బసవరాజు అప్పారావు గీతములు/ఎడబాటు

ఎడబాటు

ఎన్ని తపసులు జేసి
     ఈజన్మ మెత్తితినొ

చిన్ని నారాణి! నీ
     చెట్ట బట్టితిని!

తపసు గర్వాన యే
     తప్పు జేశానో, నా

చిట్టి! యీ యెడబాటు
     శిక్ష తగిలింది!

నిరాలంబస్థితి

నట్ట నడి సంద్రాన
నావలో వున్నాను
నడినీటిలో ముంచుతావా?
               నా సామి?
నావ వొడ్డట్టించుతావా? నట్టనడి ||