కెక్కువగా బ్రయత్నముజేసి భాగవతులని వాసిగాంచవలెను.

ఆ.వె. ఎన్నియెన్నిపూజ ♦ లెన్నిజేసిననేమి
       భక్తిలేనిపూజ ♦ ఫలములేదు
        భక్తికలుగుపూజ ♦ బహుళకారణమురా
        విశ్వదాబిరామ ♦ వినురవేమ!

మాతృభక్తి.


తల్లియందు భక్తిగా నుండుటయే మాతృభక్తి యనబడును.

మనతల్లి మనలను బదిమాసములుమోసి పలు బాధల కోర్చి వచించరాని కష్టములబడి కనును. కనినది మొదలు మనయొక్క మూత్రపురీషాదులను గడిగి బహు జాగ్రత్తతొ మనల గాపాడుచుండును. మనప్రాణములను దమయరచేతిలో నిడుకొని పోషించుచుండును. మనలను గ్రిందుగ విడిచిన బిల్లిమ్రింగుననియు, బైనిబెట్టిన బక్షి తన్ను కొనిపోవుననియు బెంగపడుచు బ్రీతితొ బెంచుచుండును. మనలను కన్నతండ్రి యసహ్యీంచుకొనినను గన్నతల్లిమాత్రమటు లసహ్యించుకొనక దగ్గఱకు దీసికొని తనయొడిలో గూర్చుండబెట్టుకొని బుజ్జగించుచు ముద్దులాడు చుండును. మనవలన నెటువంటితప్పులు వచ్చినను భరించునది తల్లియే కాని వేఱొకరుగానరారు. మనకెట్టిల్య్లిక్కట్టులు వచ్చినను నవితోలగు నుపాయమాలొచించి చేతనయి నంతవఱకు వానిని దొలగించుచుండును. "పిల్లి తన పిల్లల నెక్కడ నెప్పుడు గండుపిల్లివచ్చి చంపునో" యనుభవముచే సందులగొందుల వానిని దాచ్విపెట్టుట మనముచూచుటలేదా? కాబట్టి తల్లి కున్నప్రేమ యితరులకు లేదనిచెప్పవచ్చును. అట్టితల్లుల యందు భక్తిగానుండుట మనకు విధ్యుక్తధర్మముకాదా. అది గాక "మాతృదేవోభవ" అనగా "దల్లియేదైవముకలవాడనై కమ్మా" యని యుపనిషత్తులు చాటుచున్నవి. మఱి యు "నమాతు: పరదైవత" మ్మనగా "దల్లికంటె నితరదైవములే" దని శాస్త్రము నుడువుచున్నది. కాన మనలను వృద్దికిదీసికొనివచ్చిన తల్లులయందు భక్తిగా నుండవలెను. వారికేవిధమైన బాధలుండినయెడల ననుకొనని ప్రయోజనములను హఠాత్తుగా బొందగలము.

అటుల మాతృభక్తికలిగి యాకస్మికముగా లాభములబొందువారును బూర్వులలో గలరు. వాఐలొనొకరి కధ జెప్పెద.

మున్ను కశ్యపబ్రహ్మవరమున "వినత" యను తరుణీ రత్నమునకు గరుడుడనువాడొకడు జనించెను. అతడు మహాజన సత్వసంపన్నుడు. అట్లయ్యు నాగరుత్మంతుడు తనతల్లియనుమతిని, దనసవతితల్లియగు కడ్రువయొక్క కుమారులగు పాములను మోయుచుండెను. ఇటులుండ నాతని వీపుననుండి యొకపరి యవిక్రిందపడుట కద్రువకాంచె. అంత నామె యత్యంతముగా నాగురుడుని దూఱెను. అంత నాతడు తనతల్లిని "అమ్మా! మీసవతి యొక్కయు, నామెకుమారులయొక్కయు బనులనెందులకు జేయవలెనని యడిగెను. అంత నావినత నాయనా! నానవతియునేనునుచ్చైశ్శ్రవంబు బరీక్షించునపుడు దానిపుచ్చంబున నలుపులేదని నేనును, గలదనియాయెయూ వాదమొనరించితిమి. ఈవాదమున నెవరోటుఒపడుదురో వారవతలివారికి దాసిగానుండవలెనని యొక పంతమేర్పఱచుకొంటిమి. మఱునాడు దానిని బరిశీలింప నేనోటువడితిని. దాన నామెకు దాసిగా నింతచఱకు నుంటిని. దీనికి గారణము మీయన్నగారగుననూరునిశాపమే ఇక నీబానిసపని నీవలన బాయదగు"నని పలికెను. అంత నతడు తన తల్లియొక్క నీచపుదశగనుగొని వంతనంది యా వరవుడముం బాపుటకై యాసవతితల్లికొమరులదరి జేరను. తరువాత, వారిని "నాతల్లిదాస్యము మీరు బాపినయెడల మీకిష్టమైనది యేదైనను దెచ్చియిచ్చెద" నని యడిగెను. అంతవారు "మాకమృతంబుదెచ్చియిచ్చిన నీతల్లి దాస్యము పాయగల"దని యనిరి. దానికి గరుడుడు సమ్మతించి తన తల్లియనుమతిని గైకొని మార్గమధ్యమున ననేక దుష్కరకార్యముల జేయుచు నాకలోకంబు జేరెను. అచట నమృతమునుగాచుచు గావలియున్న వారితో యుద్ధమొనరించి యాయమృతమును గైకొని తానుద్రాగకుండ నత్య్భతడు వేగముతో వచ్చుచుండెను. ఇంతలో విష్ణుమూర్తి కనుగొని "నీవేగపద్భుద్దులకును, నీబలమునకును, నీమాతృభక్తికిని మెచ్చితి గాన నీకు గావలయువరము లెవ్వియో కోరు" మని పలిక. అంత నావైనతేయుడు "భక్తవత్సలా! నేనమృతంబుద్రాగకపోయినను ముసలితనములేని దేవత్వమును, నీభువనముల కెల్లను నాయకుడవైన నిన్ను నెల్లప్పుడు గొలిచి యుండుటను నాకుదయచేసి యనుగ్రహించుండని ప్రార్దించెను. అంత నామహామహు "డటులనె నీకోరిక లిచ్చితి. మఱియు నీదినమునుండి నాకుధ్వజమును వాహనంబును, నీవెకావయునని చెప్పెను. దానికా గరుత్మంతుడు డంగీకరించి సంతసించెను. ఇంతలో దేవేంద్రుడు "అమృతమునువీడుహరించెగా" యని కినిసి యాగరుడునిపై వజ్రాయుధముం గాంచి "వజ్రాయుధమా! గొప్పవాడగు దేవేంద్రునికరమున నుండు దానవు. కాన నిన్నవమానింపగూడ" దని పలికి తనఱెక్కయందున నొకయణుమాత్రము దానికాహారముగా జూపి నీపనిని జేసికొని పొమ్మని పలికెను. ఇవ్విధమున నీగరుత్మంతుడు డొనర్చుట సుర్వేశ్వరుడు చూచి మెచ్చి యాతనితో స్నేహము జేసికొనెను. అటుపిమ్మట నావిహంగపతి కాద్రవేయుల సమీపమునకువచ్చి "ఇదిగో మీరుకోరినటుల నమృతముదెచ్చినాను. గొనుడు. నాతల్లిని దాస్యమునుండి విడిపింపు“ డని. పలికెను. అవ్విధముననే వారొనరించిరి.

చూచితిరా! అవిహంగేంద్రుడు మహాబలజవోపేతుడయ్యు దల్లిమాట నిరాకరించలేక పాముల మోసెనుగదా. మఱియు దనతల్లి బానిసపని బాపుటకై యెంతపని జేసెనో తెలిసినదిగదా. ఈసమయముననేకదా విష్ణుమూర్తివలన వరముల బొందుటయు నింద్రునితో సఖ్యంబు సంభవించుటయు మాతృభక్తివలన నాకస్మికముగా వచ్చిన లాభములేకదా. కాబట్టి మాతౄభక్తి గలిగినవారలు మహాసంపన్నులు కాగలరు. కాన మనము మాతృభక్తి కలిగియుండుదము.

ఆ.వె. వచ్చిపోయి చూచు ♦ వాడుగాకిడుమల
      బడునె? తల్లివోలె ♦ బట్టితోడ
      దండ్రిచెప్పునిట్లు ♦ ధర్మశాస్త్రంబుల
      నంబ గౌరవమున ♦ నధికయగుట.

         

(భారతము)

పితృభక్తి.

తండ్రియందు భక్తిగానుండుట పితృభక్తి యనబడు.

కన్నతండ్రి మనల బెంచి పెద్దజేయును. మనకుగావలసిన యాహారవిహార పదార్దముల దెచ్చియిచ్చును. మనతోగూడ నాడుచు మాటలాడుచు మనకానందము గూర్చుచుండును. మనతోడనే సంతోషముగా గోల