భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం రెహానా తయ్యాబ్జీ

గాంధీజీకి ఉర్దూ భాష నేర్పిన మంచి కవయిత్రి

బేగం రెహానా తయ్యాబ్జీ

(1900-1975)

జాతీయోద్యమంలో తాత, తలితండ్రులతోపాటుగా మాత్రవుే కాకుండ మెట్టినింట చేరాక కూడ భర్త కుటుంబీకులతో కలసి పోరుబాట నడిచిన అవకాశం ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులలో చాలా కొద్ది మందికి లభించింది. అటువంటి అదృష్టానికి నోచుకున్న అతికొద్ది మందిలో ఒకరు రెహానా తయ్యాబ్జీ.

గుజరాత్‌ లోని సంపన్నతయ్యాబ్జీ కుటుంబంలో రెహానా తయ్యాబ్జీ 1900 జనవరి 27న జన్మించారు. ఆమె తల్లి ఆమీనా తయ్యాబ్జీ (1866-1942), తండ్రి జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యాబ్జీ (1854-1936). ఆయన గాంధీజీ చే గుజరాతి వజ్రం గా పిలువబడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు. 1885లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ స్థాపన జరిగినప్పటి నుండి తయ్యాబ్జీ కుటుంబీకులు అందులో సభ్యులు. ఆమె సన్నిహిత సంబంధీకులు జస్టిస్‌ బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ (1844-1906) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పనిచేయగా తయ్యాబ్టీ కుంటుంబంలోని పలువురు మహిళలుజాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.

రెహానా తండ్రి జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యాబ్జీ, తల్లి అమీనా తయ్యాబ్జీలు మహాత్ముని నేతృత్వంతో సాగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె తల్లి గుజరాత్‌లో మహిళల

177 ఆధ్యర్యంలో సాగిన కార్యక్రమాలకు స్వయంగా నాయకత్వం వహించారు. తయ్యాబ్జీ కుటుంబంలోని ప్రతిఒక్కరూ చాలా వరకు ఏదోవిధాంగా జాతీయోద్యమంలో భాగస్వాములయ్యారు. ఆ కారణంగా తయ్యాబ్జీ కుటుంబం స్వాతంత్య్రోద్యామయోదుల కుటుంబంగా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది.

ప్రఖ్యాతి చెందిన స్వాతంత్య్రసమరయోధుల కుటుంబంలో జన్మించిన రెహానా తయ్యాబ్జీ పెంపకం ఆ వాతావరణంలో సాగింది. ఆ ఇంట ప్రతి ఒక్కరూ ఉద్యామకారులు కావటం, ఆ ఇంటికి వచ్చే అతిథాులు కూడ ఆ బాటన నడుస్తున్న యెధాులు కావటంతో చిన్ననాటనే రహానా హృదాయంలో స్వేచ్ఛా, స్వతంత్ర భావాలు ప్రగాఢంగా నాటుకున్నాయి. ఆ వాతావరణం ఫలితంగా రెహానా తయ్యాబ్జీ కూడ బానిస బంధనాల నుండి విముక్తి కోసం సాగుతున్న పోరా దిశగా పయనించారు.

ఆధునిక విద్యతోపాటుగా సాంపద్రాయక విద్యను అభ్యసించిన రెహానా గ్రాడ్యుయేషన్‌ చేయటంతోపాటుగా ఆంగ్లం, హిందీ, గుజరాతీ, ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. తయ్యాబ్జీ కుంటుంబానికి మహాత్మాగాంధీ సన్నిహితులు కావటంతో చిన్ననాటనే రెహానాకు గాంధీజీ పరిచయం కలిగింది. ఆయనను తమ కుటుంబం లోని ఓ పెద్దగా తయ్యాబ్జీలు పరిగణించారు. ఆయనతో తమ కుటుంబ వ్యవహారాలను కూడ చర్చించి సలహాలు తీసుకున్నసందార్భలున్నాయి. గాంధీజీ ఆమెను తన కుమార్తెగా భావించారు. ఆమెకు సంబంధించిన ప్రతి విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపారు. గాంధీజీ తన ఉత్తరాలలో ఆమెను ప్రియపుత్రి, చిరంజీవి, రెహానా బేటిగా, బేటీ రహానా, ఉస్తాది సాహెబా, పాగల్‌ రహానా, భోలి బేటి అని సంబోధించారు.


మహాత్ముని సేవాగ్రాం ఆశ్రమంలో రెహానా తయ్యాబ్జీ కొంత కాలం గడిపారు. ఆ సందార్బంగా ఆమె గాంధీజీకి ఉర్దూ భాష నేర్పారు. ఆ తరు వాత కూడ ఆమె గాంధీజీకి తరచూ ఉతరాలు రాస్తూ ఆ విషయం మీదా ఎంతో శ్రద్ధచూపారు. ఆమె నుండి ఉత్తరాలు ఆందుకోవడం ఎంతో ఆనందదాయకమని గాంధీజీ చెప్పుకున్నారు. ఆమె నుండి ఉత్తరాలు రావటం అలశ్యమైతే ఆయన ఎంతో వ్యాకులత చెందారు. ఈ విషయాన్ని ఆమెకు రాసిన ఒక ఉత్తరంలో, నీ ఉత్తరం అందకుంటే నా మనస్సు గందరగోళంగా ఉంటుంది అని రాశారు. ఆ కారణంగా ఆమెను ఉస్తాది సాహెబా అని తన ఉత్తరాలలో సంబోధించారు. రెహానా తయ్యాబ్జీ సూఫితత్వాభిలాషి. ఆమె అన్ని మతాల పట్ల సమాన గౌరవం

178 చూపారు. అన్ని మతాలు భగవంతుడిని చేరు మార్గాలని ఆమె భావించారు. మతాలకు అతీతంగా మానవులంతా ఒక్కటేనని, ధార్మం మానవులలో ఐక్యత పెంచేందుకు దోహదపడలన్నారు. మహాత్ముని సేవాగ్రామంలో ఉన్న సమయంలో అక్కడ జరిగిన ప్రార్ధనా సమావేశాలలో అన్ని మతాలకు సంబంధించిన ప్రార్ధనా గీతాలను, చక్కని కంఠంతో గానం చేయటం ఆమె దినచర్యగా మారింది. ఆమె ఖురాన్‌ పఠనం అందరిని ఆకట్టుకుంది. ప్రతి సమావేశంలో ఆమె ఖురాన్‌ పఠనం ప్రత్యేకంగా సాగేది. మహాత్మా గాంధీ ఆమెచేత ఖురాన్‌ను చదివించుకుని శ్రద్ధగా వినేవారు. మత సామరస్యం బోధించే, సూఫీ సిద్థాంతాల పట్ల మక్కువ గల రహానా మతం పేరిట కలహాలు, మతస్థుల మధ్యా ఘర్షణలు జరిగితే విలవిల్లాడరు. మతఘర్షణల నివారణకు, శాంతి సామరస్యాల స్థాపనకు నిరంతరం కృషిసల్పారు. ఆమె సూఫి తత్వం.

మతసామరస్యం, హిందూ-ముస్లింల ఐక్యత వరకు పరిమితం కాలేదు. ఆమె తాత్వికత విస్వమానవ సోదరభావం దిశగా సాగింది. ఈ మేరకు ప్రచారకార్యక్రమాలను కూడ ఆమె నిర్వహించారు. ఆమె సలహాలను, సూచనలను స్వీకరించేందుకు, ప్రసంగాలను, ప్రార్థనా గీతాలను వినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమాలకు హాజరయ్యేవారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan : Page. 250)

రెహానా తయ్యాబ్జీ చక్కని కవయిత్రి. ఆమె స్వయంగా పలు ప్రార్థనా గీతాలను రాశారు. అన్నిమతాలకు సంబంధించిన ప్రార్ధనా గీతాలను ఆమె స్వయంగా రాసి పాడి సభికులకు విన్పించి ప్రశంసలందుకున్న ఘట్టాలున్నాయి. ఆమె సేవాగ్రాం నుండి వెళ్ళిపోయాక కూడ గాంధీజీ ఆమెకు ఉత్తరాలు రాసి మరీ ప్రార్థనా గీతాలను, గజల్స్‌ను ప్రత్యేకంగా రాయించుకున్న సందార్భాలున్నాయి. నీ ప్రార్ధనా గీతాలు విననిదే నాకు బాగుండటం లేదు, నీవు వచ్చి పాడి విన్పించు అని గాంధీజీ ఆమెకు రాసిన ఉత్తరాలలో పేర్కొన్నారంటే ఆమె గీతాలు ఆయనను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలుస్తుంది. ఆమె కేవలం ప్రార్థ్ధనాగీతాలు మాత్రమే రాయలేదు. జాతీయోద్యామంలో భాగంగా ఉద్యమకారులను ఉత్తేజపర్చేందుకు ఉద్యమ గీతాలు కూడ రాశారు. ఆ పాటలను భారత జాతీయ కాంగ్రెస్‌ సభలు, సమావేశాల వేదికల మీదా నుండి పాడి విన్పించారు.

జాతీయోద్యామంలో భాగంగా ఆమె తల్లితండ్రులతో కలసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గుజరాత్‌లో మద్యపాన నిషేధ ఆందోళన, విదేశీవస్తువుల బహిష్కరణ ఉద్యమాల నిర్వహణకు గుజరాత్‌ మహిళల సమావేశాన్ని గాంధీజీ ఏర్పాటు చేసిన

179 సందర్భంగా ఆ సమావేశంలో ఆమె ప్రధాన పాత్ర వహించారు. 1930 ఏప్రిల్‌ 11న రెహానా తయ్యాబ్జీకి గాంధీజీ ఓ లేఖ రాస్తూ మధ్యపానం, విదేశీ వస్తువుల బహిష్కరణ తదితర అంశాల మీద గుజరాత్‌ మహిళల సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశానికి నీవు, మీ అమ్మగారు తప్పక హాజరుకావాలి అని కోరారు. ఆ సమావేశానికి రెహానా తన తల్లి అమీనా తయ్యాబ్జీతోపాటుగా హజరయ్యారు.

భారతదేశానికి మార్గదర్శకమైన ఈ ఉద్యామం సందర్భంగా మహిళలను సంఘితం చేసేందుకు రెహానా ప్రత్యేక బాధ్యాతలు స్వీకరించి ఆ బృహత్తర భూమికను నిర్వర్తించారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ యువజన విభాగం యూత్‌ లీగ్‌కు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఆ హోదాలో మహాత్ముని ఆదేశాల మేరకు ఆమె పలు కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఈ ఉద్యామం సందంర్బగా ఆమె పలుమార్లు అరెస్టయ్యారు.

ఈ ఉద్యమం నేపధ్యంలో గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ పక్షాన సమావేశం తీర్మానాలను ప్రభుత్వానికి ఎరుకపర్చేందుకు రెహానా తయ్యాబ్జీ, అమీనా తయ్యాబ్జీ, ఆమనా ఖురేషి సంతకాలతోపాటు మొత్తం మీదా 24 మంది మహిళల సంతకాలతో కూడిన మహాజరును వైశ్రాయికి పంపారు. ఆ మహాజరులో రహానా తయ్యాబ్జీ సంతకాన్ని కూడ గాంధీజీ కోరడం ద్వారా ఆమె ప్రాధాన్యత వెల్లడయ్యింది.

1942 నాటి ఖ్విట్ ఇండియా ఆందోళనలో ఆమె క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊరేగింపు నిర్వహిస్తున్న ఆమెను ప్రభుత్వం అరెస్టు చేసి సంవత్సరం జైలు శిక్షకు గురిచేసింది. స్వాతంత్య్రోద్యమ సైనికురాలుగా ఆమె లాఠీ దెబ్బలను, జైలు శిక్షలను అనుభవించారు. అరెస్టులు, లాఠీ దెబ్బలు, జైళ్ళు, స్వాతంత్య్రోద్యమకారులకు సత్కారాలుగా భావించిన రెహానా తయ్యాబ్జీ చివరి వరకు జాతీయోద్యమంలో విరామమెరుగక పాల్గొన్నారు.

సర్వమానవ సోదారభావానికి, విస్వశాంతి పరిరక్షణకు, బానిసత్వం నుండి మాతృదేశం విముక్తి కోసం చివరి క∆ణం వరకు ఉద్యామించిన బేగం రెహానా తయ్యాబ్జీ 1975 మే 16న అవివాహితగా కన్నుమూశారు.

180