బసవరాజు అప్పారావు గీతములు/అవస్థాభేదము
అవస్థాభేదము
లేమావిగుళ్ళ
మెక్కెడు పికమా
లేకితిండి నీ
కేలనే?
పూవుల జాడల
బోయెడు హరిణీ
ముండ్లడొంక బో
నేటికో?
సురనది జలముల
తూగెడు హంసీ
మురికి చెఱువు జొరె
దేలనే?
ఇంగిత మెరిగిన
మనమా నీకీ
యెంగిలి యోజన
యెట్టిదే?