మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/అవతారిక



అవతారిక

"నమ ఋషిభ్యో మంత్రకృద్యో మంత్రపతిభ్యో
 మామామృషయో మంత్ర కృతో మంత్ర కృతో మంత్రపతయేః షరా
 దుర్మాహ మృషీ న్మంత్రకృతో మంత్రపతీన్పరాదాం "

“మంత్రద్రష్టలు మంత్రపతులు నగు మహర్షులకు నమస్కారము, వారు నన్ను విడువకుందురుగాక ! నేను వారిని విడువకుందునుగాక!"

- కృష్ణయజుర్వేదము.

భారతదేశమున జన్మించిన ప్రతివ్యక్తికిని బరమపావనులగు భారతమహర్షులు త్రికాలస్మరణీయులు, భుక్తిముక్తి ప్రదాతలు. ఆధ్యాత్మి కౌన్నత్యమున, జ్ఞానప్రకాశమున, విజ్ఞానవిశేషమున. ధర్మ ప్రవచనమున, సర్వవిషయములందును భారతవర్షమునకేకాక యావత్ప్రపంచమునకును భారత మహర్షులే భిక్షాప్రదాతలు. విశ్వసంసృష్టికిని దత్సుస్థితికినీ వారె కారణభూతులు, అట్టి మహర్షుల సంతటిని జనించుటచేతనే భారతీయుఁడు విశిష్టసౌభాగ్య విలసితుఁడై విఱ్ఱవీఁగుట కధికారము గడించియున్నాఁడు. ఆ మహర్షుల పవిత్రాశీర్వచన బలముచేతనే నాఁటికిని నేఁటికిని నింక నేనాఁటికిని జ్ఞానతేజమును బ్రసరింపఁజేయుట కొక్క భారతీయుఁడే యర్హుఁడై యున్నాడు. ప్రపంచగురుత్వము వహించుట కాతఁడే నమర్థుఁడు. అజ్ఞానాంధకారబంధుర మగు పాశ్చాత్య ప్రపంచము విజ్ఞాన ప్రదీపమునకు భారతమహర్షులనే యాశ్రయింపక తప్పదు.

అట్టి మహామహులగు మహర్షుల జీవిత విశేషము లెఱుఁగుటకు వారి నాదర్శముగాఁ గైకొనుటకుఁ గుతూహల పడని భారతీయుఁ డుండఁడు. కాని వారి జీవితవిశేషము లేకముఖముగా నొకేచోటఁ గాక వివిధ పురాణాంతర్గతములై జిజ్ఞాసువుల కలభ్యము లగుచున్న వి. మఱియు సమన్వయశక్తి వివిధ పురాణ పరిశీలనా సామర్థ్యము లేనివారి కవి కొన్ని పరస్పరవిరుద్ధములుగను సర్దరిహితములుగను దోఁచుచుండుటలో నాశ్చర్యము లేదు. వివిధ పురాణవిదులగు విద్వద్వతంసు లీవైరుధ్యములను వైతొలఁగించి సమన్వయ మొనరించి యేకముఖముగా నింతవఱ కేభాషలోను గొనిరాకపోవుటతీఱని కొఱఁతయే యనక తప్పదు. ఈ పరిస్థితిలో భగవత్ప్రేరితుఁడనై ముహర్షుల పైఁ గల భక్తితాత్పర్యము లూఁతగాఁ గొని బహుపురాణ ప్రామాణ్యము ననుసరించి యీ గ్రంథమును సంధానించితిని.

మానవ పరిపూర్ణతకు సత్యాహింస శౌదయాగుణములకు నింద్రియనిగ్రహము, తపోబలము. నాత్మజయము మున్నగువాని కన్నిటికి మన ప్రాచీనభారతపర్ష మహర్షులే యెన్ని యుగములకైన నాదర్శప్రాయులు. . వారి జీవితోపదేశములు నిత్యమననపాత్రములు, ఐహికాముష్మిక ఫలప్రదములు.

1945లోఁ దొలుత ముద్రితమైన యీ గ్రంథముస కిది ఆఱవ ముద్రణము. ఆంధ్రమహాజనుల హృదయకమలముల నిది యధివసించుట మిక్కిలి ముదావహము.

ఇట్లు, బుధజనవిధేయుఁడు

బులుసు వేంకటేశ్వరులు

కాకినాడ

1 - 3 - 69 

అగస్త్యస్తుతి

"ప్రణవపంచాక్షరోపవిషత్ప్రపంచంబుఁ
             గడదాఁక నెఱిఁగిన కఱకలాని
 వాతాపిదైత్యు, నిల్వలునితోఁ గూడంగ
             జఠరాగ్ని వ్రేల్చినసవనికర్తఁ
 గోపించి నహుషునిఁ. గుంభీవనంబుగా
             హుంకార మిచ్చినయుగ్రతేజు
 వానకాలమునాఁడు వండునట్టిననీటి
             కాలుష్య ముడిపెడుకతకఫలముఁ

 బాండుభసిత త్రిపుండ్రాంకఫాలభాగు
 భద్రరుద్రాక్షమాలికాభరితవక్ష "
 వింధ్యగర్వాపహారి నాపీతజలధి
 నయ్యగస్త్యమహర్షి నే నభినుతింతు.
                                      [శ్రీ కాశీఖండము - 2. 161

అత్రిస్తుతి

అంభోజగర్భహృదంభోజసంభవు
            బంఛారిదైత్యసం స్తంభయితుని,
వనితాజనానీక ఘసశిరోరత్న మా
            యనసూయఁ జెట్ట పట్టినగృహస్థుఁ
జంద్రదుర్వాసోమునీంద్రదత్తాత్రేయ
            ఋషిచంద్రములఁ, గన్న ఋషినతంసు
ధర్మశాస్త్రానేక మర్మజ్ఞు. నిర్మల
           కర్మరహస్యు సత్కర్మనిరతు

బహుతపోధన సంయుతు, నిహతనిఖిల
కామరోషాదిశత్రు. దివ్యామలాత్మ
తత్త్వమూ ర్తిని, సప్తర్షి సత్త్వమహితు,
నత్రిఋషిఁ గొల్తు నెపు డిహాముత్రములకు.




అష్టావక్రస్తుతి

మాతృగర్భమునందె మహిత వేదవ్రాత
             మర సె నెవ్వాఁ డట్టి యురువివేకి
యేకపాదసుజాత లేమహాత్ముని గని
             ధన్యాత్ములై రట్టి తపసిదిట్ట
జనకరాజర్షి యేజ్ఞావిబోధవముచే
             విజ్ఞుఁడై వెలసె నావిబుధవరుఁడు
సద్భ్రహ్మచర్య దీక్షాదక్షుఁడై యెవ్వఁ
             డలఘుకీ ర్తివి గాంచె నామహర్షి

సుప్రభాకాంతపతి యెవ్వఁ డాప్రభావుఁ
డమలవిజ్ఞానమూర్తి గృహస్థ రత్న
మతిపవిత్రుఁ డష్టావక్రుఁ డామహర్షి
కంజలి ఘటించి స్మరియింతు సహరహంబు.

ఋష్యశృంగస్తుతి

సంగత మైనభక్తిని ప్రశంస యొనర్తు "వధీత వేదవే
దాంగువి సర్వసంయమిముఖాబ్జనతంగుని నిర్జితేంద్రియా
నంగుని లిప్తభూతిలపదంగువి సద్గుణసంగునిన్ ప్రభా
భంగువి సంతతోదితతపఃకృతిరంగుని ఋష్యశృంగువిన్..”
                                          (భాస్కరరామాయణము. బాల 92)

కపిలస్తుతి

కపిలమహర్షి రూపమునఁ
            గర్దమమౌనికి దేవహూతియం
దపరిమిత ప్రభావమున
           వర్మలిఁ బుట్టి తరింప వారు సాం
ఖ్యవథము లోకమందుఁ బర
           మాత్ముననుగ్రహపాత్ర మంచుఁ జూ
పి పయిని భక్తి మార్గమును
           బెంపుగఁ జేసినవిష్ణుఁ గొల్చెదన్.

"శ్రీవిష్ణుపదభక్తిఁ జెలఁగుసప్తర్షి చం
              ద్రములలో మున్నెన్నఁ దగినమేటి
 దిత్యదీత్యాదిసాధ్వీశిరోరత్నంబు
              లను బ్రేమఁ జెట్టవట్టివ గృహస్థు
 కమలాప్త భుజగేంద్ర ఖగరాజరోహిణీ
              కన్యకారమణులఁ గన్నతండ్రి
 రాముచే దానధారాపూర్వముగ భూత
              ధాత్రి గ్రహించిన శ్రోత్రియుండు

కోయరూహసంభవునకు బౌత్రుఁడు మరీచి
పుత్రుఁడు విచిత్రగుణమణిపాత్రుఁ డఖిల
వేద వేదాంతతత్త్వవివేకశాలి
మహిమఁ జెలువొందుకశ్యపమౌనిఁ " గొల్తు,
                                 (దశావతారచరిత్రము.

గౌతామస్తుతి

కరముల్ మోడ్చి నుతించు భక్తి "సురగం
           గాపూతతో యార్ద్రభా
స్వరమూర్తిన్ గతధూమసంజ్వలితస
           జ్జ్వాలాగ్నికల్పున్ సురా
సురదుర్దర్షుని నక్షపాదు రచిత
           శ్రుత్యర్థవాదున్ వ్రతా
విఠళామోదు సుధీయుతుం బ్రతిహతా
           విద్యాతమున్ గౌతమున్."
                                  (భాస్కరరామాయంము. బాల. 5. 2..

చ్యవనస్తుతి

భృగువంశాంబుధిచంద్రుఁడై తపమునన్ విశ్వప్రభావాడ్యుఁడై
సుగుణాలంకృత యౌసుకన్యసతియై శుశ్రూషలం జేయఁగా
జగదుద్ధారకు లౌసుతుల్ గలుగ శశ్యద్ద్యోగమార్గంబునన్
సుగతింగాంచినపావనాత్ముఁజ్యవనున్ గొల్తున్ మహర్షీంద్రువిన్.

జమదగ్ని స్తుతి

జమదగ్నిన్, బరమారివీరనిజహృత్సంబంధషడ్వర్గమున్
విమాలాత్మాద్భుత సత్తపఃఫలమునన్ విద్వస్తముంజేసి తా
నమలోదాత్తమనీషచేఁ బరిమధర్మానీక సంరక్షణన్
వమతన్ గీ ర్తిని గాంచినాతనిఁ బ్రశంసన్ గొల్తు నశ్రాంతమున్,

దత్తాత్రేయ స్తుతి

“నిజగర్భగత జగన్నిచయ మారయు లీల
           నంతర్ముఖాపాంగుఁ డైవవాని
 నళినజాండావృత్తి నాభివీధికి నేర్పు
          రీతి పక్షసరంబుఁ ద్రిప్పువాని
 శ్రుతు లాత్మయంద నిల్చుటఁ దెల్పు తెఱఁగున
          వవరుద్ధ నిశ్వాసుఁ డైనవానిఁ
 దనపూనినధరిత్రికి నలోలత ఘటించు
          పగిది జటిలవృత్తిఁ బరగువాని

బ్రాక్తనస్వీయదామోదరత్వ మెఱుఁగఁ
జేయుగతి యోగపట్టికఁ జెలఁగువాని
యోగము దెక సూచితాద్భుత చరిత్రుఁ
డైనవాని దత్తాత్రేయమౌనిఁ గొలుతు "
                                   (చంద్రభానుచరిత్రము. 1 అ. )

దధీచి స్తుతి

అతులతపోధనుండు చ్యవనాత్మజరత్నము దేవకార్యసం
గతికి విజాస్థు లిచ్చినయకల్మషదానమహావ్రతుండు పా
ర్వతిని దృణీకరించుటఁ బహత్పరుఁ దిట్టుట దక్షు నల్గి శా
పతిమిరబద్దుఁ జేసినప్రభావవిలాసి దధీచిఁ గొల్చెదన్.

దుర్వాసస్తుతి

“అనుభావశక్తి బ్రహ్మాదుల నొకపూరి
             పుడుకకుఁ గొకోనిపోతరీఁడు

ఘనకోపవాణిజ్యముపఁ దపోవిత్తజా
            లముఁ గూడఁబెట్టెడులాబగాఁడు
తనరథంబునకు మాధవసత్యభామల
            గుఱ్ఱాలఁ జేసినకోడిగీఁడు
యతిసతీకులరత్న మనసూయకడుపువ
            మునుమునఁ బుట్టినముద్దులాఁడు

సకలకల్యాణకరుఁడు సాక్షాదనంగ
హరుఁడు నిర్మలతత్త్వ విద్యావిచార
ణావిలాసుఁడు దుర్వాసుఁ" డావరిష్ఠు
నధికనిష్ఠ భజింతుఁ బ్రత్యహము భక్తి.
                                (వరాహపురాణము. 2 ఆ. 1

పరమపవిత్ర ధారతవిభాసుర దివ్యమహర్షివర్య సు
స్థిరచరితామృతం బిది ప్రసిద్ధిగ దీనిని గ్రోలఁగల్గుచో
నరుఁడు సుఖించు; నిత్యము వినం బఠియించిన భక్తియుక్తుల,
పరము లభించు నీప్రథమబాగము భాగములెన్మిదింటిలో.