భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/మునీరా మజ్రుల్ హఖ్
గాంధీజీకి వజ్రాల గాజులు అందించిన వితరణశీలి
మునీరా మజ్రుల్ హఖ్
స్వాతంత్య్రోద్యమంలో అవిశ్రాంతంగా పాల్గొంటూ ఉద్యమకారుడైన భర్తకు అన్ని విధాల సహకరిస్తూ, ఉద్యమ అవసరాలకు అనుగుణంగా మసలుకున్న మహిళలు జాతీయోధ్యమ చ రి త్ర లలో మనకు ఎందరో క ంపిస్తారు . ఆ కోవక ు చె ం దిన మహిళామతల్లులలో మునీరా బేగం ప్రముఖులు.
మునీరా బేగం గుజరాత్‌కు చెందిన తయ్యాబ్జీ కుటుంబీకురాలు. ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధు లు జస్టీన్ బధ్రుద్దీన్ తయ్యాబ్జీ మేనకోడలు. జాతీయోద్యామకారుల కుటుంబం నుండి వచ్చిన ఆమె 1917లో ప్రఖ్యాత జాతీయోద్యామకారుడు పాట్నా జమీందారి వంశస్థుడైన మౌల్వీ మజ్రుల్ హఖ్‌ను వివాహమాడారు. వివాహానంతరం ఆమె భర్తతోపాటుగా జాతీయోద్యమంలో భాగస్వామి అయ్యారు. హిందూ-ముస్లింల ఐక్యత కోసం కృషి సల్పారు.
ఆమె సంపన్న కుటుంబానికి చెందిన సర్వసంపదలను ఉద్యమకారుల కోసం త్యాగం చేసిన వితరణశీలి. నిరాడంబరంగా జీవితం సాగిస్తూ వచ్చిన ఆమె గాంధీజి అడిగినంతనే అత్యంత విలువచేసే వజ్రాలు పొదిగిన తన బంగారు గాజులను దానంగా ఇచ్చేసి ఆయనను ఆశ్చర్యచకితుల్ని చేశారు.
ఆమె త్యాగనిరతిని వివరిస్తూ 1920 డిసెంబరు 4వ తేదిన గాంధీజి తన మిత్రుడు అక్బర్ హైదారాబాదికి రాసిన లేఖలలో, జాతీయోద్యమంలో ఆమె పాత్రను వివరిస్తూ, ఆమె దాతృత్వాన్ని వర్ణిస్తూ ఎంతగానో కొనియాడరు. (Collected works of Mahathma Gandhi , Volume XIX 1920-1921, Page.70)
ఆమె భర్త మజ్రుల్ హక్ సర్వసంపదల్ని వదలి ఫకర్ జీవితాన్ని స్వీకరించి, హిందూ- ముస్లింల ఐక్యత కోసం పనిచేశారు. ఆ మార్గంలో మునీరా బేగం భర్తకు అన్ని విధాల సహకరించారు. ఆమె జీవితాంతం ఆ దిశగా కృషి చేశారు. 78