శ్రీ రాగం - ఆది తాళం

మార్చు

పల్లవి:

మానవతి జ్ఞానవతి మహితమతి భారతి సరస్వతి ||

చరణం 1:

నీ నయ మెన్నగ నెవ్వరి తరము నిమిష రహితుల కునైన దుస్తరము
మానుగ నా వాక్కుల నిరంతరము
నీ నిల వరము నే కోరు వరము ||

చరణం 2:

ప్రాకట వీణాగాన భజనము భవ్య కావ్య మ్రుదు భావ కధనము
యే కడలను వాంచించు నా మనము
నీకు సేవనము నాకు జీవనము ||

చరణం 3:

మంజులమగు నీ మహిమము ఘనము
భంజిత దుర్మత భవ వాసనము
రంజిత దాసు శ్రీరామ కవనము రక్షిత ధనము మోక్ష సాధనము ||

"https://te.wikisource.org/w/index.php?title=మానవతి&oldid=410584" నుండి వెలికితీశారు