భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం ముహమ్మద్ ఆలం
బానిస బతుకు కంటే గౌరవప్రదమైన మరణం మేలని చాటిన
బేగం ముహమ్మద్ ఆలం
భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటున్న భర్తల అడుగుజాడల్లో నడుసూ,తమదైన ప్రత్యేక పాత్రను నిర్వహించిన ముస్లిం మహిళలు ఎందారో ఉన్నారు. ఆ మహిళలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రస్తావనలు చాలా అరుదుగా కన్పిస్తాయి. జీవిత భాగస్వాములు బ్రిటిష్ ప్రబుత్వం దాష్టీకాలకు గురవుతూ, తరచుగా జైలు పాలవుతున్నందున ఎదురవుతున్న ఆర్థిక సామాజిక ఇక్కట్లతోపాటుగా మనోవ్యధను జీవితమంతా భరిస్తూ ఉద్యమాలకు ఊపిరి పోసిన మహిళామణుల త్యాగం అనిర్వచనీయం. అటువంటి మహిళలు చూపిన తెగువ, చాటిన దేశభక్తి, త్యాగనిరతి, చరిత్రలో తమదైన స్థానం ఏర్పర్చుకున్నాయి. ఆ విధమైన చరిత్రను సృష్టించిని కోవకు చెందిన మహిళలలో బేగం ముహమ్మద్ ఆలం ఒకరు.
ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ ముహమ్మద్ ఆలం భార్య. లాహోర్‌కు చెందిన ఖాన్ షేక్ మియా ఫిరోజుద్దీన్ కుమార్తె. అసలు పేరు కంటే బేగం ముహమ్మద్ ఆలం పేరుతో ఆమె ఎంతో ప్రఖ్యాతి చెందారు. డాక్టర్ ఆలం లండన్‌లో ఉన్నత విద్యను పూర్తిచేసుకుని లాహోర్ వచ్చి న్యాయవాదిగా స్థిరపడ్డారు. 1921లో కనకవర్షం కురిపిస్తున్న న్యాయవాద వృత్తిని త్యజించి ఖిలాఫత-సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఆనాటినుండి బేగం ఆలం భర్త
107 సయ్యద్ నశీర్ అహమ్మద్
కార్యకలాపాలకు పరోక్షంగా మద్దతునిస్తూ జాతీయోద్యమంలో భాగం పంచుకున్నారు. డాక్టర్ ఆలం తరచుగా జైలు కెడుతుండటంతో భర్త బాధ్యతలను తన పరిమితుల మేరకు ఆమె నిర్వహిస్తూ వచ్చారు. ఆమె కృషి, స్వాతంత్య్రోద్యమం పట్ల వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, ఆమెలోని ఉద్యమ నిబద్ధత, లక్ష్యసాధన పట్ల ఉన్న దృఢసంకల్పం 1932లో ప్రపంచానికి వెల్లడయ్యాయి.
1932లో డాక్టర్ ఆలంను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ సమయానికి డాక్టర్ ఆలం తీవ్ర శారీరక రుగ్మతతో బాధాపడుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం పట్ల, అధికారుల వ్యవహార సరళి పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న డాక్టర్ ఆలం అంటే మండిపడుతున్నఅధికారులు ఆయన పట్ల క్రూరంగా వ్యవహరించారు. అనారోగ్యంతో బాధాపడుతున్నప్పటికీ ఆయన చికిత్స పట్ల అధికారులు శ్రద్ధచూపలేదు. ఆ కారణంగా ఆయన ఆరోగ్యం రోజురోజుకు దిగజారి పోసాగింది. ఈ విషయ ం బయటకు పొక్కకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకున్నా, స్వదేశీ పత్రికలు డాక్టర్ ఆలం అనారోగ్య పరిస్థితులను తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ విషయాలను తెలుసుకున్న ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు.బ్రిటిష్ ప్రభుత్వం మీద, జైలు అధికారుల మీద విమర్శలు గుప్పించారు. డాక్టర్ ఆలం మీద కక్షపూనిన అధికారగణం ఆ విమర్శలను ఏ మాత్రం ఖాతరు చేయలేదు. డాక్టర్ ఆలం గాని, ఆయన కుటుంబ సబ్యులు గాని స్వయంగా విజ్ఞప్తి చేస్తే తప్ప ఆయనకు వైద్యసౌకర్యం కల్పించేది లేదని అధికారులు మొండికేశారు. స్వయంగా కోరితే చికిత్స కు అనుమతిస్తామని సంసిద్ధతను వ్యక్తం చేశారు.
ఈ విషయమై ప్రజలలో తర్జన భర్జనలు ప్రారంభమైనాయి. ప్రభుత్వం స్వయంగా వైద్య సేవలను అందించాల్సి ఉండగా, అందుకోసం అభ్య ర్థించటం చిన్నతనంగా కొందరు భావించగా, మరికొందరు డాక్టర్ ఆలం అనారోగ్య తీవ్రత దృష్ట్యా వినతి పత్రం పంపటం మంచిదని అభిప్రాయపడ్డారు. డాక్టర్ ఆలం మాత్రం ఎటువంటి పరిస్థితులలోనూ తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ప్రభుత్వానికి వినతిపత్రం పంపుకునేది లేదని స్పష్టంగా ప్రకటించారు. ప్రాణం పోయినా నేను ఆ పని చేయను అంటూ ఆయన మిన్నకుండి పోయారు. బేగం ఆలం భర్త ఆరోగ్యం పట్ల ఆవేదన చెందుతున్నప్పటికి భర్త అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యర్థనలు పంపలేదు. ఈ పట్టుదల మూలంగా
108 భారత స్వాతంత్యోద్యమం ముస్లింమహిళలు
డాక్టర్ ఆలంకు ఎటువంటి చికిత్స జరగకపోవడంతో సమయం గడిచే కొద్ది ఆయన ఆరోగ్యం ప్రమాదాకర స్థితికి చేరుకుని చివరకు రక్తం కక్కుకుంటూ ఆయన మృత్యువుకు సమీపం కాసాగారు.
ఆ పరిస్థితు లలో డాకర్ ఆలం హితైషులు బేగం ఆలం వద్దకు వచ్చి ఆమెకు నచ్చచెప్ప ప్రయత్నించారు. పరిస్థితులు చేయిదాటి పోతున్నందున ఉద్యమకారుడు డాక్టర్ ఆలంను కాపాడుకునేందుకు ప్రభుత్వానికి వినతి పత్రం పంపాల్సిందిగా హితవు పలికారు. ఆలస్యం చేస్తే ఆయన విలువైన ప్రాణాలను రక్షించటం ఎవ్వరికీ సాధ్యం కాదని, అందువలన త్వరపడల్సిందిగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఆలం ఆరోగ్యంపట్ల ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు పత్రికలలో ప్రజల విజ్ఞప్తుల పరంపర సాగింది. ప్రముఖ జాతీయోద్యమ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ ఆలం అనుచరులు, మిత్రులు ఆయన ఆరోగ్య పరిస్థితులను తలచుకుంటూ తీవ్రంగా వ్యధ చెందారు.
ఆ సమయంలో బేగం ఆలం నిరుపమాన దేశబక్తినీ ఉద్యమకారుడైన భర్త దాఢనిర్ణయం పట్ల గల గౌరవం, ఆమెలోని అసమాన ధైర్యసాహసాలు బహిర్గతమయ్యాయి. డాక్టర్ ఆలం అనారోగ్య పరిస్థితి పట్ల దేశవ్యాపితంగా వ్యక్తమవుతున్నఆందోళన, సన్నిహితుల నుండి వ్యక్తమవుతున్న హితవచనాల నేపధ్యంలో ఆమె ప్రజల నుద్దేశించి చేసిన ప్రకటన సంచలనం సృషించింది. ఆ ప్రకటన జాతీయోద్యామకారులకు ఎంతో స్పూర్తిదాయకంగా నిలచింది. పర్ధానషీ మహిళలు కూడ మాతృదేశ విముక్తికోసం సాగుతున్న పోరాటం పట్ల కలిగియున్న స్పష్టమైన అవగాహనకు బేగం ఆలం చేసిన ప్రకటన స్పష్టంగా అద్దం పట్టింది.
ఆనాడు బేగం ఆలం చేసిన ప్రకటనను బిజనోర్‌కు చెందిన మదీనా అను ఉర్దూ పత్రిక 1932 అక్టోబర్ 25నాటి సంచికలో ప్రచురించింది. ఆ ప్రకటన ఈ విధంగా సాగింది.
మాతృభూమి, స్వేచ్ఛాస్వాతంత్య్రాల నిమిత్తం పోరాడుతున్న నా భర్త జీవితం తొలుత ఈ జాతి సొత్తు, ఆ తరువాత మాత్రమే నాది, మరెవరిదైనా. అందువలన నా భర్త జీవితాన్నిఎలా ఉపయోగించుకోవాలన్నది జాతి జనులు నిర్ణయించాలి...ప్రభుత్వాన్ని అర్థించి, నా భర్త నామీద ఉంచిన విశ్వాసాన్నినేను భంగపరుస్తూ, ఆయన త్యాగపూరిత దృఢ నిశ్ఛయానికి వ్యతిరేకంగా నేను వ్యవహరించలేను...జరిగేదేదో జరగనివ్వండి.
109 సయ్యద్ నశీర్ అహమ్మద్
ఆ ఘోర విపత్తుకు బ్రిటిష్ ప్రభుత్వమే కారణం కానివ్వండి.. నా భర్తను సింహంలా మృత్యువును స్వీకరించనివ్వండి...జాతి ప్రయాజనాలు, ఆత్మ గౌరవాభిమానాల పరిరక్షణ విషయం లో వ్యకిగత జీవితాలు అంత ప్రాముఖ్యం కావు... మాతృదేశ విముక్తి పోరాటంలో ధనమాన ప్రాణాలను బలిపెట్టాల్సి ఉంటుంది...అందుకు ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు సరికదా, మనమంతా మరింతగా గర్వపడాలి.
..నా భర్త కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోరాడినట్లే, మృత్యువుతో కూడ పోరాడి విజయం సాధించగలరు. ఒకవేళ మృత్యువుదే పైచేయి అయినట్టయితే, గౌరవప్రదమైన జీవితం సాగించే ఉద్యమకారునికి లభించే మరణం, పదికాలాల పాటు నికృష్టంగా గడిపే భయంకర బానిస జీవితం కంటే ఎంతో ఉన్నతమైంది...అందువలన నన్నుఅర్థం చేసుకోండి. ప్రభుత్వాన్ని తన పని తాను చేసు కపోనివ్వండి. (భారతకి స్వాతంత్ర్య సంగ్రాం మే ముస్లిం మహిళావోంకా యోగ్ దాన్, డాక్టర్ ఆబెదా సమీయుద్దీన్, ఇస్టిట్యూట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ స్టడుస్, న్యూఢిల్లీ, 1997, పేజి. 316-317)
ఈ ప్రకటన అటు ప్రభుత్వ వర్గాలలోనూ ఇటు ప్రజలలోనూ సంచలనం సృష్టించింది. ఆ ప్రకటనలోని ప్రతి వాక్యం దేశభక్తిపూరితమై యావత్తు దేశాన్ని ఉత్తేజపర్చింది. బేగం ఆలం ధైర్యానికి, ఆమెలో దాగిఉన్నఉద్యమ నిబద్దతకు, భర్త నిర్ణయాల పట్ల ఉన్నగౌరవానికి ఉద్యమకారులు జేజేలు పలికారు.
ఆ విధంగా జాతీయోద్యామకారులకు స్పూర్తిదాయక మార్గదార్శకం చేసిన బేగం ఆలం జీవితాంతం డాక్టర్ ముహమ్మద్ ఆలంతోపాటుగా విముక్తి పోరాటంలో పాల్గొని చరితారులయ్యారు.
మీరంతా మీ కుటుంబాల పాలకులు, శాసకులు సంపూర్ణాధికారులు కారా? అది నిజమైతే మనం మన కుటుంబాలలోని మగవాళ్లందర్నీ సహాయ నిరాకరణ ఉద్యమంలో నిష్టగా పొల్గోమనేట్టు ప్రోత్సహించాలి. ఉద్యమం పట్ల నిబద్ధతతో వ్యవహరించేలా చూడాలి. అందుకు విరుధంగా వ్యవహరిస్తే సాంఫిుకంగా బహిష్కరించాలి. మన మగవాళ్ళను కర్మనిష్టాపరులను చేయాలి.....ధర్మపోరాటం పట్ల దృఢచిత్తులై వ్యవహరించండి.
- అక్బరీ బేగం.
110