బాల నీతి/విమర్శనము
< బాల నీతి
కాన వానినిదునిమి శిష్టరక్షకుడను బిరుదమును నంవర్ధకము కలదానిగా నొసంగించుకొనుమని నారదమహర్షివచ్చిచెప్పిపోయెను. ఈరెండును నాకచరణీయములే. ప్రస్తుతమందరెండు నాసన్నములైనవి. కాని వీనియందు ముంసేదియుపేక్షణీయమోయేదియాచరణీయమో నాకుదెలియలేదు. కానమీరుచక్కగా విమర్శించి చెప్పుడని వారినిగోరెను. అంతనీలాంబరుడాతనితో రాజసూయాధ్వరగమనంబుపేక్షణీయంబనియు, శిశుపాల వధకార్యం బత్యావశ్యకామష్టేయంబనియు నాశ్రీకృష్ణునికి జెప్పెను. అంత నుద్ధవుడు బాగుగ విమర్శించి శాంతచిత్తముతో “కృష్ణా!ఆరాజసూయాధ్వరంబునకు సకలరాజులురాగలరు. శిశుపాలుడు కూడ వచ్చును. నీవు నచటికేగిన ధర్మరాజెక్కువగా సంతోషించి తుదిదినమున సభామధ్యమున ముందుగా నిన్నుయాబూజించును. దాన నీదుర్మార్గుడగు శిశుపాలుడు చూచి యోర్వలేక నిన్నుదూలనాడును. అత్తఱి నీవు వానిని చేదింపవచ్చును. కాన రాజసూయాధ్వరగమనంబె నీవనుకొనిన రెండుపనులను నెఱవేర్చగలదు. కావున నటులజేయుమని చెప్పెను.అంత గృష్ణు డాయుద్ధవుడువిమర్శించి వచించిన విధముననె రాజసూయాధ్వర్ంబుంకు జనెను. ఆయన చెప్పినటుల దన్ను ధర్మరాజు పూజించెను. దానినోర్చలేక శిశుపాలుడు తిట్టెను. అంత దనుశిశుపాలుని ఖండించివిచెను. అంతటగృష్ణుడు తనమనమున నుద్ధనవిమర్శనబుద్ధికి మెచ్చుకొని యెక్కువగాంసంతోషించెను.
102
బా ల నీ తి.
వి మ ర్శ న ము.
చక్కగా విచారించుట విమర్శన మనబడు.
ఇది, చెడుగుపనులను జేయించనీయదు. ఇదియె, లాభాలాభములగుఱించి దూరాలోచనమును జేయించును. ఇదియ గుణాగుణముల దెలియ బరచు చుండును. ఇదియె, పాండితిని వృద్దిజేయుచుండును. ఇదియే తత్తఱపాటు నాపును. ఇదియె, నిదానము గలిగించుచుండును.కాబట్టి వివిధఫలప్రదంబగు నీవిమర్శనము మనుజ జాతికంతకు ముఖ్యము. ఇట్టివిమర్శనముకలిగిన వారల విమర్శకులని చెప్పెదరు. వీరు తాము చక్కగా నడచుచు నితరులనుగూడ మంచిద్రొవల నడపించు చుందురు. వీరొకదాని విషయమై చర్చింపదలసినపుడు దానికి దానికిసంబంధించినమఱికొన్ని విషయముల బరిశీలించి బలాబలములగాంచినకారణముగా నిక్కమగు సంగతిని సిద్ధాంతీకరించుచుందురు. మఱి కొన్నిసంగతులయందు వీరెక్కువగా బరిశ్రమజేసి హేతుసహితముగా గ్రొత్తసంగతులను లోకమునకు దెలియబఱచుచుందురు. దాన లోభోపకారముకల్గును గదా. కాబట్టి యీవిమర్శకులు నితరులకు విశేషశ్లాఘాపాత్రులు. కవియైనను బండితుడైనను గాయకుడైనను శిల్పియైనను గావచ్చునుగాని విమర్శకుడగుటమాత్రము కష్టము. కారణమేమన?
103
బా ల నీ తి.
ఈవిమర్శకు లేవిషయమును గైకొని విమర్శింప దలచిరో యావిషయమందు వారికంటె నెక్కువ తెలివైన వాడై యుండవలెను. ఇది చేదు, ఇది తీపు, ఇది పులుసు. లోనగురుచులను దెలియబఱచు నాలుకవలె నె యీకార్యము మంచిది, యీకర్యము చెడ్డది. యని యీవిమర్శకులు తెలియబఱచుచుందురు.
లోకమునగించిద్జ్జ్లలువాచాటునిబండితునిగా దలచుచుందురు. అట్టిపట్టున నీవిమర్శకు లాప్రగల్బుని పత్తుం దెలిసికొని యాకించిద్జ్జ్ఞలకు దెలియ బఱచుచుం దురు. ఎవరైన నొకరు వచ్చి తమబోధలవలనమఱి యొకనిని మోసముజేయ దలచిన యెడల నాసంగతి నీ విమర్శకులు గ్రహించి యాతనినావల దఱిమివేయు దురు. ఇట్టి సద్విమర్శ కులు పూజ్యులు.
ఇక దుర్విమర్శకులు కొందఱు కలరు. వారు దుర్విమర్శకులై వారి కారణములవలననే స్దిరీకరించ వచ్చును. వారు మంచివానినిగూడ గుతంత్రములచే నేవియోకొన్ని యల్పకారణములను గైకొఇ తప్పులని చెప్పెదరు. మఱియు వీరహకారపూరిత చేతస్కులై యుందురు. కాన నీదుర్విమర్శకులు దూషణీయులు.సద్విమర్శకులు వచించినపగిది మనము మనతప్పులను దిద్దుకొనవలయును. విమర్శించిన కొలది మంచిమంచి సంగతులు బయలువెడలును. సానబెట్టినకొలది వజ్రము ప్రకా
104
బా ల నీ తి.
శమమగునుగదా. ఈసద్విమర్శకులు ఇష్పక్షపాతముగా నొప్పిన విషయము మాలిన్యరహితమై పదునాఱవవన్నె మేలిమిబంగారువలె బాగుగానుండును ఈసద్విమర్శకులకు విమర్శనగ్రంధములను వ్రాయుటకు బ్రోత్సాహము జేయుచుండవలెను. మనము వారు చెప్పినమాడ్కి నడువవలయును. దాన మనమనేకలాభముల బొందగలము.
అటుల లాభముబొందినవారలలో నొకనినిజూపించుచున్నాను.మున్ను శ్రీకృష్ణమూర్తి ద్వారకానగరంబున దనపేరోలగంబున సుఖంబుగా గూర్చుండి యుండెను. అత్తఱి ధర్మరాజుపంపున నొకడువచ్చి”అయ్యా! ధర్మరాజుగారు రాజసూయాధ్వరంబుగజేయదలచిరి. కాన వారికి బ్రధానులగుమీరు తప్పకరం”డనిచెప్పి చనెను. అంత నారదమహర్షి వచ్చి “శిష్టరక్షకా! ప్రస్తుతమందు మిక్కిలి యెక్కువగా శిశుపాలుడు జనులను భాదించుచున్నాడు. కాన వానినిదునిమి శిష్టరక్షకు డనుబిరుదమును సార్ధకముజేసికొను“మని చెప్పి కృష్ణునివీడ్కొనెను. అంతట నాశ్రీకృష్ణుడు రెంటిని విని యేమియు జేయజాలక తనయన్నయగు బలరాముని,బినతండ్రియగునుద్ధవుని, బిలిపించి “గురువులారా! నాకు బరమమిత్రుడగుధర్మరాజు, రాజసూయాధ్వరం బొనర్పదలంచి నన్నుబిలిపించినాడు. ఇక శిశుపాలుడు లోకమును నెక్కువగా గందరగోళము జేయుచున్నాడు
(14)
105
బా ల నీ తి.
106
బా ల నీ తి.
చూచితిరా? ఆశ్రీకృష్ణు డాయుద్ధవుడు వచించిన రీతిగా నడచుట బట్టియేకదా తనపనుల రెంటిని నేక కాలమున సాధించుకొనుగలిగెను. తనయన్నపలికిన విధముననే చేసినయెడల దనపనుల నేకకాలమందిటు ల గొనసాగించుకొనగలడా? గించుకొనలేడు. కాబట్టియె, యిప్పటికాయుద్ధవుని "విమర్శక చూడామణి" యనియు, మహాపరాక్రమశాలియగు నా బలరాముని "సాహసికు" డనియు వచించుచున్నారుకదా. కాన మనము విమర్శనజ్ఞానము కలిగి యుండుదము. మనకు దెలియని విశేషసంగతులను సద్విమర్శకుల నడిగి వారు వచించినపగిది మనము నడచు కొందము. మనము విమర్శనగ్రంధముల గావించి లోకోపకారుల మగుదము.
క. మిత్త్రత్వము శత్రుత్వము
బాత్రతయు నపాత్రతయు♦బరికించుచా
రిత్రుడు చిరతరగణనా
సూత్రికముగ దాననెల్ల♦శుభముల నొందున్
(భారతము)
వి వే క ము.
దేహమును నాత్మయును విభాగించు జ్ఞానమును, సుగుణ దుర్గుణములను విచారించుటయును వివేకమనబడు.