మణి మాలికలు/సంతోష్‌ కుమార్‌ కొత్తా

సంతోష్‌ కుమార్‌ కొత్తా

ఫ్లాటు నెం: 203, బ్రిక్స్‌ వసంతం అపార్టుమెంట్స్, యాదవ్‌స్ట్రీట్ సుదర్శన్‌ నగర్‌, హైదారాబాద్‌ - 27. కలం పేరు: సంతోషహేలి వృత్తి: అప్లికేషన్‌ ఇంజనీర్‌ (ఒరాకిల్‌) మొబైల్‌ నెం. 9553 575859 ఈ-మెయిల్‌: santoshqriz@gmail.com వెబ్‌:facebook.com/sanoctics సంతోషహేలి... 1.

చిరునవ్వాతారాజువ్వా
అంతటి మెరుపెలా సాధ్యం నీకు?

2.

నా హృది విస్తరిలో
కమ్మని ప్రేమని వడ్డించాను... ఆరగిస్తావో,విసిరేస్తావో నీయిష్టం

3.

వెటకారంలో శాస్త్రవేత్తవి అనుకుంటా
వలచినా పిలిచినా వయ్యారాలు పోతూ వెటకారంగా చూస్తున్నావ్‌

4.

వేసవి తుమ్మెదా సూరీడు
ఓపికనే తేనెని జుర్రేస్తూ

5.

వెన్నెల మిఠాయి ఊరిస్తుంది
ఉడికిస్తున్న వేడివేడి వేసవిలో

మణి మాలికలు జ సంతోష్‌ కుమార్‌ కొత్తా

125 126

6.

చినిగిన కాగితంపై వ్రాసిన కావ్యం
ప్రణయమనే నాగిని కాటేసిన జీవితం

7.

మన ప్రేమాయణ రచనకి అంతరాయం
మనసు పాళీకి ప్రేమసిరా అందాకపోవటం

8.

మనసూ మాటలు నేర్చింది
నీ పేరుని పలికినప్పినుండి

9.

కళ్ళకు బద్దాకమే
నీ నుండి చూపుని మరల్చానికి

10.

ప్రేమలేఖ
చదాువు అవసరం కోరని దారఖాస్తుపత్రం

11.

దేవతలకి సైతం తప్పని కరువు
నీలాిం స్ధందార్యానిfl భువికి పంపించాక

12.

అసూయ శాస్త్రంలో పండితురాలివి
ఆ మాత్రం తెలియదా నా కోపానికి కారణం

13.

రేయి రాకాసి
నీ తలపుల గోల చేస్తూ

14.

కళ్ళకు కూడ ఆకలి ఎక్కువే
ఆ ప్రకృతి అందాన్నిఆరగించాలని

15.

తీవ్రవాదం భయపెట్టినా
తరగని అందం హిమాలయాల సొంతం

మణి మాలికలు జ సంతోష్‌ కుమార్‌ కొత్తా 16.

నీతో క్షణ కాలం
ఆ తలపుతో జీవితకాలం

17.

రాక్షసులైనా భయపడరా
మన రాజకీయ నాయకుల పాలనలో

18.

సామాన్యుడి దురాశ
ఎన్నికలలో ఓటేసి ఓటములన్నింటిని జయించవచ్చని

19.

పేదావాడి కంటికి వర్షాకాలమే కదా
ఆకలి వెక్కిరించినా... అన్నం ఊరించినా

20.

భవిష్యత్‌ భయపెడుతుంది
ఉచితంగా దొరికేది కన్నీరు మాత్రమేనంటూ

21.

నీ కళ్ళేమైనా రెడ్‌ సిగ్నలా!
చూడగానే నా నడక ఆగిపోయింది!

22.

క్షామమే మిగిలింది
కామమేలుతున్న రాజ్యంలో

23.

పేదరికం
కన్నీటికి కూడ కరువు రావటం!

24.

ప్రేమ
కవికి మాత్రమే పనికొచ్చే వస్తువు

25.

నరకాసుని వధించిన స్త్రీకి
నేటి సమాజంలో నరకమే నడి రోడ్డుపై ప్రయాణం

మణి మాలికలు జ సంతోష్‌ కుమార్‌ కొత్తా

127 128

26.

  సులభం.. అమ్మా అని పిలవటం
దుర్లభం.. అమ్మ ప్రేమకి సమానం

27.

విధికి నీమది గది తాళం దొరికిందా
ఎంత కోరినా తలుపు తీయనని మొరాయిస్తుంది

28.

పేదావాడికి షరామామూలే
బీటలుబారిన భూములు.. రాతలుమారని బతుకులు

29.

జ్ఞాపకాలకి షరామామూలే..
విరహంలో వేధించటం.. వద్దాన్నా విసిగించటం

30.

ఒక చిలిపి సంశయం
ప్రతి తెలుగువాడి తలరాతనూ బ్రహ్మ తెలుగులోనే రాస్తాడా?

31.

ఆదాయం పన్నుశాఖ వారికి తీరని ఆశ
కుబేరుని నుండి పన్నులు వసూలు చెయ్యలేకపోతున్నామని!

32.

ఎందుకో అంత కోపం
చెంపల కెంపు ఎరుపు కళ్ళలో నిండితే బాగోదు!

33.

నీది దిండులాంటి మనసు..
మెత్తనిది.. హత్తుకునేది.. హాయినిచ్చేది

34.

తుంటరివే నువ్వు
కన్ను కొడతావ్‌.. కనురెప్ప వెయ్యనియ్యవ్‌

35.

ఆగేది కాదు నా కలం,
ఆగిపోయినా సరే ఈ కాలం!

మణి మాలికలు జ సంతోష్‌ కుమార్‌ కొత్తా 36.

  నీ మనసుకెంత మోమాటం
నీదైన నా మది మందిరంలో కొలువు ఉండటానికి

37.

నీమనసుకంత మోమాటం
నలుగురిలో నవ్వుల పువ్వులను విసరటానికి

38.

పండగ పూట గుడి బాట
కడుపు నిండేలా ప్రసాదం మూట

39.

చెలి పలుకులను వర్ణించతరమా అంటూ
అక్షరాలు సిగ్గులొలుకుతూ సమ్మె బాటపట్టాయి

40.

గడియారంలేని లోకముంటే బాగున్ను..
ఒధులే .. ఇప్పటికే నీ మాటలతో సమయం తెలియట్లేదు

41.

బండి కొనుక్కుంటున్నానంటే
పానీపూరీ బండేనా అంది తింగరబుచ్చి

42.

ఆకలి చావులు ఆగవు
బియ్యం కిలో రూపాయయినా

43.

చెలి చూపుల చమత్కారమా!
చైత్రంలో శిశిరంలా ఆనందభాష్పాల కన్నీటి ధార పొంగినది

44.

రుచి చూపితే ప్రణయామృతం
నా తనువుతీరినా.. నీ ప్రేమలో తరిస్తా

45.

విరహం
కన్నీరు మాత్రమే తీర్చగల దాహం

మణి మాలికలు జ సంతోష్‌ కుమార్‌ కొత్తా

129 130

46.

చిరునవ్వు చెరగదు
నా సంతోషం నీ స్నేహమైనపుడు

47.

ఓటమి స్నేహం చెయ్యనంటే
గెలుపు ఒంటరిగా మిగిలిపోతుంది

48.

ఓటనేది కాదు అంగటి సరుకు
ఐదేళ్ళ కాలాన్నిఐదొందలకి అమ్ముకోకు

49.

బద్ధకం ఆవకాయ బద్దలాంటిది
అలవాటైతే వదలటం కష్టం

50.

గుండెలోతులో గుబులు మిగిలే
జ్ఞాపకాల గాయాలు మండుతుంటే

51.

వర్ణనకు పదాలు వెతుకుతున్న తరుణం
విరహ వేదనలో గాయపడిన హృదయం

52.

చెలి జ్ఞాపకాల గాయం
స్పూర్తి నింపి నాతో రచింపచేసింది ఓ గేయం

53.

శ్రీ శ్రీ
కాలాన్ని కవిత్వంగా మార్చిన కవి

54.

భవిష్యత్‌ భారతం భుజాలపై
బడి బస్తాల బరువులు

55.

నవ్వు 'కునేలా' ఉంది జీతం
నవ్వు 'కొనేలా' ఉంది జీవితం

మణి మాలికలు జ సంతోష్‌ కుమార్‌ కొత్తా