బసవరాజు అప్పారావు గీతములు/నా కవిత్వ ధాటి
నా కవిత్వ ధాటి
నన్నెవ్వ రాపలే రీవేళా
నాధాటి కోపలే రీవేళా !
నోటపలికేదంత
పాటగా మోగేను
కోటివరహా కెత్తు
కెత్తుగా తూగేను ||నన్నెవ్వ||
గుండు ఠాఠామంటు
కొట్టినట్టుగ నేటి
పండితులు ఠా రెత్తి
పరుగుచ్చుకోవాలి ||నన్నెవ్వ||
పట్టుపట్టితినంటె
వాగీశుడే వచ్చి
దాసోహమని పాట
వ్రాసి వల్లించాలి!
నన్నెవ్వ రాపలే రీవేళా
నాధాటి కోపలే రీవేళా !