ప్రబంధరత్నాకరము/చతుర్థాశ్వాసము

చతుర్థాశ్వాసము

క.

శ్రీరమణీరమణీయకృ
పారాజదపారకలశపారావారా
చారుతరలోచనీకృత
నీరజవనమిత్రభేశ నీలాద్రీశా!

1


వ.

దేవా! సూర్యోదయాదివర్ణనంబులు విన్నవించెద నాదరింపుము.

2

సూర్యోదయము

పెద్దిరాజు – అలంకారము [3-113]

క.

[1]ఎచ్చటఁ జూచిన జగముల
నచ్చటనె వెలుంగు [2]నవియు నజహరిహర[3]తా
సచ్చతురుఁ డనియు మఱియును
నిచ్చకుఁ దగఁ బొగడవలయు నిను నుదయంబున్.

3

[3-114]

మ.

కమలామోద మెలర్ప నేత్ర[4]సుఖదాకారంబు రంజిల్ల ను
త్తమవందారుశివంక[5]రత్వ మెసఁగన్ ధర్మార్థకామక్రియా
దిమ[6]మూలం బన [7]నొప్పు మిత్రుఁ [8]డుదయోత్సేకప్రభావంబుచే
సముఁ డద్దేవున కిందువంశజుఁడు త[9]చ్చంచద్గుణశ్రేణులన్.

4

ముక్కు తిమ్మన – పారిజాతము [4-49]

సీ.

[10]మొగుడుఁదమ్ములఁ జిక్కు మగతేఁటియలుఁగులు
              సడలిపోఁజేయు విశల్యకరణి
కాలవశంబునఁ గడసన్న వాసర
              శ్రీఁ గ్రమ్మఱించు సంజీవకరణి
రే యను వాలునఁ [11]బాయలైన రథాంగ
              తతుల హత్తించు సంధానకరణి
తిమిరంబుచే సొంపు సమసినదిశలకు
              వన్నియ నొసఁగు సౌవర్ణకరణి


తే.

మించు [12]బీఱెండ యగ్నిఁ బుట్టించు సరణి
కలుషఘోరపయోరాశిఁ [13]గడపు [14]తరణి

తోఁచెఁ బ్రాచీమహీధరోత్తుంగసరణిఁ
బ్రాఁజదువు మానికంబుల [15]బరణి తరణి.

[16]అయ్యలార్యుఁడు – యుద్ధకాండశేషము [1812]

సీ.

ఘనతమిస్రో[17]న్మత్తకరిరక్తజలములఁ
              జెలువారఁ దోఁగిన సింహ మనఁగఁ
బూర్వపయోరాశి పొందున నుండుక
              వచ్చు బాడమహావహ్ని యనఁగఁ
బ్రథమాద్రిశృంగంబు పైదెచ్చి పెట్టిన
              ఘనపద్మరాగైకకలశ మనఁగఁ
బ్రాచీవధూకరపల్లవతలమునఁ
              గొమరారు విద్రుమగుచ్ఛ మనఁగ


తే.

భానుఁ డుదయించె రాఘవమానవాధి
పతిమనోరథ[18]పరిపక్వఫల మనంగ
భూరితేజంబు వెలుఁగంగ భువనభవన
తిమిరహతిఁ జేయఁ జాలిన దీప మనఁగ.

6

[?]

సీ.

దివసముఖాభినందితచక్రయుగ్మమం
              బుల యనురాగంపుఁబో వనంగ
హరిహరబ్రహ్మమహానుభావంబు లొ
              క్కటిగాఁగఁ గరఁగిన ఘటిక యనఁగ
నతులవేదత్రయలతికాచయము పెను
              పొందఁ బుట్టెడు మూలకంద మనఁగ
++ + + + + + + + ++ + + + +
              + + + + + + + + + + + + + +


తే.

నఖిలజగములు కట్టెఱ్ఱ యగుచు జనన
మాజకరపుటహృదయసరోజములకు
ముకుళనంబును జృంభణంబును నొనర్చి
భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగె.

7

శ్రీనాథుఁడు - భీమఖండము [2-49]

సీ.

ప్రథమసంధ్యాంగనాఫాలభాగంబునఁ
              జెలువారు సిందూరతిలక మనఁగఁ

గైసేసి పురుహూతు గారాపుటిల్లాలు
              పట్టిన రత్నదర్పణ మనంగ
నుదయాచలేంద్రంబు తుదఁ బల్లవించిన
              మంజుకంకేలినికుంజ మనఁగ
శతమన్యుశుద్ధాంతసౌధకూటముమీఁద
              గనుపట్టు కాంచనకలశ మనఁగఁ


తే.

కాల మనియెడు సిద్ధుండు గమిచి మ్రింగి
కుతుక [19]మొప్పఁగ నుమిసిన ఘటిక యనఁగ
గగనమందిరదీపికాకళిక యనఁగ
భానుఁ డుదయించె దేదీప్యమానుఁ డగుచు.

8

పెదపాటి సోమయ - అరుణాచలపురాణము

సీ.

వివిధసదాచారవిధులు వీడ్వడకుండఁ
              గొఱలి కాలము దెల్పు గురుఁ డనంగఁ
జక్రవాకాహ్వయశకుని దంపతులకు
              విరహానలము మాన్చు వె జ్జనంగ
మంజులనక్షత్రమండలనికరంబు
              పాలిటి నిశ్వాసపవన మనఁగ
నాకాంగనలమీఁద నరుణి తనరజంబు
              కడిగి జల్లు వసంతకాండ మనఁగఁ


తే.

బుట్టదమ్ముల పాలిటి చుట్ట మనఁగఁ
గప్పుఁజీకటి మూకల వి ప్పనంగ
నిఖిలలోకములకు ముఖ్యనేత్ర మనఁగ
సూర్యుఁ డుదయించెఁ బరిరక్షితార్యుఁ డగుచు.

9

[?]

మ.

[అ]మరస్థానవిశేషమై తనరు హేమాద్రిన్ శివావాసమై
[రమణీయం]బగు కార్యభూభరము పేరన్ బ్రహ్మ వీక్షించి నె
య్యము సంధిల్లఁగ వానిపై సురనదిన్ హత్తించె లేకున్న నా
యమరక్ష్మాధరమున్ హలాచలము నీరై పోవవే యెండచేన్.

10

కవిలోకబ్రహ్మయ - అరుణాచలపురాణము

సీ.

గహ్వరస్థలమెల్ల గాడి నెఱెలు వాఱి
              యురగలోకమునకుఁ దెరువు లయ్యె
జలమెల్ల నుడుకెత్తి జలచరంబులు మ్రగ్గి

              వారిపైఁ బొట్టలు వాచి తేలె
మృగతృష్ణనీళ్ళని మృగసంఘ మెదురేఁగి
              నొగిలి నల్దెసలకు నోళ్ళు దెఱచె
నాకాశచరకోటి యాతపంబునఁ గ్రాఁగి
              నింగి నిల్వఁగ లేక నేలఁ గూలె


తే.

నింకె నదనదీకూపంబు లెండెఁ [20]జెఱువు
లుండలేరైరి నరులెల్ల నుబ్బచేత
గుంది పథికులు మ్రాఁకులక్రిందఁ బడిరి
కడు భయంబున వీవరి (?) గాడ్పు లెసఁగ.

[?]

చ.

మృడు నయనాగ్నిఁ గ్రోలి హరు మేచకకంఠముమీఁద వ్రాలి య
జ్జడనిధి బాడబానలము చక్కటిఁ దేలి [21]దవప్రభూతముల్
తడఁబడి తోలి తేలి బెడిదంబగు వేఁడిమితోడ వచ్చె న
ప్పడమటిగాలి లోకముల ప్రాణుల జాలి నిదాఘవేళలన్.

12

వర్షఋతువు

పెద్దిరాజు – అలంకారము [3-103]

క.

తటి[22]దటన మేఘపటలీ
ఘటితాంబర[23]శక్రచాపకరకా[24]వ్రాత
స్ఫుటధారాసాదాదివి
కటత నుతింపంగవలయు ఘన[25]కాలమునన్.

13


మ.

చపలా[26]లోకములన్ బయోధరగరిష్ఠశ్రీయు [27]సద్యోల్లస
ద్విపులానందము నంబరాభరణసద్వేషంబునుం [గంకణ
స్థ][28]పుటారావము [29]సొంపు మీఱఁ దగు వర్షావేళ విశ్వేశ్వరా
[ధిపు] సేవించు ప్రగల్భకామినిగతిం [30]దీపించు [31]భావింపఁగన్.

14

[32]చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-16]

చ.

కరములు చాఁపి [33]వడ్డిడుటకై బుధశుక్రుల సాక్షివెట్టి య
య్యరుణుఁడు భూమిచేతఁ దగ నప్పులు [34]గైకొని యియ్యకున్నచో

ధర ధనమూలవృద్ధులకుఁ దక్కక [35]సాగినవారిఁ గూర్చి య
క్కఱ [36]గుడి వ్రాసి యాఁగె ననఁగాఁ బరివేషము చుట్టె నాతనిన్.

15

[2-19]

మ.

ఘనరావంబు చెలంగ భృంగి వినుతుల్ గావించి పాడంగఁ గా
ననమం దెచ్చట నీలకంఠవిలసన్నాట్యంబు రంజిల్లెఁ దా
[ఘనరావంబు చెలంగ భృంగి వినుతుల్ గావించి పాడంగఁ గా
ననమం దెచ్చట నీలకంఠవిలసన్నాట్యంబు రంజిల్లదే.]

16

చిమ్మపూడి అమరేశ్వరుఁడు - విక్రమసేనము

తే.

అంబుదంబులు రత్నాకరంబు నీరు
దలఁచి పద్మరాగములతోఁ దలముఁ దప్ప
ద్రావి దక్కింపఁజాలక ధరణిమీఁద
గ్రక్కెనో యన సురగోపకములు వొలిచె.

17

భావన పెమ్మన - అనిరుద్ధచరిత

సీ.

ఉల్లాసనర్తనోత్ఫుల్లవిభుక్షేత్ర
              బర్హాతపత్రవిభాతి మెఱయ
శంపాలతాజాలసంపాదితోన్మీల
              దాలోలనీరాజనాంశు లుదర
శాతమన్యవచాపజాతశోభాయత్న
              బహురత్నతోరణప్రభలు నెఱయ
జటలీకృతాభోగపటలీసముత్తుంగ
              [మాతంగ]ఘనఘటామహిమ దనర


తే.

గ్రీష్ముశాత్రవుఁ డెంతయుఁ గ్రిందుపడఁగ
జటులగర్జాభయానకస్వనము లెసఁగ
జారుసలిలవిధాభిషేచనము లొదవఁ
బ్రావృడాగమరాజన్యపట్ట మమరె.

18

జక్కన – సాహసాంకము [4-35]

చ.

లలితగతి న్మయూ[రికలు] లాస్య మొనర్పఁగ భేకదంపతీ
కలకల[37]నాదముల్ చెలఁగ గర్జనవాద్యము లుల్లసిల్లఁ గం
దలకు సుమాంజలుల్ [38]వెలయ నర్తనశాలయనం దనర్చె భూ
తలము విచిత్రవారిదవితానతిరస్కరిణీసమేతమై.

19

[39]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-11]

ఉ.

చాతకభాగ్యరేఖ జలజాతపరిచ్యుతి పక్వకందళీ
సూతి చికిత్సకాంగన ప్రసూనశరాసనరాజ్యలక్ష్మి ప్ర
ద్యోతనచంద్రమఃపటు[40]విధుంతుదభీషకసర్వజీవజీ
వాతువు గాననయ్యె [41]నవవారిధరోదయవేళ [42]యయ్యెడన్.

20

[6-20]

ఉ.

క్రూరతటిత్కృపాణ[43]తతిరూఢబలాక[44]కపాలమాలికా
హారిణి నిర్నివారణవిహారిణి [45]కాళిక [46]కాళికాగతిన్
దారుణ[47]లీలమై భువనదాహకుఁడైన నిదాఘదైత్యు నం
భోరుహమిత్రు పేరి తలఁ బుచ్చుక మ్రింగె విచిత్రవైఖరిన్.

21

నంది మల్లయ - మదనసేనము

తే.

వర్షధారలు పన్నగావళులు గాఁగ
బ్రబలు మెఱుపులు తన్మణిప్రభలు గాఁగ
భానుశుభ్రాంశుకాంతులు గాన రాక
యుండె రోదసి పాతాళమో యనంగ.

22

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

మ.

లుఠితాశారవితాంతరంబు చపలాలోకప్రభాసంజ్ఞలున్
జఠరా[48]సహ్య[49]గిరాంవికారమును భూషావేషముం ధూర్తుక
ర్మఠవృత్తంబుగ దుర్దినావళి సుదూరస్ధంబు చేసె న్మహా
శఠముం బోలెఁ గుముద్వతీకమలినీచంద్రార్కలీలన్ [వెసన్.]

23


సీ.

కలయంగ వనవాటికలఁ [50]జోడుముట్టుచు
              కొండమ[ల్లియ] తావి గుబులుకొనియెఁ
బురివిచ్చి పంచమస్ఫుటనాదములతోడ
              నర్తించి గిరులెక్కె [51]నమలిపిండు
దిశల నెఱ్ఱనిఛాయఁ దిలకింపఁగాఁ జేసెఁ
              గణపమ్రాఁకుల కోరకముల సొబగు
విరహమానసములు వేగదొడఁగఁ జల్లి
              [52]కఱ్ఱ గైకొనెఁ దూర్పుగంధవహుఁడు


తే.

చెలగె నెడనెడ [53]నాభీలసలిలపూర
విహరణోద్దండమండూకవీతకంధ

ఘుర్ఘరధ్వానడిండిమాఖండనినద
మభినవంబైన యా జలదాగమమున.

24

భైరవుఁడు – శ్రీరంగ[54]మహత్త్వము [2-26]

మ.

జల[55]దాటోపవిశాల మింద్రధను[56]రంచద్వారుణీకూల ము
త్కలికాలంబకదంబసాల[57]వనమధ్యస్ఫారసవ్యావలీ
కలనా[58]వాల ముదారకేతకపరాగ[59]వ్యాళ ముర్వీధర
స్థలనృత్యన్మదకేకిజాల మగు వర్షాకాల మొప్పెం [60]గడున్.

25

బమ్మెర పోతరాజు – దశమస్కంధము - పూర్వభాగము [754]

సీ.

పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెఁ
              బడమట నింద్రచాపంబు దోఁచెఁ
బరివేషయుక్తమై భానుమండల మొప్పె
              మెఱపు లుత్తరదిశ మెఱవఁ దొణఁగె
దక్షిణగాములై తనరె మేఘంబులు
              జలచరానీకంబు సంతసించెఁ
[జాత]కంబుల పిపాసలు కడపలఁ జేరెఁ
              గాంతారవహుల గర్వ మణఁగె


ఆ.

నిజకరాళివలన నీరజబంధుండు
దొల్లి పుచ్చుకున్న తోయ మెల్ల
మరల నిచ్చుచుండె మహిఁ గర్షకానంద
కందమైన వాన కందు వందు.

26

శరదృతువు

పెద్దిరాజు – అలంకారము [3-105]

క.

వెన్నెల యింపును జుక్కల
చెన్నును దెలుపారు దిశల చెలువంబులు వి
చ్ఛిన్నములగు జలదంబుల
సన్నుతి సేయంగవలయు శారదవేళన్.

27


శా.

సోమశ్రీలకు వన్నెవెట్టుచు వనస్తోమంబునం [61]బర్వునా
శామాలిన్యమునేలఁ ద్రోచు [62]నవరాజద్రాజహంసావళిన్
బ్రేమంబున్ [63]బచరించు మానసమునన్ బెంపై శరద్విభ్రమం
బామోదప్రదమైన విశ్వ[64]విభు నుద్యత్కీర్తికిన్ సాటియై.

28

[65]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [2-59]

సీ.

జగతీస్థలము పట్టుచాలమి పరికించి
              చాలించు లీల వర్షములు వెలిసెఁ
గైకొన్న నీరెల్ల గ్రక్కింప రవి యాఁక
              విడిచు లీల మొయిళ్ళు వికియఁబాఱె
ప్రావృడ్జనని తోడు వాసిన బిడ్డలై
              పెంపేది నదులు శోషింపఁజొచ్చె
రాజుల దండయాత్రలఁ ద్రొక్కుడగు భీతి
              నిలఁ జొచ్చె నన రొంపు లివురఁబాఱె


ఆ.

జలము కలఁక [66]దేఱె సస్యముల్ పక్వంబు
లగుచు వచ్చెఁ దెల్లనయ్యె దిశలు
ఱెల్లు పూఁచె నంచ లెల్లెడఁ గొలఁకుల
నుల్లసిల్లె శారదోదయమున.

29

[2-60]

సీ.

అంబుదంబులఁ గల్గు నాసారవర్షంబు
              కరిమదంబులయందుఁ గ్రాలుకొనియె
కేకి కేకలఁ గల్గు కాకలీభావంబు
              కలమగోపికల వాగ్గతులఁ జేరెఁ
గేతకీతతిఁ గల్గు కృతవికాసస్ఫూర్తి
              కుందవాటికలపైఁ గుదురుపడియె
సురచాపమునఁ గల్గు [67]పరభాగసంపత్తి
              చేల కేఁగెడు శుకశ్రేణిఁ జెందె


తే.

బకకులంబులు గతి విజృంభణమదంబు
మధురకలహంసకులముల నధివసించె
నఖిలలోకప్రసా[68]దావహముగ వాన
కాల మరుగంగ నవశరత్కాలమైన.

30

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము [4-43]

ధ్రువకోకిల.

సకలధాన్యసమృద్ధిచేతఁ బ్రసన్నకౌముదిచే సుధో
దకముచే ననుకూలవర్షవితానశీతహిమంబుచే
సెకలు చల్లని లేఁతయెండలచేత వేడుక సేయఁగా
నకట సాటియె కాలముల్ శరదాగమంబున కెయ్యెడన్.

31

మల్లికార్జునభట్టు – కిష్కింధాకాండ [404]

శా.

సోమస్ఫూర్తికరంబు నిర్మలనదీస్తోమప్రవాహంబు ని
ర్జీమూతంబు నిరస్తకర్దమధరిత్రీకంబు శుభ్రీకృత
వ్యోమాశాంతము ఫుల్లకాశముఁ దుషారోద్గారి యున్మీలితో
ద్దామాంభోజసరోవికాసము శరత్కాలంబు గానంబడెన్.

32

[415]

చ.

దలదరవింద[69]గంధకుముదస్మిత తారకహారచంద్రికా
మలయజ బంధుజీవకు[70]సుమస్ఫురితాధర యుల్లసన్నదీ
పులిననితంబబింబ తిలపుష్పసునాసిక యుత్పలాక్షి ని
ర్మలవిధుమండలాస్య [71]యయి రమ్యశరన్నవలక్ష్మి యొప్పెడున్.

33

హేమంతఋతువు

పెద్దిరాజు – అలంకారము [3-107]

క.

బలవ[72]త్కాలీయకకం
బళ[ఘన]కౌశేయపట్టపటమాంజిష్టం
బులఁ జనదు సీతు యువతుల
వలిచన్నులఁ దక్క ననుచు వలయున్ బొగడన్.

34

[3-108]

మ.

తరుణీయౌవనగర్వజృంభితకుచోదగ్రోష్మగంధంబులన్
వరకాశ్మీరససాంకవాగురురసవ్యాసక్తులం [73]బట్టికాం
బరమాంజిష్టపటాదులన్ హిమగతిన్ బ్రాపింప రీ విశ్వభూ
వరు మెప్పించిన సత్కవీంద్రు లతులావాసంబులం దిమ్ములన్.

35

అయ్యలార్యుని సింగయ – పద్మపురాణము – ఉత్తరఖండము

సీ.

హరి లచ్చి నేప్రొద్దు నక్కునఁ జేర్చుట
              హేమంత మరుదెంచు టెఱిఁగి కాదె
హరుఁడు ఫాలంబున ననలంబుఁ దాల్చుట
              తఱుచైన చలి కోర్వ వెఱచి కాదె
కూర్మంబు మేను సంకుచితంబు సేయుట
              శీతాగమం బగు భీతిఁ గాదె

మొగిఁ బాపఱేఁడు మైముడిగి నిద్రించుట
              తుహినంబు సోఁకునఁ దూలి కాదె


ఆ.

యనఁగ సకలదిశల నలమి జీవులనెల్లఁ
గంప మొందఁజేసెఁ బెంపు మిగిలి
కమలములు హరించి కమలాప్తుఁ గొలువంగ
నప్పళించి శీత మరుగుఁదెంచె.

36


సీ.

నేల యెంతెంతయు [74]నెఱి చంద్రకాంతపు
              రాలఁ గట్టించినలీల మెఱసె
నింగి యెంతెంతయుఁ బొంగి దుగ్ధాంభోధి
              నిట్ట పట్టినమాడ్కి దట్ట మయ్యె
దిక్కు లెన్నెన్నియు నొక్కటి వెలిపట్టి
              తెరచీర లెత్తినకరణిఁ దోఁచెఁ
గొండ లెన్నెన్నియుఁ గొమరాడు హరికతో(?)
              కలయఁ బర్వినరీతిఁ దెలుపు చూపెఁ


తే.

దరువు లెల్లను ఘనసారతరువు లయ్యెఁ
గొండ లెల్లను హరు వెండికొండ లయ్యె
గజము లెల్లను నమరేంద్రు గజము లయ్యె
గురుతరంబగు పెనుమంచు కురియు కతన.

37

భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-36]

సీ.

ప్రత్యూషజృంభితప్రాలేయదుర్లక్ష్య
              మాణపద్మభవాండమండలంబు
సంకులద్వాసరసమయ[75]మందిరభవ
              ద్యోతఖద్యోత[76]భానూత్కరంబు
వితతనిశీధినీవేళాసహస్ఫీత
              శీతరుగ్బింబవిజృంభణంబు
శీతాంశుదుర్విధవ్రాతసంచితకరీ
              షాగ్నిధూమావృతాశాంతరంబు


తే.

నగుచు నంతంత [77]కెగసె నీహారధరణి
ధరసముద్ధూతనిబిడశీతలసమీర
ణాభిసంపాతజాతమాయాతిభీత
జంతుసంతాన మగుచు హేమంత మంత.

38

[78]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-26]

ఉ.

అంతఁ గ్రమంబుతోడ శరదంతమునన్ బరియుక్తమై బలం
బంతయుఁ జెల్లుటం జులకనై [తెలుపై]న మొయిళ్ళు గాడ్పుచే
నెంతయు ధూళియై విరిసి యీగతిఁ దూలెనొకో యనంగ హే
మంతమహోదయంబున హిమంబు తమంబుగ ముంచె లోకమున్.

39

?

ఉ.

+ + + + + + + + + + + + + + + + + + + + +
+ + + పద్మదైత్యహనుమంతము మన్మథకుంభిడింభవే
శంతము నక్తమాలదశశస్త్రవిలూనశరద్విలాససా
మంత మనంతదూరతరమానవతీజనకాంత మెంతయున్.

39క

పెద్దిరాజు – అలంకారము [3-109]

క.

భృశవిచ్ఛిన్నంబగు ది
గ్దశకంబును గమలరుహవితానముఁ బ్రాతః
ప్రశిథిలరవికరమునుగా
శిశిరముఁ బొగడంగఁదగు విశేషక్రియలన్.

40

[3-110]

చ.

వెరవున నాత్మవంశుఁడగు విశ్వనరేశ్వరుమీఁది ప్రీతిఁ జం
దురుఁడు తుషారసంహితుల దొట్టిగఁ బంచిన వచ్చి యచ్చటన్
బరిగొనఁబోలు నంచుఁ జెడి పాఱిన వైరులు భీతిఁ గానలోఁ
దిరముగ నిల్వనేరరొకదే యని చూతురు పందలాత్మలన్.

41

చిమ్మపూడి అమరేశ్వరుఁడు - విక్రమసేనము

చ.

ద్యుమణికినైన జక్కువ లెదుర్పఁగ దుస్తరమైన యట్టి శీ
తమునఁ బ్రియంబు పాటన సుధాకరమౌళికి ఫాలదేశనే
త్రమున వెలుంగు మంటల కతంబున నోరసపోయెఁగాక ని
క్కమునకు నంగమోచి మనఁగా వశమే మది నెంత గూర్చినన్.

42

బొడ్డపాటి పేరయ – శంకరవిజయము

సీ.

మేదినీ[79]జలమెల్లఁ గేదారజల మయ్యెఁ
              గాకున్న [80]వలి యుదకంబు లెట్లు
భూమిలో వడగళ్ళప్రోవు లయ్యెను భూధ
              రంబులు గాదే నివంబు గలిసె
నిందుండు భాస్కరుం డిందుండు గాఁబోలు
              గాకున్న రవి వేఁడి గామి యెట్లు

అఖిలతరులు చలి నంతర్భవించెఁబో
              కాదేని చలికడ గానరాదె


తే.

యగరుమాంజిష్టపటము ప్రియాంకనాంగ
సంగతియు నిచ్ఛ గల భాగ్యశాలి దక్క
మనుజు లీచలి నేమని మనుట గలుగు
ననఁగ శిశిరంబు భువనంబు లాక్రమించె.

43

చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-32]

తే.

స్థావరములైన యద్రులుఁ జలికి వెఱచి
యీడు మీఱిన సానులతోడికూట
ములు విసర్జింపలేవన్నఁ దలప నొరులు
సతులఁ బాసి చరింపంగఁజాలఁగలరె.

44

[81]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-39]

క.

చెప్ప [82]నశక్యంబగు చలి
యుప్పతిలం బాలవృద్ధయువజనములకున్
దప్పక శరణము లయ్యెన్
గుప్పసములు ముర్మురములుఁ గుచకుంభములున్.

45

తెనాలి రామలింగయ – హరిలీలావిలాసము

క.

పెదవియుఁ బెదవియు నుదురును
నుదురును [83]గేల్ గేలు పదమునుం బదము నొగిన్
గదియించి సంధిఁ బెరుగు ప
గిది నొదిగిరి సతులుఁ బతులు కేలిగృహములన్.

46

వీథినాటకము [45]

ఉ.

ప్రక్కలు వంచి వంచి మునిపండ్లును బండ్లును రాచి రాచి రొ
మ్మక్కిలఁ జేసి చేసి తల యల్లనఁ గాళ్ళుల సంది లోనికిం
[84]జక్కికి నొక్కి నొక్కి యిరుచంబడఁ గుమ్మడి మూటగట్టి వీఁ
పెక్కి గువాళిసేయు చలి యిక్కడ నక్కడఁ బోక వేఁకువన్‌.

47

వసంతఋతువు

పెద్దిరాజు – అలంకారము [3-99]

క.

అంకురపల్లవపత్రస
మంకితముకుళప్రసూనహారిఫలములన్
బొంకములగు వనములు ని
శ్శంకముగ నుతింపదఁగు వసంతములందున్.

48

[3-100]

మ.

స్మరబాణంబులు వాఁడులయ్యె గుణవిస్ఫారంబు ఘోరంబుగా
నెరసెం గీరము లంగజాతబిరుదానీకంబుఁ గీర్తించె మిం
చె రసాలాగ్నులు పల్లవార్చులఁ దనర్చెం జంద్రవంశ్యావనీ
వరుతో నల్గుట చెల్లునే [85]యనతయై వామాక్షి కీపట్టునన్.

49

పోతురాజు భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-37]

ఉ.

సంతతపుష్పసౌరభసుజాతి దిగంతము పాంథమర్మభి
త్కుంత ముదాత్తమత్తపికఘోషితమన్మథరాజ్యవైభవో
దంతము జంతుజాతసుఖదస్థితిమంతము [86]దూరధూతహే
మంతము సర్వసాక్షిగ సమగ్రతఁ జూపె వనాంతరంబునన్.

50

[87]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-2]

ఉ.

భాసురలీల నయ్యె నిలపై మధుమాసము గర్వితేక్షుబా
ణాసకృతాట్టహాసము భయాకులపాంథవిముక్తదీర్ఘని
శ్వాసము కోపనా[88]ధృతినివాసము కోకిలకీరషట్పదో
ల్లాసము దత్తభూరుహవిలాసము సర్వమనోవికాసమై.

51

[4-4]

చ.

తెగిన మనోభవుం దిరుగఁదెచ్చి కుజంబులకెల్లఁ బ్రాయముల్
మగుడఁగ నిచ్చి యన్యభృతమండలి మూఁగతనంబు పుచ్చి ము
జ్జగముల వార్తకెక్కిన వసంతభిషగ్వరుఁ డాప్తుఁ డయ్యునుం
దగుగతి మాన్పలేఁడు మఱి దక్షిణవాయువు నందు జాడ్యమై.

52

[4-13]

సీ.

రేల వెన్నెలలు పండ్రెండు సూర్యులఁ జూపు
              బీరెండలై కాసి నీరసింప

దక్షిణానిలము లుద్ధతి నేడు తెఱఁగుల
              పెరిగెడు గాడ్పులై పెల్లగింపఁ
[89]గెంజాయ దిక్కులఁ బింజించు చిగురులు
              కాలానలార్చులై కాఁకఁ బెనుప
నళిశుకపికగర్జ లడరఁ బూదేనియ
              ఘోరాంత్యవృష్టియై [90]కురిసి కలఁప


తే.

విరహవేదన లెసఁగి యుద్వేలగతుల
నద్భుతముగ నేకార్ణవ మగుచు ముంప
నఖిలసుఖకారి యగు వసంతాగమంబు
పథికలోకంబునకు మహాప్రళయమయ్యె.

53

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [2-61]

ఉ.

పండినయాకు డుల్లి నవపల్లవముల్ తిలకింపఁ బూఁబొదల్
నిండఁగఁ బర్వె లేఁగొనలు నిద్ధములై నిగుడంగ మాకు లొం
డొండఁ దలిర్చె నామని సముజ్జ్వల[యోగరసాదనక్రియన్]
గొండిక పాయముల్ మగుడఁగోరి భజించిన సిద్ధులో యనన్.

54

[?]

చ.

గ్రహణ మొనర్చినన్ వృకలికాపుకొలంకము లీనఁజేయుచున్
రహినటవీవధూటి ననురాగరసంబునఁ దెల్పు సత్కళా
+ + + + + + + + + + + + + + + ++ + + + + ++
మహితవిభూతి నంత మధుమాసము వచ్చె విలాసికైవడిన్.

55

[?]

చ.

నవమధువాసవుండు విపిన[91]స్థితభూధరపర్ణపక్షముల్
జవమున మందమారుతనిశాతపవిం దెగవైవఁ దద్రణో
ద్భవరుధి[92]రౌఘముల్ మృదులపల్లవజాలములందె దుర్మతుల్
భువి నెఱుగంగరాదు పికభూతములుం దనియంగఁ బూయగన్.

56

[?]

చ.

సమజమనోజపార్థుఁడు వసంతవిరాటసుతుండు తోడుగా
నమితవనీశమీతరుగతాయుధసంభృతవర్ణచర్మసం
ఘము వెడలించి యా చిగురుఁగైదువు లుద్ధతిఁ బూని యేసె దు
త్తుమురుగ మానగోగ్రహణథూర్వహపాంథకురుప్రవీరులన్.

57

నాచిరాజు సోమయ - [93]మత్తలీలావిలాసము

చ.

సుకృతము కాచెఁగాక చెలి జూదరిపట్టు మదాళిమాలికా
చికుర[94]భరంబు జీర్ణదళచేలములుం గుదియింపఁ [95]ద్రెవ్వునే
సకలవనావనీద్రుపదజాతజనార్దనుభంగిఁ జూడఁడే
యకట వసంతుఁ డీ కిసలయాంశుకసంహతి పెద్ద సేయుటన్.

58

జక్కన - సాహసాంకము [5-1]

సీ.

రాజకీరకుమారరాజి కక్షరశిక్ష
              మొనరింప వచ్చిన యొజ్జ యనంగఁ
గలకంఠనికురుంబకములకు వాకట్టు
              విడిపింప వచ్చిన మొజ్జ యనంగఁ
దరులతాదులకు వార్థకము మానంగ మందు
              సేయంగ వచ్చిన సిద్ధుఁ డనఁగ
సంప్రణయక్రోధజంపతినివహంబుఁ
              గలుప [96]వచ్చిన చెలికాఁ డనంగ


తే.

మందమారుతోద్ధూతమరందబిందు
సిక్తషట్పదజ్యారవశ్రీవిలాస
మకరకేతుప్రతాపసమగ్రమై వ
సంత మేతెంచె సంతతోత్సవ మెలర్ప.

59

ముక్కు తిమ్మన – పారిజాతము [3-51]

సీ.

పరువంబుగాక చొప్పడని మామిడితేనె
              లాన నాసాస నఱ్ఱాడునవియుఁ
దమకించి చిగురాకు [97]గమిచి నో రొగరైనఁ
              గడఁగి గొజ్జఁగినీటఁ గడుగునవియు
[సంపెంగపొదరింటి చక్కి గోరఁటఁ గాంచి
              యుసురంచు మగిడి నోరూరునవియుఁ]
గలిగొట్టు [98]పసరుమొగ్గలఁ [99]గోర్కి పొలివోయి
              మునుపటి మొల్లల మూఁగు నవియుఁ


ఆ.

ననుచుఁ దేఁటికదుపు లామనిఁ దలసూపెఁ
జూపుదనుక నెల్లచోటఁ దోఁట
యందుఁ దామ యగుచు నమ్మరు నెలగోలు
[100]పౌఁజు లనఁగఁ జూడ్కి పండువయ్యె.

60

చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-100]

సీ.

మంచున మేనెల్ల [101]మరించి పత్రసం
              చయమును డుల్చు విశల్యకరణి
ముదిరిన తరుజాతమునకుఁ జిత్రంబుగాఁ
              దారుణ్య మొసఁగు సంధానకరణి
పసరు చందముఁ దోఁచి యొసఁగెడు కోరక
              వ్రాతంబునకును సౌవర్ణకరణి
హరునిచే మటుమాయమై మే నెఱుంగని
              చిత్తజాతునకు సంజీవకరణి


తే.

పలుకనేరని కోకిలప్రకరమునకు
నంచితస్వర మిచ్చు మహౌషధంబు
కాముకశ్రేణులకునెల్లఁ గాలకూట
మనఁగ మించె వసంతసమాగమంబు.

61

[?] - వెంకటవిలాసము

శా.

చాతుర్యం బెసగన్ హిమాహ్వయదశాస్యధ్వంసియై తెచ్చె వి
ఖ్యాతిం బంకజలక్ష్మి సీత బలె దానారామనామస్థితిన్
చేతోజాతవిభాషణున్ నిలువఁజేసెన్ జేసి యిట్లేలకో
జాతిద్వేషము పూనె రామసమతన్ జైత్రుండు పెంపొందియున్.

62

బొడ్డపాటి పేరయ – శంకరవిజయము

తే.

రాగరంజితకుసుమపరాగపటలు
లంబరముఁ గప్పె మలయజోద్ధతము లగుచు
గగనచరులెల్ల వీథు లుత్కంఠ నాడు
రమ్యవాసంతకుంకుమరజ మనంగ.

63

మడికి సింగయ – వశిష్ఠరామాయణము [4-4]

ఉ.

అంతఁ బ్రవేశమయ్యె మదనాధిపరాజ్యరమావిభూషణా
నంతము భూరిసౌరభలతాంతము కోకిలచంచరీకసా
మంతము పూర్ణచంద్రరుచిమంతము పాంథవిలాసినీమనో
ధ్వాంతము దంపతిస్వదనవంతము నాఁగ వసంత మున్నతిన్.

64

నండూరి మల్లయ్య - హరిదత్తోపాఖ్యానము

మ.

శుకవాక్యస్ఫుటమంత్రముల్ దనర నస్తోకప్రసూనోల్లస
న్మకరం[102]దాజ్యసుధార లొప్పఁగ వసంతక్ష్మాలసద్వీథిఁ గిం

శుకపుష్పాగ్నులఁ జైత్రయాజకుఁడు దా సూనేష్వజప్రీతి ను
త్సుకతన్ వ్రేల్చె ద్విజాతియందు శశి[103]దత్తున్ శ్రీవశున్ బ్రేమతోన్.

65

వనవిహారము

పెద్దిరాజు – అలంకారము [3-115]

క.

చారుతరచైత్రసంప
త్పూరితవిభవముల వేడ్క పొంగుడువడఁగా
నారీజనసహచరుఁడై
యారామవిహార మొప్ప నధిపతి సేయున్.

66

[3-116]

సీ.

మానినీగండూషమధువులఁ బూచిన
              [104]పొగడను సొబగొప్పఁ బొగడి పొగడి
నారీపదాహతి ననిచిన కంకేలి
              పరువంబు నగ్గించి పలికి పలికి
లలనావలోకనంబులఁ బుప్పితంబగు
              తిలకంబుపైఁ జూడ్కి త్రిప్పి త్రిప్పి
వనితోపగూహనంబునఁ బేర్చు సురపొన్న
              మేటి పుణ్యమునకు మెచ్చి మెచ్చి


తే.

మన్మథాంశావలుల పొంత మలసి యలసి
శుకపికాళివిహారంబు చూచి చూచి
సతులుఁ దానుఁ జరించు వసంతవేళ
ప్రమదవనమున విశ్వభూపాలవరుఁడు.

67

[105]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-21]

సీ.

అలరుల కెత్తుచో నఱచేతి కెంజాయ
              లొదవి కోయిలల నోరూరఁజేయు
నునుమేను లలసి మ్రానులమీఁద నొరగుటల్
              తీవెలు [106]వ్రాకిన తెఱఁగు దెలుపఁ
జెలికత్తియల లీలఁ బిలుచు నున్పలుకుల
              మదకీరసమితికి మాట లార్ప
భుగభుగ వలచు నూర్పుల తావు లెసఁగి క్రొ
              న్ననలకు వింతవాసన లొసంగ

తే.

నిక్కి కొనకొమ్మ లందుచో నీవి జాఱి
బయలుపడి యొప్పు నాభి[107]కూపముల సొబగు
లంగలతలకు నరవిరులై చెలంగ
సతులు పుష్పాపచయకేళి సలిపి రర్థి.

68

[4-23]

చ.

పొడవున నున్న పల్లవునిఁ బువ్వుల వేఁడుచు నొక్క నెయ్యపుం
బడఁతుక హస్త మెత్తుటయుఁ బయ్యెద జాఱి కుచోదయాద్రిపై
బొడచి వినూత్నరాగరుచిఁ బొల్పు వహించు నఖాంకచంద్రుచే
ముడిఁగె నొకింతలో సవతిముద్దియపిండు ముఖారవిందముల్.

69

[108]తెనాలి రామలింగయ – హరిలీలావిలాసము

సీ.

నిఱుపేదకౌ నింత నిక్కింతన దళియై
              రోమాళి తన కలరూపుఁ దెలుప
నున్నతోన్నతమూర్తిఁ జెన్నొందు కటిసీమ
              కనయంబు తొంటి పొంకంబు సడలి
పనపుఁబయ్యెదఁ జాఱ బయలైన పాలిండ్లు
              చూపరకోర్కులు చూఱ లిడఁగ
నవవిభాగంబు నన లవలవై యున్న
              వేణి దొల్తటి కమ్మవిరులు దొరుగఁ


ఆ.

గక్షభాగరుచులు కనకంపుఁబొడి వెద
చల్లు లాడు నొక్కచంద్రవదన
కొసరి కుసుమబంతిఁ గోయు కైతవమున
నత్తపస్విమ్రోల బిత్తరించె.

70

భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-69]

సీ.

పదముల కెంజాయ పరగనిచ్చినచోటఁ
              జిగురాకు పఱిచిన చెలువు [109]నెఱప
తీగకై[110]వడి గౌను సాగనిక్కిన నీవి
              వెడజాఱి [111]నతనాభి[112]బెడఁగు దెలుపఁ
బరువంపువిరులపైఁ బచరించు చూడ్కులు
              మొగమెల్లఁ గన్నులై మొరువు చూప
గేలు సాఁచిన నివ్వగిలు కక్షకాంతులు
              జిగు చన్నుఁగ్రేవల జీరువాఱ

తే.

మలఁగి జఘనంబు వెనుకకు మాగ నిగిడి
వ్రేళ్ళపై ముద్రికల మించు వెల్లిగొనఁగ
వాఁడి వాలారు కొనకొని వలను మెఱసి
కోర్కులె చరింపఁ బువ్వులు గోసె నోర్తు.

71

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [2-81]

సీ.

మునిగాళ్ళ మోపి నిక్కినఁ బదచ్ఛవి నేల
              యును బల్లవించిన యొప్పు పడయ
వలువేది నతనాభి వెలసి యొక్కింత సా
              గిన మధ్యమెంతయు తనుత నొంద
మొగమెత్తి మీఁదికి నిగిడించుఁ జూడ్కులు
              కన్నుల విప్పెల్లఁ గానఁబడఁగఁ
గడలొత్తు కరమూలఘనకాంతి సూపఱ
              డెందము వోనీక ద్రెక్కొనంగ


తే.

నొయ్య డాకేలు దవ్వుల నున్న తీఁగఁ
దిగిచి నఖదీప్తు లంతంత దీటుకొనగ
లీలఁ బెఱకేల నచ్చరలేమ యోర్తు
గోసెఁ బువ్వులు ప్రమదవికాసలీల.

72

[113]

తే.

వలపుగాడ్పులు నూర్పుల గలసి బెరయఁ
దుమ్మెదలు గుంతలంబులు దొట్రుపడఁగఁ
బువ్వులును నవ్వులును గూడి బొత్తుగలచు
విరులు గోయఁదొణంగి రవ్వేళయందు.

73

జక్కన – సాహసాంకము [5-27]

ఉ.

అందని పువ్వుగుత్తి దెసకై యఱు సాపఁగ నేల బాల? కో
యం దలపయ్యెనేని నెగయ న్నిను నెత్తెదనంచు సంతసం
బందఁగ నెత్తి యెత్తి విభుఁ డందఱి ముందఱ దించుచుండఁగా
నందినకంటె సంతసము నందె లతాంగియు మాటిమాటికిన్.

74

బొడ్డపాటి - రాజశేఖరవిజయము

సీ.

కరపదాధరకాంతి గప్పిన చోటెల్లఁ
              బువ్వులుఁ జిగురులు పోలికలుగ
నఖకపోలస్థలముఖరోచు లించుచోఁ
              బరలుఁ దుమ్మెదలును విరులు గాఁగఁ

గజ్జలాంతకటాక్షకచరుచుల్ వొలయుచోఁ
              [114]దలిరులు విరులును నళులు గాఁగఁ
గక్షవక్షోజాంగకచ్ఛవి సోఁకిన
              నన్నియు గోరింట లగుచు మెఱయ


తే.

వెఱగుపడి నవ్వు నవ్వుచో వింతరీతి
నిల్పియును గుసుమంబులే నివ్వటిల్లఁ
దన తనూవిభ్రమములని తలఁప కొకతె
గుఱుతు లరయుచు నొకభంగిఁ గొనియె విరులు.

75

దశదోహదములు

ముక్కు తిమ్మయ – పారిజాతము [4-9]

మ.

విను మింతు ల్దిలకంబుఁ జంపకముఁ [115]గ్రోవిన్ సిందువారంబుఁ బ్రేం
కనమున్ మామిడి గోఁగుఁ బొన్నఁబొగడన్ గంకేలి నూహించి క
న్గొన మో మెత్తఁగఁ గౌఁగిలించుకొన మూర్కోఁ బాడఁ జే నంటఁ బ
ల్క నగం గ ల్లుమియంగఁ దన్న ననుచున్ [116]గల్పాగ మాయావిరుల్‌.

76

[4-10]

చ.

కనఁ [117]దిలకంబుఁ గేసరముఁ గ ల్లుమియ న్రహిఁ బాడఁ బ్రేంకనం
బు [118]నిముర మావి నవ్వ సురపొన్న ముఖాంబుజ మెత్తఁ జంపకం
బు నెఱ గవుంగిలిం గొరవి మూర్కొన వావిలిఁ దన్న [119]వంజులం
బు [120]నుడువ గోఁగునై తరుణి! పూఁచు సురద్రుమ [121]మిన్నిపువ్వులున్‌.

77

భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-61]

సీ.

పాణిపల్లవమృదుస్పర్శఁ జూతంబుల
              సుకరాంఘ్రిహతుల నశోకములను
గలభాషణంబులఁ గర్ణికారంబుల
              వదనాసవంబుల వకుళములను
పరిరంభణంబులఁ గురువకప్రతతుల
              దృగ్విలాసంబులఁ దిలకములను
దరహాసకాంతిసంతతి సురపొన్నల
              సమదరాగంబులఁ జంపకముల

తే.

నసమసంగీతలహరిఁ బ్రియాళములను
జారుముఖగంధముల సిందువారములను
ప్రౌఢనఖరాంకురక్రీడఁ బాటలముల
నాదరంబార నంతంతఁ బ్రోది చేసి.

78

ఘటవాసి మల్లుభట్టు – జలపాలిమాహాత్మ్యము

సీ.

అతివ [122]పాదాంబుజాహతి నశోకము పూచె
              [123]వెలది యూర్పునకు [124]వావిలి [125]హళించె
లలన చూపులచేతఁ [126]దిలకంబు పులకించెఁ
              గోమలి కౌఁగిటఁ గొరవి ననచెఁ
గామినీవదనసంగతి నుబ్బె సంపెంగ
              తరుణిచేఁబడ్డ చూతము ఫలించె
వనితగీతమున ప్రేంఖణము వాసన మించె
              నారి నవ్విన కర్ణికార మలరె


తే.

నాతి మాటలవలనఁ బున్నాగతరువు
పొలఁతి మద్యంబు లుమియంగఁ బొగడ మించెఁ
జంద్రవదనలు విహరించు చతురగరిమ
నీరసంబులు సారస్యనిరతిఁ బొందె.

79

బొడ్డపాటి పేరయ – శంకరవిజయము

తే.

పాది గండూషమధు వుల్కి పల్కుజిఁల్కఁ
జూచి గోరొత్తి ముద్దిడి చాఁచి నవ్వి
[127]యూపు దాలించి కౌఁగిట నుపచరించి
ననువుచే నుండెఁ దరువులో నాథులొక్కొ.

80

అళివర్ణన

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

మ.

సకలారామములన్ మదాళి వినుతుల్ [128]సంపూర్ణమై యొప్పుఁ బు
ష్పకదంబంబుల హత్తుచున్ విడుచుచున్ [129]చాటించు చొక్కించు కిం
చుక కప్పించుచుఁ బాంథచిత్తములు సంక్షేపింపఁగా మ్రోయుచున్
ప్రకటానంగధనుర్గుణక్రియలు చూపన్ దారియై యేపునన్.

81

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [2-68]

చ.

వలి [130]విరవాది క్రొవ్విరుల వాతుల మూతులు వెట్టి తేనియల్
కొలఁదికి మీరఁ గ్రోలికొని క్రొవ్వున [131]జివ్వల నీన నొక్కమై
దలముగ [132]దీటు గట్టుకొని దాఁటెడు తేఁటుల చైది నెల్లచోఁ
గలయఁగ వృక్షవాటికలఁ గ్రమ్మె న[133]కాలతమోనికాయముల్.

82

భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-46]

చ.

అరవిరి కమ్మఁ దమ్మి విరు లందుట నెందును సోడుముట్ట న
బ్బురముగ [134]నుబ్బు మేలివలపుల్ [135]పసిఁగొంచు మూఁగిలో
గుఱువులు [136]వాఱి కర్ణికలఁ గొందుల వాచవు లూరు తేనె ము
మ్మరముగఁ [137]గ్రోలి యన్నుకొని మానక ఝమ్మని మ్రోసెఁ దుమ్మెదల్.

83

చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-107]

తే.

భూరిమధుపానమునఁ [138]జొక్కి పుష్పరేణు
పటలి భూతిగఁ దాల్చి నేర్పరితనమున
ఝంకృతులు శృంగనాదంబు జాడ గాఁగఁ
దుమ్మెదల పిండు మించె సిద్ధుల విధమున

84

కోకిలవర్ణన

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

సీ.

భామినీసమితికిఁ బంచమస్వరముల
              బాగులు నూచు నేర్పరు లనంగ
విటవీటిజనులకు వినమ్రోసి మన్మథా
              వేశంబుఁ గావించు వెజ్జు లనఁగ
విరహిబృందములకుఁ బొరి నుల్కు పుట్టించు
              గొఱతెడు మరు వెఱగొంగ లనఁగ
నిల వసంతునికి మిక్కిలి సొంపు గలిగింపఁ
              డాలైన యట్టి చుట్టము లనంగ


తే.

సొగసి తలిరుల వాచవిఁ జూచి చూచి
పక్వసహకారఫలరస[139]పాయు లగుచు
ధరఁ బురారామపాదపవరులు కాఁపు
లున్న కోకిలదంపతు లుల్లసిల్ల.

85

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [2-73]

చ.

మనసిజు మంత్రఘోషములు మన్మథు నానతిమాట లిందిరా
తనయ విలాసహాసములు దర్పకు నార్పుటెలుంగు లంగజ
న్ముని చదువుల్ మనోభవు మనోహరగీతు లనంగఁ జారుఖే
లనములు నెల్ల దిక్కులఁ జెలంగె మదోత్కటకోకిలధ్వనుల్.

86

భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-44]

చ.

గునియుచు గుజ్జు మావి[140]నెలఁగొమ్మల నిమ్ముల వ్రాలి సోగలై
గొనలు దెమల్చి కెంజిగురు గుంపులు [141]లంపులు మేసి క్రొవ్వి వీ
కున నొగ[142]రెక్కి [143]డగ్గుపడు కుత్తుకలం గడలొత్తు నూతన
స్వనములు పంచమశ్రుతులఁ [144]జట్టికొనం [145]జెరలించెఁ గోయిలల్.

87

చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-105]

మ.

ఒగరెక్కం గడులేఁతలై మృదువులై యోగ్యంబు[146]లై యున్న యా
చిగురాకుల్ దమ కంఠదోషముల నుచ్ఛేదింపఁగాఁ జాలు మం
దు[147]గతిన్ మేసి పికంబులెల్లఁ దరుసందోహంబులన్ వ్రాలి [148]సో
లి గరిష్ఠంబగు పంచమస్వరముఁ గ్రోల్చె న్మన్మథప్రీతిగాన్.

88

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

చ.

పలుకులు బాలికాజనుల భాషలు వీడువడంగఁ జంచులున్
ఫలములు కెంపు పొత్తుఁగొనఁ బక్షములన్ బసరాఁకుఁజొంపముల్
చెలిమి యొనర్ప వర్తనము చిత్తజుఁ డాడియుఁ గూడి రా ++
చిలుకలు వొల్చు తోటల వసించిన పొందులు వేటలాడుచున్.

89

భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-47]

చ.

మిలమిల మంచు [మించు] చలిమించుల [149]ముద్దుల చందమామ కాం
తులఁ దులఁదూఁగు క్రొమ్మొలక [150]తూఁడుగొనం గబళించి [151]త్రుంచి వి
చ్చలవిడి మేసి గబ్బుఁగొని సమ్మదనాదము లింపఁ గేలి లీ
లల మలసెం గొలంకుల కెలంకుల రాజమరాళదంపతుల్.

90

భావన పెమ్మన - అనిరుద్ధచరిత

చ.

లలితమృణాలముల్ సెలవులన్ రసముట్టఁగ రెండొకంటికిన్
బొలయఁగ నిచ్చుచుం దరఁగ యూయెల లూఁగుచు సైకతస్థలం
బుల విహరింపుచున్ దొగల పొంతల నాడుచుఁ జారులీలలన్
గొలఁకుల నెల్ల భోగములఁ గూడి చరించు మరాళదంపతుల్.

91

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

ఉ.

మీనపతాకకేలిఁ దమ మేను లెఱుంగక వ్రాలునప్డు సూ
న్యూనత తమ్మితేనియల నూనిన తేంట్లన నొప్పు నచ్చటన్
దౌ నలినారచేతమును నజ్జని వ్రేళ్ళను బెల్లగింపఁగాఁ
బూని య[నే]కరూపములఁ బుట్టినభంగిఁ గళంకితచ్ఛవిన్.

92

జలకేళి

పెద్దిరాజు – అలంకారము [3-117]

క.

నీరజములుఁ జెంగలువలుఁ
గైరవములు వీచికలును గరయంత్రపయో
ధారలు నావర్తంబులు
వారివిహారంబునందు వర్ణము లరయన్.

93

[3-118]

చ.

వళులును వీచికావళులు వారిరుహంబులు వక్త్రపంక్తులున్
జెలువగు నాభులున్ [152]నుడులుఁ జేతులు రక్తసరోరుహంబులున్
జలదలకంబులున్ మధుపజాలము వీడ్వడఁ గేలి సల్పి మిం
చులు గొను చూడ్కులన్ సతులు సూతురు విశ్వనృపాలమన్మథున్.

94

[153]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-43]

సీ.

కదళిక లను కంటెఁ [154]గరభంబు లను కంటె
              నిభకరంబులఁ బోల్చ నిప్పు డనువు
చక్రంబు లను కంటె శకటాంఘ్రు లను కంటె
              నిసుక[155]తిప్పలఁ బోల్చ నిప్పు డొప్పు
గుచ్ఛంబు లను కంటె కుధరంబు లను కంటె
              నిఱి జక్కవలఁ బోల్ప నిప్పు [156]డొనరు
నద్దంబు లను కంటె నమృతాంశుఁ డను కంటె
              [157]నెల తమ్మి [158]గమిఁ బోల్ప నిపుడు తగవు


ఆ.

నాఁగఁ బొలిచి రంగనలు నీటియాటల
కెచ్చరించి [159]తఱియు నెడఁ గొలఁకుల
తోయసంగమమునఁ దొడలను బిరుదులఁ
వలచనుంగవలను వదనములను.

95

[4-49]

చ.

అలరి యొకింత మాఱుమొగమై యఱచేతుల నొగ్గికొన్న న
చ్చలమునఁ గాముకుండు పయిఁ జల్లెడు నీటిమెఱుంగుదుంపరల్
చెలువ చనుంగవం బొలిచెఁ జేరి తదీయనఖాంకచంద్రులన్
గొలిచి వినూతనద్యుతులు గొల్పెడు తారకపంక్తులో యనన్.

96

నంది మల్లయ - మదనసేనము

ఉ.

చేడెలు క్రిందిమెట్టునకుఁ చేతులు పట్టుకు డిగ్గుచుండఁగా
నీడలుఁ దోఁచె నంబువులు నెమ్మిఁ దలిర్పఁగ నాగకన్యకల్
చూడఁగ వచ్చిరో యనఁగఁ జూచెడి పండువ సేసె వేడుకం
దోడుగ వచ్చె నంచలు మనోహరయానము లభ్యసింపుచున్.

97

[?]

చ.

దుమికిన మీఁదికై యెగయు తుంపర లన్నవతార లుబ్బి త
ద్విమలముఖేందుబింబములు వెన్నెల గాయఁగఁ దత్సరోవరా
బ్జములు [వ]డంకఁజొచ్చె దివసంబు నిశాసమయంబు శంక సే
య ముదముతోడఁ గల్వలు రయంబున గంతులు వైచె నత్తఱిన్.

98

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము [3-196]

చ.

తన యుదకంబునం దొక సుధాకరబింబముఁ గల్గఁజేసె న
వ్వననిధి యేమి చిత్రమని వారిరుహాకర మంబురాశిఁ గా
దని సితచంద్రబింబముల నప్పుడు గల్గఁగఁ జేసెనో యనన్
వనితల మోము లింపెసఁగె వావిరి గుబ్బలబంటి నీరునన్.

99

ముక్కు తిమ్మన – పారిజాతము [4-37]

చ.

పెరిఁగిన హారరత్నముల పెల్లున [160]నొక్కెడఁ దామ్రపర్ణియై
నెరసిన సోగ[161]పెన్నెఱుల నిగ్గున [162]నొక్కెడ భానుకన్యయై
గురుకుచకుంభలిప్తనవకుంకుమ నొక్కెడ శోణయై నభ
శ్చరనది యొప్పె దివ్యజలజాతముఖు ల్జలకేళి సల్పఁగాన్‌.

100

[4-38]

చ.

అలకలు నాసికామణియు నన్నువకౌనుఁ గుచద్వయంబుఁ గుం
డలములుఁ జంచలింప జతనంబున హస్తము లూఁది జీఁకుబం
డల దిగజాఱి రొండొరుకడన్ దరళాక్షులు దోనివింటఁ విం
జలు గొన నేయు పుష్పశరు సంపెఁగవాలికతూఁపులో యనన్‌.

101

మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [2-157]

తే.

[163]పదువు రొక్కటియై యొక్కపడఁతిఁ దఱుమ
నిలువుటీఁతలఁ బాఱెడు నీలవేణి
తోఁచె హిమరోచి పెక్కుమూర్తులు ధరించి
రాఁదలంకుచుఁ బాఱెడి రాహు వనఁగ.

102

చరిగొండ ధర్మయ – చిత్రభారతము [3-12]

సీ.

అంగుష్ఠములు [164]ముట్టి యంఘ్రితలంబులఁ
              జెంది గుల్భంబుల నంది [165]యూరు
వులఁ జేరి జఘనస్థలు[లు] సోఁకి నాభిరం
              ధ్రములను [166]సుడిసి పక్షముల నూఁది
చన్నులు [పట్టి] కక్షంబుల నొరసి కం
              ఠములు నిమిరి కపోలములు పుణికి
యధరంబు లాని నయనముల నొరసి ఫా
              లములఁ జుంబించి శీర్షముల నంటి


తే.

క్రమము మీఱఁగ నిరతాభిరతి దలిర్పఁ
గళల నెలవులు పరికించు కాంతు లనఁగఁ
జాలి నీరజపత్రలోచనలనెల్ల
సారసామోదయుతసరోజలము లలమె.

103

వస్త్రములు

[167]సంకుసాల సింగన – కవికర్ణరసాయనము [4-60]

తే.

బహురసార్ద్రతఁ దము నంటి పాయలేని
వసనములు [168]డించి సతులు నీరసములైన
క్రొత్తమడుఁగులు వేడ్కఁ గైకొనిరి యహహ
ప్రియముఁ గైకోరు నూతనప్రియలు సతులు.

104

అంగర బసవయ - ఇందుమతీకల్యాణము

సీ.

బొమ్మంచులువ్వంగమలు గజపొప్పళ్ళు
              జిలుగుఁ జెంగావులు చిలుకచాళ్ళు
వలిపెంపు లెడమధావళములు ముత్యాల
              పందిళ్ళు వోజులు పచ్చబట్లు
గుళ్ళకాపులు చిత్రకోలాటములు గంధ

              గావులు సతినీలు గర్భసుఖులు
మేఘవన్నియలు లక్ష్మీవిలాసములు కం
              టకగుబ్జగలును నందనవనాలు


తే.

మండలాచరణంబులు నిండు జంత్రి
కలు చలారులు షీటులు కారికములు
తోరహస్తుకకలంభీలు దుప్పటములు
కటితలంబుల నొప్పుగాఁ గట్టుకొనిరి.

105

భూషణములు

అంగర బసవయ – ఇందుమతీకల్యాణము

సీ.

[169]బబ్బిలికాయలు బంగారుమొగులుపి
              ల్లాండ్లు మట్టియలు బాదాంగకముల
మొలనూళ్ళు కంకణంబులు వీరముద్రిక
              లంగుళీయకములు హారతతులు
కేయూరములు భుజకీర్తులు తవసాలు
              కట్టాణిముత్యాల కంటసరులు
సూడిగంబులు చేరుచుక్కలు బవిరెలు
              గుబ్బసరంబులు కుండలములు


తే.

ముంగరయు బన్నసరములు మొలపుతీఁగె
లల్లిపువ్వులు పతకంబు లంజికట్లు
[170]చేకటలు నాఁగ వడిగెలు చెవుల పువ్వు
లవయంబులఁ దాల్చిరి యమరఁగాను.

106

[171]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-61]

చ.

స్మర[172]పరిదత్తహస్తములు సర్వసమీక్షణభాగధేయముల్
తరుణిమరత్న[173]సానువులు దర్పకదర్పలతావసంతముల్
వరహృదయానురాగరసవార్థి[174]వివర్ధనపూర్ణచంద్రమః
కరములు వేడ్కఁ గైకొనిరి కాంత లలంకరణంబు లయ్యెడన్.

107

మధుపానము

పెద్దిరాజు – అలంకారము [3-119]

క.

సంభోగకరము మదనా
లంబనము నశేషరస[175]విలసితము నంత
ర్బింబితవదనమునగు కా
దంబరి యావాసమునకుఁ దగు నొడఁగూర్పన్.

107

[3-120]

మ.

అలినాదంబులు తాలమానములు గా[176]నాలప్తి గావించుఁ దొ
య్యలి యో[177]ర్తొక్కతె పాడు విశ్వవిభు నేలాదిప్రబంధములన్
తెలివిం గైకొని యోర్తు సారంగముగ నర్తించున్ గళాసించు ను
గ్మలి యొక్కర్తెయుఁ గ్రాలు సోలములతోఁ గాదంబరీగోష్ఠిచేన్.

109

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [3-96]

చ.

నెలతుక యోర్తు చేతి హరినీలశిలామయపాత్రఁ బూర్ణసం
చరితతరంగయై పొదలు వారుణిఁ దోఁచు సుధాంశుమండలం
బలఘుకరాళరాహువదనాహతి స్రుక్కి కరంబుఁ [బిమ్మిటిం
గలఁ]గి పొరింబొరి న్వణకు కైవడిఁ గానఁగనయ్యె నయ్యె[డన్].

110

[178]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-160]

సీ.

కోపం[బు లేక భ్రూ]కుటి ఘటియించుఁ బో
              లింపంగ లక్ష్యంబు లేక చూచుఁ
బిలువకుండఁగ నైనఁ బలుకు నోహో యని
              బయ లూఁతగొనఁజూచుఁ బాఱఁజూచుఁ
గారణం బొండులేకయ నవ్వు వికవిక
              గ్రాలెడు నీడపై సోలజూఁచుఁ
జేరువ నెచ్చెలిఁ బేరెలుంగునఁ జీరు
              మనసు లేకయ పాడు మాని మాని


తే.

బ్రస్తు[తము గాని వెడ] తొక్కు బలుకుఁ బలుకు
మ్రోయు తేఁటులతోఁ [గూడి ముచ్చటా]డు
నుబ్బి జాబిల్లిఁ బిలుచు రాకున్న నలుగు
మ[గువ యొక్క]తె మధుమదోన్మత్త యగుచు.

111

[?]

చ.

తమ ముఖదర్పణ[౦బు]లు ముదంబున నాసవపూర్ణపాత్రలం
దమరఁగఁ దోఁచినన్ జలరుహాక్షులు గన్గొని రోహిణీసతీ
రమణునిఁ గట్టి రేమనఁ [179]గరంబుల [180]శీధురసంబుఁ గ్రోలఁగాఁ
బ్రమద మెలర్ప నిందుఁ బడి పాయదు తన్మధురప్రయత్నుఁడై.

112

తెనాలి రామలింగయ – హరిలీలావిలాసము

సీ.

సింధుపూరితముగాఁ జిప్ప నివాళింపు
              జేవెలుంగిడి చూచుఁ జేతి మదిర
యించుక చవిగొను నించుఁ జేరువనున్న
              బోటికిఁ బొలముట్టి తేట లించు
నొక యేలపదము మిన్నక పాడి తోడన
              నేమంటినే యేను నేరికైన
సవరని మొగమెత్తు జాబిల్లి నీక్షించుఁ
              గడు రహస్యములైన కడల నాడు


తే.

మెచ్చుఁ దలయూఁచు నగుఁ దోన[వచ్చుఁ జెంత]
నలరు లోఁబడు జాతులఁ గలియఁ దరుల
నొఱగు [తొలఁ]గు నేర్పెఱుఁగు నలరు[లు దాల్చు]
మగువ యొక్కతె మధుపాన[మత్త యగు]చు.

113

సిద్ధపురుషుఁడు

జక్కన – సాహసాంకము [6-4]

సీ.

ఆదినాథుని యపరావతారము పూని
              మత్స్యేంద్ర[నాథుని] మహిమఁ [181]దనరి
సారంగనాథుని సామర్థ్యమును [బొంది]
              [182]గోరక్షనాథుని గుణముఁ దాల్చి
సిద్ధబుద్ధిని బుద్ధి చిత్త[మునం జేర్చి]
              [183]ఖనిరు విద్యాధికఘనతఁ జేర్చి
మేఖనాథుని మంత్రవైఖరి వహి[యించి]
              [నాగార్జును]ని కళాశ్రీ గమించి


తే.

యా విరూపాక్షుఁ డితఁడన నతిశయిల్లి
[యర్థి నవనాథసిద్ధుల] కైక్యమైన
మోహనాకృతి యితఁడను మూర్తిఁ దనరి
[చిన్మయాస్వాం]తుఁ డగు నొక్క సిద్ధవరుఁడు.

114

[6-5]

ఉ.

పాదములందు బంగర[పుఁబావలు] [184]వెట్టి దుకూలకంథమై
మోదముతోడఁ దాల్చి జనమోహ[నమా]రణధాతువాదయం
త్రాదిసమస్తవిద్యలఁ సమర్థు లనందగు [శిష్య]పఙ్క్తి య
త్యాదరభక్తి రెండు మెయిలందుఁ దనుం గొలువ న్మహోన్నతిన్.

115

తెనాలి రామలింగయ - కందర్పకేళీవిలాసము

సీ.

మౌళి గెంజడల జొంపము ఫాలపట్టిక
              దీండ్రించు భసితత్రిపుండకంబు
కర్ణకీలితరత్నకామాక్షియుగళంబుఁ
              బలుచని నెమ్మేనిఁ బట్టుకంథ
కరముల బంగారుసరకట్టుఁ గిన్నెర
              హరిణశృంగంబుఁ బేరురమునందుఁ
గరమూలమున భూరి[185]తరవారి సన్నంపు
              నడుమున నొడ్డియాణంబు దిద్దు


తే.

[186]పిఱుఁదుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన
యోగవాగలు శూలంబు నాగసరము
పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు
నిరుపమాకారసిద్ధుఁ డరుగుఁదెంచె.

116

జక్కన – విక్రమార్కచరిత్రము [7-14]

సీ.

[187]మత్తికాటుక పొత్తు మరగిన నునుఁగెంపుఁ
              జూపులఁ గలికిమించులు నటింపఁ
బెక్కువన్నెల కంథ [188]చక్కిఁ జిక్కక నిక్కి
              చనుదోయి కెలఁకులఁ [189]జౌకళింప
సంకుఁబూసల క్రొత్తసరులు నిగారించి
              [కంబుకంఠము] నూత్నకాంతి నొసఁగ
పలుగుఁగుండలముల ప్రభఁ బ్రోదిసేయు[చుఁ
              జెక్కులఁ జిఱు]నవ్వు చెన్ను [190]మీఱ


తే.

యోగదండాగ్రగతపాణియుగళి[మీఁద]
[జబుకభా]గంబు నిలిపి రాచిలుకతోడ

సకలవిద్యానుసంధానసరస[గోష్ఠిఁ]
[గలసి] భాషించు యోగీంద్రకాంతఁ గనియె.

117

[?]

సీ.

మూడు రేఖ + + + + మోము గంధపుబొట్టు
              మసిబొట్టు నడుమగా మిసి[మిఁ జెంద]
సందుల యందుల సంకుఁబూసల పేర్లు
              తఱపివె[న్నెలతీరు] తారుకొనఁగఁ
బలు వన్నెకోకల నలవరించిన కంథ
              చనుదోయి + +మారు సవదరించి
మెఱుఁగుఁదీఁగెలఁ బోలు నెఱివన్నె చూపుల
              + ++ +చటభంగి యెఱుకపఱుపఁ


తే.

గోలయును గప్పెరయు నిరు[కేలఁ బూ]ని
బిక్ష మర్థించు పురమున పెద్ద కేత
నాగ సైరల గో+ ++ ++ +యనుచు
భోగసంప్రాప్తి జవరాలు జోగురాలు.

118

[?]

ఉ.

పచ్చల[హార]ముల్ పసిఁడిపావలు నచ్చపుఁగ్రొత్తముత్తెపుం
గుచ్చులు నింద్రగోపములు కుచ్చలిగంతయు సింగినాదమున్
మెచ్చలు గుజ్జు గెంజడలు మీటున ఖంగను మిట్ట చన్నులున్
అచ్చునఁ బోసినట్టి యొక యాదిమ[191]యోగిని వచ్చె నింపునన్.

119

తులసి బసవయ్య - సావిత్రికథ

ఉ.

కప్పెరయున్ గళాసమును కంథయు లాతము సింగినాదమున్
విప్పగు భూతిబొక్కణము వ్రేలు పిశంగజటాకదంబమున్
ద్రిప్పుడు నక్షమాలికయుఁ దిన్నని శూలముఁ గల్గి సంతసం
బుప్పతిలంగ వచ్చు నొక యోగినిఁ గాంచె నభోంతరంబునన్.

120

ద్యూతములు

తెనాలి రామలింగయ – హరివిలాసము

తే.

[192]ఉరుతరాంబుదము[లు] వోలె [193]నొడ్డి నిలిచి
వైణికులు వోలె సారెలు వరుస నిలిచి

పుష్పలావికలను బోలెఁ [బుడిసిలించి]
యెత్తు లిడియెద రార్యయు నిందుధరుఁడు.

121

[?]

సీ.

+ + + +ప్పుడు గాఁగ బలుమాఱు నిడికడ
              యాకడ సారెయ ల్మా + + + +న్
అడిగిన సందియం బప్పుడు పడకున్న
              నదలించి కినియు + + + +దలి?
యరిగి పాచికలయం దొకయంత కల్గిన
              నౌ గొ + + + +ల నడిగి యడిగి
తమ కొమ్ము గెల్చు చందమున కున + +
               + +హ సంపద నుబ్బి యుబ్బి


తే.

+ +యన నేర్తు గాదు గాదన + + + +
ననుచు నన్యోన్యమున వాదులాడి యాడి
చూచు ఖే + + + + + +౦తల చూపు లలర
నక్షకేలి యొనర్చి రయ్య[వసరమున].

122

వీటినాటకము [98]

శా.

సంగాసంగజయాజయం[బు పరిహాస]ప్రస్ఫుటాశ్లీలభా
షాంగం బాకలితాంతరావ[లయకక్ష్యా]భాగ[194]ముద్రాలస
ద్భంగీనిష్టితకాష్ఠ[195]శంకుకము [పాప]ద్యూత మీ పన్నిదం
బంగీకారము సేయువారి మొలలం బ్రాపించుఁ గౌపీనముల్‌.

123

నాచిరాజు సోమయ – ఉత్తరహరివంశము [3-122]

సీ.

దుగుణంబు చేసినతోడనే మూఁడని
              వారించి లేదని వలము సేసి
యూరకెత్తకు దాయ ముగ్గడించినఁగాని
              పట్టి వేయకుమని పటితళించి
వెడలిన సారెలు వెనక ముందఱ చేసి
              యెత్తిన సారె పోనీక యార్చి
సమమాయె రమ్మని సరస వారికి నిచ్చి
              గెలుపు సుమాళంబు గెరలఁజేయ


తే.

బడిసి యీరైదు పూజించి పలకమీఁద
బలుపమున వ్రాసి వెలివ్రాయి దొలఁగవైచి

పన్ని పంచి యొక్కటి నాడఁబంచి వ్రాలుఁ
దప్పనో పత్రనయమునఁ దాన గెలిచె.

124

మృగమునకు

భాస్కరుఁడు – అరణ్యకాండము [2-25]

సీ.

నెలలోని యిఱ్ఱికి నీలకంఠునిచేతఁ
              బొలుపారు లేడికిఁ బుట్టెనొక్కొ
యజుఁ డన్ని రత్న[౦బులందునుం గ]లుగు క్రొ
              మ్మించుల దీనిఁ గల్పించెనొక్కొ
రోహిణా[చలము మే]రువుఁ గూడి [196]యురుతర
              ప్రభల నీ హరిణంబుఁ బడసెనొక్కొ
క్రొక్కారు మెఱుఁగుల [జుక్కల యొఱపును]
              గలిసి యా మృగమయి వెలసెనొక్కొ


తే.

దీనిఁ బోలంగ జంతువుల్ త్రిభువనముల
యందు [మఱి కలవొకొ యని] యాత్మ మెచ్చి
ప్రీతి వనదేవతలు సూడ సీ[తదృష్టి]
మార్గమున కల్లఁ [197]జనియె నమ్మాయలేడి.

125

పిల్లలమఱ్ఱి పినవీరన – శాకుంతలము [2-20]

సీ.

కాలాంతరంబు మోసంబైన [విడివడి]
              యరుదెంచు గాడ్పు వాహనమృగంబొ
శశముతో [నొంటక] జగతిపై వచ్చిన
              చంద్రునిలోని లాంఛనమృగంబొ
వీ[రభద్రుని] కృపావీక్షణంబునఁ బున
              ర్నవమై చరించు జన్నపుమృగంబొ
పార్వతీకన్యక ప్రార్థింప విడిచిన
              యురగేంద్రకంకణు కరమృగంబొ


తే.

యనఁగ మాయామృగమువోలె నా మృగంబు
ధరణిపతి బాణనిహతికిఁ దగులువడక
నదులు నగములు ఘనకాననములు గడచి
చటులగతి నేఁగె మాలినీతటమునకును.

126

జయతరాజు ముమ్మన – విష్ణుకథానిదానము

సీ.

వీక్షణవిస్ఫురద్విస్ఫులింగంబులు
              బడబానలార్చుల భంగిఁ బఱువ
నిర్ఘాతసంఘాగ్రఘర్ఘరధ్వానంబు
              లంబునిధిధ్వాన మడచిపుచ్చ
భాసురభీకరకేశప్రమాణంబు
              లబ్ధిచక్రంబుల యడుల వాపఁ
గఠినమౌ దోర్గండఘనవాలదండంబు
              శరధిశైలంబుల సత్త్వ ముడుప


తే.

నిశితదంష్ట్రాచలము పయోనిధులలోన
మెఱయు ముత్యపుమోసల యొఱవు దఱుప
దైత్యవీరుని గుండియల్ తల్లడిల్ల
నపుడు యజ్ఞవరాహేంద్రుఁ డతిశయిల్లె.

127

[?]

సీ.

+ + + +చెక్కు దునిసి పాఱగ మెఱుం
              గులు శైలములు జిమ్ము కొంతదనుక
బ్రహ్మాండభాండంబు పగిలి చిల్లులు వోగఁ
              గొమ్ముల దాఁటికి + + + + + +డిల్ల
పంది మెల్లన నేరణ ప + +ష్పంది యగుచు
               + ++ + + + + + + + + + + +
 + + + + + + + + + + + + + + + +
               + + + + + + + + + + + + + +


తే.

+ + + + + + + + + + + + + +
 + + + + + + + + + + + + + +
 + + + + + + + + + + + + + +
 + + + + + + + + + + + + + +

128

జక్కన – సాహసాంకము [2-125]

సీ.

ప్రళయకా[198]లాభీలభైరవోదగ్రత
              సూకరాకృతిఁ బొడ[సూపెనొక్కొ]
యత్యంతకుపితాంతకాంతకాకారంబు
              క్రోడరూపంబుఁ [గైకొనయె]నొక్కొ
పటుభయంకరవీరభద్రాతిరేకంబు
              భూదారవేషం[బు పూనె]నొక్కొ

[199]చండభుజాదండదండధరస్ఫూర్తి
              కిరిఘోర[మూర్తిఁ బర]గెనొక్కొ


తే.

యనఁగ నతిభీకరాకారమైన యట్టి
యేకలం బెల్ల[యెడలను నె]దురు లేక
ఘోరసత్త్వసమగ్రకాంతారజలధి
దిరుగుచు[న్నది మం]దరగిరియుఁ బోలె.

129

వేటవర్ణన

జక్కన – సాహసాంకము [2-123]

సీ.

[తలమీఁదఁ] జెరివినఁ దనరారు నునుఁ[200]డెంక
              యమృతాంశురేఖచందమున నమర
మేదినీరేణువు మెయి నిండఁగాఁ బర్వి
              భసితాంగరాగసంపద వహింప
జుంజువెండ్రుక [201]లెత్తి చుట్టిన లేఁదీఁగె
              పన్నగాధీశ్వరు[202]పగిది మెఱయఁ
గరమొప్పు నుదిటిపై గైరికతిలకంబు
              ఫాలలోచను భాతిఁ బరఁగుచుండ


తే.

శబరుఁ డొక్కరుఁ డేతెంచె సంభ్రమమున
శంకరుఁడు తొల్లి శబరవేషము ధరించె
నంచు మదిలోన నీసుఁ దలంచి తాను
నీశు నాకృతిఁ గైకొన్న యెఱు కనంగ.

130

చిమ్మపూడి అమరేశ్వరుఁడు - విక్రమసేనము

సీ.

ఇది నెలలో నున్న యిఱ్ఱినైనను దాల్చు
              నట్టి నేర్పున భాజిఁ బట్టు దేవ
బట్ట [203]వైచిన ముట్టి బలువున నిది దివిఁ
              బాఱి చంపును సాళువంబు దేవ
యిది వాజి విచ్చిన యది సన్నకౌ నొంది
              యెలయించుఁ గక్కెరపులుగు దేవ
యిల నిది తూమెడు తలలకుఁ బొరగాని
              నిజ గరి[?]యైన కైరవము దేవ


ఆ.

దేవదేవ నీకుఁ దెచ్చితినని చెప్పి
యిచ్చి నిలిచి మ్రొక్కి యెదురనున్న

మృగమునకు సమస్తమేదినీపతి దన
యంగపూజ యొసఁగ + + + +న.

131

చరిగొండ ధర్మయ – చిత్రభారతము [3-130]

సీ.

ఎఱమీఁది పు[లినైన గొఱి]యచందంబునఁ
              గొనివత్తు మిదె చూడు మనెడువారు
నఱిమె[డు సింగంబునైనఁ] బ్రాణంబుతో
              డనె పట్టి తెచ్చెద మనెడువారు
జండించు గండ[భేరుండంబు]నైనను
              గనుకట్టు [204]కట్టెద మనెడు వారుఁ
జాలఁ గోపించిన శర[భాధిపంబునై]
              [205]నను మెడఁ గట్టెద మనెడువారు


తే.

ఘోరమృగముల గమి[యించుకొని ప్ర]తాప
మడర సురియలఁ బొడిచెద మనెడువారు
నగుచు నా న[రపాలుని] యగ్రవీథి
నడచి రంతంతఁ జెంచులు పుడమి వణక.

132

పిల్లలమఱ్ఱి [పినవీరన] – శాకుంతలము [1-113]

సీ.

జడలల్లి ముడిచి పాగడఁ జొళ్ళెములు దీర్చి
              త[లముళ్ళు] బలువుగా నెలవు కొల్పి
మృగము చేరఁగవచ్చు మొగసిరి చూ[ర్ణంపుఁ]
              దిలకంబు లలికసీమల ఘటించి
వాకట్టు [206]వదినికె చేకట్టు మండ[లు
              కరకాం]డమధ్యభాగముల దొడగి
కుఱుచగాఁకట్టిన కఱకు దట్టీదిండు
              [నంతరం]బు[న] బిడియమున దోఁపి


తే.

పందిపోటులు దడవిండ్లుఁ బాఱవాతి
యమ్ములును జిల్లకోలలు నడిదములును
వలతియీటెలు ధరియించి వచ్చి రంగ
రక్షకులు తాతతరముల ప్రాఁతవారు.

133

[1-108]

సీ.

పులిమల్లఁ డడవిపోతులరాజు [207]గరుడుండు
              గాలివేగంబు పందేలపసిఁడి
విరిముప్ప చేపట్టి వెండి గుందుప్పర
              పచ్చిమిర్యము వెఱ్ఱిపుచ్చకాయ
వేఁట మాణిక్యంబు విరవాది మెడబల్మి
              పెటకొండి యుపకారి పిడుగుతునక
జిగురుండు చిత్రాంగి సివ్వంగి బరిగోల
              పొలియడు కస్తూరి బొండుమల్లె


తే.

యనఁగ మఱియుఁ బెక్కు[208]దోయముల పేళ్ళు
దారకులు దేరవచ్చె నుద్దండవృత్తి
వేఁటకుక్కలు మృగరాజవిగ్రహములు
వటుకనాథుని వాహ్యాళివాహనములు.

134

[ప్రౌఢకవి మల్లన] – రుక్మాంగదము [3-69]

సీ.

[209]గడికోట బసవశంకరుఁడు చొప్ప[రికాఁడు]
              [కాట్రేఁ]డు జగజెట్టి గాలిపడగ
కొండీఁడు పులియ[మార్కోలు] గండండు ను
              [దురు]గాలి మాష్టీఁడు దొంగలబొజుఁగు
[బండిమల్లఁ]డు వెండిగుండు చిచ్చరుగోల
              పట్టుగొల్లె నభూతభైరవుండు
[కొదమ]సింగము మెట్టుగుదియ గోటలగొంగఁ
              డాదిభైరవుఁ[డు మోహ]నమురారి


తే.

చలిపిడుగు విక్రమార్కుఁడు [210]బలుదలారి
య[నెడు నామం]బులను జేర్చు నవనినాథు
నగరి జాగిలముల నేర్చి [తగినరీతి]
గొలుసులను బట్టి చని రొక్క కొంద ఱపుడు.

135

[3-70]

సీ.

[వలల కా]వళ్ళు చివ్వంగుల [211]బండులు
              తిరుచుట్టు [212]బొంగుకాలురులు[చీరె]
[తె]రులు నుగంబులు దీమముల్ మారము
              ల్మెకదారి కత్తులు [మెకము బో]ను
లొఱపైన గొడ్డండ్లు మెఱుఁగు బల్లెంబులు

              తట్ట గొమ్మ[లు పులిచె]ట్టు మందు
బలువిండ్లు పోటుగోలలు తోలుమ్రోకులు
              [గొరక]త్తలములు కరకణీలు


తే.

నాదిగా వేఁటలకు యోగ్యమై తనర్చు
సాధనంబులు సవరించి సరభసమున
నాటవికసైన్య మేతెంచి యధిపుఁ గాంచి
దండములు పెట్టి నిలిచి ప్రతాప మలర.

136

ఘటకాశి మల్లుభట్టు – జలపాది[మా]హాత్మ్యము

సీ.

శార్దూలభల్లూకచయముల మర్దించి
              సింహపోతమ్ముల సంహరించి
ఖడ్గపోతంబుల ఖడ్గముల హరియించి
              వనవరాహముల గర్వము లణంచి
చామరప్రియమునఁ జమరుల మన్నించి
              మదగజంబులకు సమ్మద మొనర్చి
విద్యల్లతానేత్రవిభ్రమంబు లణంచి
              హరిణచయంబుల నాదరించి


తే.

బ్రమసియుండిన వడిదప్పి పాఱలేక
యలసి పడ్డను, రతికేలి మెలఁగుచున్న
బాలకులఁ జూచి పోలిక భక్తి నున్న
విపినమృగముల కృపతోడ విడిచిపుచ్చె.

137

సముద్రవర్ణన

పెద్దిరాజు – అలంకారము [3-95]

క.

సిరినెలవు గురుసుధాప్రియు
న[రుదారఁగ నజుని]తండ్రియల్లుఁడు రత్నా
కరము దనపేరు జలధికి
సరిగ[లరే యరయ] ననుచుఁ జను వర్ణింపన్.

138

[3-96]

మ.

అతిగాంభీర్యము గోత్ర[గోపనము] సత్త్వాటోపమాహాత్మ్యమున్
హితలక్ష్మీసరసత్వమున్ [సతతవృ]ద్ధీతప్రభావంబు ను
న్నతసర్వోత్తరజీవనోదయము [నానావా]హినీసౌఖ్యశా
లితయున్ జేర్చు జళుక్యనాథునకుఁ బో[లెన్ జూడ] నంభోధికిన్.

139

శ్రీనాథుఁడు – భీమఖండము [3-51]

సీ.

సర్వంసహ[కుఁ గాసె సమకట్టు] పుట్టంబు
              గగనంబునకు వెల్లఁ గలువసెజ్జ
[213]యవటంబు మేఘ[వాహను] గంధకరటికి
              నభ్యవహార మౌర్వాగ్నిశిఖకు
వంటిల్లు [యామినీశ్వ]రకళామౌళికి
              [214]దరిచోటు నిఖిలబృందారకులకుఁ
గూ[టకచ్ఛప]నాయకునకు [215]నిశాంతంబు
              [216]మరుజనకునికిని మనికిపట్టు


తే.

[ఘనతరో]ద్దండపాఠీనకమఠనక్ర
తిమితిమింగలచక్రవిక్రమవిహార
ఘుమఘుమారంభగంభీరఘోషఘటిత
[217]లటహదిక్ప్రతిశబ్దోపలబ్ధి యబ్ధి.

140

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [1-26]

సీ.

అఖిలలోకానందుఁడగు చంద్రుఁ డెందేనిఁ
              గలిగె నుజ్జ్వలఫేనకణము మాడ్కి
నైరావతాదిమహాకరు లెందేనిఁ
              బ్రభవించె మకరశాబముల పగిదిఁ
గమనీయసురతరుసముదయం బెందేని
              జనియించె శైవాలచయము భంగి
భువనైకమాత మాధవుపత్ని యెందేనిఁ
              బొడమె మాణిక్యంపుబొమ్మ పోల్కి


తే.

ఆదిమత్స్యకూర్మములు విహారలీలఁ
దనరు నెందేని ప్రకృతిసత్త్వముల కరణి
నట్టి యంబోధి యేపారు నద్భుతైక
సారమహనీయమహిమ [కాధార]మగుచు.

141

జయతరాజు ముమ్మన – విష్ణుకథా[నిధానము]

సీ.

గాంభీర్యసంపద గణుతించు నప్పుడు
              తన్ను [మొదలుగాఁ]గ నెన్నవలయు
సకలంబు లోఁగొను సద్గుణం బె[న్నుచో]
              దను నిదర్శనముగా వినుతిసేయుఁ
గడు నేచియు [దమించుక]డఁ దమిఁ జెప్పుచోఁ
              దనకు మర్యాద యుదాహ[రణము]

[బ]హుసువస్తువుఁ గన్న భాగ్యంబుఁ బల్కుచోఁ
              దన పేర్మి[యగుఁ బం]తమునకుఁగూడ


తే.

మరియు మంచితనంబుల యొరువు [మురువు]
చెప్పఁబూనఁగ దానయై చెన్ను మిగులఁ
దనకు సాటి[వస్తువుఁ దలఁ]పఁ దాన యగుచు
నఖిలసౌభాగ్య మయ్యె న[య్యంబు]రాశి.

142

[?]

సీ.

అసమబాణుని మాత వెసఁగన్న పురిటిల్లు
              భూతనాథుని వేఁడి బోనమిల్లు
కూటవ వేల్పుల కుడివెన్న తరియిల్లు
              పుణ్యపుఁ గోమలి పుట్టినిల్లు
పాఁపపాన్పులవాని పవ్వళింపుల యిల్లు
              జలచరగ్రహముల సత్రమిల్లు
వాలిసుగ్రీవులవా రత్తవారిల్లు
              కొండులు దాగెడు గొందిటిల్లు


తే.

కలితసురగజహయముల కట్టుమట్టు
మణులు గన్పట్టు వెల్లువ మనికిపట్టు
వాహినుల కూఁత వారిదవ్రజము మేఁత
యీఁతులకు నీఁత పెనుమ్రోఁత ప్రాఁతజలధి.

143

[218]అయ్యలార్యుఁడు – యుద్ధకాండశేషము [1745]

చ.

కనియెఁ గపీంద్రుఁ డంత ఘన[219]గర్జననిస్వనవీతనిద్రమున్
ఘనతిమినక్రచంక్రమణకల్పితవీచికదంబభద్రమున్
గనదురురత్నరాజి[భుజగవ్రజ][220]సంచరణాతిరౌద్రమున్
జనితమరాళఫేన[విలసన్నవము]ద్రము నా సముద్రమున్.

144

పెద్దిరాజు – ప్రద్యుమ్న[చరిత్ర]

స్రగ్ధర.

దైతేయుం డంతఁ జూచెన్ దతసలిలతలద్వా[రదుర్వా]రలీలా
పాతోన్మజ్జన్నిమజ్జబహులచరాపా[రగంభీ]రశశ్వ
ద్వాతూలస్థూలకేలీవశవిశదకణావాలకల్లోల[మాలా]
జాతాఖాతాదిరౌద్రున్ జలదచలకులాసన్నభ[ద్రున్ సము]ద్రున్.

145

కొరవి గోపయ - సింహాసనద్వాత్రింశిక [2-159]

మహాస్రగ్ధర.

కనియెన్ [దుర్వారద]ర్వీకర[మకర]ఝషగ్రాహరక్షావినిద్రున్
[ఘనవీచీ]సద్భుజాభ్రంకష[221]గుణసమతిక్రాంతకాలాంతరుద్రున్

జనకాధీశాత్మజాధీశ్వర[222]ధనురతివిస్తారితా[వర్త]భద్రున్
[223]స్వనదంభోదాతిరౌద్రున్ వరతటవిహితోచ్ఛ్వాసముద్రున్ సముద్రున్.

146

[224]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-108]

మహాస్రగ్ధర.

కని రంతర్మగ్నభూభృత్కబళనచ[టుల]గ్రాహసంచారధాటీ
జనిత[225]స్పర్థాళువీచీసముదయలహరీసంభ్రమద్భోగిపూత్కా
రనిరంతో[226]త్పాతితక్షీరవితతఘన[227]ధారాసహస్రస్వభావన్
ఖనదీస్వైరోపగూహూద్గతసుఖసుముఖాకారలబ్ధిన్ పయోబ్ధిన్.

147

చరిగొండ ధర్మయ – చిత్రభారతము [5-3]

మహాస్రగ్ధర.

కనియె న్భూపాలుఁ డత్యుగ్రమకరకమఠగ్రాహపాఠీనరంగ
ద్ఘనభంగాభంగఘోష[పితనిఖిలిది]దిక్చక్రకుంభీంద్రనిద్రున్
వినుతాత్మద్వీపమధ్యా[విరతపటుసభా]వేశ్మనిద్రావశశ్రీ
వనితారాట్తల్పభోగీశ్వర[భరమణిదు]ర్వర్గభద్రున్ సముద్రున్.

148

సముద్రలంఘనము

ఉ.

+ + ను వంచి దీని + + + ౦కగదోంక గదల్చి పాదముల్
వివ్వక పె + + + లను వీచిముఖంబు బిగించి కొండ జా
జవ్వుమనంగ + + గిలె నక్కకు వీంపి + + + యద్ది పై
రివ్వున దాటెవో + + మ ఱెక్కలతోడి సురాద్రియో యనన్.

149

మొల్లరామాయణము – సుందరకాండము – 225ప

క.

అడుగులు సమముగ నిడుకొని
వడి బాహు[వు లూఁ]ది నిక్కి వాయుజుఁ డంతన్
ఎదలూచి దాటె జల[నిధి]
[మిడి]వింటన్ బసిఁడియుండ మీఁటిన భంగిన్.

150

సముద్రమథనము

శ్రీనాథుఁడు – భీమఖండము [4-59]

సీ.

కపటకచ్ఛపమైన కైటభాంతకు వీఁపు
              కొమరు మీఱిన [228]చుట్టకుదురు గాఁగ
నారసాతలమూలమైన మందరమహా
              ధరణీధరంబు మంథానకముగ

దందశూకాన్వయాధ్యక్షుండు వాసుకి
              తత[229]పరిగ్రహణసూత్రంబు గాఁగ
నావహప్రవహాదులగు మారుతంబులు
              తగులఁగట్టిన యాఁక త్రాళ్ళు గాఁగ


తే.

బలిపురోగములగు దైత్యపరిబృఢులును
దివిజనాయకుఁ డాదిగా దేవతలును
దఱిచి రంభోధిఘుమఘుమధ్యానరవము
భువనగోళంబు దిక్కులు చెవుడుపఱుప.

151

సేతుబంధనము

అముడూరి నరసింగభట్లు - షోడశరాజచరిత్ర

శా.

ఇచ్చోటన్ వినుఁ డీ యథార్థకథ ను[త్ప్రేక్షింప నీశున్] స్తుతిన్
మెచ్చించెన్నని కాదు రాఘవచమూనిర్మూ[లనోద్రేకియై]
విచ్చు న్మొగ్గ వరాలిమొగ్గ యనుచున్ విచ్చేసె నంభోధి కీ
[యుచ్చున్ ద]చ్చయనార్థమే నిలిపినాఁ డుర్వీశుఁ డీసేతువున్.

152

భా[స్కరుని] యుద్ధకాండము [249]

చ.

ఇలఁ గల కొండలెల్లఁ గపు లే[పున వేకొ]ని వచ్చి పైపయిన్
వలువున నీ నలుండు బహునక్ర[చుహామ]కరాదిసత్త్వముల్
పెలుకుఱి క్రిందికిం జన గుభిల్లు గుభిల్లు గుభిల్లున [వైచి సందు]సం
దులఁ దరుసంఘముల్ గలయ ద్రొక్కుచు సేతు [వొనర్ప నె]మ్మెయిన్.

153

[?]

చ.

త్రిభువనకంటకుం జెఱుప దేవర పం+ + + + గట్టఁగా
ప్రభ గల కొండలన్ని వెసబాఱి కదల్చి యు+ + మహా
రభసముతోడ మోచుకొని రామ యటంచును వా[ర్ధి]లోపలన్
గుభులు గుభుల్లు గుబ్బ గుబగుబ్బ గుభిల్లున వైచి రార్చుచున్.

154

నదీవర్ణన

ఘటకాశి మల్లుభట్లు - జలపాలిమాహాత్మ్యము

సీ.

గురుముక్తిమార్గానుకూలంబు కూలంబు
              భాసురసుజ్ఞానఫలము ఫలము
బహుళకల్మషగర్వభంగంబు భంగంబు
              శ్రవణసంతోషగౌరవము రవము

యోగీంద్రహృదయాను[230]రాగంబు వేగంబు
              వసుధదుర్మతికి నావళ్ళు సుళ్ళు
సురపథప్రాప్తికిఁ దెరువులు నురువులు
              ఇహపరంబుల కుప్ప యిసుకతిప్ప


తే.

యంబురాశిసమాలింగనానుషంగ
విప్రనిగమోత్తమత్రితంత్రప్రసంగ
+ + + + ద కారణజటవిహంగ
గౌతమీగంగఁ గాంచె [క్ష్మానేత య]పుడు.

155

[?]

సీ.

+ + + +ణసౌఖ్యసారంబు
              త్రైలోక్యసుఖకల్ప[తరులు ద]రులు
ధర్మార్థకామసంధానంబు ఫేనంబు
              [స్థిర]పుణ్యమార్గవైఖరులు తిరులు
బహుతాపత్ర[యశృంగభం]గముల్ భంగముల్
              ఘోరపాపౌఘసంహారి వారి
 + +షమార్గణగణములు కన్యామణులు
              ప్రకటవై[కుంఠవై]భవము భవము


తే.

కఠినతరరోగజాలంబుఁ గాఁచు [నాచు]
కాలమృత్యువు కొమ్ముతో గసికె యిసికె
[నీకు సరి]గాఁగ నదులు వర్ణింపఁగలవె
జాహ్నవీగంగ! సర్వలక్షణశుభాంగ!

156

పెదపాటి సోమయ – కేదారఖండము

సీ.

భవ్యులకును మోక్షభవనంబు [231]భువనంబు
              కపటాత్ములకు గుచ్చు గసికె యిసికి
తద్జ్ఞులకును గల్పతరువులు నురువులు
              ఖలులకుఁ జొరరాని [232]గళ్ళు సుళ్ళు
ధీరులఁ గడతేర్చు తెప్పలు తిప్పలు
              పాపకర్ముల కతిభయము రయము
సభ్యుల కాధారసారంబు తీరంబు
              మలినాత్ములకు మహామాయ ఛాయ


తే.

యనఁగఁ బఱగియుఁ దన వారి యంద మొంద
సాధువులు నైన నత్యంతశఠులు నైన

పరమపుణ్యులఁగాఁ జేయఁ బఱగినట్టి
హరశిరస్సంగ యదియ పో [యమలగంగ].

157

[233]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-69]

సీ.

బలి[దాతృదాన]సంభవకీర్తి[234]లేఖిక
              మురదైత్యభిత్పదాంబుజమ[ధూళి]
విధికమండలుపయోనిధిసుధారసధార
              జగదం[డఖండక]చ్ఛత్రయష్టి
మదనభేదనశిరోమందారమాలిక
              న[గరసంజీ]వనౌషధిమతల్లి
కనకాద్రిదండసంకలిత[235]కేతనశాటి
              [హారినభోంతర]హారలతిక


తే.

జంభశాసనపురమణిసాలచ[క్ర]
మండలీకృతనిజభోగకుండలీశ
[236]ముచ్యమానవినూ[త్ననిర్మో]కయష్టి
నప్సరల కంతఁ జూ[237]పట్టె నభ్రగంగ.

158

జయ[తరాజు] ముమ్మన – విష్ణుకథానిధానము

ఉ.

ఆడు భవజ్జలంబుఁ [గొని]యాడును నెవ్వఁడు వాఁడు ము[క్తి] దొ
ద్ధాడును బ్రేమతో సరసమాడు హిమాచలకన్యతోడ ము
ద్దాడు గుణాధినాయకుని నాడు మహాద్భుతతాండవంబుఁ [238]జెం
డాడువిధిన్ గృతాంతుఁ దునుమాడు విచిత్రమె జహ్నుకన్యకా.

159

ప్రగడపల్లి – పోతరాజు

మ.

ద్విరదాకారత నెంచి సంతమసరీతిం బర్వి మేఘాకృతిన్
బఱపై శైలధృతిన్ దనర్చిన మహాపాపౌఘముం గిట్టి కే
సరిమాడ్కిన్ రవిభాతి గాడ్పుగతి వజ్రస్ఫూర్తి దారించుచున్
హరి[యించున్] విహరించుఁ ద్రుంచు భవదుద్యద్వారి గోదావరీ.

160

అంగర బసవయ - ఇందుమతీకల్యాణము

శా.

[శ్రీహే]లాపరవిత్తజుం డజుఁడు సూచె న్నర్మదా[వాహిని]న్
సాహిత్యప్రథమానజీవనసరస్సద్గేహినిన్ [దీరరే]
ఖాహంసీబకచక్రవాకపటుపక్షక్షేపసం(జాత)వా
తాహత్యుచ్ఛల్లితాంబుపాంశపటువ్యా(కీర్ణస)మ్మోహినిన్.

161

తెనాలి రామలింగయ – హరివి(లాస)ము

ఉ.

ఆ మునిసార్వభౌముఁడు సమంచితకాం(చనపారి)జాతరా
జీమతిఫేనభానికరజిత్వరతత్పరమాణఫేనిల
శ్రీమతివాతధూతజలకశీరసేకపవిత్రితాంకధా
త్రీమతి దర్పితాఖిలసుధీమతి గోమతిఁ గాంచె ముందటన్.

162

పుణ్యక్షేత్రము

జక్కన – సాహసాంకము [2-191]

చ.

చెలువగు కాళికామహిమ చిత్రము బెబ్బులి లేడి మ్రింగి యాఁ
కలి చెడ కెద్దుఁ బట్టఁ బులికాటున నెద్దును నెద్దుపోటునం
బులియును జీవముం [239]దొరఁగ భోరున [240]లేడొక లేడిఁ బుట్టుటన్
[241]పులి పులుతోలు [242]గప్పుటయుఁ బొల్పగు నెద్దొక నెద్దు నెక్కుటల్.

163

[?]

క.

ఆ కాశిఁ దెగిన నరునకు
నాకాశనదీజలంబు లౌదల నుండున్
కాకోదరుఁడు (దెశిశీను?)
కాకోదరు + + + + + గా కేలుండున్.

164

తెనాలి రామలింగయ – హరి[లీలావిలాసము]

తే.

ఈఁతపంటికిఁ దాటిపం డింత కింత
మ[శకమైనను] గొండొకశశకమైనఁ
కాశికాసీమఁ గడనిద్రఁ గ[న్ను మొగి]చి
మేరుధను వెత్తి కదలని తేరు నడుపు.

165

శ్రీనాథుఁడు – భీమఖండము [3-25]

తే.

కార్తికీవేళ భీమశంకరుని న[గరఁ]
దూఱుఁ నెవ్వాఁడు చిచ్చఱతోరణంబు
నతఁడు [దూఱఁడు] ప్రాణనిర్యాణవేళ
ఘోరయమపట్ట[ణద్వార]తోరణంబు.

166

శరభాంకుఁడు

చ.

శకలము నందె [మౌనిసతి] జారసహోదరుఁ జూడఁగల్గెనే
టికి వెదనొందు శ్రీగిరిపతిం దరిశింపఁగఁ గోర్కి లేక కా
శికిఁ జనెఁ బూపచంద్రునికిఁ జిచ్చరకంటికిఁ జిత్తజన్ముభూ

తికిఁ జదలేటినీటికిఁ దుది న్నిటువంటిది యారవల్ గణిం
చుకొనిఁ జొచ్చు టెట్టులు విశుద్ధులె శ్రీశరభాంకలింగమా.

167

కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము

చ.

అలఘుతరాపవర్గము సమంచితశంకరతీర్థరాశిలో
పల నధికంబు కాశి యదిప్రాణులఁ జంపక యీదు ముక్తి యే
యలజడిఁ బెట్ట కిచ్చు నరుణాచల మించుక యాత్మ[లోపలన్]
దలఁచిన మోక్షలక్ష్మి యిఁక దానికి సాటి[యె య]న్యతీర్థముల్.

168

వ్రతమాహాత్మ్యము

భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [5-103]

సీ.

పటుఘోరపాతకపటలమ[హారణ్య]
              చటులసమజ్జ్వలజ్వలనకీల
దుర్వారదారు[ణదుష్కృత]సంఘాత
              మేఘసంవర్తసమీరణంబు
[భూరి]భీషణపాపపుంజసముత్తుంగ
              భూమిభృ[న్నిశితదం]భోళిధార
దుస్సహదురితసందోహనిరంతర
              [ధ్వాం]తప్రచండమార్తాండహేతి


తే.

క్రూరకల్మష[కుంభి]కంఠీరవంబు
భీకరాఘౌఘ[243]పవనకుంభీనసంబు
కుటిలకిల్బిషపాథోధికుంభసూతి
భాసురంబైన శ్రీవిష్ణువాసరంబు.

169

[5-114]

చ.

ఋతువులలో వసంతము మహీధరసంతతిలో సువర్ణప
ర్వతము గ్రహంబులందు దినరాజు తరంగిణులందు [244]గంగ గో
వితతులో మరుత్సురభి వేల్పులలో హరిఁ [245]బోలె నుత్తమ
వ్రతములలోనఁ జక్రధరవాసరసువ్రత మొప్పు నెంతయున్.

170

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము

  1. చ.అచ్చట
  2. చ.ననియని
  3. చ.కాణచ్చరియుడని
  4. చ.సుకరా
  5. చ.రత్న
  6. చ.మూలంబున
  7. చ.నొప్ప
  8. చ.నుదయో
  9. చ.చంచెత
  10. చ.మొగులు
  11. చ.జాయ
  12. చ.నీరెండ
  13. చ.గుడుపు
  14. చ.సరగి
  15. చ.భరణి
  16. అయిలన
  17. చ.ద్యత
  18. చ.తరుపక్వ
  19. చ.నొవ్వగ
  20. చ.దరువు
  21. చ.దవిప్రభాతముల్
  22. చ.తటన
  23. చ.చక్ర
  24. చ.వాతా
  25. చ.కాయమునన్
  26. చ.లోలము
  27. చ.నన్నొ
  28. చ.కుటీలాపము
  29. చ.నొప్పు
  30. చ.దీపించి
  31. చ.భావించినన్
  32. చలికొండ
  33. చ.పట్టిడుటకై
  34. చ.పుచ్చుకొ
  35. చ.సారికి
  36. చ.గురి
  37. చ.సౌధముల్
  38. చ.చలగ
  39. సుంకసాల
  40. చ.విధూత్తభిషేకము
  41. చ.నున
  42. చ.యంతయున్
  43. చ.పరి
  44. చ.కపోల
  45. చ.కారిక
  46. చ.కానికా
  47. చ.లీనమై
  48. చ.నమ్య
  49. చ.గిరిం
  50. బోదు ముట్టించు
  51. చ.నెమలి
  52. చ.కద్రు
  53. చ.నాపెలు
  54. మాహాత్మ్యము
  55. చ.జాంతో
  56. చ.రంభ
  57. చ.ఘనపద్యా
  58. చ.వాత
  59. చ.శ్రీల ను
  60. చ.దగన్
  61. చ.బర్ప
  62. చ.నత
  63. చ.బ్రసరించు
  64. చ.విధు
  65. సుంకసాల
  66. చ.దీరె
  67. చ.వర
  68. చ.సారమైన
  69. చ.గంధి
  70. చ.కుముద
  71. చ.యటు
  72. చ.కాళేయ
  73. చ.బాటి
  74. చ.నెలి
  75. చ.మందిత
  76. చ.నాభాంసురంబు
  77. చ.కే సన
  78. సుంకిసాల లింగయ
  79. చ.బల
  80. చ.మలి
  81. సుంకిసాల
  82. చ.నసబ్బంబగు
  83. చ.కెంగేలు
  84. చ.జెక్కిలి
  85. చ.యలపయై
  86. చ.చేరె మాత
  87. సుంకిసాల
  88. చ.భృతి
  89. చ.గంజాత
  90. చ.చ.కుదిచి
  91. చ.వృతు
  92. కాఖముల్
  93. దత్త
  94. చ.ఫలంబు
  95. చ.పెంపు
  96. చ.దలచిన
  97. చ.గరచి
  98. చ.సొబగు
  99. చ.కోకో
  100. చ.పండు గ
  101. చ.డించిన
  102. చ.దాఖ్య
  103. చ.రర్తు
  104. చ.+++పొగడల
  105. సుంకసాల
  106. చ.దాఁకిన
  107. చ.రూపముల
  108. తెన్నల
  109. చ.నొరువ
  110. చ.యర
  111. చ.తన
  112. చ.వెగడు
  113. పిల్లలమఱ్ఱి పినవీరన – శాకుంతలము [2-135]
  114. చ.తరువిరులు
  115. చ.కోటిం
  116. చ.కల్పాకంబులై యవ్విరుల్
  117. చ.నుడికంపు
  118. చ.నెవుర
  119. చ.మంజులం
  120. చ.నుదురె
  121. చ.మన్ని
  122. చ.రాగంబు
  123. చ.నలది
  124. చ.నావిరి
  125. చ.హరించె
  126. చ.వికలంబు
  127. చ.పూవు
  128. చ.సంపూర్ణులై
  129. చ.గ్రీడించి
  130. చ.విరివాటి
  131. చ.నివ్వల
  132. చ.ధాటు గు
  133. చ.కోయ
  134. చ.మెరి
  135. చ.వడి
  136. చ.జారి
  137. చ.యెన్న
  138. చ.జొచ్చి
  139. చ.పాను
  140. చ.శల
  141. చ.నావులు
  142. చ.లెక్క
  143. చ.దన్ను
  144. చ.బుట్టి
  145. చ.గెరలించె
  146. చ.లున్నైన
  147. చ.గడున్
  148. చ.నోలి
  149. చ.మందుల
  150. చ.తోడుకలం
  151. చ.మించి
  152. చ.దిరులు
  153. సుంకిసాల
  154. కుధరంబు
  155. చ.దిబ్బల
  156. చ.డొప్పు
  157. చ.నేలు
  158. చ.ధగ
  159. చ.తలియు
  160. చ.నక్కటి
  161. చ.కన్నుగవ
  162. చ.నొక్కట
  163. చ.పలువు
  164. చ.పుట్టి
  165. చ.జాను
  166. చ.సుదినక్షత్రముల
  167. సుంకిసాల
  168. చ.జించి
  169. చ.బొబ్బిలి
  170. చ.చేవటలు
  171. సుంకిసాల
  172. చ.పతి
  173. చ.శోణిలువితంక్రియలంగులతావసంతముల్
  174. చ.నివర్ణన
  175. చ.విలాసిత
  176. చ.నాడంతి
  177. చ.తోంకతె
  178. సుంకిసాల
  179. చ.తంబుల
  180. చ.సింధు
  181. చ.నూని
  182. చ.+రొంక
  183. చ.నిరునివిద్యాదిఘనతజేసి
  184. చ.పట్టు
  185. చ.కరవాలు
  186. చ.పెరుగు
  187. చ.మంతరౌటురపొందు
  188. చ.జిక్కుననక్కు
  189. చ.జనువుమెరయ
  190. చ.లొత్త
  191. చ.జోగిణి
  192. చ.వురు
  193. చ.వొద్ది
  194. చ.రత్రా
  195. చ.సంకులము
  196. చ.యురునిజప్రభలచే నీరూపు బడసె
  197. చ.జేయు
  198. చ.లోదగ్ర
  199. చ.దండధరోద్దండ
  200. చ.బిక
  201. చ.లొత్తి
  202. చ.భంగి నమర
  203. చ.గైచిన
  204. చ.పట్టెద
  205. చ.దనరగాఁ దెచ్చెద మనెడువారు
  206. చ.వదనీక
  207. చ.లశామతి
  208. చ.దోవతుల
  209. చ.నలి
  210. చ.జలదరారి
  211. చ.బిళ్ళును
  212. చ.సొంగులు తెఱపు
  213. చ.వ్యాపంబు
  214. చ.తలిచాటు
  215. చ.వేశంతంబు
  216. చ.మరుదయర్జునునికి మర్దనునికి
  217. గ.లటదిశాప్రతి
  218. అయిలన
  219. చ.గర్జితనిస్వన
  220. చ.నన్ వెలనాతికాద్రమున్
  221. చ.నహాన
  222. పసురని
  223. ఘనదంబుదృష్టకాద్రున్
  224. సుంకసాల
  225. చ.స్వర్థాను
  226. చ.పాలిత
  227. చ.రాకా
  228. చ.మట్టి
  229. సక్రమణ
  230. చ.రాగులు
  231. చ.భవనంబు
  232. చ.దళ్ళు
  233. సుంకసాల
  234. చ.రేఖక
  235. చ.దిమ్మరిస
  236. చ.మత్స్యమాన
  237. చ.పట్టి
  238. చ.చుద్దౌడు
  239. చ.దొలగి
  240. చ.వేరొక
  241. చ.జలిజలితోలు
  242. చ.గట్టుటయు
  243. చ.భేక
  244. చ.నున్న
  245. చ.వోవు