మాయమ్మ మహిషాసుర


రాగం: కళ్యాణి /తాళం: మిశ్ర చాపు మార్చు


పల్లవి:
మాయమ్మ మహిషాసుర మర్దని జనని
మాయమ్మ కాయజారి గేహిని భవాని ||

చరణం 1:
సమాన రహిత హిమా చల సుత జాల మేల
నీకిది తగదిక
శమ దమాది మహిమాయుత శ్యామల రమణి
నన్ను కడుపార గన్న ||

చరణం 2:
చిన్న బిడ్డ యొక నేరము జేసిన ఎన్నడైన
జనని ఎగ్గులు సేయునే
నన్ను పాలించవే నా మొరలించవే
నిన్ను నమ్మితి నా తోడు నీడ ||

చరణం 3:
ఒసి పరాశక్తి ఓంకార రుపిణి యుల్లమందు ని
వసించు ముదమున దాసు రామ
హ్రుద వాస వినొదిని
దాసులకు కొంగు బంగారైన ||