ప్రజ్ఞా ప్రభాకరము/వెలుఁగుబాట
౨౨
వెలుఁగుబాట
రోడ్డుమిఁద అబ్బూరి జగన్నాధరావుగా రను మిత్రుఁడగపడి నా చేయి పట్టుకొని 'మిరు ప్రభాకర శాస్త్రిగా రేనా?ఇట్టుంటి రేమి?'అని యడిగెను. మూఁడేళ్ళనుండి జబ్బుగా నుంటి నంటిని. ఏమి జబ్బు అనుచు నాతఁడు నన్నింటిలోనికిఁ గొనిపోయెను. శూన్యహృదయముతో నేను లోని కరిగితిని. అక్కడ శ్రీ గురజాడ అప్పారావు గారి ద్వారా నాకు మిత్రు లయిన వారు, అప్పారావు గారి బంధువు, మూఁడేండ్లకు ముందు అప్పుడప్పుడు నన్ను లైబ్రరీలోని యోగ శాస్త్ర గ్రంధముల గూర్చి యడుగుచుండు వారు నగు శ్రీ పోతు రాజు నరసింహము. ఎం.ఏ.'ప్రెసిడెన్సి కాలేజి ఫిలాసఫీ ప్రోఫిసరు ఆగపడిరి. వారి ప్రశ్నపై సూక్ష్మముగా నా యానారోగ్యము తెల్పితిని. వారి బావమఱఁది యగుజగన్నాధరావు నన్ను 'మా బావగారు చేరిన యోగ గోష్ఠిలో చేరిన మి యనారోగ్యము తొలఁ గిపోఁ గలదు గదా! ఏల చేరరాదు? 'అనిరి.నరసింహము గారు 'ధ్రువనాడి గూర్చి నేను వారిని ప్రశ్నించితిని. నా జాతకము ధ్రువనాడిలో నుండునా యని యడిగితిని. వారు గంపెడు విషయములు చెప్పిరి. నన్ను వెంటనే కుంభకోణము వెళ్ళి యోగ గోష్ఠిలో చేరఁగోరిరి. వెళ్ళుటకు సమ్మతించుచో జాబు యిత్తు ననిరి. హరిద్వారము గాక ఆరోగ్యద్వారము చేరఁ బోవుచున్నట్లయ్యెను.'నేను'అను నా బాహ్యప్రజ్ఞ లోదిరిగి నట్లును,దానికి బాట పాయ లిచ్చి యేర్పడుచున్నట్లున్న దోఁచెను.ఎడమ ప్రక్క నుండి తేలి తేలి చెడుగు పోవుచున్నట్లును, గుడి ప్రక్క నుండి దూఱి దూఱి నడుమ నొక బాట యర టాకు నీనవలె సాగుచున్నట్లును దలఁపఁ జొచ్చితిని. ఒక ప్రక్క ఆఫీసుకు వెళ్ళ వలసిన తొందర. ఆ సమయమున మా లైబ్రరియన్ కు మిత్రుఁడు, మా నరసింహము గారికి మిత్రుఁడు నొక్కఁ డక్కడ నుండి నా గోడెల్ల విని 'రెండు రోజులు సెల విప్పించుటకు నేను లైబ్రేరియన్తో చెప్పి యేర్పాటు చేసెదను. నీవు కుంభకోణము వెళ్ళుము'అని క్రొత్తగా లీవు చీటి వ్రాయించి పుచ్చుకొని వెళ్ళెను.
నేను సాయంకాలము రైలు పయనమునకు సన్నద్దుఁడ నయితిని. నరసింహము గారు జాబు వ్రాసి యిచ్చిరి. రాత్రి యేడుగంటలకే నేను ఎగ్మూరు స్టేషనుకు వెళ్ళితిని. అక్కడ మా లైబ్రరి యరవపండితుఁ డుండెను. ఆతఁ డు నన్నుఁ జూచి చెయి పట్టుకొని 'నేఁడు ఆఫీసుకు రాక అయ్యో!ఇది యేమి? ఇక్కడ నగపడితిని?ఎక్కడికి పోవుట? మీ యింట చేర్చెదను. రండు. మతి స్వాస్ధ్యము తప్పి యిట్లగుచుంటిరా యేమి?యని పలవించెను.నేను దుఃఖించితిని. నా కడ నంత దాఁక చాల నడుకువతో వర్తిల్లుచిండిన వాఁ డు. దయనీయముగా నున్న నా యప్పటికి స్ధితికి వగచి యట్లనెను.నేను చెప్పితిని. నాకు మనసు చెడలేదు. ఆరోగ్యమునకై వెళ్లుచున్నాను. రెన్నాళ్ళలో మరలరాఁగలను. కంగారుపడవద్దు. నామీది యాదరమే మి చేనిట్లు పలికించినది. ఎఱుఁగుదును. వెఱవవలదు. లైబ్రేరియన్ తోనే నిట్లు వెళ్ళుచుండుట తెల్పుఁడు అని. ఆతఁడు టిక్కెట్టు కొని తెచ్చి పెట్టి రైలెక్కు దాఁక నాతో ముచ్చటించుచుండెను.
--- ---