బసవరాజు అప్పారావు గీతములు/ఎది కావలెనే?
భగవంతుని కడు
భక్తి బాడగను
ఆనందమే లేదా
లోకమున
నానందమే లేదా?
ఎది కావలెనే?
ఇది సంపెగ పూ
విది మల్లెపూవు
ఎది కావలెనే?
చెలియా !
ఇది మామిడిపం
డిది జామపండు
ఎది కావలెనే?
చెలియా !
ఇది ద్రాక్షరస
మిది పూవుదేనె
ఎది కావలెనే?
చెలియా !
ఇది వైడూర్యం
బిది మేలి కెంపు
ఎది కావలెనే !
చెలియా ?
ఇది కృష్ణుప్రేమ
మిది మిత్రుప్రణయ
మెది కావలెనే !
చెలియా ?
కవి జీవితము
కవి యని కీర్తిని
గాంచుట కన్నను
ఘన మే మున్నది
జగతిన్ ?
కష్ట సుఖమ్ముల
చవి జూచుటకన్న
మృష్టాన్నం బెటు
రుచిరా ?