భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/' షహీద్‌ ' ఉమర్‌ బీబీ

జలియన్‌ వాలా బాగ్‌లో నేలరాలిన ధీరమాత

' షహీద్‌ ' ఉమర్‌ బీబీ

(1864 - 1919)

మాతృభూమిని విముక్తి చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పరాయి పాలకుల మీద విజృభించిన ఘట్టాలలో పురుషులతోపాటు స్రీలు కూడ సాహసోపేత భాగస్వామ్యం వహించారు. ఈ మేరకు సాగిన అహింసాయత పోరాటాలలో పాల్గొని బ్రిటిష్‌ పోలీసుల హింసకు ప్రాణాలను అర్పించిన అమరజీవుల జాబితాలో ఉమర్‌ బీబీ అరుదైన స్థానం సంపాదించుకున్నారు.

పౌరుషానికి పోతుగడ్డ దైర్య సాహసాలకు పుట్టినిల్లుగా ఖ్యాతిగాంచిన పంజాబ్‌ రాష్రం లోని అమృతసర్‌ జిల్లా, దుల్లా (DULLA) గ్రామంలో ఉమర్‌ బీబీ 1864లో జన్మించారు. బానిస బ్రతుకును సహించలేని రైతుకుటుంబంలో పుట్టిన ఆమె స్వతంత్ర భావాలను అలవర్చుకున్నారు. ఆమెకు ఇమానుద్దీన్ తో వివాహం జరిగింది. (Freedom Movement and Indian Muslims, Santimoy Ray, PPH, New Delhi, 1983, Page.97)

మాతృభూమి పట్ల అపార గౌరవాభిమానాలు గల మహిళ ఉమర్‌ బీబీ. జాతీయ ఉద్యమ విశేషాలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ అనుకూలాంశాలకు ఆనందం, ప్రతికూల అంశాల పట్ల బాధను వ్యక్తం చేస్తూ వచ్చారు. స్వదేశీయుల మీద విరుచుకు 73 పడుతున్న బ్రిటిష్‌ పోలీసుల దాష్టీకాలను జ్వలిత నేత్రాలతో గమనిస్తూ ఆవేదన చెందారు. మాతృభూమిని బానిస బంధనాల నుండి విముకం చేయడనికి భారతీయులు సాగిసునfl పోరాటాలను అణిచివేసేందుకు బ్రిటిష్‌ పాలకులు అనుసరిస్తున్న క్రూరవిధానాల మూలంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితి నెలకొనియున్న తరు ణంలో ఆమె జీవిత సహచరు డు కన్నుమూశారు. భర్తను కోల్పొయిన ఆమె సంసారం ఒడిదుడుకులకు గురయ్యింది.

ఆర్థిక కష్టనష్టాల కడలిలో పయనం సాగిస్తున్నా కూడ ఉమర్‌ బీబీ జాతీయోద్యామ కార్యక్రమాల పట్ల తనకున్న ప్రత్యే క ఆసక్తిని కోల్పోలేదు . ఆనాడు పంజాబ్‌ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటూ ఉద్యామకారుల ఉత్సాహానికి ఆనందిస్తూ, ఉద్యమకారులను తన బిడ్డలుగా భావిస్తూ ప్రోత్సహిస్తూ ఆశీర్వదించారు. జాతీయోద్యమ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ నాయకుల సబలకు హాజరుకాసాగారు. ఆ నాయకుల, విప్లవయోధుల ప్రసంగాలను శ్రద్ధగా వినేవారు. ఆ సభలు-సమావేశాల నుండి గ్రామానికి తిరిగి వచ్చి ఆయా కార్యక్రమాల విశేషాలను గ్రామస్తులకు ఆసక్తిదాయకంగా వివరించటం అలవాటు.

ప్రథమ ప్రపంచ యుద్ధంలో భారతీయుల అండదండలు, మద్దతు సంపాదిం చటం కోసం బ్రిీషు ప్రబుత్వం పలు ప్రయ త్నాలు చేసిణ్ది. యుద్ధ సమయంలో పంజాబు నుండి అత్యధికులను భారత సైన్యంలో చేర్చుకుంది. ఈ మేరకు అటు ప్రజలకు ఇటు భారతీయ సైనికులకు పలు హమీలను ఇచ్చింది. ప్రపంచ యుద్ధ్దం తరువాత తాను ప్రకటించిన హామీలను, కల్పిస్తానన్న అవకాశాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రబుత్వం తన హామీలను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాల్సిందిగా ప్రజలు డిమాండ్‌ చేశారు. ప్రజల డిమాండ్‌లను ప్రభుత్వం పట్టించుకోకపోగా అలనాటి హామీలను ప్రస్తావించిన ప్రజల మీద విరుచుకుపడింది. ఈ రకమైన నమ్మక ద్రోహం కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో పాలకుల పట్ల అన్ని వర్గాలలో అసంతృప్తి అలుము కుంది. ఆ అసంతృప్తి కాస్తా స్థాయిదాటి ఆగ్రహ రూపుదాల్చింది. ఆ కారణంగా పంజాబులో విప్లవ కార్యకలాపాలు ఊపందాుకున్నాయి.

ఈ వాతావరణంలో 1918 ఆగస్టులో అమృతసర్‌లో డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ, ఆయన భార్య సాదత్‌ బానో కిచ్లూల నేతృత్వంలో ముస్లిం జనసముదాయాల నిరసన సభ జరిగింది. ఈ సభలో వక్తలు బ్రిటిషు ప్రభుత్వం అనుసరిస్తున్నప్రజావ్యతిరేక చర్యల

74

భారత స్వాతత్రోద్యమములో ముస్లిం మహిళలు


మీద విరుచుకుపడ్డారు. ఈ వాతావరణం క్రమంగా పంజాబు దాటి దేశవ్యాప్తం కాసాగింది. ప్రజల నుండి వ్యక్తమౌతున్న ఆందోళన, ఆగ్రహాన్ని అణిచివేతకు ఉద్యమిస్తున్న సాయుధ విప్లవకారులను నిరోధించేందుకు, దేశవ్యాప్తంగా వ్యక్తమౌతున్న నిరసన జ్వాలల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంగ్ల ప్రభుత్వము 1919 మార్చిలో భయంకర రౌలత్‌ చట్టాన్ని తెచ్చింది.

ఈ చట్టం ద్వారా అధికారులకు విశేషాధికారాలు కల్పించింది. పౌర హక్కులను కాలరాయడానికి, విచారణ లేకుండా ఎవరినైనా నిర్బంధించడానికి అవసరానికి మించిన అసాధారణ అధికారాలు పోలీసులకు లభించాయి. ఈ చట్టం క్రింద అనుమానితులు ఎవరినైనా, ఎక్కడైనా పోలీసులు, సైన్యాధికారులు అరెస్టు చేయవచ్చు. ఆ విధంగా అరెస్టు అయిన వారెవ్వరికీ బెయిలు లభించదు. వకీలును నియమించుకునే అవకాశం ఉండదు. తన వాదన విన్పించుకునే అవకాశం ఇవ్వరు. ఆ కారణంగా రౌలత్‌ చట్టం గురించి గాంధీజి వ్యాఖ్యానిస్తూ, నో అప్పీల్‌-నో వకీల్‌-నో దాలాల్‌ (No appeal;no vakeel;no dalaal) అని అన్నారు.

ఈ ప్రజావ్యతిరేక చట్టానికి నిరసనగా సత్యాగ్రహోద్యామానికి గాంధీజీ పిలుపు ఇచ్చారు. ఈ ఉద్యమానికి నాందిగా ఢిల్లీలో తొలి సత్యాగ్రహ సభ జరిగింది. ఆ తరువాత పంజాబులో సభ నిర్వహిచేందుకు డాక్టర్ సైఫుద్దీన్‌ కిచ్లూ తదితర నాయకుల నేతృత్వలో్

మహాత్మా గాంధీని ఆహ్వానించారు. ఆయన రాకను నిరోధించేందుకు ప్రబుత్వం గాంధీజీని అరెస్టు చేసింది. ఆ అరెస్టుకు పంజాబ్‌ ప్రజలు తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో అత్యంత క్రూరుడిగా పేర్గాంచిన జనరల్‌ డయ్యర్‌ నేతృత్వంలో సాగుతున్నపోలీసు రాజ్యాన్ని పంజాబు నాయకులు డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ, డాక్టర్‌ సత్యపాల్‌ తీవ్రంగా విమర్శించారు. ఆ విమర్శలకు ఆగ్రహించిన ప్రభుత్వం ఆ నేతలను 1919 ఏప్రిల్‌ 10న అరెస్టుచేసి ప్రవాసానికి పంపింది.

ఈ చర్యతో పంజాబు జనం మరింత రెచ్చిపోయారు. ప్రియతమ నాయకులను విడిచిపెట్టమంటూ ఊరేగింపులు జరిపారు. ఆ సందర్బంగా జరిగిన కాల్పులలో నలుగురు మరణించారు, పలువురు గాయపడ్డారు . ఆ సంఘటనలతో మరింత రచ్చిపోయిన ప్రజలు నేషనల్‌ బ్యాంకులోని ఇరువురు ఆంగ్ల అధికారులను హతమార్చారు, గందరగోళం సృష్టించారు. ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపచేశారు.

అ సంఘటనల తరువాత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు ఏప్రిల్‌ 13న అమృతసర్‌లోని జలియన్‌వాలా బాగ్ లో నిరసన సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున వైశాఖి పర్వదినం. ఆ సందర్భంగా జరుగుతున్న సభలో పాల్గొనేందుకు పరిసర గ్రామాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో జలియన్‌వాలా బాగ్ కు తరలి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న జనరల్‌ డయ్యర్‌ కుట్రపూరితంగా వ్యవహరించాడు. సభా కార్యక్రమాలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ ఉత్తర్వులను ప్రజలు ఖాతరు చేయలేదు. జలియన్‌వాలా బాగ్ ఆ రోజున జనప్రవాహంతో నిండిపోయింది. ఆ సభలో పాల్గొనేందుకు ఉమర్‌ బీబీ కూడ అమృతసర్‌కు చేరుకున్నారు.

ప్రజలు భారీ సంఖ్యలో సభాస్థలికి విచ్చేశారు. ఈ స్పందనకు జనరల్‌ డయ్యర్‌ మండిపడ్డాడు . నిప్పుతొక్కిన కోతిలా చిందులేశాడు. సాయుధ బలగాలను వెంటపెట్టుకు ని సబాసలిని చుట్టుముట్టాడు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు చేయకుండానే సబికుల మీద కాల్పులు జరిపించాడు. సభాస్థలి చుట్టూ ప్రహరీ గోడ ఉండటం, సభాస్థలిలోకి రాకపోకలకు ఒకవైపు మాత్రమే ఉన్నఇరుకైన ప్రవేశమార్గానికి అడ్డంగా తన సాయుధ బలగాలను మొహరించి కాల్పులు జరిపించిన డయ్యర్‌ కిరాతకత్వానికి పెద్దసంఖ్యలో ప్రజలు నేలకొరిగారు. ఈ దుస్సంఘటనలో ప్రభుత్వ రికార్డుల ప్రకారంగా 378 మంది మరణించగా అందులో 55 మంది ముస్లింలు ఉన్నారు. ఈ సంఖ్య సరికాదని అమరులైలెన


76

భారత స్వాతంత్యోద్యామం : ముస్లిం మహిళలు

అమర వీరుల రుధిర ధారలకు గుర్తుగా నిలచిన జలియన్‌వాలా బాగ్ గోడ.

వారు సుమారు 1500 వరకు ఉంటారని, మూడు వేలకు పైగా గాయపడిన వారు ఉన్నారని ఆనాటి పలు వ్యక్తిగత, సంస్ధాగత నివేదికలు పేర్కొన్నాయి.

భారత స్వాతత్ర్య్ సమరోజ్వల చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడిన జలియన్‌వాలా బాగ్ దుర్మార్గంలో డయ్యర్‌ సైనిక మూకల తుపాకీ గుండ్లకు ఉమర్‌ బీబీ బలయ్యారు. ఆనాటి 55 మంది ముస్లిం యోధులలో ఒకే ఒక మహిళగా 55 సంవత్సరాల ఉమర్‌ బీబీ ప్రత్యేక స్థానం పొందారు.

ఈ మేరకు తన రుధిర ధారలతో జలియన్‌వాలా బాగ్ మట్టిని పునీతం చేయడం మాత్రమే కాకుండ తమ వీరోచిత పోరాటాలతో, ప్రాణ త్యాగాలతో పంజాబీలు నిర్మించిన అద్భుత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఉమర్‌ బీబీ ప్రత్యేక స్థానం పొందారు. (Contribution of Muslims to the Indian Freedom Movement, Khaliq Ahamed Nizami, Idarah-i-adabiyat-i- Delli,1999, Page. 36)

                               * * *

నా భర్తను సింహంలా మృత్యువును స్వీకరించనివ్వండి...జాతి ప్రయోజనాలు, ఆత్మగౌరవాభిమానాల పరిరక్షణ విషయంలో వ్యక్తిగత జీవితాలు అంత ప్రాముఖ్యం కావు..మాతృదేశ విముక్తి పోరాటంలో ధనమాన ప్రాణాలను బలిపెట్టాల్సి ఉంటుంది. ..అందుకు ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు సరికదా, మనమంతా మరింతగా గర్వపడాలి. - బేగం ముహమ్మద్‌ ఆలం.

77