మణి మాలికలు/సాయి కామేష్‌ గంటి

సాయికామేష్‌ గంటి 23-20-1, రెండవ అంతస్థు, సుబ్బారావు వీధి, సత్యనారయణపురం, విజయవాడ-520011 కలం పేరు : అన్వేషి వృత్తి : సీనియర్‌ పాసింజర్‌ గార్డ్‌ (రైలేfiస్‌) మొబైల్‌ నెం. 7702772301 ఈ-మెయిల్‌: sandyamadhuri@gmail.com వెబ్‌: WWWfacebook.com/sai.... ...

పారేసుకున్న క్షణాలు... 1.సప్తపదిలో ఏఅడుగు తప్పుగా పడిందో

సమిధాగా మారిపోయింది నవవధాువు చిరునవ్వు

2.హరివిల్లులో చోటివ్వలేదానా

నలుపు రంగు... రాత్రిలో ఒదిగిపోయింది

3.మాతృదినోత్సవం అనుకుాం

వృధ్ధాశ్రమం గేటుకతుక్కున్నాయ్ ..కొన్ని కళ్ళు

4.స్కూలుకెళుతూ కనిపించింది పసితనం

పుస్తకాల శిలువని మోస్తూ

5.

మనసు అట్టడుగు పొరలలో వెతుకుతున్నా ఆశగా

చిరునవ్వుల తడి ఎమైనా మిగిలుందా అని

మణి మాలికలు *సాయి కామేష్‌ గంటి

113 114

6.

విరహమంటే ఎప్పికైనా నువ్వొస్తావనే ఆశ
విషాదామంటే నువ్వెప్పటికి రావన్న వాస్తవం

7.

నీమది చేరని నాభావాలు
నీకాలను పట్టుకుని వేలాడుతున్నాయి

8.

ఇప్పటిదాకా నాతోనే ఉన్నాడు'
బాధాగా అంటోంది మరణ లేఖలో చివరి అక్షరం

9.

కన్నీళ్ళతో కడగి యడనికి
నువ్వు నలుసువి కాదు...కనుపాపవి

10.

చెత్తబుట్ట నోరు తెరిచింది
తొలిప్రేమలేఖ రాయడం మొదలెట్టగానే

11.

ఆగకుండ ఎక్కిళ్ళ చప్పుళ్ళు
మదిఖర్కానాలో జ్ఞాపకాలు తయారౌతుంటే

12.

ఆలుమగల మధ్యా గొడవట
భార్య ఏకపాత్రాభినయమే వినిపిస్తోంది

13.

ఎన్ని తారలు మింగిందో మరి
అమాశలోనూ..చీకటి మెరుస్తోంది..వింతగా

14.

హోళీ అంటె తనకిష్టమంది
నల్లరంగే చల్లుతోంది...మనసుపై

15.

మాటలు మరణించాయి మరి
నిశ్శబ్దంగా మøనంచెక్కిలిపై...జ్ఞాపకాలచారికలు

మణి మాలికలు * సాయి కామేష్‌ గిం

16.నా వేదనతో రమిస్తూ నిశి
అక్షరాలు ప్రసవిస్తోంది..నా డైరీలో
17.వర్షంలో తడవటం ఇష్టమన్నావుగా
ఇదిగో నా కనులు వర్షిస్తున్నాయి.. ఇపుడైనా రావా
18.నా కలానికి పదాును ఎక్కువ
ఒక్కోసారి నా మనసునే కోసేస్తుందాది.
19.ఎక్కడ ప్రారంభమైనా
నీతోనే అంతమøతోంది..నా ప్రతీఅలోచన
20.ఎటు వెళ్ళాలో సందిగ్ధం మనసుకి.
అటువైపు తాను...ఇటువైపు నేను
21.తాగిన వెన్నెల చాల్లేదేమో
తొడిమలింకా ఎర్రనే ..పారిజాతాల్లో
22.నీ తలపులు
ప్రతిరాత్రీ నా నిదురని భోంచేస్తూ
23.ప్రేమకు తను పెద్దాబాలశిక్ష
విరహా నికి నేను విజ్ఞాన సర్వస్వం
24.మానవత్వం మరణిం చింది
నడివేసవిలో..గుక్కెడు నీళ్ళు దొరక్క.
25.అమ్మాయి చేతి స్పర్శ తాకినందాుకేనేమో
వాకిట్లోముగ్గులకి అన్నాన్ని మెలికలు

మణి మాలికలు *సాయి కామేష్‌ గిం</poem>

115 116

26.

నా కలం అక్ష(ర)యపాత్ర
అనుక్షణం అక్షరాలు రా(లు)స్తూ

27.

కన్నీలో తడిసాయేమో కలలు
నా ఆశల వెలుగులు ప్రసరించగానే జ్ఞాపకాల హరివిల్లు

28.

ప్రపంచమంతా ఎదురొ(రి)స్తోంది.
తనకోసం గతంలోకి నేను పయనిస్తుంటే

29.

మరోరోజు గడచి పోయింది
నువ్వు రాకుండనే..విధిచేతిలో నేనోడిపోతూ

30.

అమ్మాయి బీకాం అనుకున్నా..కాదు..బీయెస్సీనే
చూపుల్లో యాసిడ్‌ వర్షం..మనసును దహించేస్తూ

31.

ఒంటరితనానికి...ఏకాంతానికి.
ఒకటే తేడ...నీ జ్ఞాపకాలు

32.

మనమధ్యా దాూరం అడుగే
చేరడనికే... జీవితం సరిపోదాంతే

33.

చీక టి దుప్పటికి చిరుగులెక్కువే

బైటపడుతోంది వెలుగు అక్కడక్కడ...తారలుగా

34.

సిగ్గులు గగ్గోలెడుతున్నాయి
చెలి చెక్కిలిని విడిచి వెళ్ళేదారిలేక

35.

నీ చూపులు గుర్తుచేస్తూ
వేళ్ళ చివర 'చురుక్కు'మంటున్న సిగరట్

మణి మాలికలు * సాయి కామేష్‌ గంటి 36.

కాలం మాత్రం గడియారంలో చక్కర్లు కొడుతుందట
నన్ను మాత్రం వర్తమానంనించి భవిష్యత్లోకి తోసేస్తూ

37.

గతానికి ఆకలెక్కువ.
వర్తమాన భవిష్యత్లను మింగేస్తుంది మెల్లగా

38.

డైరీ రాస్తుంటే.
నా కన్నీటిలోదూకి కొన్ని అక్షరాలు ఆత్మహత్య చేస్కుంటున్నాయ్

39.

నీకై పరచిన నామనసుపై
నీపాదాల స్పర్శ బదాులు పరిస్థితుల పదాఘట్టనలు...పరిహసిస్తూ

40.

నిరీక్షణలో నిర్బంధించకు
ఎదురుచూపులు ఎదని కోసేస్తున్నాయి, కాలమనే రంపంతో నిర్దయగా

41.

నామనసు అక్షయపాత్ర
ఎన్ని జ్ఞాపకాలు కన్నీళ్ళుగా ఖర్చైనా

42.

విరహం అంటే
వీడిపోవడం కాదు... మానసికంగా వీడలేకపోవడం

43.

నువ్వు తీరానివో...లేక అందానంత దాూరానివో
నేను మాత్రం కన్నీ అలనే ఎపుడూ

44.

నీ పరిచయం
నా సుస్పష్టాస్పష్టాల మధ్యాంతర రేఖ

45.

అడుగు బైటకేస్తున్నావా...?
కలికాలం కాదామ్మాయ్‌. ఇది 'ఆకలి'కాలం

మణి మాలికలు * సాయి కామేష్‌ గిం

117 118

46.

వాడిపోయాయనుకున్నా..ఊహు
ఇంకా వాడిగానే..నీ తలపులు

47.

భావాలు భారమయ్యాయనేమో
గాలి వీచినా కదాల్లేదాు...డైరీపేజిలు

48.

పరాణ్ణజీవులు..నీ తలపులు
తరిమేస్తున్నా..నాలోనే బతికేస్తూ

49.

పడమర పొందాులో సూర్యుడు
తూర్పు..నిట్టూర్పుల విషాదాచాయల్లో

50.

జ్ఞాపకాల శవాలలో
జీవఛ్ఛవాలను వెతుకుతున్నా...ఆశ చావక

51.

ఉషోదాయాలన్నీ రసోదాయాలే
నీవులేనపుడే నీరసోదాయాలు

52.

కుత్తుకలో నీ తలపుల కత్తులు
పీల్చే స్వాసని సైతం చీలుస్తూ

53.

అరుణవర్ణం చెలి చెక్కిళ్ళలో
సప్తవర్ణాలు నా హృదివాక్లిో

54.

మమ్మీడాడీల చేతిలో
అమ్మానాన్నల హత్య

55.

నా హత్యకి
హంతకుణ్ణి.నేనే

మణి మాలికలు * సాయి కామేష్‌ గంటి 56.

'నా'కు 'నీ'కు
మధ్య...'ని'శబ్దం

57.

నా డైరీలో తెల్లకాగితం
లిపిలేని భావాలకి సాక్ష్యంగా

58.

ఏటుచూసినా నీజ్ఞాపకాలే
కనులు మూసినా రెప్పలను కో(తో)సేస్తూ

59.

నా విషాదానికి గణతంత్రం
చెలి 'పరాధీన'గా మారినక్షణం

60.

ఊరవతల శ్మశానం
మద్యకొచ్చింది...కబ్జాలాటలో

61.

నా మౌనం చిరుగుల ప్పటి
నువ్వు నవ్వుతూ ఎదురుగా ఉంటే

62.

అలారం శబ్దం మారిపోయింది.
పసిపాప ఇంటికి వచ్చిందిగా

63.

అద్దంలో బంధించా చందమామని నీకు ఇద్దామని
నీవైపు తిరిగేసరికి బందీగా నువ్వు... నాకోసం

64.

రక్తం... రంగు తెలుపు... నమ్మవా నువ్వు దూరమయ్యాక నాకన్నీటిని చూడు

65.

నిశ్శబ్దమైన యుద్దం నా కనురెప్పలకు నీ తలపులకు...నిదుర విషయంలో

మణి మాలికలు జ సాయి కామేష్‌ గంటి

119 120

66.

తను శిధిలం చేసిన నాహృదయాన్ని తడుముకున్నా
తనే తాకిందనుకుని ఆశగా చూసింది మరోసారి

67.

నీ నాలుకతో నా కనుపాపను ముద్దాడావు
కంటిలో నలుసు పడింది అంటూ...దొంగా

68.

ఏదో కోల్పోùయిన భావన
నిన్నా? లేక నన్నా??

69.

శాఖాహారమే తింటాడట
చెట్లుకు కూడ ప్రాణముందని మరిచిపోయాడు

70.

నువ్వే నయం
నీ తలపులు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి నన్ను

71.

చేరుకున్న ప్రతిమజిలీలో ఆశగా చూస్తా నీకోసం

అదేంటో...ఎపుడూ వాస్తవం వెక్కిరిస్తూ కనిపిస్తుంది

72.

ఎన్ని వసంతాలు వర్షించి శిశిరమైపోయాయో
నీకై నా ఎదురు చూపులలో

73.

నావేళ్ళ కొసలు వణుకుతున్నాయి
'నీ ఇష్టప్రకారమే విడిపోదాం' అని నీకు లేఖరాస్తుంటే

74.

నిమిషంలో తిరిగొస్తానంది
యుగాలు కరిగిపోయినా ఆ నిమిషం గడవదే ఇప్పటికీ

75.

నా కవనపు ప్రతీ పదం నీవే
నా గమనపు ప్రతీ పథం నీవే

మణి మాలికలు జ సాయి కామేష్‌ గంటి 76.

ప్రేమలో విఫలమైతే తాగాలా...?
కన్నీళ్ళున్నాయిగా...మందు ఎందుకు..?

77.

నవ్వినా ఏడ్చినట్టుంది.
నీ నవ్వుల ఎక్స్‌పైరీడ్‌ దాటిపోయిందా

78.

నీ పయనంలో నేనో మజిలీ
నాకు మాత్రం నీవే గమ్యం

79.

నివేదించనా నీకు నా ప్రతీ అక్షరాన్ని
ఏఒక్కటైనా నీకు నా వేదాన తెలుపగలదాని

80.

అనుమానాలెందుకు అమ్మాయి
నా ప్రతీ స్పందన నీ స్పందానల ప్రతిస్పందనలే

81.

తాను వెళ్ళిపోయింది నిశ్శబ్దంగా
పున్నమిరేయికి నల్లరంగు అద్దుతూ

82.

కాలం ఎలాిం గాయాన్నైనా మాన్పుతుందాట
కానీ..నువ్వు కాలానికే గాయంచేశావు

83.

అడగంగనే వరాలిస్తావట...నిజమా శంకరా...?
అంతేలే...బంగారమడిగినా ఇచ్చెడిది బూడిదేగా

84.

నా చేతిలో సిగరెట్
నీ తలపులతో నేను...ఒకేలా...కడదాకా కాలిపోతూ

85.

ఎవరు అన్నారు కన్నీరుకి రంగులేదని
నీతలపులతో అది సప్తవర్ణాలను సంతరించుకుంది

మణి మాలికలు జ సాయి కామేష్‌ గంటి

121 122

86.

ఒకశబ్దం తర్వాత పూర్తిగా నిశ్శబ్దం
తడిమి చూసుకున్నా...పగిలిన హృదాయం

87.

ప్రతి ప్రశ్నకి బదులుందా?
'లేదు' ఒక సమాధానమే

88.

మదిలో అస్పష్టమైన భావాలకి
చ(చి)క్కి రూపాన్నిస్తూ...చీకటి

89.

అర్ధాంగి అంటే సగభాగమేనట
నాకేమి తనే సర్వస్వమనిపిస్తోంది

90.

నీకు మేఘసందేశం పంపుదాం అనుకున్నా
మేఘాలే కనపడలేదు...కనులుమాత్రం వర్షించాయి

91.

నిన్నునేను చూసినపుడు
కాలం కొన్నిక్షణాలు పారేసుకుంది

92.

కనుపాప జలకాలాడింది
స్మస్కృతిని శృతి చేసిన ప్రతీసారీ

93.

జాలువారకే కన్నీరా
జాలిపడేవారు ఎవరూ లేరు ఇక్కడ

94.

నేనెవరినని ప్రపంచమంతా అంవేషించా
సమాధానం నీ చిరునవ్వులో దొరికింది...నీఆనందామే నేనని

95.

నిను కలవడమే జీవితగమ్యం అనుకున్నా
కలిసాకే తెలిసింది నాప్రయణం ఆరంభమైందాని

మణి మాలికలు జ సాయి కామేష్‌ గంటి 96.

నన్ను వద్దనుకునేగా వీడిపోయావ్‌
ప్రతిఅడుగులో ఎదురౌతావే జ్ఞాపకమై

97.

నేను
అనేక 'నీవు'ల కలయిక

98.

నా కనురెప్పలపై
చెలి పెదవుల సంతకం...ప్రేమ

99.

పారేసుకున్న క్షణాల్లో కొన్ని
తిరిగి ననుపలుకరిస్తున్నాయ్‌...డైరీలో

100. మారిపోయా అభిమన్యుడిగా
నీప్రేమ పద్మవ్యూహంలో

101. చెలి పాదాలను ముద్దిడనా
నాబరువుని అవి మోస్తున్నందుకు

102. తన పరిచయం కదలాడింది రెప్పలవెనుక
రేగిన గాయమై..రాయని గేయమై

103. శిశిరమా నువ్వొచ్చి ఎంచేస్తావ్‌
మదిలో ఆశలు ఎపుడో రాలిపోయాయి..తన వలన

104. గమ్యం వరకు తోడుంటాను
బౌతికంగానో..లేదంటే జ్ఞాపకంగానో

105. నీ పయనంలో నేనో మజిలీ
నాకు మాత్రం నీవే గమ్యం

మణి మాలికలు జ సాయి కామేష్‌ గుంటి

123

106. తను రాసిన ప్రేమలేఖ.. ఎపుడు చదివినా
అక్షరాలు అలుక్కునే.. కన్నీరు చూపుకి అడ్డుపడి

107. అలసిపోయిన మదిసంద్రంలో
అలలూ లేవు..కలలూ లేవు

108. నాదైన లోకంలో
నీకు మాత్రమే చోటుంది...నాకు కూడ లేకుండ

109. గాయాన్నితిరిగి రేపకే సమయమా
చివరి కన్నీటిచుక్క ఎప్పుడో ఇంకిపోయింది.

110. అక్షరాలు అన్నీ పోటీ పడుతున్నాయి
మా మొదటిపరిచయాన్నిఅందంగా వర్ణించడానికి

111. కలం కదలదు...కాలం ఆగదు
కొన్నిరోజులుగా అన్ని తెల్లకాగితాలే..డైరీలో

112. ఎండమావిలో నీరు
కనులకే సొంతం

113. ప్రేమ గాయాన్ని చేస్తుందా...?
ఊహూ˙..చేసింది ప్రియురాలు

114. చెలి అందియగా మారిపోయా
మువ్వల సవ్వడికి నా ఎదలయతో తాళం వేస్తూ

115. నాదాంటూ ఏముంది?
నీకు ఇవ్వడానికి.. కన్నీళ్ళతో సహా

124

మణి మాలికలు జ సాయి కామేష్‌ గంటి