బసవరాజు అప్పారావు గీతములు/దీపావళి

పండొకటి చేతులో బడి జారిపోయె
మండు;వేసవికి చె ట్లెండు జూపినవి
మెఱు పొకటి మింటిపై మెఱిసిపోయింది
ఉఱుములు భూమి నుఱ్రూ లూసినవి.

             ----


దీపావళి


(యమునాకళ్యాణి - జంపెతాళం)



లోకాని కుత్తుత్త దీపావళీ
నాకుమాత్రము దివ్య దీపావళీ !
వేడాల నాధుడౌ
వేదాద్రి నరసింహ
దేవుడే నాయింట
దీపమైనాదు !
లోకాని కుత్తుత్త దీపావళీ
నాకుమాత్రము దివ్య దీపావళీ !
వేద వృక్షములాగు
వేదాద్రి నీడ నా

       వంశ వృక్షమ్ము శా
       శ్వతముగా నిలవాలి!
లోకానికి కుత్తుత్త దీపావళీ
నాకు మాత్రము దివ్య దీపావళీ!


జేజేలు

ఎవ రను కున్నారొ ఏరగరా మీరు!
పాపాయి సాక్షాత్తు పరమాత్ముడండీ!
తరతరాలా గొప్ప తపసుజేశాము,
స్వామి నాటికి నేడు వర మిచ్చినాడు ఎవ్వ||
ఎన్నో యుగాలుగా విన్నవించాము
ఇనాళ్ళ కీనాదు విన్నాడు మనివి! ఎవ్వ||
వేదాధ్రినాధుడే వెలిసి నాయింట
ఉయ్యాలతొట్టెలో ఊగుతున్నాడు! ఎవ్వ||
చేతులెత్తండోయి జేజేలనండోయ్,
నరసింహదేవుడే నాచిట్టితండోయ్!
ఎవ్వరనుకున్నారొ ఎరగగా మీరు!
పాపాయి సాక్షాత్తు మరమాత్ము డండీ!