ప్రజ్ఞా ప్రభాకరము/శకునపరిగణనము

౧౩

శకునపరిగణనము

అజ్ఞాననిహత మై యుండుటచే దేశమంతట నిట్టి యపభ్రంశపు తలఁపులు నిండారి యున్నవి. పెద్దపెద్దలు, కొమ్ములు దిరిగిన విద్వాంసులు, మహొన్నతపదవులం దున్నవారు గూడ నింటనుండి యే దేని పనిమిఁ బయటకి వెడలునపు డెదురుగా నెవ్వరు వచ్చుచున్నారో యని పరిశీలింతురు. కుగ్రామములో నట్టి పరిశీలనము తగు నేమో, అర్ధవంతమగు నేమో కానీ వేలకొలఁది ప్రజలు గల నగరములలో నట్టి పరిశీలనము చీకాకు గొల్పును. సమకాలమునే విధులలో ' పంచ శుభం పంచాశుభమ్' అన్నట్టు కలసికట్టు గానో, ముందు వెనుకలుగానో సభ ర్తుకలు, ఒంటి బ్రాహ్మణులు,పల్వురు న్రాహ్మనులు తారసిల్లుచునే యుందురు. ఇందు పౌర్వాపర్యములు పర్యాలోచించుచుందురు. మఱియు ఫలాని వితంతువు , ఫలాని బ్రాహ్మణుఁ డు ఎదురుగా వచ్చినప్పుడు కార్యము నిర్వక్రముగా నిర్వహణము చెందు నని వారు విశ్వసించుట కలదు. వా రేట్లు వచ్చినప్పుడు మంచి జరుగుట కేవో కారణములు,యుక్తులు నసందర్భముగా నుపాంశువుగా గణిం చుట కలదు.

తాము ప్రయాణ మగువేళకు బ్రాహ్మణుఁడేని, ఆతఁడు, కుమారుఁడో, అన్నో, తమ్ముఁడో, అయినను నెదురుగా వచ్చినచో వ్యంగ్యముగా మొగము చిట్లించుకొని గర్హించుటో, వాచ్యముగానే తెగడుటో జరగు చుండును. తన యింటిలోని వారే అయినను, పరాయి వారె అయినను వితంతువు వచ్చినచో గర్హించుటయు, ప్రయాణము నిలుపుటయు జరుగుచుండును. మఱీవింత- ప్రయాణమయిన వ్యక్తి వితంతువే అయినను గూడ తనకు వితంతు వెదురుగా వచ్చిన గర్హించును. ఈ శకునపరిక్షల వల్ల ప్రయాణముల నాపుకొనువారును, నని వార్యముగా పయన మయినను నిరుత్సాహనిహతిచే ససిగా సాగించుకొనలేక ఎదురు వచ్చిన వారిని గర్హించుటచే వారితోను, వారి కుటుంబముతోను దీర్ఘ వైరము తెచ్చుకొనువారును నెందఱో ఉన్నారు. రైలు ప్రయాణములకు శకున ముహూర్త పరిగణ నము చేయుచు అనుకూల శకునముహూర్తాదులకై కొంతసే పాగి పోవుటో చాల ముందుగానే పయన మగుటో చేయువారున్నారు.

మన మంచిచెడ్డలకు మనమే ప్రవర్తకుల మనీ, మన సత్కార్యసత్సంకల్ప బలముచే మన మంచిని మనమే సాధించు కొనఁ గల్గుదుము గా కనీ లోఁతయిన పట్టుదలతో వర్తించు వా రిట్టి చిలిపి చీ కాకులకు పాల్పడరు. మంచి శకునములకేన్నింటి కోదుష్పలితములు గలుగుచుండుట, దుస్స కునముల కేన్నింటికో సత్ఫలితములు గల్గుట గుర్తించుచున్నను గూడ శాస్త్రము ప్రమాణ మని ప్రామాణ్య నిశ్చయము లేకున్నను దానినే విశ్వసించుచుండవలె నని కేవో శ్లోకములుదాహరించుచు సమర్ధించుకొనుచుండుట యజ్ఞానపుఁ బిరికి తన మనవలదా? గర్భవతుల గ్రహణములఁ జూడరాద నుట, ఆదివారము నాఁ డుసిరిక పచ్చడి తినరాదనుట, రాత్రులందు లవణము పేరు- ఉప్పు- అన్న తెలుఁ గు పేరే- పేర్కొన రాదనుట (లవణము - బుట్టలోనిది- చెప్పరానిది ఇత్యాది విధములఁ దెలుప వచ్చును.) మొదలయిన విట్టివే.

మన తలఁపులలో, పలుకులలో, పనులలో మంచి చెడుగులు పెన వేసికొని సాగుచున్నవి. చెడుగు లేని యచ్చ మంచితనము మానవత కింకను నంద లేదు. జన్మము లెత్తఁగా నెత్తఁగా సత్త్వము హెచ్చికిళ్ళను దొలఁగించుకొని మెళ్ళను పడగా బంగారుకు వన్నె హెచ్చినట్టు మానవునిలో హెచ్చఁ జొచ్చెను. సద్భావ ప్రాబల్యము కలిగినప్పుడు ప్రపంచము నాలుగుంచుల ప్రజాసంఘము నెల్ల పాఱజూడఁ గల్గినప్పుడు దేశజాతి కులశ్రయము లయిన నిరర్ధకాచారములు తొలఁ గి పోగలవు.

స్వీయు లందఱు నానాఁడు నా వివాహమును గూర్చి వివాహిత యగుకన్యను గూర్చి యతృప్తి చెందిరి గాని, కొంత నాకు గూడ వెఱపు గల్గుస్థితివలె వేర్పడెను గాని కాలము కొంత గడచిన తరువాత నందఱనిశ్చయములును దల్ల క్రిందు లై పోయినవి. అవి ముందు ముందు తెలియఁ గలవు. అట్టి శుభ పరివ ర్తనము కలుగుటకు వివాహ మయిన తర్వాత సంవత్సరము లెనిమిది గడవవలసెను.