మాటాడి పొమ్మనవే

హిందుస్థాని కాపి రాగం -ఖండచాపు తాళం

మార్చు

పల్లవి:

మాటాడీ పొమ్మనవే మంజుల వాణి వాని నొక ||
నీటిమూట తో సాటి బూటకములేత్టికి మంచిది||

చరణం 1:

రద్ది యేల వద్దనుచు కొద్దిగాను బుద్ధి చెప్పి
ముద్దియ మోమున మోమిడి ముద్దులు గుల్కు వద్దజేరి యొక ||

చరణం 2:

చిన్న నాడే నన్ను గూడే వన్నెకాడే వాడనుచు
కన్నెమిన్న నిన్నే కోరి యున్నది ఇక వన్నె మీర నొక ||

చరణం 3:

భాసురాంగ గోపాలుని బాసలచే మోసపోతి
దోసమేమి చేసితినో దాసు రామ కవితాసుధా రుచి ||