ప్రసార ప్రముఖులు/వార్తా విభాగం
---లకు ఈ ప్రసారాలు ఉద్దేశించబడ్డాయి. సా. 5-45 నుండి అరగంటపాటు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అలానే శ్రీలంక నుండి సిలోన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ వానిజ్య ప్రసార విభాగం తెలుగు సినిమా పాటలతో చాలా పాపులర్ అయింది. శ్రోతలు కోరిన పాటలు, వారి పేర్లు ప్రసారం చేస్తూ ఎందరినో ఆకర్షిచింది. ప్రకటనలు బాగా లభించేవి. 'బినాకా, గీతామాలిక' వంటి ప్రముఖ కార్యక్రమాలు శ్రోతల్ని బాగా ఆకర్షించాయి. వాణిజ్య ప్రకటనలకు వ్యాపార వేత్తలు సిలోన్ రేడియోను ఆశ్రయించేవారు.
ఇటీవల వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ప్రముఖమైన తర్వాత ఈ వాణిజ్య ప్రసార విభాగంవారు సిలోన్ నుండి ప్రసారాలు తగ్గించారు.
ఇటీవల విశ్వవాణి సువార్తవాణి పేర తెలుగులో క్రైస్తవ మత ప్రచార ప్రసారాలు జరుగుతున్నాయి. విశ్వవాణి మీడియంవేవ్‌పై చాలా శక్తివంతంగా --KHZ మీద ప్రసారాలు చేస్తూ అదే మీటర్లపై పనిచేసే కేంద్రాల కంటె శక్తివంతంగా ఉండేది. దాన్ని అదిగమించడానికి కడప, విశాఖపట్టణం, విజయవాడ కేంద్రాల ప్రసారశక్తిని 100 K W స్థాయికి పెంచాల్సి వచ్చింది.
వార్తా విభాగం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రాంతీయ వార్తా విభాగం ఎందరో ప్రసిద్ధుల్ని తయారుచేసింది. వార్తలు చదవడంలో తమదైన ప్రత్యేకతను చాటుతున్న వారెందరో వున్నారు.
శ్రీ తురగా కృష్ణమోహన్ : వీరు ప్రత్యేక బాణిలో వార్తలు చదివేవారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రథమ ప్రయాణం కవర్ చేయడానికి డ్యూటీ మీద వెళ్ళారు. దురదృష్టవశాత్తు రైలు వెళ్ళిపోయింది. దాన్ని ఖాజీపేటలో అందుకొందామని పాత్రికేయ బృందం వాహనంలో వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరి సతీమణి తురగా జానకీరాణి రచయిత్రి. వారు ఆకాశవాణిలో మహిళా కార్యక్రమాల ప్రొడ్యూసర్‌గా రెండు దశాబ్దాలు పనిచేసి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా రిటైరయ్యారు. పన్యాల రంగనాధరావు తమ గాత్ర గాంభీర్యంతో శ్రోతల్ని అలరించేవారు. పదవీ విరమణ తర్వాత 'సమయం' పత్రికా సంపాదకులుగా పనిచేసి హైదరాబాదులో మృతి చెందారు, గోళ్ళమూడి నళినీమోహన్ హైదరాబాదులో వార్తలు చదివేవారు. వీరు తర్వాత ఢిల్లీ జనరల్ న్యూస్ రూమ్‌లో ఎడిటర్‌గా పదవీ విరమణ చేశారు.
న్యూస్ రూంలో అసిస్టెంట్ ఎడిటర్లుగా ఎందరో పని చేశారు. వారిలో నర్రావూరు సుబ్బారావు, మల్లాది రామారావు, J. B. రాజు, R. రామచంద్రరావు, కొత్తపల్లి సుబ్రమణ్యం, R. V. R. కృష్ణారావు, ఆకిరి రామకృష్ణారావు, సుజాత, ఆలీ, అశోక్‌రావు మల్లాది రామారావు హైదరాబాదు నుండి ఢిల్లీ కి రిపోర్టరుగా బదిలీ అయ్యారు. 1994లో ఉత్తమ రిపోర్టర్‌గా జాతీయస్థాయిలో బహుమతి పొందారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి ఆంగ్ల దినపత్రికలో రిపోర్టరుగా చేరారు.
వార్తా విభాగంలో వార్తలు చదివే వారిలో డి. వెంకట్రామయ్య, జ్యోత్స్న ప్రముఖులు. వీరుగాక క్యాజువల్‌గా వార్తలు చదవడానికి వచ్చిన వారిలో పత్రికా సంపాదకులు పొత్తుర్రి వెంకటేశ్వరరావు, సురమౌళి, గుడిపూడి శ్రీహరి. పార్వతీ ప్రసాద్ ప్రముఖులు. దివి వెంకట్రామయ్య కథా రచయితగా మంచిపేరు సంపాదించారు. చక్కటి కంఠం గల వీరు సమర్దులైన వ్యక్తులు.
హైదరాబాదు కేంద్రం నుండి ఉర్దూ వార్తలు కూడా ప్రసారమవుతాయి. న్యూస్ ఎడిటర్ ఆంగ్లలో జనరల్ పూల్ కాపీ తయారు చేస్తారు. దానిని తెలుగు ఉర్దూలలో తర్జుమా చేసుకొని ఆయా విభాగాల న్యూస్ రీడర్లు చదువుదురు. ప్రాంతీయ వార్తలు ఉర్దూలో చదవడంలో వసీం అక్తర్ చాలా ప్రసిద్ధులు. ఆయన పదవీ విరమణ చేశారు. ఉర్దూ వార్తలు సా 5- 50 ని. లకు హైదరాబాదు నుండి ప్రసారమవుతాయి. కడప కేంద్రం కూడా రిలే చేస్తుంది. ప్రాంతీయ వార్తలు తెలుగులో హైదరాబాదు నుండి సా, 6-15 ని. లకు ప్రసారమై అన్ని ఆంధ్ర కేంద్రాలు రిలే చేస్తాయి. అలానే మధ్యాహ్నం 1-10 ని. లకు హైదరాబాదు ప్రాంతీయ వార్తలు కడప కేంద్రం రిలే చేస్తుంది. ఉదయం 6-45 ని. లకు విజయవాడ కేంద్రం నుండి వచ్చే ప్రాంతీయ వార్తలు, హైదరాబాదు, కడప, విశాఖపట్టణం కేంద్రాలు రిలే చేస్తాయి. మ. 1-20 ని. లకు విజయవాడ ప్రాంతీయ వార్తలు విశాఖపట్టణం రిలే చేస్తుంది.
హైదరాబాదు వార్తా విభాగం బుధ, శనివారాలలో ఆంధ్ర దేశంలో జరిగే వార్తలతో "రేడియో న్యూస్ రీల్" రాత్రి 7-45 ని. లకు ప్రసారం చేస్తుంది. అన్ని కేంద్రాలు రిలే చేస్తాయి. అలానే అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో ప్రతిరోజూ శాసనసభ సమీక్ష పాత్రికేయులు చేస్తారు. అన్ని కేంద్రాలు రిలే చేస్తాయి. అలానే వార్తా వ్యాఖ్య పేర తాజా విషయాలపై వ్యాఖ్యలు ప్రసారం చేస్తూంది.
ఎన్నికల సమయాలలో రాత్రింబగళ్ళు ప్రత్యేక వార్తాప్రసారాలు చేయడం ఆనవాయితీ. రేడియో మాద్యమం త్వరగా వార్తలు చేరవేయడంలో తన ప్రత్యేకతను చాటుతుంది. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ N. T. రామారావు మరణ వార్తను ఉ. 6 గం. లకు ఢిల్లీ కేంద్రం నుండి వచ్చే ఆంగ్లవార్తల్లో ప్రసారం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చనిపోవడంతో పత్రికలు ఆ వార్తను ప్రచురించలేకపోయాయి. జాతికి ఆ వార్తను తొలిసారిగా రేడియో త్వరితంగా అందించగలిగింది.
1995 మార్చి ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 98 లక్షల రేడియో సెట్టులు వున్నట్లు ఒక అంచనా.