ఎదుటివాని భావమును చెడుదనియే అనుకొనుచుండును.

791. ఎంత అజ్ఞాని అయినా ఇతరులతో నేను జ్ఞానిననే చెప్పుకొనుచుండును. అదే విధముగా ఎంత ధనికుడైన ఇతరులతో నేను బీదవాడినేనని చెప్పుకొనుచుండును.

792. సమాజసేవ అని కొందరనుచుందురు. సమాజమంటే ఏమిటో తనకు తెలిసినది సమాజమో కాదో మొదట ఆలోచించుకోవాలి.

793. మనిషికి బయట సమాజమని లోపలి సమాజమని రెండు సమాజములు కలవు. ఒకటి నీకవసరము, రెండవది నీకనవసరము.

794. కన్ను తెరిస్తే దృశ్యము (వెలుగు) కన్ను మూస్తే చీకటి కన్ను వెనుకల వెలుగు చీకట్లను చూచేవాడెవడు? చూపేవాడెవడు? తెలుసా?

795. ఏ ఊరికి పోయినా నీ ఊరిలోని భూమి, గాలి ఉన్నట్లు అక్కడ కూడా అవియే కలవు. అదే విధముగా ఏ శరీరమును చేరి చూచినా ముందున్న శరీరములోనివే కలవు.

796. ఎలుక పిల్లిని చూస్తే భయపడుతుంది. పిల్లి కుక్కను చూస్తే భయపడుతుంది. కుక్క పులిని చూస్తే భయపడుతుంది. పులి మనిషిని చూస్తే భయపడుతుంది. ఇలా అందరిలోను భయము పాదుకొని ఉంది.

797. భయము పరధర్మమైన ప్రకృతిధర్మము, ధైర్యము స్వధర్మమైన పరమాత్మ ధర్మము. 798. ఆకాశానికి అంతులేదు అనుచుందుము. అకాశానికే అంతు లేనపుడు దానిని పుట్టించిన వాడు మరీ అంతులేనివాడు మరియు అంతుబట్టనివాడు.

799. "నీ ప్రాణానికి నా ప్రాణమిస్తా" అంటారు. కానీ అలా ఎవరికైనా సాధ్యమవుతుందా? నీ ప్రాణము నిజానికి నీదేనా? నీదికాని దానిని ఎలా యివ్వగలవు? అందువలన మాట అనినా ఎవరూ ప్రాణము ఇవ్వలేక పోతున్నారు.

800. శీలము పోయిందంటారు. శీలము అంటే ఏమిటో తెలుసా? శీలము నీవు ఉంచుకున్నది కాదు, ఎవరైన తీసుకొంటే పోయేది కాదు. అది నీ తలలోనిది.

801. పోలీసులు లాఠీలతో దొంగను భయపెట్టవచ్చును. కానీ వాని తలలోని బుద్ధిని మార్చలేరు. చేతితో చేయలేనిదానిని నోటితో చేయవచ్చునని పెద్దలన్నారు. కావున పోలీసులు లాఠీలను వదలి మాటలతోనే చెప్పాలి.

802. దొంగలు మాటలతో వినరు. వారికి కావలసినవి లాఠీల దెబ్బలేనని కొందరు అనుకోవచ్చును. కానీ అది సరియైన పద్ధతి కాదు.

803. మాటలు మంత్రములాంటివి. ఏ మంత్రము ఏ రోగమునకు తెలియకపోతే మంత్రము వృధాఅగును. అలాగే దొంగకు కావలసిన మాటలు చెప్పకపోతే చెప్పిన మాటలు వృధాఅగును. వాడు మారడు.

804. ప్రతిమాట మంత్రమేనని యోగి వేమన కూడ అన్నాడు. దొంగతనమను రోగమును నయముచేయుటకు తగిన మాటలనే ఉపయోగించాలి. 805. దేనికి ఏ మంత్రము ఉపయోగించాలో మాంత్రికునికే తెలుసు. అలాగే ఎవరికి ఏ జ్ఞానపు మాటలు చెప్పాలో గురువుకే తెలుసు.

806. ఏ పోలీసుకైన గురువుంటే మంచిది. గురువువలన లభించిన జ్ఞానము వలన కరడుకట్టిన నేరస్తుడినైన మార్చవచ్చును.

807. నీవు గురువు వలన జ్ఞానము పొంది, దానివలన నీ జీవితములో ఒక్కడినైన మార్చగలిగితే నీ జీవితమునకు సార్థకత చేకూర్చినట్లే.

808. జ్యోతివలన కటికచీకటైనా పోతుంది. జ్ఞానము వలన కటిక మూర్ఖుడైనా మారగలడు.

809. దీపము అప్పుడు ఎదురుగావున్న వస్తువులోని అందమును తన వెలుగు ద్వారా తెలియచేస్తుంది. అలాగే జ్ఞానము అప్పుడు ఎదురైన సమస్యలోని సత్యమును తన వివరముద్వారా తెలియజేస్తుంది.

810. హారములో దారము దాగివుంది. శరీరములో ఆత్మ దాగివుంది. హారములోని దారమును స్థూలముగా వెదికితే కనిపిస్తుంది. అలాగే శరీరములోని ఆత్మను సూక్ష్మముగా వెదికితే కనిపిస్తుంది.

811. దేవుడు భూమివిూదకి భగవంతునిగా వస్తే ఎవరు గుర్తించలేరు. అయినా గుర్తించుటకు అవకాశము సూక్ష్మముగ వున్నవారికే ఎక్కువగలదు. తర్వాత జ్ఞానులకు గలదు.

812. పాము తనలావుకంటే పదింతలు పెద్దయిన జంతువునైన సులభముగ మ్రింగును. అలాగే మాయ పది సంవత్సరముల జ్ఞాన అనుభవము కల్గినవారినైన సులభముగ తనలో కలుపుకొనును. 813. దేవుడిలో కలిసిపోవాలనుకున్న నీవు ఎవరిలో కలుస్తున్నావో చూచుకో. దేవునిలోనికి ఐక్యము కావడానికి ముందే మాయలో ఐక్యమగు అవకాశము ఎక్కువ కలదు జాగ్రత్త!

814. జీవుడు రవ్వంత! ఆత్మ శరీరమంతా!! పరమాత్మ బ్రహ్మాండమంతా!!! మాయ గుణమంత కలదు.

815. గుణ అనగా హెచ్చింపు. సందర్భమునుబట్టి అవసరమును బట్టి మాయ తన్నుతాను హెచ్చించుకొని ఎంత ఎక్కువగానైన పెరుగగలదు.

816. తన్నుతాను ఎంతైనా హెచ్చించుకొనును కాబట్టి మాయను "గుణ" అని అంటాము. "గుణ" అనునది 12 విధములుగా ఉన్నది. అందువలన మనిషికి 12 గుణములున్నవని అంటున్నాము.

817. మ్రొక్కేవాడుంటే ఎవడైన స్వామి, గురువు అవుతాడు కానీ ఎవరు మ్రొక్కాలి? ఎవరు మ్రొక్కించుకోవాలి? అని తెలియని స్వావిూజీలు భూమి విూద ఉన్నారు.

818. భూమివిూద కదలని వృక్షములని, కదిలే వృక్షములని రెండు రకములు కలవు. కదలని వృక్షమునకు కాయలున్నట్లే, కదిలే వృక్షమునకు కూడ కాయలు కలవు. కదలని వృక్షమునకు ఒకే జాతి ఒకే రకము కాయలు కాస్తే, కదిలెడి వృక్షమునకు అనేక జాతుల అనేక రకముల కాయలు కాస్తున్నవి.

819. కదలని వృక్షమైన వేపచెట్టుకు ఒకే పేరుగల వేపకాయలే కాయును. అవి అన్నీ చేదుగా ఒకే రుచి కల్గియుండును. కదిలెడి వృక్షమైన మనిషికి వేరువేరు పేర్లుగల కాయలు కాస్తున్నాయి. ఒక కాయపేరు గుండెకాయ అయితే, మరొక కాయపేరు తలకాయ!

820. దేశ పరిధిలోని రాజ్యాంగమును తెలుపునది చట్టము. శరీర పరిధిలోని యంత్రాంగమును తెలుపునది ధర్మము.

821. నాస్తికులను శరీరము విూద గుడ్డలులేని పిచ్చివారిగా పోల్చ వచ్చును. హేతువాదులను అప్పుడప్పుడు ఎవరివద్దనైన గుడ్డలులేని వేశ్యలుగా పోల్చవచ్చును. ఆస్తికులను భర్తను వదలి ఎవరికి తెలియక ఇతరులతో కూడు కులటలుగా పోల్చవచ్చును. ఆత్మవాదులను తన భర్తతో మాత్రమే కాపురము చేయు పతివ్రతలుగా పోల్చవచ్చును.

822. కన్న తండ్రివలన ధనమును హక్కుగ పొందవచ్చును. కానీ అది నీ మరణములో నీవెంటరాదు. గురువువలన జ్ఞానధనమును హక్కుగ పొందవచ్చును. అది చావులో నీతోపాటు వచ్చును.

అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.