కైకవసి రాగం - రూపక తాళం మార్చు

పల్లవి:
పురుషోత్తమా కరుణించుమా వరదుండవై
వాంచ దీర్చి బ్రోవ పరాకు యేరా ||

చరణం 1:
మునులు నిను మధుర గానము చేసి
ఎట్లు సేవించిరో
దూరితామితాపార ఘోర సంసార
బంధనులైరి శౌరీ ||

చరణం 2:
నీ వాడనై సదా నిన్నే నెర నమ్మి యుంటి నేరమేమిరా
కావవేలరా కాంచనాంబరా పావనీశ్వరా పరాత్పరా ||

చరణం 3:
వర దాసు శ్రీరామ కవి వర దాయక నిరుపాధికా
చరణములకే శరణు జొచ్చితి
సరసిజాలయా సతీపతీ ||