ప్రజ్ఞా ప్రభాకరము/నవజీవనము

౨౮

నవజీవనము

నాఁటి రాత్రి శ్రీవారి ని దేశముచొప్పున మద్రాసుకు హాయిగా నే బయలు దేరితిని. కుంభకోణమున నుండి మాయవరము దాఁక రైలులో వచ్చితిని. పలువు రక్కడ దిగిచుండిరి. నేనును ఆ స్టేషనులో దిగి అక్కడ చాలాసేపు రైలాగును గాన ప్లాట్ ఫారం మిఁద కొంతదడవు నిటు నటు తడవాడితిని. రైలెక్కి తిని. అది బయలు దేరెను. నేను తలుపు దగ్గరనే నిలుచుంటిని. న న్నెవరో బయటికి పడఁద్రోయు చున్నట్లయ్యెను. మరల తొంటిరీతి కంపము, నిరుత్సాహము తోఁ చెను. తోడ్తో రైలు ద్వారము దగ్గఱ నున్న నాకు హరి ద్వారము తలఁ పునకు వచ్చెను. పాడు తలఁపు క్రిందికి దూకుదునా యనియుఁ దోఁచెను.

అల్లంతలో న న్నెవరో వెనుకకు నెట్టిచున్నట్లయ్యెను. ఇది నాలో జరుగుచున్న సదసద్వి వాదముగా గోచరించెను. పూర్వము కంటె నిప్పుడు గొప్ప జ్వాల లోపల వెలుఁగుచున్న ట్లయ్యెను. పూర్వ మెక్కడోమిణుకు మిణుకు మను నాశా జ్యోతి యుండెడిది. నే నీ సంకల్ప వికల్పములతో నిటు నటు నూగుచుండగా లోఁ గూర్చున్న సహృదయుఁ డొకఁడు భగవదావిష్టునట్లు తన ప్రక్క చోటు చూపుచు ' అయ్యా తలుపు తెఱచి యున్నది. క్రింద పడగలరు! ఇటు వచ్చి కూర్చుండుఁడు' అనెను. వెంటనే వెళ్ళి కూర్చుంటిని. ఆతఁడు లేచి నాకు మఱీ చోటిచ్చెను.' నేను తర్వాతి స్టేషనులో దిగిపోవుడును గాన యిఁక కూర్చుండను' అని నన్నుఁ గూర్చుండబెట్టి తానే తలుపు వేసి దగ్గఱ నిలుచుండెను. న న్నట్లు రక్షించినవారు గురుదేవులే యగుట. వారి ప్రజ్ఞాంశము నాలో నుండుట కాల క్రమమున స్పష్టముగా గుర్తింప నయ్యెను.

మద్రాసు చేరుదాఁ క నే నున్న చోటనుండి కదలక రైలు కంటె ముందుకు దూకుచున్న తలఁ పుల వేగముతో నిద్రమెలఁ కువలతో శాంత్యశాంతులతో మద్రాసు వచ్చితిని. వెంటనే మిత్రులను గలసికొని జరగిన సందర్భము లెల్లఁ దెలిపితిని. అవి వేసవి సెలవుల నాళ్ళు గాన మా బావ తో బుట్టులు మా గ్రామమునకు వెళ్ళి యుండిరి. మరల జనార్దనుని హొటలు లో భోజనము చేయుచు ఆఫీసులో అందఱు నా యనారోగ్యమును నెఱిఁగి యుండిన మిత్రులే కాన నా కట్టె తొందర కలిగింప కుండిరి. నాఁటి దాఁక నా యనారోగ్యము ను గూర్చి వంత చెందుచు నే నెక్కువ కాలము జీవింపఁబో నను కొనుచున్న నా మిత్రుఁ డొకఁ డు, ఆఫీసులో ఉద్యోగి కలరా వచ్చి యదాటుగా చనిపోయి నాకు చాల చింతఁ గొల్పెను. సాయంకాల మయిదు గంటల దాఁకఁ బని చేసి బడలి యింటికి వచ్చి సాయంకాలానుష్టానమున బడలిక తొలఁగి మరల నుత్సాహినై రాత్రి గడసి ఉదయోపాసనమున మఱింత తేఱి ఆఫీసుకు వెళ్ళుచు డిన క్రమమున నారోగ్య వృద్ధి బడయఁ జొచ్చితిని. దినదినము నరసింహము గారి యింటికి వెళ్ళి వారితోఁ గలసి యుపాసనము జరపు చుంటిని.

   ఆ నాళ్ళలో మద్రాసులో శేషయ్యంగా రను నొక వైష్ణవుఁడు తంజావూరు జిల్లా వా స్తవ్యుఁ డు ' ధ్రువనాడి' యను సంస్కృత గ్రంధము నుండి యనేకుల జాతకము చదువు చుండెను. ఆ యాచార్యుఁడు తొలుత చాల ననారోగ్య గ్రస్తుఁ డుగా నుండి శ్రీవారి శిష్యుఁడై కుంభకోణమున వసించి యారోగ్యవృద్ధి చెందెను. కాన మా గోష్టిలోని వాఁ డయ్యెను. ఆయన శ్రీవారి జాతకమును, మా గోష్ఠిలోని వారయిన యితరుల జాతకములను జదువు చుండెను. కొంత తద్వైచిత్ర కనుగొనుచు వింత చెందుచుంటిని.
   పదిరోజులు గడచి నేను గొంత తేరుకోఁగా నన్ను కృష్ణా జిల్లాలో గ్రంధార్జనమునకుఁ బొమ్మని మా పై యధికారి శ్రీ కుప్పుస్వామి శాస్త్రి గారు నామీది యనురాగము తోనే యాజ్ఞ యిచ్చిరి. వెంటనే నేనును, శ్రీ మానవల్లి రామకృష్ణా కవిగారును వెడలితిమి. కృష్ణ కాల్వల క్రొత్త నీటి స్నానపానములు మా కిద్దఱకును సరిపడలేదు. బందరు  నుండి రోడ్డు సైడు కెనాల్ నీటి లో పడవమీద చల్లపల్లి వచ్చితిమి.  కవిగారికి వేచిన జీడి పప్పన్న చాల ప్రీతి,  బందరులో  నది మంచిది దొరకును గాన వారు దాని నధికముగా గొని తెచ్చిరి. పడవలో కబుర్లు చెప్పుకొనుచు నిద్దఱము దానిని తింటిమి, నేను మితముగా, వా రమితముగా!ఆ రాత్రి కవిగారికి వాంతులు, విరేచనములు, జ్వరము,కలరా అనుకొం టిమి. సత్రములో నుంటిమి. ఆ రాత్రి యా సత్రములో మా బంధువు లొకరు  మాకు  సర్వోపచారములు చేసిరి. ఉదయము బజారులో టర్పంటైను, బ్రాంది మొదలగు నౌషధద్రవములకుఁ  బోగా వర్తకు లెవ్వరు నియ్యరైరి. రామకృష్ణ కవిగారు 'ఎం.ఏ  'మద్రాసు నుండి గ్రంధార్జనమునకై  రాజా గారిని దర్శించుటకై వచ్చుట,  వారితో నేను నుండుట యిత్యాదికము వెల్లడి యయ్యెను.
   ఆ యూరికి వచ్చు పెద్దమనుష్యులకు, ఉద్యోగులకు వలసిన పదార్దములు రాజాగారే యియ్యవలెను గాని కోమట్లియ్య గూడ దని యను శాసనము. కవిగారు 'కాళ్ళిడ్చు కొని పోవుచున్నవి. జీవితము నిల్చునట్లు లేదు. కలరా గాఁ బోలును. బ్రాంది కావలెను, కాళ్ళకు టర్పెంటైను రాయ వలె'నందురు. అవి దొరక లేదు. రాజాగారిని దర్శింప మధ్యాహ్నము గాని వీలుపడలేదు. రాజాగారు భోజనా నంతరము నిద్ర లేచిన తర్వతా నేఁ బంపిన వార్త వారికిఁ దెలుపు ననువుపడెను. వలసినవానిని వారు పంపిరి. అప్పటికే కవిగారికి మా బంధువుల యుప చారములచే గుణముగా నున్నది. మందు లక్కఱ లేకేపోయెను. ఈ వార్త ఆఱు మైళ్ళ దూరమున నున్న మాగ్రామమునకు తెలియగా, మా తండ్రిగారు పంపగా మా పినతండ్రిగారు బండిలో మమ్ము తోడ్కొనిపోయిరి.                                                                                    

చల్లపల్లిలో నే కవిగారి యుపచారములలో మునిఁగి యుండుట, వారితో నేను జీడిపప్పు తిని నీరు త్రాగియుండుట కారణములుగా తల తిరుగుట, వాంతులు, జ్వరము నాకు నారంభించెను. ఇంటికి చేరు నప్పటికి నాకు 100 డిగ్రీల జ్వరమున్నది. నేను మందుఁ గొన ననుచుంటిని. కుంభకోణము టెల్లిగ్రాం ఇయ్యఁ గోరితిని. వెంటనే మా వా రట్లు చేసిరి. కాని యది వారి కందుట నాఁటి రాత్రి యగునో, మర్నాడగునో, చాల తీవ్రజ్వరము గాన మందిచ్చి తీర వలసిన దే యని నాకుఁ జాటుగా మా తల్లిదండ్రులు, నన్నగారు చర్చించుకొనుచుండిరి. అది వింటిని పిల్చి యడిగితిని.' మందు గొన వలసినదే' యనిరి. అంగీకరించితిని. సాయంకాలము ఆఱుగంటల వేళ కు మందిచ్చిరి. అప్పుడే ఆకాశమున నుండి దభీలున క్రిందఁ బడుచున్నట్టు లయి యొడ లెల్ల చెమ్మటనీరు చిమ్మఁ దొడఁ గెను. పది నిముషములలో జ్వర మెల్లతగ్గెను.' మంది చ్చితిమి. తోడనే తగ్గెను' అని మావారనుకొనిరి.' ఇచ్చిన టెల్ల్లిగ్రాం శ్రీవారికి చేరినది. ట్రీట్మేంటు జరగియుండును. తోడనే తగ్గినది' యని నేను దనిసితిని. మర్నాడు తేటగానే యుంటిని. మందు గొనుచుంటిని. మూఁ డ వనాఁడు మరల జ్వరము వచ్చెను. నాఁ డు కుంభకోణము నుండి జాబు వచ్చెను.' జ్వరము తగ్గియుండును. మందు గూడ పుచ్చుకొన వచ్చును, అని. మందు పుచ్చుకొనుటకు దైర్యము వ చ్చెను. పుచ్చు కొనుచుంటిని. సెలవు లేదు. శ్రీ రామకృష్ణ కవిగారును జ్వరము మరల మరల వచ్చును తంటాలు గొల్పుచుండుట చే సెలవు తీసికొని మద్రాసుకు వెళ్ళిపోయిరి. నేను చిరకాలము సెలవులో నుండి డ్యూటిలో చేరి మరల సెలవు గొనుట దుఃఖకరముగా తోఁచుటచే నెటు చేయను జాలక చిక్కు పడుచుంటిని. ఇంటిదగ్గఱ నుండ నిష్టము లేదు. జ్వరము వచ్చుచునే యుండుటచే నూళ్ళ వెంట నొంటరిగాఁ దిరుగఁ జాలను. ఇట్టి యిక్కట్టులోనింటికి వచ్చిన వారము రోజులలోనే నాకు ఆఫీసు నుండి టెల్లిగ్రాం వచ్చెను.' తత్క్షణమే నీవు తంజావూరు లైబ్రరీ పరిశీలనమునకు వెళ్ళవలసినది. అక్కడ చేరి పనిచేయువలసినది' అని. అలిగి తన్నితే పఱుపుమిఁద పడ్డట్టు, రొట్టెవిఱిగి నేతిమిఁద పడ్డట్టు నాకు పరమోత్సాహకర మయినది.

   తోడ్తో బయలు దేఱి మద్రాసు వచ్చి ఆఫీసుకు వెళ్ళి లైబ్రేరియ౯ తో మాట్లాడి మద్రాసులో నాగక కుంభకోణమునకే వెళ్ళిపోయితిని. అప్పటికి మా తోబుట్టువు కుటుంబము మద్రాసులో నుండెను. మా తమ్ముఁ డు చి" చంద్రశేఖరము అక్కడ హైస్కూలులోచదువుచుండెను. వాని కక్కడ టైఫాయిడ్ జ్వరము వచ్చెను. శ్రీ వారికి జాబు వ్రాసితిని. మద్రాసులో వారి శిష్యుఁడుగా నున్న మన్మిత్రు నొకని ట్రీట్ చేయవలసినదిగా జాబు వ్రాసిరి. ఆతఁడు వచ్చి ట్రీట్ చేసి యీ జ్వరము  తగ్గిన తర్వాత నీ కుఱ్ఱవానికి శ్రీవారి శిష్యత లభింపజేయవలసిన దనియు, దానివల్ల నీతఁడు కొఱఁతలు దొలఁగి యారోగ్యము పడయఁ గలఁ డనియు దివ్యదృష్టికి గోచరించిన దానిని దెలిపెను. నెలా పదిరోజులు జ్వరము వానిని బాధించి విడిచెను.     కుంభకోణమున శ్రీ వారిని దర్శించి నాకధ యెల్లఁ జెప్పికొంటిని. శ్రీ వారు నన్ను ప్రతివారము సెలవు దినమున తంజావూరి నుండి కుంభకోణము వచ్చుచుండు మనిరి. ఆ కాలమున రైలుఛా ర్జీ అర్ధరూపాయ లోపుగా నుండెను. అట్లే చేయుచుంటిని. తంజావూరిలో నాకుత్యాగరాజయ్య రను మిత్రుఁ డేర్పడెను. ఆయన శ్రీవారి శిష్యుఁడు. ఇర్వురమును గలసి ప్రార్ధనము చేసుకొను చుంటి మి. జ్వరము తగ్గి యారోగ్య వంతుఁ డయిన మాతమ్ముఁడు వదిన గారిని దోడ్కొని కుంభకోణమునకు వచ్చెను. వానిని శ్రీవారి శిష్యునిఁ గావించితిని. 
   చల్లపల్లిలో ఆరంభించిన చలిజ్వరము ఎడనెడ నాకు నేను కుంభకోణము వెళ్ళిన తోడనే తీవ్రముగా జ్వరము వచ్చెడిది. మజ్జిగ అన్నమే తినఁ గల్గెడి వాఁ డను. రాత్రి ఒకటి రెండు గంటల వేళ తీవ్రముగా ఆకలి యయ్యెడిది. అప్పుడు ముందుగానే నాకై జాగ్రత్త పడి సచ్చిదా నంద  స్వాముల వారు ఊరుగాయ, మజ్జిగ అన్నము ఎత్తి దాచి యుంచెడివారు. ఆకలయి నపుడు వారిని లేపి యది తిని నీరు ద్రావి నిద్రపోయెడి వాఁడన. ఉదయము జ్వరముతో నే తంజావూరికి వచ్చెడి వాఁ డను-వచ్చిన కొంత సేపటికి జ్వరము తగ్గిపోయెడిది. వారమురోజులు నెమ్మదిగా ఆఫీసు పని  చేయఁ గల్గెడు వాఁ డను. నాతో రామకృష్ణ కవిగారు వగైరా లుండిరి. వారు మద్రాసు వెళ్ళినప్పుడు శ్రీ కుప్పు స్వామి శాస్త్రిగారితో నేనేదో కుంభకోణము వెళ్ళి యోగసాధనము చేయుచుంటి ననియు, అక్కడికి వెళ్ళిన తోడనే జ్వరపడి జ్వరముతోనే ప్రతివారము వచ్చుచుందు ననియు చెప్పిరి. వారు కుపితు లయి యుండిరి.

1916 క్రిస్ మస్ సెలవులు వచ్చినవి. నేనా సెలవు రోజులలో కుంభకోణముననే శ్రీవారి సన్నిధి నుంటిని. 30 తేది దాఁక నాకు జ్వరమే. 31 వ తేది నాకు విరేచనము లెడ తెగ కుండ కాఁజొచ్చినవి. నల్వది యేఁ బది తూరులయ్యెను. సగ్గుబియ్యపు జావను మిత్రులు మహ దేవయ్య గారు తెచ్చి యిచ్చిరి. త్రాగితిని గాని కదల శక్తి లేదు. నాఁ డుదయము నేను వెళ్ళి తీర వలెను. శ్రీవారి కీ యసం దుర్భము తెలిసెను. రామ చంద్రయ్యరుగారు అనుముఖ్య శిష్యునిఁ బిలిచి ప్రభాకరునికి విగర్ సప్లైయగుటకు ట్రీట్చేయమనిరి. ఆతఁడు పండుకొన్న నేను లేచి కూర్చుండి, కూర్చున్న నేను లేచి, లేచిననే నిటుదిరిగి, తిరిగిన నేను పర్వెత్తఁగలిగి యుత్సాహ శక్తిపూరితుఁడ నయితిని. కొంత పర్వాతోనే నే వెళ్ళి శ్రీవారి పాదములు వ్రాసితిని. రైలు వేళగుచున్నది గాన వెంటనే స్టేషనుకు పోమ్మనిరి,' ఇఁక నుండి యానారోగ్య ముండదు. వారము వారము రా నక్కఱ లేదు. రెండు రోజులు సెలవు కలసి వచ్చిన రమ్ము, పగలు హాయిగా భోజనము చేయుము. ఉదయము, మధ్యాహ్నము లఘ్వహరము గొనుము. జీర్ణ శక్తి సరిగా నుండును. లివరు సరిపడినది. రాత్రిపూట మజ్జిగ కాక పోసికొని భుజింపుము' అనిరి. తంజావూరికి వచ్చి వేసితిని. తదాది జ్వరము లేదు. జీర్ణ శక్తి చక్క బడినది. ఆకలి యన్నది నాఁట నుండి ససిగా తెలియ వచ్చెను. దినదిన క్రమాభివృద్ధిగా నారోగ్యము కలుగఁ జొచ్చెను. ఆనాళ్ళ నుండి నాకు అనారోగ్యవ్యధ తొలఁగి వింతవింత యను భూతులు కలుగఁ జొచ్చెను. ఒక నాఁ డుదయము రొట్టెపాలు (కాఫియాల వాటు ముప్పది యై దేండ్ల వయసు తర్వాత నే) తీసికొని ప్రాతరుపాసనము జరపుకొని ఆఫీసుకు వెళ్ళితిని. తంజావూరి లైబ్రరీ ఉదయము 8 గంటలనుండి సాయంకాల మయిదు గంటల దాఁక) అప్పుడు ప్రాతఃకాలముననే కొన్ని నియమితసనయములలో సాయంకాలము దాఁక నభ్యాసము లుండెడివి.

   పదిగంటల వేళ నభ్యాసము జరపుకొని టేబిలు దగ్గఱ గ్రంధ పరిశీలనము జరుపు చుండఁ గా నా మూలాదారమున నుండి ప్రబలముగా పిచి కారితో కొట్టి నట్టు ప్రజ్ఞా బలధారాలు రేగఁ  జిచ్చినవి. ఉత్సాహా నందములు పొంగి పొరలి శరీర మెల్ల వ్యాపింపఁ జొచ్చినవి. ఆధారాలు తలలో నికిఁ బోయినవి అప్పటి నా యాహ్లాదము చెప్పఁ దరము కానిది. లోపల చిచ్చుబుడ్డి వెలిఁ గించి దాని పై పలుచని కుండ మూసినట్లు తల యూగులాడఁ జొచ్చినది. లోపల నేవో మెఱుఁగు రేకలు తిరుగఁ జొచ్చినవి. అప్పుడు పని కట్టిపెట్టి వినోదింపఁ దొడగితిని. పదినిమిషము లట్లుండెను. నా స్థితి యానంద తాండవ మాడు చున్నట్లయ్యెను. నెమ్మదిగా నది వశంగత మయ్యెను. నా యొడ లానంద మయ మయ్యెను. కొలఁది దినములకే ఆ లైబ్రరి పనిని వడిగా ముగించి వేసితిని.