బసవరాజు అప్పారావు గీతములు/నడమంత్రపు సిరి

నైతి నంచు సిగ్గు జెంది
యధోగతిని బోఇతివే ?

చాలును నీలాంఛనమ్ము
లేల ? నేడు గాక యున్న
రేపైనను రావొక్కో
నీపన జగ మెఱుగనిదే ?

కన్నకడుప యేమి, నీకు
కలుగు నెట్టు లహర్నిశ్లు
కనలి పొక్కజేయు వాదు
కడుపుమంటవలెని తపన ?

పోయినవత్సరపు సుఖము
బుల్లితల్లితోనె పోవ
నూరనసంవత్సరాది
నీతీరున వగవనాయె ! !

                   -----

నడమంత్రపు సిరి

కోయి లొకసా రొచ్చి కూసిపోయింది
 మాయవానలు లోకమంత ముంచినవి
 

పండొకటి చేతులో బడి జారిపోయె
మండు;వేసవికి చె ట్లెండు జూపినవి
మెఱు పొకటి మింటిపై మెఱిసిపోయింది
ఉఱుములు భూమి నుఱ్రూ లూసినవి.

             ----


దీపావళి


(యమునాకళ్యాణి - జంపెతాళం)



లోకాని కుత్తుత్త దీపావళీ
నాకుమాత్రము దివ్య దీపావళీ !
వేడాల నాధుడౌ
వేదాద్రి నరసింహ
దేవుడే నాయింట
దీపమైనాదు !
లోకాని కుత్తుత్త దీపావళీ
నాకుమాత్రము దివ్య దీపావళీ !
వేద వృక్షములాగు
వేదాద్రి నీడ నా