ప్రాణాయామము/శాంతిశ్లోకము
ఓం
శాంతిశ్లోకము
హరి:ఓం| వాజ్మేమనసి ప్రతిష్ఠితా, మనోమే వాచి ప్రతిష్ఠిత మావిరా వీర్మ ఏధివేదస్యమ ఆణీస్థ: శ్రుతంమే మాప్రహాసీ రనేనాధీతే నాహోరాత్రాస్సందధామ్ర్యుతం
వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తార మవత్వవతు మామవతు వక్తారమవతు వక్తారం||
ఓం శాన్తి: శాన్తి: శాన్తి:
హరి: ఓం ! నావాక్కు మనస్సునందు ప్రతిష్ఠింపబడియున్నది మనస్సు వాక్కునందు ప్రతిష్ఠింపబడి యున్నది.
ఓ ఈశ్వరా! నాకు నీవు ప్రత్యక్షము కమ్ము; ఓ మనోవాక్కులారా! వేదములు బోధించుచున్న సత్యమును గుర్తించుటకు నాకు సాయపడుడు. నేను వినినది మరచిపోకుందును గాక! అహోరాత్రములు అధ్యయనము చేసెదను. సత్యస్వరూపమును ధ్యానింతును. సత్యమును పల్కుదును. అది నన్ను రక్షించునుగాక. నా గురువును రక్షించునుగాక.
ఓం శాంతి: శాంతి: శాంతి:
_____ . . . _____