ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/పదునేనవ అధ్యాయము
ప్రెంచిస్వాతంత్ర్యవిజయము
పదునేనవ ఆధ్యాయము
రాజునకు మరణదండనము విధించుట
(1)
సంపూర్ణ ప్రజా
స్వామ్యము,
1792 సంవత్సరము సెప్టెంబరు నెల 21 వ తేదీన నూతన జాతీయసభ సమావేశ మయ్యెను. మితవాదులెన్నికలకు నిలువ బడనే లేదు. వారి యాజమాన్యముననుండిన ఫూలెంటు క్లబ్బు మూయబడినది. కొంత మంది మిత వాదులు దేశమును వదలిపోయిరి. కొంతమంది దేశములోనుండి తిరుగుబాటులను పురికొల్పు చుండిరి. జాతీయసభలో కుడి వైపున గిరాడిస్టులును, ఎడమ వైపున మాంటీనార్డులును, మధ్య నేక క్షకిని చెందనివారును కూర్చుండి యుండిరి. ఎడమ కక్షికి చెందినవారిలో రాబిప్పీయరు, డాంటన్, మారటు మొదలగువారు ముఖ్యులు. ఎక్కువ
రాష్ట్రములు గిరాండిస్టులనే యెన్నకొ నెను. కాని అతవాదు ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
లగు మాంటి నార్డులకు ప్యారిసుప్రజలలోను, మ్యుని సిపాలిటీలో సు పూర్తిగా పలుకు బడి గలదు. జెకోబిన్ క్లబ్బులును వీరి యా జమాన్యముననే యున్నవి. జాతీయ సభ కూడగనే, రాజును తీసి వేసి ఫ్రాన్సు దేశమును సంపూర్ణప్రజాస్వామ్యముగ (రిపబ్లిక్కుగా) చేసిరి. సెప్టెంబరు 22 వ తేదీనుండియు, నూతన శకప్రారంభ మగునట్లు ప్రకటించిరి. ఫ్రాంన్సు యొక్క పంచాం గములో ప్రధమ సంవత్సర మా తేదీనుండి. ప్రాంభ ముసు చేయించిరి.
రెండు కక్షల కును తగాదాలతో ప్రజాస్వామ్య ప్రభు త్వము ప్రారంభమయ్యెను. ఈ రెండవ తేదీన ప్యారిసు లో హత్యల, గావించిన వారిని ఆత్మ హత్యల ప్రోత్సాహకులను శిక్షించ వలెనని 'రాండిస్టులు తీర్మానమున బెట్టిరి. ఉద్రేక 'సమయములలో నట్టివి .జారుగక మానవనియు ఎవరిని శిక్షింప "బనిలేదనియు అతివాదులు ఖండించిరి. అతివాదనాయకులగు రాబిస్పయరుమారటుగారులె హత్యలు చేయుటకు పోత్సా హకులని రెండవకక్షి వారు నిందించిరి. తుదకు ఏమియు తేల కయే జాతీయసభ వారు హత్య లవిషయము విడిచి పెట్టిరి. ఉభయ కక్షల మధ్య మనస్తాపములు పెరుగుచుండెను. ఎక్కువసంఖ్యా కులగు గిరాండిస్టులనుండియే మంత్రు లేర్పడిరి. గిరాండిస్టు నెటులయిన కూలదోసి తా మథికారములోనికి రావలెనని యతివాదులు తలంచిరి. అతి వాదులు ప్యారిసు ప్రజలుగుంపుల యుద్రేకము మీదను - జెకోబిను క్లబ్బు మీదను ఆధారపడి
యుండిరి, గిడాండిస్టులు అనుభవజ్ఞులును విద్వాంసులును గొప్ప 221
పదు నేనవ అధ్యాయము
వక్తలునే కాని, ఏ సమూహములను తమ యభిప్రాయములు : లోనికి త్రిప్పుకొనుటకు ప్రయత్నించ లేదు. సామాన్య ప్రజలలోని యాందోళసమును నిర్లక్ష్యముగా జూచిరి. ప్యారిసుప్రజలు అల్లరుల కెల్ల కారకులగుచున్నారని బెదరించి, ముఖ్య పట్టణము యొక్క సానుభూతిని గోలుపోయిరి.. ప్యాతిసు యొక్క- పలుకు బడినుండి రాష్ట్రములను వేరు చేయవలెనని ప్రయత్నించిరి కాని సాగలేదు.
2
యుద్దము.
యుద్ధము సాగుచుండెను. ప్రెంచి సైన్యములు జాతీయ వాదులగు యౌననులతో నిండియుండెను. వీరు దేశము కొరకై కార్చిచ్చులో దుముకుటకును కంఠములు గోసియిచ్చుటకును సిద్ధపడిన వారు. దుస్తులలోను ఆహారములలోను ఎట్టిలోపము లున్నను, పోనీ సన్నిటికిని సంతోషముగా సహించుచున్న వారు. వీరిలో చాలమంది జీతములు పుచ్చుకొన కుండ వచ్చినవారు. తమ దేశము యొక్క ఘనతకై యుద్ధములో ముందునకు. దుముకుచుండిరి. ఇట్టి ధైర్యశాలరగు సైన్యములను యూరవు. ఖండ మదివర "కెన్నడును చూచి యుండ లేదు. ఫ్రెంచి సైన్య. ములకే ప్రతిచోటను జయముకలిగెను. ఫ్రెంచి సేన లిటలీలో జొరబడి శత్రువుల నోడించి ' సావాయి, వైసీ, సార్డినియా లను లోబరచుకొనెను. జర్మనీలో ప్రవేశించి రైన్ రాష్ట్రము లను కొంతవరకు ఆక్రమించుకొని మైంజు, ఫ్రాన్కు పర్డు కోట లను పట్టుకొనెను. బెల్జియము పై ఫ్రెంచి సేనలు దండెత్తి
ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము
పోయి నవంబరు 6 వ తేదీన జాంపెను యుద్ధములో ఆస్ట్రియా వారిని పూర్తిగా నోడించి, బెల్జియమును స్వాధీన పఱచు కొనెను. సావాయి, నైసులు పాన్సులో చేరుటకు సమ్మ తించినందున ప్రాన్సు యొక్క రాష్ట్రములుగ చేయబడెను . బెల్లీయము లోని ప్రభువులును, మతగురువులును ఆటంకము గలుగ జేయుచున్నందున బెల్జియమును స్వంతంత్ర మయిన ప్రజా స్వామ్యమునుగా నుంచవలేనా లేక ఫ్రాస్సులో కలుపుకొన వలెనా యనువిషయములను ఫ్రెంచి జాతీయసభవారు ఆలో చించుచుండిరి. స్కెల్టునదిలో స్వేచ్ఛగా సన్ని జాతుల వారును వర్తక ఫు టోడలు తెచ్చుకొనుటకై ఫ్రెంచివా రనుజ్ఞనొసంగిరి. ఇదివఱకు నాంగ్లేయుల యోడలు మాత్రమే యీసది లోనికి వచ్చుచుండెను. బెల్జియము ఫ్రాన్సులో చేర్చుకొన బడుటకుగానీ స్వతంతమయిన ప్రజాస్వామ్యముగా చేయబడుటకుగాని, ఆంగ్లేయుల కసమ్మతము. ఫ్రాంన్సును విజృంభించకుండ సణచ గల యొక రాజు పాలసములోనే బెల్జియ ముండ వలెనని ఇంగ్లీ షువారి పట్టుదల. పోలండు. మీదికి దండెత్తుటకై ఫ్రెంచివారు యోచించుచుండిరి. వీలయినచో సంధి చేసికొని యుద్ధ మంత రింపజేయవ లెసనియే ఫ్రెంచి జాతీయ ప్రభుత్వమువారు తిరిగి ప్రయత్నించిరి. హాలండు పై తాము దండెత్తుట మానుకొనెద మనియు, ఫ్రెంచి రాజును, ఆయన కుటుంబమును ఫ్రాన్సును విడిచిపోవుటకు సమ్మతించెదమనియు, బెల్జియము సంగతి సంధి జరుగుపరకును నిలిపి యుంచెదమనియు ఫ్రెంచివారు ఇంగ్లాండు నకును, ప్రష్యాకును సంధి రాయబారములను బంపిరి.. ఇంగ్లాండు
223
పదు నేనవ ఆధ్యాయము
ఈరాయ జారమును తృణీకరించెను. ఇంగ్లీషు ప్రముఖుడగు బర్కు ఫ్రెంచివిప్లవమునకు వ్యతిరేకముగ “Reflections on the French Revolution"అను గ్రంధమును ఫ్రకటించుటయే గాక ఆంగ్లేయ ప్రభుత్వము వారు యూరపులోని ఫాన్సుపై యుద్ధము చేయునట్లు పురిగొల్పిరి.
3
స్వాతంత్ర్య
ప్రకటనలు
నవంబరు 19 వ తేదీన, ఏ దేశ ప్రజలయినను స్వాతం త్రమును గోరి, తమ్ము పొలించుచున్న రాజులయిన తిరుగుబాటు చేసిన యెడల, తామట్టి ప్రజలకు సహాయము చేయుటకు సంసిద్ధుముగ నున్నామని, ఫ్రెంచి జాతీయ ప్రభుత్వమువారు ప్రకటనమును గావించిరి. డిసెంబరు 15 తేదీన, ఫ్రెంచి సైన్యములు పోయిన చోట నెల్ల, ప్రజలే తమ దేశ మును పాలించుకొనుటకు హక్కుదారులనియు, తమ పైనున్న నిరంకుశ ప్రభుత్వములను ప్రభువులుంపరల ప్రత్యేక హక్కులను కూలదోసి, స్వతం త్రమైన ప్రజాపాలనమును సాధించు కొనవచ్చుననియు, నిందుకు తాము తోడ్పడేదమనియు ప్రజలలో ప్రకటించవలసినదని, ఫ్రెంచి ప్రభుత్వమువారు ఉత్తరువులను జారీచేసిరి. డిసెంబరు నెలలో ఫ్రెంచి సైన్యములు హాలెండు నాక్రమించెను.
రాజును
విచారించుట
ఖయిదు చేయబడిన రాజును విచారించి మరణ శిక్ష విధించవలెనని అతి వాదు లాందోళనము ప్రారంభించిరి. క్రొత్తగా నేర్పడిన ప్రజాస్వామ్యమునకు రాజు దేశములో బ్రతికియుండు టపాయకరమని
జేకోబిన్ క్లబ్బులు తీర్మానించిరి. రాష్ట్రముల ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
లోని ప్రజా సంఘములును నిట్టి తీర్మానములనే చేసి - జాతీ
యసభకుపంపెను, ప్యారిసు సగర ప్రజలు 10 వ ఆగష్టు
తేదీన రాజ సైన్యములచే గాయములు పొందిన వారిని జాతీయ
సభకు మోసికొని వచ్చి 'దీవికీ లూయి కాపలుకు ప్రతీకారము
చేయవలసిన 'దని కోరిరి. పదునారవలూయి రాజను నామము
తీసివేసి, లూయికాపటని ఆయనను ప్రజలు పలువ సాగిరి..
“కాపటు లూయిరాజు కుటుంబనామము. గిరాండిస్టులు
రాజుయొక్క ప్రాణమును రక్షించవలెనను. సుద్దేశ్యము గలిగి,
యుఁండిరి. గీరాండిస్టులను ప్రజలకు ని ద్వేషులుగ జేసి అక క్షిని
పడగొట్టు నూహతో అతివాదులు రాజును చంపవలెనని పట్టు
పట్టిరి.ఈ సమయమున తాము ప్రజానురాగమును పొంది
'యధికారమును సంపాదించవలెనని వీరిపన్నుగడ.
దురదృష్టవశమున 10 వ ఆగష్టకు తరువాత సివిలు దస్తావేజులున్న కచ్చేరీలలో లూయీ రాజు దేశ విరోధులతోను. యూరపు రాజులతోను కుట్రలు సలిపిన యుత్తరప్రత్యుత్తర ములు దొరకెను. 1791 సంవత్సరము 16 వ యేప్రిల్ తేదీన, తనకు తిరిగి యధి కారము వచ్చినచో విప్లవము నణ చెడి ప్రాత నిరంకుశ ప్రభుత్వమునే స్థాపించెదసనియు, మతాచార్యులకు వెనుకటి స్థితిని గలుగ జేసెదననియు, ఫ్రెంచి జాతీయ ప్రభుత్వ ముతరఫున దాసు యూరపు రాజులమీద యుద్ధమును ప్రకటిం చినది, వారు త్వరగా దండెత్తవచ్చి ఫ్రెంచి ప్రజల నోడించి తనకు విముక్తి గలుగ జేయుదు రనునాశ తో మాత్రమే చేసితి
పనియు, క్లేరుమాంటు బిషప్పుడు (మతాచార్యునికి) లూయీ 225
పదునేనవ అధ్యాయము
నారాయి రాజు ఉత్తరము వ్రాసినట్లు బయల్పడెను. “ఈయద్దమువలన త్వరగా నీ రాజద్రోహులును అనీతిపరులు నగు ఫ్రెంచిమూ తలమీద యూరపురాజు లందరు నొక్కుమ్మడిగా వచ్చెదరు. రాజులయొక్క లక్షయేబది వేల మంది సైనికులును అరువది వేల మంది దేశ భ్రష్టులును వచ్చి మీకు సహాయముచే తు" రని బిషపు రాసిన ప్రత్యుత్తరముకూడ దొరకెను. రాజు బహిరంగముగా తన సోదారుల మీద బహిప్కారశాసనము చేసి, రహస్యముగా వారితో నాలోచనలు జరుపుచున్నట్లును బుజు వయ్యెను. ఇంతేగాక" ట్యూలరీ మందిరములోని ఒక మూల నున్న గోడలో ఇనుపతలుపు చే మూయించియున్న సొరంగము లోకూడ. కొన్ని దస్తావేజులు దొరకెను. లూయీరాజు విదేశీయూతో కుట్రలు జరుఫుటయేగాక. స్వదేశములోకూడ తిరుగు బాటులులు జరుగు కు కుట్రలు చేసినట్లును, మితవాదులను ప్రోత్సహించి శాసన సభను కూలద్రోయ యత్నించి నట్లును వీని వలన స్పష్ట పడెను.
ఇందు వలన నతి వాదుల వాదమునకు ప్రోద్భలము గలిగెను.
రాజును రక్షించదలచిన వారి పక్షము బలహీనమయ్యెను.
జాతీయ సభలో రాజు విచారణ సంగతి చర్చకు వచ్చి
నప్పుడు కొందరు రాజు చుట్టములకు మించిన వాడనియు,
నాయనను విచారించుట కెవరికిని అధికారము లేదనియు, వాదించిరి.
లూయి. రాజవిచారణ జరుగవచ్చునా, జాతీయసభ
వారు విచారించ వచ్చునా, యను విషయములను గూర్చి యభి
ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
వారు విచారించవచ్చునని యభిప్రాయ మిచ్చిరి.రాజుగా గాక ప్రత్యేక వ్యక్తిగా శిక్షాస్మృతి క్రింద దేశద్రోహ నేరమునకై విచారించవచ్చుననియు,దేశములోని న్యాయమున కంత కును మూలస్థానమయిన ప్రజ లెన్న కొనిన ప్రతినిధులగుట వలన, జాతీయసంఘమున కట్టి విచారనాధికారము గలద నియు నీ సంసమువారు - అఖ్యాయికను వ్రాసిరి. ఈ నినే దనవచ్చిన యారుదినముల కనగ 13 నవంబరు నుండియు, జాతీయసభలో నీవిషయమై తిరిగి చర్చలు జరిగెను. రాజును శిక్షించుట ఎవరకిని అధికారము లేదనియు, జూతీయసభ “కాయనపై న్యాయవిచారణ చేయుటకు హక్కు లేదనియు, నింతేగాక రాజునకు న్యాయము, కరుణ కసుపఱచ వలసిన దననియు, సూతన ప్రజాప్రత్వ మాదార్య వంత మయినదను కీర్తిని పొందవలసిన దనియు, రాజును శిక్షించుటవలస దేశము లోపలను బయటను ఉపద్రవము లెక్కున కలుగుట కారకమగు ననియు, కొందురు చెప్పిరి. అతివాదులు, లూయి రాజు దేశ ద్రోహియనియు, మానవకోటికి శతృపనియు, ఆయన జీవించి యుండుటవలన దేశములో విద్రోహపు తిరుగు బాటులకు 'కారణముగుననియు, విచారణలేకుండుగనే ఆయనకు మరణ శిక్ష విదించుట దేశక్షేమముస కత్యావశ్యకత మనియు చెప్పిరి “విచారణతో మనకు సంబందము లేదు; లూయి ముద్దాయి. గాడు, 'మీరు న్యాయాధిపతులుగారు; మీరు రాజకీయవేత్త లు; ఒక మనుష్య నివిూద నేరము స్థాపనము చేయుటగాని నిర్దోషి యని చెప్పుటగాని మీపని కాదు; మీదేశ సురక్షితమున కావ
227
పదునేనవ అద్యాయము
శ్యక మేదో దానినే చేయుట మీవిధి. జాతిని కాపాడుట మీ
ధర్మము, సింహాసనభ్రష్టుడయిన రాజు చెడుపనులకే తగి
యున్నాడు; దేశము యొక్క శాంతిని భంగపంచుటకును, దాని
స్వాతంత్యమును చెడగొట్టుటకును లూయి రాజుగ నుండెను..
ఆయనను తీసివేసి ప్రజా స్వామ్యమును స్థాపించితిమి. ఇందువల
ననే మీ రాలోచించుచున్న సమస్య తేలిపోయినది. లూయీని
విచారించనక్కర లేదు. ఇదివరకే మీరు విచారించి దోషియని
నిర్ధారణ చేసియున్నారు. లేని యెడల ప్రజాస్వామ్య మును
స్థాపించి యుండెడివారు గారు " అని అతి వాద నాయకుడగు
రాబిస్పీయరు చెప్పెను. "ఒక రాజునకు న్యాయమైన శిక్షవిదిం
చుటకు చేతులువణుకుచున్న వారు, శాశ్వతపు పునాదులమీద
ప్రజా ప్రభుత్వము నెటుల నిర్మించగలరు. స్వాతంత్రముసు గోరు
పౌరులారా! స్వంతంత్రముసు పొందిన ప్రధమ దివశము నుండియు
మీ బానిసత్వమును గౌరవముగా గ్నాపక ముంచు కొను నెడల
రోమనుల వలెను ఇంగ్లీషు వారివలెను కొంత కాలముయిన తరు
వాత నయిన తిరిగి రాజును తెచ్చి పెట్టు కొనుదురను భయము
నకు తావుండదా? అని సెంటు దస్టు చెప్పెను. జాతీయ సభలో
నెక్కువమంది యొక వైపున అతివాదుల యభిప్రాయములను
మరియొక వైపున రాజును విచారించనే గూడదను వారి వాదనలను
త్రోసివేసి, లూయీ రాజును విచారించుటకే తీర్మానించిరి. ఆయన మీద
ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
నాలుగు నెలనుండియు లూయిరాజును, కుటుంబమును టెంపిలుకోటలో ఖైదీలుగ నుండిరి. ప్యారిసు మ్యునిసిపాలిటీ. వారు బహు అను మాసముతో గట్టిగా కాపుదల చేసిరి. లూయి యన్నిటికిని మనస్సు సమాధానపర్చుకొని శాంతచిత్తుడై తనకు రా నున్న దాని సనుభవించుటకు సిద్ధము గానుండెను. క్లెరీ యను ఒక నౌకరు మాత్రమే ఈయన యొద్దనుండెను. అతడే ఆయన కుటుంబమునకును సేవ చేయుచుండెను, ఖైదు వేయ బడిన మొదటి నెలలలో ప్రతిదినమును ఆయన కుటుంబముతో కలిసికొను చుండెను. దీనివలన ఆయన మనస్సునకు కొంతవరకు తృప్తియుండెను. దుర దృష్టము లో భాగస్వాములుగా భార్య యగు మేరి ఆంటీ వెటును, సోదరియగు ఎలిజబెత్తును నుఁడిరి. వారి నీయన యోదార్చుచుండెను. చిన్న రాకొమరునికి లూయి దురదృష్టవంతులను గూర్చిన విషయములు బోదించుచుండెను. లూయి ఏశేషముగా గ్రంధములను చదువుచుండెను. ఇంగ్లాండు చరిత్రను తరుచుగా చదువుచు ఇంగ్లీషు ప్రజలు సింహాసనభ్రష్టు లను చేసి రాజల కథలను, ఇంగ్లీషువారు శిరచ్చేదము చేసిన చార్లెసు రాజు చరిత్రమును ముఖ్యముగా పఠించుచుండెను. కాని కుటుంబమును ప్రతి దినము చూచు భాగ్యముకూడ నాయనకు త్వరలోనే పోయినది. ఆయనను విచారణ చేయవలేనను నా లోచనలు ప్రారంభము కాగనే అందరును కలిసి యాలోచించు కొసకుండ"నాయను, కుటుంబమును వేరు జేసి యొక రి నొకరు చూచుకొనకుండ ప్యారిసు పురపాలక సంఘమువారు కట్టుదిట్ట
ములుచేసిరి. 229
పదునేనవ ఆధ్యాయము
ఈ స్థితిలో నుండగా జాతీయసభకు లూయిని తీసుకొని రావలసినదని పురపాలక సంఘద్యోగి యగు సాంటెరీ నీ కుత్తరుపు చేసిరి. ఆయనయును ప్యారిసుపుర పాలనాధ్య కుడును టెంపిలు కోటకు వెళ్లి రాజుతో నీసం దేశమును, చెప్పి 'దయచేసెదరా' యని యడిగిరి. ఒక్క నిమిషం మాలోసించి లూయి రాజు వారి తోకూడ వెళ్ళెను. లూయీ రాజు జాతీయ సభలోనికి ప్రవే శించి యన్ని వైపుల నొక్కసారి వీక్షించెను. జాతీయ సభాధ్య క్షుడు లూయి... ఫ్రెంచి జాతి మీమీద నేరములు మోపు చున్నది. అవి మీకు చదివి వినిపించెదను. కూచ్చుండీ" యని చెప్పెను. అదివరకే వేయబడి యున్న యొక యాసనము పై లూయి కూర్చుండెను. చాల సేపు విచారణజరిగెను. లూయీ మన స్తైర్యముతో ఈ ప్రతిప్రశ్నకును స్పుటముగా సమాధానము చెప్పెను.. తన ప్రవర్తన నిష్కల్మషమయినదనియే యాయన చెప్పెను. దేశ శతృపులతో తాను రహస్యాలోచనలు జరుప నే లేదని చెప్పెను. లూయీ దస్కతు గల దవస్తా వేజులను ప్రతిపక్షులు చూపిరి. లూయీ వేనిని తనదస్కతని యెప్పు కొనలేదు. ఇనుప మూత వేసిన సురంగము సంగతి తనకు తెలియదనెను. తస తరఫున వాదించుట కొక న్యాయవాది నియ్యవలసినదని లూయీ కోరెను. విచారణకు తిరిగి వాయిదా వేయబడెను. లూయీని తిరిగి టెంపిలు కోటలో విడిచి.
అతివాదు లా క్షేపించినను జాతీయ సభవారు
లూయీరాజునకు న్యాయవాది నిచ్చుటకే యంగీక రించిరి.
జాతీయ సభ్యులలో నొకరగు సుప్రసిద్ధ న్యాయవాది మాలే
స్వాతంత్ర్యవిజయము
నాకు మరీ బాబూ. షెర్బీ రాజుతరఫున వాదించుటకు బూనుకొ నెను. " అప్పటి కనేక మంది గొప్పవారికి దుర్లభమయన మంత్రి పదవిని నాకు రెండు సార్లు లూయీ రాజిచ్చియున్నాడు. ఇప్పుడాయనకు నేను కృతగ్నతను చూపెద"నని మాలెషెర్బీ చెప్పెను. మాలె షెర్బీ లూయీ తో సంప్ర దించుటకు "టెంపిలు కోటలోని లూయీ యున్నగది లోనికి వెళ్ళగనే లుయీ లేచివచ్చి కన్నీళ్లతో మాలె షెర్బీని కౌగలించుకొని "మీత్యాగము మిగుల నౌదార్వ వం తమయినది. నాప్రాణమును మీరు సం. క్షించ లేక పోగా, మీ ప్రాణమునకు కూడ నపాయమును తెచ్చు కొన్నారు." అని లూయీ చెప్పెను. మాలె షెర్బీ , ట్రన్ షెటు, డె జ్జీ లను ముగ్గురు న్యాయవాదులు ముద్దాయి వాదమును తయారు చేసిరి. "నాప్రాణమును తప్పక తీసెదరు. నాకు మరణము. నిశ్చయము. కాని, నేను నిర్దోషినని బావి సంతతి వారికైనను తెలియగలందులకు మనము వాదించుటవసర"మని లూయీ వీరితో చెప్పెను.
రాజునకు
మరణ శిక్ష
విధించుట.
విచారణ దినమున లూయి రాజు హాజరయ్యెను. అనేక మంది ప్రజలు చూడ వచ్చిరి. అంతయు బహు నిశ్శబ్దముగా నుండెను. లూయి తరఫున న్యాయవాదులలో డెజ్జీ వాదనమును నడిపెను. అనేక హేతువులను యుక్తి యుక్తముగా చెప్పి లూయి. రాజు కెప్పుడును పవిత్రమయి నట్టియు ప్రజా సౌఖ్యమును గోరునట్టియు యుద్దేశ్యములు మాత్రమే కలవని చూపెసు.
గంభీరమైన యుపన్యాసముతో వాదమును ముగించెను: “న్యాయ 230
'పదునేనవ అధ్యాయము
సంరక్షకులారా ! వినుడు. అతని భావి కాలములో నేమివ్రాయ నున్నదో యోచించు కొసుడు. లూయి రాజు ఇరువదవయేట చిన్నతనముననే రాజ్యమునకువచ్చెను: . నీతిలోను, న్యాయము లోను, మితవ్యయము లోను. ఆదర్శప్రాయమగు ప్రవర్తనను కలిగి యుండెను. ఆయనకు దురభ్యాసము లేవియు లేవు.. ఏ దుర్వసనము నకు నాయన లోనుగా లేదు. ఆయన ఎల్లప్పుడును ప్రజలకు స్నేహితుడగనే యు.డెను. తమ్మును పీడించుచున్న పన్నును తీసివేయమని ప్రజలు కోరిరా....-లూయీ వెంటనే రూపుమాపెను. సంస్కరణములు చేయ వలెనని ప్రజలు కోరిరా! లూయీ వెంటనే చేసెను. చట్టములు, మార్చవలెనని ప్రజలు కోరిరా? - లూయీ వెంటనే మార్చెను . లక్షలకొలది ఫ్రెంచి ప్రజలకు రాజకీయ హక్కులను కోరిరా? లూయి ఇచ్చెను. ప్రజలు స్వేచ్ఛను గోరిరా లూయి ప్రసాదించెను. ప్రజల కొరకు లూయీ గొప్పు త్యాగములు చేసెనని చెప్పుక తప్పదు.. ఇట్టి లూయీ ని మీరి చంప చూచుచున్నారు. పౌరులారా! ఇంతకన్న నెక్కువ 'నేను చెప్పను. తక్కినదంతయు చరిత్రకు వదలి వేయు చున్నాను . మీరిప్పుడు చెప్పు తీర్పును చరిత్ర విమర్శించునని గ్నాపకముంచు కొనుడు. ఇందు పై చరిత్ర యిచ్చెడి తీర్పు శాశ్వతముగా నుండును." అని యుపన్యా సమును
ముగించెను... తీర్చుకు వాయిదా వేసి లూయి రాజును టెంపిలు కోటకు పంపిరి ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
లూయీని కాపాడవలెననియే గిరాండిస్టులకు గలదు గాని తమ్మును, రాజరకమును తిరిగి నెలకొలుప దలచినవారిని దేశములో నతివాదులల్లురులు పెట్టుదురసు భయము వీరికి కలిగి ఎటు చేయుటకును తోచకుండిరి.అతివాదులు చాకచక్యముతో నాదోళనము సలిపిరి. రాజుతరపున వాదనయంతయు రాజరికమును తిరిగి స్థాపింపయత్నించుటయే యని వీరు చెప్ప సాగిరి. పెకోబిను క్లబ్బులు వీరికి తోడ్సడెసు. రాజును వెంటనే చంపవలెనని జాతీయభకు మహజర్లు వచ్చెను. నిర్గోషియని యనుటవలన ప్రయోజనము లేదని యెంచి ఆయన విషయమైన తీర్పు జాతీయసభవారు చెప్పక ఫెంచిప్రజలకు 'పదలివేయవలెనని కొందరు గిరాండిస్టులు తలచిరి. తీర్పు జాతీయ సభవారెచెప్పిఅందుమీద ప్రజల యభిప్రాయ మడుగ వలసినదని మరికొందరు గిరాండిస్టులు చెప్పిరి, రాష్ట్ర ములలోని ప్రజలు రాజును రక్షించుట కొప్పుకొనెదరని వీరి యాశ. ప్రజలకు వదిలివేయుటవలన "దేశములో అంత అంతర్యుద్ధము సంప్రాప్తమగునని కొంద రాక్షేపించిరి.. అన్ని విషతయములలోను 'జాతీయ సభ్యలయభిప్రాయము తీసు కొన బడెను. లూయి దోషియనియే అందరును ఏకగ్రీవముగా తీర్మానించిరి., ప్రజల యభిప్రాయము తీసికొనవలెనని రెండు వందల యెను బదిమంది సభ్యులును, జాతీయసభవారే పూర్తిగ తీర్పు చెప్పువలసినదని నాలుగువందల యిరువదినలుగురు సభ్యులును సమ్మతుల నిచ్చిరి. ఏమిశిక్ష విధించవలెనను విషయములో, గిరాండిస్టులలో కొందరు
రాజును దేశ భోష్టుని చేయుటకును, కొందరు కొందరు ఖైదు పదు నేనవ అధ్యాయము
లోనే యుంచుటకును, సమ్మతుల నిచ్చిరి. మూడు వందల అరవ
వది యొకరు వెంటనే మరణశిక్ష.. వేయవలెనని సమ్మతుల నిచ్చిరి.
ఇరువదియారు ముంది ఎక్కువ సమ్మతులతో (మెజార్టీతో)
రాజునకు మరణశిక్ష విధించవలెనను తీర్మాన మంగీకృతమయ్యెను.
ఆధ్యక్షుడు దుఃఖచిహ్నముతో జాతీయసభ పేర లూయీ
కాపటుకు మరణశిక్ష తీర్మానింపబడినదని ప్రకటించెను. కొద్ది
మంది మెజార్టి వలన మాత్ర మే మరణశిక్ష తీర్మానింపబడినందున
పునర్విమర్శ చేయవలసినదని రాజు మొక్క న్యాయ
వాదులు కన్నీళ్ళ తో కోరిరి. “బహు కొద్దిమందిగల, యెక్కువ
సంఖ్యతోనే చట్టము న్నియు చేయబడుచున్న "వని యొక
యతివాది జవాబు చెప్పెను. "అవును. చట్టములు తిరిగి మార్చబడును.
చనిపోయిన మనుషుల తిరిగి బ్రతికించజాలమని యొకరు ప్రత్త్యు
త్తర మిచ్చిరి. పునర్విమర్శ, తీర్మానము మీద సమ్మతులు
తీసికొనగా నది యోడిపోయెను.పదునారవలూయీ రాజునకు మరణదండన స్థిరపడెను.
రాజును శిర
చ్చేదము
చేయుట
లూయీ రాజందుకు సిద్ధపడి యేయుండెను. మాలేషెర్బీ కన్నిళ్ళు కార్చుచు నీ శిక్ష సంగతి లూయీకి చెప్పుటకు పోయినపుడు లూయీ చేతితో కన్నులు మూసి కొని యొంటరిగానేదోగొప్పయలోచనములో మగ్నుడై యుండెను. మాలే షెర్భీ వెళ్ళగనే లూయీ లేచి (రెండుగంటలనుండియు నా ప్రభుత్వములో నే సెప్పుడయిన నాప్రజలకు కీడు చేసితినా యని
యాలోచించుకొనుచున్నాను. నే నిప్పుడే భగవంతుని సన్ని ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
ధికి పోబోవుచున్నాను. నే నేప్పుడును నాప్రజల సౌఖ్యము నే
కోరి ప్రవర్తించితినని నేను మీకు ప్రమాణము చేయుచు
న్నాను." ఆని లుయీ రాజు చెప్పెను. మరణదండ ససంగతి
లయీ శాంతముగా వినెను. మరణమునకు తదూరగుటకు
మూడురోజుల వ్యవధి యియ్యవలెననియు, తన కుటుంబమును
చూడనియ్యవలెననియు , తనకొక మతాచార్యుని ఇయ్యవలె
ననియు లూయీ కోరెను. ఆఖరి రెండు కోరికలను మన్నిం
పబడెను... ఒక రోజు వ్యవధి మాత్రమే యియ్యబడెను. ఆ దిక్కు
లేని కుటుంభమును, లూయీ చూచిన కడసారి చూపు మిక్కిలి
దుఃఖకరమైనదిగా నుండెను , మరియొక సారి దర్శించెదనని
కుటుంబముతో లూయీ చెప్పెను.. కాని దిరిగి వారిని చూడ లేక
పోయెను. నే నాదురదృష్ట వంతులను చూడ లేను" అని లూయీ
తనలో అనుకొనెను. ఆరాత్రి లూయీ శాంతముగా నిద్రించెను.
మరుసటి యుదయు మయిదుగంటలకే నౌకరు లూయీని నిద్ర
నుండి లేపెను, ఆయన స్వాధీనములోనిఆస్తి యంత యు నొక
యుంగరము, ముద్ర , కొన్ని వెంట్రుకలు, నౌరున కిచ్చెను.
అదిపర కే ఫిరంగుల మ్రోతలసు, వాద్యముల చప్పుడులును ప్రారంభ
మయ్యెను. ఇంతలో సాంటెరి వచ్చెను. “నాకొరకు మీరు వచ్చినారు.
ఒక నిమిష మాగు" డని లూయీ చెప్పి "తాను వ్రాసిన
మరణశాసనము నా మ్యునిసిపలు యుద్యోగస్థుని కిచ్చి "పోదము
రండి" యని లూయీ టోపీని ధరించి బయలు దేరెను. .
235
పదునేనప ఆధ్యాయము
టెంపిలు కోట బయట నిలువ పెట్ట బడి యున్న గుర్రపు బండిలో
సాంటెరితొ కూడ లూయీ రాజెక్కి యొక గంటలో ఉరి తీయు స్తలమగు
ప్లాసిడివల్యూషన్ కు వచ్చెను. త్రోవ పొడుగున నిరు ప్రక్కలను ఆయుధ
పాణులగు షుమారేబది వేల మంది సైనికులు కాపుదల కాయు చుండిరి.
ప్యారిసు పట్టణమంతయు నిశ్చేష్టితముగ నుండెను. ఉరి ప్రదేశమునకు
చూడ వచ్చిన ప్రజలు సంతోషము గాని, విచారమును గాని వెలి
బుచ్చక నిశ్శబ్దముగా చూచు చుండిరి. లూయీ గుర్రపు బండి దిగెను.
స్థైర్యముగా నురి స్థంభముపై నెక్కెను. మతాచార్యుని దీవనను గైకొనుటకు
మోకరించెను. "సెంటు లూయీ కుమారుడా స్వర్గమునకు బొమ్ము"
అని మతాచార్యు డాశీర్వదించెను. లూయి తన చేతులు బంధింప బడుటకు
కొంచెమయిష్టతను చూపెను. తరువాత నొప్పుకొనెను. ఉరి స్థంభము యొక్క
ఎడమ ప్రక్కకు తొందరగా వెళ్ళి "నేను నిర్దోషిగా చని పోవు చున్నాను.
నాశత్రువులను నేను క్షమించు చున్నాను. దురదృష్టవంతులగు
ప్రజలారా............... " అని లూయి చెప్ప బోవు చుండగా ఆయన చెప్పునది
వినబడకుండ తప్పెటలు వాద్యములు మ్రోగించబడెను. వెంటనే ముగ్గురు
శిరచ్చేదకులు వచ్చి ఆయనను పట్టుకొనిరి. 1793 వ సంవత్సరము జనవరి
21 వ తేదీన ఉదయము పది గంటల పదినిముషములకు లూయీ
ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
ఈవిధముగా ముప్పదితొమ్మిదో యేట , పదునాలుగున్నర సంవత్సరమలు రాజ్యపాలన చేసి, ఫ్రాన్సు యొక్క మిక్కిలి , యోగ్యుడగునట్టియు మిక్కిలి బలహీను డయినట్టియు రాజు మరణించెను. ఆయసపూర్వుల పరిపాలనా లోపములవలన ఆయన కాలములో గొప్పవిప్లవము కలిగెను. దైవభీతియు ప్రజలయందు ప్రేమయు నాయన కుండెను. కాని ప్రజలలో కలిగిన నూతన భావములను సరిగా గ్రహించి వానికి తాను నాయకుడై ప్రజలను నడించగల దూర దృష్టియు సామర్థ్య మును ధైర్య స్థైర్యములును కలిగియుండ నందున ప్రజాశక్తి కాహుతుడయ్యెను.