ప్రసార ప్రముఖులు/విదేశీ తెలుగు కార్యక్రమాలు

దర్శకుల దృష్టిలో పడ్డారు. వందలాది చలన చిత్రాలలో పనిచేశారు. చాలా సినిమాలలో డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు. స్వయంగా చిత్రాలు నిర్మించారు.

1971 లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు పక్షాన నిలబడి ఒంగోలు లోక్‌సభ స్థానానికి ఎంపికయ్యారు. లోక్‌సభలో సాంస్కృతిక విషయాలను ప్రస్తావించి సభ్యుల దృష్టిని ఆకర్షించారు.

స్వయంగా రచయిత అయిన జగ్గయ్య రవీంద్ర గీతావళిని తెలుగులోకి అనువదించి ప్రచురించారు. చక్కటి పద్యరచన చేయగల సమర్ధులు జగ్గయ్య. ఆత్రేయగారి మీద అభిమానంతో ' మనస్విని ' ప్రచురణలు వెలువరించారు. జగ్గయ్య మదరాసులో స్థిరపడ్డారు.

విదేశీ తెలుగు కార్యక్రమాలు

రేడియో మాస్కో నుండి 1968 నుండి తెలుగులో అరగంట కార్యక్రమాలు ఆసియా దేశాలకు ప్రసారమయ్యేవి. కమ్యూనిస్టు రష్యా విడిపోయి ముక్కలైన తర్వాత ఈ ప్రసారాలు నిలిచిపోయాయి. ఢిల్లీ వార్తల విభాగం నుండి ఎందరో మాస్కోకి డెప్యుటేషన్‌మీద రెండేళ్ళపాటు వెళ్ళి అక్కడ ఒకరిద్దరు ఉద్యోగుల సహకారంతో తెలుగు కార్యక్రమాలు రూపొందించారు.

వారిలో శ్రీయుతులు తిరుమలశెట్టి శ్రీరాములు, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, భండారు శ్రీనివాసరావు (హదరాబాదు) చెప్పుకోదగినవారు. వారు ఆ దేశీయుల ప్రేమాదరాలకు పాత్రులయ్యారు.

ఆకాశవాణి విదేశీ ప్రసార విభాగం ఓవర్‌సీస్ ప్రసారాలలో తెలుగు ప్రసారాలను 1990 ఉగాది నుండి ప్రారంభించింది. అప్పట్లో కేంద్ర ప్రసారశాఖా మంత్రిగా పర్వతనేని ఉపేంద్ర ఉండేవారు. ఉదయం 4-30 ని. ల. ప్రాంతంలో 30 నిముషాలు ఈ ప్రసారాలు ఢిల్లీ నుండి జరిగేవి. 1995 నుండి ఈ విదేశీ ప్రసారాలు హైదరాబాదు కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. South East Asia దేశాల ---లకు ఈ ప్రసారాలు ఉద్దేశించబడ్డాయి. సా. 5-45 నుండి అరగంటపాటు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అలానే శ్రీలంక నుండి సిలోన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ వానిజ్య ప్రసార విభాగం తెలుగు సినిమా పాటలతో చాలా పాపులర్ అయింది. శ్రోతలు కోరిన పాటలు, వారి పేర్లు ప్రసారం చేస్తూ ఎందరినో ఆకర్షిచింది. ప్రకటనలు బాగా లభించేవి. 'బినాకా, గీతామాలిక' వంటి ప్రముఖ కార్యక్రమాలు శ్రోతల్ని బాగా ఆకర్షించాయి. వాణిజ్య ప్రకటనలకు వ్యాపార వేత్తలు సిలోన్ రేడియోను ఆశ్రయించేవారు.

ఇటీవల వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ప్రముఖమైన తర్వాత ఈ వాణిజ్య ప్రసార విభాగంవారు సిలోన్ నుండి ప్రసారాలు తగ్గించారు.

ఇటీవల విశ్వవాణి సువార్తవాణి పేర తెలుగులో క్రైస్తవ మత ప్రచార ప్రసారాలు జరుగుతున్నాయి. విశ్వవాణి మీడియంవేవ్‌పై చాలా శక్తివంతంగా --KHZ మీద ప్రసారాలు చేస్తూ అదే మీటర్లపై పనిచేసే కేంద్రాల కంటె శక్తివంతంగా ఉండేది. దాన్ని అదిగమించడానికి కడప, విశాఖపట్టణం, విజయవాడ కేంద్రాల ప్రసారశక్తిని 100 K W స్థాయికి పెంచాల్సి వచ్చింది.

వార్తా విభాగం

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రాంతీయ వార్తా విభాగం ఎందరో ప్రసిద్ధుల్ని తయారుచేసింది. వార్తలు చదవడంలో తమదైన ప్రత్యేకతను చాటుతున్న వారెందరో వున్నారు.

శ్రీ తురగా కృష్ణమోహన్ : వీరు ప్రత్యేక బాణిలో వార్తలు చదివేవారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రథమ ప్రయాణం కవర్ చేయడానికి డ్యూటీ మీద వెళ్ళారు. దురదృష్టవశాత్తు రైలు వెళ్ళిపోయింది. దాన్ని ఖాజీపేటలో అందుకొందామని పాత్రికేయ బృందం వాహనంలో వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరి సతీమణి తురగా జానకీరాణి రచయిత్రి. వారు ఆకాశవాణిలో మహిళా కార్యక్రమాల ప్రొడ్యూసర్‌గా రెండు దశాబ్దాలు పనిచేసి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా రిటైరయ్యారు. పన్యాల రంగనాధరావు తమ