ద్వితీయాశ్వాసము
క. |
శ్రీరామామణినిత్యవి
హారోచితలలితఘనభుజాంతరనవశం
పారుచిరకలితసుస్థిర
నీరదవర్ణప్రకాశ నీలాద్రీశా!
| 1
|
నాయకోత్కర్షము
వ. |
దేవా! నాయకోత్కర్షణాదివర్ణనంబులు విన్నవించెద నవ
ధరింపుము.
| 2
|
శ్రీనాథుఁడు – నైషధము [1-46]
సీ. |
తపనీయదండైకధవళాతపత్రితో
ద్దండతేజఃకీర్తిమండలుండు
నిర్మలనిజకథానిమిషకల్లోలినీ
క్షాళితాఖిలజగత్కల్మషుండు
వితతనవద్వయద్వీపనానాజయ
శ్రీవధూటీసమాశ్లిష్టభుజుఁడు
నిఖిలవిద్యానటీనృత్తరంగస్థలా
యతనాయమానజిహ్వా[1]స్థలుండు
|
|
తే. |
ప్రస్తుతింపంగఁ [దగు] సముద్భటకఠోర
చటులగుణటంక్రియా2 [2]స్తనితఘోష
చాపనీరదభవశరాసారశమిత
బలవదహి[తతేజో]దవానలుఁడు నలుఁడు.
| 3
|
పెదపాటి యెఱ్ఱాప్రెగడ - కుమారనైషధము
సీ. |
లావణ్యరేఖావిలాసలీలాకళా
శాసితసూనశరాసనుండు
కుంభినీవహనవిజృభదోస్స్తంభసం
భావితాశాంతదంతావళుండు
దా[రాక్ష]దానాంబుధౌతయాచకజాల
దుర్దమదు[ర్వ్యధా]కర్దముండు
నీహారసురవాహినీహారనారద
శారదనీరదస్వచ్ఛయశుఁడు
|
|
తే. |
వినుతి సే[యం]గఁ దగు [యుద్ధ][3]విజయ[4]లటహ
పటహనిర్గుణనిర్ఘాతపటలచటుల
ఘోరనిర్ఘోషవినమితకుమతవిమత
కులకరన్యస్తవిస్తృతానలుఁడు నలుఁడు.
| 4
|
సీ. |
శాత్రవభుజగభుజంగమశాత్రవ
శాత్రవనృపబలసాగరముల
రిపుపద్మవనపద్మరిపు[5]రిపుప్రళయధా
త్రీనాథపురవరత్రిపురములను
విద్విష్టగిరిగిరివిద్విష్టవిద్విష్ట
మండలాధీశభూమండలముల
వైరికైరవవనవైరికైరవవన[వైరి]
వైరిభూపాలకాంతారములను
|
|
ఆ. |
బొం గణంపఁ ద్రుంపఁ బొరిమార్ప గాల్ప నౌ
ర్వానలుండు, నలుండు, వృషాంకబాణ
పటుతరానలుండు ప్రళయానలుండు ద
వానలుండు ధరణి నా నలుండు.
| 5
|
[వాసిరాజు రామయ్య – బృహన్నారదీయము][6]
సీ. |
విశ్వంభరాచక్రవిజయలక్ష్మీఘన
స్తన[7]పరీరంభదోస్స్తంభయుతుఁడు
బాడబానలశిఖా[8]భంగిభానుప్రభా
ద్యోతమానప్రతాపోజ్జ్వలుండు
కుండలీశాధీశగురుపద్మసంభవ
స్ఫుటశేముషీకళాభూషణుండు
సురసింధుశరదభ్రశుభ్రాభ్రకాదభ్ర
విభ్రమస్థిరయశోవిశ్రుతుండు
|
|
తే. |
విపులకోదండనిర్ముక్తవిశిఖనివహ
దారుణోదగ్రదహనదందహ్యమాన
సమదశాత్రవరాజన్యచటులవిపిన
సముదయుండు భగీరథక్ష్మావరుండు.
| 6
|
చిరుమూరి [9]గంగరాజు - కుశలవోపాఖ్యానము
సీ. |
పదపద్మరజమునఁ బాషాణపుత్త్రికఁ
బూఁబోణిఁ జేసిన పుణ్యుఁ డితఁడు
బాలుఁడై హరధనుర్భంగంబు సీతకు
నుంకువ సేయు నిశ్శంకుఁ డితఁడు
మణిమయంబై యున్న మాయాకురంగంబుఁ
గడఁగి చంపిన వేటకాఁ డితండు
కట్టాణిముత్యంబు కైవడి మున్నీరు
బాణాగ్రమున నిల్పు [10]ప్రౌఢుఁ డితఁడు
|
|
తే. |
ప్రబలదశకంఠపటుకంఠనిబిడవిపిన
దహనకీలాయమానదోర్దండచండ
చటులకోదండనిర్ముక్తశరనికాయుఁ
డితఁడు కాకుత్స్థవంశాబ్ధిహిమకరుండు.
| 7
|
తులసి బసవయ్య – సావిత్రికథ
సీ. |
తనశాతహేతి మత్తవిరోధిశుద్ధాంత
దుర్దాంతహృద[11]యాగ్నిధూమరేఖ
తనకీర్తి హుతవహస్తంభశంభుకిరీటి
[12]తక్షుల్లమల్లికాస్తబకపంక్తి
తననిరర్గళదానధార పంకజభవాం
డోదంచితా[13]వరణోద[14]కంబు
తనభుజంబు పయోనిధానవేష్ఠితవిశ్వ
వసుమతిధేనుకావైణకంబు
|
|
తే. |
గాఁగ విలసిల్లు సకలదిక్చక్రవాళ
భరితతేజో[15]నివహబృహద్భానుదళిత
చండభానుండు సంతతాఖండవిభవ
శాలి యగు నశ్వసేనభూపాలవరుఁడు.
| 8
|
[16]సంకుసాల సింగన్న - కవికర్ణరసాయనము [1-27]
సీ. |
తనభూభరణదక్షతకు మెచ్చి ఫణిరాజు
చులుకన యగు వేయితలలు నూపఁ
దనఖడ్గపుత్త్రి శాత్రవుల నచ్చరలను
జిన్నిబొమ్మలపెండ్లి చేసి యాడఁ
దనమూర్తి సుందరతాగర్వవతు[లైన
|
|
|
సతులమానసములఁ] బ్రతిఫలింపఁ
దనకీర్తి వల్లికాతతుల కాశావధి
కుంభిదంతముల [17]వే గొనలు గాఁగఁ
|
|
తే. |
బ్రస్తుతికి నెక్కె సతతధారాళనైజ
దానచిరవాసనావాసితప్రపంచ
రంజనైకమహారాజకుం[జరంబు
విశ్వభూభర్త]యై యువనాశ్వవిభుఁడు.
| 9
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-87]
సీ. |
విశ్వసన్నుతశాశ్వతైశ్వర్యపర్యాయ
కుటిలకుండలిరాజకుండలుండు
దిగిభశుండాదండదీర్ఘ[18]బాహాదండ
మాని[తాఖిలమహీమండలుం]డు
జనసన్నుతానన్యసామాన్యవైభవ
శ్లాఘాకలితపాకశాసనుండు
కులశిలోచ్చయసానుకోణస్థలన్యస్త
[19]శస్తవిక్రమజయశాసనుండు
|
|
తే. |
భాసమానమనీషాంబుజాననుండు
[సకలదేశావనీపాలమకు]టనూత్న
రత్నరారజ్యదంఘ్రినీరజయుగుండు
శంబరారాతి[20]నిభుఁడు దుష్యంతవిభుఁడు.
| 10
|
సీ. |
ప్రకటప్రతాపాతపముచేత వైరుల
కన్నులఁ జీకట్లు గ్రమ్మఁజేసి
[ఖడ్గహాలాహల]గరిమచే నహితుల
నమృతాశనులు గాఁగ నలవరించి
సలలితసత్కీర్తిచంద్రికఁ బగతుర
మనసుల దాహంబు మట్టుకొల్పి
సముదగ్రధారాళశరవృష్టి విమతుల
తనువులఁ జమ[టలు దలము కొ]ల్పి
|
|
తే. |
చిత్రచారిత్రవిక్రమశ్రీ వహించి
సాహసాంకమహీపాలచక్రవర్తి
|
|
|
జలధివలయితవసుమతీచక్రవహన
చండభుజదండకలితుఁడై యుండునంత.
| 11
|
మాదయగారి మల్లన - రాజశేఖరచరిత్ర [1-54]
సీ. |
[శ్రీసతీ]సీమంతసిందూర[వేదిక]
కపటారికాసారగంధకరటి
గంభీరగుణకథాకలశపాథోరాశి
సాతత్య[21]సత్యవిశ్రమణసీమ
[22]సకలబాంధవ[23]కలాపికలాపనీరదం
బుది[తాఘ]ధరణి[భడద్భిదురపాణి]
నిజకీర్తివల్లరీనీరంధ్రదిగ్వీథి
కవికుటుంబత్రాణకల్పశాఖి
|
|
తే. |
సజ్జనానూనకరుణారస[24]ప్రవర్తి
భూజనాత్యంతసంస్తుత్యపుణ్యమూర్తి
కామినీలోకహృద్వశీకరణపుష్ప
ధన్వుఁ డన నొప్పు [నా హోమధ]న్వనృపతి.
| 12
|
తిక్కనసోమయాజి – విరాటపర్వము [2-204]
సీ. |
తొడరిన హరునైన దోర్బలంబునఁ దన్ను
మిగులఁగనీఁ డను మేటిమాట
యమరేంద్రు నర్ధా[25]సనమునకునైన
నర్హుడెంతయును[నను రూఢిమాట]
జమునిల్లు సొచ్చిన జంతువునైనను
కాచు నెమ్మె[యి]నను రాచమాట
దనుఁ గోరి యూర్వశి తాన వచ్చిననైన
లోలుండు గాఁడను మేలిమాట
|
|
తే. |
శౌర్యవైభవప్రాభవశౌచములకు
నొరులకైనఁ గైవారమై యుల్లసిల్లు
నొక్కరుని కివియెల్లను నిక్కమట్టె
యెందుఁ గలుగునె యర్జును నీఁడు వాఁడు.
| 13
|
నన్నయభట్టు – సభాపర్వము [1-18]
మ. |
మదమాతంగతురంగకాంచనలసన్మాణిక్యగాణిక్యసం
పద లో[లిం గొనివ]చ్చి యిచ్చి ముదమొప్పం గాంచి సేవించి ర
|
|
|
య్యుదయాస్తాచలసేతుశీతనగమధ్యోర్వీపతుల్ సంతతా
భ్యుదయున్ ధర్మజుఁ దత్సభాస్థితు జగత్పూర్ణప్రతాపోదయున్.
| 14
|
చిమ్మపూడి - అమ[రేశ్వరుఁడు] - విక్రమసేనము
మ. |
కులశైలంబులలో సువర్ణగిరి దిక్కుంభీంద్రవర్గంబులో
బలభిన్నాగము లోకపాలకులలోఁ బర్జన్యుఁ డుగ్రోరగం
బులలో శేషుఁడు పెంపుఁ గన్నకరణిన్ బూ[జ్యాధి]పశ్రేణిలో
వెలసెన్ విక్రమసేనభూవిభుఁడు దోర్వీర్యప్రతాపంబునన్.
| 15
|
భైరవుఁడు - శ్రీరంగమహత్త్వము [4-277]
ఉ. |
భూజనదృక్చకోరపరిపూర్ణసుధాంశుఁడు కీర్తిచంద్రికా
రాజితలో[కుఁ డా]నతధరాతలనాథకిరీటరత్ననీ
రాజితపాదపీఠుఁ డరిరాజకులాచలవజ్రపాణిపం
కేజహితాన్వయాగ్రణి సుకీర్తినరేంద్రుఁడు సమ్మదంబునన్.
| 16
|
తిక్కనసోమయాజి [విజయసేనము]
సీ. |
అరిమానసంబులు దరికొని యేఁచు నె
వ్వని యుజ్జ్వలాకారవైభవములు
బుధుల లజ్జానతిఁ బొందునట్లుగఁ జేయు
నెవ్వని పాండిత్య మెసకమెసఁగ
[26]నే వదాన్యులనైన యెవ్వని వితరణం
బులు వంది[జనుల] చాపల మొనర్చు
వనితాజనము మానధనముఁ గోల్పుచ్చు వి
చ్చలవిడి నెవ్వాని విలసనంబు
|
|
ఆ. |
అట్టి విజయసేను నభిరామమూర్తి వి
ద్యానిరూఢమతి వదాన్యపరుఁడు
మధురవిభ్రమైకనిధి యను జగమెల్ల
నతఁడు చిత్రగుణసమగ్రుఁ డగుట.
| 17
|
[27]సంకుసాల సింగన - కవికర్ణరసాయనము [2-57]
సీ. |
సర్వసర్వంసహాజనము నర్థార్థిగా
కర్థి నర్థించు సమర్థమయ్యె
పాతాళమున [నుండు] ఫణికచ్ఛపాదులు
భార మేమియు లేని బ్రతుకుఁ గనిరి
ఖచరలోకంబునఁ గ్రతుభుగ్జనంబులు
దృప్తిమైఁ గఱ్ఱునఁ ద్రేపఁ గనిరి
|
|
|
త్రిజగతిసంతతాతిథియైన కలహాశి
నయనంబు లాకఁటిభయము మఱఁచె
|
|
తే. |
దానగుణశాలి భూసముద్ధరణదక్షుఁ
డనిశమఖదీక్షితుండు మత్తారిహరణ
విహృతినిరతుండు యువనాశ్వవిభుసుతుండు
ఘనుఁడు మాంధాత నృపుడైన కాలమునను.
| 18
|
సభావర్ణన
తులసి బసవయ్య – సావిత్రికథ
సీ. |
సకలదిగ్దేశరాజన్యహారప్రభా
జాలంబు ఫేనపుంజంబు గాఁగఁ
జంచలలోచనాజనకరాంచలచల
చ్చామరోత్కర మూర్మిచయము గాఁగఁ
సముచితరత్నాసనము లంతరాకీర్ణ
బహుళభూధరకదంబములు గాఁగఁ
బరనృపాలార్చితబాలాజనంబుల
మెఱుఁగుఁజూపులు గండుమీలు గాఁగఁ
|
|
తే. |
వందిసంస్తుతు లుద్గీతధ్వనులు గాఁగ
జయరమాకాంత కుధ్భవస్థాన మగుచు
నంచితాజ్ఞామహావేల నంబురాశి
మహిమఁ జెలువొందు నాస్థానమండపమున.
| 19
|
సీ. |
సకలభాషాకావ్యసత్కవిరాజులు
నుభయపార్శ్వంబుల నుల్లసిల్ల
సంగీతవిద్యాప్రసంగపారంగత
గాయకేంద్రులు సమ్ముఖమున మెఱయఁ
జరమభాగమునందుఁ జామరగ్రాహిణీ
కంకణఝణఝణత్కార మెసఁగఁ
బద[28]పీఠిచెంగటఁ బ్రణతరాజకిరీట
నవరత్ననీరాజనములు నిగుడ
|
|
తే. |
సహజకరుణాకటాక్షవీక్షణ విశేష
దీపితాశేషధనకృతార్థీకృతార్థ
కలితచాటుసుధాపూర్ణకర్ణుఁ డగుచు
నిండువేడుకతోఁ గొలు వుండునపుడు.
| 20
|
సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము [5-3]
సీ. |
కంకణఝణఝణత్కారసంకులముగా
సుందరీజనము వీచోపు లిడఁగ
నర్హసంగతి నంతరాంతరంబుల మంత్రి
సామంతహితవీరసమితి గొల్వ
వివిధప్రధానాదివిజయాదినిజగుణ
ప్రకరంబు ప్రౌఢపాఠకులు సదువ
స్వమహితైశ్వర్యానువాదరూపంబుగాఁ
జేయెత్తి విబుధు లాశీర్వదింప
|
|
తే. |
వేత్రధరనిష్ఠురోక్తివైచిత్రు లెసఁగ
నంగ[29]చోళకళింగవంగాదివివిధ
సకలదేశాధిపతులు దర్శనము పడయ
నిండు కొలువుండె మాంధాతృనృపవరుండు.
| 21
|
సీ. |
ప్రాకారములయందుఁ బటుగోపురములందుఁ
ధామ[రమ్యద్వార]సీమలందు
విపణిగృహంబుల వెలయు నాయుధహస్త
భటులను హితులుగాఁ బ్రౌఢి నిల్పి
రక్షితం బొనరించి రాజబింబద్యుతుల్
మించికాయుచునున్న మంచివేళ
మహిమ నాప్త[30]బుధైకమధ్యస్థలమునందుఁ
జెలఁగి రత్నాసనాసీనుఁ డగుచు
|
|
ఆ. |
నర్తకేళి[లాస్య]నటనాగతులచేత
శాస్త్రసమ్మతముగ జనులకెల్ల
వేడ్క సూపి మఘవవిభవుఁడై కొలువుండ
వలయు విభుఁడు నిఖిలకళలు నెఱిఁగి.
| 22
|
నృత్యమునకు
మ. |
అడుగుల్ ముప్పదియాఱిటన్ వెడలుపై హస్తత్రిషట్కంబుచే
నిడుపై యున్నతమై సమస్థలమునై [31]నిర్మోకహస్తాంకమై
మృడుమిత్రబ్ధివులొందు(?) వాకిలొకటై మించన్ గవాక్షంబు లిం
పడరన్ శాలను రాజు షడ్విధము నాట్యం బట్లు సేయించుటన్.
| 23
|
సీ. |
[మొదలఁ] బుష్పాంజలి ముదమునఁ గావించి
[32]కరబాళి మొగబాళి సరవు లెత్తి
యురుపృథ[33]బాళము లొగిఁ బిల్ల మురువును
హస్తప్రకరణము [34]లనువు [35]పఱిచి
కడకట్టు శబ్దంబు కడఁగి దర్వును జిందు
బాగైన గీతప్రబంధములును
కుండలిబహురూపదండలాస్యవిలాస
దేశిమార్గంబుల తెరువు లెఱిఁగి
|
|
తే. |
నయము బిఱుసును నరిగతుల్ కడిఁది గాను
తిరువు మురువును నిలుకడ తిన్న నగుచు
పాత్రఁ గొనిపించఁ గొనఁగను బ్రౌఢియైన
వాఁడె నటుఁ డనఁబరఁగు నీవసుధయందు.
| 24
|
నూతనకవి సూరయ – ధనాభిరామము
చ. |
ఇరువదియాఱువీక్షణము లెన్నగ నాలుగువక్త్రచేష్ట లిం
పరుదుగ నేడు భ్రూనటన [లాపయి] నాలుగుదోర్విలాసముల్
సరసతఁ జూపి హంసవృషసామజవాయసశుద్ధసంగతుల్
పరువడి ముట్ట నిల్పి సితపంకజలోచన పాడుచుండఁగన్.
| 25
|
సీ. |
శృంగార మింపార నంగవల్లికయందు
గీతసామగ్రి యంగీకరించి
కరతలామలకంబుగాఁ గరాంబుజముల
నర్థ మాద్యంతంబు నభినయించి
భావింప నరుదైన భావమర్మంబులు
మెఱుఁగుఁజూపులలోన మేళవించి
|
|
|
తానమానములలోఁ దాళనిర్ణయలీలఁ
జరణపల్లవముల సంగ్రహించి
|
|
తే. |
యఖిలమును మెచ్చఁ బ్రత్యక్షమైన యట్టి
నాట్యవిద్యాధిదేవత నాఁ దనర్చి
భరతశాస్త్రమర్మజ్ఞతాప్రౌఢి మెఱసె
యూర్వశీకాంత వేల్పుఁబేరోలగమున.
| 26
|
తే. |
అపుడు తానావసానంబునందు మధ్య
కీలితంబయి [మొప్పెఁ] గెంగేలు వలికి
నలియవుగదా యటంచు నా నడిమితీఁగ
నుపచరింపఁగ వచ్చినదో యనంగ.
| 27
|
చదలువాడ యెఱ్ఱాప్రెగడ - నరసింహపురాణము [2-83]
సీ. |
అమృతంపుసోనపై నడరిన ట్లేపాట
చెన్నున మోళ్ళును చిగురు లొత్తి
మారుతాహతిపేర మ్రాకులు దలయూఁపఁ
దొడఁగె [36]సంగీతమాధుర్యమునకు
నింపులగని యైన యీరాగరసము దీఁ
గలఁకు గోరకపులకల నొసంగె
సెలయేఱు లన నశ్రుజలముల దొరగించె
గిరులు[37]ను మంజులగీతిఁ గరఁగె
|
|
ఆ. |
ననినఁ బోలుఁ బొసగు నగుఁ దగు ననఁగ న
చేతనంబు లెల్లఁ జిత్రరూపు
లట్లు [సొ]గిసె నిలువ నంగన యొక్కతె
పాడెఁ గలమనోజ్ఞభంగు లలర.
| 28
|
చరికొండ ధర్మయ్య - చిత్రభారతము [3-34]
సీ. |
తనభూషణంబులఁ దనరెడి మాణిక్య
గణము నొక్కుమ్మడిఁ గరఁగి పాఱ
నీరసాకృతిఁ బొల్చు నిష్ఠురస్థాణువుల్
భాసురలీలఁ గ్రొమ్మోసు లెత్త
నా[38]సమీపంబున నల్లల్లఁ జరియించు
మృగపక్షిజాతంబు మేఁత లుడుగఁ
|
|
|
జైతన్య మొంది వస్త్రంబులఁ గనుపట్టు
చిత్రరూపంబులు శిరము లూఁప
|
|
తే. |
నొళవు చిగురింప దివ్యపయోజనేత్ర
గ్రామములు మూఁడు [39]నిఖిలమూర్ఛనల తెఱఁగు
మంద్రమధ్యమ[40]తారక్రమంబు మెఱయఁ
బాడె రెండవశారదభంగిఁ బొంగి.
| 29
|
[41]సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము [5-87]
ఉ. |
పట్టిన హస్తకాంతి మును పల్లవితంబగు వీణె పాటచేఁ
బుట్టు చిగుళ్ళ రెట్టి యగు పొల్పు వహింప మొగంబు తావికిన్
జుట్టిన తేంట్లకున్ శ్రుతులు సూప సుధారసధార[42]పాలికం
[43]బట్టి మృదుస్వరం బెసఁగఁ బాడె నొకర్తు మనోజ్ఞభంగులన్.
| 30
|
జయతరాజు ముమ్మయ – విష్ణుకథానిధానము
సీ. |
రాగంబు[44]లను శుద్ధరాగ[45]సాళగరాగ
సంకీర్ణరాగముల్ చక్కఁ దీర్చి
స్త్రీపున్నపుంసకరూపంబు లనువాని
వేళలు మైత్రియు వెలయఁ జూపి
తాన ప్రపంచవిస్తారంబు [46]మెఱయుచోఁ
గ్రొత్తతానంబులు గొసరి కొసరి
స్వరమూర్ఛనాగ్రామజాతిశ్రుతుల లక్ష
ణములకు నపుడు లక్ష్యములుగ
|
|
తే. |
+ + + + లొదవంగఁ దగిన శుద్ధ
దేశమార్గములను రాణఁ దేట పడఁగ
సకలమోహన[47]సంగీతచతురుఁ డగుచు
వేణుగానంబు ప్రకటించె విశ్వగురుఁడు.
| 31
|
మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [3-167]
శా. |
డాకేల న్నిజకన్యకామణుల కంఠశ్రేణి గీలించి వీ
క్షాకంజాతము లాత్మపాదశిఖరేఖం దాల్చి సంగీతవి
ద్యాకౌశల్యము గానరా మదికి నాహ్లాదంబు సంధిల్ల [గౌ
రీకల్యాణము పాడి] రప్పుడు పురంధ్రీరత్నముల్ వేడుకన్.
| 32
|
సాహిత్యము
సీ. |
[48]ఊరక మూయక యుబ్బసం బందక
వెఱవక దేహంబు విఱుచు కొనక
నిడుచన వెట్టక నిద్దొట + + + +
[త]రవాయి దప్పక తడవికొనక
యక్షరాస్పష్టత [49]యతిగీతనష్టత
కాకుండ నర్థంబు గానఁబడఁగ
ఆ యా రసమ్మున కనురూపముగఁ బెక్కు
రాగముల్ ఫణుతులు బాగు పుట్టఁ
|
|
తే. |
జెఱకు కొననుం + + + + వు దోఁప
నంతకంతకు [వేడుక] లతిశయిల్లఁ
జదువుకొన్నారు వీరల చదువుఁ బోలఁ
జదువు లేదని పొగడిరి సభికవరులు.
| 33
|
చ. |
వెనుకకుఁ బోక [50]యీ యనక వేసట నొందక పంక్తి [పంక్తికిన్
బెను]పక కానమిన్ బ్రమసి బెగ్గిల కెంతయు మున్న చూచుచున్
కనుఁగొని యక్షరాక్షరము కందువ దప్పక యేకచిత్తుఁడై
యనుపమభక్తితోఁ జదువు నాతని వాచకుఁ డండ్రు [51]సజ్జనుల్.
| 34
|
జక్కన - సాహసాంకము [2-118]
సీ. |
బ్రహ్మాయురస్తు విప్రప్రసాదో౽స్తు క
ల్యాణపరంపరావాప్తిరస్తు
దేవేంద్రభోగో౽స్తు దిగ్విజయో౽స్తు సు
[52]స్థిరకీర్తిరస్తు వాక్సిద్ధిరస్తు
సౌభాగ్యమ + + + + సమున్నతిరస్తు
సంగరవిజయో౽స్తు సౌఖ్యమస్తు
వస్తువాహనసంపదస్తు చింతితమనో
రథసిద్ధిరస్తు సామ్రాజ్యమస్తు
|
|
తే. |
సప్తసాగరపరివృతసకలభూమి
మండలైకాధిపత్యసమాగమో౽స్తు
పుత్త్రపౌత్త్రాభివృద్ధివిస్ఫూర్తిరస్తు
మంగళాని భవంతు తే మనుజనాథ!
| 35
|
మాదయగారి మల్లయ – రాజశేఖరచరిత
సీ. |
శుభమస్తు వైభవప్రభుగుణసంభవ
శ్లాఘాపరాభూతశక్ర! నీకు
భద్రమస్తు సముద్రముద్రితక్ష్మాభార
భరణకద్రూసుతప్రౌఢ! నీకు
విజయో౽స్తు నిష్ఠురనిజభుజాసముదగ్ర
విక్రమక్రమకళావిజయ! నీకు
కల్యాణమస్తు సత్కవిరాజసంకల్ప
కల్పనా[53]కల్పనాకల్ప నీకు
|
|
తే. |
నాయురస్తు తుషారనీహారహార
ధాళధళ్యప్రధామలధవళకీర్తి
సాంద్రచంద్రాంతపక్లాంతశత్రురాజ!
విరహిణీలోకహృదయారవింద నీకు.
| 36
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [3-17]
సీ. |
స్వస్త్యస్తు శశివంశజలధికౌస్తుభరత్న
శ్రీరస్తు సమర[నిర్జితసపత్న
దీర్ఘా]యురస్తు పృథ్వీజనస్తుత[శీల
కల్యాణ]మస్తు విక్రమవిశాల
ఐశ్వర్యమస్తు ధర్మానోకహస్కంధ
సమధికోన్నతిరస్తు సత్యసంధ
సౌభాగ్యమస్తు సజ్జనచూతవనచైత్ర
విశ్వతోవిజయో౽స్తు విమతజైత్ర
|
|
తే. |
భూవినుతకీర్తిరస్తు సత్పుత్త్రపౌత్త్ర
సంపదభివృద్ధిరస్తు విశ్వప్రశస్త
శక్రవిభవో౽స్తు పూరువంశప్రదీప
జగతి[54]భవత శ్చిరాయ దుష్యంతభూప!
| 37
|
ప్రౌఢకవిమల్లన – రుక్మాంగద చరిత్ర [1-81]
సీ. |
ఆరోగ్యమస్తు దీర్ఘాయురస్తు యశో౽స్తు
శ్రీరస్తు సంకల్పసిద్ధిరస్తు
హరిభక్తిరస్తు సుస్థిరతాస్తు మహిమాస్తు
విప్రప్రసాదో౽స్తు విక్రమో౽స్తు
విఖ్యాతిరస్తు [దిగ్విజయో౽స్తు సామ్రాజ్య]
|
|
|
మస్తు మోదో౽స్తు కల్యాణమస్తు
విభవో౽స్తు [55]సస్యాభివృద్ధిరస్తు నమో౽స్తు
దానలీలాస్తు సత్కాంతిరస్తు
|
|
తే. |
ధనకనకవస్తువాహనధాన్య[పుత్త్ర
పౌత్త్ర]లాభో౽స్తు నిత్యసౌభాగ్యమస్తు
ప్రతిభటౌఘక్షయో౽స్తు భూపాలనైక
శక్తిరస్తు సదైవ తే జనవరేణ్య!
| 38
|
పెద్దపాటి యెఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
శ్రీసిద్ధిరస్తు శాసితవైరిమండల
విజయో౭స్తు భువనైకవీరవర్య!
అభ్యుదయో౭స్తు సాహసబలసామగ్ర్య!
కల్యాణమస్తు నిష్కలుషహృదయ!
శుభమస్తు కారుణ్యవిభవసముజ్జ్వల!
బ్రహ్మాయురస్తు భూపాలతిలక!
యభివృద్ధిరస్తు మహౌదార్యభూషణ!
చిరకీర్తిరస్తు భాసుర[56]గుణాఢ్య!
|
|
తే. |
తుష్టిరస్తు నిజాంకనిర్ధూతకలుష!
[57]పుష్టిరస్తు జగత్త్రయీపూరచరిత!
భద్రమస్తు మహీభారభరణ! నీకు
నధికతేజో౭స్తు తే నిషధరాజ!
| 39
|
నీరాజనము
ప్రౌఢకవి మల్లన – రుక్మాంగదచరితము [4-11]
సీ. |
పద్మరాగనవీనపాత్రికాప్రభలకుఁ
గరనఖద్యు[తులు] శృంగార మొసఁగఁ
దిన్ననై విలసిల్లు దీపదీప్తులకును
గలికి కన్నుల డాలు చెలు వొనర్ప
ఘనసారవర్తికాకలితగంధమునకుఁ
దనుసౌరభంబు మోదంబు సేయ
మధురమంగళగీతమహితనాదములకుఁ
గలకంకణధ్వనుల్ గరిమ యిడఁగ
|
|
తే. |
మెఱుగుఁ జెక్కుల కాంతులు నెఱయఁ బర్వి
వజ్రతాటంకరుచులకు వన్నె వెట్ట
వారిజానన లపుడు నివ్వాళు లొసఁగి
రమ్మహీపాలునకుఁ బ్రయత్నమ్ము లలర.
| 40
|
మల్లికార్జునభట్టు - బాలకాండ [712]
చ. |
నలి నెదురేఁగుదెంచి యెలనాగలు దాఁచిన కక్షదీధితుల్
వెలువడఁ బయ్యెదల్ వెడల వీఁకఁ గుచంబులు నిక్క దీపికా
కళికలు నోష్ఠరాగములు కాంతుల నీనఁగ లేఁతకౌనుదీఁ
గలు వణకాడ బాహులతికల్ నిగుడించి [58]నివాళు లియ్యఁగన్.
| 41
|
ముక్కు తిమ్మయ్య – పారిజాతము [2-13]
క. |
కలికి [59]నిడువాలుఁ గన్నుల
తళుకులు మణిదీపశిఖలుఁ దడబడ లక్ష్మీ
నిలయున కిచ్చిరి కొందఱు
నెలఁతలు మౌక్తికవిచిత్రనీరాజనముల్.
| 42
|
ఉ. |
హారతు లిచ్చు వే + యిన నారికి[?] రాయనిఁ గన్నతండ్రి కొ
య్యారి మెఱుంగుఁ జూపులనె హారతు లిచ్చె నొకర్తు తజ్ఝణా
త్కారకరద్వయీవలయకాంతులు గుత్తపుఁ జన్నుదోయి తా
హారగళంచలన్నలు + జాలత నెంతకురయన్ భాకాంతిమై[?].
| 43
|
ఛప్పన్నదేశాలు
తులసి బసవయ్య - సావిత్రికథ
సీ. |
సౌవీర మగధ కోసల భోసల పుళింద
[60]లాట కేరళ మహాఘోట [61]భోట
సాముద్ర [62]పౌండ్ర ఘూర్జర కుంత లావంతి
పాండ్య గాంధార నేపాళ గౌళ
కర్ణాటక కురు కేకయ వత్స మత్స్యాంగ
బంగాళ సింధు కళింగ వంగ
[63]కుకురు బాహ్లీకాది కొంకణ తెంకణ
సాళ్వ కాశ్మీర పాంచాల చోళ
|
|
తే. |
శక సుధేష్ణ త్రిగర్త దశార్ణ వార్ణ
కాలు కాంభోజ దరద [64]ఖింకాణ హోణ
[65]సుంహనోత్కళ బహుధాన శూరసేన
యవన మద్ర మరుద్ర దేశాంధ్రవిభులు.
| 44
|
దుగ్గన – నాసికేతోపాఖ్యానము [2-169]
సీ. |
పాండ్య కేకయ చోళ [బర్బర పాంచాల]
బంగాళ లాట నేపాల గౌళ
గాంధార సౌవీర కాంభోజ కాశ్మీర
హేహయాభీల బాహ్లిక విదేహ
మగధ మద్ర విదర్భ మాళవ కేరళా
శ్మంతక కుంతల మత్స్య వత్స
కరహాట మరహాట కర్ణాట శకలాట
కుకుర కోసల కాశ కురు కరూశ
|
|
తే. |
[66]సుంహ్మ సౌరాష్ట్ర గుజరాష్ట్ర శూరసేన
చేది సింధు యుగంధర [67]చేకితాన
యవన బహుధాన మలయాన కాంగ వంగ
తేంక ణాంధ్ర కళింగాది దేశములకు.
| 45
|
రాజదర్శనమునకు
మద్దికాయల మల్లయ్య - రేవతీపరిణయము
సీ. |
అమృతాంశుబింబంబు నవఘళింపఁగఁజాలు
తీయని పెద [68]పెద్ద తేనె [69]పెరలు
కలశాంబునిధి తరఁగల పిల్ల లనఁజాలు
సాంద్రదీర్ఘవలక్షచామరములు
+ + + + + + + + + + + + + + +
+ + + + + + + + + + +
తారకంబుల యొప్పిదములు గాదనఁజాలు
వైణవమౌక్తికవ్రాతములును
|
|
తే. |
నాది యగు దివ్యవస్తుసంహతులు దెచ్చి
యవనమండలపతి కుపాయనము లిచ్చి
విన్నపము చేసె నిట్లని వేడ్కఁ దనదు
డెందమునఁ గందళింపఁ బుళిందవిభుఁడు.
| 46
|
ప్రౌఢకవి మల్లయ రుక్మాంగదచరిత [3-6]
సీ. |
పసిఁడిపువ్వులు పట్టుపచ్చడంబులు రేఖ
చీరలు గుజ్జరిపారువములు
చమురుకావళ్ళు రాజనపుబియ్యమ్ములు
చెఱుకుఁగోలలు కందచిరుగడములు
మినుములు పెసలు మామిడితాండ్ర టెంకాయ
యల్లంబు తమలంపుటాకుఁ గట్లు
[70]మేకపోఁతులు పండుమీను తట్టంబులు
ఖర్జూరములు తేనె కలపు పైర్లు
|
|
తే. |
[71]దోని మెకములు పందులు దుప్పి తొడలు
పనసపండ్లును బెల్లంబు పంచదార
గసగసలు సారపప్పు ద్రాక్షఫలములును
గొనుచుఁ బ్రజ లేఁగి రవనీశు కొలువునకును.
| 47
|
బమ్మెర పోతరాజు – నవమస్కంధము [333]
సీ. |
[72]కలఁగు టెల్లను మానెఁ [73]గంధు లేడింటికిఁ
జలనంబు మానె భూచక్రమునకు
జాగరూకత మానె జలజలోచనునకు
దీనభావము మానె దిక్పతులకు
మాసియుండుట మానె మార్తాండ[74]విధులకుఁ
గావిరి మానె దిగ్గగనములకు
[75]నుడిగిపోవుట మానె నుర్వీరుహంబుల
కడఁగుట మానె ద్రేతాగ్నులకును
|
|
ఆ. |
గడిఁది వ్రేఁగు మానెఁ గరిగిరికిటినాగ
కమఠములకుఁ బ్రజల కలఁక మానె
రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు
ధరణిభరణరేఖఁ దాల్చు తఱిని.
| 48
|
సీ. |
పొలతుల వాలుచూపులయంద చాంచల్య
మబలల నడుములయంద లేమి
కాంతాలకములంద కౌటిల్యసంచార
|
|
|
మతివల నడపులయంద జడిమ
ముగుదల పరిరంభములయంద పీడన
మంగనాకుచములయంద పోరు
పడతుల రతులంద బంధ[76]సద్భావంబు
సతులఁ బాయుటలంద సంజ్వరంబు
|
|
తే. |
ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు
లంద చౌర్యంబు [వల్లభు లాత్మసతుల
నాఁగి క్రొమ్ముళ్ళు పట్టులం దక్రమంబు]
రఘువరేణ్యుఁడు శాసించు రాజ్యమందు.
| 49
|
తులసి బసవయ్య – సావిత్రికథ
సీ. |
ధర్మభంగము విధూత్తంసవీరమునంద
ధర్మభంగ[ము రణస్థలు]లయంద
ఘనతమ[77]+ + + + + + మునంద
ఘనతమస్స్ఫూర్తి యామినులయంద
విక్రమోత్సేకంబు వీరయోధులయంద
విక్రమోత్సేకంబు విష్ణునంద
బలగర్వహతి గోత్రకులభంజనునియందఁ
బలగర్వహతి రా+ + + + + +
|
|
తే. |
[+ + ]చోట లేక నిష్కంటకంబు
గా మహీతల మేకచక్రముగ నేలె
రంతిదశరథనాభాగరఘుదిలీప
నయసమన్వితుఁ డశ్వసేనప్రభుండు.
| 50
|
స్త్రీవర్ణన
సీ. |
[కురులు కప్పు దనర్చి] యిరులు గ్రమ్మక యున్నె
నగవు వెన్నెల మించు నెగడెఁ గాక
చన్ను జక్కవదోయి మిన్ను వ్రాఁకక యున్నె
పయ్యెద వల యడ్డపడియెఁ గాక
కను గండుమీ లటఁ గడచిపోవక యున్నె
[చెవులను కొలఁకులఁ] జిక్కెఁ గాక
|
|
|
యాననాంబుజముల నళులు పైకొన కున్నె
మేను సంపెఁగతావిఁ బూనెఁ గాక
|
|
తే. |
[78]యొప్పు [79]కనుఁబాటు దాఁకక యున్నె రత్న
భూషణద్యుతు లొక్కటఁ బొదిలెఁ గాక
[తలఁప నచ్చెరువైన యీ]తరళనయన
యవయవశ్రీల లీల లేమని నుతింతు.
| 51
|
సీ. |
భామినీమణిమధ్యభాగంబు కృశమని
కటితటంబున [80]నిల్పె గౌరవంబు
తొయ్యలి వలిచ[న్నుదోయి కర్కశ]మని
య[డగు]ల మార్దవం బలవరించెఁ
గమలలోచన కుంతలములు వక్రములని
తనువల్లికకుఁ జక్కదనము నొసఁగెఁ
బూదీగెబోణి చూపులు [చంచలము లని
మె]లపు నెన్నడవున మేళవించె
|
|
తే. |
నబల నఖములు క్రూరము లని తలంచి
సౌమనస్యంబు గుణమున సంతరించి
నీరజాననుఁ డెంతకు నేరఁడంచు
[జగము గొనియా]డ నొప్పు నా చిగురుబోడి.
| 52
|
తులసి బసవయ్య – సావిత్రికథ
సీ. |
వదనాంబుజంబుపై వ్రాలిన మదభృంగ
జాలంబు ల[బల]నీలాలకములు
రదనముక్తాఫలప్రకరంబు దాఁ[చిన
పవడంపునునుగ్రో]వి పడఁతి మోవి
యౌవనాంభఃప్రవాహములోనఁ దేలెడు
జక్కవకవ కాంత చన్నుదోయి
నతనాభికూపసంగతయైన నవజల
ద్రోణి పల్లవపాణి రోమ[రాజి]
|
|
తే. |
+ + + + + + [రా] మణికి నిడిన
కమ్మ పూదండ లబ్జాక్షి కరయుగంబు
చరణపద్మముల్ ముట్టం[గఁ జా]లునట్టి
కరికరంబులు నిడువాలుఁగంటి తొడలు.
| 53
|
[81]సంకుసాల సింగన – కవికర్ణరసాయనము [2-26]
సీ. |
అవనిపై నుండుగా కనఁటి కంబము లెట్టు
లనఁటి కంబములపై నవని నిలిచె?
గగనంబు గిరులపైఁ గనుపట్టుగా కెట్లు
గగనంబుపై గిరుల్ గానవచ్చె?
[జలధరంబులమీఁద] శశి యుండుఁగా కెట్లు
శశిమీఁద నున్నది జలధరంబు?
నాళంబుపైఁ గాక నలినకోశం బెట్లు
నళినకోశంబుపై నాళమున్న
|
|
తే. |
దనుచుఁ జూపరులకు విస్మయంబు గొలుపుఁ
[దొడలుఁ గటిమండలం]బును నడుముఁ జన్ను
లాననముఁ గొప్పు నాభియు నారు [82]ననఁగ
నలరె విమలాంగి నవయౌవనాగమమున.
| 54
|
సీ. |
మెట్లకుఁ దరమిడ మెయికొంట యా యింతి
కుచముల ప్రతిఁజూపఁ గోరు టెల్ల
[ఖడ్గధారాపదగ్రహణం]బు సేయుట
సుదతి యా రుపమింపఁ జూచు టెల్ల
గగనారవిందంబుఁ గనుట యా సతి మధ్య
గతనాభితో సాటి గాంచు టెల్ల
నంధకారము ద్రవ్వు టా యింతి కుంతల
ముల సాటి [వెట్టంగఁ బూను] టెల్లఁ
|
|
తే. |
జందమామకు గ్రుక్కి ళా యిందువదన
వదనసామ్యంబు సేయంగ వాంఛ సేఁత
పృథివి కడగాంచు టా రామ పిఱుఁదుతోడ
సదృశవస్తువు గనుటున్న చదరు లేల.
| 55
|
శ్రీనాథుఁడు – నైషధము (2-15)
సీ. |
జగము లొక్కుమ్మడి సాధింప నెత్తిన
రతిమన్మథుల వింఢ్లు [83]రమణి బొమలు
కాంతినిర్ఝర మీఁదు కామయౌవనముల
కుంభప్లవము లింతి కుచయుగంబు
నడిమింత యని కేలఁ దొడికిపట్టిన ధాత
యంగుళిరేఖ లబ్జాస్యవళులు
|
|
|
యువమనోమృగరాజిఁ దవిలింపఁదీర్చిన
మదనవాగుర లిందువదన కురులు
|
|
తే. |
బాల్యతారుణ్యసీమావిభాగమునకు
నజుఁడు వ్రాసిన రేఖ తన్వంగి యారు
భానువరమునఁ బడసిన పంకజముల
యపరజన్మంబు పూఁబోణి యడుగు లధిప!
| 56
|
పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
సీ. |
అమృతంబు(లోని కం)దంతయుఁ బోఁదోమి
కొని పూర్ణచంద్రుండు దలరెనేని
విధుమండలంబున విధిచేత దళవంబు (?)
గని పూవుఁదూపులు [84]గ్రాలెనేని
శృంగారరససరసీజాతులైన కో
మలమృణాళంబులు [85]పొలసె నేని
పసిఁడికుంభములకుఁ బ్రభవించి మించు జ
క్కవకవ [86]బొదలంగఁ గలిగెనేని
|
|
తే. |
మెలఁత నీమోము చెన్నువ [87]మించవచ్చు
పొలఁతి చూడ్కుల పొలపంబుఁ [88]బోలవచ్చు
నింతి మృదుబాహువుల దొరయింపవచ్చుఁ
జెలువ చనుఁగవ జిగి సరి సేయవచ్చు.
| 57
|
సీ. |
అలరెడు రెప్ప లల్లార్చిన యందాఁక
యనిమిషకన్య గాదనఁగ వశమె
అమృతంబు చిలుక మాటాడిన యందాఁక
కనకంపుఁబ్రతిమ గాదనఁగ వశమె
నడుగక యడు గెత్తి నడిచిన యందాఁక
గొనబుఁబూదీఁగె గాదనఁగ వశమె
కలికి తనూరేఖ కదిసి కన్గొనుదాఁక
ఘనవనలక్ష్మి గాదనఁగ వశమె
|
|
తే. |
యువిద సఖిమీఁద వెడ వ్రాలియున్నదాఁక
నెనరు తొలుకారు మెఱుపు గాదనఁగ వశమె
వెలఁది గుణములు సఖులచే వినినదాఁక
నంగసంభవు మాయ గాదనఁగ వశమె.
| 58
|
ఏర్చూరి సింగన – కువలయాశ్వచరిత
సీ. |
తనజన్మ మప్పులఁ దలమున్క లని రోసి
పులిన మీ పొంకంబుఁ బొందె నొక్కొ
పరికింపఁ దనపట్టు దిరుగుడు పా టని
పెన్నిధి సుడి మూర్తి బెరసె నొక్కొ
బ్రతుకెల్ల గతి బట్టబయలాయె నని చూచి
గగన మీ పుట్టువుఁ గనియె నొక్కొ
పనిలేక పాసెడి పాపంబుఁ దలపోసి
జక్కవ లీ రీతి కెక్కె నొక్కొ
|
|
ఆ. |
యనఁగ లలన జఘన మంబుజముఖి నాభి
చామ నడుము బాల చన్నుదోయి
మహితరుచుల [89]నెగడి మానవపతి కన్ను
దోయి పండువగుచుఁ [90]దోఁచె నంత.
| 59
|
ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత [3-72]
సీ. |
కందుఁ జెందని సుధాకరపూర్ణబింబము
మెఱసి పాయకయున్న మెఱుపుఁదీఁగె
పంకంబునందుఁ గీడ్పడని మృణాళముల్
కనవిచ్చి చనని జక్కవయుగంబు
వికసించి మొగుడని విమలాంబుజాతముల్
కర్కశంబులు గాని కరికరములు
చిలుక ము క్కంటిని వలఁతి బింబఫలంబు
[91]ధావళ్య మెడలని దర్పణములు
|
|
ఆ. |
ననఁగ నాననంబు నంగంబు హస్తముల్
చన్నుదోయి వాలుగన్ను లూరు
లలఁతి మోవిచెక్కు లలర నయ్యరవింద
గంధి భూమిపాలుఁ గదియ నరిగి.
| 60
|
చ. |
వనిత మొగంబు చందురుఁడు వట్రువగుబ్బలు చక్రవాకముల్
తనువు మెఱుంగు నేత్రములు దామరలున్ దడబాటు నొందు కౌ
నని యజుఁ డిందు కొక్క చపలాద్యములందును గందఁ బక్షముల్
తనురహితంబుఁ గేసరవితానముఁ గల్గగఁ జేసె నేర్పునన్.
| 61
|
పిల్లలమఱ్ఱి వీరయ్య- శాకుంతలము
మ. |
నవలావణ్యపయోధిఁజిత్త మను మంథానాద్రికిం జంద్రికా
పవనాశిం దరిత్రాఁడుగాఁ బెనఁచి [92]యబ్జాతాశుగుం డిచ్చినన్
రవళిన్ కోకిలకీరముల్ [93]దరువ నా రత్నాకరంబందు ను
ద్భవముం బొందిన లక్ష్మి గావలయు నా పద్మాక్షి వీక్షింపఁగన్.
| 62
|
నన్నెచోడఁడు – కుమారసంభవము [8-5]
మ. |
హరినీలోపమమధ్యకేశి శశిబింబాస్యోష్ఠ రాజీవకే
సరనేత్రామలగంధి విద్రుమలతాసద్వర్ణతన్వంగి సిం
ధురకుంభాలసయాన పూర్ణ[94]కుచ సంస్తుత్యా[95]రుణాబ్జాంఘ్రికం
ధర [96]శైలాత్మజ చెప్ప నొప్పదె సుధా[97]ధామార్ధచూడామణీ.
| 63
|
క. |
నెఱి గడచి నాఁడు నాఁటికి
గుఱి గడవగఁ బెరిగి జఘనకుచకచభరముల్
చిఱుతొడలు నడుము నఱ్ఱును
[98]విఱిగెడినో యనుచు గిరిజ వెఱచుచు నడచెన్.
| 64
|
క. |
వ్రాలని నీ చన్నులతో
వ్రాలెడు జక్కవలు సరియె వలలం బెట్టం
జాలెడు నీ కన్నులకును
బాలకి సదృశములె వలలఁ బడు మత్స్యంబుల్.
| 65
|
చూపఱకు
కంచిరాజు సూరయ - కన్నప్పచరిత
మ. |
తమ సౌభాగ్యము లంగసంభవుని భద్రశ్రీల సేవింపఁగాఁ
దమ దృగ్జాలము లాలతాంతశరకుంతశ్రేణిఁ బాలింపఁగాఁ
దమ వృత్తస్తనభారముల్ మరుని చిత్తస్ఫూర్తి సూచింపఁగాఁ
దమకం బారఁగఁ జేరి చూచిరి పుళింద[99]గ్రామణిన్ బ్రేముడిన్.
| 66
|
ముక్కు తిమ్మయ్య – పారిజాతము [3-14]
ఉ. |
కాళియభేదిఁ జూచు తమకంబున మజ్జనమాడి యాడి నీ
లాలక యోర్తు గంధసలిలార్ద్రకచంబులు చన్నుదోయిపై
[100]రాలిచి సందిటం బొదివి రాజపథంబున కేఁగుదెంచె గో
పాలకమూర్తిఁ గాన [101]శిఖిబర్హము కానుక దెచ్చెనో యనన్.
| 67
|
[102]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-157]
ఉ. |
అంబుజనేత్ర యోర్తు వసుధాధిపు గన్గొనుచో రసాతిరే
కంబునఁజేత మున్ను తమకంబునఁ దెచ్చిన దర్పణంబులో
బింబితమైన రాజు ప్రతిబింబము చెక్కున నొక్కి గ్రక్కునన్
జుంబన మాచరించి చెలిఁ జూచి ముఖాబ్జము వంచెఁ గ్రక్కునన్.
| 68
|
అన్యోన్యవీక్షణలు
తిక్కన సోమయాజి – విజయసేనము
సీ. |
మదనవశీ[103]కరమంత్రదేవత దృష్టి
గోచరమూర్తిఁ గైకొనియెనొక్కొ
సితకరబింబనస్సృతసుధాధార ని
తంబినీరూపంబుఁ దాల్చెనొక్కొ
విధికామిని[104]సృష్టి విజ్ఞానపరసీమ
భాసురతనులీలఁ బడసెనొక్కొ
శృంగారనవరసశ్రీవిలాసోన్నతి
సుందరాకారంబు నొందెనెక్కొ
|
|
ఆ. |
కాక యొకవధూటి కడుపునఁ బుట్టిన
భామ కేల యిట్టి రామణీయ
కంబు గలుగు ననుచుఁ గన్నియపై మహీ
పాలసుతుఁడు దృష్టి పరవె నర్థి.
| 69
|
క. |
కిసలయకదళీబిసబిం
బసుధాంశుప్రాయవస్తుబహువిధరూపో
ల్లసము ముద ముడుప నజుఁ డొక
యసమాకృతిఁ [105]దాల్చె నొ[క్కొ] యంగన గాఁగన్.
| 70
|
[బొడ్డపాటి పేర]య – శంకరవిజయము
మ. |
సమలావణ్యము వన్నెఁగూడి రసముల్ సంధించి శృంగారవే
షముతోఁ [జొక్క]పుఁజూపు నవ్వొలయ నిచ్ఛాతూలికన్ భావచి
త్రముగాఁ బంచశరుండు రాగరతిఁ జెంతల్ చూచుచున్ వ్రాసి [ప్రా]
ణము వాగీశ్వరు వేఁడి నించెనన మేనాపుత్త్రి యొప్పెన్ గడున్.
| 71
|
పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
సీ. |
నెలవంక చూడ్కి వెన్నెల గాసిన కుమారు
వీక్షణాంభోనిధి వెల్లివిరియఁ
బతి చూడ్కి తామరల్ పరువంబు నొంద తొ
య్యలి చూపుటలలు బిట్టాడుచుండ
సుదతి చూ పమృతంపుసోనయై కురిసిన
వరుదృష్టి యనిమిషత్వము వహింప
నధిపదృష్టిప్రవాహంబు పెల్లడరిన
యింతి దృఙ్మీనంబు లింత లాడ
|
|
తే. |
వరుస కౌతుకకల్లోలవలన మొలయ
రాగమకరందమత్తతఁ బ్రజ్వరిల్లు
సంచితధ్యాన మను ప్రకాశము దలిర్ప
చిఱుత సిగ్గను వలలోనఁ జిక్కుఁబడగ.
| 72
|
శా. |
గంధర్వాత్మజ రాజుఁ జూచెఁ బతియుం గాదంబరిం జూచె ద
ర్పాంధీభూతమనస్కుఁడై మరుఁడు విల్లందెన్ బ్రసూనోల్లస
ద్గంధం బొప్పఁగ [నెక్కు]వెట్టి గుణనాదం [106]బూని పుష్పాస్త్రముల్
సంధించెన్ దెగఁబాపి యేయఁదొడఁగెన్ సవ్యాపసవ్యంబుగన్.
| 73
|
దశావస్థలు
కూచిరాజు ఎఱ్ఱయ్య – కొక్కోకము
క. |
చూచుట తలఁచుట కోరుట
కాచుట కృశమౌట రుచులు గానమి సిగ్గున్
ద్రోచుట నడచుట మూర్ఛా
ప్రాచుర్యము మరణ మనగఁ బదియు నవస్థల్.
| 74
|
సీ. |
ఒంటిమోహముఁ గనుగొంట చక్షుఃప్రీతి
పలుమాఱు నది దలంపంగఁ జింత
యుడివోసి కోర్కెచే నుండుట సంకల్ప
|
|
|
మొగి గుణస్థితి నిద్ర యుడిగి పొగడ
విరహతాపంబున వేగియుండుట కార్మ్య
మరుచి యేమిటిమీఁద నాస లేమి
యెన్ని యాడెడువారి నెఱుఁగమి నిర్లజ్జ
గమనంబుఁ దనయిల్లు గడచి చనుట
|
|
తే. |
వలపు దలకెక్కి యటు తనవశము గాక
పరవశత్వంబు చే టెల్లఁ బడుట మూర్ఛ
పొందలేకున్న ప్రాణంబు వోవుననుట
మృతిగఁ జెప్పుదు రివి దశగతుల చొప్పు.
| 75
|
పెద్దిరాజు – అలంకారము [2-61]
సీ. |
ఆదియుఁ జక్షుఃప్రీతి యన నంత చిత్తసం
గంబు నా మఱియు సంకల్ప మనఁగ
నటఁ బ్రలాపం బన నౌల జాగర మన
నటమీఁద గార్శ్యసమాఖ్య మనఁగ
వెండియు విషమద్వేషం బనం ద్రపా
సంత్యక్తి నాఁగ సంజ్వర మనంగ
నున్మాద మనఁగను మూర్ఛాపగమం బన
మరణంబు నా నిట్లు మానినులకు
|
|
తే. |
ననుగతద్వాదశావస్థయై తనర్చుఁ
బదియు దశ లండ్రు కొందఱు ప్రౌఢమతులు
పరఁగు లక్షణములు నుదాహరణములును
వరుసఁ జెప్పుదుఁ దెలియంగవలయు [107]నిందు.
| 76
|
స్త్రీవిరహము
పెద్దిరాజు – అలంకారము [3-123]
క. |
అచ్చపువెన్నెలచేఁ గడు
వెచ్చుటలును [108]మాన మెడలి వెడవిల్తునిచే
నొచ్చుటలును బ్రియుం [109]డబ్బని
ముచ్చటలును విప్రలంభమునఁ జెప్పఁదగున్.
| 77
|
ఉ. |
ఎల్లిద మయ్యెఁ దాల్మి తగవెల్ల వివేకము వింత యయ్యె మి
న్నెల్లను జంద్రుఁ డయ్యె వనమెల్ల మనోభవుతూపు లయ్యె మే
|
|
|
నెల్లను సన్నమయ్యెఁ జెలులెల్ల విరోధులుగూడ నైరి భూ
వల్లభుతోడి యల్క గరువంపుఁ జలంబునఁ జూపు చోటికిన్.
| 78
|
తెనాలి రామలింగన - కందర్పకేతువిలాసము
ఉ. |
కామిని చంద్రుఁ జూచి మదిఁ గందు సరోరుహగంధి మందిరా
రామముఁ జూచి మ్రానుపడు రాజనిభానన సారె కింశుక
స్తోమముఁ జూచి యీ కఱుకు తొయ్యలి కోయిలఁ జూచి కంటగిం
పామతలీలఁ దాల్చు మదనానలతాపవిషాదవేదనన్.
| 79
|
[110]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-132]
చ. |
పొడిచిన చంద్రుఁ జూచి నృపపుంగవ వచ్చితె యంచు లేచిమై
గడు రతిఁ గేలు సాచి బిగికౌఁగిటి కందకయున్న పూనికల్
సడలి విషణ్ణయై మఱలి శయ్యపయిం బడి వెచ్చనూర్చు న
ప్పడఁతి మనోజతీవ్రశరబాధలఁ జిత్తగతుల్ భ్రమించినన్.
| 80
|
చ. |
విరులు శరంబు లయ్యెఁ [111]జలివెన్నెల యెండిన మంట యయ్యె నున్
గరువలి వజ్ర మయ్యెఁ జెలికత్తెయ యోపనిదయ్యె హస్తపం
జరముగఁ బూని పెంచు శుకశాబమునుం బగసాటిదయ్యె న
త్తరుణికిఁ బంచబాణుఁ డనుదైవము దాఁ బ్రతికూల మౌటచేన్.
| 81
|
చ. |
పులకకదంబముల్ ననిచె ఫుల్లముఖాబ్జవికాససంపదల్
తొలఁగె మరాళికాగతులు దూరము లయ్యె శ్రమాంబుపూరముల్
వెలి విరియంగఁజొచ్చెఁ బురి విచ్చి నటింపఁగ [112]నెమ్మి కోరికన్
బొలఁతుకయందు మన్మథుఁడు పూర్ణముగా శరవృష్టిఁ జూపఁగన్.
| 82
|
పోతరాజు దశమస్కంధము [పూ. భా. 1129]
మ. |
లలనా యేటికిఁ దెల్లవాఱె రవి యేలా తోఁచెఁ బూర్వాద్రిపైఁ
గలకాలంబు నహంబుగాక నిశిగాఁ గల్పింపఁ డాబ్రహ్మ దా
వలఱేఁడున్ దయలేఁడు కీరముల దుర్వారంబు లెట్లోకదే
[113]కలదే మాపటి[114]వేళయుం గలుగనే కంజాక్షుసంభోగముల్.
| 83
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [2-192]
మ. |
చెమటం జెక్కులు తొంగలింప ముఖరాజీవంబు వాడంగ సో
లమునన్ రెప్పలు వ్రాలఁ గన్నుఁగవఁ దేల న్మోవినిట్టూర్పు లం
గములం దల్పముఁ జేరుచున్ విభుని రాకల్ గోరుచున్ బ్రొద్దువే
గమికిం గుందుచు వర్ధమానవిరహగ్లాని న్మదిం గుందుచున్.
| 84
|
చిమ్మపూడి అమరేశ్వరుడు - విక్రమసేనము
సీ. |
ప్రాణంబు లెడల నభ్యాసంబు సేయు మా
ర్గంబన నిట్టూర్పు గాడ్పు లెసఁగఁ
గవ్యశాలగ నేయి గ్రమ్ము కైవడిఁ గామ
శిఖిఁ గ్రాఁగి మైదీగె చెమట వొడమ
మదను నమ్ములు నీరు పదను పెట్టిన క్రియ
వాలుఁగన్నులు బాష్పవారి మునుఁగఁ
బగ లేదుటయు నెడఁబడు రథాంగము చంద
మునఁ జన్నులు ముఖోద్గముగ వణంక
|
|
ఆ. |
ప్రాణ మెడలి నెఱవు పడి యొడలు + + +
భూషణములతోడి పొత్తు విడిచి
లాఁతులైరి సఖులు లలఁతులు వాయని
ప్రాఁతలైరి నిషధరాజసుతకు.
| 85
|
సీ. |
పరిణతఫణిలతాపత్రంబుఁ గదిసిన
చివురు నాఁ జెక్కునఁ జేయి చేర్చి
కందర్పు మదకరి కరముపై జక్కవ
వెఱఁగె నాఁ దొడఁగు చమిఱియ మోపి
దవనంబు పొరకల గవిసిన మంచు నాఁ
బలుచని చెమట మైఁ గలసి మెఱయఁ
గలువరేకులు మౌక్తికములు నీనెడిన నినాఁ
గన్నుల బాష్పంపుఁగణము లురల
|
|
తే. |
వేఁడినిట్టూర్పు గాడ్పులు విరహవహ్ని
శిఖలు ప్రబలంగ వలవంత చింత నొగిలి
యేకతంబున్న దాని రాజేంద్రతనయఁ
గనిరి లతాగృహంబులో వనజముఖులు.
| 86
|
మాదయగారి మల్లయ – రాజశేఖరచరిత్ర [3-104]
సీ. |
విరహపన్నగఫణావిహరణంబున వేఁడి
యూర్పులఁ బయ్యెద యొయ్యఁ గదల
ననురాగజలధిసంజనితఫేనచ్ఛాయ
లని [115]మేని వెలిచాయ లతిశయిల్ల
గాఢచింతాలతాకళికాకదంబకం
బన ఘర్మకణజాల మంకురింప
నురు మోహతిమిరఖద్యోతంబులనఁ గాకఁ
[116]బెట్టు కుంకుమచర్చ [117]పేటు లెగయఁ
|
|
తే. |
గుటిలకుంతల యున్న యిప్పటితెఱంగు
ప్రాణప్రదమైన మనకుఁ జెప్పంగ నేల
చాల నట్టింటి పగయైన శంబరారి
యట్టివానికి మది దయ పుట్ట[118]కున్నె.
| 87
|
పురుషవిరహము
[119]సంకుసాల సింగన - కవికర్ణరసాయనము[3-42]
సీ. |
భద్రేభకుంభసంస్ఫాలనక్రీడలఁ
దన్వంగి కుచములుఁ దలఁచి తలఁచి
కరకృపాణికసముత్కంపనక్రీడలఁ
దరళాక్షి కన్నులుఁ దలఁచి తలఁచి
ధరవైరిమణిహారధారణక్రీడలఁ
దరుణి కుంతలములుఁ దలఁచి తలఁచి
సజ్జ్యకార్ముకలతాసంగ్రహక్రీడల
లలన [120]బొమ్మల తీరుఁ దలఁచి తలఁచి
|
|
తే. |
రుచిరతరభద్రపీఠాధిరోహణములఁ
దామరసనేత్ర కటి పెంపుఁ దలఁచి తలఁచి
యవనిపతి [121]స్వపదర్థానుభవము లెల్లఁ
గన్యరూపానుభవముగాఁ గరఁగుచుండె.
| 88
|
సీ. |
గజయాన మెలఁగిన గతియైనఁ బైఁబడ
గద్దించి తర్కించి కలక నొందు
మానిని యల్గిన మాడ్కి ద్రోఁచినఁ దేర్ప
|
|
|
నుంకింప భావించి యుమ్మలించుఁ
జపలాక్షి కెమ్మోవి చవిగన్న యట్లైనఁ
జమరించి చర్చించి చిన్నవోవు
మదవతి కౌఁగిలి గదిసిన యట్లైనఁ
బులకించి దేరి సంచలత నొందు
|
|
తే. |
త[రుణి] మెఱసినఁ గోర్కులు తగులు కొలుపు
నోలిఁ దనలోన నల నరపాలసుతుఁడు
మాన మూటాడ గంభీరమహిమ సడల
లజ్జ గడివోవ ధైర్యంబు లావు దిగఁగ.
| 89
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [3-35]
సీ. |
రవులుకొల్పునొ సన్నరవలలో రాఁజెడు
కామాగ్ని దక్షిణగంధవహుఁడు
పువు [122]శింజినాదంబు చెవి నూది వెఱపింపఁ
జూచునో మరు[123]వింటి జోగితేఁటి
పరులతోడుత మాట పలుకాడకుండంగ
వాకట్టునో మంత్రవాది చిలుక
తెరువు గట్టుకొనంగ మరుని కింకరులకుఁ
గూఁతలు వెట్టునో కోకిలంబు
|
|
తే. |
భావజునిచేత [124]నొవ్వక పవనుచేతఁ
దూలపోవక యళిచేతఁ దొట్రువడక
చిలుకచేఁ దాల్మి చెడక కోకిలముచేత
గాసిగాక శకుంతలఁ గనుట లెస్స.
| 90
|
సీ. |
కుంతలంబుల పేరి కొదమతుమ్మెదలను
గ్రాలుఁగన్నుల పేరి గండుమీలఁ
జన్నుగుబ్బల పేరి చక్రవాకములను
హస్తద్వయము పేరి యబ్జములను
ద్రివళిరేఖల పేరి సవడివీచికలను
నతనాభి పేరి నెన్నడిమి సుడిని
గటిమండలము పేరి ఘనసైకతములను
గోమ[125]లాంఘ్రుల పేరి కూర్మములను
|
|
తే. |
రుచిరమైన శకుంతలరూపసరసి
నీఁదు లాడింపకుండిన నెట్లు పాయు
|
|
|
దర్పితానంగశరజాత[126]దావదహన
తప్తమన్మానసమరాళతాపభరము.
| 91
|
మాదయగారి మల్లయ రాజశేఖరచరిత [3-80]
సీ. |
బలువిడి నేతెంచి వలరాచబెబ్బులి
వాఁడి[127]తూపుల గోళ్ళ వ్రచ్చెనేని
యెలమావికొన యెక్కి పెళపెళ [128]వార్చి కో
విల పోటుఁగూఁతలు పెట్టెనేని
బడిబడిఁ గమ్మపుప్పొడి నిప్పుకలు జల్లి
వెడవెడగా గాలి నుడిసెనేని
తేనియల్ గ్రోలి మత్తిలి గండుఁదుమ్మెద
కెరలి ఝమ్మంచు ఝంకించెనేని
|
|
తే. |
బాడబజ్వాలికలతోడఁ గూడి మాడి
వచ్చి వెన్నెలతేట కార్చిచ్చు బలిసి
యిట్టలంబుగఁ బైఁ జుట్టుముట్టెనేని
పాంథు లక్కట యేరీతి బ్రతుకువారు.
| 92
|
ఉ. |
కంగిన పైఁడికుండలు వకావకలై చనఁ జేయఁజాలు చ
న్నుంగవ వ్రేఁగునం దన తనూలత యల్లన నాడఁ దేట వా
లుంగనుదోయి చూపులు తళుక్కున [నల్ల]న వచ్చినన్ దృఢా
లింగన మాచరింప కవ[129]లీఢమనోవ్యధ పాయనేర్చునే.
| 93
|
శ్రీనాథుఁడు – నైషధము [2-32]
శా. |
కాలాంతఃపురకామినీకుచతటీకస్తూరికాసౌరభ
శ్రీలుంటాకము చందనాచలతటశ్రీఖండసంవేష్టిత
వ్యాళస్ఫారఫణాకఠోరవిషనిశ్స్వాసాగ్నిపాణింధమం
బేలా నాపయి దక్షిణానిలము పక్షీ సేయు దాక్షిణ్యమున్.
| 94
|
తెనాలి రామలింగన - కందర్పకేతువిలాసము
ఉ. |
అక్కమలాక్షిఁ గన్గొనిన యప్పటినుండియు నేమి చెప్ప నా
కెక్కడఁ జూచినన్ మదనుఁ డెక్కడఁ జూచిన రోహిణీవిభుం
డెక్కడఁ జూచినన్ జిలుక లెక్కడఁ జూచినఁ గమ్మగాడ్పు లిం
కెక్కడ [130]వెట్టి యోర్వఁగల నీ విరహానలతాపవేదనన్.
| 95
|
మ. |
లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో
త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ
పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ
జలజావాసముఁ జొచ్చి యాడక మనోజాతానలం బారునే.
| 96
|
[విరహభ్రాంతి]
ఉ. |
వారిజ! మీన! కోక! యళివర్గ! సితచ్ఛద! సల్లతావనీ!
మీ రుచిరాస్య మీ నయన మీ కుచ మీ యలకాళి మీ గతిన్
మీ రమణాంగి మత్ప్రియ నమేయగతిన్ విరహాతురాననన్
మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరుఁ గానరే.
| 97
|
పెదపాటి యెఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
చ. |
అలికులమెల్ల వేణియును హంసములెల్లను మందయానముల్
జలజములెల్ల నెమ్మొగము జక్కవలెల్లను జన్నుదోయి యా
పులినములెల్లఁ బెన్ బిఱుఁదు పుష్పములెల్లను మేనివాసనల్
పొలఁతుక నాశ్రయించుకొని పోయె నవన్నియు నన్నివంకలన్.
| 98
|
సీ. |
కురులు వ్రాయుటను గొదమతుమ్మెద లయ్యెఁ
గన్నులు వ్రాయంగఁ గలువ లయ్యె
నధరంబు వ్రాసిన మధురబింబం బయ్యె
గళము వ్రాయుటయును గంబు వయ్యెఁ
జనుఁగవ వ్రాసినఁ జక్రవాకము లయ్యెఁ
జేతులు వ్రాసినఁ జిగురు లయ్యె
నడుము వ్రాయుటయును నవలతయై యొప్పెఁ
బొలుపారఁ గటి వ్రాయఁ బులిన మయ్యెఁ
|
|
ఆ. |
దరుణి తొడలు పాదతలములు వ్రాసినఁ
గరికరములు హల్లకములు నయ్యె
నేమి వ్రాయఁ దలఁచి యేమి వ్రాసితినని
మదనవిభ్రమమున మనుజవిభుఁడు.
| 99
|
శిశిరోపచారములు
[పిల్లలమఱ్ఱి పిన]వీరభద్రుఁడు – శాకుంతలము [3-41]
సీ. |
కడరేకు లొలిచిన కల్హారదళములఁ
దలగడ బిళ్ళ లందముగఁ జేర్చి
మీఁది [131]బబ్బెడ గీసి మృదువుగాఁ జేసిన
విమలమృణాళహారములు వైచి
పూఁదేనెఁ బదనిచ్చి పుప్పొడి మేదించి
కలఁగొన మేనఁ జొబ్బిలఁగ నలఁది
చలువ వెట్టిన క్రొత్త జలజపత్రంబులఁ
దోరంబుగాఁ జన్నుదోయి గప్పి
|
|
తే. |
చరణముల లేఁతచిగురు మోజాలు దొడిగి
కటిభరంబునఁ గురులెల్ల కమరుఁ జుట్టి
పొగడలను బొడ్డుమల్లెలుఁ బొన్నవిరులు
బాల నాలుగుదిక్కులఁ బడసి వైచి.
| 100
|
జక్కన – సాహసాంకము [1-139]
సీ. |
అఱుతఁ గీలించిన యాణిముత్తెపుఁబేర్లు
హరినీలహారంబులై తనర్చెఁ
దనువల్లి నంటిన ధవళచందనచర్చ
లీలఁ గాలాగరులేప మయ్యెఁ
గరమున మెత్తిన కర్పూరరేణువుల్
కస్తూరికా[132]రజఃకణము లయ్యె
సెజ్జపైఁ బఱిచిన చేమంతిఱేకులు
కలయ నిందీవరదళము లయ్యెఁ
|
|
తే. |
జిత్తజాతుండు కను మూయ సేసినాఁడొ
మన మనంబున విభ్రాంతి మట్టుకొనెనొ
కమలలోచనపరితాపగౌరవంబొ
యనుచు వెఱఁగంది మదిఁ గుంది రబ్జముఖులు.
| 101
|
మాదయగారి మల్లయ – రాజశేఖరచరిత్రము [3-110]
సీ. |
చెంగావిఁ గప్పె నెచ్చెలి యోర్తు మానంపు
రవి గ్రుంకనగు సాంధ్యరాగ మనఁగఁ
గర్పూరరజ మొకకాంత చల్లె వియోగ
|
|
|
దహనమహాకీర్తిమహిమ యనఁగఁ
గలువలు కనుఁగవ నల నొత్తె నొక్కర్తు
ప్రాణవాయువు లోని కణఁచె ననఁగ
బొడ్డుమల్లియ లొక్కపొలఁతి రాశిగఁ బోసె
నంగజభూతోపహార మనఁగ
|
|
తే. |
నబల కీరీతి శిశిరకృత్యము లొనర్ప
నంతకంతకు సంతాప మావహిల్లఁ
జెలులఁ గనుఁగొని తమలోన నలబలంబు
లుడిగి నివ్వెఱఁ గంద నం దోర్తు చూచి.
| 102
|
శ్రీనాథుఁడు – శృంగారనైషధము [2-141]
సీ. |
పద్మిని! కన్నీరు పన్నీటఁ దుడువుము
రంభాదళంబు సారంగి! వీవు
కల్పవల్లి! యొనర్చు కర్పూరతిలకంబు
చక్రవాకి! యలందు చందనంబు
వలిపెంపుఁ [133]జెంగావి వలువఁ గట్టు చకోరి!
బిసకాండహారంబు వెట్టు హరిణి!
కలకంఠి [చేర్చు] చెంగలువ యెత్తు దలాడ
కలికి! పైఁ [134]జిలికించుఁ గమ్మఁదేనె
|
|
తే. |
బాల శైవాలమంజరీజాలకంబు
లిందుమతి! యొత్తు మఱి చేతులందుఁ గదియ
నప్పళింపు మదాలస! యడుగులందుఁ
జల్లగాఁ బుండరీకకింజల్కధూళి.
| 103
|
ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
తొలి[135]తొలి కోసిన తోరంపుఁ గ్రొవ్విరు
లించువిల్తునికి మీఁ దెత్తి మ్రొక్కి
పద్మపరాగంబు భసితంబు మంత్రించి
పువ్వారుఁబోణికి బొట్టు వెట్టి
సంపంగిఱేకున సర్వంబు లిఖియించి
రాజాస్యకరమున రక్ష గట్టి
నెఱిఁ బచ్చనివి యెఱ్ఱనివియైన వొనగూర్చి
[136]బడిసి పుష్పంబుల బడిమి పోసి
|
|
తే. |
మదచకోరంపుమఱక నేమఱక ద్రిప్పి
పడఁతికిని దమ్మికప్పెర వెడలఁజేసి
|
|
|
చెలఁగి పూఁదేనియలఁ దేఁటి సిద్ధులకును
వెలఁది యెదుటను జూఱ గావించె నపుడు.
| 104
|
సీ. |
విరదమ్మిసురటుల విసరకే యెలనాగ!
యుష్ణాంశుచెలు లవి యుడుకు చల్లు
వెలఁది ముక్తాహారములు వైవకే సఖి!
యౌర్వాగ్నితోఁబుట్టు లవి యలంచు
+ + + + + + + + + + + + + +
+ + + + + + + ++ + + + + +
+ + + + + + + + + + + + + +
+ + + + + + + ++ + + + + +
|
|
తే. |
చెలఁగి పన్నీరు చల్లకే కలువకంటి!
రాహుదంష్ట్రలు సోఁకిన రాజుమేని
కనటు చేఁబ్రోది యగు నది గాదు మిగులఁ
గాన నవియెల్ల నబల నీగతికిఁ దెచ్చె.
| 105
|
[137]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-122]
సీ. |
స్వర్ణకుంభములకు వర్ణలేపము గాఁగఁ
జన్నుల కుంకుమం బలఁది యలఁది
వెడవిల్తు [138]నలుగులు [139]దొడయుటగాఁ గన్ను
వెడపక పన్నీటఁ దుడిచి తుడిచి
లేఁతతుమ్మెదలకు మేతగా విరిదమ్మి
పుప్పొడిఁ గురులపైఁ బోసి పోసి
యనుఁగుఁజుట్టములతో నాలింగనములుగాఁ
బదకరంబులఁ జిగు ళ్ళదిమి యదిమి
|
|
తే. |
కప్పురపుధూళి మేనిపై గుప్పి గుప్పి
విపులకదళీదళంబుల వీచి వీచి
విరహపరితాపవతి యైనవెలఁది కపుడు
చెలులు శిశిరోపచారముల్ సేయఁ జేయ.
| 106
|
మ. |
పటికి న్నార్చిన లీలఁ జందనము పై పైఁ బూయ నంగారక
చ్ఛటలం గాఁచు తెఱంగునం జిగురుసెజ్జన్ బొర్లఁగా నప్పట
|
|
|
ప్పటికిం జేపద నిచ్చు నట్లొడలిపైఁ బన్నీరు చల్లంగ ను
త్కటమయ్యెం బెనుకాఁక బంగరుశలాకం బోలు నబ్బాలకున్.
| 107
|
చ. |
కిసలయశయ్య డిగ్గి యొకక్రేవ శకుంతల నిల్చియుండఁ ద
త్కుసుమ మపాంగ మంటికొని క్రొత్తవిరుల్ గనుపట్టె నెంతయున్
మొసలిసిడంబువాని పువుముల్కులు నాటిన పోటుగంటులన్
రసగిలి పేరఁబడ్డ రుధిరంబుల యోడికతండమో యనన్.
| 108
|
సఖివాక్యాలు
అమరేశ్వరుఁడు – విక్రమసేనము
సీ. |
ఏపునఁ జెలరేఁగి యేయు మనోజన్ము
చెఱుకువిల్ రెండుగా విఱిచివైతుఁ
బలువలై పలుకు చిల్కల నాలుకల [ముల్లు]
విఱివి [140]యీరములతో వెడలనడఁతు
మదమున మ్రోయు తుమ్మెదలఁ జంపకలతాం
తములలో మునుగంగ[?] ముంతుఁ
దగులమై వీతెంచు దక్షిణాశాగంధ
వహు [141]మహాహీంద్రుని వాఁతఁ ద్రోతు
|
|
తే. |
నేటి కులికెదు నాయట్టిబోటి కలుగ
వెలఁది నీమనమందున వెఱవకుండు
మమ్మ ధైర్యంబు వదలకు మమ్మ యెందు
గత్తలము గల్గు మేనికిఁ గలదె బాధ?
| 109
|
సీ. |
మకరధ్వజునివిల్లు మనము వాయిని నిడి
నమ లింపుగాఁ జేయు నల్లఁజెఱకు
మదనుబాణావళి మనము క్రొమ్ముళ్ళపైఁ
బొలుపార దుఱిమెడి పుష్పచయము
మనసిజాతుని యెల్లి మనము వినోదార్థ
మై వచ్చి యాడెడి మావిచిగురు
మరుతేరిహయములు మనయిండ్లలోఁ బంజ
రంబులఁ బొరలు కీరవ్రజంబు
|
|
ఆ. |
తా ననంగుఁ డట్టివాని యలంచుట
యేమి యతని కడిమి యేమి యతని
|
|
|
బీర మేమి ధరణిఁ బిచ్చుక [142]యులివేమి
వాలఁగ (?) నేమి వాలుగంటి.
| 110
|
[143]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-109]
సీ. |
అహికులా(ధిపు) వ్రాసి మంత్రించి దక్షిణ
గంధవాహుని[144]రాకఁ గట్టు వఱతు
రాహుపూజాభిచార మ్మొనరించుచు
శశి బిట్ట బిరుగుడు చంపివైతు
నలువైన శ్రీరామనామమంత్రంబుచేఁ
గలకంఠతతుల వాకట్టి విడుతు
సంపంగి నౌషధసంప్రయోగము [145]సూపి
మొకరి తుమ్మెదపిండు మూర్ఛ వుత్తు
|
|
తే. |
ప్రాంతభూరుహముల గల పండ్లు డులిచి
త్రుళ్ళు చిలుకల నాలుక ముళ్ళు విఱుతు
పొలఁతి నాయంత నెచ్చెలి ప్రోడ గలుగ
నించు విలుతుని పగకు నీ కేల తలఁక?
| 111
|
మాదయగారి మల్లయ – రాజశేఖరచరిత [3-111]
సీ. |
చిగురుటాకుల్ కత్తు లగునేని నింతకు
డగర కోయిల నోరు దెగకయున్నె?
యలరుఁదేనియ వేఁడి యగునేని నింతకు
గండుఁదుమ్మెద ముక్కు కమలకున్నె?
యరవిరలే నిప్పు లగునేని నింతకుఁ
బూవిల్తు నఱచేయి పొక్కకున్నె?
యసదు గాలియె వెట్ట యగునేని నింతకుఁ
గమలవనంబెల్లఁ గ్రాఁగకున్నె?
|
|
తే. |
భామ! యేటికిఁ [146]జిగురు కై వాడఁ బాఱ
వనిత! యేటికిఁ దేనెకై వడియఁ బాఱ
వెలఁది! యేటికి ననలకై వెళ్ళబాఱఁ
బొలఁతి! యేటికి సురటిగాడ్పులకు వణఁక?
| 112
|
ప్రార్థనలు
[147]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము (3-117)
సీ. |
నీవిక్రమక్రీడ నిజహృదయంగమం
బై మెచ్చు శ్రీధరుం డనుఁగుఁదండ్రి
నీయాజ్ఞ నొండన నేరక ముద్రిత
వదనుఁడై వర్తించు వాగ్వరుండు
నీతూపు కోర్వక నిటలాక్షుఁ డుమతనూ
ఫలకంబు చాటునఁ బాయఁ డెపుడు
నీబిరుదోక్తిచిహ్నితజయజంగమ
స్తంభమై యున్నాఁడు జంభవైరి
|
|
తే. |
యింకఁ దక్కిన బడుగుల నెన్ననేల?
యిట్టి నీ [148]వెట్లు పసిబాల నేఁచు టెట్లు
పర్వతం బెత్తు కెంగేల బంతి యెత్తి
కడిమి నెఱపంగఁ జూచితే కాయజన్మ.
| 113
|
సీ. |
ముద్దియయెడ గల్గు మోమోట మఱచితే
కాఱించె [149]దేల రాకాశశాంక
మగువ నీ కిచ్చిన మాటప ట్టెఱుఁగవే
యించుక కృప సేయవేల చిలుక
కోమలాంగికి [150]నఱ్ఱు గుత్తికవై యుండి
కలకంఠమా! కనికరము వలదె
చెలి మోముఁదమ్మి తావులఁ గ్రోలుచుండియుఁ
గుడిచి నింటికిఁ గీడు గోరకు మఱి!
|
|
ఆ. |
కాలమెల్లఁ బగలుగా వచ్చెఁ గదె మీరు
కొమ్మ నే(చఁదగదు) కోకయుగమ
యకట సతికి నంతరంగమై యుండియు
మలయకయ్య నీవు మలయపవన.
| 114
|
ఉ. |
పత్రము పుష్పముల్ ఫలము భక్తి నొసంగెడివార మింతె యీ
మాత్రమునన్ బ్రసన్నులయి మానినిఁ గన్గొనుఁడయ్య మీకృపా
|
|
|
పాత్రము గాఁగ నంచుఁ దగుభంగిఁ బికంబులఁ దేంట్లఁ జిల్కలన్
బత్రము పుష్పముల్ ఫల ముపాయన మిచ్చి భజించి నెచ్చెలుల్.
| 115
|
[పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని] శాకుంతలము [3-188]
మ. |
జననం బొందితి దుగ్ధవారినిధి నాసర్వేశుజూటంబుపై
జనుచే ప్రొద్దుఁ బ్రశంస సేయ నవతంసం బైతి నీప్రాభవం
బునకుం బాంథజనాపకారి యగు నాపూవిల్తునిం గూడి వా
రని దుష్కీర్తిగఁ దిట్టునం బడకు చంద్రా! రోహిణీవల్లభా!
| 116
|
శ్రీనాథుఁడు – నైషధము [2-129]
మ. |
అవతంసంబవు పార్వతీపతికి దుగ్ధాంభోధికిం గూర్మిప
ట్టివి బృందారకధేనుకల్పతరువాటికౌస్తుభశ్రీసుధా
సవదిగ్వారణసోదరుండవు జగచ్ఛ్లాఘ్యుండ వీ విట్టినీ
కవునే [151]ధర్మువు శోచ్యపాంథజనసంహారంబు తారాధిపా.
| 117
|
తులసి బసవయ్య – సావిత్రికథ
చ. |
పనివడి పాకశాసను నెపంబునఁ బంకజసంభవుండు నీ
తనువుఁ దొఱంగఁజేసె నతిదారుణశాంభవరోషవహ్నిచే
మనమున నాటి యాగ్రహము మానక నీవును సంఘటించి తా
ఘనుని శిరంబుఁ ద్రుంచు తమకం బితరుల్ [తెలి]యంగ [152]శక్తులే.
| 118
|
ఉ. |
శ్రీలలనాతనూభవవిశేషజగజ్జయమూలమన్మథా
జ్ఞాలతికాలవాలరతినాథకరాళమదాంధగంధశుం
డాలవిలోలబాహువిలుఠత్కరవాలవిశాలమందవా
తూలమదీయకాంతధృతి తూలఁగ నేఁపున వీవకుండుమీ.
| 119
|
భావన పెమ్మన - అనిరుద్ధచరిత్ర
సీ. |
కుసుమకోదండుండు గుణవంతుఁ డగుటెల్ల
యళులార! మీప్రాపు కలిమిఁ గాదె
మరుని యెక్కుడు పెంపు మహిమీఁదఁ జెప్పుట
కీరంబులార! మీపేరఁ గాదె
సంకల్పజన్ముండు సత్ప్రాణుఁ డగుటెల్ల
మలయానిలంబ! నీమహిమఁ గాదె
|
|
|
మీనకేతనుకీర్తి మిన్నందు కొనుటెల్ల
శీతమయూఖ! నీచెలిమిఁ గాదె
|
|
తే. |
బాలఁ గారింపఁ దగదని పలుకఁ దగదె
యేడుగడయును మీరె [153]కా కెంత దవ్వు
మాకుఁ బుష్పాస్త్రుఁ డంచు ననేక[154]నుతుల
మధుపశుకమందపవమానవిధులఁ దలఁచి.
| 120
|
దూషణలు
సీ. |
ధూర్జటికోపాగ్ని ధూళిగాఁ గ్రాఁగిన
నాఁ డేల నీయమ్ము వాఁడి లేదు
వాఁడికోఱల రాహు వడిఁదోలి కఱచిన
నాఁ డేల నీరశ్మి వేఁడి లేదు
శాపంబు శ్రీరామభూపాలుఁ డిచ్చిన
నాఁ డేల కూయరో పోఁడిగాను
చనుపకముల కర్గి కనుకని డుల్లిన
నాఁ డేల మ్రోయరో నేఁడు మీరు
|
|
ఆ. |
మగువఁ బాయు టెఱిఁగి మగఁటిమి వాటించి
యేయఁ గాయఁ గూయ మ్రోయ నగునె?
మదన! చంద్ర! పికమ! కొదమతుమ్మెదలార!
నాఁడు నాఁడు నాఁడు నాఁడు లేరె?
| 121
|
[155]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము
ఉ. |
పైకొని వచ్చె దేల నినుఁ బాము దినం జలిగాలి! ప్రార్ధనల్
గైకొన వేల చంద్ర! నిను గా మడువన్ మెలఁ పేది ప్రేలెదో
కోకిల యేటి కిట్లు? నినుఁ [156]గొర్త బడం దరళాక్షి సేయు నీ
పాకము దప్పవేల నిను భస్మముగా వలరాజ యిత్తఱిన్.
| 122
|
నెల్లూరి ముత్తరాజు - పద్మావతీకల్యాణము
క. |
నీ వెంత వేడుకొన్నను
గేవలపాతకుల కేల కృప పుట్టదు మదిన్
[157]దేవుఁడు నహి గురువు న్నహి
భావజచంద్రులకు వికచపద్మదళాక్షీ.
| 123
|
మన్మథదూషణ
శ్రీనాథుఁడు – నైషధము [2-138]
సీ. |
భువనమోహనసముద్భవమైన యఘమున
నశరీరభూతంబవైతి మదన!
విరహమాలిన్యదుర్విధుఁ గాని సోకవు
కలిదోషమవె నీవు కాయజుండ
ప్రాల్గల రతిదేవి భాగ్యసంపదఁ గదా
ప్రసవసాయక! చచ్చి బ్రతికి తీవు
చాలదా యేలెదు సకలప్రపంచంబు
పంచత్వ మొందియుఁ బంచబాణ!
|
|
తే. |
తమ్మిపూఁజూలి నీయాగ్రహ మ్మెఱింగి
లోక మవ్యాకులతఁ బొందుఁగాక యనుచుఁ
దక్కుఁగల కైదువులు మాని దర్పకుండు
విరులు నీ కాయుధములు గావించినాఁడు.
| 124
|
చంద్రదూషణ
[శ్రీనాథుని శృంగార]నైషధము [2-128]
సీ. |
జన్మకాలమునందు జలరాశికుక్షిలోఁ
దరికొండ పొరిపోవఁ దాఁకెనేని
గ్రహణవేళలయందు రాహు వాహారించి
తృప్తిమై గఱ్ఱునఁ ద్రేఁచెనేని
విషమనేత్రుఁడు చేతి విష మారగించుచోఁ
బ్రతిపాకముగఁ జేసి త్రాగెనేని
నపరపక్షము పేరి యపమృత్యుదేవత
యొకమాఱుగా నామ ముడిపెనేని
|
|
తే. |
కుంభసంభవుఁ డబ్ధితోఁ గూడఁ గ్రోలి
తజ్జలముతోడ వెడలింపఁ దలఁపఁడేని
విరహిజను లింత పడుదురే వీనిచేత?
నక్కటా దైవ మటు సేయఁదయ్యెఁ గాక.
| 125
|
మాదయగారి మల్లయ్య – రాజశేఖరచరిత [3-149]
సీ. |
కఱచు[కొంచును] ద్రావఁగాఁ గాచియున్నారు
సురలు నీ యెమ్మెలు స్రుక్కనేల?
క్షయము నానాఁటి కగ్గలముగా నిఁకనొత్తి
వచ్చు నీ జాడలు వదలవేల?
పెనుపాఁప పగవాఁడు పెడతల గండఁడై
యుండ నీ మదవృత్తి నుడుగవేల?
యదియునుగాక మేనంతయు గాలి ప
ట్టుక రాఁదొణంగె నీ వికృతియేల?
|
|
తే. |
యదిరిపాటుగ నుదధిలో నౌర్వవహ్ని
నెపుడు పడియెదవో కాని యెఱుఁగరాదు
చెప్పినట్టులు వచ్చునే సితమయూఖ
యేల త్రుళ్ళెద? విది యేమి మేలు నీకు.
| 126
|
ఉ. |
రాహువఁ గాను ని న్నఱగ రాచిన శూరుఁడఁ గాను నీ తను
ద్రోహము చేసినట్టి యల రోహిణితండ్రిని గాను దజ్జగ
న్మోహిని నీలనీలకచ ముద్దుల చక్కెరబొమ్మఁ గూర్పక
య్యో! హరిణాంక! తావకమయూఖముఖంబుల నేఁచనేటికిన్.
| 127
|
తులసి బసవయ్య – సావిత్రి హరికథ[?]
చ. |
కరుణ దలిర్ప నిన్ గుటిలుఁగా మదిఁ జూడక జూటకోటిలో
నిరుపమలీలఁ జేర్చుకొని నెమ్మది నున్న పురారిఁ బాండురు
గ్భరితశరీరుఁ జేసితివి కంతుని వైరముఁ బట్టి యక్కటా
సరసిజవైరి! యీ విసపుజాతికిఁ బాంథవధంబు పెద్దయే.
| 128
|
[158]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-140]
సీ. |
పు ట్టండ్రు కొందఱు పుట్టయే మఱి వృద్ధిఁ
బొందకుండఁగ హాని పుట్టవలదె?
వట మండ్రు కొందఱు వటమేని నూడలు
వాఱి మండలమెల్లఁ బ్రబలవలదె?
మృగ మంద్రు కొందఱు మృగమేని నుండక
మృదురాంకురముల మేయవలదె?
శశ మండ్రు కొందఱు శశమేని దేవతా
పథికు లీ యిరువు మాపంగవలదె?
|
|
తే. |
వీనిలో నొక్క టెద్దియేనైన నంక
ముండియును జెడకున్న వాఁ డువిద వీఁడు
ధర్మపరు హేతువునఁ గీఁడు దాఁకుఁ గాని
పాపవరుఁ దాఁకదనియెడి పలుకు నిజము.
| 129
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [3-185]
సీ. |
భద్రకాళిభర్త పదతలాహతి బల్లి
పర వోలె [159]నెపమారఁ బ్రామడయ్యె
దక్షశాపజమైన యా క్షయావ్యాధి ని
ర్జీవిగా గాసిలఁ జేయదయ్యె
నమృత మెల్లను ద్రాగి యంకసారంగంబు
బింబమెల్లను నిండఁ బెరుఁగదయ్యె
నాచార్యుఁ డనక భార్యకుఁ దప్పినప్పుడు
పొడుగర నీ రంకు పొడవదయ్యె
|
|
తే. |
ప్రథమకళ యారగించెడి పావకుండు
మీఁగడయుఁ బోలెఁ గడిచేసి మ్రింగడయ్యె
నేల యిటుసేయఁ బాంథుల ఫాలవీథి
వనజగర్భుఁడు వ్రాసిన వ్రాఁతఫలము.
| 130
|
క. |
లోకము విరహులకును శశి
భీకరుఁ డగు టరుదె? సురలు పీఁకుక తినఁగా
నాకాశపిండమై తిరి
గే కుటిలాత్మునకు నేడ కృప మదిఁ దలఁపన్.
| 131
|
వివాహమునకు
పెద్దిరాజు అలంకారము [3-127]
క. |
ప్రచురస్వయంవరోచిత
రచనలుఁ గన్యావరాభిరమ్యక్రియలున్
[160]విచితశుభాత్మకవిధులున్
రుచిరవివాహమ్ములందు రూపింపఁదగున్.
| 132
|
ఉ. |
సంతతమంగళధ్వనులు చామరమౌక్తికపుండరీకముల్
వింత విభూతిగా గురుకవిస్తుతివేళ వరించెఁ [161]బొంత సా
మంతుల నుజ్జగించి కడు మక్కువ నెచ్చెలులైన నీతివి
క్రాంతులు చూపఁగోరి జయకన్యక వచ్చి చళుక్యవల్లభున్.
| 133
|
[162]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-187]
క. |
అంగజవికారవశమున
నంగుళములు వణఁక వణఁక నప్పుడు భూభృ
త్పుంగవుఁడు పెద్ద తడవున
మంగళసూత్రంబు గట్టె మానిని యఱుతన్.
| 134
|
చ. |
ఎగయుచునున్న జక్కవల నేలు చనుంగవ వ్రేఁగునన్ దెగెన్
దెగెననఁ గౌను సాగి కొన నిక్కి [163]బయల్పడు బాహుమూలముల్
ధగధగమంచు నిండు జిగిదట్టపుఁ బైడి వసంతమాడఁగా
మగని శిరంబుపై నునిచె మానిని [164]వే తలబ్రాలు దోయిటన్.
| 135
|
సీ. |
తఱి వేచి యొండొరు మొఱఁగి కన్గొను నానఁ
దారలు కడకంటఁ జేరి మెలఁగఁ
బార్శ్వదృష్టికిఁ గానఁబడు నంతయంతన
నంతయుఁ గనుటగా నాత్మ లలర
హోమధూమంబుల కొఱగు పేరిటఁ జూడ
కైన నొండొరు మోము లభిముఖముగ
స్పర్శ లేకున్న నాసన్నపార్శ్వంబులు
పెరపార్శ్వములకంటెఁ బ్రియము గాఁగ
|
|
ఆ. |
హోమవేదియందు నొక్కపీఠంబున
నొప్పి రపుడు కన్నెయును వరుండు
కంతుఁ డిరువు రందుఁ గల కూర్ము లొక్కింత
చూచి కట్లె వైచి తూచికొనఁగ.
| 136
|
అంగర బసవయ్య - ఇందుమతీపరిణయము
సీ. |
లాజవిమోక్షవేళాసముద్గతహోమ
ధూమవాసన మేనఁ దొంగలింప
|
|
|
మృగనాభిమకరికారేఖలై మృదుగండ
మండలి హోమధూమములు నిలువ
హోమధూమశిఖాముఖోష్ణంబు సోఁకి పూ
ర్ణేందుబింబాననం బెఱ్ఱవాఱ
మాటికి హోమధూమంబుచే వెడలెడు
కన్నీటఁ గాటుక కరఁగి పాఱ
|
|
తే. |
గురుజనోక్తవిధానానుకూల బాల
నిజవివాహవిలాసంబు నిర్వహించె
భోజుఁ డప్పుడు వేడుక బుధకవివిత
తానములతోడ నార్ద్రాక్షతములు చల్లె.
| 137
|
బొడ్డపాటి పేరయ్య - పద్మినీవల్లభము
ఉ. |
పాయక కన్నె నాథుతలఁ బ్రాలిడఁ బూన్చిన యాణిముత్తెముల్
దోయిటఁ బద్మరాగమణులో యన నించుక యెత్తిచూచుచో
ఛాయల నింద్రనీలముల ఛాయలుగాఁ బతిమౌళి మీఁదటన్
బోయఁగఁ బూవుమొగ్గలనఁ బొల్చె విచిత్రవిలాసవైఖరిన్.
| 138
|
జక్కన – సాహసాంకము [4-182]
సీ. |
పసిడికుండల మించు పాలిండ్ల నునుమించు
కరమూలముల కాంతిఁ గౌఁగిలింపఁ
గరమూలముల కాంతి కడలెత్తి యందంద
కేయూరదీప్తులుఁ గీలుకొనఁగఁ
గేయూరదీప్తుల గిరికొని నెరసుతోఁ
గంకణద్యుతిమీఁదఁ గాలుద్రవ్వఁ
గంకణద్యుతి సోయగము మీఱఁ బలుమాఱు
రత్నాంగుళీయక ప్రభలఁ జెనకఁ
|
|
తే. |
దన మెఱుంగారు కెంగేలుఁ దమ్ము లెత్తి
ప్రాణవిభుమౌళిపైఁ దలఁబ్రాలు వోయు
నపుడు కాంత మైఁ బులకము లంకురించి
కోరకితమల్లికా[165]వల్లి కొమరుఁ దాల్చె.
| 139
|
శ్రీనాథుఁడు – నైషధము [6-102]
ఉ. |
కంకణనిక్వణంబు మొగకట్టఁగఁ గౌ నసియాడ రత్నతా
టంకవిభూషణంబులు వడంకఁ గుచంబులు రాయిడింపఁగాఁ
|
|
|
బంకజనేత్ర గౌతముని పంపున లాజలు దోయిలించి ధూ
మాంకునియందు వ్రేల్చె దరహాసము ఱెప్పలలోనఁ దాఁచుచున్.
| 140
|
పతివ్రతాలక్షణము
సీ. |
వనరుహానన మనోవాక్కాయకంబుల
ధవుని దైవము గాఁగఁ దలపవలయుఁ
బ్రత్యుత్తరం బీక పని యేమి చెప్పినఁ
జెవిఁ జేర్చి వేగంబె సేయవలయుఁ
బ్రతివాసరమును శోభనశిక్షకై నిల
యంబు గోమయమున నలుకవలయు
నత్తమామల[166]తోడ నాప్తభృత్యులయెడ
మాయాప్రచారంబు మానవలయు
|
|
తే. |
నెపుడు ననుఁ జూచునో నాథుఁ డిచ్ఛయించి
యనుచు నిర్మలమైన దేహంబు దనర
బెనిమిటికి నిష్టమైన భోజనపదార్ధ
చయము కడుభక్తితోఁ దాన సలుపవలయు.
| 141
|
ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత్ర [4-81]
సీ. |
తలఁపులో నాత్మేశు దైవంబు మాఱుగాఁ
దరళాక్షి యనురక్తిఁ దలఁపవలయు
విభుఁడు చెప్పినమాట వేదమంత్రంబుగా
నెలఁత నెమ్మనమున నిలుపవలయు
నధిపతి నియమించినది నిజవ్రతముగా
జలరుహాయతనేత్ర సలుపవలయుఁ
జెలువుఁ డాదరణ నిచ్చిన పదార్థము పది
వేలుగా నాత్మ భావింపవలయు
|
|
తే. |
వలయుఁ బ్రియమునఁ బెనిమిటి వంకవారి
ప్రాణబంధులుగాఁ జూడ భామినులకు
వలవ దధిపతి పగవారివలన మైత్రి
చేయ రా దెన్నఁడు వికచరాజీవముఖికి.
| 142
|
శ్రీనాథుఁడు – కాశీఖండము [2-73]
మ. |
పసుపుంగుంకుమకజ్జలంబులును గూర్పాసంబు తాంబూలమున్
గుసుమంబుల్ గబరీభరంబు చెవియాకుల్ మంగళాలంకృతుల్
విసు పొక్కింతయు లేక తాల్పవలయున్ వీనిన్ సదాకాలమున్
ససిఁ జక్కంగఁ బ్రియుండు వర్ధిలుటకై నాళీకపత్రాక్షికిన్.
| 143
|
పిల్లలమఱ్ఱి వీరయ – శాకుంతలము [4-81]
చ. |
తెఱవకు వల్లభుండు పరదేశము వోయిన వన్నె మాని తా
నఱితికి నల్లఁబూసలును నచ్చత బొట్టును మట్టి వన్నెగా
గుఱుమణుగైన పుట్టమును గూడఁగ దువ్వని మైలకొప్పునై
మఱువడి యింటిలోఁ బతిసమాగమనంబు మతింపుటొప్పగున్.
| 144
|
ఘటకాశి మల్లుభట్టు - జలపాలిమాహత్మ్యము
సీ. |
అత్రిమునీశ్వరుం డడవి కేఁగినవేళ
హరిహరబ్రహ్మలు ధరకు వచ్చి
యనసూయవర్తనం బరయఁ దలంచి వా
రతిథులై యాహార మడిగినంత
నవుగాక యని వేగ యన్నపానాదులు
వడ్డింపఁదలఁచుచో వారి కోర్కె
తప్పకుండఁ బతివ్రతాప్రభావంబున
నకళంక యగుచు బాలకులఁ జేసి
|
|
తే. |
యంబరము లూడ్చి సకలపదార్థములను
పాత్రములఁ బెట్టి తొంటి రూపము లొనర్చి
సంతతం బంది తత్తదంశముల సుతుల
వరము లందెను నది పతివ్రతల మహిమ.
| 145
|
అభ్యంగనము
ముక్కు తిమ్మయ్య – పారిజాతము [2-9]
ఉ. |
కంపనలీలమై నసదుఁగౌ నసియాడఁ గుచద్వయంబు న
ర్తింప లలాటరేఖ చెమరింపఁగ హారలతాగుళుచ్ఛముల్
తుంపెసలాడఁ గంకణమృదుధ్వని తాళగతిం జెలంగఁగా
సంపెఁగనూనె యంటె నొకచంద్రనిభానన కంసవైరికిన్.
| 146
|
మ. |
కొనగోరుల్ దలసోఁకఁ జన్నులమెఱుంగుల్ దిక్కులం [167]బర్వ న
ల్లన వేఁ గౌను వడంకఁ గంకణము లుల్లాసంబుగా మ్రోయ న
|
|
|
క్కునఁ బేరుల్ విరులై పెనంగొన బెడంగున్ జూపు లాడింపుచున్
జననాథాగ్రణి కంటె నొక్కతె తలన్ సంపెంగతైలంబుతోన్.
| 147
|
సీ. |
కీలుఁగం పెడలింపఁ గేదంగిపూఁదావి
పుంభావ[168]వాంఛలు గుబులుకొనఁగఁ
నఱచెయ్యి నడువెత్తి నాడింప బహువిధ
గంధ[169]కదంబముల్ [170]గజిబిజింపఁ
బదనిచ్చి నుదురొత్తఁ బచ్చికస్తురిబొట్టు
బిగివిడి తొడలపైఁ బెట్లి వ్రాలఁ
గేసరి గోళ్ళను గెరలిన జవ్వాది
తట్టుపున్గులచేతఁ దావు లెసఁగ
|
|
తే. |
నాతి చన్నులపొంగున నడుము వణఁక
నధివు వాతెర తెల్లనా కందుకొనుచుఁ
బసిఁడిగిన్నియలోని సంపంగినూనె
వనిత తలయంటె తనప్రాణవల్లభునకు.
| 148
|
ముక్కు తిమ్మయ – పారిజాతము [2-10]
ఉ. |
తామరదోయిలోఁ దగిలి దాఁటెడు తేఁటులఁ బోలఁ బెన్నెఱుల్
వేమఱు చేతులం [171]బిడిచి విప్పి విదిర్చి నఖాంకురంబులన్
గోమలలీల దువ్వి తెలిగొజ్జఁగినీ రెడఁజల్లి చల్లి గం
ధామలకంబు వెట్టె నొకయంగన కాళియనాగభేదికిన్.
| 149
|
చరికొండ ధర్మయ – చిత్రభారతము [4-5]
చ. |
ఒకచపలాక్షి యొయ్యన నృపోత్తము నౌదలపైఁ దనర్చు నా
చికురభరంబు పాపిటలు సేసి మనోహరచందనంపుటం
టకలి యిడెం గరంబులు దడంబడ రాచుచు రత్నకంకణ
ప్రకరముఁ గుండలంబులును రాపడి మ్రోయఁగఁ దూఁగియాడఁగన్.
| 150
|
ముక్కు తిమ్మయ – పారిజాతము [2-11]
మ. |
చెలువల్ గొందఱు హేమకుంభములతోఁ జేసే నొసంగన్ విని
ర్మలదోర్మూలరుచుల్ వెలిం [172]బొలియఁ దోరంబైన చన్దోయి సం
దొలయ న్వేనలి జాఱ నిక్కి యరమే నొయ్యారమై వ్రాలఁగా
జలకం బార్చె లతాంగి యోర్తు యదువంశస్వామికి న్వేడుకన్.
| 151
|
చరికొండ ధర్మయ – చిత్రభారతము [4-6]
ఉ. |
కొందరు కామినీమణులు గొజ్జఁగినీరు సువర్ణకుంభరా
జిం దగముంచి చేరి యభిషేకము చేసిరి మోము లప్పుడం
దందఁ జెమర్పఁ జన్ను లొరయం గరమూలరుచుల్ దిశావళిన్
[173]జిందఁగ వింతసంభ్రమముచేఁ బదనూపురకోటి మ్రోయగన్.
| 152
|
సూపకారుని వర్ణన
ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
పులు [174]సొఱ్ఱ చేఁదు నుప్పును దీపు నొగరును
గణుతింపఁ బానాధికములు గాక
చిముడంగఁ బాఱక చిక్కనై యిగురక
కాటువోవక మఱి కలఁతవడక
యుడికియు నుడుకకయుండి [175]నీ ర్కర్క్రమ్మక
పసరు వేయక పరిపాటి చెడక
సంబారములతోడి సంబంధ మెడలక
[176]పొగపువాసన [177]విరి వోటు గాక
|
|
తే. |
వింతలై జిహ్వకును రుచుల్ విస్తరిల్లఁ
దగు పదార్థంబు వెడనెడఁ దాము తామ
భోక్తలకు భోజనాసక్తిఁ బొడమఁ జేయ
నిండువేడుకఁ గూరలు వండనేర్తు.
| 153
|
తిక్కన సోమయాజి – విరాటపర్వము [1-77]
ఉ. |
ఆఱురసంబులం జవులయందలి క్రొత్తలు వుట్ట నిచ్చలున్
వేఱొకభంగిఁ బాకములు విన్ననువొప్పఁగఁ జేసి చేసినన్
మీఱఁగ బానసీని నొకనిం బురిఁ గాననియట్లుగాఁగ మే
న్గాఱియవెట్టియైన నొడికంబుగ వండుదు నన్నికూరలున్.
| 154
|
విషనిర్విషాలకు
ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
తంగేడు [178]జెముడుకుఁ దామ రుమ్మెత్తకు
గన్నేరువేళ్ళకుఁ గరకకాయ
|
|
|
ముసిఁడికి శుంఠియు బసుపు సున్నమునకుఁ
దెఱఁగొప్పఁ బొగడకుఁ దెల్లయుప్పు
వట్టివేళ్ళకుఁ బత్తి [179]వావిలి [180]కొడిసెకు
నేయి పాలకును [181]వేన్నీళ్ళు దలఁప
జీడికి సెనఁగ మించిన వసనాభికి
[182]జిఱ్ఱివేళ్ళును నల్ల జీలకఱ్ఱ
|
|
తే. |
తైలశశులకు జిల్లేడుపూల నీళ్ళు
పనసవంటికి నూనె యావడకు [183]ముస్తి
మిరియ మరఁటికిఁ దెగడకు నరయఁ దుమ్మ
లడరు వెలితుమ్మ [184]నేలతంగేడు వైరి.
| 155
|
జయతరాజు ముమ్మయ – విష్ణుకథానిధానము
సీ. |
చనుఁగవఁ బయ్యెద జాఱంగ జాఱంగఁ
గరమూలమున నంటఁ గదిమి కదిమి
వేనలి వెడవెడ వీడంగ వీడంగ
నెలమి మూఁపునఁ జాల నిఱికి నిఱికి
నుదుటిపై నలకలు సెదరంగఁ జెదరంగ
నల్లన ముంజేత నదిమి యదిమి
పొడతెంచు చెమటలు పొదలంగఁ బొదలంగ
నడరు నూర్పులచేత నణఁచి యణఁచి
|
|
తే. |
చన్నులును జేతికలశంబు సరసమాడ
నవ్వు నమృతంబుఁ దమలోన [185]నవ్వులాడ
సిగ్గుఁ దమకంబు వినయంబుఁ జెంగలింప
వెలఁది యమృతము వడ్డించె విబుధపతికి.
| 156
|
ముక్కు తిమ్మయ్య – పారిజాతము [2-19]
సీ. |
శాకపాకంబుల చవులు వక్కాణించు
గతిఁ గంకణంబులు ఘల్లుమనఁగ
నతివేగ మిడుఁడు మీ రను మాడ్కి మేఖలా
కీలితరత్నకింకిణులు మొరయఁ
గలమాన్నరుచితోడఁ గలహించు జాడ దు
వ్వలువ [186]పింజలు ఫెళఫెళ యనంగ
నారగింపుఁడు మీర లని ప్రియం బాడెడు
పొలుపున మట్టియల్ గిలుకరింప
|
|
తే. |
నలరుఁబోఁణులు వడ్డింప నచటఁ గలహ
భోజియును దాను బహుభక్ష్యభోజ్యలేహ్య
చోష్యపానీయముల మధుసూదనుండు
సారెఁ గొనియాడుచును వేడ్క నారగించె.
| 157
|
శ్రీనాథుఁడు – నైషధము [6-120]
సీ. |
గోధూమసేవికాగుచ్ఛంబు [187]లల్లార్చి
ఖండశర్కరలతోఁ గలపి కలపి
గ్రుజ్జుగాఁ గాఁచిన గోక్షీరపూరంబు
[188]జమలి మండెఁగలపైఁ జల్లి చల్లి
మిరియంబుతోఁగూడ మేళవించిన తేనె
తోరంపులడ్వాలఁ దోఁచి తోఁచి
పలుచగా వండిన వలిపెంపుఁజాఁపట్లు
పెసరపప్పులతోడఁ బెనచి పెనచి
|
|
తే. |
గోవ జవ్వాదిఁ గస్తూరిఁ గొఱతపఱుచు
వెన్న పడిదెంబు జొబ్బిల విద్రిచి విద్రిచి
వారయాత్రికు [189]లామోదవంతు లగుచు
వలచి భుజియిం రొగిఁ బిండివంటకములు.
| 158
|
సీ. |
అమృతరసోపమంబైన కమ్మని యాన
వాల పాయసము జంబాలమయ్యె
మంచులప్పల మించు మండెంగమడుపులు
పొరలి తెట్టవగట్టు నురువులయ్యెఁ
గప్పురంబుల యొప్పుఁ దప్పుపట్టఁగఁజాలు
ఖండశర్కరలు సైకతములయ్యె
గరుడపచ్చలచాయ గల పచ్చగందని
కూరలు శైవలాంకురములయ్యె
|
|
తే. |
నొలుపుఁబప్పుల తీరంబు లురలఁబడఁగఁ
బూరియలు లడ్డువంబులు పొరలి పాఱ
విమలశాల్యోదనంబుపై వెల్లిసూపు
నాజ్యధారాప్రవాహసాహస్రమునకు.
| 159
|
చ. |
తరుణులు చంచలా[190]లతలు తత్కరభాండనికాయ మంబుదో
త్కరములు పాలుఁ దేనెలు ఘృతంబులు వాన లఖండఖండశ
ర్కరలును ద్రాక్షపండ్లు వడగండ్లును శోభనభుక్తివేళఁ దొ
ల్కరిసమయంబు పే రెలమిఁగైకొననుండెను భోక్తృసస్యముల్.
| 160
|
శ్రీనాథుఁడు భీమఖండము [2-142]
శా. |
ద్రాక్షాపానకఖండశర్కరలతో రంభాఫలశ్రేణితో
గోక్షీరంబులతోడ [191]మజ్జిగలతోఁ గ్రొన్నేతితోఁ బప్పుతో
నక్షయ్యంబుగ [192]నేరుఁబ్రాల కలమాహారంబు నిశ్శంకతన్
కుక్షుల్ నిండఁగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్.
| 161
|
తెనాలి రామలింగయ్య హరిలీలావిలాసము
ఉ. |
అల ఘృతంబు వేఁడియగు నన్నము నుల్చిన ముద్దపప్పు క్రొం
దాలిపుఁ గూర లప్పడము ద్రబ్బెడ చారులు పానకంబులున్
మేలిమి పిండివంటయును మీఁగడతోడి ధధిప్రకాండమున్
నాలుగు మూఁడు తోయములు నంజులుఁ గంజదళాక్షి పెట్టఁగన్.
| 162
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-135]
సీ. |
పెనుపారు కడియంపుఁ బిండివంటలతోడఁ
గమ్మని సద్యోఘృతమ్ముతోడఁ
గనరు వోకుండఁ గాచిన యానవాలతోఁ
గడి సేయవచ్చు మీఁగడలతోడఁ
చెక్కులాగుల గదంబించు జున్నులతోడఁ
బేరి దాఁకొన్న క్రొంబెరుగుతోడఁ
బిడిచినఁ జమురు గాఱెడు మాంసములతోడఁ
దేటతియ్యని జుంటితేనెతోడఁ
|
|
తే. |
బాయసాహారములతోడఁ బడఁతు లొసఁగ
నఖిలసేనాప్రజలతోడ నారగించి
సంతసం బంది పటకుటీరాంతరమున
జనవిభుఁడు [193]భజించెను నిశాసమయసుఖము.
| 163
|
ప్రౌఢకవి మల్లన రుక్మాంగదచరిత్ర [1-132]
సీ. |
పాయసాన్నము లపూపములు పెసరపప్పు
లాజ్యప్రవాహంబు లరటిపండ్లు
ఖండశర్కరలు మీఁగడ లిక్షుఖండముల్
తీయఁగూరలు చారుతిమ్మనములు
[194]పైళ్ళుపుట్టలు కట్లు చల్లరసంబులు
పచ్చళ్ళు శిఖరలు పనసతొనలు
మామిడితాండ్ర యామలకముల్ పానక
ములు రసావళ్ళాల ముద్దపెరుఁగు
|
|
తే. |
సొంఠి మజ్జిగలును భూమిసురసహస్ర
ములకు గంధాక్షతలపూజ మున్నుగాఁగ
నారగింపుల నిడి విడియంబు లొసఁగి
తారుఁ బారణ సేసిరి త[త్]క్షణంబ.
| 164
|
తాంబూలమునకు
క. |
తలపోయఁగ రుచు లాఱును
గలుగును వాతంబుఁ గ్రిమియుఁ గఫముం జెడు నాఁ
కలి పుట్టు దగయుఁ జెడుఁ ద
మ్ములము పదార్థంబు రాగమూలము ధరణిన్.
| 165
|
చ. |
వదనవికాససౌరభవివర్ధనకారి లసన్మదాపహం
బుదరవిశేషసౌఖ్యకర[195]ముద్గతదోషబలప్రహారి తా
మదజనకంబు తమ్ములము మానవతీపతిభోగవేళలన్
మదనపునర్భవీకరణమంత్రము తుల్యమె దీని కెద్దియున్.
| 166
|
సీ. |
లఘుకారి క్రిమిదోషవిఘటనసంధాయి
దీపననిర్దోషదీప్తికరము
పాషాణచూర్ణంబు పైత్య[196]వాతఘ్నంబు
శంఖంబు కఫపైత్యశక్తిహరము
చిప్పలసున్నంబు శ్లేష్మంబు [197]నణగింపుఁ
గుల్లసున్నము వాతగుణముఁ జెఱుచుఁ
|
|
|
[198]దెలివిచ్చుఁ జాలముత్తియపుఁజూర్ణము చూర్ణ
వర్ణ మాయువునకు బాధకంబు
|
|
తే. |
పత్రమూలములను రోగ[199]పటల [ముండు]
నగ్ర మది పాపముల కెల్ల నాలయంబు
నడిమి యీనియ బుద్ధి వినాశకరము
వీని వర్జించి తగఁజేయు వీడియంబు.
| 167
|
సీ. |
కఠినమై దొడ్డచిక్కణమునై వత్సరా
ర్థ[200]౦బు వోయిన ప్రాతఁదనము గలిగి
యుజ్జ్వలచ్ఛాయమై నొత్తిన తరువాయి
శశమాంసఖండంబుచంద మగుచు
నొగ రించుకయు లేక మిగులంగఁ దీపైన
క్రముకంబు [201]లెఱ్ఱనై కమ్మ వలచి
దళమెక్కి పండిన తాంబూలదళములు
కాలోపలంబులు [202]కాల్చి వడియఁ
|
|
తే. |
[203]గట్టినటువంటి చూర్ణంబుగా నొనర్చి
భుక్తి గొనక ముందట నాల్గు భోజనాంత
రమున రెండును నటమీఁద రాత్రి నాఱు
మార్లు తమ్మల మొప్పారు మంత్రియప్ప.
| 168
|
కేళీమందిరము
కూచిరాజు ఎఱ్ఱయ – కొక్కోకము
సీ. |
పట్టికంకటి దూదిపరుపు మొక్కలిపీట
యగరుధూపము వెలుఁగైన దివ్వె
పూవుదండలు గంధపొడిపెట్టె బచ్చన
జాలవల్లిక దన్నె మేలుకట్టు
తమపడిగము పచ్చతలగడ చిఱుచాప
సానరాయడపము సంచి గిడ్డి
గొడుగు పావలు గాజుకుడుక సున్నపుఁగ్రోవి
గంధంపుఁజిప్ప బాగాలభరణి
|
|
ఆ. |
దిడ్డిగంబు జీరతెర బోనపుట్టికె
నిలువుటద్దము వీణె చిలుక సురట
|
|
|
మిద్దెయిల్లు చూఱు మిగిలిన తీవంచ
మఱియుఁ గలుగు కేళిమందిరములు.
| 169
|
ఎఱ్ఱాప్రెగడ – మల్హణ[204]చరిత్ర [2-96]
సీ. |
పగడంపుఁ గంబాల పచ్చటోవరి[యును]
నపరంజి కాళంజి యలరుఁబాన్పు
బంగారు సకినెల పట్టెమంచంబును
వజ్రపు నునుజాలవల్లికయును
కుంకుమతలగడల్ గొజ్జంగిపూఁదెఱల్
తరమైన చంద్రకాంతంపు గిండి
చౌసీతిరతముల సవరని మేల్కట్లు
దీపించు [205]మాణిక్యదీపకళిక
|
|
తే. |
పొసఁగఁ గస్తూరివేది కప్పురపుసురటి
నిలువుటద్దంబు రతనంపుటెత్తుపలక
తళుకుదంతపుబాగాలు కలికిచిలుక
గలిగి యొప్పారు చవికలో పలికినపుడు.
| 170
|
జక్కన – సాహసాంకము [4-219]
సీ. |
కలువఱేకుల మీఱు కలికికన్నుల కాంతి
మేల్కట్టు ముత్యాల మెఱుఁగు వెట్టు
నిండుచందురు [206]నేలు నెమ్మోముబెణఁగులు
నిలువుటద్దమునకుఁ జెలువు లొసఁగ
నరుణాబ్జముల మించు నడుగు[207]ల నునుఁజాయ
నెలకట్టు కెంపుల నిగ్గుఁ జెనక
కారుమెఱుంగులఁ గైకొను తనుదీప్తి
కనకకుడ్యప్రభ గారవింప
|
|
తే. |
సారఘనసారదీపాదిసౌరభంబు
లలఁతి యూర్పుల నెత్తావి నతిశయిల్ల
మందిరాభ్యంతరముఁ జొచ్చె మ్రాను దేఱి
భీతమృగనేత్ర ప్రియసఖీప్రేరణమున.
| 171
|
సంభోగమునకు
పెద్దిరాజు – అలంకారము [3-121]
తే. |
తనరు నెనుబదినాల్గు బంధములయందు
నమరుఁ బ్రచ్ఛన్నమును బ్రకటము ననంగ
సురతములు రెండు వాని విస్ఫురణ సొంపు
వలయు వర్ణింప నిఖిలకావ్యములయందు.
| 172
|
సీ. |
పొలయల్కఁ దలఁపులఁ బులకించుఁ బులకించి
బింకంపుఁ గౌఁగిళ్ళ బిగి భజించు
మరుచిహ్న లున్నెడఁ బరికించుఁ బరికించి
చొక్కుచుఁ జెమరిన యిక్క లరయు
దొలిమ్రొక్కు [208]చెవిచెవిఁ జివికించుఁ జివికించి
మురిపెంపు సిగ్గుల మూరిఁబోవుఁ
బంజరమునఁ జిల్కఁ బలికించుఁ బలికించి
నొడువు లాలములైన నోరు నొక్కు
|
|
తే. |
సొబగుటడుగుల లత్తుక చూచుఁ జూచి
[209]యరిగి శయనించు [210]మారయ నప్పళించు
వెలఁది యొక్కర్తు చాళుక్యవిభుని[చేత]
భావజాతుని గెలిచిన భావ మొప్ప.
| 173
|
కూచిరాజు ఎఱ్ఱయ – కొక్కోకము
సీ. |
వలిపె పయ్యదలోన నిలువక వలిగుబ్బ
చనుదోయి మెఱుగులు చౌకళింపఁ
బగడంపు వాతెర పైకి నించుక జాఱు
మొగమునఁ జిఱునవ్వు మొలకలెత్తఁ
గొలఁకుల నునుకెంపు తిలకించు క్రొవ్వాఁడి
దిట్టచూపులు తలచుట్టి తిరుగ
నునుగొప్పులోపల నునిచి పూవులతావి
మీఁదికి దాటి తుమ్మెదలు పిలువఁ
|
|
తే. |
దొడవులకు నెల్లఁ దొడవైన యొడలితోడ
వలపులకు నెల్లఁ దనమేని వలపు దెలుపఁ
బరఁగు కామిని తన వామపార్శ్వమునను
గదియగా నిల్చి వేడ్కలు గదురుకొనఁగ.
| 174
|
[211]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-217]
తే. |
ముగ్ధ యగుఁగాక యేమింత ముగ్ధ గలదె?
బాల జఘునాంశుకం బింక నేల పెనఁగ?
రాజవరున కురోజదుర్గములు రెండుఁ
జేపడియెనట్టె [212]యిఁకఁ గ్రింది సీమ యెంత.
| 175
|
సీ. |
తల వంచుటయె కాని తప్పక కను ప్రేమ
ఘనమని లోచూపు గతము వెట్ట
మౌనముద్రయె కాని మాటాడు వేడుక
గడుసని ముఖకాంతి ముడియ లేయ
నడ్డగించుటయె కాని యాలింగనప్రీతిఁ
బలువని కంపంబు బాస సేయఁ
బై వెట్టమియె కాని పైకొను తమి కల్మి
సత్తని పులకలు సాక్షి పలుకఁ
|
|
తే. |
గరుణముగ వేఁడఁ జొరమియె కాని మనసు
కరఁగినది యని చెమట పైకంటఁ జాట
హృదయనాథుని మది దక్క నేలుకొనియె
బాలికామణి యపు[213]డు దాఁ బ్రథమరతిని.
| 176
|
సీ. |
నెమ్మోవి దాఁచెడి నెపమునఁ జెక్కులు
చుంబింప [214]నెడమిచ్చు సుదతి నేర్పుఁ
గినిసి చెక్కులు దాఁచికొనియెడి నెపమున
మోము మోమునఁ గూర్చు ముదిత వెఱపు
సడలెడు తన నీవి [215]సవరించు నెపమునఁ
గౌఁగిటి [216]కొదవించు కాంత తలఁపుఁ
గరములఁ జనుదోయి గప్పు నెపంబున
[217]నీవిక సందిచ్చు నెలఁత మతముఁ
|
|
తే. |
[218]దొడిఁబడక గానఁబడనీక యొడలు నులియు
నెపముమైఁ గౌఁగిటి కెదుర్చు నీరజాక్షి
యుపమయును భూమివల్లభు నుల్లమునకుఁ
గ్రొత్తచవి గొల్పె మఱి వేఱె కొన్నినాళ్ళు.
| 177
|
సీ. |
ఈక్షింపఁగా నేర్చె నిఱ్ఱింకు చూపుల
మోవిఁ గూర్పఁగ నేర్చె మొలకనవ్వు
పొలయింపఁగా నేర్చె భ్రూలతానటనంబు
విననేర్చె నర్మోక్తి వీను లాని
యెదురొత్తఁగా నేర్చె [219]నిఱియుఁ గౌఁగిటియందు
మొగమెత్తఁగా నేర్చె మోవిఁ గదుప
కరమెత్తి యీనేర్చెఁ గర్పూరవీటిక
నలరింపఁగా నేర్చె నంఘ్రు లొత్తి
|
|
తే. |
నేర్చె గరువింప మెచ్చింప నేర్చె నేర్చె
మొగము గనుపట్టి యలుక మై [220]మ్రొక్కుఁ గొనఁగ
జెలువ పతిచేతి రతికళాశిక్షణమునఁ
బంచబంగాళముగ లజ్జఁ బాఱద్రోల.
| 178
|
పిల్లలమఱ్ఱి వీరయ – శాకుంతలము [3-220]
సీ. |
అన్యోన్యసంప్రీతి నలవరింపుచునుండు
వలరాజు కూఱట గలుగదయ్యె
రమణీయనూతనరతిరహస్యములకుఁ
గామశాస్త్రంబులు కడమలయ్యె
నుజ్జ్వలమగుచుఁ బెల్లుబ్బెడి రాగవా
ర్ధులు లేశమైనను దొంకవయ్యె
నితరేతరప్రీతి నెడలింపఁదలఁచిన
ధృతికి రాఁ దెఱిపి సిద్ధింపదయ్యె
|
|
తే. |
మమతలును దత్తరింతలు మక్కువలును
జొక్కులును గౌతుకములును [221]సోలడములుఁ
బ్రియములును గాముకతలు తబ్బిబ్బులుగను
సతియుఁ బతియు రతిక్రీడ సలుపునపుడు.
| 179
|
ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత [4-36]
సీ. |
జలకంబునకు వాంఛ సలుపఁ డంగన మేని
కస్తూరి చెమటలఁ గలయఁదోఁగి
ఘనసారగంధపంకముఁ దేరి చూడఁడు
సతి యూర్పు కమ్మవాసనల [222]సొగసి
నీరాజనమ్ము మన్నింపండు విద్యుల్ల
|
|
|
తాక్షి చూపునివాళులందు నలరి
షడ్రసాన్నములకై చనఁ డింతి యధరామృ
తమ్మున నాప్యాయనమ్ము నొంది
|
|
తే. |
యఖిలభోగము లబ్జాతముఖియె కాఁగ
బాలికామణిఁ గూడి యప్పార్ధివుండు
తెల్లవారుట రాత్రి యేతెంచుటయును
మఱచి నిధువనకేళి [223]సమ్మదము నొంది.
| 180
|
శ్రీనాథుఁడు – శృంగారనైషధము [7-171]
ఉ. |
ఇంచుక యుల్లసించినను నేమని చెప్పఁగ? లజ్జ వచ్చి వ
ర్జించును సాధ్వసం బడరి శిక్ష యొనర్చును మౌగ్ధ్య మేఁచి వా
రించుఁ బ్రగల్భభావము ధరించి యటేని వధూమనోగతిన్
బంచశిలీముఖుండు పసిపాపఁడువో న(వసం)గమంబునన్.
| 181
|
చ. |
కుతుకమునం గురంగమదకుంకుమచర్చ వహించి నీలలో
హితరుచులై స్వయంభులయి యీహితసౌఖ్యవిధాయులైన య
య్యతివ పయోధరంబులకు నర్ధనిశాసమయంబునన్ సమం
చితనఖకింశుకార్చనము సేసె మహీపతి భక్తి యేర్పడన్.
| 182
|
సీ. |
పతిపాణిపల్లవచ్యుతనీవిబంధన
వ్యగ్రబాలాహస్తవనరుహంబు
ధవకృతాధరబింబదశనక్షతివ్యధా
[224]భుగ్నలీలావతీభ్రూలతంబు
ధరణినాయకభుజాపరిరంభమండలీ
గాఢపీడితవధూఘనకుచంబు
వరనఖాంకురమృదువ్యాపారపులకిత
నీరజాక్షినితంబోరుయుగళి
|
|
ఆ. |
యస్తి వామ్య[భా]ర మస్తి కౌతూహలం
బస్తి ఘర్మసలిల మస్తి కంప
మస్తి భీతి యస్తి హర్ష మస్తివ్యధం
బస్తి వాంఛమయ్యె నపుడు రతము.
| 183
|
ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
చ. |
కలిసి యొకళ్ళొకళ్ళు కసుగందని వేడ్కలఁ జూచువేళ ఱె
ప్పలు మఱువయ్యెనే నవియుఁ బాయుట తత్సుఖపారవశ్యులై
పలుకకయుండుటే యలిగి పైకొనకుండుటె యంతెగాని తొ
య్యలియు విభుండుఁ బాయుటయు నల్గుట నాఁగ నెఱుంగ రెన్నఁడున్.
| 184
|
తులసి బసవయ్య – సావిత్రికథ
చ. |
విడిలిన మోవి కెంపులును [225]వ్రేకపుటూరుపుగాలి సొంపులున్
బడలిన మోవి యొప్పులును నాన దొఱంగిన మాటతప్పులున్
సడలిన కొప్పు బాగులును జంకెనచూపులు వింతలాగులున్
దడఁబడ నభ్యసించిరి ముదంబున నిద్దఱుఁ గామతంత్రముల్.
| 185
|
జక్కన – సాహసాంకము [4-226]
సీ. |
తొంగలి ఱెప్పల తుదలు గైవ్రాలినఁ
గొనరుఁజూపులయందు మిసిమిఁ జూపఁ
దారహారముల నర్తనఁ గళాసించినఁ
గుచకుంభములమీఁదఁ గొంత నిక్కఁ
గుంతలంబుల త్రుళ్ళగింతలు [226]సడలినఁ
గెమ్మోవి చుంబనక్రీడ కెలయ
మణికాంచివలయంబు మౌనంబు గైకొన్న
నురునితంబము కేళి కుత్సహింపఁ
|
|
తే. |
జెమట చిత్తడి మైపూఁత దెమలి చనిన
నెమ్మనంబునఁ దమకంబు నివ్వటిల్ల
నున్న జలజాక్షి యొప్పు నృపోత్తమునకు
మదనపునరుద్భవవికారమంత్ర మయ్యె.
| 186
|
ధూర్జటి కాళహస్తిమాహాత్మ్యము [1-43]
ఉ. |
ఎక్కడఁ బట్టినం గళల యిక్కువ లెక్కడ నోరు సోఁకినన్
జక్కెర లప్ప లేమనిన సారసుధారస మెట్టులుండినన్
జక్కదనంబు పెన్నిధులు సంభ్రమ మొప్పఁగ నేమి సేసినన్
మక్కువ చెయ్వులై వెలయు మన్మథకేళి యొనర్చు నంతటన్.
| 187
|
ఉపరిసురతము
చ. |
ప్రకటితలీలఁ గీలడరఁ బాపట ముత్యపుఁజేరు మోముపైఁ
దకపికలాడఁ గ్రక్కదలు దంతపుఁగమ్మల కాంతి మొత్తఁమై
వికచకపోలభాగములు [వెన్నెల] సల్లఁగ [నీ]వు నన్ను నా
లకుముకిభంగిఁ గూడ మగలాగులు మెత్తునదే కళావతీ!
| 188
|
క. |
ఆ కంజానన యుపరతి
కాకాశము వణఁకెఁ దార లటునిటు పడియెన్
జోకైన గిరులు గదలెను
భీకరమగు తమము చంద్రబింబముఁ గప్పెన్.
| 189
|
ప్రౌఢకవి మల్లయ్య రుక్మాంగదచరిత [3-185]
సీ. |
ఒదికిలి శయ్యపై నునిచిన మేనులు
తలగడ నిడ్డ హస్తద్వయంబు
గటులపైఁ [గట్టన] కట్టంశుకంబులు
+ + పన్నెగా మోడ్చిన కన్నుఁగవయు
కలయఁగ నిమిరిన కస్తూరి చెమటలు
తలపులు వెడలిన తత్తరములు
చవులాను లుడిగిన చక్కెర మోవులు
చదురొప్పఁ బెనిచిన మృదుపదములు
|
|
ఆ. |
కరము వదలియున్న కౌఁగిళ్లుఁ జిటిలిన
గంధములు బొసంగ గరిమతోడ
నిధువనావసాననిద్రలు సెందిరి
పతియు సతియు వేడ్క లతిశయిల్ల.
| 190
|
రత్యంతనిద్ర
క. |
సతి సలిపెడు నుపరతిని బ
ర్వతములు చలియింప నభము వణకఁగఁ దారల్
గతిఁ దప్ప శశి స్రవింపఁగ
మతి నురగము దలఁక దమము మైకొని పొదువన్.
| 191
|
శ్రీనాథుని నైషధము [7-188]
స్రగ్ధర. |
సరి యాతాయాతరంహ[227]శ్చలకలితరతశ్రాంతినిశ్వాసధారా
పరిషద్వామిశ్రభావ[228]ప్రవిఘటితమిథఃప్రాణభేదోదయంబై
యొరిమ న్వక్షోజపాళీయుగకరిమకరీయుగ్భుజామధ్యచిహ్నా
భరణవ్య[229]క్త్యైకభావోభయవిలసితహృద్భాగమై నిద్రవోయెన్.
| 192
|
సంతానవాంఛ
తులసి బసవయ్య – సావిత్రికథ
సీ. |
సంతతి లేని సంసారంబు నిస్సార
మొగి నర్భకులు లేని యొప్పు తప్పు
కొడుకుతోఁ [230]గుడువని కూడు గీడు తనూజు
లెపుడు క్రీడింపని యిల్లు పొల్లు
పుత్త్రరత్నము లేని భోగంబు రోగంబు
తనయుఁ గానని [231]వాని తగవు నగవు
పిన్నబిడ్డలు లేని పెక్కువ తక్కువ
సూనుమై సోఁకని మేను మ్రాను
|
|
తే. |
కాన నెబ్భంగినైన సంతానలబ్ధి
కాననగు త్రోవఁ బరికించి కానవలయుఁ
గాని యూరకే యున్కి యుక్తంబు గాదు
జగతి సంతతి లేకున్న జన్మహాని.
| 193
|
[232]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-39]
సీ. |
జలకమార్చినఁ జిన్నిశయ్యలో నొయ్యొయ్య
గాలు చేయార్పంగఁ గనుట లేదు
కెంగేల నునుబొజ్జ గిలిగింత లిడ నవ్వు
నెలమోము దమ్మి ముద్దిడుట లేదు
తియ్యదేనియ లొల్కు తీవనవ్వులతోడి
తొక్కుఁబల్కులు విని చొక్క లేదు
వడఁకుచుఁ జిఱుతప్పుటడుగుల నేతేరఁ
జేసాచి యక్కునఁ జేర్ప లేదు
|
|
తే. |
పుత్త్రకులు లేని సిరి యేల? భోగ మేల?
బాలకులు లేని తా మేల? బ్రదు క దేల?
|
|
|
యాత్మజులు లేని యశ మేల? హర్ష మేల?
యిహముఁ బర మెద్ది సంతానహీనులకును.
| 194
|
ఉ. |
ముంగిట నాడు పుత్త్రుఁ డతిమోదమునం దను దౌలఁ గాంచి వే
డ్కం గరయుగ్మ మెత్తి చిఱుగంతులతో వెడయేడ్పుతోడ డా
యంగఁ జెలంగి యెత్తికొని యక్కునఁ జక్కఁ[గఁ] జేర్చి ముద్దుమో
ముం గమియార ముద్దిడుట ముజ్జగ మేలుట గాకయుండునే.
| 195
|
ఉ. |
నారకయాతనాంబుధికి నావ, నిబద్ధకవాటగోపుర
ద్వారమునందుఁ గుంచిక, భవక్షితిజంబునకున్ ఫలంబు, వి
స్ఫారనిజార్థగుప్తి కనపాయనిధిస్థలి, వంశవర్ధనాం
కూరము పుత్త్రునిం బడయఁగోరుట యొప్పదె యెట్టివారికిన్.
| 196
|
మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [1-62]
సీ. |
లోచనానందకల్లోలినీభర్తకుఁ
దోయజారాతి పుత్త్రుండు కాఁడె
శ్రవణహితాలాపరత్నాంకురాళికి
రోహణాచలము పుత్త్రుండు కాఁడె
యమితపాతకపుంజతిమిరమండలికి న
ఖండదీపంబు పుత్త్రుండు కాఁడె
సంసారసుఖమహీజాతసంఘమునకు
దోహద[233]సేవ పుత్త్రుండు కాఁడె
|
|
తే. |
దుఃఖములఁ బాపి ముక్తికిఁ ద్రోవ సూపి
ప్రోవఁ జాలినవాఁడు పుత్త్రుండు కాఁడె
కాన నిహపరసాధనకారణంబు
తల్లిదండ్రుల కాత్మీయతనయుఁ డబల.
| 197
|
ఏర్చూరి సింగయ్య – కువలయాశ్వచరిత్ర
ఉ. |
వైరి [234]తమిస్రమం బణఁగ వంశమహార్ణవ ముబ్బ బాంధవో
ద్ధారచకోరసంతతి ముదంబునఁ దేలఁగ నర్థివర్గస
త్కైరవజాతమెల్లను వికాసముఁ బొందఁగఁ బుత్త్రచంద్రజ
న్మారవచంద్రికానుభవ మచ్చిన చిత్తము మిన్ను ముట్టదే.
| 198
|
గర్భచిహ్నములకు
అంగద బసవయ్య - ఇందుమతీకల్యాణము
సీ. |
శశిమండలముమీఁది సాంద్రచంద్రిక వోలె
నునుమొగంబునఁ దెల్లఁదనము నిల్చె
పసిడికుండలమీఁది బలభిన్మణులు వోలె
వలిచన్నుముక్కుల నలుపు లొదవె
నిఱుపేదమీఁది నిర్ణిద్రసంపద వోలె
మధ్యభాగంబున మహిమఁ దాల్చెఁ
గదలిన[235]లతమీఁది కమ్మబూవులు వోలె
[236]నిలవనిమేన సొమ్ములు దొలంగెఁ
|
|
తే. |
దరుణిగమనంబు మిగుల మాంద్యము వహించె
వనజపత్రాక్షి కోర్కులు కొనలు సాగె
వనిత నేత్రాంతములు వసివాళ్ళు వాడె
[237]రమణి తనువల్లి శయ్యల వ్రాలఁ గణఁగె.
| 199
|
సీ. |
హేమసింహాసనం బెక్క నుద్యోగించు
మణికల్పితాస్థానమంటపమున
విసరించుకొనఁ జూచు వింజామరంబుల
వైరివీరవిలాసవతులచేత
నాటింపఁదలఁచు నానాద్వీపసంధుల
గెలుపుఁగంబంబులు వలసినన్ని
దుష్టరాక్షసకోటిఁ దునుమ విచారించు
మఘవన్ముఖాఖిలామరులు వొగడ
|
|
తే. |
[238]సంతతము జహ్నుకన్యాతటాంతరముల
నధ్వరంబులు గావింప నలవరించు
నెలఁత నిచ్చలు నిజగర్భనివసదర్భ
కప్రభావపరిప్రాప్తి గౌరవమున.
| 200
|
మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [1-86]
సీ. |
కౌను దొడ్డతనంబుఁ గని చింతపడు గతిఁ
గుచముఖంబులు నీలరుచి వహించె
మందస్మితంబందు మరగి రాదన ముద్దుఁ
|
|
|
బలుచని చెక్కులు పలకఁబాఱె
ఫలరసంబున కెవ్వి ప్రతి రామి నొల్లదో
యన జిహ్వ కన్నిట నరుచి పుట్టె
గర్భస్థుఁ డగు బాలు కమనీయగుణభార
మహిమ నా నడ [239]లతిమందమయ్యెఁ
|
|
తే. |
గలికి బేడిసమీలతోఁ గలహమాడు
వాలుఁజూపుల [దాటులు] డీలుపడియె
మంటి కమ్మని తావికి మనసు వారె
నాఁడు నాఁటికిఁ బాలికానలినముఖికి.
| 201
|
ఘటకాశి మల్లుభట్టు - జలపాలిమహత్త్వము
సీ. |
ధవళాంగుఁ డగు శంభుదత్తగర్భము గాఁగ
వనితదేహము పాండువర్ణమయ్యెఁ
బుత్త్రలాభానందపూరితకుక్షియై
యఖిలభక్ష్యములందు నరుచియయ్యెఁ
జెలులు వచ్చినఁ జూచి సిగ్గున నున్నట్లు
పలుక[240]నోపకయుండె నలసవృత్తిఁ
దతిమరాళములకు గతి నేర్పు కైవడి
నలినాక్షి మందయానము వహించె
|
|
తే. |
హేమకలశాగ్రములయందు నింద్రనీల
రత్నముల రీతిఁ దత్కుచాగ్రంబులందు
నలుపు సొంపారు గర్భచిహ్నములు గలిగి
యతివ[241]తతికిని సంతోష మావహించె.
| 202
|
ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
శ్రీ బయల్పడకుండఁ జికురముల్ తమకప్పుఁ
గుచచూచుకములకుఁ గొంత యిచ్చె
లేమి దోఁపకయుండ లెస్సఁగా నడిమికిఁ
గుచములు తమకల్మిఁ గొంత యిచ్చెఁ
దనువల్లికకు దృష్టి దాఁకకుండఁగ సాధు
దంతముల్ తమకాంతిఁ గొంత యిచ్చెఁ
దరచిసిరింతలై[?] దాఁటకుండఁగఁ దమ
యలసత చూడ్కుల కంఘ్రు లిచ్చె
|
|
తే. |
నంగకము లొక్కమై నున్న [242]వాంగములను[?]
గలిమిలేములు దమలోన నలకరించి
[243]యరయఁ బుత్రోత్సవమున కాయత్తపడెనొ
యనఁగ సతి మేన గర్భచిహ్నములు దోఁచె.
| 203
|
సీ. |
మెఱుఁగుశృంగములందు మెదలకయున్న వి
నీలమేఘంబులు నీరజాస్య!
వెన్నెలపులుఁగులు వేకువ చంద్రుపైఁ
దేలుచున్నవి చూడు తియ్యఁబోణి!
మింట నాగడపలు మెల్లమెల్లన విచ్చి
కానరావయ్యె నో కలువకంటి!
పారిజాతపుఁ దీగ బహువర్ణపుష్పభా
రంబు మోవగలేదు కంబుకంఠి!
|
|
తే. |
యనుచుఁ దమలోన [244]నర్మోక్తు లాడుకొనుచుఁ
దనకు నుపచారములు సేయు ననుఁగుఁజెలులఁ
జూచి నవ్వుచు సహజన్య చూడనొప్పెఁ
జారు[245]దౌహృదలక్షణసహిత యగుచు.
| 204
|
మలయమారుతము
సీ. |
[246]ఒడియాపగ నున్న [247]యుదటు జుక్కవ లింక
నక్కట [248]నెగసి గాశాడకున్నె
సరగామి నెంతయుఁ జఱుల లోఁబడనున్న
గిరులెల్ల నిఁకఁ బెచ్చు పెరుగకున్నె
పగిలి లోఁగరిగెడు బంగారుకుండలు
తలకెక్కి యటమీఁదఁ జెలఁగకున్నె
కలఁగిన మాలూరఫలము లింకిటుమీఁద
గిట్టి తీదీపులఁ బెట్టకున్నె
|
|
తే. |
[249]పరులు గన్గొన నున్నతిఁ బాయవలసె
నక్కటా మాకు నని యని యాత్మఁ గుంద
మునుపుఁ [250]జిత్తాంధకారంబు మొనసె ననఁగ
నలినలోచన చనుమొనల్ నల్లనయ్యె.
| 205
|
పుత్త్రోత్సవము
పెద్దిరాజు – అలంకారము [3-129]
క. |
మిత్రానందోదయము, న
మిత్రత్రసనంబు శుభనిమిత్తంబును స
త్పాత్రస్థితివితరణములు
పుత్త్రోత్సవవేళయందుఁ బొగడఁగవలయున్.
| 206
|
ఉ. |
చిత్రము పోర విశ్వవిభుచే నసిపుత్త్రికఁ గన్న పుత్త్రు లు
ద్యత్త్రిదశాకృతిం బడసి యౌవనసంపదఁ జెంది మంగళా
మత్రములై వెలుంగునెడ మంజులయుక్తిఁ దనర్చు దివ్యవా
దిత్రితయంబు నింపొదవుఁ దెమ్మరలున్ సురపుష్పవృష్టియున్.
| 207
|
ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదచరిత [1-142]
సీ. |
బహుళగంధముతోడఁ బవనుఁ డల్లన వీచె
దిక్కులు విశదమై తెలివినొందె
జలరాసు లేడు నుత్సవమున నుప్పొంగె
భానుబింబము శుభప్రభఁ దనర్చె
హవ్యవాహుఁడు దక్షిణార్చుల విలసిల్లెఁ
దరులు పుష్పఫలప్రతతుల నలరె
నిర్మలంబైనట్టి నీరముల్ ప్రవహించె
నఖిలజీవులకు నాహ్లాద మొదవె
|
|
తే. |
నంబుజోదరు దివ్యపాదారవింద
భక్తిభాజనుఁడైన యప్పార్థివునకు
నమితగుణరత్నసంశోభి యగు కుమారుఁ
డుదయమును నొందు నవ్వేళ నుర్వియందు.
| 208
|
ఏర్చూరి సింగయ్య – కువలయాశ్వచరిత
సీ. |
తిమిరమంతయుఁ బాసి దిక్కులు తెలివొందె
నమృతాంశువులు సెందె నభ్రవీథి
కువలయానందమై కోరిక లిగురొత్తె
విబుధుల మదిలోన వె[ట్ట]లొదవె
నక్తంచరశ్రేణినయమెల్ల దిగజాఱె
చిత్తజోల్లాసంబు చెలువు మిగిలె
|
|
|
దివ్యనీలంబులతేట లల్లనఁ బర్వె
భువనాధిపతి వేడ్కఁ బొంగి పొరలె
|
|
తే. |
దీపికాజాలమెల్లఁ జిత్రించినట్టి
రమణఁ దోఁపంగ దృక్చకోరములు మెచ్చ
నమితతేజోవిరాజమానాత్ముఁడైన
పుత్త్రచంద్రుండు జననము వొందునపుడు.
| 209
|
మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత్ర [1-88]
మ. |
కురిసెం బువ్వులవాన చూపఱుల చూడ్కుల్ వేడ్క నోలాడఁగా
నెరసెన్ మెల్లని చల్లగాలి కొదమల్ నెత్తావి నిండారఁగాఁ
బొరసెన్ దిక్కుల నొక్క వింత చెలువంబుం దత్కుమారప్రతా
పరుచిం బోలమి నాఁబ్రశాంతగతి సంప్రాప్తించె వైశ్వానరున్.
| 210
|
బాలింతరాలు
ధూర్జటి – శ్రీకాళహస్తిమాహాత్మ్యము
మ. |
తలఁ బంకించిన నూనె పుక్కిట సదా తాంబూలమున్ నేత్రక
జ్జలమున్ కంధరఁ గట్టుకొన్న వస పూసల్ గబ్బిపా లుబ్బు గు
బ్బలు నేకాంగు[ళికార్పితా]లకలసద్భస్మంబు [జి]డ్డైన దు
వ్వలువం [251]జెల్వుగ బిడ్డకాన్పు నడిపెన్ వామాక్షి బాలింతయై.
| 211
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [4-62]
సీ. |
తల లంటి రతిపుణ్యతాపసాంగన[లు నెం]
తయు వేడ్క నింగుదీతైలమునను
పుటజాంగణమునఁ గాపు నివిరి పెరటిలో
వెల్లుల్లిపొగ యిచ్చి వీతిహాత్రుఁ
జాగించి రంచితోత్సవము [252]ముప్పురుటాలి
వైభవంబు తృతీయవాసరమున
నాఱవదివసంబునం దాచరించిరి
బహుయోగినీగణప్రార్థనములు
|
|
తే. |
కొలన గుడిపిరి దినముల కొలఁది యెఱిఁగి
యఖిలమునిధర్మపత్నుల నామతించి
విన్నఁబోకుండఁ గ్రియలెల్ల విస్తరిల్లఁ
దగ నొనర్చిరి పురుటాలి [253]తగవులెల్ల.
| 212
|
బాలక్రీడ
మాదయగారి మల్లయ రాజశేఖరచరిత [2-3]
ఉ. |
నిద్దపురత్నభిత్తిఁ దననీడను గన్గొని తోడనాడు నా
ముద్దులబాలుఁ డంచుఁ గరముల్ పలుమాఱును [254]జాఁచి చీరుచున్
విద్దెము సేయుచుండి తగు విందులు విందులు వచ్చిరంచు నే
ప్రొద్దు నృపాలుఁడున్ సతియుఁ బొంగుచు నక్కున గారవింపఁగన్.
| 213
|
శా. |
కేలీకాంచనసౌధవీథికల చక్కిం దొట్లలోఁ బెట్టి యా
ప్రాలేయాచలకన్యకాధవకృపాపారంగతా! నిద్రవో
వే! లావణ్యపయోనిధీ! యనుచు నావిర్భూతమోదంబునన్
జోలల్ వాడుదు రక్కుమారునకున్ శుద్ధాంతకాంతామణుల్.
| 214
|
తే. |
కఱకుఁజూపుల మూడవక న్ననంగ
రత్నములు గీలుకొలిపిన రావిరేక
ఫాలభాగంబుపైఁ గ్రాల బాలుఁ డపుడు
శంబరారాతి యభియాతి చంద మొంద.
| 215
|
శైశవము
[255]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-55]
సీ. |
కనుఱెప్ప లిడ నెఱుంగని చూడ్కిఁ జూచుచు
జిగివీఁపు దోఁప బోరగిలఁబడుచుఁ
గరజానువులఁ జతుశ్చరణుఁడై తిరుగుచు
శిశునిదర్శితదృఢస్నేహుఁ డగుచు
భాసురమితపదన్యాసంబు సూపుచు
హ్రదవిహారమున దుర్వారుఁ డగుచు
జనకజానందబీజత్వంబుఁ గైకొంచు
గుణముల ముసలి నాఁ బ్రణుతి గనుచు
|
|
తే. |
వసననిరపేక్ష నిచ్ఛాప్రవర్తి యగుచు
హయసమారోహణంబు సేయంగఁగలిగి
రాసుతుఁడు దనశైశవక్రమదశావ
తారములచేతఁ బూరుషోత్తమతఁ దెలిపె.
| 216
|
జయతరాజు ముమ్మయ విష్ణుకథానిధానము
ఉ. |
కాటుక చేతులున్ మొగముగాఁ బులుమాడుచుఁ దల్పవస్త్రముల్
చీటికి మాటికిన్ బొదలి చిందఱ వందఱ చేసి యాడుచున్
మీట నదల్ప నేడ్చుచును మెత్తని మాటల బుజ్జగించి ము
ద్దాటకుఁ జొచ్చినన్ నగుచు న ట్లమరెన్ హరి శైశవంబునన్.
| 217
|
చ. |
అరుణజటాచయంబును దిగంబరభావము సాంద్రధూళిదూ
సరితశరీరమున్ వెఱపు చంద మెఱుంగమి యెల్లచోటులున్
దిరుగుచు నున్కియున్ గలిగి తెల్లమి చేసె యశోదపట్టి దా
హరిహరు లేకమౌటఁ దనయం దతిశైశవవిభ్రమంబునన్.
| 218
|
పిల్లలమఱ్ఱి వీరయ – శాకుంతలము [4-66]
సీ. |
సింహాసనంబునఁ జేరి రాజులు గొల్వ
నుండుచందమునఁ గూర్చుండనేర్చె
ధర్మంబు నాల్గుపాదములను నడపింతు
ననువిధంబున నడయాడనేర్చె
తరలునో యనృతంబు తఱుచుమాటల నను
పగిది నొక్కొకపల్కుఁ బల్కనేర్చె
వర్ణాశ్రమంబుల వరుస దప్పకయుండ
నిలుపుదు ననుభంగి నిలువనేర్చె
|
|
తే. |
ధాత్రి కరమందు నంశ [256]మైదవది తనకు
నర్హ మను పోల్కి ధాత్రి కరాంగుళంబు
కణఁకఁబట్టి యల్లల్లన నడువనేర్చె
నాఁడు నాఁటికి నిభపురనాథసుతుఁడు.
| 219
|
పురుషసాముద్రికము
కవిలోకబ్రహ్మ - -కేదారఖండము
సీ. |
కక్షకటిస్కంధకుక్షిఫాలాస్యంబు
లాఱు నున్నతము లీ యర్భకునకు
నాజానుబాహునాసాక్షులు దీర్ఘముల్
హ్రస్వంబు [257]లూరుమేహనగళంబు
లంగుళిజత్రుకేశాంఘ్రిగుల్ఫములు సూ
క్ష్మము [258]లధరోష్టనఖదృగంత
|
|
|
తాలుజిహ్వాకరతలరేఖ [259]లెఱ్ఱన
స్వరనాభిసత్త్వముల్ సద్గభీర
|
|
తే. |
ములు సెమర్ప[వు] మృదువు లంఘ్రులు కరములు
కఠినములు శంఖచక్రాంకకలితములును
నైదురేఖలు చెలువొందు నలికతలము
లక్షణము లింత యొప్పునే యక్షయములు.
| 220
|
స్త్రీసాముద్రికము
క. |
ఉదరంబు దర్దురోదర
సదృశంబై జఘన మతివిశాలం బయినన్
సుదతీరత్నంబున క
భ్యుదయంబుగ ధరణి యేలు పుత్త్రుఁడు పుట్టున్.
| 221
|
క. |
కడు నిడుదయుఁ గడు గుఱుచయుఁ
గడు వలుదయుఁ గడుఁ గృశంబుఁ గడు నల్లనిదిన్
గడు నెఱ్ఱనిదగు మెయిగల
పడఁతిని గీ డనిరి మునులు వరమునిచరితా.
| 222
|
కూచిరాజు ఎఱ్ఱయ్య – కొక్కోకము
సీ. |
హేమవర్ణంబైన యిందీవరద్యుతి
యైనను దనుకాంతి [260]యందమైనఁ
జరణంబులును హస్తసరసిజంబులు గోళ్లుఁ
గనుఁగొనలును నెఱ్ఱ [261]గలిగియున్న
[262]సరసంబు మృదువునై చక్రాబ్జకలశచిహ్ని
తంబైన కరపాదతలయుగములు
సమము బింకములైన చనుదోయి నల్లనై
కడలొక్క కొలఁదైన కచభరంబు
|
|
తే. |
భోజనము నిద్రయును గొంచెమును మొగంబు
నుదరమును జాలఁబలుచనై మృదులతనువు
నధికశీలంబుఁ గల కన్య యర్హనాఁగఁ
జాటి చెప్పిరి పరిణయశాస్త్రవిదులు.
| 223
|
సీ. |
పర్వతతరునదీపక్షినామంబుల
నే కన్నెఁ బిలిచెద రింటివారు?
|
|
|
పొడవు కొంచెము దళంబును స్వల్పమును వక్త్ర
మునఁ బొందు నే కన్య తనువు తొడలు?
బింబోష్ఠ మధికంబు పింగళమై గుంట
కన్నులు గల్గి యే కన్నె మెలఁగుఁ?
గలకంఠమును బాదకమలంబులునుఁ గడుఁ
గఠినంబు లగుచు యే కన్నె కుండు?
|
|
తే. |
నిదురవోవుచు నవ్వుచు నిడుదయూర్పు
వుచ్చు నేడుచు నే కన్య భుక్తివేళ
మీసములు గల్గి చనుదోయిమీఁద రోమ
ములును [263]గల్గును నా కన్యఁ దలఁప వలదు.
| 224
|
పురుషయౌవనము
[264]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-58]
సీ. |
తూఱి బాల్యము వోవఁ ద్రోచి ప్రాయంబు వె
ట్టిన కవాటంబుఁ బాటించె నురము
జయరమాలంబనశాఖలై బాహువు
లాజానుదైర్ఘ్యంబు నధిగమించె
వదనచంద్రునిఁ [265]జొచ్చి బ్రతికెడి చీఁకట్ల
గతి నవశ్మశ్రురేఖలు జనించె
నర్ధిదైన్యములపై నడరు [266]కెంపును బోలె
నీక్షణాంచలముల [267]నెఱ్ఱ దోఁచె
|
|
ఆ. |
సుందరత్వమునకు జోటిచ్చి తా సంకు
చించె ననఁగఁ గడు గృశించె నడుము
జనవరాత్మజునకు సకలలోకోత్సవా
పాదియైన యౌవనోదయమున.
| 225
|
మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [2-8]
సీ. |
ధర నొక్కమైఁ దాల్పఁ దరము గాదని భోగి
వరుఁడు దాల్చిన తనుద్వయ మనంగ
హృదయగేహముఁ బాసి యీశుఁ డేఁగకయుండ
నలవరించిన [బోరు]దలు పనంగ
సముదీర్ణలావణ్యజలధిలోఁ జూపట్టు
లాలితశైవాలలత యనంగ
|
|
|
నిందిర విహరింప నెడముగా నజుఁడు గా
వించిన క్రొందమ్మివిరు లనంగ
|
|
తే. |
నిడుద బాహుయుగంబును వెడద యురముఁ
[268]గొమరు మీసలు దీర్ఘనేత్రములు మెఱయ
మానినీజనమానసమానహరణ
చతురత[ర]మూర్తి యా రాజసుతుఁడు వెలసె.
| 226
|
[ముక్తపద]
మ. |
అతిబాహాబలసత్త్వ! సత్త్వగుణయుక్తానంద! నందాంగనా
మతిలాలిద్యుతకారి! కారితరపుక్ష్మాలోక! లోకైకసం
తతసంపూజితపాద! పాదనయనాంతస్వాంత! స్వాంతోద్భవా
యతవిభ్రాజితమూర్తి! మూర్తిభవజిద్యక్షామరప్రార్థితా!
| 227
|
క. |
శ్రీరమణీరాజితముఖ
సారసపరిమళవిలోలషట్పదజలదో
దారతులితాంగవిభ్రమ
గౌరవజలజాతనయనఘనమణిశయనా!
| 228
|
మాలిని. |
నిరుపమగుణవర్తీ నిర్మలానందమూర్తీ
శరశశినిభకీర్తీ సంభృతశ్రీధరిత్రీ
స్మరశతశతరూపా మంజువాక్యప్రతాపా
సురగుణనుతిపాత్రా శుద్ధభాస్వచ్చరిత్రా.
| 229
|
గద్యము. |
ఇది శ్రీమజ్జగన్నాథవరప్రసాదలబ్ధకవితాప్రాభవ గంగనామా
త్యతనూభవ సకలబుధవిధేయ పెద్దపాటి జగ్గన నామధేయ
ప్రణీతంబైన ప్రబంధరత్నాకరంబునందు నాయకోత్కర్షయు,
సభావర్ణనయు, నృత్యగీతసాహిత్యసమంజసంబును, ఆశీర్వా
దంబును, నిరంజనవిధానంబును, ఛప్పన్నదేశంబుల నామంబు
లును, రాజ్యపరిపాలనంబును, స్త్రీవర్ణనయు, నవలోకనంబును,
నన్యోన్యవీక్షణంబును, దశావస్థలును, స్త్రీవిహారపురుషవిహా
రంబును, విరహభ్రాంతియు, శిశిరోపచారంబులును, సఖీవాక్యం
బులును, మన్మథచంద్రాదిప్రార్థనలు, తద్దూషణంబులును,
వైవాహికపతివ్రతాలక్షణంబులును, అభ్యంగనవిధియును, సూప
కారవిరాజితంబును, విషనిర్విషవిశేషంబులును, భోజనమజ్జన
తాంబూలంబులును, కేళీగృహంబులును, సురతప్రకారంబును,
సురతాంతశ్రమంబును, సంతానవాంఛయు, గర్భలక్షణంబును,
పుత్త్రోదయంబును, బాలింతలక్షణంబును, బాలక్రీడయు,
శైశవంబును, యౌవనంబును నన్నది ద్వితీయాశ్వాసము
సంపూర్ణము.
| 230
|