భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/హమీదా తయ్యాబ్జీ

పోలీసులు గుర్రాలచే తొక్కించినా బెదరని

హమీదా తయ్యాబ్జీ

(1911- )

బ్రిటిషు బానిస బంధనాల నుండి విముక్తి కోరుకున్న భారతీయులు దృఢసంకల్పంతో ఆ దిశగా ముందుకు సాగారు. పోరుబాటలో దీక్ష చేపట్టారంటే వారిని మార్గం మళ్లించడం ఎంతటి క్రూరత్వానికైనా సాధ్య మయ్యేది కాదు.ప్రభుత్వం ఎంతదారుణాలకు పాల్పడినా ఉద్యమకారులు పోరుబాట తప్ప లేదు . ఈ వైఖరికి పురుషులైనా, స్రీలైనా తేడా కన్పించలేదు భయానక హింసకు కూడ ఏమాత్రం వెరవక మున్ముందుకు సాగిన సాహస మహిళలు జాతీయోద్యమంలో పలువురు దర్శనమిస్తారు. ఆ మహిళలలో చెప్పుకోదగ్గవారు శ్రీమతి హమీదా తయ్యాబ్జీ.

గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన తయ్యాబ్జీ కుటుంబానికి చెందిన హమీదా తయ్యాబ్జీ 1911లో బరోడాలో జన్మించారు. ఆమె సీనియర్‌ కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసం గావిస్తున్న సమయంలో తన కుటుంబీకులతోపాటుగా జాతీయోద్యమంలో పాల్గొనేందుకు చదువును మధ్యలో వదిలేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ యువజన సమితిలో ఆమె సభ్యురాలు. తాత అబ్బాస్‌ షంషుద్దిన్‌ తయ్యాబ్జీ, మహాత్మా గాంధీల రాజకీయ సిద్ధాంతాల పట్ల ప్రభావితులయ్యారు. జాతీయోద్యమంలో భాగంగా జరిగిన అన్ని ప్రధాన సంఘటనలలో ఆమె పాల్గొన్నారు.

105 సయ్యద్ నశీర్‌ అహమ్మద్‌

ఈ క్రమంలో బ్రిటిష్‌ పోలీసుల లాఠీ దెబ్బలను రుచి చూశారు.స్వదేశీ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహిసూ,్ మహిళలతో ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో మహిళల నిబద్ధతను నీరు కార్చేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం పోలీసులను ఉసికొల్పింది. అమెను పలు హింసలకు గురిచేసంది. ఆమెను ప్రత్యే క లక్ష్యంగా పెట్టుకు ని గుర్రాలచే తొక్కించింది. అటువంటి భయానక సంఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆమె ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు. మరింత పట్టుదలతో ముందుకు వెళ్ళారు. ఆమె తన సహచరిణులను సమీకరించుకుని రెట్టింపు ఉత్సాహంతో అహింసామార్గంలో ఆందోళనలో పాల్గొన్నారు. అరెస్టులు, లాఠీ దెబ్బలు, జైలు శిక్షకు ఏమాత్రం భయపడకుండ ఉద్యమబాటన తన కార్యక్రమాలను కొనసాగించిన ధైర్య శాలి. ఈ మేరకు ఆమె పలుసార్లు జైలు శిక∆లు అనుభవించారు.

గాంధీజీ ఆదేశాల మేరకు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో పనిచేసేందుకు వెళ్ళిన ఆమె తన కార్యదక్షతను ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకోవటం మాత్రమే కాకుండ భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకుల ప్రశంసలందుకున్నారు. ఆమెకు పలు కార్యక్రమాల బాధ్యాతలను జాతీయోద్యామం అప్పగించింది. జాతీయ కాంగ్రెస్‌ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని ధైర్య సాహసాలతో నిర్వహించటమే కాకుండ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె ప్రముఖ పాత్రపోషించారు. ఆమె కార్యక్రమాల నిర్వహణా సరళిని ప్రశంసిస్తూ 1932 ఏప్రిల్‌ 24న బేగం రెహనా తయ్యాబ్జీకి గాంధీజీ లేఖ రాశారు. ఆ లేఖలో హమీదా ఎంతో ధైర్యవంతురాలు. హమీదాకు మరింత ఆయుష్షును భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఆమె చేపట్టిన కార్యకలాపాలను ఆమెకు స్యయంగా మహాత్ముడు రాసిన లేఖలలో, ఇతరులకు ఆయన రాసిన పలు లేఖలలో ప్రత్యేకంగా ప్రస్తావించి రెహనా సాహసాన్ని, కార్యదక్షతను చరిత్రకు అందించారు. మతాతీత భావాలుగల హమీదా తయ్యాబ్జీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ కు చెందిన ప్రముఖుడు ప్రబోధ్‌ మెహతాను (బొంబాయి) వివాహం చేసు కున్నారు. ఆ తరు వాత బాధ్య తలు మరువని పౌరురాలుగా, కుటుంబాన్ని సమర్ధవంతంగాతీర్చిదిద్దిన ఆదర్శ గృహిణిగా, మాతృమూర్తిగా బేగం హమీదా జీవితం గడిపారు.

106