వ. |
పరమజ్ఞాను లైనద్రోణనందనులు తపస్స్వాధ్యాయసంపన్ను లై సుఖం బున్న
వారు వారల నడుగఁ బొ మ్మనిన మార్కండేయు వీడ్కొని జైమిని వింధ్యగిరి
కరిగి యవ్విహంగకుమారు లున్నశిఖరప్రదేశంబు డాయం బోయి తదీయమధు
రాధ్యయనధ్వని విని విస్మితుం డగుచు నంతర్గతంబున.
| 98
|
జైమిని ధర్మపరులయొద్ద కేఁగుట
క. |
జితనిశ్వాస మవిస్వర, మతివిస్పష్టంబు సౌష్ఠవాన్వితము వివ
ర్జితదోషం బీభవ్యులు, శ్రుతిపఠనం బింత కర్ణసుభగం బగునే?
| 99
|
క. |
ఈరూపంబున నిమ్ముని, దారకు లుండంగ వీరిఁ దగిలి ప్రియం బే
పారఁగఁ బాయక యున్నది, భారతి యిది చోద్య మెన్నిభంగులఁ దలఁపన్.
| 100
|
వ. |
అనుచుఁ దత్ప్రదేశంబు ప్రవేశించి విశాలశిలాతలవిష్టరోపవిష్టు లైనయాద్విజో
త్తములం గాంచి హర్షించి స్వవచనపూర్వకంబుగా ని ట్లనియె.
| 101
|
జైమిని ధర్మపక్షుల భారతార్థములఁ బ్రశ్నించుట
తే. |
వ్యాసశిష్యుండ జైమిని యనఁగఁ బరఁగు, వాఁడ భవదీయదర్శనవాంఛఁ జేసి
యరుగు దెంచితి ననిన హర్షాత్ము లగుచు, నాతనికి మ్రొక్కి యాతిథ్య మాచరించి.
| 102
|
తే. |
సేమ మడిగి ఱెక్కలగాలి సేద దీర్చి, యనిరి మునికి దార్క్షేయు లత్యాదరమునఁ
బుట్టు బ్రతుకును సఫలతఁ బొందె మాకు, నిపుడు భవదంఘ్రిపద్మాభివీక్షణమున.
| 103
|
క. |
మాయొడళులలో నుండెడు, నాయతపితృకోపవహ్ని యంతయు నడఁగెన్
శ్రీయుత! భవద్విలోకన, తోయంబులఁ జేసి సకలదుఃఖచ్యుతిగాన్.
| 104
|
వ. |
అని పలికి ద్రోణనందనులు మునీంద్రా! భవదాగమనకారణం బేమి యెఱింగింపు
మనిన జైమిని యి ట్లనియె.
| 105
|
సీ. |
అనుపమం బగుభారతాఖ్యానమున సందియములైనయర్థంబు లర్థి మిమ్ము
నడుగ నేతెంచితి ననిన నాద్విజవరు లవి మాకు విషయంబు లై మదీయ
మగుబుద్ధి దోఁచిన యట్లెల్లఁ జెప్పెద మడుగుము నీ వన్న నతిముదమున
నతఁడు మార్కండేయు నడిగినయట్టుల నన్నియర్థంబులు నడుగుటయును
|
|
ఆ. |
నమ్మహానుభావు లలరి నారాయణు, నాదిపురుషు నిత్యు నప్రమేయు
నఖిలవేదమయుఁ జరాచరగురుఁ బర, మాత్ము వాసుదేవు నజు ననంతు.
| 106
|
తే. |
విష్ణుఁ బ్రభవిష్ణు నచ్యుతు విగుణు సగుణు, హరిఁ జతుర్వ్యూహు నవ్యయు నభవుఁ బరము
|
|
|
నెలమిఁ దమచిత్తముల నావహించి హర్ష, మగ్ను లగుచు నందంద నమస్కరించి.
| 107
|
వ. |
ద్రోణనందను లాజైమినిం జూచి మహాత్మా! నీయడిగినయర్థంబులు మాయెఱిఁగిన
తెఱంగున నెఱింగించెద మాకర్ణింపుము.
| 108
|
ధర్మపక్షులు భారతార్థసంశయములఁ జెప్పఁ దొడఁగుట
తే. |
ఎవ్వఁ డబ్ధిపర్యంకశాయిత్వలోలుఁ, డెవ్వఁ డఖిలప్రజాసర్గహేతుభూతుఁ
డెవ్వఁ డాదిమసంయమిధ్యేయమూర్తి, యట్టిదేవుండు సకలలోకార్చితుండు.
| 109
|
క. |
ఆరయ నిర్గుణ సగుణో, దారతల న్నిరవయవుఁడు సావయవుఁడు నై
సారవిభూతి వెలుంగును, నారాయణుఁ డతని కమరు నాలుగుమూర్తుల్.
| 110
|
వ. |
వాసుదేవసంకర్షణప్రద్యుమ్ననారాయణాభిధానంబులు గలిగి విలసిల్లు నామూర్తుల
విధంబు వివరించెద వినుము.
| 111
|
శ్రీ నారాయణవ్యూహ చతుష్టయవివరణము
,
మ. |
అరయ న్వర్ణము పేరు రూపమును లే కత్యంతతేజోమయ
స్ఫురణాసంపదఁ జెంది సర్వగతి సంపూర్ణత్వముం బొంది వీ
తరజస్పత్త్వతమోవికారవిమలత్వం బొంది యోగీంద్రభా
సురనిష్ఠాత్మిక యాదిమూర్తి గడుఁ బొల్చు న్వాసుదేవాఖ్య యై.
| 112
|
తే. |
శేషరూపంబు నొంది యశేషభూభ, రంబు నుద్యత్ఫణాసహస్రమునఁ దాల్చి
సర్పసమితి గొలువఁ దమశ్శక్తిఁ బొలుచు, దివ్యసంకర్షణాఖ్యద్వితీయమూర్తి.
| 113
|
క. |
ధరణీప్రజానుపాలన, పరిణతి సదవననిరూఢి బహువిధధర్మో
ద్ధరణరతి న్సత్వోన్నతిఁ, బరగుఁ దృతీయ యగుమూర్తి ప్రద్యుమ్నాఖ్యన్.
| 114
|
తే. |
బహుళజలమధ్యమునఁ బెనుబాఁపపాన్పు, పై రజశ్శక్తి గైకొని పవ్వళించి
లీల నఖిలలోకములు గల్పించు వినయ, ధుర్య నారాయణాఖ్య చతుర్థమూర్తి.
| 115
|
వ. |
ఈనాలుగుమూర్తులందుఁ బ్రద్యుమ్నమూర్తి యైన దేవుండు పరమసాత్త్వికుండు
సకలధర్మకుళలుండు భక్తజనలోలుండు జగదవనశీలుండు నపారకృపావిశాలుండు
నగుటం జేసి సురగణరంజనంబు నసురగణభంజనంబు నిగమనికరరక్షాఖేలనంబు
ధర్మపరిపాలనంబు నొనరించుచు నొక్కమాటు వరాహనరసింహవామనాదిరూపం
బులు గైకొని ధరణి ధరియించి హిరణ్యాక్షు సంహరించి హిరణ్యకశిపు హరించి
బలి నణంచి జగంబులయలజడి యడంచు మఱియు దేవమనుష్యతిర్యగ్యోనులం
దుపేంద్రరామతిమికమఠరూపంబుల నావిర్భవించి లోకరక్షణోపాయపరాయణుం
డై వర్తించుట గారణంబుగా భూభారసంహారార్థంబు మనుష్యత్వంబు నొందె
నని చెప్పి యప్పక్షివరులు పాంచాలీభర్తలప్రకారంబు వినుమని యిట్లనిరి.
| 116
|
పాంచాలీభర్తృపంచకవివరణము
సీ. |
శతమఖుచేఁ దనసుతుఁడు మృతుండైన విని విశ్వకర్మయు విపులకోప
వేగుఁ డై లోకము ల్వినఁగ మద్ద్రోహిని దునుమఁగ నోపిన తనయు నిపుడు
|
|
|
పడసెద నాతపోబలమున నని పల్కి భీమరయంబున బెరసి యొక్క
జడ వహ్నిలోపలఁ జయ్యన వ్రేల్చిన వికృతఘోరాననవిస్ఫురద్భ
|
|
తే. |
యంకరోజ్జ్వలమూర్తి వృత్రాసురుండు, పుట్టె నతనికిఁ దైజసస్ఫూర్తిఁ గలుగ
సప్తమునులను బంపి తత్సంధిఁ జేసి, వేల్పుఱేఁ డొక్కవెంట నవ్విప్రుఁ జంపె.
| 117
|
క. |
ఆహత్యఁ జేసి యింద్రుని, దేహబలము వోయి వాయుదేవుని గూడె
న్మాహాత్మ్య మడఁగె విప్ర, ద్రోహంబున నెట్టిఁడైన దురితముఁ బొందున్.
| 119
|
క. |
ఆసమయంబునను నహ, ల్యాసక్తుం డగుట నింద్రుఁ డగ్గౌతముచే
గాసిపడి నైజతేజముఁ, బాసి వికృతి నొంది నష్టబలుఁడై యుండెన్.
| 120
|
చ. |
తదవసరంబున న్సకలదైత్యులు దానవులు న్మదంబునం
ద్రిదశవిభు న్జయింపఁగ మదిం దలపోసి మఘాదిధర్మసం
పద లణఁగింపఁ బూని బహుపార్థివవంశములందుఁ బుట్టి రు
ర్వి దలరి భూరిభారవహవిహ్వల యై చనియె న్సురాద్రికిన్.
| 121
|
మ. |
చని యింద్రాదిసుపర్వులం గని మనస్తాపంబు దీపింప ని
ట్లనె నద్దేవి మనుష్యలోకమున నత్యంతోగ్రతేజోఘనుల్
దనుజు ల్పుట్టినవా రనేకనృపులై తత్సేన లక్షోహిణుల్
వినుఁ డే నోర్వఁగఁ జాల మీక తగు నావ్రేఁగంతయు న్బాపఁగాన్.
| 122
|
ఇంద్రుఁడే పాండవరూపంబున నైదువిధము లగుట
క. |
అని చెప్పిన నయ్యమరులు, విని యందఱు నపుడు ధరణివ్రేఁ గుడుపఁగ న
త్యనుపమనిజతేజోంశము, లొనరం బుట్టించి రుర్వి నుర్వీనాథా!
| 123
|
తే. |
అమరపతి నిజతేజ మేనంశములుగఁ, జేసి తా భూమరుజ్జలశిఖినభముల
శక్తు లూఁది ధర్మజ భీమ సవ్యసాచి, నకుల సహదేవు లనియెడినామములను.
| 124
|
మాలిని. |
అసురదమనలీలాయత్తకౌతూహలుం డై
మసలక భువిఁ గుంతీమాద్రులం దుద్భవించెన్
వసుధభరము మాన్ప న్వాసవుం డిట్లు తేజో
విసరపిహితమూర్తు ల్విస్ఫురింప న్మునీంద్రా!
| 125
|
క. |
పెక్కొడళులు పేరులు ని, ట్లక్కజముగఁ దాల్చి పుట్టినట్టిమహేంద్రుం
డొక్కండ కాక ద్రౌపది, కెక్కడివా రరయ భర్త లేవురు చెపుమా.
| 126
|
వ. |
అని విహంగవల్లభులు ద్రౌపది యేవురకు నేకవల్లభ యైనతెఱం గెఱింగించి బలదేవు
నికిఁ బాటిల్లిన బ్రహ్మహత్యాప్రాయశ్చిత్తప్రకారంబులు చెప్పెదము విను మని
యిట్లనిరి.
| 127
|
బలరామబ్రహ్మహత్యాప్రాయశ్చిత్తప్రకారము
క. |
కౌరవపాండవసమర, ప్రారంభం బెఱిఁగి రాముఁ డచ్చోటికిఁ దా
|
|
|
ద్వారవతినుండి వచ్చె వి, చారదశాసంమిళితనిజస్వాంతుం డై.
| 128
|
ఉత్సాహ. |
హరికిఁ బ్రియుఁడు నరుఁడు గాన హరి దొఱంగఁ డన్నరున్
హరిఁ దొఱంగి యేను గౌరవాధినాథుఁ గూడ నె
ట్లరుగ నేర్తుఁ బాండుతనయులందు నిల్చి కౌరవే
శ్వరుని శిష్యు నెట్లు వారు చంపఁ జూతు నక్కటా!
|
|
ఉత్సాహ. |
వారు వీరు నాకు బాంధవమున నొక్కరూప యె
వ్వారిఁ గూడ నొల్ల బంధువర్గము ల్చలంబున
న్బోరఁ జూడఁ జాలఁ దీర్థములకు బోయెద న్వగం
గూరుచుండ నేల యని ముకుందునకుఁ బ్రియంబునన్.
| 130
|
వ. |
అంతయు నెఱింగించి హలధరుండు వీడ్కొని నిజపురంబునకుం జని మఱునాఁడు
తీర్థసేవ సేయువాఁడై నిశ్చయించి.
| 131
|
క. |
వివిధము లగుమధురసములు, చవిగొనుచుం దనియఁ ద్రావి సంఘూర్ణితచి
త్తవికారజనితమదర, క్తవిలోచనభయదవక్త్రకమలుం డగుచున్.
| 132
|
ఉ. |
ఆవిభుఁ డొక్కకేల ముసలాయుధముం బెఱకేల రోహిణీ
దేవికరంబు పట్టికొని దేహరుచు ల్వెలుఁగంగ నంగన
ల్వేవురు గొల్చి రా సమదలీల మదాంధగజంబుచాడ్పునన్
రైవతశైలసానువనరమ్యతలంబునఁ గ్రీడ సల్పుచున్.
| 133
|
రైవతోద్యానవర్ణనము
సీ. |
ఎనసి యొండొంటితో ననఁగి పెనంగెడు నవలతాతరుమిథునములసొబఁగు
సహకారపల్లవాస్వాదనక్రీడలు సలుపుకోకిలదంపతులబెడంగు
పొలయలుకలను దెల్పుచు నటించుచుఁ గ్రాలు విటకులటాళులవిలసనంబు
సరసదాడిమఫలాస్వాదనలీలలఁ గర మొప్ప శుకవధూవరులచెన్ను
|
|
తే. |
హంసవరటామనోజ్ఞవిహారవిభ్ర, మములఁ గొమరారు కమలషండములభాతి
నర్థిఁ జూచుచు హలధరుం డల్లనల్ల, నేఁగి యొక్కెఁడ నొకపొదరింటిలోన.
| 134
|
బలరాముఁడు ప్రత్యుత్థానము చేయమి నలిగి సూతుం జంపుట
సీ. |
ఉన్నతాసనమున నుండి సూతుం డను పౌరాణికుఁడు సెప్ప బహుపురాణ
కథ లర్థి వినుచున్న కణ్వభరద్వాజకుశికాత్రికుత్సాదిగోత్రజాతు
లగుభూసురుల డాయ నరిగినఁ గనుఁగొని యమ్మహామతు లీతఁ డధికశీధు
పానమదోన్మత్తుఁ డైనవాఁ డని భీతి దిగ్గన లేచి యాతిథ్యపూజ
|
|
తే. |
లొనరఁ జేసిరి సూతుఁ డయ్యున్నతాస, నమ్ము దిగకున్నఁ జూచి మనమ్ము గ్రోధ
రంజితమ్ముగ నతనిశిరమ్ముఁ జేతి, గుదియఁ బగులంగ నొకవేటు గొనియె సీరి.
| 135
|
వ. |
ఇట్లు సంకర్షణగదాఘాతంబునం గతప్రాణుం డై పౌరాణికుండు బ్రహ్మపద
ప్రాప్తుండయ్యె నంత.
| 136
|
ఉ. |
చచ్చినసూతుఁ జూచి యతిసంభ్రమకంపితచిత్తులై మును
ల్విచ్చి జటాజినావలులు వీడఁగ నల్గడఁ బాఱి రంతఁ దాఁ
జెచ్చెర బుద్ధికిం తెలివిఁ జెందిన రాముఁడు వెచ్చఁ నూర్చుచు
న్వచ్చునె బ్రహ్మహత్య బలవంతపుఁగర్మము ద్రిప్పి తెచ్చెనే?
| 137
|
చ. |
కరుణ యొకింత లేక యవుఁ గా దనునట్టితలంపు లేక భూ
సురుఁ డనుశంక లేక యిటు సూతుని నేఁ దెగఁ జూతునే సురా
పరిణతదుర్మదాంధ్యమునఁ బాపముఁ జేసితి దేహమెల్ల నె
త్తురుఁ బొల వల్చుచున్నయది దుస్తరపాతకసంక్రమమ్మునన్.
| 138
|
వ. |
అనుచు బలభద్రుండు పశ్చాత్తాపంబునం జిత్తం బుత్తలం బొంద నప్పుడు.
| 139
|
బలరామునితీర్థయాత్ర
క. |
ఈదుష్కర్మం బంతయు, నేదఁగ నెల్లెడల దీని నెఱిఁగించుచు నే
వేదవిహితవిధినియతి, న్ద్వాదశసంవత్సరవ్రతముఁ జరియింతున్.
| 140
|
వ. |
అని నిశ్చయించి రేవతీప్రభృతియువతీజనంబుల వీడ్కొల్పి విధ్యుక్తప్రకారంబునం
బ్రలంబఘ్నుండు ప్రతిలోమంబుగా సరస్వతీపుణ్యతీర్థంబు లాడం జనియె నని
చెప్పి యప్పక్షివరులు ద్రౌపదేయకథాప్రకారంబు చెప్పం దలంచి యి ట్లనిరి
తొల్లి త్రేతాయుగంబునందు.
| 141
|
హరిశ్చంద్రోపాఖ్యానము
సీ. |
ఎవ్వనిమాహాత్మ్య మెప్పుడు వేదము ల్చెలఁగి సుస్తోత్రము ల్సేయుచుండు
నెవ్వనిశాసనం బేడుదీవులరాజులకు శిరోభూషణలక్ష్మి నొందు
నెవ్వనిరక్ష మహేంద్రాదిసురలకుఁ బెట్టనికోట యై పెంపుదాల్చు
నెవ్వనిసత్కీర్తి యీయజాండం బెంత యంతయుఁ దానయై యతిశయిల్లు
|
|
తే. |
నట్టిమహితగుణాభరణాభిరామ, మూర్తి ప్రత్యర్థినృపసమవర్తి పరమ
పూజ్యసామ్రాజ్యవైభవస్ఫూర్తి నిత్య, సత్యవర్తి హరిశ్చంద్రచక్రవర్తి.
| 142
|
మ. |
ధరణీచక్ర మవక్రవిక్రమకళాదర్పం బెలర్పంగ నే
ర్పరి యై నిర్మలసత్యధర్మనియతిం బాలించె దుర్భిక్ష డం
బరదుఃఖంబులు జారచోరభయమున్మాదజ్వరవ్యాధిదు
ర్మరణాదు ల్ప్రభవింపకుండఁ బ్రజ ధర్మప్రీతి వర్తింపఁగన్.
| 143
|
క. |
ధనరూపబలంబుల న, త్యనుపమవిద్యాతపోమహత్త్వంబుల భూ
జనులకు నొదవదు మద మ, జ్జననాయకుసత్యధర్మశాసనమహిమన్.
| 144
|
వేఁట కేఁగినహరిశ్చంద్రుఁడు విశ్వామిత్రుదరి కరుగుట
వ. |
ఇట్లు సత్యవ్రతగరిష్ఠుండును ధర్మకర్మవరిష్ఠుండును నైనయారాజర్షి ప్రజాపాల
నంబు సేయుచు నొక్కనాఁ డరణ్యంబున కరిగి మృగయావినోదంబులం దగిలి చని
చని ముందఱ నొక్కయెడ.
| 145
|
తే. |
మము రక్షింపు మని పలుమాఱుఁ గూయు, నాఁడుకూయి వీ తెంచిన నానరవరుఁ
డోడ కోడకుఁ డేనుండ నొకఁడు మిమ్ము, నకట! యన్యాయవృత్తిమై నలఁపఁ గలఁడె.
| 146
|
క. |
ఇదె వచ్చెద వెఱువకుఁడీ, మది నంచును వేఁట యుడిగి మనుజేంద్రుఁడు శి
ష్టదయాళుత్వంబును దు, ష్టదమనకుతుకంబు నడరఁ జనుసమయమునన్.
| 147
|
క. |
ప్రారంభంబుల కెల్లను, నారయ విఘ్నము లొనర్చు నావిఘ్నేశుం
డారోదనముతెఱఁగు ము, న్నారసి తా నచట నునికి నప్పుడు మదిలోన్.
| 148
|
మ. |
జతనం బారఁ దపోమహత్త్వమున విశ్వామిత్రుఁ డిట్లియ్యెడన్
సతతాభ్యాసకుతూహలాగ్ర్యనియతిన్ సాధింపఁగా విద్య లా
తతతీవ్రార్తిభయంబున న్దలఁకి యత్యంతంబు వాపోయెడిన్
ధృతి నీరాజును నోడకుం డనుచు నేతెంచెం గతం బేమియో.
| 149
|
తరువోజ. |
ఈరాజుఁ బ్రేరించి యీమునిరాజు, నెద నొవ్వఁ బలికించి యీతనిక్రోధ
మారంగఁ జేసెద నంత నీవిద్య, లలజడిఁ బడ కేఁగు నని నిశ్చయించి
యారాజుమది సొచ్చె నావిఘ్నరాజు, హా యని మఱియును నాయేడ్పు టెలుఁగు
లారాజు సైఁపక యతితీవ్ర కోప, హాసభీషణవక్త్రుఁ డై యిట్టు లనియె.
| 151
|
చ. |
వెలుఁగుమహాప్రతాపశిఖవేఁడిమి దిక్కుల నించుచున్న నా
కొలఁది యెఱుంగ కెవ్వఁ డొకొ ఘోరపుఁజి చ్చిటు చీరఁ గట్టెడి
న్దలరక యిట్టిదుర్మదు నధర్మపరు న్దురితాత్ముఁ జండదోః
కలితధనుర్విముక్తపటుకాండవిఖండితగాత్రుఁ జేసెదన్.
| 152
|
క. |
అని బె ట్టదల్చుచును డా, సిన రాజుకఠోరవాక్యశిలలు చెవులఁ దాఁ
కిన నమ్ముని పెనుగోపమున నుండెను విద్య లడఁగి పోయెం గినుకన్.
| 153
|
వ. |
అట్లు డాసి యారా జాక్రందించునంగనలం గానక.
| 154
|
క. |
విశ్వామిత్రుని నుద్య, ద్వైశ్వానరసదృశశమూర్తివైభవు నాధా
త్రీశ్వరుఁడు బిట్టు గని చల, దశ్వత్థదళంబుభంగి నంగము వణఁకన్.
| 155
|
క. |
మ్రొక్కిన నోరి! దురాత్మక! యెక్కడ వచ్చె! దటు నిలువు మీ వనుఁడుఁ గడు
న్దక్కి నయమున మఱియును, మ్రొక్కుచు నిట్లనియె రాజముఖ్యుఁడు భీతిన్.
| 156
|
చ. |
అలుగమయ్య! యోమునిజనాగ్రణి! త ప్పొకయింత లేదు నా
వలన నరే్ంద్రధర్మ మగువాక్యమ పల్కితిఁ జిత్తగింపు మ
స్ఖలితము గాఁగ నిచ్చుటయుఁ గాచుటయు న్విలు చేతఁ బట్టి ని
శ్చలత రణంబు సేయుటయు శాస్త్రమతస్థితి రాజధర్మముల్.
| 157
|
వ. |
అనినం గౌశికకులసంభవుం డిట్లనియె.
| 158
|
తే. |
ఎవ్వరికి నిత్తు గాతు వీ వెట్టివారి, రాజ యెవ్వరితో బవరంబు సేయు
దనిన విప్రుల కిత్తు భయార్తజనులఁ, గాతు శత్త్రులతోడ సంగర మొనర్తు.
| 159
|
మ. |
అనినం గాధితనూజుఁ డీవిహితధర్మాచారము ల్సల్పు దే
ని నరేంద్రోత్తమ! యేను బ్రాహ్మణుఁడఁ గానే రాజసూయాధ్వరం
బునకుం జాలినయంతసొ మ్మొసఁగుమా భూదేవతాకోటికి
న్దనియ న్దక్షిణ లిచ్చి యజ్ఞ మమరేంద్రప్రీతిగాఁ జేసెదన్.
| 160
|
క. |
అని మునిపతి వేఁడిన న, మ్మనుజపతి భయంబు దక్కి మగుడను జన్మిం
చినవానిఁగా ముదంబునఁ, దనుఁ దలఁచుచు హర్షమయసుధామగ్నుం డై.
| 161
|
చ. |
వినుము మునీంద్ర! దక్షిణకు విత్తము చాలినయంత మున్న యి
చ్చినయదిగా నెఱుంగు మెద శ్రీయును రాజ్యము ధాత్రియుం బురం
బును ధనరాసులు న్సతియుఁ బుత్రుఁడు ధర్మచయంబు నేను నీ
ధనములె యిందు నీయభిమతం బగు నెయ్యది వేఁడు నావుడున్.
| 162
|
శా. |
నీ వే మిచ్చినఁ గా దన న్గొనియెద న్వీరాగ్రణీ! ధర్మము
న్నీవు న్భార్యయుఁ బుత్త్రకుండు వెలిగా నీసర్వసామ్రాజ్యల
క్ష్మీవాల్లభ్యము మాకు ని మ్మనిన నిచ్చె న్నిర్వికారానన
శ్రీవిభ్రాజితమూర్తియై సమధికప్రీతి న్హరిశ్చంద్రుఁడున్.
| 163
|
హరిశ్చంద్రుఁడు విశ్వామిత్రునకు సకలరాజ్యము నొసంగుట
వ. |
ఇ ట్లిచ్చి యమ్మునిశార్దులుం దోడ్కొని పురంబున కరిగి యపరిమితకరితురగరథ
పదాతిబహుళంబును మంత్రిపురోహితదండనాథవారసీమంతినీవివిధవిభూతివిలస
నంబును నగణితమణికనకకలధౌతాదిసమస్తవస్తుపరిపూర్ణభాండాగారసముదయా
భిరామంబును నైనసకలమహీరాజ్యలక్ష్మీవిభవం బంతయు సమర్పించినం బరిగ్ర
హించి యయ్యుగ్రతేజుం డా రాజుఁ జూచి.
| 164
|
క. |
పుడమియు నొడమియు రాజ్యముఁ, గడు వేడుక నిచ్చితేనిఁ గైకొంటిమి పెం
పడరంగను స్వామ్యం బల, వడునే నీ వున్న మాకుఁ బార్థివముఖ్యా!
| 165
|
తే. |
వెడలి పొ మ్మేల మాటలు వేయు? రాజ్య, మేకముఖము గాకున్న మా కెట్లు చెల్లు?
వినుము రాజ! సూదికి రెండుమొనలు గలవె, యింకఁ దడసిన నిన్ను సహింప నవని.
| 166
|
తే. |
పిడుగుకంటెను దద్దయుఁ బెడిదమైన, యప్పలుకు కర్ణరంధ్రము లవియ నాత్మ
పఱియలుగఁ దాఁకుటయు వెఱచఱిచి విభుఁడు, చిత్రరూపమువిధమునఁ జేష్ట దక్కి.
| 167
|
వ. |
ఒక్కముహూర్తంబునకుం దెలివొంది మునిశాపభయంబునం గళ......
కయుఁ దడయ శంకించి జలనివాసంబునం దపోనిష్ఠ నున్న వసిష్ఠుం......
లేమికి బొక్కుచు సత్యోక్తినిశ్చయంబున సమస్తంబును బరిత......
| 168
|
సీ. |
సురుచిరకిరణవిస్ఫురణంబు డింది యెంతయు మాఁగువడినమా......
భాసురరత్నసత్ప్రభలు వాసన విన్ననౌరోహణశిలోచ్చయం....
విలసితతారకవిభవంబు చెడి కడుఁ బాడఱి యున్ననభంబుక....
ప్రవిమలకుసుమసంపద యెల్ల నుడివోయి రూపు దక్కినవ.....
|
|
తే. |
నొందఁ గోటీరహారకేయూరకంక, ణాదిమణిభూషణోత్కర మపనయించి
యొప్పు పొలివోయి దీనత నుండె బంధు, జనులచూడ్కులు కమర నజ్జనవిభుండు.
| 169
|
వ. |
ఇట్లు వర్జితాశేషవిభూషణుండై తరువల్కలంబులు ధరించి యన్నరేంద్రుడు
శైబ్యయైనధర్మపత్నియుం దనయుండునుం దాను నిలువెడలుసమయంబున నమ్ముని
కుంజరుం డతని కడ్డంబు వచ్చి.
| 170
|
సీ. |
క్రతుదక్షిణకుఁ బ్రతిశ్రుతము చేసినయర్థ మీక నీ వెక్కడి కేఁగె దనుడు
నిఖిలరాజ్యంబును నీక యిచ్చినవాఁడ దేహత్రయము నాకుఁ ద్రిక్కి యున్న
దింతియ సొ మ్మిప్పు డేమియుఁ బెద్ద లేదనుటయు నలిగి సంయమి ధనమున
కెన్నినా ళ్లెడ గొనియెదు చెప్పు మంతలో సవరింపకుండిన శాప మిత్తు.
|
|
తే. |
ననిన వడవడ వడఁకుచు నతఁడు మ్రొక్కి, యొక్కనెల సైపవే కృప యుల్లసిల్ల
నంత నీయప్పు దీర్చెద శాంతిఁ బొందు, మనిన ముని ప్రీతి దీవించి యరుగు మనియె.
| 171
|
శా. |
ఆరాజేంద్రుఁడు గాల్నడ న్వెడలెఁ దో నాలుం దనూజుండు నే
తేరన్ శోకము మూర్త మైనయటు లార్తిం బొందె మో మెత్త కె
వ్వారిం జూడక తల్లడంబున సుహృద్వర్గంబు లుల్లంబులం
దారం గూరిన తీవ్రదుఃఖముల హాహారావము ల్సేయఁగన్.
| 172
|
ఆ. |
ఇట్లు వెడలి యమ్మహీనాథుఁ డరుగంగ, నపుడు పౌరజనము లంత తెఱఁగు
నెఱిఁగి విూఁద మిన్ను విఱిగి కూలినయట్టి, కరణి గుండె లవిసి కళవళించి.
| 173
|
సమస్తము విడిచి వెడలుహరిశ్చంద్రునిం గని పురజనులు దుఃఖించుట
సీ. |
కాంచనాలంకృతిఁ గరమొప్పి నీమ్రోల నేతెంచుగజఘట లెందుఁ బోయెఁ?
గనకకింకిణులచెల్వునఁ గ్రాలుతురగంబు లేల నీకెలఁకుల నేఁగు దేవు?
రత్నోజ్జ్వలము లైనరథములు నీపజ్జ వడిఁ జనుదేర కెక్కడ నడంగె?
వివిధాయుధస్ఫూర్తి వెలుఁగు కాల్వురమొత్త మేల నీతో రాక యేమి యయ్యె?
|
|
తే. |
రమ్యభూషణదివ్యాంబరములు దొఱఁగి, నారచీరలు గట్టి యనాథవృత్తి
నాలుఁ గొడుకును వెంట రా నరుగునట్టి, యెడరు వాటిల్లైనే మేదినీశ! నీకు.
| 175
|
క. |
అని పురపురఁ బొక్కుచుఁ బుర, జనములు పురి వెడలి రాజసత్తమువెనుకం
జని యంతంతకునుం బై, కొనుశోకానలమునందుఁ గుందుచు మఱియున్.
| 176
|
సీ. |
.....రాజ్యవిభూతి వ్రేఁగయ్యెనే దైవంబుకంటికి ధరణినాథ!
.....పనిసేయ సడిసన్న నీపెంపు బూడ్దబొట్టయ్యెనే భూరికీర్తి!
.......ర్భేశ్వరి యగునీమహాదేవి యింతకు నోఁచెనే యిద్ధచరిత!
.......బెరిఁగినయీముద్దుపట్టిభాగ్యం బిట్టి దయ్యెనే యధికపుణ్య!
|
|
తే. |
....హారాజ! రాజసూయాధ్వరేశ!, హా! హరిశ్చంద్ర! నిత్యసత్యాభిరామ!
.......ధైశ్వర్య! శౌర్యజితారిలోక!, హా! సమస్తలోకేశ! దయారమేశ!
| 177
|
వ. |
అనుచు నంతకంతకు నతిశయిల్లు నెవ్వగలపెల్లున నుల్లంబులు పల్లటిల్ల నందంద
క్రమ్ము నశ్రుజలంబులవెల్లి మునింగి మొగంబులు దీనంబు లగుచుండ నొండొండ
యడరుగద్గదికం జేసి వికలంబులై యాక్రందనారావంబులు చెలంగు నంగంబు లవ
శత్వంబు నొంది యొరగ నప్పురజనంబు లెల్ల నమ్మహావిభు డాయం బోయి.
| 178
|
క. |
ధరణీశ్వరులకు ధర్మం, బరయంగాఁ బ్రజలయార్తి యణఁచుటయె కదా
ధరణీశ్వర! యే మార్తిం, బరితాపముఁ బొందఁ జనుట పాడియె నీకున్.
| 179
|
ఉ. |
ఊరక యేల పోయెదు? నృపోత్తమ! దీనుల మమ్ముఁ జూడవే
కారుణికాగ్రగణ్యుఁడవు గావె? ముహూర్తము నిల్చి నీముఖాం
భోరుహవిభ్రమంబు దనివోవఁగఁ గ్రోలి మదీయలోచనో
దారమధువ్రతాళి ముద మందెడునట్టులుగా నొనర్పవే.
| 180
|
ఆ. |
మార్గజనితరేణుమలిన మై నీముఖాం, భోజ మింకఁ జాలఁ బొలుపు దఱిఁగి
వాడి తొంటియంత చూడఁగా నొప్పక, యుండు నేఁగ వలవ దుజ్జ్వలాంగ!
| 181
|
చ. |
అని కరుణంబుగాఁ బురజనావలి పల్కుచు రాఁ దదీయవా
క్యనిచయశృంఖలం దవిలి యమ్మెయిఁ బోవఁగఁ గాళు లాడమి
న్మనుజవిభుండు శోకరసమగ్నత మార్గముక్రేవ నిల్చిన
న్గనుఁగొని కౌశికుం డలిగి కన్నుల నిప్పులు రాల నిట్లనున్.
| 182
|
విశ్వామిత్రుఁడు హరిశ్చంద్రుని ధర్షించుట
తే. |
ఇస్సిరో! దురాచారుని హీనసత్య, వచను ని న్నేమి చెప్ప? నా కుచితవృత్తి
నిచ్చి రాజ్యము క్రమ్మఱఁ బుచ్చుకొనఁగఁ దలఁచి నీవండగొనియెదు నిలిచి యిచట.
| 183
|
చ. |
అనినఁ జలించుచు న్నృపతియంగన కే లొకచేఁ దెమల్చి వే
చనఁ జన నేమి చెప్ప మునిచందము! చేతిప్రచండదండ మె
త్తి నయ మొకింత లేక సుదతీతిలకంబుకృశాంగవల్లి నే
సె నిభము దొండ మెత్తి మదజృంభిత మై లత వ్రేయుచాడ్పునన్.
| 184
|
తే. |
దాని కత్యంతశోకాగ్నితప్తుఁ డగుచు, నరిగెఁ గాని యించుకయు నొండాడఁడయ్యె
నధిపుఁ డప్పుడు విశ్వాఖ్యు లైనవేల్పు, లేవు రమ్మునిసంరంభ మెల్లఁ జూచి.
| 185
|
ఉ. |
అక్కటికంబు డెందములయందు జనింపఁగ వచ్చి యక్కటా!
యిక్కమలాక్షి సాధ్వి నిటు లేటికి మోఁదెడుఁ జేతికోల? నిం
కెక్కడిపుణ్యలోకముల కేఁగెడు నిమ్ముని సత్యనిష్ఠఁ బెం
పెక్కినయన్నరేశ్వరుని నేమిటి కిమ్మెయిఁ గాసిపెట్టెడిన్.
| 186
|
విశ్వామిత్రునిశాపమున విశ్వేదేవతలు ద్రౌపదేయులై జనించుట
వ. |
అనిన నప్పలుకులు విని విశ్వామిత్రుండు రోషారుణితలోచనుం డై యవ్విశ్వనామ
దేవతలఁ జూచి మనుష్యపక్షపాతంబున నన్ను ధిక్కరించితిరి మనుష్యులు గండని
శపియించి తోన ప్రసన్నత్వంబు గైకొని మీకు సంతానంబు నుర్వి నుండకుండ
|
|
|
వలయుం గావున మీరు బ్రహ్మచారులై కామక్రోధలోభమోహమదమత్సరంబులం
బొరయక యల్పకాలంబున శరీరంబులు విడిచి దేవభావంబులు గైకొండని
యనుగ్రహించె నది కారణంబుగ విశ్వు లేవురు ద్రౌపదిగర్భంబునఁ బాండునందను
లేవురకు నుద్భవించి వివాహంబులు లేక దీర్ఘాయుష్యులు గాక చచ్చి రని చెప్పి
యప్పక్షివరులు భవత్ప్రశ్నంబు లన్నింటికి నుత్తరంబులు చెప్పితి మింక నేమి
వినవలతు చెప్పు మనిన జైమిని యి ట్లనియె.
| 187
|
తే. |
అమ్మహారాజు దుస్సహ మైనయట్టి, దుఃఖములఁ బొంది యక్కటా! తుది సుఖంబు
లనుభవించెనె యెప్పటియట్ల వినఁగ, వేడ్క యయ్యెడుఁ దత్కథవిధముఁ జెపుడ.
| 188
|
చ. |
అనవుడుఁ బక్షు లిట్టు లని రమ్మునివల్లభుతోడ గాధినం
దనుపటురౌద్రవృత్తి గని తల్లడ మంది పురీజనంబు లె
ల్లను దరియింప రానివగల న్దురపిల్లుచు నప్డు క్రమ్మఱం
జని రటు లార్తుఁ డై నృపతిసత్తముఁ డాలు సుతుండుఁ దోడ రాన్.
| 189
|
హరిశ్చంద్రుఁడు కాశి కేఁగుట
చ. |
తొలఁగనిసత్యధర్మములు తోడుగఁ దాలిమి యూఁది దుఃఖమ
న్జలనిధిఁ గూలుచు న్వివిధశైలములు న్నదులు న్మహావనం
బులును నతిక్రమించి యట భూవరుఁ డీశనివాసము న్మహీ
తిలకము సర్వమంగళము దివ్యము ముక్తిపదంబు నై భువిన్.
| 190
|
క. |
కర మొప్పెడు కాశీపుర, వరముఁ బ్రవేశించునెడ నవారితతేజ
స్స్ఫురణోగ్రుఁ గౌశికుం గని, ధరణీశుఁడు మ్రొక్కుటయు నతం డి ట్లనియెన్.
| 191
|
రాజు కాశియందుఁ గౌశికునిర్బంధమునం జింతాకులుం డగుట
తే. |
నీవు నుడివిననెల నిండె నేఁటితోడ, నేది మాసొమ్ము తెమ్ము మహీతలేశ!
యనిన నింకను దినమునం దర్ధమున్న, యది సహింపు మునీంద్ర! నీ వంతదాఁక.
| 192
|
క. |
అనవుడు నౌఁగా కని య, మ్మునిపతి వోవుటయు రాజముఖ్యుఁడు చేతో
వననిధి పిండలిపిండుగ, ఘనచింతామంథరంబు గలపఁగ మదిలోన్.
| 193
|
సీ. |
ఈమునీంద్రున కర్థ మీరెండుజాముల కెక్కడ సవరింతు? నెందుఁ జొత్తు?
నెడరు దీర్పఁగ బంధు లెచ్చటఁ గల రిప్పు? డెవ్వరి నడుగుదు హీనవృత్తి?
నెట్టు దట్టుదుఁ బ్రాణ? మేదెస పోదు? నే నెయ్యడ నడఁగుదు నింక? నకట!
నెలమితో విప్రున కిచ్చెద నని పల్కి యీ కున్నఁ గ్రిమిజన్మ మిపుడ వచ్చు
|
|
తే. |
నేమి సేయుదు? ననుచు నరేంద్రుఁ డలఁత, నెరియుచును మోము వ్రాల్చిననింతి యేడ్పు
టెలుఁగుతోఁ గన్నుఁగవ నశ్రు లొలుక జీవి, తేశుఁ గనుఁగొని సుదతి తానిట్టులనియె.
| 194
|
తే. |
ధీరమతి వీవు నిట్లు చింతింపఁ దగునె?, సత్యపాలన మొనరింపు సత్యహీనుఁ
డైనపురుషుదేహము దా శ్మశానతుల్య, మధిప! మేటిధర్మంబు సత్యంబ యండ్రు.
| 195
|
క. |
ఒనరఁగ హయమేధము లే, డొనరించితి రాజసూయ ముజ్జ్వలవిభవ
|
|
|
మ్మునఁ జేసితి సంతానమును బడసితి సుకృతి వీవు పుణ్యచరిత్రా!
| 196
|
వ. |
అనుచు నిట్టూర్పు లందంద సందడింపఁ గన్నీరు గడలుకొన న్గద్దదికానిరుద్ధకంఠి
యగుచు డెందంబున సుడిపడుతలం పెట్టకేలకు వెలువరించుకొని యమ్మహాదేవి
యిట్లనియె.
| 197
|
తే. |
పుత్రలబ్ధిఁ గృతార్థులు పొలుతు రుర్విఁ, గాన నన్నిప్పు డమ్మి యక్కౌశికునకు
ధనము పెట్టి సత్యమును మనిపికొనుము, బొంకుకంటెను జావైనఁ బొంక మనఘ!
| 198
|
క. |
అని చుఱచుఱఁ గొఱవి జూఁ, డినక్రియ సతి పలుకుటయును డెంద మవిసి య
జ్జనపతి పిడు గడిచినవిధ, మున మేదిని ముడిఁగి పడియె మూర్ఛాగతుఁ డై.
| 199
|
చ. |
పడి తెలివొంది లేచి పొరి బాష్పజలంబులు మేను కప్పఁ
బడఁతుకఁ జూచి నీవు మృదుభాషిణి వక్కట! యింత కోర్చి న
న్నడజడి పెట్టుమాట యిటు లాడఁగఁ గూడునె? హా! యవాచ్యము
ల్విడువు లతాంగి! యంచుఁ బటువేదనఁ గ్రమ్మఱ వ్రాలె మేదినిన్.
| 200
|
మ. |
పతి మూర్ఛాగతుఁ డైనఁ జూచి సతి బాష్పచ్ఛన్నవక్త్రాబ్జ యై
ధృతి యొక్కింతయు లేక వా విడిచి యార్తి న్హా! మహారాజ! హా
చతురంభోధిపరీతభూభువనభాస్వద్భాహుఖడ్గాగ్రచూ
ర్ణితవీరారిశరీరభూషితధరిత్రీభాగ! హా! వల్లభా!
| 201
|
తే. |
హా! హరిశ్చంద్ర! కనకపర్యంకతలము, నందుఁ బొందునీయంగమే యకట! చెనఁటి
నేలఁ గూలినయది నేఁడు నీచదైవ, మిట్టిదశ దెచ్చెనే దివిజేంద్రభోగ!
| 202
|
వ. |
అని విలపించుచు నమ్మహాదేవి భర్తృదుఃఖభారపీడితయై సొలసి నేల వ్రాలె నట్లు
తల్లియుఁ దండ్రియు నెవ్వరు దిక్కు లేక నిశ్చేష్టితు లై పడి యున్నం గనుం
గొని తదీయనందనుం డగుబాలుండు.
| 203
|
క. |
కన్నుల బాష్పము లురలఁగ, నన్నరవరుఁ జేర నరిగి యతిదైన్యముతో
నన్నన్న! యాఁక లయ్యెడి, నన్నము నా కిపుడు పెట్టుమని యడుగుటయున్.
| 204
|
ఆ. |
కాలకల్పుఁ డైనకౌశికుఁ డేతెంచి, శిశిరవారి వారి సేద దేర్చి
యేల నేలఁ బడఁగ లే లెము నృప! యీగ, రానియప్పు వగల నీన కున్నె?
| 205
|
క. |
అని యూఱడించి యేదీ, ధనము? ధరణినాథ! ధర్మతాత్పర్యము నీ
మనమునఁ గలదేని రయం, బునఁ బెట్టుము సత్యనిష్ఠఁ బొందుము నెమ్మిన్.
| 206
|
క. |
సత్యమున నున్న దీధర, సత్యమున వెలుంగుఁ ధరణి సత్యముననె తా
నిత్య మయి స్వర్గ మమరును, సత్యము ధర్మములలోఁ బ్రశస్తం బనఘా!
| 207
|
తే. |
వినుము తుల నిడి యెత్తుచో వేయితురగ, మేధములకంటె సత్యంబు మిగులఁదూఁగెఁ
గాన సత్యయుక్తుండవు గమ్ము సొమ్ము, దెమ్ము మమ్ము రమ్మనకు నీదెసకు నింక.
| 208
|
ఉ. |
క్రూరుఁడ వీ వనార్యుఁడవు కొంకవు బొంకఁగ నిట్టినీయెడం
గారణ మేమి మాకు నధికప్రియవాక్యము లాడుచుండ నం
|
|
|
భోరుహమిత్రుఁ డస్తగిరిఁ బొందెడుఁ బైకము చక్కఁబెట్ట కి
ట్లూరక యున్న నిత్తుఁ గడునుగ్రపుశాపము నీకు భూవరా!
| 209
|
చ. |
అని ముని యేఁగినం గడుభయమ్మునఁ దల్లడ మందునాథుఁ జూ
చీ నరవరేణ్య! నన్ను నెడసేయక యమ్మి ఋణమ్ము దీర్పు క్రో
ధనుఁ డగుచున్న కౌశికునిదారుణశాపముపాలు గాకుమీ
యని పలుమాఱు వేఁడుకొనునంగనమాటకు రాజు పొక్కుచున్.
| 210
|
క. |
మనమున రోఁతయు నొడఁబాటును బెనఁగొని మిక్కుటంపుడోలాయనముం
బెనుపఁగ ననృతభయంబును, మునిశాపభయంబు వనట ముంప వికలుఁడై.
| 211
|
ఆ. |
ఎట్టకేల కమ్మహివిభుండు మనమునఁ, దెగువఁ జేసి మగువమొగముఁ జూచి
యకట! నిర్దయాత్ములైననృశంసులఁ, బోల కేల నాకుఁ బోవ వచ్చు?
| 212
|
క. |
నిను నమ్ముకొనియెదం బద, వనరుహదళనేత్ర! యనుచు వారాణసి చొ
చ్చి నరేంద్రుఁడు బాష్పంబులు, గనుఁగవ వెల్లిగొన నెలుఁగు గడలుకొనంగన్.
| 213
|
హరిశ్చంద్రుఁ డంగడివీథిని భార్యాపుత్త్రుల నమ్ముట
సీ. |
ఓపురజనులార నాపత్ని నమ్మెద నే దాసిఁగా వెల యెఱిఁగి పెట్టి
కొనుఁడు న న్నెవ్వఁడవని యడిగెదరేని నే నృశంసుండను దానవుండ
నతిపాపకర్ముఁడ నాలి నమ్ముకొనంగ నరుగుదెంచినకఠినాత్మకుండ
ననుచుండ నొక్కబ్రాహ్మణవృద్ధు చనుదెంచి మత్ప్రియాంగన సుకుమారి పనికిఁ
|
|
ఆ. |
జాల దిచ్చెదేని చయ్యన వెలఁ జెప్పు, వరవు డెట్లు మాకు వలయు ననిన
విభుఁడు విపులదుఃఖవేదనఁ బలుక నో, రాడ కున్న నంత నాద్విజుండు.
| 214
|
ఆ. |
తగినయంతధనము దాన యన్నరనాథు, వల్కలముల ముడిచివైచి యెడిసి
వెలుచ నాలతాంగి పెడఁబాయఁ దలవట్టి, యీడ్చె నీడ్వ నేడ్పుటెలుఁగుతోడ.
| 215
|
ఆ. |
విడువవయ్య తండ్రి! తడయక వచ్చెద!, వీఁడె నన్నుఁ జూచి వెగచి వెగచి
కొడుకు దద్ద వెగడు పడి యేడ్చుచున్నాఁడు, బుజ్జగింతు ననుచుఁ బుత్త్రుఁ గాంచి.
| 216
|
క. |
అన్నన్న! నన్ను ముట్టకు, మన్న! నృపతనూజ! దాసి నశుచి ననుచుఁ బైఁ
గన్నీరు వెల్లిగొనఁగా, నున్న జననికొంగు బాలుఁ డుడుగక పట్టెన్.
| 217
|
తే. |
పట్టి విడువక యేడ్చినఁ బట్టి తల్లి, పెట్టి పోఁ జాల కర్మిలి పెద్ద యడలి
విప్రుఁ గనుఁగొని వీనిని విలువవయ్య!, గోవుతోడన వత్సముఁ గొనువిధమున.
| 218
|
వ. |
అని యద్దేవి యత్యంతదీనానన యై ప్రార్థించిన నతండు శాస్త్రవిదులు పురుషునకుఁ
బెక్కువేలుమాడలు నంగనకు నర్థంబునుం చెప్పుదురు గావున నిక్కుమారునకు వేన
వేలుమాడలు గొను మని యన్నరపతి కిచ్చి యయ్యిరువుర నీడ్చుకొని పోవం
గనుంగొని నిట్టూర్పు లందంద సందడింప వీపులు వేదనాదూమానమానసుం
డగుచు నమ్మానవేంద్రుండు.
| 219
|
చ. |
అనిలుఁడు నర్కుఁడు న్శశియు నైనను గానరు మున్ను దన్ను న
త్యనుపమరాజ్యభోగమహిమాతిశయంబున నట్టికాంత నేఁ
డినకులరత్న మై వెలుఁగునిట్టిసుతుండును దాను నాకతం
బున వరవుందనంబునకుఁ బోయెనె యేగతిఁ బోదు దైవమా!
| 220
|
మ. |
అని దుఃఖింపఁగఁ గౌశికుం డచటి కుద్యద్వేగుఁ డై వచ్చినన్
జననాథుం డిదె సొమ్ము కొమ్మనిన నాస్వల్పార్థముం జూచి కో
పనుఁ డై యంతట దక్షిణాధనము సంపన్నంబుగాఁ జేసితే
నను గారించెదవేల? యింకఁ దడ వైనం శాప మిత్తుం జుమీ!
| 221
|
ఆ. |
ప్రొద్దు జాము తక్కుపోయి నే వచ్చెద, వేయుఁ జెప్ప నేల? వేగ కొఱఁత
ధనము పెట్టవలయు నని యప్పు డిచ్చిన, ధనము గొని యతండు సనియెఁ జనిన.
| 222
|
హరిశ్చంద్రుఁడు ద న్నమ్ముకొనుట
ఉ. |
ఆనరనాథుఁ డప్పుడు భయమ్మున శోకము నగ్గలింపఁగా
దా నెద నాత్మవిక్రయము దక్క ధనంబున కేయుపాయముం
గానక నిశ్చయించి యధికధ్వని ని ట్లను నన్ను నమ్మెద
న్మానుగ నెవ్వ రైనను ధనం బిటు దెండు గొనుండు నావుడున్.
| 223
|
వ. |
అయ్యవసరంబున ధర్ముండు రయంబున.
| 224
|
మ. |
నిడుమోముం గుఱుగేలు గుండకడుపు న్నీలత్వము న్మిట్టలు
న్గడుదీర్ఘంబులు నైనదంతములు పింగశ్మశ్రుకేశంబులు
న్జెడుగుంగంపును గల్గి హేయ మగునీచీభావముం దాల్చి తా
జడక ల్లట్టి నికృష్టయష్టికరుఁ డై చండాలవేషంబుతోన్.
| 225
|
కొనవచ్చినచండాలునకును హరిశ్చంద్రునకునైన సంవాదము
క. |
ఇల గోలఁ దట్టుచు న్సం, బళి సంబళి యనుచుఁ గ్రందుపడుజనములకు
న్దొలఁగుచు నొదుఁగుచు నాభూ, తలపతికడ కరుగుదెంచి తా ని ట్లనియెన్.
| 226
|
సీ. |
నేను జండాలుఁడ నృపవర! పురమున వీరవిఖ్యాతుఁడ ధీర! వినుము
చంపఁగఁ దగువారిఁ జంపెడివాఁడఁ జచ్చినవారిమొగములచీర లెపుడుఁ
గొనియెడివాఁడ నెక్కుడుసొమ్ము గలవాఁడ నెంతయర్థం బైన నిచ్చి నిన్ను
విలిచెదఁ జెప్పుమా వెల యన్న నారాజు మాలను సేవించి మనుటకంటెఁ
|
|
తే. |
గౌశికోగ్రశాపాగ్నిచేఁ గ్రాఁగి పోవు, టైన మేలని తలఁప నమ్మౌని యరుగు
దెంచి నృపుఁ జూచి నాయప్పు దీర్ప రాదె, యధికధనము నీ కిచ్చు వీఁ డనిన విభుఁడు.
| 227
|
చండాలదాస్యమునకై కౌశికహరిశ్చంద్రసంవాదము
క. |
ఇనవంశంబునఁ బుట్టిన, మనుజేంద్రుఁడ నఖిలలోకమాన్యుఁడఁ గొఱమా
లినమాలని నకట! తపో, ధనసత్తమ! యేను గొలువఁ దగునే? చెపుమా.
| 228
|
మ. |
కరుణం జూడుము కావు మిప్పుడు త్రిలోకస్తుత్య! చండాలసం
కరదోషంబును బొందకుండఁగ ననుఁ గైకొమ్ము నీబంటుగాఁ
బరిశిష్టం బగుసొమ్ము నాకు వెలగా భావింపు మంచు న్మునీ
శ్వరుపాదంబులు వట్టెఁ జేతుల హరిశ్చంద్రుండు దైన్యంబునన్.
| 229
|
ఉ. |
అక్కట! యేమి సెప్పఁ గఠినాత్మకుఁ డమ్ముని యిట్టు లార్తుఁ డై
మ్రొక్కినరాజుఁ గన్గొని యమోఘముగా ననుఁ గొల్చి బంటవై
దక్కితి గాన మాలనికి దక్కఁగ నమ్మితి నేను నిన్ను వీ
డక్కఱ దీఱ నిచ్చు నొకయర్బుదవిత్తము నాకు నావుడున్.
| 230
|
ఉ. |
మాలఁడు వొంగి యమ్మునికి మానుగ నద్ధన మిచ్చి పట్టి భూ
పాలుని నంటఁ గట్టి యకృపామతిఁ గొంకక చేతికోలఁ బై
తో లెగయంగ వ్రేసి వెసఁ దోడ్కొని పల్లెకుఁ బోయె నేరికిం
గాలవశంబునం గలుగుకర్మఫలంబులు దప్ప నేర్చునే?
| 231
|
వ. |
ఇట్లమ్మహారాజు కాలవశంబునం జండాలపక్కణగతుండై దురంతదుఃఖార్ణవంబునం
దేలుచుం దనమనంబున నిజజీవితేశ్వరిం దలంచి.
| 232
|
క. |
బాలునిదీనం బగుమో, మాలోకించుచును శైబ్య యత్యంతావర్తిం
దూలి తనదాస్య ముడుపం, జాలుదు నని నన్నుఁ దలఁచు సతతము నకటా!
| 233
|
క. |
నాపా టెఱుంగ దింతయు, నాపుత్త్రుఁడు ననుచుఁ బొక్కు నత్యంతపరీ
తాపంబు నొందు మాలని, చేపడుటకుఁ బేరుఁ బెంపుఁ జెడిపోవుటకున్.
| 234
|
వ. |
ఇవ్విధంబున హరిశ్చద్రుండు నిరంతరవేదనానలదందహ్యమానమానసుం డగు
చుండ నొక్కనాఁ డతనితో నాచండాలుండు నీకుఁ గాటికాపరితనం బిచ్చితి నందుఁ
బుట్టినధనంబునందు రాజునకు నాఱవభాగంబును నాకు మూఁడుపాళ్లునుం బెట్టి
నీవు రెండంశంబులు గొని బ్రతుకు మని నియమించి పంచిన మహాప్రసాదం బని
వారణసీపురంబుదక్షిణంబునకుం జని.
| 235
|
హరిశ్చంద్రుఁడు శ్మశానవాసము చేయుట
సీ. |
శవదహనోద్భూతసంతతధూమంబు బహువిధదుర్గంధబంధురంబు
కేశచితాభస్మకీకసకీర్ణంబు బేతాళడాకినీభూతచితము
వాయసగృధ్రగోమాయుకలకలంబు మేదోవసామాంసమేదురంబు
మృతబంధుశోకార్తసతతహాహారవ మమితకపాలపిండాన్నసాంద్ర
|
|
తే. |
ముజ్జ్వలాగ్నిశిఖావృతవ్యోమభాగ, మగుచు నత్యంతవిస్తారమైనభీక
రశ్మశానమ్ము గని యద్ధరావిభుండు, దానిఁ దఱియంగఁ జని యందుఁ దా వసించి.
| 236
|
ఉ. |
కాలియ పట్టినట్లు గడుఁ గంది కృశుం డయి వీడి వెండ్రుక
ల్దూలఁగ లాంఛనధ్వజముతో లగుడంబు తగ న్ధరించి ప్రే
|
|
|
తాలయ మెల్లఁ ద్రిమ్మరుచు నాయతు లన్నియుఁ గొంచు రాజు పె
న్మాలతనంబు నొందెఁ గొఱమాలినదైవముచెయ్ది నక్కటా!
| 237
|
సీ. |
ప్రాణంబుతోడ జన్మాంతరంబును బొందె నిట్లు హరిశ్చంద్రుఁ డేమి చెప్పఁ?
బీనుంగులకుఁ బెట్టుపిండము ల్గుడుచుచు మేదోవసామాంసమిళితపంక
ముల నెప్పుడును బ్రుంగు చొలికి బూడిదలలోఁ బొరలుచుఁ గట్టినబొంత గప్పు
చొడలిదుర్గంధంబు సుడియంగ వడిని జుగుప్ప రూపంబు గైకొన్నమాడ్కి
|
|
ఆ. |
సతీనికృష్టవృత్తి నార్తుఁడై సుతసతీ, సుహృదమాత్యబంధుసుఖవియోగ
వేదనానలమున వేఁగుచు నమ్మెయి, నుండ నెలలు పదియు రెండు నిండె.
| 238
|
హరిశ్చంద్రుఁడు శ్మశానమునఁ గల గాంచుట
వ. |
అంత నొక్కనాఁ డమ్మహీపతి పరేతనికేతనంబున నిద్రించి యత్యద్భుతంబైన కలఁ
గాంచె నెట్లనినఁ దాను జండాలికాగర్భంబున నుద్భవించి సప్తవర్షవయస్కుండై
యొక్కశ్మశానంబున మృతసంస్కారమాల్యాహరణాధికారంబున నుండం గొందఱు
విప్ర లొక్కశవంబు గొనివచ్చి దహనవేతనంబునకై తనచేతం బరాభూతి నొంది
కోపించి ఘోరనరకంబునం బడు మని శపించిన నప్పుడు కాలకింకరులు దన్నుం
బట్టుకొనిపోయి తప్తసికతానలప్రదేశంబుల నడిచియుఁ బొడిచియుఁ గాల్చియుఁ
బ్రేల్చియుఁ గండలు గోసియు నూనియ నుడికించియుఁ బురీషకూపంబుల ముంచియు
ననేకక్రూరదండంబులు దండింపం బూయశోణితంబులు ద్రావుచు నొక్కొక్క
దినంబు శతవత్సరంబులుగా వత్సరద్వయం బధికదుఃఖంబు లనుభవించి నారకభవో
త్సార్యమాణుండై క్రమ్మఱ మహీతలంబునం బడి ఖర శునక హస్తి వానర చ్ఛాగ
బిడాల కంక గృధ్ర మత్స్య కూర్యాదినానాకుయోనులం బుట్టి సార్ధహాయనంబు
తీవ్రవేదనలపాలై యెప్పటిరాజస్థితి వడసి జూదంబున నాలిని గొడుకును
రాజ్యంబును గోలుపడి యేకాకియై యడవుల కరిగి సింహంబుబారిం బాఱి శర
భంబుచేత రక్షితుఁడై దానిచేత నతిపీడితుం డగుచు భార్యానందనులం దలంచి
వందురితిరుగుచు నొక్కయెడ నయ్యిరువురుఁ దమ్ము రక్షింపుమని తన్నుం బేర్కొని
పిలుచునెలుంగులు విని డాయం బోయి వారలం గానక పరిభ్రమించుచుండం బది
యేనుదివసంబులు గొఱంతగాఁ బండ్రెండేఁడులు నిండినతఱి విశ్వామిత్రుచే నంత
వృత్తాంతంబు నెఱింగి జముండు తనకడకు రప్పించి యిది యెల్లఁ గౌశికరోషంబున
నయ్యె దానం జేసి భవన్నందనుండు మృత్యుగతుం డగుం బదంపడి పరమశుభంబు
గలుగు దుఃఖశేషంబు గుడువ మనుష్యలోకంబునకుఁ బొ మ్మని త్రోపించిన నంతరిక్షం
బున నుండి నేలంగూలినవాఁడై బిట్టు మేల్కాంచి.
| 239
|
క. |
కడుభీతియు బెగ్గలమును, నడరఁగ నిది యొక్కకల మహాద్భుత మేని
య్యిడుమలు పండ్రెండేఁడులు, పడితినొ! కలయో! నిజంబొ! భ్రమయో! యకటా!
| 240
|
క. |
ఈదుఃఖము సుఖ మయ్యెడు, నాదుఃఖములకును నగ్గ మైతిమి విధిచే
|
|
|
నీదుస్స్వప్నము నెపమున, నీదుర్దశకంటె నింక నేదెస యగునో!
| 241
|
తే. |
అనుచు నెంతయుఁ దలరి యమ్మనుజవిభుఁడు, మోడ్పుఁగేలు శిరంబున మోపి వేల్పు
లార! యెప్పుడు నేకీడు చేరకుండఁ, గరుణ ననుఁ బుత్రు నింతిని గావరయ్య!
| 242
|
క. |
అని పలికి నృపతి శవవే, తనకారణమునను నంత దలఁపును జెడి భా
ర్యను బుత్రు మఱచి ప్రేతస, దనసంచరణంబునందుఁ దత్పరుఁ డయ్యెన్.
| 243
|
వ. |
అంత నమ్మహీవల్లభువల్లభ యొక్కనాఁడు.
| 244
|
చ. |
ఉరగముచేతఁ జచ్చినతనూద్భవునిం గొని శోకవేదనా
పరవశయు న్వికీర్ణకచభారయు నుద్దత బాష్పపూరయు
న్గదరతలతాడితాస్యయును గద్గదికావికలార్తనాదయు
న్జరణవిపర్యయాపగతసత్వరయానయు నై పొరిం బొరిన్.
| 245
|
వ. |
ఏడ్చుచుం బరేతనికేతనంబున కేతెంచి యక్కుమారు నొక్కయెడ నీడి కూర్చుండి.
| 247
|
మృతపుత్రులైన చంద్రమతీహరిశ్చంద్రులు శ్మశానమున దుఃఖించుట
ఉ. |
బోరనఁ బొంగి శోకరసపూరము నిర్భరబాష్పపూరము
ల్వారక కన్గవం దొరఁగ వాతెఱ లాలలు గ్రమ్ము దేర హా
హారవము ల్సెలంగ విరియంబడి వేనలి ధూళి బ్రుంగ న
క్కూరిమిపట్టిఁ బేర్కొనుచుఁ గోమలి మేదినిఁ జేతు లూఁదుచున్.
| 247
|
సీ. |
బహువిధంబులఁ బ్రలాపం బొనర్చుచు నేడ్చుసతియేడ్పు విని డాయఁ జని విభుండు
కార్చిచ్చు సోఁకినఁ గంది మ్లానత్వంబుఁ బ్రాపించుదీవియరూపు నొంది
యున్నట్టివనితఁ దదుత్సంగమున నున్న యహివిషవ్యపగతప్రాణుఁ డైన
సూనునిఁ జూచి యించుకయు నెఱుంగక యబ్బాలు శుభలక్షణావలులకుఁ
|
|
తే. |
జోద్యపడి యేనరేంద్రునిసుతుఁడొ వీఁడు?
కాలుఁ డెటు మ్రింగెనో వీనిఁ గరుణమాలి?
యనుచు మదిలోనఁ దలఁచి యాఘనుఁడు లోహి
తాస్యుఁ డింతకు నింత ప్రాయంపువాఁడు.
| 248
|
తే. |
వాఁడు గాఁడు గదా బలవంతుఁడైన, యంతుకునిచారిఁ బడి యిటు లైనవాఁడు
నాఁగ నద్దేవి మఱియు నానావిధములఁ, గొడుకుఁ బనపుచు నాథుఁ బేర్కొనుచు నడలి.
| 249
|
క. |
అక్కట! దైవము రాజ్యము, ద్రెక్కొని యాలిం దనూజుఁ దెగ నమ్మంగా
నెక్కొలిపి హరిశ్చంద్రుని, నిక్కడఁ గాడ్పఱిచె నింక నేగతిఁ బోదున్?
| 250
|
చ. |
అని పలుక న్విభుండు విని యప్పుడు దా మది వారల న్నిజాం
గనయు సుతుండు గా నెఱిఁగి గ్రక్కునఁ జేష్ట యడంగి కూలె నే
ల నతని నాథుఁగా నెఱిఁగి లాలలు వాదొరఁగంగఁ దీవ్రరో
దన మొనరించుచుం బడియెఁ దామరసానన మూర్ఛ గప్పినన్.
| 251
|
వ. |
ఇట్లు మూర్ఛిల్లి యిరువురు గొంతవడికి నొక్కటఁ దెలివొంది రంత న న్నరేం
ద్రుఁడు నందనుం గనుంగొని.
| 252
|
చ. |
అలరుమొగంబుతోడఁ గడు నర్మిలి నా కెదు రేల రావు చే
తులు పచరించుచుం దనువుధూళి మెయిం దొరయంగ నేల న
న్నెలమిని గౌఁగిలించుకొన వెంతయుఁ దీ పెసలార మంజులో
క్తులచవి యేల నా చెవులకుం జవిఁ జూపవు నీవు పుత్రకా!
| 253
|
చ. |
అనుచుఁ దనూజు నెత్తికొని యక్కునఁ జక్కఁగఁ జేర్చి మోము మో
మునఁ గదియించి బాష్పజలము ల్పొరిఁ బెల్లుగ నించి యేడ్చు హా!
యని యకటా! కుమార! తెగ నమ్మితిఁ బాపము చేసి చీర య
మ్మినయటు లిట్టు నిన్వెదకి మ్రింగునె దైవము క్రూరసర్పమై.
| 254
|
క. |
నీ విటుగాఁ జూచియు నా, జీవ మెడల దున్నయపుడు చిత్తమ్మున మో
హావేశము తండ్రులకు స్వ, భావము సు మ్మిట్లు సుతులపై సుగుణనిధీ!
| 255
|
తే. |
నెఱయ నర్మిలి నెనయునీ నెమ్మొగంబు, ఘనభుజంగవిషవ్యాప్తి గాజువాఱి
రాహుకబళితరోహిణీరమణుమాడ్కి, నుండఁ గనుఁగొని యే నెట్లు నుందుఁ గుఱ్ఱ.
| 256
|
వ. |
అనుచు నత్యంతశోకాగ్నిసంతప్తుం డై మహీతలంబునం బడిన నద్దేవి కొడుకువలని
శోకంబు విడిచి జీవితేశ్వరుజుగుప్సితం బైనచండాలభావంబుఁ జూచి విస్మయంబు
ననుతాపంబును దైన్యంబును గా ని ట్లనియె.
| 257
|
తే. |
పొడువు నిడుదయు నై కడుఁ బొలుచునితని
ముక్కుతుద యంతయును గడు నొక్కువడియెఁ
గుసుమముకుళసన్నిభరదాంకురము లింత
కంది యొవ్వెడునే దైవఘటన యకట!
| 258
|
క. |
దేవసమానుం డగునీ, భూవిభునకు సకలరాజపుంగవునకు ని
ట్లేవపుఁజండాలత్వముఁ, గావించినదైవమునకుఁ గరుణయుఁ గలదే.
| 259
|
క. |
కరితురగరథపదాతులుఁ, గర మమర సితాతపత్రకాంచనమయచా
మరములు పొడగాన మహీ, శ్వర! యెక్కడ నడఁగె నీదువైభవ మెల్లన్?
| 260
|
సీ. |
రవి దాఁచి చూడంగ నవునట్టినీమేన నొదుగుమాలిన్యంబు గదిరి యుండ
శత్రుభీకర మైనశాతాసి నమరునీకేల నీచపుబరిగోల యుండ
లలితమకుటదీప్తిఁ బొలుచునీశిరమున శవసమర్పితమాల్యసమితి యుండ
విమలదివ్యాంబరావృతి నొప్పునీకటిఁ గుత్సితం బగుబొంతకోక యుండఁ
|
|
తే. |
జేసెనే దైవ మానతక్షితిపశేఖ, రప్రభాజాలసతతవిరాజమాన
చరణకమలసుందర! హరిశ్చంద్ర! సకల, బుధమనఃకైరవాకరపూర్ణచంద్ర!
| 261
|
క. |
విలసితమణిహర్యస్థల, ములఁ దగ విహరించునీకు భూతపిశాచా
కులశవధూపవృతాంబర, తల మగుప్రేతాలయంబు ధామం బయ్యెన్.
| 262
|
తే. |
అనుచు నత్యంతమోహశోకార్తి నొంది, నాథు మెడ వట్టికొని యేడ్చె నలినవదన
యకట కల యిట్లు నిక్కల యగునె? యనుచుఁ, బనవె విభుఁ డెట్టికల గంటి పార్థివేంద్ర!
| 263
|
వ. |
అక్కలఫలం బిట్టిద యయ్యెనేని ధర్మసహాయత్వంబు లేదు గాక నిక్కంబును మనకు
దేవబ్రాహ్మణ ప్రసాదంబును సత్యధర్మజ్ఞానానృశంస్యంబులును గలిగినయట్లైన నీయట్టి
పరమథార్మికుండు రాజ్యపరిభ్రంశంబు నొంది యీదురవస్థం బడునే? యని దుఃఖిత
యగునద్దేవికి నన్నరపతి దనకన్నకలతెఱం గంతయు నెఱింగించి యయ్యింతివలనం
బుత్త్రమరణప్రకారం బెల్ల నేర్పడ విని నిట్టూర్పులు నిగుడ నత్యంతసంతాపాంత
రంగుండై శైబ్య నాలోకించి వంశకరుం డైనయీయొక్కశిశువును దైవగతిం బోవ
వగలకుం గొలు వగుచుఁ గుందం జాల వీనియెడలితోడన యనలంబునం బడియెద
నన్నేలినచండాలునియనుజ్ఞ లేకున్న నింకొక్కపుట్టువున నైన వానికి బంట
నయ్యెద నీదుర్మరణంబునం జేసి యనేకఘోరనరకంబు లైనను ననుభవించెద దాన
యజనయాజనగురుపూజనంబు లొనరించినవాఁడ నైతినేని పరలోకంబున నైన
మన మెప్పటియట్ల కూడి యుండెదము వినుము నగియును నే నెన్నండును బొంకు
పలుక నా కిదియ నిశ్చయంబు నీకు ననుజ్ఞ యిచ్చితి నీ వరిగి యమ్మహీదేవు దేవునిం
బోలె నారాధింపు మని పలికిన నపు డయ్యింతి గరం బలఁగి యిట్లనియె.
| 264
|
తే. |
కొడుకు నీవును జిచ్చునఁ బడఁగఁ జూచి, యేను జీవంబుతో నుందునే నరేంద్ర?
నాకలోకసుఖం బైన నరక మైన, ననుభవింతును నీతోడ నరుగు దెంతు.
| 265
|
క. |
అనవుడు నొడఁబడి విభుఁ డిం, ధనములు పొదగా నొనర్చి దానిపయిఁ దనూ
జుని నీడి భార్యయుఁ దన పిఱుఁ, దన నిలువం గేలు మొగిచి తత్పరమతియై.
| 266
|
హరిశ్చంద్రునొద్దకు సకలదేవతలు వచ్చి తత్సుతుఁ బ్రతికించుట
సీ. |
స్మితమధురాననశ్రీరమ్యు ధవళవిశాలాక్షు రుచిరకపోలఫలకు
రమణీయనాసాభిరాముని శ్రీవర్ణకర్ణుఁ దామ్రాధరకాంతిసుభగు
నాజానులంబమహాబాహుపరిఘు విస్తీర్ణదృఢోరస్కు సింహమధ్యు
ఘనతరకటిచక్రుఁ గమనీయజంఘుని శోభనాంభోరుహస్ఫురితచరణు
|
|
తే. |
హారకేయూరమణిమకుటాదివివిధ, దివ్యభూషణదీప్తిదేదీప్యమాను
శంఖచక్రగదాపద్మశార్ఙ్గముసల, ఖడ్గవనమాలికాచిహ్ను ఘనసవర్ణు.
| 267
|
క. |
నారాయణుఁ బీతాంబరు, శ్రీరమణీరమణు భక్తచింతామణి దు
ర్వా విపద్ధ్విషకుంభవి, దారణనిపుణాభిధానదైవతసింహున్.
| 268
|
సీ. |
తలఁచుచు నున్న యాధరణీశునొద్దకు ధర్ముండు మొదలుగాఁ దత్క్షణంబ
వాసవప్రభృతిగీర్వాణు లంభోరుహభవుఁడును సకలదిక్పతులు నాగ
గరుడగంధర్వకిన్నరసిద్ధసాధ్యులు విశ్వులు రుద్రులు నశ్విబుధులు
మఱియును గలయట్టిమాననీయామరు లాకౌశికుఁడు వచ్చి రపుడు ధర్ముఁ
|
|
తే. |
డోహరిశ్చంద్ర! సాహస ముడుగుమయ్య!, నీతితిక్షాతపస్సత్యనిష్ఠ కేను
మెచ్చి వచ్చితి సుర లెల్ల వచ్చినారు, వీరె యని చూపె నప్పుడు వేల్పుఱేఁడు.
| 269
|
ఆ. |
కుసుమవృష్టితోన కురియించె నపమృత్యు, హరణనిపుణ యైనయమృతవృష్టిఁ
బుడమిఱేనిముద్దుఁగొడుకుపై నభమున, దివ్యతూర్యరవము దివురుచుండ.
| 270
|
క. |
అమృతము సోఁకిన నారా, కొమరుఁడు దొల్లింటికంటెఁ గొమరై తనుకాం
తి మెఱయ నిద్ర దెలిసి వే, గను మేల్కొనునట్లు లేచి కడు నొప్పారెన్.
| 271
|
చ. |
జనవిభుఁ డంత విస్మయరసంబునఁ దేలుచుఁ దాను నింతియుం
దనయునిఁ గౌఁగిలించుకొని తద్దయు నొప్పిరి సమ్మదంబు పెం
పొనరఁగ దేవతామహిమ నుజ్జ్వలకాంతియు దివ్యమాల్యలే
పనధవళాంబరాభరణభాతియు మేనుల నగ్గలింపఁగాన్.
| 272
|
స్వర్గప్రయాణవిషయమై ధర్మేంద్రహరిశ్చంద్రులసంవాదము
వ. |
అప్పు డమరేంద్రుఁడు హరిశ్చంద్రున కి ట్లనియె.
| 273
|
చ. |
నరుల కగమ్యమై వెలుఁగు నాకము నీకభిగమ్య మయ్యె
నిరుపమసత్యధర్మమహనీయత శాశ్వతదివ్యభోగముల్
దొరకొనియె న్నరేశ్వర! సుతుండును భార్యయు నీవు నూత్నర
త్నరుచిరసద్విమానము ముదమున నెక్కుఁడు రండు నావుడున్.
| 274
|
తే. |
అమరనాథ! చండాలదాస్యంబు గలుగు, నాకు నాకంబునకు నెట్లు రాక గలుగు?
ననిన నిట్లను ధర్ముండు విను నరేంద్ర!, యేను జూవె చండాలతఁ బూని నీకు.
| 275
|
వ. |
అవశ్యభావి యైనదుఃఖంబు భోక్తవ్యం బగుట నిట్లు చేసితి భవత్సుకృతలబ్ధంబు
లైనదివ్యభోగంబు లనుభవింపు మనిన హరిశ్చంద్రుం డింద్రున కిట్లనియె.
| 276
|
క. |
అనిమిషవల్లభ! విను నీ, కొనరించెద భక్తి మ్రొక్కి యొకవిన్నప మే
ననిశము శోకాతురులై, ననుఁ బాయఁగఁ జాల కున్న నాపురజనులన్.
| 277
|
క. |
హితుల ననన్యశరణ్యుల, నతిభక్తుల విడిచి వచ్చునమరావతి నా
మతి రుచియింపదు గావున, శతమఖ! యే రాను నీవు సనుము మహాత్మా!
| 278
|
క. |
అరయంగ బ్రహ్మహత్యయు, గురుహతి వనితావధమును గోవధమును నాఁ
బరగుదురితములు నాశ్రితుఁ, బరిత్యజించుటయు నొక్కభంగియ యెందున్.
| 279
|
క. |
నాతోడఁ గూడ సురపురి, కేతెంతురు పౌరు లొండె నేగుదుఁ బౌర
వ్రాతముతో నే నొండె సు, ఖేతర మగునరకమున కహీనచరిత్రా!
| 280
|
వ. |
అనిన నింద్రుండు హరిశ్చంద్రున కి ట్లనియె.
| 281
|
తే. |
వినుము పుణ్యపాపంబులు వేఱువేఱ, నుండు భిన్నంబులై మానవోత్కరముల
కెట్లు సంఘాతభోగ్యత్వ మీవు గోరె, దమరపురమున కనిన ని ట్లనియె నృపతి.
| 282
|
ఆ. |
ఘనకుటుంబు లైన జనులపెంపున రాజ్య, మనుభవించి నృపతి యధ్వరంబు
లొగి నొనర్చుఁ గాన యుపకారు లైనట్టి, జనుల నెట్టియెడలఁ జనదు విడువ.
| 283
|
అయోధ్యాపురజనులతో హరిశ్చంద్రుఁడు స్వర్గమున కరుగుట
వ. |
కావున సజ్జనంబులకు సామాన్యదానజపతపఃఫలంబులను బహుకాలోపభోగ్యంబు
లైనమదీయపుణ్యకర్మఫలంబులను వారు నేనుం గూడి భవత్ప్రసాదంబునం
దివంబున నొక్కదివసం బైన ననుభవించెద మనిన ననిమిషవల్లభుం డతనితో
నియభిమతం బెట్లట్ల చేసెద నని పలికె ధర్ముండును విశ్వాత్రుండును బ్రసన్న
|
|
|
చిత్తులై దాని కొడంబడి రంతం జాతుర్వర్ణజనసమృద్ధం బైనయయోధ్యానగ
రంబున కరిగి పురుహూతుం డప్పురజనంబుల నెల్లం బిలిచి యత్యంతదుర్లభం బైన
దివిజభవనంబు ధర్మదేవతాప్రసాదంబున మీకు సులభం బయ్యె నాకలోకంబున
నుండి మహీతలంబుదాడ ననేకకోటివిమానంబులు సోపానంబులై యున్నవి.
మీ రిమ్మార్గంబునం జనుదెండనినం బ్రహృష్టహృదయులై యప్పుణ్యులు పుత్ర
కళత్రభృత్యసమేతం బడుగడుగునకు విమానంబు లెక్కికొనుచుం ద్రివిష్టపంబు
నకుం బోవం దొడంగిరి. హరిశ్చంద్రుండును సురమునిగణంబులతోడ లోహి
తాశ్వకుమారున కభిషేకపట్టబంధంబు లొనరించి యాత్మీయాఖిలరాజ్యపదస్థుం
గావించి ప్రమోదంబున సమస్తజనంబులం దోడ్కొని దివంబున కరిగె నని చెప్పి.
| 284
|
మ. |
సమకూర్పు న్వివిధార్థసంపదలు భాస్వద్రాజ్యము న్ధివ్యభో
గము భార్యాసుతలాభము న్సకలమాంగల్యంబుల న్పౌమన
స్యము దీర్ఘాయువుఁ బ్రీతి చిత్తముల సొంపారు న్హరిశ్చంద్రును
త్తమచారిత్రము విన్న మానవులకు దైవప్రసాదంబునన్.
| 285
|
ఆశ్వాసాంతము
చ. |
నిరుపమనీతిసార! మహనీయగుణోజ్జ్వలరత్నహార! మం
దరగిరిధీర! రూపజితదర్పకవీర! విలాసినీమనో
హర! మహనీయసంతతవిహార! వినిర్మలసద్విచార! వి
స్ఫురితయశోలసత్కనకభూధరకందర! శౌర్యమందిరా!
| 286
|
క. |
బాలారతికేళీపాం, చాలా! మృదుమధురహితవచనవాచాలా
భూలోకభరితసుగుణవి, శాలా! సూరిజననికరసఫలరసాలా!
| 287
|
మాలిని. |
అహితనగబిడౌజా! యన్వయాంభోధీరాజా!
సహజసుకృతబీజా! చాతురీనవ్యభోజా!
మిహిరసదృశతేజా! మేదినీకల్పభూజా!
మహితగుణసమాజా! మల్లమాంబాతనూజా!
| 288
|
గద్యము. |
ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర
తిక్కనామాత్యపుత్ర మారయనామధేయప్రణితం బైనమార్కండేయపురా
ణంబునందు జైమిని మార్కండేయునికడ కరుగుదెంచుటయు నతనికి నమ్మహా
మునీంద్రుఁడు పరమజ్ఞానచక్షులైన పక్షులజన్మప్రకారం బెఱింగించుటయు
నాపక్షులు జైమినికి భారతకథాశ్రయంబు లగునాలుగుప్రశ్నంబులకు నుత్త
రంబులు చెప్పుటయు హరిశ్చంద్రోపాఖ్యానంబును నన్నది ప్రథమాశ్వాసము.
|
|