బసవరాజు అప్పారావు గీతములు/కవరు
కవరు
కవరు వచ్చిందంటె
గంపంత ఆశతో
కాలు విరిగేటట్లు
గప్పుమని గెంతాను.
కాని ఆకవరులో
కంసాలి వ్రాసినా
కంగాళివుత్తరం
కళ్ళ జూచేసరికి
పొంగిపోయినమనసు
కుంగిపోగా అట్టె
కుర్చీలో సిగ్గేసి
కూలబడి నవ్వాను.