శ్రీశారదాంబాయైనమ:

బాలనీతి


భగవద్భక్తి.

భగద్భక్తియన భగవంతుని సేవించుట, లేక, యాతని నమ్మియుండుటయే. భగవంతుడన శ్రీ వీర్యము, ఇచ్చ, జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, యను నీమహాసుగుణములతో గూడికొనినవాడు. అతనిని నమ్మియుండుటయే భగవద్భక్తి యనబడు.

ఈభగవద్భక్తి గలిగినవారలు భాగవతుల నదగుదురు. వీరికి గ్రమముగా నాశనములేని పదవి లభింపగలదు. ముముక్షులకు భక్తిమార్గము మొదటిసాధనము. ఈభాగవతులకు సర్వకార్యములు సిద్ధియగుచుండును. కీడులు మూడవు, మేలుబొనగును. సద్భుద్ధి సంభవించును. దుర్భుద్ది యడుగంటును. మనము నిశ్చలమగుచుండును. మమమెందుల కాభగవంతునియందు భక్తికలవారముగా నుండవలెనన? ఆదయామయుడు సర్వభూతములందును దయగలవాడై వానికి దగినటుల నాహారాదులనొసంగి సర్వకాలములందును వానిని బాధల బొందకుండ జేయుటవలనను, మనకు గష్టములు సంభవించిన సమయంబునం దామహామహుని ధ్యానించించిన యెడల దత్కా లమందనుభవించెడిసిలుగుల బాసి సుకము జేకూర్చుటను, మఱియు నాయన, మననాయనవలె దినుటకన్నమును, గట్టుటకుబట్టలును నిచ్చి యల్లారు ముద్దుగా గాపాడుటను, మనమే పనినిప్రారంభించినను దానికనేకవిధముల సాయముజేసి సఫలముగా నొనరించుటచేతను, మనకు జగముననుండు వస్తువులనెల్ల జూచుటకు గన్నులును, నడచుటకు గాళ్ళును, గర్మమ్లనారంభించిటకు గరములును, విమర్శనమొనరించిటకు బిద్ధియును, గీర్తించుటకు వాక్కును, మఱియు బహువిధోపయోగంబులగు బహ్వవయవముల నిచ్చుటవలనను, నాపరమ దయాళుని దప్పక సేవించవలెను.

మనమాభగవంతుని సేవించుటయెట్లన? మనము ప్రతిదినము దెల్లవాఱుజామున నాలుగు గంటలకు మేల్కొంచి దంతధావనాది కృత్యంబుల నిర్వర్తించుకొని విమలజలమున స్నానమాచరించి ముఱికిలేని బట్టలగట్టి శుచికలవారమై "చిత్తము శివునిమీద భక్తిమఱియెచ్చటనో" యున్నట్లుండక మనమనస్సును వాక్కును, శరీరమును, గర్మమును, నీనాలుగు నొకచోజేర్చి సంభవస్దితిలయ హేతుభూతుడగు నప్పరమేశ్వరుని, "నే దెలియక చేసినపాపపుబనులను, దెలిసియుజెసిన పాపపు బనులను నామొఱనాలకించి నన్ను మన్ననతో మన్నించవలయు" నని కోరి ధ్యానించవలెను. మఱియు బూజాదుల నాపరమాత్ముని సేవింపవలెను. మనము భక్తిలేక యెంతగొప్పగా బూజ జేసినను బ్రయోజనములేదు. "భక్తి లేనిపూజ పత్రిచేటను సామెతవినలేదా? కాబట్టి మనము చేయుపూజను నిశ్చలభక్తితో జేయవలెను.

అంతట దుష్టులను శిక్షించువాడును, శిష్టులను రక్షించువాడును నగు నాపరమేశ్వరుడు మనమొఱ తెఱగునెఱంగి మనముసేయుసేవకుమెచ్చి మనమనో బీష్టముల నెఱవేఱ్చి మనసుఖదు:ఖముల నారసి యొగ్గులున్న దగ్గించి లగ్గులున్న నెక్కువజేసి మనకు దోడునీడై సదా తిరుగుచు గాపాడుచుండును. మనము భగవద్భక్తికలిగియున్నయెడల మనపగతుఱు మనల జిక్కుల బెట్టదలచిన నవి యెంతమాత్రమును మనలను బాధింప జాలవు.

ఈభక్తివిషయమున బ్రసిద్దినెక్కినవారలు పూర్వుల లో జాలమంది కలదు. వారిలో నొకొరిని జెప్పెదను.

హిరణ్యకశిపునకు గుమారుడగు ప్రహ్లాదుడు, తన తండ్రికి మిక్కిలిశత్రువును, భగవదవతారము నగు విష్ణునందు భక్తికలవాడై యుండెను. ఇట్లుండుట యతనితండ్రిచూచి వింతనంది తనకొమరున కనేక విధంబుల "నాతనియందు భక్తిమాను" మని చాలసారులు చెప్పెను. కాని యాపిల్లవాడు వినకపోయెను. అంతట దండ్రితనకొడుకుని విధ వివిధ హింసల బెట్టెను. ఇతరులచే బెట్టించెను. కాని యాప్రహ్లాదుడు మాత్రమించుకయైన భాధను బొందలేదు. అత్తఱి నాప్రహ్లాదుతండ్రి "ఏమిదిచొద్యమా ఎన్నివిధముల వేధించినను నీతనయ డాబాధలుబొందక యన్మద్వైరిని ఎక్కువగాస్తుతించు చున్నా" డని యిదివఱకుండుకోపమును రెండురెట్లధిక ము జేసికొనియు జేయునదేమియులేక విసివి యాబాలుని జీరి "కొడుకా! నీవప్పుడు కనులకు గబపడనివానిని గొనియాడుచుందువు. వాడెక్కడునున్నా"డని యడిగెను. అంతనాబక్తశిరోమణి "సర్వశక్తిసంపన్నుడగు నాదానవవైరి ప్రతిపదార్దము నందునుగల"డని పలికెను. అంత నాహిరణ్యకశిపు "డటులైన నాచక్రిని గిక్రిని నీకంబమునందుజూపుము లేదా నీశిరంబిప్పుడే భూతబలి జేసెద" నని వ్రాక్కుచ్చెను. అంతట భాగవతశిఖామణియగు బ్రహ్లాదుడాపరమాత్మను నిశ్చలభక్తితో ధ్యానింప నా పరమేశ్వరుడు తనభక్తుని కోరికదీర్చుటకై తనశరీరము యొక్కక్రిందిసగమున మనుజాకారమును, బైసగమున సింహాకారమును, దాల్చి "నృసింహమూర్తి" యను పేరున గంబమునుండి బయలువెడలి జగదేకవీరుడై తనభక్తుని బలుతెఱంగుల బాములబెట్టినవాడును, లోకకంటకుడునగు నాహిరణ్యకశిపుని సంహరించి దేవాదులచే సన్నుతిగొని భక్తునిగాపాడి యంతర్దాన మయ్యెను.

చూచితిరా! ఆప్రహ్లాదుడు భక్తివలనగాదె తనజన కుడు పెట్టినబాధల బొందకపోవుటయు కాక దుర్లభంబగు పరమాత్ముని దివ్యరూపము గాంచగలి గెను. కాబట్టియెప్పటిఆప్రహ్లాదుడు డవిచ్చిన్నమగు కీర్తినిబడయుచున్నాడుకదా! కాన మనమందఱము భగవద్భక్తి కలిగియుండుట కెక్కువగా బ్రయత్నముజేసి భాగవతులని వాసిగాంచవలెను.

ఆ.వె. ఎన్నియెన్నిపూజ ♦ లెన్నిజేసిననేమి
       భక్తిలేనిపూజ ♦ ఫలములేదు
        భక్తికలుగుపూజ ♦ బహుళకారణమురా
        విశ్వదాబిరామ ♦ వినురవేమ!

మాతృభక్తి.


తల్లియందు భక్తిగా నుండుటయే మాతృభక్తి యనబడును.

మనతల్లి మనలను బదిమాసములుమోసి పలు బాధల కోర్చి వచించరాని కష్టములబడి కనును. కనినది మొదలు మనయొక్క మూత్రపురీషాదులను గడిగి బహు జాగ్రత్తతొ మనల గాపాడుచుండును. మనప్రాణములను దమయరచేతిలో నిడుకొని పోషించుచుండును. మనలను గ్రిందుగ విడిచిన బిల్లిమ్రింగుననియు, బైనిబెట్టిన బక్షి తన్ను కొనిపోవుననియు బెంగపడుచు బ్రీతితొ బెంచుచుండును. మనలను కన్నతండ్రి యసహ్యీంచుకొనినను గన్నతల్లిమాత్రమటు లసహ్యించుకొనక దగ్గఱకు దీసికొని తనయొడిలో గూర్చుండబెట్టుకొని బుజ్జగించుచు ముద్దులాడు చుండును. మనవలన నెటువంటితప్పులు వచ్చినను భరించునది తల్లియే