ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/పదునాలుగవ అధ్యాయము



ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పదునాలుగవ అధ్యాయము

సంపూర్ణ ప్రజాస్వామ్యము

(1)

నూతన శాసనసభ

లెజిస్లేటివ్ అసెంబ్లి (శాసనసభ) 1791 సంవత్సరము 1 వ అక్టోబరు తేదీన సమావేశ య్యెను. పరాసు దేశ స్వాతం త్యమున కై పనిచేయుచున్న వారియందు గౌర. వముతోను ఇంతవరకేర్పాటు కాబడిన పద్ధతినే పోవలెనను కోరిక తోసు పని ప్రారంభించెను. జాతీయ సభవారు చేసిన రాజ్యంగవిధానము వ్రాయబడి. యున్న పుస్తక ముసు పండెండుమంది వృద్ధ ప్రతినిధులు తెచ్చిరి.. శాసన సభ్యు లెల్లరును లేచి నిలువబడి టోపీలుతీసి 'స్వాతం త్యమున కై బ్రదుకుదుము. లేని యెడు మరణింతుము' అనుశప

థమును దీసికొనిరి.
208

ఫ్రెంచి జ్వాతంత్ర్య విజయము


నూతన రాజ్యాంగవిధాన ప్రకారము ప్రాత జాతీయ సభ్యు లెవరును నూతనశాసనసభలో సభ్యులుగా నెన్ను కొన బడుటకు వీలు లేదు. ఇది మంచి యేర్పాటుగాదు. అనుభవ శాలురు రాకుండబోయిరి. స్టేట్సుజనరలులలోను, జాతీయ సభలోను నిరంకుశత్వమును ప్రభువుల హక్కులను సంరక్షించ యత్నించిన ప్రభువులు, మతాచార్యు లుండిరి. అట్టివారెవరును నీ నూతన శాసనసభలో లేరు. ప్రజల యెన్నికలలో నట్టివారికి తావు లేదు. జాతీయసభలో మధ్య నుండి నకక్షివారు నూతన శాసనసభలో కొంతమంది మితి వాదక క్షిగసు, తెక్కి సవారు గిరాండిష్టులుగను చీలిరి. అతివాదుల కెక్కువబలము గలిగెను. శాసనసభలో అధ్యక్షునికి కుడి వైపున మితవాదులు కూర్చుండిరి. గొప్ప వీరి కెడమపక్కన గిరాండిష్టు లుం డిరి. గొప్ప విద్వాంసులగు బ్రోస్సో, వేసర్డు గెన్సోన్, మొదలగువారు వీరి నాయకులు, సభలో నెడమవైపున సంపూర్ణ ప్రజాస్వామ్య మును గోరుచున్న అతివాదులు కూర్చుండిరి. వీటికి మాంటి నార్డులని పేరు. యౌవనము, తీవ్రవాదము, మంచిపక్తృ త్వము, వీరికి ప్రధానలక్షణములు.అటునిటు నూగులాడు చుండినవారు మధ్యకూర్చుండి యుండిరి. ఎటు బలముగానున్నప్పు డటు చేరుచున్న వారు ప్లెయిన్ అని వీరికి పేరు.

2

క్లిష్ట పరిస్థితులు

శాసనసభకు ప్రథమమునుండియు గొప్పకష్టము లెదు ర్కొనెను. జాతీయసభ పదలిపోయిన శత్రువుల బాధ దినదిన మున కెక్కువయ్యెను. దేశమును వదిలిపోవువా

రిసంఖ్య విశేషుగా హెచ్చెను. సైనికోద్యోగు

209

పదునాలుగవ అధ్యాయము

ఇంకా లుకూడ దేశమును ఎదలి వెళ్ళసాగిరి. ప్రభువులు వెళ్ళి వీరితో చేరిరి.. సరిహద్దు సున్న పటాలములు కొన్ని దేశ భ్రష్టులతోకలి . సెను. దేశములోనుండి దృఢ చిత్తము లేని వారిని, ప్రభువులు తిరిగి యధికారములు పొందగనే, వీరిగతి యేమినుగునో ఆలోచించు కొనుమని వర్తమానములంపుచుండిరి. జర్మసురాష్ట్రములలోను ఆస్ట్రియాలోను. ఫ్రెంచి దేశ బ్రష్టులగుంపులు చేరి ఫెంచివిష్ణ వ మును నాశనము చేయుటకు సిద్ధపడు చుండిరి, యూరపులోని రాజులు వీరికి తగుర క్షణను, సహాయము నిచ్చుచుండిరి. వీరిరా యబారులను రాజు లాదరించుచు, ఫ్రెంచిప్రభుత్వపు రాయబా రులను అగౌర వపరచి వెళ్ళగొట్టిరి.. జాతీయ వాదులగు ఫ్రెంచివ ర్తకులకును బాటసారులకును, యూరపులో ప్రతిచోటను మిగుల నిబ్బందులు కలుగ జేసిరి. ఫ్రాన్సులో సున్న పోపు పక్షపు మతా చార్యులు ప్రజలను జాతీయ ప్రభుత్వము పై మతము పేర వురి గొల్పి తిరుగుబాటును చేయించుచుండిరి.

దేశభ్రష్టుల
మీద నిర్బంధము

విదేశములకు పోకుండ నిర్బంధములు కలుగజేయుటకు శాసనసభ వారు సమకట్టిరి. కొంత తీవ్రముగుచర్చ జరిగెను. మితవాదు లా క్షేపించిరి. ముప్పదియవ అక్టో'బరు తేదీన రాజు యొక్క జ్యేష్ఠ సోదరు డగు లూయీస్టానిలా ప్రభువు రెండు నెలలలోఫ్రాన్సుకు తిరిగిరానియెడల, రాజకుటుంబము నాయనకుగల సమస్తహక్కులు పోవునిని శాసించిరి. సవంబరు 9 వ తేదీన ఫ్రాన్సును ఎగలి విదేశ సరిహద్దులలో

ప్రోగగుచున్న వారందఱును దేశద్రోహులనియు, 1792 నం
210


ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

వత్సరము జనవరి1 వ తేదీలోపల దేశ ములోనికి తిరిగిరాని యెడల కుట్రదారుగా భావింపబడి వారిమీద మరణశిక్ష విధింపబడుననియు వారి భార్యలయొక్కయు పిల్లల యొక్కయు ఋణదాతల యొక్కయు న్యాయమయిన హక్కు'లకు లోబడి వారి యొక్క యావదాస్తిని ప్రభుత్వము వారు తీసుకుందురనియు శాసించిరి. నవంబరు 29 వ తేదీన జాతీయ ప్రభుత్వము నొప్పు కొనుచు శపధములు తీసికొనినమెడల, మతాచార్యుల యుపకార వేతనములు తీసి వేయుబడు ననియు వానిని తిరుగుబాటు దారులుగా భావించి నిగహాలో నుంచెదమనియు శాసించిరి.


లూయీ రాజు తన సోదరుని మీద చేయబడిన శాసన ము నంగీక రించి దస్క తును పెట్టెనుగాని, "దేశబ్రష్టులనుగూర్చి యు మతాచార్యులనుగూర్చియు శాససభవారు చేసిన శాసన ముల నంగీక రించక త్రోసి వేసెను. శాసనసభలోని కక్షుల లో నొకరి మీద నొకర నెక్కించి తాను నిజమైన యధికారమును చ లాయించవలెనని రాజు యత్నించెను. ఎప్పుటికైనను తమకు మంచిరోజులు వచ్చునేమోయను నాశతో రాజును, రాణియును కుట్రలు సలుపుచుండిరి. ఫ్రెంచిక్లబ్బను పేర నొక క్లబ్బును ప్యా రిసు పట్టణములో తన కుట్రదాయడగు మోలి వెలి చేత స్థాపింప జేసి, యాక్లబ్బులో రహస్యముగా జీతము లనిచ్చి సభ్యులను జేర్పించి, రాజుపక్షముగా నాదోళనము చేయించుచుండిరి. కొంతమంది మితవాదులగు శాసన సభ్యులు కూడ లంచములు పుచ్చుకొని

ఈకుటృలో చేరిరి

211

పదునాలుగవ అధ్యాయము

ఇతర రాజ్యముల
తో స్నేహమును
గోరుట

విదేశ రాజులతో తమంతట తాము కలహించవలె నను నుద్దేశ్యము శాసనసభకు లేదు. సాధ్యపడిన యెడల స్నేహ ముగా నుండవలె నసుతలంపు మాత్రమే గలదు. నవంబరు 20వ తేదీని శాసనసభవారొక శాంతికరమగు ప్రకటనమును గావించిరి. “ఇతర దేశములను జయించవలెనను గోరిక ఏమాత్రమును ప్రెంచి ప్రజలకు లేదని ప్రమాణము గావించుచున్నాము. ప్రక్క నున్న "దేశముల వారి వాత్సల్యతనే గోరుచున్నాము. స్వాతంత్యమును పొందినట్టియు, గొప్పదై నట్టియు మాజాతి తరపున మీకందరకును మా మనఃపూర్తి యగు స్నేహభావమును ప్రకటించు చున్నాము. మీ యొక్క చట్టములను, మీ యూచారములను, మీ ర్యాజ్యాంగ విధానము లను మేము గౌరవించెదము, వాటితో మేమెట్టి జోక్యమును కలుగజేసి కొనము. మా చట్టు ములను, మా రాజ్యాంగ విధాన మును మీఉకూడ గౌరవించెదరని సమ్ముచున్నాము. మీ ర్క్రమముగా మామీద యుధ్ధమునకు వచ్చిన యెడల లోపమం తయు మీదేయగును. మే ముప్పుడు మా సైన్యములను మాపిరం గులనేగాక, మా స్వాతంత్ర ధర్మమునుగూడ మీకు వ్యతి రేక ముగ నిలువ బెట్టెదము. పుసర్జీవమును పొందిన ప్రజలతో యుద్ధ ముచేయుటవలన మీకు గలిగెడి పలితములకు మీరే జవా బుదారులగుదురని విదేశీ ప్రభువుకు తెలియపంచవల సినదిగా రాజును కోరిరి. లూయీ రా జట్లు తెలియపరచెను.

కానీ యూర పురాజు లెవరు నీ శాంతి సందేశమును
202

ఫేంచి స్వాతంత్ర విజయము

చేసికొనియున్ననెడ తెగ లక్ష్యపెట్టక కిరీటాధి పతుల యెక్క గౌరవముకొఱకును, సురక్షితముకొరకును, యొడంబడికను మార్చుకొనుటకు వీలు లేదని ప్రత్యుత్తరమిచ్చిరి. తరువాత నిరువదిమూడు సంవత్సరములవరకును యూరపులో జరిగినన ఘోర యుద్ధమునకు, నిరంకుశత్వమును పునరుద్ద రింప దలచిన రాజులే జవాబుదారులు, ఫ్రెంచి జాతియొక్క స్వయం నిర్ణయమునకును, స్వాతంత్యమునకును, యూరపు యొక్క నిరంకుశత్వమునకును, దురాశకును. మధ్య జరిగిన ఈ యుద్ధములో, ప్రధమము నుండియు సంగ్లాండు నిరం కుశపుపక్షముననే నిలవబడి ఫ్రెంచి ప్రజ లేర్పరచుకొన్న ప్రభుత్వము నిర్మూలనమై , పదు నెనిమిదవ లూయీ రాజును బల వంతముగా ఫ్రెంచి ప్రజల పైన కట్టువరకను పోరాడెను.

3

యుద్ధములో
సపజయములు,

ఫ్రాన్సు దేశము యుద్ధమునకు తయారయ్యెను. గిరాం డిస్టులు శాసనసభలో ఎక్కువమంది యు నెక్కువ పలుకుబడి గలిగియు నున్నందున లూయిరాజు వారిలోనుండి మంత్రుల నేర్పరచుకొనవలసి వచ్చెను. ఏప్రిలు 20 వ తేదిన లూయి రాజు శాసనసభకు వచ్చి ఆస్ట్రియా మిద యుద్ధమును ప్రకటించెను. ఈ వార్త, ఫొస్సు దేశమునకు సంతోషము కలిగించెను. పట్టణము లలోను జల్లాలలోను సుత్సాహముతో ప్రజలు సైన్యములో చేరిరి. ధనసహాయముకూడ బాగుగా చేసిరి. కాని ఏప్రిలు

28 వ తేదిన బెల్జియములో ఫ్రెంచి సేనలు ఆస్ట్రియా వారిచే.

203

పదునాలుగవ అధ్యాయము


పూర్తిగా నోడింపబడి చెల్లా చెదురయ్యెను. లపయతు సేనాని తెన సేనలను మరల్చుకొని ప్రాన్సు సరిహద్దుచేరెను. " శతృ పులు ప్యారిసు మీద పడుదురను భయము ప్యారిసు ప్రజల లో కలిగి విశేషకలవరమును కలిగించెను,

రాజు యొక్క
ప్రవర్తనము

విప్లవమునకు వ్యతిరేకులగు ప్రభుపక్ష పాతులు సంతస మును వెలిబుచ్చిరి '. రాజు తన స్వంత సైన్యము హెచ్చించుచుండెను. విప్లవమునకు వ్యతిరేకులనుండి సైనికులను చేర్చుకొనుచుండెను. రాణిచుట్టును ఆస్ట్రియా రాజుతో, సలహాలు చేయుచున్న బృంద మొకటి చేరెను. శాసనసభ వారు వెంటనే ప్యారిసు సునగరమున నిరువది వేలమంది రిజర్వు సైనికులను తయారు చేసిరి, రాజు యొక్క- స్వంత సైన్యములను, రాణియొక్క ఆస్ట్రియా బృంద మును తీసివేయవలెనని కోరిరి.జాతీయ ప్రభుత్వముచే నంగీకరింప పబడని మతగురువుల నెల్ల కల్లోలములను పురిగొల్పుచున్నం దున వెంటసే ఫ్రాన్ను దేశమును వదలిపోపలసినదని శాసనము చేసిరి. ఈ శాసనమును రాజు త్రోసివేసెను. రాజు గీరాం డిస్టు మంత్రును వెళ్ళగొట్టి, మితవాదులు నుండి. మంత్రివర్గము నేర్పంచుకొనెను. ప్రజలలో పలుకుబడి. గోల్పోయినవారును, స్వల్ప సంఖ్యాకులు సగు మితవాదుల మీద ఆధార పడక , రాజు తన యాశలనన్నిటిని యూపురాజులమీద పెట్టుకొనెను. మేలన్ డూపాన్ అను రాయబారి ద్వారా విదేశ రాజులకు కబు రంపెను. దేశము యొక్క కష్టముల కన్నిటికిని రాజే కారకు

కుడగ నున్నాడని శాసనసభ వారి అంగీకారముతో రోలెండను
214

ప్రెంచి స్వాతంత్ర విజయము


సభ్యుడు రాజునకుత్తరము వ్రాసిపంపెను. రాండిస్టుమంత్రులను తీసి వేసినందులకు శాసనసభ వారు తమ యసమ్మతిని, దెలిపిరి. కాని రాజు తన దుష్ప్రవర్తనను మాన లేదు. ఇందు మీద రాజును తీసి వేసిన గానీ దేశమునకు సురక్షితము లేదని అతివాదులు ప్రజల కుపన్యాసముల నిచ్చిరి. పత్రికలలో వ్రా యుచుండిరి. క్లబ్బులలో తీర్మానించుచుండిరి. సంపూర్ణ ప్రజా స్వామ్య వాదుల పలుకుబడి ప్రజలలో బాగుగ వృద్ధి చెందెను, ప్యారిసుసగర మ్యునిసిపల్ అధ్యక్షుడును, సభ్యులును ఈ కక్షి లోనే చేరియుండిరి.

(4)

రాజును తీసి వేయ
వలెనను యత్నము.

జూన్ 20 వ తేదీ జాతీయ సభ్యులు టెన్నిసుకోర్టు శపదమును తీసికొన్న దినము. . 'దాని సంవత్సరోత్సవము పేర ప్యారిసు లోని ముప్పది వేలమంది జనులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు జాతీయ గీతములను, విప్లవ కీర్తనలు పాడుచు శాసన సభా మందిరమునకు వచ్చిరి. స్త్రీలు, పిల్లలు బాగా తీయగీతములను విప్లవకీర్తనలను పొడుచు, శాసని సభామందిరమునకు వచ్చిరి. ప్రజాసమూహము యొక్క - నాయకులు శాశన సభ కొక అర్జీ నిచ్చుచు ' రాజు తన యిష్టము వచ్చినట్లు ప్రవర్తిం చుచున్నాడు. ప్రజా నురంజకులగుమంత్రులను దీసి వేసినాడు. జాతి యొక్క సౌఖ్య మొక మనుష్యని దయ మీద నాధార పడదగినంత తేలికైన వస్తువు కాదు. దేశము నీ యపా య స్థితి నుండి తప్పించుటకు వారు వెంటనే పూనుకొను' డని' చెప్పిరి. ఈ సంగతి తాము జాగ్రత్తగా నాలో చింతు మనియు,

ప్రజలల్లరులు చేయకుండ తిరిగి యండ్ల కేగవలయునని కోరుచు

215

పదనాలుగవ అద్యాయము


న్నా మనియు శాసనసభాధ్యక్షుడు చెప్పెను. ప్రజలక్కడ నుండి పోయి రాజమందిరములో ప్రవేసించిరి. రాజు ధైర్య ముగా తలుపులు తీయించి ప్రజలను రానిచ్చెను. జాతీయ భటులు ప్రజలల్లరి చేయకుండ కాపాడిరి. రాజు ముందుకు వచ్చి ప్రజలిచ్చిన జకోబినులు ధరించెడి ఎర్ర టోపీని ధరించెను. వారిలో నొక రిచ్చిన ద్రాక్ష సారాయయుమును త్రాగెను. ప్రజలు సంతృప్తినొంది వెళ్ళిపోయిరి.


శాసనసభలో రాజును తీసి వేయవలెనని గిరాఁ డిస్టు కక్షీ సభ్యులు కూడ చెప్పసాగిరి. వెర్నాడను సభ్యుడు దేశము యొక్క అపాయస్తితిని వర్ణించి, దీనికంతకును రాజును, ఆయన సలహాదారులును జవాబుదారులని, సభ్యుల మనంబులు కరుగునట్లు పన్యసించెను. బ్రిస్సో "రాజును, ఆయస సలహాదారులను ఫ్రెంచి జాతిని ఆటబొమ్మవలె త్రిప్ప యత్నించుచున్నా ”రని చెప్పెను. యుద్ధము ముగియువరకును శాసనసభ ఎడతెగకుండ సమా వేశమగునట్లు, తీర్మానించిరి. సభ్యులు రాష్ట్రములకు పోయి ప్రజలను పురికొల్పి సైన్యములలో జేర్చి. యుద్ధము సకు దృఢప్రయత్న ములను వేసిరి

రాజును
ఖైదు చేయుట,

1792 సంవత్సరము జూలై 25 వ తేదీన ప్రష్యా సేనాధి పతియగు బ్రన్సువి క్కు ప్రభువు పదునారవ లూయీ రాజు గోల్పోయిన హక్కులను తిరిగి యిచ్చుటకయి తాము వచ్చుచున్నామనియు, లూయీ రాజుకు వ్యతిరేకముగా నుండు వారి నెల్ల కాల్చి వేయుదుమనియు

యూరపు రాజులతరపున ప్రకట
216

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

నము చేసెను. ఇందుమిద ప్యారిసు ప్రజ లాగ్రహ పరవశులైరి. ఆగష్టు నెల 10 వ తేదీన ఉదయము 7 గంటలకు ప్యారిసుప్రజ లును జాతీయభటులుసు ఆయుధము'లను ధరించి ట్యూలరీమం దిరమును ముట్టడించిరి.. రాజు యొక్క విదేశీయభటు లెదిరించిరి. ప్రయోజనము లేదయ్యెను. రాజుచెం తనున్న జాతీయ భటులు ప్రజలలో కలిసిరి. రాజు కుటుంబముతో గూడ పారి పోయి శాసనసభామందిరములో శరణు జొచ్చెసు. శాసనసభ వారు రాజును కుటుంబమును ఆమందిరము యొక్క కొన్ని గదు లలో రెండురోజులుంచి ప్రజల యాగ్రహము నుండి సంరక్షిం చిరి. శాసనసభకు ప్రజలు వచ్చి వెంటనే రాజును పదభష్టుని చేయవలసినదని కోరిరి. సెప్టెంబరు 21 వ తేదీన ప్రభుత్వ పద్ధతిని నిర్ణయించుట కొక నేషనల్ కన్వెషనును జాతీయ సమా వేశము) కూర్చుటకును, రాజును -రాజ్య బ్రష్టు ని చేయు జవాబుదారి వారికి వదలుటకును, అంతవరకును రాజును అధి కారమునుండి తొలగించి ఆయన ఏర్పరచిన మిత వాదమం త్రులను దీసి వేయుటకును, శాసన సభవారేకాగ్రీవముగా తీర్మా నించిరి. వెంటనే గిరాండిస్టుమంత్రులను శాసనసభవారు నియ మించిరి. జాతీయ ప్రభుత్వము సకు వ్యతిరేకులను మతగురువు లను షుమారు నాలుగు వేల మందిని దేశబ్రష్టులను గావించిరి. సైన్యములకు తగు ప్రోత్సాహము కలుగ జేయుటకై కమీషనరులను బంపిరి. పదునారప లూయీ రాజు కుటుంబముతో కూడ సెప్టెంబరు 21 వ తేదీన ప్యారిసులోని టెంపిలుకోటలో విడి ఖైదులో నుంచబడెను. యూరపునంతను గడగడ వణంక

.

217

పదునాలుగవ అధ్యాయము


జేసియున్న ఫ్రాన్సు రాజరికయొక్కదిసములోపల ప్రజా శక్తి ముందఱ కూలిపోయెను.


యుద్ధములో
జయములు


ఈ కాలమున ప్రష్యా సైన్యములు బళులు దేరి ఫ్రాన్సు సరిహద్దు లోపల ప్రవేశించి ఆగష్టు 20వ తేదీని 'లాంగులీపట్టణ మును ముట్టడించి స్వాధీనపరచుకొనెను. 30వ తేదీన వర్డన్ పట్టణమును ముట్టడిం చెసు. వర్డన్ పడిపోయినచో తశత్రువులు ప్యారిసు మీదికి వచ్చుట సులభమగుసు. దేశమును సంరక్షించు కొను టెట్టని శాసనసభ్యులు చర్చించు కొనుచుండిరి. దేశము లోని రాజపక్షపాతుల కెల్ల భయము పుట్టించపలెనని డాంటన్!" చెప్పెను. శాసనసభ యేమియు తీర్మానించ లేదు. ప్యారీసు పురపాలక సంఘమువారు ఇంటింటను ఆయుధముల కొఱకు వెదికి శత్రువులు ప్యారిసును ముట్టడించిన చో రాజు పక్షమున చేరు దురని యసుమానింపబడిన ప్రభువులను, మత గురువులను, దేశీ బంధువులను, 'రాజుక్రింద సైనికులుగ సున్న వారిని చెరసాలలో సుంచిరి.. సెప్టెంబరు 1వ తేదీ రాప్యారిసులో తెలి సెను. ప్రజల కలవరమునకు మేరలేదు. శత్రువులు ప్యారిసు మీదికి వత్తురని గొప్ప భీతాపహము కలిగినది. సెప్టెంబరు 2వ తేదీనుండియు వరుసగా మూడురోజులు, పేరున కొక విచారణ కమిటీ యని యేర్పఱచి 35 చెసొలలను తెరచి అను

మాసగ్రస్తులగు సుమారు వేయి మందిని ప్యారిసు ప్రజలు నిర్దా
218

ఫ్రెంచిస్వాతం త్య విజయము

క్షిణ్యముగ చంపి వేసి.. ప్రజల యావేశము ముందఱ శాసనసభ యేమియు చేయు లేకుండెను . డెమరో సేనాని ఫ్రెంచి సైన్యము లను తీసికొని శత్రు సైన్యము. మీదికి వెళ్ళెను . శత్రు సేనాని యగు బ్రన్సువిక్కు ప్యారీసుమీదికి నెకాయెకి వచ్చుటకు సందేహించెను. మ్యూజులకోటను పట్టుకొనుటకై వెడలుచుం డెను. త్రోవలో వాల్మీయొద్ద ప్రెంచి సైన్యములు శత్తృవుల నెదుర్కొనెను.ఫ్రెంచి సైనికుల సంఖ్య తక్కువగానున్నను దేశాభిమాసపూరితు లై పోరాడి శత్రువులను పూర్తిగ నోడిం చెను. లూయీ రాజును పేరునకు రాజుగా చేసినన చాలునని ప్రష్యా వారు సంధి రాయబారముల సంపగా ప్రష్యా సైన్యము లు పూర్తిగా ఫ్రెంచి దేశము పదలి వెళ్ళినగాని ఎట్టి రాజీనామా మాటలను మాట్లాడుటకే వీలు లేదని ఫ్రెంచి ముప్రభుత్వము వారు జవాబు చెప్పిరి.. తిండి లేక బాద పడి, రోగములచే పీడింపబడి, ప్రష్యా సైన్యములు సెప్టెంబరు 30 వ తేది నుండియు ఫ్రాన్సును వడలి వెళ్ళిపోయిరి. ఫ్రెంచి సైనికులు వర్డన్ లాంగులీని స్వాధీనం పచుకొనిరి. ఆస్ట్రియనులు చిలీని ముట్టడించగా వారిని ఫ్రెంచి సైన్యములు తరిమి వేసెను. వాల్మీభయము వలన ఫ్రెంచి విప్లవము కాపాడబడెను. ఆ జయమను పొందిన మరుసటిదినమున నే ప్యారిసులో జాతీయ సభ వారు రాజును శాశ్వతముగా పదభష్టునిచేసి సంపూర్ణ ప్రజాస్వామ్యమును ప్రకటించిరి,