భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం మజీదా బానో
మతం పేర దేశ విభజన తగదంటూ ' లీగ్ ' ను ఎదుర్కొన్న
బేగం మజీదా బానో
(1919- 1974)
బ్రిటిష్ వలసపాలకులను తరిమివేతకు పోరాటం సాగిస్తున్న ప్రజలను, ద్విజాతి సిద్ధ్దాంతం ఆసరాతో చీల్చి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలన్న స్వార్థపర శక్తులకు, వ్యక్తులకు వ్యతిరేకంగా కూడ ప్రజలు ఉద్యమించారు. భారతదేశంలోని ముస్లింలకు ప్రతినిధిగా ప్రకంచుకున్న ముస్లిం లీగ్ వేర్పాటువాదచర్యలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, మతం పేరుతో అధికారాన్ని చేప్టాలనుకుంటున్న శక్తుల ఎత్తులను చిత్తుచేయడనికి సాహసంతో బరిలోకి దిగిన సాహసి శ్రీమతి మజీదా బానో.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదారాబాదులో బేగం మజీదా బానో 1919లో జన్మించారు. ఆమె తండ్రి ముస్తా ఫా అహమ్మద్. ఆయన నిజాం సంస్థ్ధానంలో ఉద్యోగి. పదవ తరగతి చదాువుతున్నప్పుడు ఆమె వివాహం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన న్యాయవాది మహమ్మద్ సిద్ధీఖీ తో జరిగింది. వివాహం తరువాత భర్తతో పాటుగా ఆమె ఉత్తర ప్రదేశ్ వెళ్ళిపోయారు. భర్త కుటుంబంతో సన్నిత సంబంధాలు గల ప్రముఖ జాతీయోద్యామ నాయకులు రపీ అహమ్మద్ కిద్వాయ్ ప్రబావంతో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు.
175 స్వేచ్ఛా, స్వాతంత్య్రాల దిశగా సాగుతున్ని జాతీయోద్యమం సంపూర్ణ విజయం సాధించి స్వరాజ్యం స్థాపం చాలంటే, ప్రజలు మతాలకు అతీతంగా ఐక్యం కావాల్సి ఉందనిఆమె భావించారు. ఆ కారణంగా మతం పేరుతో వేర్పాటువాద రాజకీయాలు నడుపుతున్నముస్లిం లీగ్ నాయకుల తీరుతెన్నులను విమర్శించారు. 1936లో జరిగిన ఓ ప్రదర్శనలోజాతీయ వాదులైన కొందరు యువకులు ఏర్పాటు చేసిన ఆజాద్ ముస్లిం లీగ్ లో ఆమె భాగస్వాములయ్యారు. ఆజాద్ లీగ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదార్శనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందార్భంగా ముస్లింలీగ్ అధినేత ముహమ్మద్ అలీ జిన్నాకు వ్యతిరేకంగా బేగం మజీదా బానో నినదించా రు.
1935 భారత చట్టం ప్రకారంగా దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. భారత జాతీయ కాంగ్రెస్ ప్రజలందరి ప్రతినిధిగా ఎన్నికల రంగంలో దిగగా, ముస్లింలీగ్ తాను ముస్లింల ప్రతినిధిగా ప్రకించుకుంది. ఆ ఎన్నికల లో లక్నో మహిళా నియోజకవర్గం నుండి మజీదా బానో జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె ముస్లిం లీగ్ అభ్యర్థ్ది బేగం ఇనాం హబీబుల్లాతో పోటి పడ్డారు . ఈ ఎన్నికలలో మౌలానా అలీ సోదరు లలో ఒకరైన మౌలానా షధకత్ అలీ తదితర ప్రముఖ నాయకులు లీగ్ గెలుపును కాంక్షిస్తూ ప్రచారం సాగిం చారు. ఈ సందర్భంగా మౌలానా ష్ధకత్ అలీ ఖురాన్ గ్రంథాన్ని చేతబూని ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజల నుండి వాగ్దానం చేయించు కోవడాన్ని బట్టి, లీగ్ ఆ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
జాతీయ కాంగ్రెస్ అభ్య ర్థి మజీదా బానో పక్షాన కాంగ్రెస్ నేతలు, లక్నో విద్యారులు ప్రచారం చేశారు. మత సామరస్యం కోరుతూ ముసిం లీగ్ నేతల వాదనలను పూరపక్షం చేస్తూ మజీదా పర్దాతోపాటే విసృత పర్యట నలు జరిపారు. ఆ ఎన్నికలలో కేవలం 175 ఓట్ల తేడతో ఆమె ఓటమి చెందారు. అయినా ఎన్నికల జయాపజయాలతో ఏమాత్రం నిమిత్తం లేకుండ హిందు-ముస్లింల ఐక్యతా నినాదాంతో ముందుకు సాగారు.
స్వతంత్ర భారతం అవతరించాక, దేశసేవకు అధిక ప్రాధాన్యతనిచ్చి, చివరి క్షణం వరకు మతసామరస్యం కోసం కృషి చేస్తూ ప్రజాసేవలో గడిపిన శ్రీమతి మజీదాబానో 1974 ఫిబ్రవరి 12న బీహార్ రాష్ట్రం బారా బంకీలో కన్నుమూశారు.
176