మణి మాలికలు/రాజా రవి శ్రీనివాస్‌ యల్లాప్రగడ

రాజా రవి శ్రీనివాస్‌ యల్లాప్రగడ

ఫ్లాట్ నెం. 103/8,

ఈశ్వర్‌ విల్లాస్‌, నిజాంపేట్,

హైదారాబాద్‌ - 500090

కలం పేరు: సూరీడు

వృత్తి: ప్లానింగ్ మానేజర్‌ (L & T)

మొబైల్‌: 9948595957

ఈ-మెయిల్‌: rajask11@gmail.com

వెబ్‌: velurekhalu.com

సూరీడు వెలుగులు...

1. నాకు మృగమంటే జాలి
   మనుషుల్నిదాంతో పోలుస్తారని

2. సగం పిచ్చోడు ఆస్పత్రిలో
   పూర్తి పిచ్చోడు అధికారంలో

3. నువ్వునీప్రేమలొంచి తోసేసావ్‌
   నేన్నీతో సహా ప్రేమించా

4. ఆత్మహత్య చేసు కున్నాడు
   మనసుపై భూతద్దం వద్దని చెబుతూనేవున్నా..!

5. కనిపించే రూపం కన్నా
   రూపంలేని ప్రతిభలు మిన్న

85

<poem> 6. కొన్ని పాపాల వాసన
   మరణంతో కడిగినా వదలదు

7. సత్కార్యానికి శుభముహుర్తం
   రేపు, ఇవాళ కాదు...ఇప్పుడే

8. ప్రేమించే హృదయం కన్నా
   ప్రేమనుపంచే చేతులు మిన్న

9. అంతర్చక్షువులు విప్పార్చి చూడు
   నువ్వు చూసేదంతా ఎంత అబద్దమో తెలుస్తుంది నేడు

10.మనసుని ఓ మూల విడిగా ఉంచు
   అప్పుడే అది నీకు తల వంచు

11. ప్రేమకు భాషెందుకు
    భావప్రసారం చాలు నిశ్శబ్దపు మాధ్యామంలో

12. గోరంత ప్రేమదీపాన్ని గుండెకవాటాలలో కాపాడు
    రేపు కొండంత వెలుగునిస్తుంది చూడు

13. వేరే జ్ఞానం ఎందుకు
    వేదం వింటున్నాగా నీఎదసవ్వడిలో

14. వెనకేమున్నది గతం తప్ప
    ముందుకు చూడకనే నేను నా గతి తప్పా

15. నా కలం ఎర్రగా రాస్తోందేం?
    పొరపాటున నీసింధూరం అద్దావా ప్రకృతీ?

<poem>

16.నేనో వలస పక్షిని

 మనుష్య తీరం నుంచి...ఎక్కడ వాలాను ఇంతకీ?

17.భూతం, వర్తమానం, భవిష్యం...అంతామంచే

  నాల్గు మాటల గీతా సారం

18.కూసింత దారి చూపించరూ

  తప్పిపోయా..రత్నగర్భ భారతదేశానికి

19.జ్ఞాపకాల అరలు ఈ రోజు ఆత్రంగా తడుముతుంటే

  అన్నీ ఖాళీలే..నువ్వెలా వదిలేసి వెళ్ళావో అలాగే

20.దుప్పటి నిండా అవినీతి చిరుగులే

  పేదరికం చలేస్తోందని ప్రభుత్వదుప్పటి కప్పుకుంటే

21.ఎందుకలా తేరిపార చూస్తావ్‌

  నువ్వేగా క్రితం జన్మలో పునర్జన్మలో మళ్ళీ కలుస్తానన్నావ్‌

22.నే ప్రపంచంలో లేను

  ప్రపంచమే నాలో ఉంది

23.అన్వేషించు

  కానీ అది నీతో ఆరంభించు

24.

అనుకున్నది చెయ్యి తగిలితే సరే..లేకుంటే అనుభవం

25.మరణం

 జీవితానుభవ విరామం


87 88

26.

గుడ్డివాడట బిచ్చం అడిగాడు
మరి అంతర్చక్షువుల గుడ్డివాడికి ఏ బిచ్చం వెయ్యాలి?

27.

మానవత్వం కారుతోంది
మనసు బీటల్లోంచి...జ్ఞానకట్ట వేయండి

28.

అసాధ్యంలో
తుడిపివేత . ..కృషితో

29.

పయనం ఎప్పుడూ ఒంటరే
తోడుందనుకోవడం మన తృప్తే

30.

ఈ లోకంలో ఉన్నామన్న ఊహలో మనం
అసలు ఈ లోకమే ఊహని అతడు

31.

అసలు దుఖం ఏది?
అంతా అనుభవమే తప్ప!

32.

దండం పెట్టివరాలు కావాల్ట
దానికి మానవ జన్మే ఎందుకు?

33.

కాలే కడుపుకి
కవితా? పట్టెడన్నమా?

34.

నువ్వు దైవాన్ని నమ్మినట్టే
దైవం నిన్ను నమ్ముతాడు...సృష్టి వృధా పోదని

35.

ఇప్పుడే కానిచ్చొచ్చా
ఊహల శవయాత్ర..నిజం కోసం

మణి మాలికలు జ శ్రీనివాస్‌ యల్లాప్రగడ 36.

నువ్వుఋణపడుండాలి కన్నీటికి
నిన్నొదుల్తూ నీ బాధనొదిలిస్తోంది

37.

మనుషుల్ని గురుపట్టాలంటే
ముందు నువ్వు మనిషివి అయ్యుండలిగా

38.

మానవత్వం కాలి బూడిదవుతుంటే
చీకట్లో కవితల్రాసుకోడానికి వెలుగడిగాట్ట

39.

కిలకిలరావాల్తో నిద్దర లేచాను
చూస్తే మాఅవిడ నవ్వుతోంది

40.

మంచి, చెడు
నువ్వటు చూసి, నేనిటు చూసి

41.

ఎందుకలా నువ్వుపట్టిన కుందేలుకి మూడు కాళ్ళంటావు?
అదేటీ ఏకుందేలుకైనా మూడు కాళ్ళేగా ఉంటా

42.

ఓడిపోతే చిన్నతనమా?
కాదు ఒకపాఠం ఎక్కువ అనుభవం

43.

ఏదీ ప్రేమించలేని మనసెందుకు
తిరిగి ఆశించే బతుకెందుకు

44.

ఇంతోిటి దానికి విరించెందుకు?
మనమే రాసుకుంటే పోలా?

45.

నన్ను నేను తవ్వుకుంటే
నాకు నేను దొరికాను

మణి మాలికలు జ శ్రీనివాస్‌ యల్లాప్రగడ

89 జ బిందు జాబితా అంశం 90

46.

వాన వస్తుంది పోతుంది
ఆకాశం మాత్రం స్థిరం

47.

గీతా ప్రధమ శ్రోత అతడు
రోజూ ప్రసరిస్తున్నా మనకెందుకో చీకటే

48.

విలువలు వలువల్లా జారాయి
మనసు నగ్నత్వం బైటపడ్డది

49.

కష్టాల కొలిమిలో కాల్తేనే...
మనసు బంగారం మెరుస్తుంది!

50.

విరించి కష్టాల రాత
నా విశ్వాసంతో తుడిపివేత!

51.

రోడ్డుమీద కాగితం విసిరావా నువ్వు
దేశాన్ని విమర్శించే హక్కే కోల్పోయావు

52.

కలదో లేదో సందేహమేల
కళ్ళున్న వాడికి కనిపిస్తుందిగా

53.

నీతో నిన్ను తీసుకోచ్చావు
తిరిగి నిన్నే తీసుకుపోతావు

54.

కళ్ళతో చూసి
నిజమని నమ్మావా?..ఏ కళ్ళు?

55.

వజ్రాన్ని కూడ కోస్తుందది తెలుసుగా
సంకల్పాన్ని తీసుకోకు ఎప్పుడూ అలుసుగా

మణి మాలికలు జ శ్రీనివాస్‌ యల్లాప్రగడ 56.

కవితా హారం తయారు చేసే క్రమంలో పాపం అక్షరాలను గుచ్చుతున్నానన్న సంగతి మరిచా!

57.

మనిషంటే మనిషే అనుకున్నా మనసుకి తొడుగని తెలుసుకోలేకున్నా

58.

అతడి గొంతులో గరళం అందుకే ఆకాశమంతా నీలం

59.

మనసు పేరాంనికొచ్చా వలపుగంధం పూయవూ?

60.

మానవ మృగమట బహుశా పొగడ్తేమో!

61.

గందరగోళంలో చెప్పబట్టే గీత బాగా ఎక్కి ఉంటుంది

62.

అతడికి చెప్పడానికి మాత్రం ఇరవై నిముషాలు మనకు అర్థం అవ్వడానికి జీవితాలకి జీవితాలు

63.

అల పాఠం నేర్చుకోవూ వెనక్కెళ్ళినా అదే స్పూర్తితో ముందుకు దూసుకు రావాలని

64.

తీరం నవ్వుతోంది అలెప్పుడూ తనని చేరలేదని దానికి తెలీదు అల తనని కోసుకుపోతోందని !

65.

ఆశల సౌధం కూలితే ఇంకా ఒకటి కట్టే పని నీ చేతుల్లో..

మణి మాలికలు జ శ్రీనివాస్‌ యల్లాప్రగడ

91 92

66.

మనసు చేతిలో మనిషి గుర్రం చేతిలో కళ్ళెమున్నట్టు

67.

పోయిందాని విలపిస్తున్నావా తెగితేనేగా ముందాుకుపోయేది!

68.

ఎక్కడ వదిలేసొచ్చావు నాజ్ఞాపకాన్ని ఇంకా ఇది ఆరోజన్మేగా!

69.

ఎక్కడో తప స్సందాుకు అందాుకు జీవితముందిగా

70.

వెనక్కో ముందుకో అసలు నడిస్తేనేగా పయనం అయ్యేది

71.

నేను మనమవలేమా నలుగురూ మోసేలోగా!

72.

నన్నొదిలెయ్యండి అంటూ కలవరింత ఎలక్షన్లొచ్చాయని కలొచ్చినట్టుంది పాపం

73.

అరర్థ ాత్రి సూర్యోదాయ మయ్యిందానుకున్నా వలపుసయ్యాట తర్వాత ఎర్రబడ్డ నీ మోము చూసి

74.

నిద్దర లోనుంచి లేచా స్వప్నం మాత్రం విడలేదు

75.

నువ్విక్కడికి వచ్చావంటే ప్రయాణం మొదాలని కాదాు..ఆఖరవబోతోందాని

మణి మాలికలు జ శ్రీనివాస్‌ యల్లాప్రగడ 76.

కవితలు రాయాలంట ఉన్నది లేనట్టా...లేనిది ఉన్నట్టా...లేనిది లేనట్టా

77.

మన పూర్వీకులందరూ ఋషులేనంట మనం జబ్బలు చరుద్దాం!

78.

చూడ్డం కంటే కలే నయం కనీసం నిద్రొదిలాక కలని తెలుస్తుంది

79.

చెప్పారు అటొద్దని అందాుక నేనెం చుకున్నా

80.

ఒంటరితనమా నిన్ను కూడ వదిలేసుకున్నావా

81.

భయం వెంబడిస్తోందా అయితే వెనక్కి తిరిగి ఎదాురెళ్ళు

82.

ఊరూ పేరూ లేని అనామకుడినంటున్నాడు అయితే వాడు దారిలో పడ్డట్టే

83.

అందారమూ బాకీయే ఎప్పుడో చేసుకున్న అప్పులకర్మలు తీరుస్తూ

84.

భూమి గుండ్రమన్నప్పుడు గ లీలియోని కొట్టారు

85.

విధి రాతా? నీకు నువ్వు రాసుకున్న రాతా?

మణి మాలికలు జ శ్రీనివాస్‌ యల్లాప్రగడ

93 94

86.

కనిపించేది మాయమౌతుంది మాయలేకుండ చూస్తే!!

87.

ఎక్కడేముందో వెతు క్కోవాలి అహం అంధకారం కప్పేసిన చోట

88.

కను రెప్పలు మూస్తేనే మొత్తం లోకాన్ని చూడగలిగేది

89.

దేవుడ అని పైకి చూస్తావెందుకు నీలో నున్న గుండెల్లో చూడకుండ

90.

సంభవం...అసంభవం రెండు ధాృవాలు మధ్యా విశ్వాసానికి అటూ ఇటూ

91.

నేను నువ్వను బేధామున్నా కాల్చే కట్టె ఒక్కొటే

92.

మనుషులమని గుర్తిద్దాం తర్వాతే మనసుల గురించి మ్లాడదాం

93.

ఎప్పుడూ ఉన్నదొకటే దారి రెండోది అడ్డుగోడే చూడు

94.

వెనక్కి జారిపోతున్నావా అట్టడుక్కెళ్ళేలోపు ఓ గడ్డిపరక దొరుకుతుందిగా

95.

పౌర్ణమైనా రో రాదాు చంద్రాుడు తరిగి పెరిగితేనే

మణి మాలికలు : శ్రీనివాస్‌ యల్లాప్రగడ 96.

కారణం లేకుండ ఏదీ ఉండదు ఆఖరికి నీ పుట్టుకతో సహా

97.

సంకల్పకలంలో చెమటసిరా నింపు నీరాత నువ్వురాసుకునేందుకు

98.

అతడిచ్చిన జీవితం, శరీరం, రక్తం, సంకల్పం ఇంకెంత సైన్యం కావాలి బతుకు పోరానికి

99.

కొంచెం బిజీ... మనిషిగా బతికేందుకు!

100. ప్రపంచం ఊగుతోంది మనసు మత్తులో!

101. సాగర మధానం ముందాు గరళం తర్వాతే అమృతం

102. పాడె మీదా గుర్తొస్తుంది మనిషిగా బతికితే బాగుండేదాని

103. పరిగెత్తు...గుద్దుకుంటే మంచిదే నీలో రక్తముందాని గుర్తొస్తుంది

104. కాలం కాదు నీకు నువ్వు కలిసి రాక

105. ఆవేదానకు అక్షర రూపం బాధ్యాత స్వీయ ఆచరణ రూపం హక్కు

మణి మాలికలు : శ్రీనివాస్‌ యల్లాప్రగడ

95 106. దురదృష్టం మాయమవదు ధృడనిశ్చయం చెంత

107. వెలుగు రేఖలు ఆగవు నువ్వు నిద్ర లేవకపోయినా

108. నీప్రేమను తెనిగించ మరుజన్మకై చూస్తున్నా

109. మాటల్లేని భావాలకు విలువెప్పుడు దొరికేనో

110. ఊత తొలగితేనే మనకు నడకొచ్చేది

111. అంధుడు ఏనుగును చెప్పే చందం మనం ప్రేమకు చెప్పే భాష్యం

112. మాటల దుస్తులు బాగున్నాయి మనసు నగ్నత్వాన్ని కప్పుతూ

113. నీ మనసు తోటకు మాలివి నువ్వే విరబూయిస్తావో...చెత్తగా మలుస్తావో నీ ఇష్టం

114. అక్షరాలే కాదు భావాలూ కనుమరుగు...పైకెళ్ళే కొద్దీ

115. కాల్చే కట్టే ఒకటే దాహనానికైనా...వెలుగు చూపేదైనా

96

మణి మాలికలు : శ్రీనివాస్‌ యల్లాప్రగడ