బాల నీతి/కోపము
97
బా ల నీ తి.
లు కలిగియుండినయెడల వారివిద్య పాడగుహ. ధనవంతులీ గర్వమును గలిగియుండిన వారు తమ ధనమును వ్యర్దముగా వ్యయ మొనరించుచుందురు. విద్యాంసులు దీనిని గల్గియుండిన వారికుదుగౌరవము నాశనమగును. వేయేల? ఎవనికైన నీగర్వము కష్టము గలిగించుననియె యని నమ్ముడు. ఎంతయబివుద్ధి యగుచుండిన నంతతగ్గియుండ వలెనుగాని నిక్కి యుండ గూడదు. అటులున్నవరలె లోకోత్తర సత్పురుషులు కాగలరు. కాన మనమహంకారము విడనాడి వినయముగా నుండుదము.
క. గరువము గలిగిన మనుజుడు
కరముగ నలజడుల బొందు♦గానన్ దానిన్
సరసర విడుచుచు వినయము
సరుసమునన్ బొందవలయు♦నధికుండైనన్.
కో ప ము.
కోపమనగా నొకరిపై గినుక జెందుటయె?
బా ల నీ తి.
ణములవలె నెఱ్ఱ జేయుచుండును. అస్తమించు సూర్యునిపగిదిముఖము నెఱ్ఱబాఱ జేయును. తోకదొక్కిన త్రాచుపామువలె బుస్సలుకొట్టించును. కుక్కవలె మొఱగించుచుండును. కోతివలె జెంగుచెంగున గంతుల్ వేయించుచుండును. ఏనుగు తొండమువలె నిట్టటు జేతుల ద్రిప్పించుచుండును. పెద్దపులివలె దుమికించుచుండును. పటపట పండ్లు గీటించుచుండును. తులువమాటాలాడించును. అనృతముల నాడించును. తుదకు దెబ్బలాటకు బురి గొల్పును. ఆసమయమున నీకోపమునకుండు శక్తి మఱియొకదానికి లేదు. ఈకోపము మోహము జెందించును. మోహము బుద్దియందు భ్ర్రాంతిగలుగ జేయును. ఆభ్రాంతిక్రమక్రమముగా బుద్ధిని నాశనమొ నరించును. బుద్దినాశనమైనవాడు నశించగలడు. కాన నీకోపముచేయుచుండు చేడుగుపనులను వర్ణించుటకు వేనొళ్లు గలచిలువకైనను దరముగాదు. ఇట్టి క్రోధము కలిగినవారిని క్రుద్దులని చెప్పెదరు.
ఈముంగోపులు బుధులైనను జంకక దుష్కార్యములు జేయగడంగుదురు. ఇటుల వీరాచ రించుటవలన సజ్జనులకు బూజ్యముగానేరద్. కాని యీబుధులొకరి పరి కోపము జెందినపుడు సజ్జను డొకడాతనిజేరి మీరిటులాచరించగూడదు. కాన నూరకుండుడని బోధించిన వారీతని మాటవిని కలహ మాడక యూరకుందురు. అటులనె సజ్జనుడు చని దుర్మార్గునికి జెప్పినవాడు మఱింత కినుకమానును. కాని మిన్న 99
బా ల నీ తి.
కుండునా? మిన్నకుండడు. చక్కనిపాలు పొంగువచ్చు సమయమున గొంచెము నీరుజల్లిన నాపాలు పొంగు మానియుండును. ఆనీరునె క్రాగుచున్ననూనెలో జల్లిన యెడల నానూనె మరింత భగ్గునమండి యిల్లుగాల్పక యుండునా? ఉండదు. కాబట్టి సజ్జనుడు కోపియైనను పెద్దలమాటవిని కినుకమానుననియు, దుర్జనుడు వినక యింక నెక్కువదౌర్మార్గ్యమును జూపుననియు దెలిసికొనవలయును. ఈముంగొపులౌ తారాతామ్య భావములు గమనించరు. కాని తమకంటె నెక్కువ బలముగలవారిపైగాని తమయదికారిపైగాని కినుక సాధ్యమైనంతవఱకు జెందరు. కినుక వారిపైగలిగియు న్నను నేమియు బ్రయోజనములేదని యాముంగొపు లకు దెలియును. కోపముగలిగినవారలు కష్టముల జెందినతరువాత బశ్చాత్తాపమందుదురు.
అటుల గినుకచే గష్టములబడి పశ్చాత్తాపము జెందినవారు పూర్వులలో గొందఱు కలరు. వారిలో నొకని జెప్పద.మున్ను దుర్వాసమహర్షి విష్ణుబక్త శిఖామణి యగు నంబరీషునిసదనమునకు జనెను. అత్తఱి నాతడు ద్వాదశిపారణజేయ నుద్యమించుచుండెను. కాని యీమహర్షి తనకడకువచ్చిన సంగతిని విని యచటనుండి లేచి ప్రత్యుద్ధాన పూర్వకంబుగ నా మహర్షిని దోడ్కొనివచ్చి యుచితాసనంంబిడి సిరుంబారని నాయింటికిపుడ నిందునకురమ్మని విన
బా ల నీ తి.
101
బా ల నీ తి.
కుండని బ్రహ్మమహేశ్వరుల బ్రార్దించి మంటలనార్పుడని కోరెను. దానికి వారు మావలనగాదనిరి.అంతట విష్ణుమూర్తినిగూడ సందర్శించి యతనినిగూడ బైవిధమున గోరనతడుగూడ మావలనగాదు. కాని నాభక్తకుడగు నంబరీషుని వలన నీమంటలు చలార గలవని చెప్పెను. అందుల కామహర్షి ఖిన్నుడై యిదివఱకు మంచివానిని బాధించుటవలనగదా మగుడ బాధలబొందుచుంటినని పశ్రాత్తాపము జెందుచు చివరికాయంబరీషుని సమీపమునకెవచ్చి యీమంటలనార్పి నాబాధదొలగింపుమనిం ప్రార్దించెను. అంత నారాజు విష్ణుమూర్తియనుగ్రహమున నతనిభాధ దొలగింప జేసెను. తదుపరి వరిద్దరుకలసి యన్నమును భుజించిరి.
చూచితిరా? ఆదుర్వాసు డారాజును గోపముచే హింసింప మొదలిడెను. దానికి బ్రతిఫలముగా నామహర్షి యెంటకష్టపడెనో తెలిసినదికదా. కాబట్టి యెవరైనను గోపమువిడనాడినవారు సుఖింపగలరు. కాన మనము కోపమువీడి శాంతముగలిగి సౌఖ్యముల బొందుచుందము.
ఆ. కోపమునను ఘనత♦కొంచెమైపోవును
కోపమునను మిగుల♦గోడు జెందు
గోప మడచెనేని♦గోరిక లీడేరు
విశ్వదాబిరామ!♦వినురవేమ!.